28-06-1977 అవ్యక్త మురళి

* 28-06-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

వేస్ట్ (వ్యర్థం) చేయకండి మరియు వెయిట్ (భారమును) తగ్గించండి.

శబ్దము నుండి అతీతంగా ఉండే నిరాకారి స్థితి మరియు ఆకారీస్థితిలో సంజ్ఞల యొక్క భాష అనగా మూవీ భాష ఎక్కువగా ఉంటుంది. అటువంటి శబ్దం నుండి అతీతంగా ఉండే స్థితి మీకు ప్రియమనిపిస్తోందా? ఈ రెండు స్థితులలోనూ సాకార సృష్టిలో వలే శబ్దము లేదు. ముఖము ద్వారా వినిపించడము, వినడము, దీని నుండి అతీతంగా మీ వృత్తి ద్వారా లేక దృష్టి ద్వారా లేక వైబ్రేషన్ల ద్వారా మరియు మీ శ్రేష్ఠ ఆనుభవాల యొక్క ప్రభావము ద్వారా ఎవరైనా ఆత్మల యొక్క సేవను చేసే అనుభవముందా? అనగా వాటి ప్రభావము ద్వారా వినిపించడము లేక పరిచయమును ఇవ్వడము లేక సంబంధమును జోడించడము దీని యొక్క అనుభవముందా? ఏవిధముగా వాణి ద్వారా సంబంధము జోడించడంలో అనుభవజ్ఞులుగా ఉన్నారో అలాగే ఈ ఆత్మలకు వృత్తి లేక దృష్టి లేక శ్రేష్ఠ ఆనుభవాల యొక్క ప్రభావంతో సేవ చేయండి అని వాణి ద్వారా డెరెక్షన్ లభిస్తే అది చేయగల్గుతారా లేక కేవలం వాణి ద్వారా చేయగల్గుతారా? ఏవిధంగా వాణి ద్వారా ఆత్మలకు బాబాతో సంబంధాన్ని జోడింపజేయడంలో నెంబరువారీగా నిమిత్తులవుతారో అలాగే మీ యొక్క సూక్ష్మ స్థితి లేక మాస్టర్ సర్వశక్తివాన్ లేక మాస్టర్ జ్ఞానసూర్య యొక్క స్థితి ద్వారా ఆత్మలకు స్వయం యొక్క స్థితి లేక బాబా సంబంధము యొక్క అనుభవమును కలిగించగలరా? శక్తిశాలి వాతావరణము, వైబ్రేషన్ లేక స్వయం యొక్క శక్తి స్వరూపము యొక్క సంపర్కముతో వారికి కూడా అనుభవము చేయించగలరా? ఎందుకంటే సమయం ఎంతెంత సమీపంగా వస్తుందో అంతంతగా పాండవ సైన్యము ప్రత్యక్షమయ్యే ప్రభావం గుప్త రూపంలో వ్యాపిస్తోంది. సేవ యొక్క రూపురేఖలు సమయ ప్రమాణంగా మరియు సేవా ప్రమాణంగా తప్పక పరివర్తన చెందుతాయి. ఈ రోజుల్లో సైన్స్ ద్వారా కూడా ప్రతి వస్తువును క్వాంటిటీకి బదులుగా క్వాలిటీలోకి తీసుకువస్తున్నారు. ఎంత చిన్నని రూపంగా తయారుచేస్తున్నారంటే, రూపము చిన్నగా ఉంటుంది కానీ, శక్తి అధికంగా నిండి ఉంటుంది. తియ్యదనము యొక్క విస్తారమును సాక్రీన్ యొక్క రూపంలోకి తీసుకువస్తారు. విస్తారమును సారంలోకి తీసుకువస్తున్నారు. అదేవిధంగా పాండవ సేన అనగా సైలెన్స్ శక్తి యొక్క శ్రేష్ఠ ఆత్మలు కూడా ఒక్క గంట యొక్క భాషణ ద్వారా ఎవరికైనా ఏ పరిచయమునైతే ఇవ్వగలరో దానిని ఒక్క క్షణము యొక్క శక్తిశాలి దృష్టి ద్వారా, శక్తిశాలీ స్థితి ద్వారా, కళ్యాణము యొక్క భావన ద్వారా, ఆత్మిక భావన ద్వారా స్మృతిని కలిగించగలరా లేక అపరోక్ష సాక్షాత్కారమును చేయించగలరా? ఇప్పుడు ఇటువంటి అభ్యాసము యొక్క అవసరముంది. దీని కొరకు రెండు విషయాల యొక్క అవసరముంది, వాటి ద్వారా అటువంటి శ్రేష్ఠ సేవకు నిమిత్తులవ్వగల్గుతారు. ఏ రెండు విషయాల వైపు విశేషంగా బాబా అటెన్షన్ ను ఇవ్వమంటున్నారు? అవేంటో మీకు తెలుసా?

నలువైపులా ఈ రెండు విషయాలపై ధ్యానముంచమని చెబుతున్నారు. ఒకటేమో, ఏ వస్తువును వ్యర్థం చేయకండి మరియు ఇంకొకటి వెయిట్ (భారము) ను తగ్గించండి. వారేమో శరీరము యొక్క భారమును తగ్గించమని అంటారు, కానీ బాప్ దాదా ఆత్మ పైన ఏ భారమైతే ఉందో, ఏ భారము యొక్క కారణంగా ఆత్మ ఉన్నతమైన స్థితిని అనుభవం చేసుకోలేకపోతుందో ఆ భారమును తగ్గించండి అని చెబుతారు. ఒకటేమో, వేస్ట్ చేయకండి, ఇంకొకటేమో వెయిట్ ను తగ్గించండి, ఈ రెండు విషయాలపై విశేషమైన ధ్యానము కావాలి. మీ శక్తులను లేక సమయాన్ని వ్యర్థం చేసినట్లయితే జమ అవ్వదు మరియు జమ అవ్వని కారణంగా ఏ సంతోషము లేక శక్తిశాలీ స్థితి అయితే అను భవమవ్వాలో దానిని కావాలనుకున్నా కూడా పొందలేకపోతారు. శ్రేష్ఠ ఆత్మలైన మీకు విశ్వకల్యాణకారులుగా అయ్యే కార్యము ఉంది. అదేవిధంగా సమయం లేక శక్తులు కేవలం మీ కొరకే కాక అనేక ఆత్మల యొక్క సేవ కొరకు కూడా స్టాక్ జమ అయి ఉండాలి. కానీ వేస్ట్ అవుతూ ఉన్నట్లయితే స్వయమూ తమను తాము నిండుగా అనుభవం చేసుకోలేరు. ఈ రోజుల్లోని ప్రభుత్వం కూడా పొదుపు యొక్క స్కీములను తయారుచేస్తూ ఉంటుంది, అలాగే స్వయము కొరకు అవసరమైన సమయం లేక శక్తుల నుండి పొదుపు యొక్క లక్ష్యమును ఉంచుతూ పొదుపు చేస్తూ ఉండాలి. ఎందుకంటే విశ్వములోని సర్వ ఆత్మలు శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క పరివారమే. పరివారము ఎంత పెద్దగా ఉంటుందో అంత ఎక్కువగా పొదుపు యొక్క ఆలోచనను ఉంచడం జరుగుతుంది.

మీ అంతటి పెద్ద పరివారము ఇంకెవరికైనా ఉందా? కావున సర్వ ఆత్మలను మీ ముందు ఉంచుకుంటూ స్వయాన్ని అనంతమైన సేవార్థము నిమిత్తంగా భావిస్తూ మీ సమయాన్ని మరియు శక్తులను కార్యంలో వినియోగిస్తున్నారా? మాస్టర్ రచయిత యొక్క స్థితి స్మృతిలో ఉంటోందా లేక మీ కొరకే సంపాదించుకొని తింటున్నారా? లేక కొంత అని కొంత పోగొట్టుకున్నారా? ఇలా నిర్లక్ష్యంగా నడుస్తున్నారా? కావున ఇప్పుడు మీ సర్వఖజానాల యొక్క బడ్జెట్ తయారుచేయండి. ఇంత పెద్ద బాధ్యతాయుతమైన కార్యమును ఎత్తే ఆత్మల్లారా జమ అవ్వకపోతే కార్యమును ఎలా సఫలం చేయగలుతారు. డ్రామానుసారంగా అవ్యవలసిందే కదా అని అనడం, ఇది జ్ఞానం యొక్క విషయం. కానీ, డ్రామాలో నేను కూడా నిమిత్తంగా అయి సేవ ద్వారా శ్రేష్ఠ ప్రాప్తిని పొందాలి అన్న లక్ష్యమును ఉంచుతూ ప్రతి ఖజానా యొక్క బడ్జెట్ తయారుచేయండి. బడ్జెట్ లో ఏ లక్ష్యమును ఉంచాలి? స్లోగన్ మీకు గుర్తుందా? "తక్కువ ఖర్చు చేయాలి, ఎక్కువ ప్రసిద్ధం చేయాలి” ఇప్పుడు ఇక ఎంత జమ అయి ఉంది అని ప్రతి ఖజానాను పరిశీలించండి. ఆ జమ యొక్క ఖాతా ద్వారా హద్దులోని ఆత్మల యొక్క సేవ జరగగలదు. ప్రతి సబ్జెక్టు ద్వారా అనంతమైన సేవ కొరకు నిమిత్తమవ్వగల్గుతున్నానా లేక కేవలం జ్ఞానం ద్వారా చేయగల్గుతున్నాను కానీ ధారణ ద్వారా చేయలేకపోతున్నానా? ఎప్పుడైతే పుల్ గా అవ్వాలో అప్పుడు పుల్ సబ్జెక్టుల ద్వారా సేవ కొరకు నిమిత్తులుగా అవ్వడం ఎంతో అవసరం. ఏ ఒక్క సబ్జెక్టులోనైనా లోపం ఉన్నట్లయితే ఫుల్ పాసవ్వరు, కేవలం పాసవుతారు. ఒకటేమో, పాస్ విత్ హానర్ గా అవ్వడం, ఇంకొకటి కేవలం పాసవడం. ఎవరైతే కేవలం పాసవుతారో పాస్ విత్ హానర్‌గా అవ్వరో వారు ధర్మరాజు యొక్క శిక్షల నుండి పాస్ అవ్వవలసి ఉంటుంది, అనగా ఎంతో కొంత శిక్షల యొక్క అనుభవమును పొందుతారు. పాస్ విత్ హానర్లు ఇతరులు పాస్ అవ్వడం చూస్తారు. కావున ప్రతి సబ్జెక్టులోనూ ఫుల్ పాసవ్వాలంటే ప్రతి ఖజానాను రక్షించుకోండి మరియు బడ్జెట్‌ను తయారుచేయండి అనగా వ్యర్థం చేయకండి. ప్రతి క్షణమును, సంకల్పమును స్వయాన్ని శక్తిశాలిగా చేసుకోవడంలోనైనా ఉపయోగించండి లేక సర్వాత్మల యొక్క సేవార్థమైనా కార్యంలో వినియోగించండి.

రెండవ విషయం, భారమును తగ్గించండి. ఒకటేమో, పూర్వజన్మలలో మిగిలి ఉన్న లెక్కాచారముల యొక్క భారమును సమాప్తము చేయడంలో నిమగ్నమై ఉన్నారు, ఆ భారము పెద్ద భారమేమీ కాదు, కానీ, బ్రాహ్మణులుగా అయ్యాక లేక బ్రహ్మాకుమారీ కుమారులని పిలువబడ్డాక విశ్వకళ్యాణకారులు లేక విశ్వసేవా ధారులు అని పిలువబడ్డాక కూడా ఏవైనా వికల్పాలను లేక వికర్మలను చేస్తే ఈ భారము ఆ భారము కన్నా వంద రెట్లు ఎక్కువవుతుంది. ఇటువంటి ఎన్ని రకాలైన భారాలను మీపైకి ఎత్తుకున్నారు? తమ సంస్కారాలకు వశమై, స్వభావాలకు వశమై, జ్ఞానము యొక్క, బుద్ధి యొక్క అభిమానానికి వశమై, పేరు ప్రతిష్టల స్వార్థానికి వశమై, స్వయానికి సమాధానాలను ప్రాప్తింపచేసుకొనేందుకు వశమై లేక నిర్లక్ష్యానికి లేక బద్దకానికి వశమై ఇప్పటివరకూ ఎన్ని భారాలు మీపైకి ఎత్తుకున్నారు? జ్ఞానీ ఆత్మగా పిలువబడ్డాక, సేవాధారిగా పిలువబడ్డాక సేవకు బదులుగా డిస్ సర్వీస్ ను చేసే కర్మలు లేక వాతావరణమును వ్యాపింపచేసే వైబ్రేషన్లను ఉత్పన్నం చేసేందుకు నేను ఎప్పుడూ నిమిత్తమవ్వకూడదు అన్న ధ్యానమును ఎల్లప్పుడూ ఉంచాలి. ఎందుకంటే సేవ జరుగుతున్నా కానీ, ఒక్కసారి యొక్క డిస్ సర్వీసు పదిసార్లు చేసిన సేవను సమాప్తం చేసేసుంది. ఏ విధంగా మూలం నుండి అంతమైపోతుందో అలాగే ఒక్కసారి చేసిన డిస్ సర్వీసు పదిసార్లు చేసిన సేవ యొక్క ఖాతాను అంతం చేసేస్తుంది. కానీ, తాము మటుకు తానెంతో సేవ చేస్తున్నాము అని భావిస్తూ ఉంటారు. కానీ, ఖాతా ఖాళీగా ఉన్న కారణంగా గుర్తులు కనిపిస్తున్నా కానీ అభిమానానికి వశమై బయటి నుండి అన్నీ తెలిసినవారిగా ప్రవర్తిస్తారు. వాటి చిహ్నాలు ఏ విధంగా ఉంటాయి? ఒకటేమో, స్మృతిలో శక్తి లేక ప్రాప్తి యొక్క అనుభవముండదు. లోలోపల సంతుష్టత ఉండదు. ప్రతి సమయం ఏదో ఒక పరిస్థితి లేక వ్యక్తి లేక ప్రకృతి యొక్క వైభవం స్థితిని అలజడిలోకి తీసుకువచ్చేందుకు లేక సంతోషమును, శక్తిని అంతం చేసేందుకు నిమిత్తమవుతాయి. బయటి యొక్క అట్టహాసం ఎంత సుందరంగా ఉంటుందంటే అనేక ఆత్మలు వారిని గుర్తించని కారణంగా వారిని అందరికన్నా మంచి ప్రసన్నచిత్తులుగా మరియు మంచి పురుషార్థులుగా భావిస్తారు. కానీ లోలోపల పూర్తిగా చిక్కులలో ఖాళీగా అయి ఉంటారు. పేరు ప్రతిష్టల యొక్క ఖాతా ఫుల్ గా ఉంటుంది, కానీ ఖజానాల యొక్క ఖాతా, అనుభూతుల యొక్క ఖాతా ఖాళీగా ఉంటాయి అనగా ఏదో నామమాత్రంగా ఉంటాయి. దానికి గుర్తు ఏమిటి? అటువంటి ఆత్మలు స్వయం విఘ్నాలకు వశమై ఉన్న కారణంగా సేవ యొక్క కార్యంలో కూడా విఘ్నరూపులుగా అయిపోతారు. వారికి విఘ్నవినాశకులు అన్న పేరు ఉంటుంది, కానీ వారు విఘ్నరూపులుగా అవుతారు. అటువంటి ఆత్మలపై సమయ ప్రతి సమయం భారం పెరుగుతున్న కారణంగా అనేకరకాలైన మానసిక వ్యర్థ చింతనకు లేక మానసిక అశాంతికి గురవుతారు. అటువంటి అనేక రోగాలను ప్రాప్తించుకుంటారు.

రెండవ విషయం, భారము ఉన్న కారణంగా పురుషార్థం యొక్క వేగం తీవ్రంగా ఉండజాలదు. హైజంప్ వదలండి, కనీసం పరుగు కూడా తీయలేరు. ఇది చేద్దాము, అది చేద్దాము అని ప్లానులు చేస్తారు కాని సఫలులవ్వలేకపోతారు. మూడవ గుహ్యమైన విషయమేమంటే ఇటువంటి భారమయమైన ఆత్మలు ఎవరైతే విఘ్నరూపులుగా లేక డిస్ సర్వీసు నిమిత్తులుగా అవుతారో, బాబాకు ఆర్పించబడిన తమ తనువును, మనస్సును లేక ఈశ్వరీయ సేవార్థము లభించిన ధనమును ఎవరైతే తమ విఘ్నాల యొక్క కారణంగా వ్యర్ధం చేస్తారో అనగా ఎవరైతే సఫలతను పొందరో వారిపై వీటిని వ్యరం చేసినందుకు కూడా భారము పెరుగుతుంది. కావున పాపముల యొక్క గుహ్యగతులను కూడా బాగా తెలుసుకోండి. ఇప్పుడు ఇక ఏం చేయాలి? వేస్ట్ చేయకండి మరియు వెయిట్ తగ్గించండి. ధర్మరాజపురికి వెళ్ళేముందే మీపై మీరు ధర్మరాజులుగా అవ్వండి. మీ లెక్కనంతటినీ తెరవండి మరియు పాపపుణ్యాల యొక్క ఖాతా ఎంత మిగిలి ఉంది అని పరిశీలించుకోండి, ఏమి జమ చేసుకోవాలో చూసుకోండి మరియు విశేషంగా స్వయం కొరకు ప్లానులను తయారుచేయండి. పాపాల ఖాతాలను భస్మం చేయండి, పుణ్య ఖాతాను పెంచండి. బాప్ దాదా పిల్లల యొక్క ఖాతాలను చూసి అవి చాలా సంపన్నంగా అయిపోవాలి అని భావిస్తారు. (బయట వర్షం పడుతోంది) ప్రకృతి కూడా తన పాఠమును చదివిస్తోంది. ఏ విధంగా ప్రకృతి తన ఋతువులో లేక సమయానుసారంగా తీవ్ర గతితో కార్యమును చేస్తుందో అలాగే బ్రాహ్మణుల యొక్క సంపాదనను జమ చేసుకొనే ఋతువు ఇదే. కావున ఈ ఋతువు అనుసారంగా తీవ్ర వేగంతో జమ చేసుకోండి. అచ్చా!

సదా ఫరిస్తాలుగా, భారరహితంగా అనగా లైట్ రూపంలో ప్రతి క్షణము మరియు సంకల్పంలో కూడా గతమును భస్మం చేస్తూ భవిష్యత్తును జమ చేసేవారికి, సదా విశ్వసేవా ధారీ స్వరూపంలో స్థితిలో ప్రతి ఆత్మకు, సర్వఖజానాలను మహాదానులుగా అయి దానము చేసేవారికి, తమ శక్తుల యొక్క ఖజానాలలో సంపన్నమై శక్తుల ద్వారా వరదానులుగా అయ్యేవారికి, దయార్ధహృదయ ఆత్మలకు, సదా విశ్వకళ్యాణ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

పార్టీలతో బాప్ దాదా:- సదా స్వచింతన మరియు శుభచింతన రెండూ స్థితులు ఉంటున్నాయా? శుభచింతన ఉన్నప్పుడు వ్యర్ధము సమాప్తమైపోతుంది. వ్యర్థము ఉందంటే శుభచింతన యొక్క అనుభవము తక్కువగా ఉన్నట్లు. ఒకసారి మంచి వస్తువును రుచి చూసాక ఇక సామాన్యమైన వస్తువును స్వీకరించే సంకల్పము కూడా కలుగదు. అలాగే, శుభచింతనలో ఉండేవారు వ్యర్థ చింతనను చేయలేరు. చింతనను నడపడము అనగా దాని స్వరూపంగా అయిపోవడం. సాగరంలో ఉండే జీవ జంతువులు సాగరంలో ఇమిడి ఉంటాయి. అవి బయటకు రావాలనుకోవు. చేపలు కూడా నీటి లోపలే ఉంటాయి, బయటకు వస్తే అంతమైపోతాయి. సాగరము లేక నీరుయే తనకు ప్రపంచము. బయట ఉన్న ఇంతటి విసారమైన ప్రపంచము తనకు ఎందుకూ పనికి రాదు, అలాగే జ్ఞానసాగరుడైన బాబాలో ఇమిడి ఉండావారి ప్రపంచము కూడా బాబాయే, అనగా సాగరమే. ఇలా అనుభవం చేసుకుంటున్నారా లేక బయట తిరిగి రావాలి అని మనస్సులో కలుగుతోందా? ఎప్పటివరకైతే స్వరూపంలో ఇమిడిపోయే అనుభవమును పొందరో అప్పటివరకూ అతీంద్రియ జీవితము యొక్క గాయనమేదైతే ఉందో సుఖము యొక్క ఊయలలో ఊగే, హర్షితమయ్యే బ్రాహ్మణ జీవితము యొక్క గాయనమేదైతే ఉందో అది లభించజాలదు. ఇటువంటి అనుభవజ్ఞులే ఈ బ్రాహ్మణ జీవితపు సుఖము యొక్క మహత్యమును తెలుసుకుంటారు. బ్రాహ్మణులను శిఖగా చూపుతారు. శిఖము అనగా ఉన్నతమైన స్థితి. ఇక్కడివరకూ చేరుకోకపోతే విజయం జండాను ఎలా ఎగురవేయగలరు? ఉన్నతమైన శిఖరము పైకి వెళ్ళి జండాను ఎగురవేస్తేనే విజయులుగా పిలువబడతారు. 

వర్తమాన సమయం యొక్క పురుషారమేమిటి? వినడము, వినిపించడము నడుస్తూనే ఉంటుంది. అనుభవజ్ఞులుగా అవ్వాలి. అనుభవజ్ఞుల యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. ఒకే విషయమను అనుభవజ్ఞులు వినిపించడంలో మరియు కేవలం దానిని విని తిరిగి వినిపించడంలో ఎంతో తేడా ఉంటుంది కదా. మరి కూడా ఇప్పుడు అనుభవం చేసుకోవాలనుకుంటున్నారు. యోగ శిబిరంలో విశేషమైన అనుభవమును పొందుతారు? ఎందుకంటే, అక్కడ అనుభవజ్ఞులుగా తయారుచేసే సాధనముగా వినిపించడంతో చేయించడం కూడా జరుగుతుంది. దాని ద్వారా మంచి రిజల్టు వెలువడుతుంది. ఇప్పుడు ఆత్మలు అనుభవాన్ని కొరుకుంటున్నారు. కావున మీరు కూడా అనుభవజ్ఞులుగా అయి అనుభవం చేయించండి. అనుభవం ఎలా కలుగుతుంది? దానికొరకు ఏ సాధనమును ఉపయోగించాలి? ఏదైనా కనుగొనే వైజ్ఞానికుడు ఏదైనా ఇన్వెన్షన్ ను చేసేందుకు పూర్తిగా ఏకాంతంలో ఉంటాడు. కావున ఇక్కడి ఏకాంతము అనగా ఒక్కరి యొక్క అంతంలో నిమగ్నమైపోవడం, కావున బాహ్యమైన ఆకర్షణల నుండి ఏకాంతము కావాలి. కేవలం గదిలో కూర్చుండిపోయే ఏకాంతము కాదు, మనస్సు ఏకాంతముగా ఉండాలి. మనస్సు ఏకాగ్రముగా అనగా ఒక్కరి యొక్క స్మృతిలో ఉండాలి. ఏకాగ్రమై ఉండడమే ఏకాంతము. ఏకాంతములోకి వెళ్ళి ఇన్వెన్షన్ లను కనుగొంటారు కదా! నలువైపుల యొక్క వైబ్రేషన్ ల నుండి అతీతంగా వెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ కూడా స్వయాన్ని ఆకర్షణల నుండి అతీతంగా తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఏకాంతము ఇష్టం లేనివారు కూడా చాలామంది ఉంటారు. సంఘటనలో ఉండడము, నవ్వడము, మాట్లాడడం వారికి ఎక్కువగా ఇష్టమవుతుంది. కానీ ఇది బాహ్యముఖతలోకి రావడము. ఇప్పుడు స్వయాన్ని ఏకాంతవాసిగా చేసుకోండి, అనగా సర్వ ఆకర్షణల యొక్క వైబ్రేషన్ ల నుండి అంతర్ముఖులవ్వండి. ఇప్పుడు ఎటువంటి సమయం వస్తోందంటే, అప్పుడు కేవలం ఈ అభ్యాసము మాత్రమే ఉపయోగపడుతుంది. బాహ్యమైన ఆకర్షణలకు వశీభూతమయ్యే అభ్యాసమున్నట్లయితే అది సమయం వచ్చినప్పుడు మోసం చేసేస్తుంది. ఎటువంటి పరిస్థితులు రానున్నాయంటే అప్పుడు ఈ అభ్యాసము తప్ప ఇంకే ఆధారమూ కనిపించదు. ఏకాంతవాసులు అనగా అనుభవీ మూర్తులు. ఢిల్లీవారు సేవ యొక్క ఆదికి నిమిత్తమయ్యారు, కావున ఈ విశేషతలో కూడా నిమిత్తులుగా అవ్వండి, అప్పుడు ఈ స్థితి యొక్క అనుభవమును ఇతరులు కూడా కాపీ చేస్తారు. ఇది అన్నింటికన్నా పెద్ద సేవ. సంఘటిత రూపంలో మరియు ఇండివిడ్యువల్ రూపంలో రెండు రూపాలలోనూ అభ్యాసము యొక్క వాతావరణమును వ్యాపింపజేయండి. 

Comments