29-05-1977 అవ్యక్త మురళి

29-05-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పురుషార్ధం యొక్క వేగంలో ఆటంకానికి కారణం మరియు నివారణ.

                         సదా మర్యాదా పురుషోత్తములు, సర్వ ఖజానాలను సఫలం చేసుకునేవారు, సఫలతామూర్తులు, బాబా యొక్క ఆజ్ఞాకారులు, శ్రీమతానుసారం నడిచే ఆత్మలతో బాబా మాట్లాడుతున్నారు-
                        ప్రతి ఒక్క పురుషార్ధి శక్తిననుసరించి పురుషార్ధంలో నడుస్తున్నారు. ప్రతి ఒక్క పురుషార్థీ యొక్క వేగాన్ని చూస్తూ, ప్రతి ఒక్కరి ముందు ఏయే విఘ్నాలు వస్తున్నాయి? మరియు సంలగ్నతతో విఘ్నవినాశకులుగా ఏవిధంగా అవుతున్నారు అని. ఒకొక్కసారి ఆగుతున్నారు, ఒకొక్కసారి పరుగు పెడుతున్నారు, ఒకొక్కసారి దుముకుతున్నారు, కానీ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? వీటి కారణంగానే తీవ్ర పురుషార్ధి నుండి పురుషార్ధిగా అయిపోతున్నారు. ఎక్కేకళకి బదులు ఆగిపోయే కళలోకి వచ్చేస్తున్నారు. యజమాని లేదా మాస్టర్ సర్వశక్తివంతులకు బదులు ఉదాసీనంగా లేదా దాసీలుగా అయిపోతున్నారు. కారణం ఏమిటి? చాలా చిన్న చిన్న విషయాలే. గతంలో కూడా చెప్పాను - ముఖ్యంగా ఎక్కువ మంది ఎదురుగా వ్యర్ధ సంకల్పాల తుఫాను ఎక్కువ వస్తుంది.
                      వ్యర్ధ సంకల్పాలు రావడానికి ఆధారం శుభ సంకల్పాలు అంటే శుభ ఆలోచనలు, జ్ఞాన ఖజానా యొక్క లోటు. లభిస్తున్నా కానీ ఉపయోగించుకోవటం రావటం లేదు మరియు జమ చేసుకోవటం రావటం లేదు లేదా విధి రావటం లేదు. ఈ కారణంగానే వృద్ధి జరగటం లేదు. విన్నారు అంటే లభించింది కానీ ఆ సమయంలోనే అల్పకాలికంగా సంతోషం లేదా శక్తిని అనుభవం చేసుకుని సమాప్తి చేసేసుకుంటున్నారు. లౌకిక రూపంలో కూడా సంపాదించుకుంటారు మరియు తినేస్తారు, కొంచెం తింటారు, కొంచెం పోగొట్టుకుంటారు. అదేవిధంగా ధారణా శక్తి బలహీనంగా ఉన్న కారణంగా, విధి ద్వారా వృద్ధి పొందని కారణంగా సదా స్వయాన్ని జ్ఞానం మరియు శక్తుల ఖజానాతో ఖాళీగా అనుభవం చేసుకుంటున్నారు. అందువలన నిరంతరం శక్తిశాలిగా కాలేకపోతున్నారు. నిరంతరం హర్షితంగా ఉండలేకపోతున్నారు. బలహీనంగా ఉన్న కారణంగా మాయా విఘ్నాలకు వశీభూతం అయిపోతున్నారు. లేదా మాయకు దాసీ అయిపోతున్నారు మరియు ఇతరాత్మలు సంపన్నంగా ఉండటం చూసి స్వయం ఉదాసీనం అయిపోతున్నారు. జ్ఞాన ఖజానాను జమ చేసుకోవటం, శ్రేష్ట సమయం యొక్క ఖజానాను జమ చేసుకోవటం, లేదా స్థూల ఖజానాను ఒకటికి లక్షరెట్లు చేసుకోవటం అంటే జమ చేసుకోవటం. ఇలా ఈ అన్ని ఖజానాలను జమ చేసుకునేటందుకు ముఖ్య సాధనం - స్వచ్చమైన బుద్ధి మరియు స్వచ్చమైన మనస్సు. స్వచ్చమైన బుద్ధికి ఆధారం - బుద్ధి ద్వారా బాబాని తెలుసుకుని బుద్ధిని కూడా బాబా ముందు సమర్పణ చేయటం. సమర్పణ చేయటం అంటే నాది అనే భావనను తొలగించుకోవటం. ఈ విధంగా బుద్ధిని సమర్పణ చేశారా? శూద్రత్వం యొక్క బుద్ధిని సమర్పణ చేయాలి అంటే ఇచ్చేయాలి. ఇవ్వటంతో పాటు దివ్యబుద్ధిని తీస్కోవాలి. ఇవ్వటమే తీసుకోవటం. వ్యాపారం అంటే ఇచ్చిన తర్వాత తీసుకుంటారు కదా! డబ్బు ఇవ్వాలి, వస్తువు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఇవ్వటమే తీసుకోవటం. మొదట అన్నీ ఇవ్వాలి. ఏవిధంగా ఇవ్వాలి? శుభ సంకల్పం ద్వారా. అన్నీ బాబావే, నావి కాదు. నాది అనే అధికారాన్ని వదిలేయటమే సమర్పణ అవ్వటం అని అంటారు. దీనినే నష్టోమోహ స్థితి అని అంటారు. స్మృతి స్వరూపంగా అవ్వని కారణంగా లేదా వ్యర్ధ సంకల్పాలు నడుస్తున్న కారణంగా, ఉదాసీనంగా లేదా దాసీలుగా అయిపోయిన కారణంగా నాది అనే భావన నుండి నష్టోమోహగా అవ్వటం లేదు. నాది అనే భావన యొక్క విస్తారం చాలా ఉంటుంది. బాప్ దాదా కూడా రోజంతటిలో పిల్లలందరి యొక్క, విశేషంగా ఇవ్వటంలో చూపించే చతురత యొక్క ఆటలు చూస్తూ ఉంటారు. ఇప్పుడిప్పుడే ఇస్తారు మరలా ఇప్పుడిప్పుడే తిరిగి తీసేసుకుంటారు. నాది అనేది ఏదీ లేదు అని ఇప్పుడిప్పుడే నోటితో నాదంటూ ఏదీ లేదు అంటారు. కానీ మనస్సులో అధికారం ఉంచుకుంటారు. అధికారం అంటే తగుల్పాటు. ఒకొక్కసారి కర్మతో ఇచ్చేసి వాణితో తీసేసుకుంటారు. ఏమి చతురత చేస్తారంటే క్రొత్తవాటితో పాటు పాతవాటిని కూడా తమ దగ్గర ఉంచుకోవాలనుకుంటారు. అనటానికి నిమిత్తులు అని అంటారు కానీ వ్యవహారంలో గృహస్థీలుగా ఉంటారు. వ్యర్థ సంకల్పాలను తొలగించుకోవడానికి ఆధారం - గృహస్థ స్థితిని వదిలేయాలి. కుమారీ అయినా, కుమారుడు అయినా నా స్వభావం, నా సంస్కారం, నా బుద్ధి ఇవన్నీ గృహస్థ స్థితి యొక్క విస్తారం. సమర్పణ అయిపోయిన వారికి బాబా స్వభావమే మీ స్వభావం, బాబా సంస్కారమే మీ సంస్కారం, బాబా బుద్ది ఎలాగైతే దివ్యమైనదో అలాగే మీది కూడా అయితే, దివ్యబుద్ధిలో స్మృతి ఉండకపోవటం అనేది ఉండదు. ఒక గంట యొక్క స్థితిని పరిశీలించుకుంటే - సంకల్పాలకు ఆధారం ఏదోక రకమైన నాది అనే భావనే ఉంటుంది. నాది అనే భావనకి గుర్తు చెప్పాను కదా - తగుల్పాటు.
                      తగుల్పాటులో కూడా రకాలు ఉన్నాయి. 1. సూక్ష్మ తగుల్పాటు. దీనిని సూక్ష్మ ఆత్మిక స్థితిలో స్థితులైతేనే తెలుసుకోగలరు. 2. స్థూల రూపం యొక్క తగుల్పాటు. దీనిని సహజంగా తెలుసుకోవచ్చు. సూక్ష్మ తగుల్పాటు యొక్క విస్తారం కూడా చాలా ఉంది. తగుల్పాటు లేకుండా బుద్ధి యొక్క ఆకర్షణ లేదా లొంగుపాటు అక్కడి వరకు వెళ్ళదు. కనుక తగుల్పాటుకి పరీశీలన లొంగుబాటు. సంకల్పంలో లేదా వాణిలో లేదా కర్మలో లేదా సంబంధ సంపర్కాలలో అనుకోకుండా సమయం అటువైపు తప్పకుండా వినియోగిస్తారు. అందువలన వ్యర్థ సంకల్పాలకు ముఖ్య కారణం తగుల్పాటు. దీనిని పరిశీలించుకోండి, మీరు వద్దనుకున్న విషయాలు కూడా వ్యర్థ సంకల్పాల రూపంలో మిమ్మల్ని అలజడి చేస్తాయి. దీనికి కారణం పాత స్వభావ సంస్కారాలపై నాది అనే భావన. నా స్వభావం, నా సంస్కారం అనుకుంటే అవి ఆకర్షిస్తూ ఉంటాయి. రచన రచయితను ఎలాగైతే లాగుతుందో అదే విధంగా నా స్వభావం, సంస్కారం అనే రచన, రచయిత అయిన ఆత్మను లాగుతూ ఉంటుంది. నావి కాదు, ఇవి శూద్ర సంస్కారాలు. శూద్రత్వ సంస్కారాలను నావి అనటం మహాపాపం, దొంగతనం కూడా మరియు మోసం కూడా. శూద్రుల వస్తువులను బ్రాహ్మణులు దొంగతనం చేస్తున్నారు అంటే నావి అని అంటున్నారు ఇది మహాపాపం. బాబా! ఇవన్ని నీవే అని చెప్పి మరలా నావి అని అనటం మోసం. ఇటువంటి పాపాలు చేయటం వలన, పాప భారం పెరిగిపోవటం వలన బుద్ధి ఉన్నత స్థితిలో స్థితులవ్వలేకపోతుంది. అందువలన వ్యర్థ సంకల్పాల యొక్క నీచస్థితికి మాటిమాటికి రావలసి వస్తుంది. మరలా ఏమి చేయము? అని అరుస్తున్నారు.
                     వ్యర్ధ సంకల్పాలకు రెండవ కారణం - రోజంతటి దినచర్యలో మనసా, వాచా, కర్మణా కొరకు బాబా ద్వారా మర్యాదా సంపన్న శ్రీమతం ఏదైతే లభించిందో దానిని ఏదోక రూపంలో అతిక్రమిస్తున్నారు. ఆజ్ఞాకారి నుండి అనాజ్ఞాకారి అయిపోతున్నారు. మర్యాదలు అనే రేఖ నుండి మనస్సు ద్వారానైనా బయటకి వస్తే వ్యర్థ సంకల్పాలు అనే రావణుడు యుద్ధం చేస్తాడు. కనుక ఇది కూడా పరిశీలించుకోండి. సంకల్పం, వాణి, కర్మ, సంబంధ సంపర్కాల ద్వారా బ్రాహ్మణుల నీతి మరియు రీతిని అతిక్రమించటం లేదు కదా? ఏదొక నీతి లేదా రీతిని అతిక్రమిస్తేనే బుద్ధిలో వ్యర్ధ సంకల్పాలు కలిసిపోతాయి. రెండవ కారణం అర్ధమైందా? అందువలన బాగా పరిశీలించుకోవాలి, అప్పుడే వ్యర్థ సంకల్పాల నుండి నివృత్తి కాగలరు. రోజంతటి కొరకు బాబా ద్వారా శుద్ధ ప్రవృత్తి లభించింది. బుద్ధికి ప్రవృత్తి - శుద్ధ సంకల్పాలు చేయటం, వాణీకి ప్రవృత్తి - బాబా ద్వారా విన్నది చెప్పటం. కర్మకి ప్రవృత్తి - కర్మయోగియై ప్రతి కర్మ చేయటం. కమలం సమానంగా అతీతం మరియు అతిప్రియంగా ఉండటం. ప్రతి కర్మ ద్వారా బాబా యొక్క శ్రేష్ట కార్యాలను ప్రత్యక్షం చేయటం లేదా ప్రతి కర్మను చరిత్ర రూపంగా చేయటం. చతురతతో కాదు, చరిత్రగా చేయాలి, అది కూడా దివ్య చరిత్రగా ఉండాలి. సంపర్కంలో ప్రవృత్తి - నిమిత్తంగా స్వయం యొక్క సంపర్కంలోకి వస్తూ అందరికీ తండ్రి అయిన బాబా సంపర్కంలోకి తీసుకురావాలి. ఇలా పవిత్ర ప్రవృత్తిలో బిజీగా ఉండటం ద్వారా వ్యర్ధ సంకల్పాల నుండి నివృత్తి కాగలరు. ప్రవృత్తి నుండి నివృత్తి అని వారు అంటారు కదా! కానీ బాబా అంటున్నారు పవిత్ర ప్రవృత్తి ద్వారానే నివృత్తి. గృహస్థీలు వేరు, వీరిని గృహస్థి అని అనరు. పవిత్ర ప్రవృత్తి గలవారిని నిమిత్తులు అని అంటారు, కానీ గృహస్థి అని అనరు. కనుక అర్ధమైందా! నివృత్తికి ఆధారం పవిత్ర ప్రవృత్తి. మంచిది.
                         సదా మర్యాదా పురుషోత్తములు, సర్వ ఖజానాలను సఫలం చేసుకునేవారికి, సఫలతామూర్తులకు, వ్యర్ధాన్ని సమర్ధంలోకి పరివర్తన చేసుకునేవారికి, బాబా యొక్క ఆజ్ఞాకారి, సదా శ్రీమతానుసారం నడిచే పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments