29-10-1981 అవ్యక్త మురళి

* 29-10-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

తండ్రి మరియు పిల్లల యొక్క ఆత్మిక మిలనము.

ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో మిలనమును జరుపుతున్నారు. ఈ ఆత్మిక మేళాను కేవలం పిల్లలైన మీరే జరుపుకోగలరు. ఈ ఒక్క తండ్రితో ఒకేసారి ఒకే సమయంలో ఈ మిలనమును జరుపుకోగలరు. మీరందరూ దీపావళి మేళాను జరుపుకునేందుకు వచ్చారు. మేళాలో ఒకటేమో జరుపుకోవడం ఉంటుంది, ఇంకొకటి ఒకరితో ఒకరు కలుసుకోవడం ఉంటుంది, మూడవది కొంత తీసుకోవడం, కొంత ఇవ్వడం ఉంటుంది. నాలుగవది ఆడుకోవడం ఉంటుంది. మీరందరూ ఈ నాలుగూ చేసారు. మేళాలోకి అయితే వచ్చారు. కానీ జరుపుకోవడం అనగా సదా అవినాశీ ఉత్సాహంతో నిండిన, ఉల్లాసంతో నిండిన జీవితంలో సదా ఉండే దృఢ సంకల్పం చేయడం. ఈ ఆత్మిక మేళాను జరుపుకోవడం, అవినాశి ఉత్సవాన్ని జరుపుకోవడం, ఏదో ఒకటి, రెండు రోజుల కొరకు కాదు, సంగమయుగమే సదా ఉత్సవము అనగా ఉత్సాహమును పెంచేది, కావున దీపావళి అయిపోవడం కాదు, అంతా దీపావళే. ఇది సదాకాలికముగా కొత్త సంవత్సరమే. ప్రతి ఘడియా మీ కొరకు కొత్త ఘడియయే. కొత్త సంవత్సరంలో ఆ ఒక్క రోజు విశేషముగా కొత్త వస్త్రాలను, కొత్త కొత్త అలంకరణలను, కొత్త ఉత్సాహంతో విశేషంగా సంతోషంగా వేడుకను జరుపుకునే రోజుగా భావిస్తూ అందరికీ అభినందనలు తెలుపుతారు. నోరు తీపి చేసుకుంటారు. అలాగే ఆత్మిక పిల్లలైన మీ కొరకు సంగమయుగములోని ప్రతిరోజు అందరికీ అభినందనలు తెలిపే రోజు మరియు సర్వులకూ సదాకాలికముగా నోటిని తీపి చేసే సమయం, అలా సదా ఉత్సాహములో ఉండాలి మరియు ఇతరులకు కూడా ఉత్సాహాన్ని కలిగించాలి. సదా మీ నోటి నుండి మధురమైన మాటలే వెలువడాలి. ఇదే నోరు తీపి అవ్వడం మరియు ఇతరులకు కూడా మధురమైన మాటల ద్వారా బాబా యొక్క స్మృతిని కలిగించాలి. సంబంధములోకి తీసుకురావాలి. ఇది నోటిని తీపి చేయడం. కావున సదా మీ నోరు తీయగా ఉందా? మధురమైన పలుకులు అనే మిఠాయి సదా మీ నోటిలో ఉందా? మరియు సదా ఇతరులకు కూడా తినిపిస్తున్నారా?. ప్రతీరోజూ శ్రేష్ఠమైన స్థితిని అనగా ప్రతిరోజూ మీలో నవీనతను ధారణ చేస్తున్నారా? ఒక్క క్షణం గడవగానే కొత్త స్థితి, ఒక్క క్షణం క్రితం ఏ స్థితి అయితే ఉందో అది మరుక్షణం పైకి ఎక్కే కళ యొక్క అనుభూతి కారణంగా సదా శ్రేష్ఠముగా మరియు కొత్తగా ఉంటుంది. కావున స్థితిని ధారణ చేయడం అనగా కొత్త వస్త్రాన్ని ధారణ చేయడం. సత్య యుగములో అయితే స్థూలముగా సదా కొత్త వస్త్రాలను ధరిస్తారు. విశ్వ మహారాజులు లేక రాజ వంశీయులు ఒకసారి ధరించిన వస్త్రాలను మళ్ళీ ధరించరు. కావున ఆ సంస్కారాలను రాజ్య అధికారీ ఆత్మలు ఇక్కడినుండే నింపుకోవాలి. ప్రతి సమయం కొత్త స్థితి మరియు ప్రతి సమయమూ బాప్ దాదా ద్వారా జ్ఞానము, విజ్ఞానము ద్వారా కొత్త సింగారము జరుగుతోంది. ఏ విధంగా అందరికన్నా ఎక్కువ సంపదవంతులు సదా కొత్త. కొత్త అలంకరణలను చేసుకుంటారో అలా సర్వశ్రేష్ఠ సంపన్నమైన తండ్రి శ్రేష్ఠ సంపన్నులైన పిల్లలగు మీకు రోజూ కొత్త సింగారాలు, కొత్త అలంకరణలూ చేస్తూ ఉంటారు కదా! మరి ప్రతీరోజూ కొత్త సంవత్సరమైనట్లే కదా! కొత్త వస్త్రాలు, కొత్త సింగారము, కొత్త ఉత్సవము అనగా ఉత్సాహము మరియు సదా నోరు తీపిగా ఉండడం. నిరంతరమూ మీ నోటిలో మాధుర్యత అనే మిఠాయి ఉండాలి. కావున బాబా కూడా రోజూ ఏమంటారు? (మధురాతి మధురమైన పిల్లలు) ఇది పక్కాగా గుర్తుంది కదా? బాబా కూడా మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు మరియు పిల్లలు కూడా ఏమంటారు? (మధురాతి మధురమైన బాబా) మరి మీ నోట్లో ఏముంది? కావున రోజూ కొత్త సంవత్సరమే అవుతుంది కదా! కొత్త సంవత్సరమేమిటి, ప్రతి ఘడియా కొత్త ఘడియగా అయిపోతుంది. మరి ఇదే విధంగా జరుపుకున్నారా? లేక ఉత్సవం వెళ్ళిపోగానే ఉత్సాహం కూడా పోతుందా? ఈ విధంగా అల్పకాలికముగా అయితే జరుపుకోలేదు కదా! ఇక్కడ ఆత్మిక మేళా అనగా అవినాశీ మేళా, రెండవది జరుపుకోవడంతో పాటు కలుసుకోవడం. కావున ఆత్మికముగా కలుసుకోవడం లేక మిలనమును జరుపడం అనగా తండ్రి సమానముగా అవ్వడం. ఇది కేవలం హృదయానికి హత్తుకోవడం కాదు, గుణాలతో కలుసుకోవడం, సంస్కారాలతో కలుసుకోవడం. కలుసుకోవడం అనగా సమానముగా అవ్వడం. కావుననే సాంగత్యము యొక్క రంగు అన్న గాయనము ఉంది. ఇటువంటి ఆత్మిక మిలనమును జరుపుకున్నారా? లేక కేవలం పరస్పరం ఒకరితో ఒకరు చేతులు కలుపుకుంటూ హృదయాలకు హత్తుకున్నారా? గుణాల యొక్క మిలనము లేక సంస్కారాల యొక్క మిలనము సదాకాలికముగా ఉంటుంది కదా! రోజూ మిలనమును జరుపుకోవాలి. కావున పరిశీలించుకోండి, మేళాలోకి వచ్చారంటే ఇటువంటి మిలనమును జరుపుకున్నారా? 

మూడవ విషయం - తీసుకోవడం మరియు ఇవ్వడం, లౌకిక రీతిగా కూడా ఏదైనా మేళాలోకి వెళ్లినట్లయితే డబ్బు ఇస్తారు మరియు ఏదైనా వస్తువును తీసుకుంటారు. ఏదో ఒకటి తప్పకుండా తీసుకుంటారు కానీ తీసుకునే ముందు తప్పకుండా ఇవ్వవలసి ఉంటుంది. మరి మీరు సదా తీసుకుంటున్నారా? పరస్పరం ఒకరి నుండి ఒకరు ప్రతి ఒక్కరి విశేషతలు లేక గుణాలను తీసుకుంటూనే ఉంటారు. సదా తీసుకుంటూ ఉంటారు కదా! తీసుకోవడం అనగా స్వయంలో ధారణ చేసుకుంటారు. కావున ఎప్పుడైతే విశేషతలను ధారణ చేసుకుంటారో అందుకు బదులుగా సాధారణత స్వతహాగానే సమాప్తమైపోతుంది. గుణాన్ని ధారణ చేసినట్లయితే ఈ గుణధారణ యొక్క బలహీనత స్వతహాగానే సమాప్తమైపోతుంది, కావున ఇది ఇప్పుడేమైపోతుంది. మరి గుజరాత్ వారు తీసుకుంటూ మరియు ఇస్తూ ఉన్నారా? తీసుకోవడం మరియు ఇవ్వడం చేసారా? కావున ఈ తీసుకోవడం మరియు ఇవ్వడం కూడా అన్నివేళలా జరుగుతూనే ఉంటాయి మరియు ఇంకా ముందు, ముందు కూడా జరుగుతూనే ఉంటాయి. ప్రతి క్షణమూ తీసుకుంటారు మరియు ఇస్తారు. ఎందుకంటే తీసుకోవడం ద్వారా ఇవ్వడం కూడా బంధాయమానమై ఉంది. కావున ఇవ్వడంలో కూడా ఉదారచిత్తులుగా ఉన్నారా? లేక పిసినార్లుగా ఉన్నారా? ఉదారచిత్తులుగా ఉన్నారా? మీరు ఇచ్చేది ఏమిటి? వేటిద్వారా అయితే దుఃఖపడుతున్నారో వాటినే ఇస్తారు.

ఎప్పుడైతే పిల్లలందరూ ఖాళీ అయిపోతారో అప్పుడే తండ్రి వస్తారు. తనువు యొక్క శక్తి లేదు. మనస్సు, ధనము యొక్క శక్తి లేదు. తనువు యొక్క శక్తితో ఖాళీగా ఉన్నారు. కావుననే స్మృతిచిహ్నంలో శివుని ఊరేగింపును ఎలా చూపించారు? మరియు మానసిక శక్తి యొక్క సమాప్తికి గుర్తు - 'సదా పిలుస్తూనే ఉండడం'. రోజూ పిలుస్తూనే ఉంటారు కదా! ధనము ద్వారా ఖాళీ అయిన దానికి గుర్తుగా ఇప్పుడు మిగిలియున్న ఎంతో కొంత బంగారమేదైతే ఉందో దాని పైన కూడా సదా గవర్నమెంట్ యొక్క దృష్టి ఉంది. భయపడుతూ, భయపడుతూ ధరిస్తారు. ధనము ఉంటే, దానికి ఉన్న పేరు ఏమిటి? నల్లధనము. ఎంతగా ధనవంతులు అన్న పేరు ఉంటుందో అంతగా 90 శాతం నల్లధనమే ఉంటుంది, మరి అది పేరుకు ధనమా లేక పనికివచ్చే ధనమా? కావున ఎప్పుడైతే అన్ని వైపుల నుండి ఖాళీ అయిపోతారో, ఎప్పుడైతే కేవలం సుధాముని ఎండిపోయిన అటుకులు మిగిలియుంటాయో అప్పుడు తండ్రి వస్తారు. అలా ఎండిపోయినవి తింటూ ఉంటే నష్టమే వాటిల్లుతుంది. మీరు ఇచ్చేవి కేవలం బియ్యమే, అవి కూడా ఎండిపోయినవి! కానీ మీరు తీసుకునేవేమిటి? సర్వగుణాలు, సర్వశక్తులు, సర్వ ఖజానాలు. 36 కన్నా ఎక్కువ వెరైటీలు. మరి ఇది తీసుకోవడమయ్యిందా? లేక ఇవ్వడమయ్యిందా? ఆ ఎండిపోయిన అటుకులు కూడా మట్టి కొట్టుకుపోయినవి తెస్తారు. మట్టి యొక్క స్మృతి ఉంటుంది కదా! ఇప్పుడైతే మారిపోయారు. కానీ తండ్రి వద్దకు వచ్చినప్పుడు మట్టి కొట్టుకుపోయినవారిగానే ఉన్నారు. మట్టినే చూస్తూ, మట్టితో ఆడుకుంటూ ఇంకేమి చేసేవారు! ఇప్పుడైతే రత్నాలతో ఆడుకుంటున్నారు, కావున తీసుకోవడం మరియు ఇవ్వడం - ఇది కూడా సదా జరుగుతూనే ఉంటుంది. ఇవ్వడం కూడా మట్టికొట్టుకుపోయిన, ఎండిపోయిన అటుకులు. కానీ కొందరు పిల్లలు అవి ఇవ్వడంలో కూడా ఎంతో మిడిసిపడుతుంటారు. ఈరోజు ఇచ్చేసాము అని అంటారు కానీ సుధాముని వలే వాటిని కూడా పక్కన దాచిపెట్టుకుని ఉంచుకుంటారు. బాబా అయితే తీసుకోగలరు కానీ మరి ఇచ్చేవారికి భాగ్యం తయారవుతుందా? బలవంతంగా తీసుకున్నట్లయితే ఇచ్చి తీసుకోవడంలో తేడా ఉంటుంది, అందులో లోపం ఉంటుంది. ఒకటి ఇవ్వడం మరియు కోటానురెట్లు పొందడం. కావున స్వ ఇచ్చ అనగా దృఢ సంకల్పం ద్వారా ఒకటి ఇవ్వడం, కోటానురెట్లు పొందడం అవుతుంది. కావున మీరే ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే ఇవ్వడంలోనే కళ్యాణము ఉంది. కావున తీసుకోవడం మరియు ఇవ్వడం ఏమిటో అర్థం చేసుకున్నారా?

ఎప్పుడైతే ఇలా జరుపుకోవడం, కలుసుకోవడం మరియు ఇవ్వడము, తీసుకోవడం జరిగిపోతుందో ఆ తర్వాత ఏమిచేస్తారు? సదా బాబాతో పాటు సంతోషంగా ఆడుకోవడం, సదా అతీంద్రియ సుఖము యొక్క ఊయలలో ఊగడం. మరి ఇటువంటి మేళాను జరుపుకున్నారా? ఇదే ఆత్మికమేళాను సదా జరుపుకుంటూ ఉండండి మరియు ఇది ప్రతీరోజు జరుపుకునే మేళా, అర్థమయ్యిందా? అచ్చా!

ఈ విధంగా ప్రతిరోజు మేళాను జరుపుకునే వారికి, సదా స్వయం యొక్క మరియు సర్వుల యొక్క నోటిని తీపి చేసేవారికి, సదా కొత్త ఉత్సాహమును ఉంచేవారికి అనగా సదా ఉత్సవమును జరుపుకునే వారికి, ప్రతి క్షణము పైకి ఎక్కే కళ యొక్క కొత్త స్థితి అనగా కొత్త వస్త్రాలను ధరించేవారికి, కొత్త సింగారధారలకు, సదా బాబాతో పాటు సంతోషముగా ఆడుకునే వారికి, ఇటువంటి సదా ఆత్మిక మేళాను జరుపుకునే శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదాల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

యుగళులతో:- మీ విశేషతలను గూర్చి మీకు తెలుసా? ఈ గ్రూప్ యొక్క విశేషత ఏమిటి? ఈ గ్రూప్ సన్యాసులను, మహాత్ములను కూడా తలవంచుకునేలా చేసే గ్రూప్. సన్యాసులు అనగా ఈనాటి మహాన్ ఆత్మలు. కావున ఈనాడు మహాత్ములుగా పిలువబడేవారికి కూడా మీ జీవితం ద్వారా బాబా యొక్క పరిచయమును మీరు ఇస్తారు. ఇదే విశేషతను సదా స్మృతిలో ఉంచుకుంటూ ప్రతి అడుగునూ వేసినట్లయితే ప్రతి అడుగూ చరిత్రవంతముగా అయిపోతుంది. బ్రహ్మ యొక్క ప్రతి కర్మను చరిత్ర యొక్క రూపములో వర్ణన చేస్తారు కదా! ఇక్కడ మధువనమును బ్రహ్మా బాబా యొక్క చరిత్ర భూమిగా భావిస్తూ ఇక్కడకు వస్తారు కదా! కావున బ్రహ్మా బాబా యొక్క ప్రతి కర్మా చరిత్రగా అయిపోయింది, ఎందుకంటే అవి శ్రేష్ఠ కర్మలు, అలాగే ఈ గ్రూప్ యొక్క విశేషత ఏమిటంటే వీరు చరిత్ర సమానమైన కర్మలను చేసే గ్రూప్. ఎందుకంటే ఇప్పుడు అలౌకిక తండ్రి పిల్లలుగా అలౌకికముగా అయ్యారు. బ్రహ్మాకుమార్, బ్రహ్మా కుమారీల యొక్క అలౌకిక సంబంధం ఏర్పడింది. అలాకిక తండ్రి, అలౌకిక పిల్లలు మరియు అలౌకిక కర్మలు. అలౌకిక కర్మలనే చరిత్ర అని అంటారు. కావున రోజంతటిలో అమృతవేళ నుండి రాత్రి వరకూ ప్రతి కర్మా చరిత్రగా ఉండాలి, సాధారణముగా ఉండకూడదు, అలౌకికముగా ఉండాలి. అలౌకిక జీవితం వారు సాధారణ కర్మలను చేయజాలరు. 

అందరి రెండు చక్రాల బండి సరిగ్గా నడుస్తోంది కదా! ఎప్పుడూ ఏ చక్రమూ కిందకూ, పైకీ అవ్వడం లేదు కదా! ఒక చక్రము ముందుకు వెళుతూ, ఇంకొకటి వెనుకకు వెళుతూ ఇలాగైతే జరుగడం లేదు కదా! ఒకరికన్నా ఒకరు ముందు ఉండండి మరియు ఒకరినొకరు ముందు ఉంచేవారిగానూ ఉండండి. మీ అందరిలోనూ ఇదే విశేషత ఉండాలి. ఒకరినొకరు ముందు ఉంచడమే ముందుకు వెళ్ళడం, నేను పురుషుడిని అని, లేక నేను శక్తిని అని భావించడం కాదు. మీరు శక్తి అయినట్లయితే పాండవులూ తక్కువేమికాదు, అలాగే శక్తులూ తక్కువేమి కాదు. ఇరువురూ బాబా యొక్క సహయోగులే. కావున పాండవులు ముందు ఉన్నారు లేక శక్తులు ముందు ఉన్నారు అని కూడా అనలేరు. ఎంతో కాలంగా శక్తులు తమను తాము కింద ఉన్నవారిగా భావిస్తూ వచ్చారు. కావుననే నషా ఎక్కించేందుకు వారిని ముందు ఉంచారు. అందుకనే శక్తులను డాలు అని అంటారు. శక్తులను ముందు ఉంచడంలోనే పాండవులకు లాభం ఉంది, శక్తులు వెనుక ఉంటే మిమ్మల్నికూడా వెనక్కు లాగేస్తారు. ఎందుకంటే శక్తులలో ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. కావున శక్తులను ముందు ఉంచడమే మీరు ముందుకు వెళ్ళడం. శక్తులు పాండవులకు డాలు వంటివారు. పాండవులు ఎక్కడైనా ఇటువంటి భాషణ చేస్తే దెబ్బలు తినవలసి వస్తుంది. ఎక్కడైనా గీతాపాఠశాలను తెరిస్తే అక్కయ్యలను పంపించండి అని అంటారు. మాత గురువు. కావున మాతలో భావన సహజంగా కూర్చుంటుంది. బ్రహ్మాబాబా కూడా వెన్నెముకగా ఉన్నారు మరియు శక్తులను ముందు ఉంచారు. కావున మీరు కూడా బ్రహ్మాబాబా యొక్క సహచరులే కావున ఏవిధంగా బాబా శక్తులను ముందు ఉంచడం ద్వారా సఫలత లభించిందో అలాగే మీరు కూడా శక్తులను ముందు ఉంచినట్లయితే సఫలత లభిస్తుంది,

ప్రవృత్తిలో ఎటువంటి గొడవా జరగడం లేదు కదా? ఎప్పుడూ పాత్రలు ఒకదానికొకటి తగిలి చప్పుడు రావడం లేదు కదా! ఎందుకంటే ఏ చప్పుడు వచ్చినా అందరూ ఏమంటారు? భగవంతుని పిల్లలు మరియు గొడవ పడడమా? అని అంటారు. పాత్రలు ఒకదానికొకటి తగులుతుంటే చప్పుడు తప్పకుండా వస్తుంది కానీ ఇక్కడ ఆ చప్పుడు రాజాలదు, ఎందుకు? ఎందుకంటే ఇక్కడ మద్యలో తండ్రి ఉన్నారు. ఎక్కడైతే మధ్యలో తండ్రి వస్తారో అక్కడ శబ్దం ఉంటుందా? మధ్య నుండి ఎప్పుడైతే తండ్రిని తప్పిస్తారో అప్పుడు తప్పకుండా ప్రమాదం జరుగుతుంది మరియు శబ్దం వస్తుంది. కావున సదా బాబాను తోడుగా ఉంచుకోండి. బాబా తోడుగా ఉన్నట్లయితే ఏదైనా విషయం జరిగినా అది సరైపోతుంది. ఎవరైనా ఇద్దరి మధ్య మూడవవారు వస్తే విషయం సమాప్తమైపోతుంది కదా! అలాగే బాబాను మధ్యలో ఉంచినట్లయితే ఆ విషయం పెరగదు, సమాప్తమైపోతుంది.

ప్రవృత్తిలో ఉంటూ కూడా సదా దేహము యొక్క సంబంధం నుండి నివృత్తిగా ఉండండి, అప్పుడే ప్రవృత్తి యొక్క పాత్రను అభినయించగలుగుతారు. నేను పురుషుడిని, తాను స్త్రీ అనే భావము స్వప్నములో కూడా రాకూడదు. ఆత్మలు సోదరులైనప్పుడు స్త్రీ పురుషులు అన్నది ఎక్కడినుండి వస్తుంది? బాబా మరియు మీరే యుగళులు కదా! మరి తాను నా యుగళు అని ఎలా అనగలరు? నిమిత్తమాత్రముగా కేవలం సేవార్ధము అలా ఉన్నారు కానీ కంబైన్డ్‌ రూపముగా అయితే మీరు మరియు బాబాయే ఉన్నారు. అయినా బాప్  దాదా ధైర్యం ఉంచినందుకు అభినందనలు తెలుపుతారు. ధైర్యాన్ని ఉంచి ముందుకు వెళుతున్నారు, ఇంకా ముందుకు వెళుతూనే ఉంటారు. ఈ ధైర్యానికి అభినందనలు తెలుపుతున్నారు.

కుమారులతో:- స్వయాన్ని సదా రాజర్షులుగా భావిస్తున్నారా? అధికారులు మరియు ఋషులు అనగా తపస్వీలు, స్వయం యొక్క రాజ్యం ప్రాప్తమవ్వడం ద్వారా స్వతహాగానే తపస్వీలుగా అయిపోతారు. ఎందుకంటే స్వయం యొక్క రాజ్యం ఉన్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించడం ద్వారా, తండ్రికి చెందినవారిగా అవ్వడం ద్వారా అదే తపస్సు అవుతుంది. ఆత్మ తండ్రికి చెందినదిగా అవ్వడం అనగా తపస్విగా అయినట్లు. కావున రాజ్యమూ ఉంది మరియు మీరు ఋషులు కూడా, మరి అందరూ స్వరాజ్యాధికారులుగా అయ్యారా? ఏ కర్మేంద్రియమూ తన వైపుకు ఆకర్షించకూడదు. సదా బాబా వైపుకు ఆకర్షితులై ఉండాలి. ఏ వ్యక్తి లేక వస్తువు వైపుకు ఆకర్షణ వెళ్ళకూడదు. మరి మీరు ఇటువంటి రాజ్య అధికారి తపస్వీకుమారులేనా? పూర్తిగా విజయులుగా అవ్వండి. ఎందుకంటే వాయుమండలం కలియుగ వాయుమండలం కదా! అలాగే హంస మరియు కొంగల యొక్క తోడు ఉంది. అటువంటి వాతావరణంలో ఉంటూ కూడా స్వరాజ్యాధికారులుగా ఉన్నట్లయితే సురక్షితులుగా ఉంటారు. కొద్దిగా కూడా ప్రాపంచిక వైబ్రేషన్ల యొక్క ఆకర్షణ ఉండకూడదు ఎటువంటి కంప్లైంటూ ఉండకూడదు. సదా కంప్లీట్ గా ఉండాలి. కుమారుల యొక్క కంప్లైంట్ వస్తూ ఉంటుంది. కుమారులు విజయులుగా అయిపోయినట్లయి వారు అందరికన్నా ఉన్నతమైనవారు, ఎందుకంటే ప్రభుత్వం కూడా యువతను ముందు ఉంచుతుంది, అందులోనూ కుమారులు ఎక్కువగా ఉంటారు. కుమారులు ఏది కావాలనుకుంటే అది చేయగలుగుతారు, ఎందుకంటే శక్తి ఎంతగానో ఉంటుంది. కానీ శక్తిని వ్యర్థం చేయడం లేదు కదా! సంకల్పము మరియు స్వప్నములో ఒక్క బాబా తప్ప ఇంకెవరూ ఉండకూడదు. అప్పుడే నెంబర్ వన్ కుమార్ అని పిలువ బడతారు. కుమారులు నిర్విఘ్నులుగా అయిపోయినట్లయితే అందరినీ నిర్విఘ్నముగా చేయగలుగుతారు. కుమారుల టైటిలే విఘ్నవినాశకులు. ఏ విధమైన విఘ్నానికి అనగా మనసా, వాచా, కర్మణా ఏ విఘ్నానికీ వశీభూతులవ్వకూడదు. కావున కుమారులకే విఘ్నవినాశకులు అన్న టైటిల్ ఉంది. వినాయకుడు ఉన్నాడు కదా! కావున మీ స్మృతిచిహ్నానికి విఘ్నవినాశకుడు అన్న పేరు ప్రసిద్ధము. ప్రాక్టికల్ గా అయ్యారు. అప్పుడే స్మృతిచిహ్నము తయారయ్యింది. విఘ్నవినాశకులుగా అవ్వడం ద్వారా స్వతహాగానే మనస్సు ద్వారా కూడా సేవ జరుగుతూ ఉంటుంది. వాయుమండలము కూడా నిర్విఘ్నముగా అవుతూ ఉంటుంది. ఏ విధముగా తత్వాల ద్వారా వాతావరణం మారుతు ఉంటుందో అలా విఘ్నవినాశకులైన పిల్లల ద్వారా వాయుమండలం మారిపోతూ ఉంటుంది. కావున నలువైపులా విఘ్నవినాశకుల యొక్క అల వ్యాపించాలి. కావున మేము విజయీ వాయుమండలాన్ని తయారుచేయాలి అన్నదే స్మృతిలో ఉంచుకోండి. ఏ విధంగా సూర్యుడు స్వయం శక్తిశాలియో, కావున నలువైపులా తన శక్తి ద్వారా ప్రకాశాన్ని వ్యాపింపజేస్తాడో అలాగే శక్తిశాలులుగా అవ్వండి. కుమారులకు ఏదో ఒక పని తప్పకుండా కావాలి. కుమారులు ఫ్రీగా ఉన్నట్లయితే గొడవ జరుగుతుంది. కుమారులు బిజీగా ఉన్నట్లయితే అందులో స్వయం యొక్క కళ్యాణమూ ఉంది మరియు విశ్వము యొక్క కళ్యాణమూ ఉంది. కావున విఘ్నవినాశకులుగా అయి వాయుమండలమును తయారుచేయడంలో బిజీగా ఉండండి. మీ విశేషతను ఈ కార్యములో వినియోగించండి. ఒక్కొక్క కుమార్ అనేకులకు సంజీవనీ మూలికను ఇచ్చే మహావీరుడు, అనగా మీరు మూర్చితులను మేల్కొలిపేవారు. కావున సదా మీ యొక్క ఈ కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి. ఏ విధంగా మీ లౌకిక వృత్తిని మరచిపోరో అలాగే ఈ అలౌకిక వృత్తి కూడా సదా గుర్తుండాలి. సంగమయుగములో బాబా ద్వారా ఏ టైటిళ్ళు అయితే లభించాయో వాటి స్మృతిలో ఉండండి. టైటిళ్ళు గుర్తుండడం ద్వారా స్వతహాగానే జ్ఞానము మరియు జ్ఞానదాత ఇరువురి యొక్క స్మృతి ఉంటుంది. అచ్చా! ఓంశాంతి.

Comments