29-12-1981 అవ్యక్త మురళి

* 29-12-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

దూరదేశీయులైన పిల్లలతో దూరదేశి అయిన బాప్ దాదా యొక్క మిలనము.

ఈరోజు బాప్ దాదా తమ లవ్లీ అనగా లవలీనమైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. దూరదేశము నుండి వచ్చారు. దూరదేశాలనుండి వచ్చిన పిల్లలను దూరదేశి అయిన బాప్ దాదా కలుసుకునేందుకు వచ్చారు. ఎంతగా బాప్ దాదాను పిల్లలు హృదయపూర్వకముగా స్మృతి చేసారో అంతగా ఆ హృదయపూర్వకమైన స్మృతికి బదులు ఇచ్చేందుకు మనోభిరాముడైన బాబా వచ్చారు. మీరు ఒక్కొక్కరు లవ్లీ ఆత్మలుగా కనిపిస్తున్నారు. ఎవరైతే దూరంగా ఉంటూ కూడా తమ ప్రియస్మృతులను పంపారో ఆ లవ్లీ ఆత్మలందరూ ఆకారీ రూపములో ఈ సంఘటన మధ్యలో బాప్ దాదా ముందు ప్రత్యక్షముగా ఉన్నారు. బాప్ దాదా ముందు చాలా పెద్ద సభ ఉంది. మీ అందరిలోనూ అందరి యొక్క ప్రియస్మృతులు ఏవైతే ఇమిడియున్నాయో ఆ స్మృతి యొక్క రూపములు ఆకార రూపములో అందరితో పాటు ఉన్నాయి. బాప్ దాదా పిల్లలందరి యొక్క ఉల్లాస, ఉత్సాహాలను మరియు సంతోషము యొక్క గీతాలను వింటున్నారు. ఇంతటి ప్రేమ యొక్క సంతోషము యొక్క గీతాలను బాప్ దాదా కేవలం చూడడం కాదు. చూడడంతో పాటు గీతమాలను వింటున్నారు కూడా. పిల్లలందరి లోపల, హృదయంలోన లేక నయనాలలో ఒక్క తండ్రి స్మృతి యొక్క ఏకరస స్థితి కనిపిస్తోంది.

“ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు" అన్న ఈ స్మృతిలోనే స్థితులైన పిల్లలను చూస్తున్నారు. ఈ రోజు మిలనము జరిపేందుకు వచ్చారే కానీ వాణిని వినిపించేందుకు రాలేదు. కేవలం భాగ్యవంతులైన పిల్లల యొక్క భాగ్యమును చూసేందుకు వచ్చారు. వికసించిన ఆత్మిక గులాబీ పుష్పాలైన పిల్లల యొక్క సుగంధమును తీసుకునేందుకు వచ్చారు. పిల్లలందరూ ధైర్యము యొక్క ఆధారముపై స్నేహము యొక్క ప్రత్యక్ష ఫలమును సమ్ముఖముగా కలుసుకుంటూ బాగా చూపించారు. భిన్న భిన్న రకాల బంధనాలను దాటి తమ మధురమైన ఇంటిలోకి వచ్చి చేరుకున్నారు. ఇటువంటి బంధనముక్తులైన పిల్లలకు బాప్ దాదా పదమా పదమ అభినందనలు తెలియజేస్తున్నారు.  చిన్న చిన్న పిల్లలది కూడా అద్భుతమే! ఈ చిన్న పిల్లలు సంగమయుగము యొక్క సింగారము మరియు భవిష్యత్తులో ఏమి చేస్తారు? ఇప్పుడు సింగారముగా ఉన్నారు. భవిష్యత్తులో అధికారులుగా ఉంటారు. అందరి అరచేతులపై స్వర్గము యొక్క స్వరాజ్యమనే గోళము కనిపిస్తోంది కదా! ఏ చిత్రమునైతే తయారుచేసారో అది ఒక్కరిది కాదు. మీ అందరిది. మీ చిత్రమును చూసారా? ఇది మా అందరి యొక్క చిత్రము అని భావిస్తున్నారా లేక కృష్ణుడిది అని భావిస్తున్నారా? ఇది ఎవరిది? మీ అందరిదా? కాదా? కావున ఈ రోజు బ్రాహ్మణులుగా ఉన్నాము. మళ్ళీ రేపు ఫరిస్తాలనుండి దేవ పదధారులుగా అవుతాము అని సదా స్మృతి ఉంటుందా? జ్ఞానము యొక్క ధారణతో మీ ఈ 'ఫరిస్తానుండి దేవతగా' అయ్యే ఈ చిత్రము సదా కనిపిస్తోందా? ఏ విధముగా ఇప్పుడు అందరి హృదయము నుండి నా బాబా అన్న శబ్దము వెలువడుతుందో అలాగే సదా జ్ఞానము యొక్క దర్పణములో మీ చిత్రమును చూస్తూ ఇది నా చిత్రము అన్న శబ్దము వెలువడుతుందా? 'నా బాబా', నా చిత్రము! ఎందుకంటే ఇప్పుడు మీ రాజ్యము మరియు రాజ్యము చేసే రాజ్య అధికారీ స్వరూపానికి చాలా సమీపముగా వస్తున్నారు. ఏ వస్తువైతే సమీపములోకి వచ్చేస్తుందో అది చాలా స్పష్టముగా అనుభవమవుతుంది. కావున ఈ విధంగా మీ ఫరిస్తా స్వరూపము, దేవతా స్వరూపము స్పష్టముగా అనుభవమవుతుందా? అచ్ఛా!

ఈరోజు విశేషముగా పిల్లలు పిలిచారు మరియు బాప్ దాదా పిల్లల యొక్క ఆజ్ఞాకారిగా ఉన్న కారణముగా మిలనమును జరిపేందుకు వచ్చారు. విశేషముగా ఒకరిద్దరు ఆత్మల కారణముగా పిల్లలందరితోనూ మిలనము జరిగింది. ఇదే లగ్నము యొక్క రెస్పాన్స్ అచ్చా! డబుల్ విదేశీయులకు సదా వేర్వేరుగా కలుసుకోవడమే ఇష్టముంటుంది. ఏవిధంగా బాబా పిల్లల హృదయాన్ని పరిశీలిస్తారో అలాగే బాప్ దాదా పిల్లల కోరికకు బదులు ఇస్తారు. కావున ఇలా కలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అల్లా యొక్క పూతోటలోకి చేరుకున్నారు. మిలనమును జరుపుతూ ఉంటారు, అచ్ఛా!

ఈ విధంగా స్నేహము యొక్క బంధనలో బంధింపబడేవారికి మరియు బంధించేవారికి, సదా లవలీనులయ్యే పిల్లలకు, సదా బాబా గుణాల యొక్క గీతమును గానం చేసే ప్రసన్నచిత్తులుగా ఉండే పిల్లలకు, సదా సంతోషము యొక్క ఊయలలో ఊగే అదృష్టవంతులైన పిల్లలకు, సదా సంతోషముగా ఉన్నందుకు అభినందనలతో పాటు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

చిన్న చిన్న పిల్లలతో - బాప్ దాదాకు చిన్న చిన్న పిల్లలను చూసి ఎంతో సంతోషము కలుగుతుంది. పిల్లల ప్రతి ఒక్కరి మస్తకముపై ఏమి కనిపిస్తోంది? మీ మస్తకముపై ఏముంది? ఆత్మ మణి సమానముగా మెరుస్తోంది. బాప్ దాదా పిల్లలందరి యొక్క మస్తకముపై మణిని చూస్తున్నారు. మీ అందరి మనస్సులోనూ ఏమి సంకల్పం ఉంది? చిన్న, చిన్న పిల్లలు అనగా బాప్ దాదా కంఠములోని మాల యొక్క మణులు. పిల్లలైన మీరు ఏ నెంబర్ లో ఉన్నారు? ఇది మీకు తెలుసా? (ఫస్ట్ నెంబర్ లో) ఎంత మంచి లక్ష్యమును ఉంచారు! బాప్ దాదా చిన్న పిల్లలను ముందు ఉంచుతారే కానీ వెనుక ఉంచరు, ఎందుకంటే చిన్నపిల్లలైన మీరందరూ జన్మ నుండే పవిత్రముగా ఉన్నారు మరియు పవిత్ర ఆత్మల యొక్క సాంగత్యములో ఉన్నారు. కావున పవిత్ర ఆత్మలను సదా నయనాలపై ఉంచుతారు. కావున మీరందరూ ఏమయ్యారు? కళ్ళలోని తారలుగా అయ్యారు. మెరుస్తున్న రత్నాలుగా అయ్యారు కదా! ఇలా భావిస్తున్నారా? పిల్లల యొక్క ప్రియస్మృతులు వారు రాక ముందే వచ్చి చేరుకున్నాయి. అందరూ చాలా చాలా మంచి మంచి చిత్రాలను కూడా పంపించారు. మంచి, మంచి లక్ష్యాల యొక్క సంకల్పాలను కూడా చేసారు. ఎవరెవరు ఏయే లక్ష్యాలనైతే ఉంచారో, కొందరు టీచర్ గా అయి వెళతామని, కొందరు నెంబర్ వన్ బ్రహ్మాకుమారి లేక బ్రహ్మాకుమార్ గా అయి వెళతాము అని లక్ష్యమును ఉంచారు కదా! మరి నెంబర్ వన్ టీచర్ లేక బ్రహ్మాకుమారీ, కుమారుల యొక్క ఏ విశేషతను తీసుకువెళతారు? ఇది చాలా సహజము. కేవలం ఒక్క చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక్క తండ్రి యొక్క స్మృతిలో ఉండాలి. ఒక్క తండ్రి యొక్క సందేశమునే అందరికీ ఇవ్వాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా, విషయం వచ్చినా ఏకరసముగా ఉండాలి. ఇదే నెంబర్ వన్ బ్రహ్మాకుమారీ, కుమారుల యొక్క లక్షణము. మరి ఇది సహజమా లేక కష్టమా? అందరూ ఉదయం లేస్తూనే గుడ్ మార్నింగ్ చెబుతున్నారా? స్మృతిలో కూర్చుంటున్నారా? ఇప్పటినుండి రోజూ అమృతవేళ లేస్తూనే మొదట స్మృతిలో కూర్చోండి. అచ్చా చిన్న, చిన్న పిల్లలైన మీ అందరికీ ఏ వస్తువు బాగా నచ్చుతుంది? (టోలీ) (బాప్ దాదా అందరికీ టోలీ తినిపించారు)

డాక్టర్లతో అవ్యక్త బాప్ దాదా యొక్క మిలనము: - అందరూ కలిసి క్షణములో ఆరోగ్యాన్ని ఇచ్చే మందును ఏదైనా కనుగొన్నారా? ఈనాటి సమయం మరియు పరిస్థితుల ప్రమాణముగా క్షణములో ఆరోగ్యాన్ని పొందాలనే కోరిక గల ఆత్మలు ఎందరో ఉన్నారు. ప్రదర్శనిలో అర్ధం చేయించండి లేక భాషణ చేయండి కానీ అందరూ భాషణ వింటూ, ప్రదర్శని చూస్తూ క్షణములో ఆరోగ్యాన్ని పొందాలి అన్న కోరికనే కలిగి ఉంటారు. సర్వాత్మలకూ రెండు కోరికలు ఉన్నాయి, ఒకటేమో సదాకాలికమైన ఆరోగ్యమును పొందాలని మరియు ఇంకొకటి చాలా త్వరత్వరగా ఆరోగ్యాన్ని పొందాలని. ఎందుకంటే అనేకరకాలైన దు:ఖాలను, బాధలను సహిస్తూ, సహిస్తూ ఆత్మలందరూ అలసిపోయారు. కావున డబుల్ డాక్టర్ అయిన మీ వద్దకు ఏ కోరికతో వస్తారు? ఈ రెండు కోరికలతో వస్తారు. పరస్పరం మీరు ఏ మీటింగ్ నైతే జరిపారో అందులో ఇటువంటిదేమైనా వెలువడిందా? మెడిటేషన్ లో కూడా సహజమైన విధానమును ఏదైనా కనుగొన్నారా? ఎగ్జిబిషన్‌నైతే తయారుచేస్తారు మరియు తయారుచేయబడి ఉంది కూడా. కానీ ప్రతి చిత్రములోనూ ఎటువంటి సారమును నింపాలంటే ఆ సారం వైపుకు ధ్యానం వెళ్ళడంతోనే శాంతి మరియు సుఖము యొక్క అనుభూతిని పొందాలి. ఎందుకంటే విస్తారమును గూర్చి అయితే అందరికీ తెలుసు కానీ ప్రతి చిత్రములో నూ ఆత్మికత ఉండాలి. ఏదైనా వస్తువుకు అత్తరు అంటిస్తే, సుగంధము అంటిస్తే వస్తువు నుండి వెలువడే ఆ సుగంధము తప్పకుండా ఆకర్షిస్తుంది. ఈ సుగంధము ఎక్కడినుండి వస్తోంది? అని అనుభవం చేసుకుంటారు. చిత్రాలనైతే తప్పక తయారుచేయండి కానీ చిత్రముతో పాటు ఏ ప్రభావమైతే పడుతుందో అది చిత్రములో కూడా చైతన్యముగా నిండి ఉండాలి. ఇక్కడ మధువనములో జడములో కూడా చైతన్యతను అనుభవం చేసుకుంటారు కదా! ఏ స్థానానికి వెళ్ళినా, కుటీరములోకి వెళ్ళినా ఏమి అనుభవం చేసుకుంటారు? చైతన్యతను అనుభవం చేసుకుంటారు కదా! అదేవిధముగా అటువంటి వాయుమండలమును తయారుచేయండి. ఎటువంటి వైబ్రేషన్లను వ్యాపింపజేయాలంటే, వాటి వల్ల చిత్రములో కూడా చైతన్యత అనుభవమవ్వాలి. సైన్స్ వారు కొన్నిచోట్ల పచ్చదనము యొక్క అనుభూతిని కలిగిస్తారు. కొన్నిచోట్ల సాగరము యొక్క అనుభూతిని కలిగిస్తారు. నీటి యొక్క ఫీలింగును కలిగిస్తారు, అలాగే మేము సాగరములోకి వచ్చేసాము, పర్వతాల పైకి వచ్చేసాము అని అనుభూతిని కలిగించే విధముగా స్టాళ్ళను తయారుచేస్తారు. అదే విధముగా తాము సుఖము యొక్క స్థానములోకి చేరుకున్నాము అని అనుభూతిని పొందే అటువంటి వాతావరణమును తయారుచేయండి. మీరు ఏదైతే కష్టపడి తయారుచేసారో అది బాగా చేసారు, మిలనము కూడా జరిగింది. ప్లాన్‌ కూడా వెలువడింది. ఇప్పుడిక పాయింట్ రూపముగా అయి పాయింటు ఇచ్చే అవసరం ఉంది. పాయింట్ ద్వారా పాయింటుని  తెలియజేయాలి. ఇప్పుడు ఇంకా ఆ సమయం రాలేదు కానీ పాయింట్ రూపముగా అయి క్లుప్తముగా పాయింట్‌ను ఇవ్వాలి. కావున ఈ విధముగా స్వయాన్ని కూడా శక్తిశాలి స్థితిలోకి సదా తీసుకురండి మరియు ఇతరులను కూడా ఇటువంటి స్థితిలోకి ఆకర్షించండి. మీ ముందుకు వస్తూనే, ఏ ప్రాప్తిని కావాలనుకుంటే అది ఇక్కడ కలుగుతుంది. అటువంటి స్థానములోకి వచ్చిచేరుకున్నాము అని వారు అనుభవం చేసుకోవాలి. ఏ విధముగా స్థూల వైద్యము ద్వారా రోగులలో ఈ డాక్టర్ చాలా మంచివారు, ఇక్కడ మంచి వైద్యము లభిస్తుంది అన్న విశ్వాసమును కలిగిస్తారో అలాగే ఆత్మిక వైద్యములో కూడా ఎటువంటి శక్తిశాలీ స్థితి ఉండాలంటే, దాని ద్వారా అక్కడికి చేరడంతోనే ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అని అందరికీ విశ్వాసమేర్పడాలి. ఈ రెండూ కలిగిస్తున్నారు కదా! ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉండాలి. అదికూడా అవసరమే. ఎందుకంటే ఈ రోజుల్లోని సమయానుసారముగా అనేక జన్మల యొక్క లెక్కాచారాలు అనగా కర్మ భోగము ఏదైతే ఉందో అది తప్పకుండా సమాప్తమవ్వాలి. కర్మభోగము యొక్క లెక్కను సమాప్తము చేసేందుకు స్థూలమైన మందు మరియు కర్మయోగిగా అయ్యేందుకు ఇది ఆత్మిక మందు. ఇప్పుడు అందరూ అనుభవించి సమాప్తం చేస్తారు. మనస్సు ద్వారా కానీ, శరీరము ద్వారా కానీ సమాప్తం చేసుకొని ఆత్మలందరూ ముక్తిధామములోకి వెళతారు కదా! అప్పుడిక రోగులూ ఉండరు, డాక్టర్లూ ఉండరు. దీని అభ్యాసము అంతిమంలో కూడా జరుగుతుంది. డాక్టర్లు ఉంటారు కానీ ఏమీ చేయలేరు. అంతమంది రోగులు ఉంటారు! ఆ సమయంలో కేవలం మీ దృష్టి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా వారికి వరదానాల ద్వారా అల్పకాలిక శాంతిని ఇవ్వగలుగుతారు. ఎంతో మంది చచ్చిపోతారు. చచ్చిపోయినవారిని తగులబెట్టే సమయం కూడా ఉండదు. ఎందుకంటే ఇప్పుడిక అతిలోకి వెళ్ళాలి కదా! అతిలోకి వెళ్ళి అంతమేర్పడుతుంది. ఇప్పటి సమాచారాల అనుసారముగా కూడా ఏదైనా కొత్త రోగము వ్యాపిస్తే అది ఎంత త్వరగా వ్యాపిస్తుంది. డాక్టర్లు ఆ కొత్త రోగానికి మందు కనుక్కొనేలోపే ఎంతో మంది అంతమైపోతారు. ఎందుకంటే ఇది అతిలోకి వెళుతోంది. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అప్పుడే డాక్టర్లు కూడా మా కన్నా ఏదో శ్రేష్ఠమైనది ఉంది అని అర్ధం చేసుకోగలుగుతారు. ఇప్పుడు అభిమానం యొక్క కారణముగా ఆత్మ మొదలైనవి ఏవీ లేవు, వైద్యమే సర్వస్వమూ అని అంటారు. ఆ తర్వాత వారు కూడా అనుభవం చేసుకుంటారు. ఎప్పుడైతే ఏమీ కంట్రోల్ చేయలేకపోతారో అప్పుడు దృష్టి ఎటువైపుకు వెళుతుంది? ఇప్పుడైతే కొత్త కొత్త రోగాలు ఎన్నో రానున్నాయి కానీ ఈ కొత్త రోగాలు కొత్త పరివర్తనను తీసుకువస్తాయి.

మీరు చాలా, చాలా భాగ్యశాలి ఆత్మలు, వినాశనానికి ముందే మీ అధికారాన్ని పొందారు. మిగిలినవారంతా మేము ఏమీ పొందలేదు అని ఆర్తనాదాలు చేస్తారు మరియు మీరు బాప్ దాదాతో పాటు హృదయ సింహాసనాధికారులుగా అయి వారికి వరదానాలు ఇస్తారు. కావున మీరు అంతటి భాగ్యవంతులు. సదా సంతోషముగా ఉంటున్నారు కదా? సదా ఇదే ఆనందములో తేలియాడుతూ మీ వద్దకు వచ్చే రోగులను కూడా సదా సంతోషము యొక్క ఊయలలో ఊపండి. దానితో మిమ్మల్నే భగవంతుని యొక్క అవతారముగా భావించడం మొదలుపెడతారు కానీ మీరు యదార్ధమైన వారి వైపుకు దారి చూపిస్తారు. ఎప్పుడైతే ఇటువంటి భావనలోకి వస్తారో అప్పుడే ఆ మార్గాన్ని  చూపించగలరు కదా! కావున అందరూ అలా తయారుగా ఉన్నారు కదా! డాక్టర్లందరి యొక్క చాలా మంచి గ్రూప్ ఉంది. ఇప్పుడు ఇలాగే వి.ఐ.పి.ల యొక్క గ్రూపును తీసుకురండి. ఎవరు ఎలా ఉంటారో వారు అలాంటివారినే తీసుకువస్తారు కదా! కావున ఎంతమంది డాక్టర్లు అయితే వచ్చారో అంతమంది వి.ఐ.పి.లు కూడా వస్తారు కదా!

విదేశాలలో కూడా అందరూ తలవంచడం అనుభవం చేసుకుంటారు. సైన్స్ సైలెన్స్ యొక్క శక్తి ముందు తప్పకుండా తలవంచుతుంది. ఇప్పుడు గొప్ప గొప్ప సైన్స్ వారు కూడా నిరాశ చెందుతున్నారు. మరి ఇక ఎక్కడికి వెళతారు? ఎక్కడైతే సైలెన్స్ వారైన మీ యొక్క కిరణాలు కనిపిస్తాయో అక్కడికే తప్పకుండా వస్తారు. మీ యొక్క సమయానుసారముగానే మీ యొక్క ఆత్మ ద్వారానే వారు ఆటమ్ ను తయారుచేసారు. మీ నుండే కాపీ చేసారు. ఆత్మిక శక్తి లేకపోతే ఈ ఆటమిక్ బాంబులను తయారుచేసేది ఎవరు ఎప్పుడైతే నలువైపులా అంధకారం వ్యాపించిపోతుందో అప్పుడు మీ యొక్క కిరణాలు అంధకారములో స్పష్టముగా కనిపిస్తాయి. జ్ఞానము యొక్క ప్రకాశము, గుణాల యొక్క ప్రకాశము, శక్తుల యొక్క ప్రకాశము, అన్ని ప్రకాశాలూ లైట్ హౌస్ గా పని చేస్తాయి. మధువనములోకి వచ్చారు, రిఫ్రెష్ కూడా అయ్యారు మరియు సేవ కూడా జరిగింది. అలాగే ప్రత్యక్ష ఫలము కూడా లభించింది. ఏ ప్లానులైతే తయారుచేసారో వాటిని ముందుకు తీసుకువెళుతూ ఉండండి. బాప్ దాదా వద్దకైతే మీ సంకల్పాలు కూడా వచ్చి చేరుకుంటాయి. ఉత్తరాలైతే మీరు ఆ తర్వాత వ్రాస్తారు, అచ్ఛా!

పార్టీలతో:- సంగమయుగ బ్రాహ్మణుల యొక్క సింగారము సర్వశక్తులూ మరియు సర్వగుణాలు.

సదా బాబా యొక్క స్మృతి అనే ఛత్రఛాయలో ఉంటున్నారా? సదా బాబా యొక్క ఛత్రఛాయ మా పైన ఉంది అని అనుభవం చేసుకుంటున్నారా? పర్వతమును ఛత్రఛాయగా చేసుకున్నట్లుగా కల్పపూర్వపు స్మృతిచిహ్నములో చూసారు కదా! కావున మొత్తం కలియుగ సమస్యలు అనే పర్వతమును బాబా యొక్క స్మృతి ద్వారా సమస్యగా కాక ఛత్రఛాయగా చేసేసుకున్నారా? ఈ విధంగా సమస్యలను సమాధానపరిచే మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్నారా? ఏ విధమైన సమస్య స్వయాన్ని బలహీనంగా చేయడం లేదు కదా? మీరు విఘ్నవినాశకులుగా ఉన్నారా? లగ్నము యొక్క ఆధారముపై విఘ్నము ఎలా అనుభవమవుతుంది? ఒక బొమ్మగా అనిపిస్తుంది కదా! దీనిని మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వడం అని అంటారు. సర్వశక్తులూ మీ జీవితము యొక్క సింగారముగా అయిపోయాయా? సంగమయుగ బ్రాహ్మణుల యొక్క సింగారము సర్వశక్తులే, కావున సర్వశక్తులతో అలంకరించిన మూర్తులుగా ఉన్నారు. ఇప్పుడు గుణాలు మరియు శక్తులతో అలంకరింపబడతారు మరియు భవిష్యత్తులో స్థూలమైన ఆభరణాలతో అలంకరింపబడతారు కానీ ఇప్పటి ఈ సింగారము మొత్తం కల్పమంతటిలోకీ శ్రేష్ఠమైనది. 10 సింగారాలు, 16 కళలతో సంపన్నముగా ఉంటారు, కావున ఇప్పటినుండే సంస్కారాలను నింపుకోవాలి కదా! కావున ఈ విధంగా మీరు అలంకరింపబడిన మూర్తులే కదా! అచ్ఛా!

Comments