30-01-1979 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సర్వబంధనాల నుండి ముక్తి అయ్యే యుక్తి.
సర్వ బంధనాల నుండి ముక్తినిచ్చే ముక్తేశ్వరుడైన శివబాబా త్రికాలదర్శి, సాక్షిదృష్టి పిల్లలతో మాట్లాడుతున్నారు -
ఈ రోజు బాప్ దాదా సర్వ స్నేహి, ప్రియమైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ఎలాగైతే బాప్ దాదా దూరదేశం నుండి పిల్లలను కలుసుకోవటానికి వస్తున్నారో అలాగే పిల్లలు కూడా దూర దేశం నుండి బాబాను కలుసుకునేటందుకు వస్తున్నారు. ఈ అలౌకిక కలయిక అంటే బాబా మరియు పిల్లల కలయిక మొత్తం కల్పంలో ఈ సంగమయుగంలోనే జరుగుతుంది. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు. బాప్ దాదా పిల్లలందరి విశేష ధారణలను చూస్తున్నారు. వినటం అయితే జన్మ జన్మాంతరాల నుండి వింటున్నారు. కానీ ఈ అలౌకిక జన్మలో అంటే బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత - ధారణా స్వరూపంగా అవ్వటం. కనుక బాప్ దాదా ఫలితాన్ని చూస్తున్నారు. ప్రతి ఒక్క బ్రాహ్మణ బిడ్డ కర్మ చేసే ముందు త్రికాలదర్శి స్థితిలో స్థితులై మూడు కాలాలను తెలుసుకునే వారిగా అయ్యి కర్మ యొక్క ఆది, మధ్య, అంత్యాలను తెలుసుకుని కర్మ చేస్తున్నారా మరియు కర్మ చేసే సమయంలో సాక్షి దృష్టితో పాత్రను అభినయిస్తున్నారా? ఇలా పాత్రను అభినయించేవారు వర్తమానంలో మరియు భవిష్యత్తులో కూడా పూజ్య స్వరూపంగా అయ్యి అనేక ఆత్మల ముందు ఉదాహరణ రూపంలో అవుతారు. త్రికాలదర్శి, సాక్షి దృష్టి మరియు ఉదాహరణ రూపం. ఈ మూడు స్థితులలో ఇప్పుడు ఎక్కడి వరకు చేరుకున్నారు? సాకార బాబాని ఎలా చూసారో అలా బాబాను అనుసరిస్తున్నారా? ప్రతి కర్మ త్రికాలదర్శిగా అయ్యి చేస్తే ఎప్పుడు ఏ కర్మ వికర్మగా అవ్వదు. సదా సుకర్మలే జరుగుతాయి. త్రికాలదర్శిగా అవ్వని కారణంగానే వ్యర్థ కర్మ లేదా పాప కర్మ జరుగుతుంది. అలాగే సాక్షి దృష్టిలో ప్రతి కర్మ చేస్తే ఏ కర్మ బంధనలో చిక్కుకుని కర్మ బంధన ఆత్మగా అవ్వరు. కర్మ ఫలం శ్రేష్ఠముగా ఉన్న కారణంగా కర్మ సంబంధంలోకి వస్తారు కానీ కర్మ బంధనలోకి రారు. సదా కర్మ చేస్తూ కూడా అతీతంగా మరియు బాబాకి ప్రియంగా అనుభవం చేసుకుంటారు. ఇటువంటి ఆత్మలు ఇప్పుడు కూడా అనేకాత్మల ముందు ఉదాహరణగా అవుతారు. వీరిని చూసి అనేకాత్మలు కూడా కర్మయోగిగా అయిపోతారు మరియు భవిష్యత్తులో కూడా పూజ్యనీయంగా అవుతారు. ఇలా బాబా సమానంగా అయ్యారా? బంధన ముక్త ఆత్మగా అయ్యారా? సర్వ సంబంధాలు బాబాతో జోడించటం అంటే సర్వ బంధనాల నుండి ముక్తి అవ్వటం. అనేక జన్మల యొక్క అనేక రకాల బంధనాలను సమాప్తి చేసుకునే సహజ సాధనం - బాబాతో సర్వ సంబంధాలు జోడించటం. ఒకవేళ ఏ బంధన అయినా అనుభవం అవుతుంది అంటే దానికి కారణం బాబాతో సంబంధం లేదు. బాప్ దాదా ఫలితాన్ని చూస్తున్నారు - ఇప్పటి వరకు ఎవరెవరు బంధనయుక్తులుగా ఉన్నారు అని. దేహ బంధనకు కారణం - ఆత్మ యొక్క సంబంధం బాబాతో జోడించబడి లేదు. బాబా స్మృతి మరియు ఆత్మ స్మృతి ధారణ అవ్వలేదు. మొదటి పాఠమే కచ్చాగా ఉంది. సెకనులో దేహానికి అతీతంగా అయ్యే అభ్యాసం సెకనులో దేహ బంధన నుండి ముక్తి చేస్తుంది. స్విచ్ వేయగానే భస్మం అయిపోతుంది. ఎలాగైతే వైజ్ఞానిక సాధనాల ద్వారా కూడా వస్తువు ఒక్క సెకనులో పరివర్తన అయిపోతుందో అలాగే శాంతి శక్తి ద్వారా, ఆత్మిక సంబంధం ద్వారా బంధనాలు సమాప్తి అయిపోతాయి. ఇప్పటికి ఇంకా మొదటి స్థితి అయిన దేహ బంధనలో ఉంటే ఏమంటారు? ఇప్పటి వరకు ఇంకా మొదటి తరగతిలోనే ఉన్నారా? ఎలాగైతే విద్యార్థులు కూడా చదువులో బలహీనంగా ఉంటే అనేక సంవత్సరాలు ఒకే తరగతిలో ఉంటారు. అలాగే ఆలోచించండి, ఈశ్వరీయ చదువు యొక్క అంతిమ సమయం నడుస్తుంది. ఇప్పటికి దేహ సంబంధాలు అనే మొదటి తరగతిలో ఉంటే ఆ విద్యార్థిని ఏమంటారు? ఏ వరుసలోకి వస్తారు? పొందేవారి వరసలోకి వస్తారా లేదా చూసేవారి వరసలోకి వస్తారా? ఇప్పటి వరకు ఇంకా మొదటి తరగతిలోనే కూర్చోలేదు కదా? పరధర్మంలో స్థితులవ్వటం సహజమా లేక స్వధర్మంలో స్థితులవ్వటం సహజమా? స్వధర్మం అంటే ఆత్మిక స్వరూపం. పరధర్మం అంటే దేహ స్వరూపం. ఏది సహజంగా అనుభవం అవుతుంది? మీ పేరు సహజ రాజయోగి అని. అలా అనుభవం అవుతుందా లేక పేరు మరియు పనిలో తేడా వస్తుందా?
రెండవ నెంబర్ బంధన - మనసా బంధన. ఈ మనస్సు యొక్క బంధనాన్ని తొలగించుకునే సాధనం - సదా మన్మనాభవ. ఈ మొదటి మంత్రాన్ని సదా జీవితంలో అనుభవం చేసుకుంటున్నారా? సదా ఒక్క బాబా తప్ప మరెవ్వరు లేరు అనే మొదటి ప్రతిజ్ఞను నిలుపుకోవటం అంటే మనస్సు యొక్క బంధనాల నుండి ముక్తి అవ్వటం. మొదటి ప్రతిజ్ఞ నిలుపుకోవటం వస్తుందా? చెప్పటం వస్తుందా లేక నిలుపుకోవటం వస్తుందా? నిలుపుకోవటం అంటే పొందటం. దీనిలో కూడా పరిశీలించుకోండి. ఎంత వరకు బంధన ముక్తిగా అయ్యాను అని? సదా సర్వ ఆకర్షణలకి అతీతంగా ఒకే సంలగ్నతలో నిమగ్నం అయ్యి ఉన్నారా? ఏకరసంగా ఉన్నారా? అచంచలంగా ఉన్నారా లేక చంచలంగా అయిపోతున్నారా? ఇప్పటి వరకు ఇంకా చంచలంగా ఉంటే ఏమి అంటారు? ఇప్పటి వరకు చిన్న పిల్లలుగా ఉన్నారు కానీ ఇప్పుడు స్థితి వానప్రస్త స్థితికి వచ్చేసింది. ఇటువంటి స్థితిలో ఈ చంచలత ఏమిటి, చిన్నతనం యొక్క స్థితి బావుంటుందా? బ్రాహ్మణ జన్మ యొక్క మాస్టర్ సర్వశక్తివాన్ అధికారం పొందారు. ఆ అధికారం ముందు ఈ దేహం యొక్క లేదా మనస్సు యొక్క బంధన ఉంటుందా? ప్రత్యక్ష అనుభవం ఏమిటి? సదా ఈ మూడు విషయాలను స్మృతిలో ఉంచుకోండి. త్రికాలదర్శి, సాక్షి దృష్టి మరియు వాటికి ఫలితంగా విశ్వం ముందు ఉదాహరణ రూపం. ఈ స్థితి సదా జ్ఞాపకం ఉంచుకుంటే అప్పుడు సదా బంధన ముక్తులుగా, జీవన్ముక్తికి స్థితిని అనుభవం చేసుకోగలరు. ఇప్పుడు పురుషార్థం చేసుకునే సమయం చాలా అయిపోయింది. ఇప్పుడు కొంచెంలో కొంచెం మిగిలి ఉంది. అందువలన సమయ ప్రమాణంగా మీ ఫలితాన్ని పరిశీలించుకోండి. బాబాని కలుసుకునే సమయం కూడా చాలా కొద్ది సమయం మిగిలి ఉంది. అందువలన ఇప్పుడు చాలా విన్నారు, వినటం అంటే వాణీ ద్వారానే ఈ బ్రాహ్మణ జన్మ తీసుకున్నారు. అందువలనే ముఖవంశావళీ అని అంటారు. జన్మ నుండి వింటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏమి చేయాలి? విన్న తర్వాత స్వరూపంగా అవ్వాలి. అందువలన అంతిమస్థితి - స్మృతి స్వరూపం. ఈ స్థితికి ఎంత వరకు చేరుకున్నారు? సీజన్ యొక్క ఫలితం ఏమిటి? వినటం మరియు కలుసుకోవటం మరియు సమానంగా అవ్వటం. స్నేహానికి ప్రత్యక్ష రుజువు - సమానంగా అవ్వటం. ఏ స్థితి అంటే బాబాకి స్నేహమో ఆ స్థితిని పొందాలి. అటువంటి స్నేహీలే కదా? సదా మీ సంపూర్ణ స్థితిని ఎదురుగా ఉంచుకోవటం ద్వారా మాయని ఎదుర్కోవటం చాలా సహజం అయిపోతుంది. బాప్ దాదా ఇదే ఫలితాన్ని చూడాలనుకుంటున్నారు. ఈ ఫలితాన్ని ప్రత్యక్షంగా చూపించేటందుకు విశేష ధారణలను జ్ఞాపకం ఉంచుకోండి. 1. మధురత 2. నమ్రత. ఈ రెండు ధారణల ద్వారా సదా విశ్వ కళ్యాణకారిగా, మహాదానిగా, వరదానిగా అయిపోతారు మరియు సహజంగానే స్నేహానికి రుజువు ఇవ్వగలరు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలో? ఇది చేయాలి మరియు కొన్ని వదలాలి కూడా! ఏమి వదలాలి? జ్ఞానీ ఆత్మగా అయిన కారణంగా భక్తి సంస్కారం, బికారీగా అయ్యి అడుక్కునే సంస్కారం మరియు కేవలం బాబా మహిమ మరియు కీర్తన చేసేటువంటి సంస్కారం, మనస్సు ద్వారా అక్కడికి, ఇక్కడికి భ్రమించటం, మీ ఖజానాలను వ్యర్థం చేసుకోవటం ఈ పాత సంస్కారాలను సదాకాలికంగా సమాప్తి చేయండి. అంటే పాత సంస్కారాల యొక్క సంస్కారం చేయండి. ఇదే వదలటం. ఇప్పుడు అర్థమైందా ఏమి చేయాలో, ఏమి వదలాలో? జ్ఞానీ ఆత్మ అంటే విజయీ. మంచిది.
ఒక్క సెకనులో స్వపరివర్తన చేసుకునేవారికి, స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసేవారికి, సర్వ బంధనాలతో ముక్తి అయ్యి సదా యోగయుక్తులు, జీవన్ముక్తి ఆత్మలకు, బాప్ దాదాకి స్నేహి అంటే సమానంగా అయ్యేవారికి, సదా విజయీ రత్నాలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment