28-11-1981 అవ్యక్త మురళి

* 28-11-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పూర్వజులైన మీపై సర్వాత్మల యొక్క ఆశలు.

ఈ రోజు గ్రాండ్ ఫాదర్ తమ సర్వవంశావళితో కలుసుకుంటున్నారు. ఇది ఎంత పెద్ద వంశావళి. దీని గురించి మీ అందరికీ తెలుసు. మీరందరూ ఈ వంశావళి యొక్క ఆది పునాది వంటివారు లేక వంశావాళి అనే వృక్షం యొక్క మూలమగు కాండము వంటివారు ద్వారా వంశావాళి ఏవిధంగా వృద్ధి పొందుతుందో ఈ రహస్యాలన్నీ మీకు బాగా తెలుసు కదా! ఏ ఆత్మనైనా చూసినప్పుడు లేక సంపర్కంలోకి వచ్చినప్పుడు మేము సర్వాత్మలకు పూర్వజులము అని లేక మొత్తం వృక్షం యొక్క శాఖలు, ఉప శాఖలు మొదలైన వాటన్నిటికీ మూల ఆధారము అనగా పునాది వంటివారము అన్నది స్మృతిలోకి వస్తుందా? ఈ స్మృతి సదా సమర్థ రూపంలో ఉంటుందా? ఈ శ్రేష్ఠ స్మృతి ద్వారా స్వతహాగానే సమర్థస్వరూపులుగా అయిపోతారు. కాండము అనగా మూలపునాదియే బలహీనంగా ఉన్నట్లయితే మొత్తం వృక్షమంతా బలహీనంగా అయిపోతుంది. మూలం శక్తిశాలిగా ఉన్నట్లయితే వృక్షం కూడా శక్తిశాలిగా ఉంటుంది. మొత్తం వృక్షం యొక్క ప్రతి ఆకుకు బీజంతో పాటు వేర్లతో కూడా సంబంధము ఉంటుంది. జీజం యొక్క శక్తి కాండము ద్వారానే శాఖలు, ఉపశాఖల వరకూ చేరుకుంటుంది. కావున ఈ రోజు మీ సర్వ వంశావళికి పూర్వజులైన మీ  ద్వారా లేక మూల ఆధారము ద్వారా ఏ శక్తి కావాలి? సర్వాత్మలు పూర్వజులైన మిమ్మల్ని ఏ ఆశతో స్మ్రుతి చేస్తున్నాయి, ఏ శుభ కోరికను మాస్టర్ దాతలు, వరదాతలైన మీ ద్వారా కోరుకుంటున్నారు? సర్వాత్మల యొక్క అనగా మీ అనంతమైన వంశావళి యొక్క శుభ సంకల్పాలు లేక కోరికలను గూర్చి మీకు తెలుసా?

ఈ రోజు సర్వాత్మల యొక్క ఒకే శబ్దము వినిపిస్తోంది. రెండు క్షణాలైనా సుఖము మరియు శాంతితో జీవించాలనుకుంటున్నారు. వ్యాకులతతో ఉన్నారు. సంపద మరియు సాధనాలు ఉంటూ కూడా సుఖము మరియు శాంతితో కూడుకున్న నిదుర కూడా కంటికి లేదు. ఈ రోజు మెజార్టీ సత్యమైన సుఖము మరియు శాంతి యొక్క లేక సంతోషం యొక్క దాహార్తితో ఉన్న కారణంగా ఆ మార్గాన్ని వెదుకుతున్నారు. అనేకమైన అల్పకాలికమైన మార్గాలను అనుభవం చేసుకుంటూ సంతుష్టత లభించని కారణంగా ఇప్పుడు మెల్లమెల్లగా ఆ అనేక మార్గాల నుండి వెనుదిరుగుతున్నారు. ఇది కూడా కాదు. ఇది కూడా కాదు అని భావిస్తున్నారు. ఇప్పుడు ఇక నేతి, నేతి అన్న అనుభవంలోకి వస్తున్నారు. 'సత్యమైన మార్గము ఇంకేదో ఉంది' అనే అనుభూతినే చేసుకుంటున్నారు. ఇటువంటి సమయంలో, ఇటువంటి ఆత్మలకు దీపముగా అయి దారిని చూపించడం పూర్వజులైన మీ యొక్క కర్తవ్యము. అమరజ్యోతిగా అయి అంధకారం నుండి లక్ష్యానికి తీసుకురావాలి. ఇటువంటి సంకల్పాలు మీకు కలుగుతున్నాయా? పూర్వజ ఆత్మలమైన మేము సర్వ వంశావళి ముందు ఏమి చేస్తామో అదే మొత్తం వంశావళి వరకూ చేరుకుంటుంది అన్న స్మృతి ఉంటుందా? పూర్వజులైన మీ యొక్క వృత్తి విశ్వం యొక్క వాతావరణమును పరివర్తన చేస్తుంది. పూర్వజులైన మీ యొక్క దృష్టి మొత్తం వంశావళి అంతటికీ సోదరభావం యొక్క స్మృతిని కలిగిస్తుంది. పూర్వజులైన మీ యొక్క తండ్రి యొక్క స్మృతి సర్వవంశావళికి మా తండ్రి వచ్చారు అన్న స్మృతిని కలిగిస్తుంది. పూర్వజులైన మీ యొక్క శ్రేష్ట కర్మ వంశావళిలో శ్రేష్ఠ చరిత్ర అనగా చరిత్ర నిర్మాణము యొక్క శుభ ఆశలను ఉత్పన్నం చేయిస్తుంది. అందరి దృష్టి పూర్వజులైన మిమ్మల్ని వెదుకుతోంది. ఇప్పుడు ఇక అనంతమైన స్మృతి స్వరూపులుగా అవ్వండి, తద్వారా హద్దులోని వ్యర్థమైన విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. తల్లక్రిందుల వృక్షము యొక్క లెక్కలో చూస్తే బీజంతో పాటు కాండము కూడా పైన ఉన్నతమైన స్థానంలో ఉంది. డైరెక్ట్ బీజము, ముఖ్యమైన రెండు ఆకులు. త్రిమూర్తులతో పాటు సమీపం యొక్క సంబంధంలో మూలము యొక్క రూపంలో ఉన్నారు. అది ఎంత ఉన్నతమైన స్థితి! ఇదే ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉన్నట్లయితే హద్దులోని విషయాలు ఎలా అనుభవమవుతాయి! బాల్యవు నిర్లక్ష్యపు విషయాలలో అనుభవమవుతాయి. మీ అనంతమైన వృద్ధాప్యంలోకి వచ్చినట్లయితే సదా అనుభవీ మూర్తులుగా అయిపోతారు. అనంతమైన పూర్వజస్థితి యొక్క వృత్తి ఏదైతే ఉందో దానిని సదా స్మృతిలో ఉంచుకోండి. ఇప్పుడు ఇంకా ఎంత కార్యం మిగిలి ఉంది? సదా ఇది స్మృతిలో ఉంచుకోండి. కాని ఈ కార్యమంతా ఏ విధంగా సహజంగా సంపన్నమవుతుంది? ఏ విధంగా మీ రచన అయిన సైన్స్ వారు విస్తారమును సారంలో ఇముడుస్తున్నారు. అతి సూక్ష్మమైన మరియు శక్తిశాలీ సాధనాలను తయారుచేస్తున్నారు. తద్వారా సమయం, సంపద మరియు శస్త్రాలు తక్కువలో తక్కువగా ఖర్చయ్యే విధంగా జాగ్రత్త పడుతున్నారు. మొదట్లో వినాశనం యొక్క కార్యంలో ఎంతో పెద్ద సైన్యాన్ని ఎన్నో శస్త్రాలను మరియు ఎంతో సమయాన్ని వినియోగించేవారు, మరియు ఇప్పుడు విస్తారమును సారంలోకి చేసేస్తుందో అలాగే స్థూల సాధనాల యొక్క విస్తారము వలన సూక్ష్మశక్తుల యొక్క శాతము గుప్తమైపోతుంది. తీసుకువచ్చారు కదా! అలాగే మీరూ మాస్టర్ రచయితలుగా అయి స్థాపన యొక్క కార్యంలో ఇలాగే సూక్ష్మము ద్వారా నిమిత్తముగా స్థూల సాధనాలను కార్యంలో వినియోగించండి. లేకపోతే స్థూల సాధనాల యొక్క విస్తారంలో సూక్ష్మశక్తులు గుప్తమైపోతాయి. ఏవిధంగా వృక్షం యొక్క విస్తారము బీజమును గుప్తంగా పూర్వజ ఆత్మలగు మీ యొక్క అలౌకికత 'సూక్ష్మ శక్తి' తద్వారా పూర్వజుల ద్వారా ఏదో విశేషమైన శక్తి ఉత్పన్నమవుతోంది అని అందరూ అనుభవం చేసుకోగల్గాలి. మీ వంశావళి ఆత్మలైన మీ ద్వారా ఏదైనా నవీనతను కోరుకుంటోంది. సాధనాల యొక్క శక్తి. వాణి యొక్క శక్తి ఇదైతే అందరి వద్దా ఉంది. కాని అప్రాప్తమైన శక్తి ఏది? అది శ్రేష్ఠ సంకల్ప శక్తి, శుభ వృత్తి యొక్క శక్తి, స్నేహము మరియు సహయోగము యొక్క దృష్టి ఇది ఎవరి వద్దా లేదు. కావున హే పూర్వజ ఆత్మల్లారా మీ వంశావళిని ప్రాప్తుల యొక్క, ఆశల యొక్క దీపాలను వెలిగించి యదార్ధ గమ్యం వరకూ తీసుకురండి. ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా?

అందరూ ఏంచేస్తారో అదే చేస్తే అందులో ఏముంది. మీరైతే అల్లాకు చెందినవారు, అతీతమైనవారు. ఇప్పుడు వాణి యొక్క బాంబులను వేస్తున్నారు కాని ఇప్పుడు అవన్నీ బేబీ బాంబులు మాత్రమే. ఇప్పుడు ఇక ప్రాప్తి యొక్క అనుభవమనే బాంబులను వేయండి. అది నేరుగా జీవితాన్ని పరివర్తన చేసెయ్యాలి. బాణం బుర్ర వరకూ తగులుతోంది. అది హృదయం వరకూ తగలడం లేదు. ముందు ముందు ఏం చేయాలో ఆ ప్లానునైతే ఇవ్వవలసి ఉంటుంది కదా! ఇప్పుడు మంచి కార్యమును చేస్తున్నారు అని వారి నోటి ద్వారా వెలువడుతుంది. కాని ఇదొక్కటే మార్గము అని హృదయపూర్వకంగా వెలువడాలి. నోటి యొక్క వ్యాపారాలు చేసేవారు ఎందరో ఉంటారు, హృదయపూర్వకంగా చేసేవారు కోట్లాదిమందిలో ఏ ఒక్కరో ఉంటారు. కాని మీరందరూ మనోభిరాముడైన తండ్రి యొక్క పిల్లలు, హృదయపూర్వకంగా వ్యాపారము చేసేవారు. మరిప్పుడేం చేస్తారు? సేవ యొక్క ఎటువంటి శక్తిశాలి చక్రము తిప్పాలంటే దాని ద్వారా సర్వాత్మలు తమ పూర్వజులను గుర్తించి ప్రాప్తి యొక్క అధికారమును పొందాలి. కొంత విన్నాము, బాగుంది అని అనేందుకు బదులుగా కొంత లభించింది అనే అనుభూతిని కలిగించండి, అర్థమైందా? చాలా బాగా వినిపిస్తారు అని కాదు. చాలా బాగా తయారుచేస్తారు అని భావించాలి. తక్కువ ఖర్చు, తక్కువ శక్తి, తక్కువ సమయం - ఇదే విధి ద్వారా సిద్ధీ స్వరూపులుగా అవ్వండి. పంజాబ్ జోన్ ఉంది కదా! పంజాబ్ జోన్ను ఎలా తయారుచేస్తారు? ఇటువంటి నవీనతను ఏదైనా చేసి చూపించండి. అనుభవం చేయించడం అనగా వారసులుగా చేయడం. బాగా వినేవారు, బాగుంది, బాగుంది అనేవారు వారంతా ప్రజలు, ఇప్పడిక వారస క్వాలిటీ కావాలి. ఒక్క వారసుని వెనుక ప్రజలు తమంతట తామే వచ్చేస్తారు. పంజాబ్ ఏం చేస్తుంది? సంఖ్య పెరగకపోతే కనీసం క్వాలిటీనైనా తీయవచ్చు కదా! మరేం చేస్తారు?ఇప్పుడు నలువైపులా వారస క్వాలిటీవారు తక్కువగా ఉన్నారు కావున పంజాబ్ వారు ఇందులో నెంబర్ వన్ గా అయిపోండి. కొందరు క్వాంటిటీలో నెంబర్ వన్ గా ఉంటే మరికొందరు క్వాలిటీలో నెంబర్ వన్ గా అయిపోండి, అర్థమైందా? పంజాబ్ వారు ఏం చేస్తారు? క్వాలిటీవారు ఒక్కరుంటే క్వాంటిటీ ఇంకెంతో ఉంటుంది. ఎందుకంటే క్వాలిటీవారు ఒక్కరైనా క్వాంటిటీని స్వతహాగానే తీసుకువస్తారు. వారి పేరుతో మీ పని జరిగిపోతుంది. ఇదైతే సహజమే కదా! అచ్ఛా

ఈ రోజు పంజాబ్ మరియు మధువనం వారి యొక్క టర్న్, పంజాబ్ వారు అందర్నీ తీసుకువచ్చి మధువనంలో సరెండర్ చేయిస్తారా? పంజాబ్ నుండి నదులు వెలువడి ఎక్కడ కలుస్తాయి? మధువనంలోనే సాగర తీరం ఉంది, కావున ఇది పంజాబ్ మరియు మధువనం యొక్క మిలనము. విశేషమైన టర్న్ పంజాబ్ వారిది, కావున పంజాబ్ వారిని ఉద్దేశించి చెబుతున్నారు. మిగిలినవారు అందరూ అందులో వచ్చేసారు. మధువన గ్రూపులోకైతే అందరూ వచ్చేసారు కదా! అందరూ ఎందులో ఇమిడిపోవాలి? మధువనంలోనే కదా! అచ్ఛా

నలువైపులా ఉన్న సర్వ పూజ్య ఆత్మలకు, సదా సర్వుల ఆశలను సదా కలికంగా పూర్ణం చేసేవారికి, అప్రాప్త ఆత్మలకు ప్రాప్తి అనే అంచలి యొక్క అనుభూతిని కలిగించేవారికి, సర్వులను అనేక మార్గాల నుండి తొలగించి ఒకే మార్గంలోకి తీసుకువచ్చేవారికి, ఇటువంటి సర్వాత్మల యొక్క మూల ఆధారమైనవారికి, సదా సర్వులను ఒక్క తండ్రి యొక్క అధికారులుగా తయారుచేసేవారికి, ఇటువంటి శ్రేష్ఠమైన పూర్వజ అత్యలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఎంతో విన్నారు. ఇప్పుడిక స్వరూపంగా అయి స్వరూపంగా తయారుచేయడమే విశేషత. ఎంతగా స్వయం సర్వప్రాప్తి స్వరూపులుగా ఉంటారో అంతగా సర్వులను ప్రాప్తి స్వరూపులుగా చేయగల్గుతారు. ఈరోజుల్లో సర్వాత్మలు పొందాలనుకుంటున్నారే కాని వినాలనుకోవడం లేదు. ఎప్పుడైతే పొందుతారో అప్పుడే ఏదైతే పొందాలో అది పొందేసాము అన్న గీతమును గానం చేస్తారు. ఏ విధంగా మీరు మేము పొందేసాము అని సంతోషం యొక్క ఈ గీతమును గానం చేస్తారో అలాగే ఇతర ఆత్మలు కూడా ఈ సంతోషకరమైన గీతమును గానం చేస్తారు. వర్తమాన సమయంలో ఆత్మలకు ఇదే అవసరముంది. ఏ అవసరమైతే ఉందో దానినే పూర్ణం చేయాలి. ఇదే శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క కర్తవ్యము. ఇదే కర్తవ్యంలో సదా అనుభవీ మూర్తులుగా అయి అనుభవాన్ని కలిగిస్తూ ఉండండి. ఇదే కోరుకుంటారు కదా! ఇదే కోరికను పూర్ణం చేసేవారు అనగా సర్వులనూ తృప్త ఆత్మలుగా తయారుచేసేవారు. కావున సదా తృప్త ఆత్మలుగా ఉన్నారా? సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండాలి. ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారే తృప్తిగా ఉంటారు మరియు ఏదైతే స్వయం వద్ద ఉంటుందో దానినే ఇతరులకు కూడా తప్పకుండా ఇస్తారు. కావున సదా ప్రాప్తి స్వరూపం యొక్క నషా మరియు సంతోషంలో ఉండండి. ఇదే సంగమయుగ జీవితం యొక్క విశేషత, తండ్రిని పొందారు అనగా సంగమ యుగం యొక్క ప్రత్యక్ష ఫలాన్ని పొందారు. ప్రత్యక్ష ఫలము సర్వప్రాప్తులు. ఇదే స్థితి ద్వారా సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి.

మధువన నివాసులైన సోదరీ సోదరులతో - మధువన నివాసులు ఎంత అదృష్టవంతులంటే, మిమ్మల్ని చూసి అందరూ సంతోషిస్తున్నారు. మీ భాగ్యము ఇంత ఉన్నతమైనదని మీకు తెలుసు కదా! మీరు ఎంత భాగ్యవంతులంటే, మీరు సదా సాగరం యొక్క తీరంపై ఉంటారు. సదా స్థూలంలో కూడా తండ్రి మరియు శ్రేష్ఠ ఆత్మల తోడుగా ఉంటారు. మరి అది ఎంతటి గొప్ప భాగ్యము! కావున సదా మీ భాగ్యం యొక్క గుణాలను గానం చేస్తూ ఉన్నారా? ఇదే గుణమును గానం చేస్తూ ఊయలలో ఊగుతూ ఉండండి. మధువన నివాసులు అనగా సదా మధువు వలే మధురమైనవారు. కావున సదా నోరు తియ్యగా ఉండాలి మరియు సర్వుల నోటిని తీపి చేసేవారిగా ఉండాలి. సాగర తీరంపై ఉండే హోలీ హంసలు మీరు. హంసలు ఏం చేస్తాయి? సదా ముత్యాలను గ్రోలుతూ ఉంటాయి. అవి రాయిరప్పలను చూడవు, రత్నాలనే చూస్తాయి. కావున మీరందరూ రత్నాలను గ్రోలేవారే కదా! మీరు మహాన్ తీర్థ స్థానముపై ఉండే మహాన్ ఆత్మలు. కావున ఇది మహాత్ముల యొక్క గ్రూపే కదా! మహాత్ములు అనగా సదా మహాన్ వస్తువును చూసేవారు. కావున మహాన్ వస్తువు ఏది? (ఆత్మ) మరి మహాత్ముల యొక్క దృష్టి ఎటువైపుకు వెళుతుంది? మహాన్ వస్తువు పైకి. కావున సదా మహాన్ గా చూసేవారు. మహాన్ వాక్కులను పలికేవారు మరియు మహాన్ కర్మను చేసేవారు, వారినే మహాత్ములు అని అంటారు. మరి పాండవులంతా మహాత్ములేనా? బాప్ దాదాకు అందరికన్నా ఎక్కువగా ఎవరిపై ఆశలు ఉన్నాయి? మధువన నివాసులపై, మధువన నివాసులకు ఆశా దీపాలను వెలిగించడం వస్తుంది కదా! కావున సదా మధువనంలో దీపావళి ఉంది కదా! సదా శుభ ఆశల యొక్క దీపాలు వెలుగుతున్నాయి. కావున రోజూ దీపావళే. తద్వారా మధువనంలో ఎప్పుడూ అంధకారం ఏర్పడజాలదు. మధువనంవారు మాస్టర్ శిక్షకులు. మీరు నేర్పించినా, నేర్పించకపోయినా ప్రతి కర్మా ప్రతి ఆత్మకు శిక్షణను ఇస్తుంది. సాధారణంగా చేసినా కాని అదీ నేర్చుకొని వెళతారు మరియు శ్రేష్ఠంగా చేసినట్లయితే దానినీ నేర్చుకొని వెళతారు. మీరు శిక్షణను ఇవ్వకపోయినా మధువన నివాసిగా అవ్వడము అనగా మాస్టర్ శిక్షకులుగా అవ్వడము. కావున సదా నేను మాస్టర్ శిక్షకుడను అన్నది గుర్తుంచుకోండి. తద్వారా ప్రతి కర్మ, ప్రతి మాట శిక్షణను ఇచ్చేదిగా ఉండాలి. మీరు విశేషంగా గద్దెపై కూర్చొని నేర్పించే అవసరం లేదు. మీరు నడుస్తూ, తిరుగుతూ ఉండే శిక్షకులు. ఏ విధంగా ఈ రోజుల్లో సంచార గ్రంథాలయాలు ఉంటాయో అలాగే మీరు సంచరించే మాస్టర్ శిక్షకులు, మీ స్కూలు బాగుంది కదా! కావున సదా మీ ముందు విద్యార్థులను చూస్తూ ఉండండి. మీరు ఒంటరిగా లేరు, సదా విద్యార్థుల ముందు ఉన్నారు. సదా చదువుతున్నారు మరియు చదివిస్తున్నారు కూడా! యోగ్యులైన శిక్షకులు ఎప్పుడూ విద్యార్థుల ముందు నిర్లక్ష్యులుగా ఉండరు, అటెన్షన్ లో ఉంటారు. మీరు పడుకున్నా, లేచినా, నడుస్తున్నా, కుర్చున్నా అన్నివేళలా మేము పెద్ద కాలేజీలో కూర్చున్నాము, విద్యార్థులు చూస్తున్నారు అని భావించండి. తద్వారా అద్భుతమైన శిక్షకులుగా అయిపోతారు. మీ అందర్నీ ఏమని మహిమ చేయాలి? మధువనం వారికి ఏ మహిమలైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. ఈ విధంగా మహాన్ గా భావిస్తూ సదా నడుచుకోండి. బాబా ఎంతగా మహిమ చేస్తారో అంతగా దానిని నిలబెట్టుకోవలసి ఉంటుంది కూడా. కావున నిలబెట్టుకోవడంలో కూడా మీరు చురుకైనవారే కదా! మధువనం యొక్క పటము మొత్తం విశ్వంలోకి వెళ్ళిపోతుంది. అందరి బుద్ధిలోనూ సదా ఏముంటుంది? మధువనంలో ఏం జరుగుతోంది అనే ఉంటుంది. కావున మీరు సర్వుల బుద్ధిలోనూ స్మృతి స్వరూపులు. మధువన నివాసులు ప్రతి ఒక్కరూ లైట్-మైట్ యొక్క గోళాలుగా అవ్వండి. లైట్ మరియు మైట్ వైపుకు స్వతహాగానే అందరూ ఆకర్షితులై వస్తారు. ఇప్పుడు తండ్రి యొక్క కర్తవ్యము కొనసాగుతోంది. కావున తండ్రికి చెందినవారిగా అయ్యే పిల్లలు సహజంగానే అనుభవం చేసుకుంటున్నారు మరియు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ కర్తవ్యము గుప్తంగా ఉంది. ఇప్పుడిక మీరు శక్తి స్వరూపం ద్వారా వాయుమండలమును తయారుచేయండి. ఇదైతే డ్రామానుసారంగా జరగవలసిందే, పెరగవలసిందే, కొనసాగవలసిందే కావున నడిపించేవారు నడిపిస్తున్నారు. కాని, ఇప్పుడు అలాగే బాబాను అనుసరించండి. ఇప్పుడు ప్రతి ఆత్మ శక్తిస్వరూపంగా అయిపోవాలి. మీరు ఎవరి సంపర్కంలోకి వచ్చినా వారు అలౌకికతను అనుభవం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఆ పాత్ర జరగాలి. ఇప్పుడు బాగుంది, బాగుంది అని అంటారు కాని బాగా అవ్వాలి అన్న ప్రేరణ లభించడం లేదు అని వినిపించారు కదా! దానికి ఒకే సాధనము - సంఘటిత రూపంలో జ్వాలా స్వరూపంగా అవ్వండి. ఒక్కొక్కరూ చైతన్య లైట్ హౌస్లుగా అవ్వండి. సేవాధారులుగా ఉన్నారు, స్నేహులుగా ఉన్నారు. ఒకేబలము, ఒకే విశ్వాసము గలవారిగా ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది కాని మాస్టర్ సర్వశక్తివంతుల స్థితిలోకి వచ్చినట్లయితే అందరూ మీ ముందు దీపపు పురుగుల వలే చుట్టూ తిరగడం మొదలుపెడతారు. ఇప్పుడు కేవలం దీపమైన తండ్రి యొక్క ఆకర్షణ ఉంది మరియు సర్వులలో అలా దీపం యొక్క ఆకర్షణ ఏర్పడినట్లయితే ఏమైపోతుంది? మీరూ దీపాలే కాని ఇప్పుడే ఇంకా స్టేజీ పైకి రాలేదు. స్టేజి పైకి వచ్చినప్పుడు చూడండి - అబూ వారు మీ వెనుక ఎలా పరిగెత్తుకుంటూ వస్తారో! మీరు వెళ్ళవలసిన అవసరముండదు. వారే వచ్చి జీ హజూర్. ఏదైనా సేవ ఉందా అని అంటారు. ఇప్పుడు ప్రియమైనవారిగా అయ్యారు. ఇందులో బాగానే ఉన్నారు. పిల్లలు మరియు తండ్రి మధ్య ఉండే సంబంధమును నిర్వర్తించడంలో సరిగ్గానే ఉన్నారు. కాని ఇప్పుడిక మాస్టర్ శిక్షకులుగా అయి, మాస్టర్ సద్గురువులుగా అయి స్టేజి పైకి రండి, ఇప్పుడు ఇంకా ఈ రెండు పాత్రలు మిగిలి ఉన్నాయి. అర్థమైందా? అచ్చా మధువన నివాసులను బాప్ దాదా సదా విశేష ఆత్మల యొక్క రూపంలో చూస్తారు. మధువన నివాసులు సదా బాబా ఆశల యొక్క దీపములు. అందరూ సదా సంతుష్టంగానే ఉన్నారు కదా! సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టపర్చాలి. ఇదే మీ అందరి యొక్క సదా కలికమైన స్లోగన్ గా ఉండాలి. సదా మీ బోర్డుపై ఏ స్లోగన్ వ్రాయబడి ఉంది? సంతుష్టముగానూ ఉండాలి మరియు సంతుష్టపర్చాలి కూడా. ఈ సర్టిఫికెట్ కలవారే భవిష్యత్తులో రాజ్య భాగ్యం యొక్క సర్టిఫికెట్‌ను తీసుకుంటారు. కావున మధువనం వారు ఈ సర్టిఫికెట్ నైతే తీసుకున్నారు కదా! సదా అమృతవేళ ఈ స్లోగన్ ను స్మృతిలోకి తెచ్చుకోండి. ఏ విధంగా బోర్డుపై స్లోగన్ ను వ్రాస్తారో అలా సదా మీ మస్తకం యొక్క బోర్డుపై ప్రతి స్లోగన్‌ను త్రిప్పండి. తద్వారా అందరూ సంతుష్టమూర్తులుగా అయిపోతారు. అచ్ఛా

Comments