27-03-1981 అవ్యక్త మురళి

27-03-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

తండ్రికి ఇష్టంగా, లోకానికి ఇష్టంగా, మనసుకు ఇష్టమైవారిగా ఎలా అవ్వాలి?

ఈరోజు బాప్ దాదా విశేషించి దేని కొరకు వచ్చారు? ఈ రోజు విశేషించి డబల్ విదేశీ పిల్లలతో ఆత్మిక సంభాషణ చేసేందుకు వచ్చారు. ఇచ్చి పుచ్చుకునేందవుకు వచ్చారు. దూర దూరం నుండి పిల్లలందరూ మధువనంలోకి వచ్చారు. కావున బాబా వచ్చిన పిల్లలతో జ్ఞానం యొక్క ఆత్మిక సంభాషణ ద్వారా ఆతిథ్యమిచ్చేందుకు వచ్చారు. ఈ రోజు బాప్ దాదా ఎవ్వరికీ ఏ విషయంలోనూ ఎలాంటి కష్టమూ అనుభవం కావడం లేదు కదా అని పిల్లలకు అడిగి తెలుసుకునేందుకు వచ్చారు. పిల్లల మిలనము కూడా సహజమైపోయింది కదా......... మిలనము సహజమైపోయింది. పరిచయము సులభంగా లభించింది. మార్గము సహజంగా లభించింది. ఇక ఏ కష్టమూ లేదు కదా! కష్టమేమి లేదు కానీ ఎవ్వరూ కష్టంగా చేసుకోవడం లేదు కదా. తండ్రి ద్వారా లభించిన ఖజానాకు తాళం చెవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకునే విధి వచ్చిందా? విధి ఉంటే సిద్ధి తప్పకుండా లభిస్తుంది. విధిలో లోపముంటే సిద్ధి కూడా లభించదు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది?

అందరూ ఎగురుతూ ఉన్నారా? ఉన్నతమైన తండ్రికి అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలుగా అయిన తర్వాత నడవాల్సిన అవసరం ఏమున్నది! ఇక ఎగరాల్సిందే. భూమిపై దారిలో నడుస్తూ ఉంటే మధ్యలో ఎక్కడో ఒక చోట విఘ్నము రావచ్చు. కానీ ఎగరటంలో ఏ ఆటంకమూ ఉండదు. అందరూ ఎగిరే పక్షులుగా ఉన్నారు కదా. జ్ఞానము యోగాలనే రెక్కలు అందరినీ బాగా ఎగిరిస్తూ ఉన్నాయి. ఎగురుతూ ఎగురుతూ అలసట రావడం లేదు కదా? అందరికీ అలసట లేనివారిగా కండి (అథక్ భవ) అనే వరదానం లభించిందా? విషయం కూడా చాలా సహజమైనదే. అనుభవం చేసి ఇతరులకు వినిపించాలి. అనుభవం వినిపించడం చాలా సులభం కదా. మీ విషయాలనే మీరు వినిపిస్తారు. అందువలన చాలా సహజం. సంబంధాల విషయం వినిపించడంలో కష్టమేముంది... కేవలం రెండు మాటలు వినిపించండి.

ఒకటి తమ పరివారము అనగా సంబంధాల విషయం, రెండవది ప్రాప్తికి సంబంధించిన విషయం. అందువలన బాప్ దాదా సదా పిల్లలను సంతోషంగానే చూస్తారు. రోజంతటిలో ఎప్పుడైనా ఏకరస స్థితిలో ఉండడానికి బదులు ఇతర రసాలు ఆకర్షించడం లేదు కదా? ఏకరసంగా ఉన్నారు కదా........ నష్టోమోహ స్మృతి స్వరూపులుగా అయిపోయారా? అయితే ఇప్పుడు గీతాయుగం సమాప్తమైపోవాలి. అందరూ జ్ఞాన ప్రాలబ్దంలోకి వచ్చేశారు కదా. స్మృతి స్వరూపులుగా అగుటే జ్ఞాన ప్రాలబ్దం. కావున ఇప్పుడు పురుషార్థం సమాప్తమైపోయింది. స్వ స్వరూపం గురించి ఏవైతే వర్ణన చేస్తారో ఆ సర్వ గుణాలు సదా అనుభవంలో ఉన్నాయి కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆనంద స్వరూపమైపోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రేమ స్వరూపమైపోండి. ఏ స్వరూపము కావాలంటే ఆ స్వరూపంలో ఎంత సమయము కావాలంటే అంత సమయం స్థితము కాగలుగుతున్నారా? ఇలా కూడా కాదు అయ్యే ఉన్నారు కదా........? తండ్రి గుణాలే పిల్లల గుణాలుగా ఉండాలి. తండ్రి కర్తవ్యమే పిల్లల కర్తమ్యము. తండ్రి స్థితి ఏదైతే ఉందో అదే పిల్లల స్థితిగా ఉండాలి. దీనినే సంగమ యుగమని అంటారు. కనుక ప్రాలబ్దం పొందినవారిగా ఉన్నారా లేక పురుషార్థులుగా ఉన్నారా.....? ప్రాప్తి స్వరూపులుగా ఉన్నారా......... ప్రాప్తి చేసుకోవాలి, కావడం లేదు, ఎలా అవుతుంది? ఈ భాష మారిపోయింది కదా? ఈరోజు భూమి మీద, రేపు ఆకాశంలో ఇలా వస్తూ వెళ్తూ లేరు కదా? ఈ రోజు ప్రశ్నలలో, రేపు ఫుల్‌స్టాప్లో(బిందువు) ఇలా చేయడం లేదు కదా.......... ఏకరస స్థితి అనగా ఒకే సంపన్న స్థితిలో ఉండేవారు. మీ స్థితి ఎప్పుడూ మారిపోకుండా ఉండాలి. బాప్ దాదా వతనము నుండి చాలామంది పిల్లల మూడ్ చాలా మారిపోతూ ఉండడం గమనించారు. అప్పుడప్పుడు ఆశ్చర్యార్థక మూడ్, అప్పుడప్పుడు ప్రశ్నార్థక మూడ్, అప్పుడప్పుడు కన్ ఫ్యూజన్ మూడ్(సంశయాత్మక), అప్పుడప్పుడు టెన్షన్, అప్పుడప్పుడు అటెన్షన్ల ఊయలలో ఊగడం లేదు కదా? మధువనం నుండి ప్రాలబ్ద స్వరూపంలో వెళ్లాలి. మాటి మాటికి పురుషార్థం ఎంతవరకు చేస్తూ ఉంటారు. తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు కూడా అలా ఉండాలి కదా. తండ్రి ఎప్పుడైనా మూడ్ ఆఫ్ అవుతారా! ఇప్పుడు తండ్రి సమానంగా అవ్వాలి. మీరు మాస్టర్లు కదా, మాస్టర్లు గొప్పగా ఉండాలి. ఫిర్యాదులన్నీ సమాప్తమైపోయాయా? నిజానికి విషయం చిన్నదిగానే ఉంటుంది. కానీ ఆలోచించి ఆలోచించి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకుంటారు. ఎక్కువగా ఆలోచించడం వలన ఆ చిన్న విషయం పెద్దదిగా అయిపోతుంది. ఎక్కువగా ఆలోచించకండి. ఇది ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు జరిగింది? అని ఆలోచించకండి. పేపరు వచ్చిందంటే దానికి సమాధానం ఇవ్వాలి. పేపరు ఎందుకొచ్చింది అనే ప్రశ్న ఎక్కడైనా ఉంటుందా? వేస్ట్ మరియు బెస్టు(చెడు మరియు మంచి) గురించి సెకెండులో నిర్ణయం తీసుకోండి. సెకండులో సమాప్తి చేయండి. వ్యర్థమైనట్లయితే అర్ధకల్పం కొరకు చెత్త కాగితాల డబ్బాలో వేసేయ్యండి. ఈ చెత్త కాగితాల డబ్బా చాలా పెద్దదిగా ఉంది. జడ్జిగా కండి, లాయర్ గా కాకండి. లాయరు చిన్న కేసును కూడా పెద్దదిగా చేసేస్తాడు. జడ్జి సెకండులో అవునా, కాదా అని నిర్ణయిస్తాడు. లాయర్‌గా అయినట్లయితే నల్లకోటు వచ్చేస్తుంది. ఇది తండ్రి గుణమా కాదా అని సెకండులో నిర్ణయం తీసుకోండి. తండ్రి గుణము కాకుంటే చెత్త కాగితాల డబ్బాలో పడేయండి. తండ్రి గుణం అయితే మంచి(బెస్ట్) ఖాతాలో జమ చేసుకోండి. బాప్ దాదా ఉదాహరణ ఎదురుగా ఉంది కదా. కాపీ చేయ్యడం అనగా అనుసరించడం(ఫాలో చేయడం). ఏ కొత్త దారిని తయారు చేయకండి. ఏ కొత్త జ్ఞానమూ కనుక్కోకండి(ఆవిష్కరించకండి). తండ్రి ఏదైతే వినిపిస్తున్నారో, దాని స్వరూపంగా అవ్వాలి. విదేశీయులందరూ 100 శాతము ప్రాలబ్ధాన్ని పొందుతున్నారా? సంగమయుగ ప్రాలబ్దము అనగా “తండ్రి సమానం"గా అగుట. భవిష్య ప్రాలబ్ధమనగా దేవతా పదవిని పొందుట. కావున తండ్రి సమానమై తండ్రితో అదే స్థితిలో కొంత సమయం కూర్చునే అనుభవం చేస్తారు కదా. ఏ రాజు అయినా సింహాసనంపై కూర్చుంటే కొంత కాలం కూర్చుంటారు కదా. ఇప్పుడిప్పుడే కూర్చుని, ఇప్పుడిప్పుడే దిగడం అనేవి ఉండదు కదా. కావున సంగమయుగ ప్రాలబ్ధము అనగా తండ్రి సమానమైన స్థితి అనగా సంపన్న స్థితిని పొంది సింహాసనాధికారిగా అవ్వడం. ఈ ప్రాలబ్దాన్ని అయితే పొందాలి. దీనిని చాలా సమయము వరకు పొందాలి. అందుకు చాలా సమయపు సంస్కారాన్ని ఇప్పుడే నింపుకోవాలి. సంపన్న జీవితముగా ఉండాలి. సంపన్నత కేవలం కొన్ని క్షణాల వరకు కాదు, జీవితమంతా ఉండాలి. ఫరిస్తా జీవితం యోగీ జీవితం, సహజ జీవితంగా ఉండాలి. జీవితమంటే కొంత సమయం వరకు ఉంటుంది. ఇప్పుడిప్పుడే జన్మించి, ఇప్పుడిప్పుడే మరణిస్తే దానిని జీవితమని అనరు. పొందాము అని అంటారు. కానీ ఏమి పొందారు......... తండ్రి సమానమైన జీవితాన్ని పొందారా......... ఎప్పుడు వరకు కష్టం చేస్తారు? అర్దకల్పం అనేక రకాలైన కష్టాలు అనుభవించారు. గృహస్థ వ్యవహారము, భక్తి, అనేక సమస్యలు ఎంతో శ్రమ చేశారు. సంగమ యుగము ప్రేమను అనుభవించే యుగము. కష్టపడే యుగము కాదు. మిలనము చేసే యుగము. దీపము మరియు దీపపు పురుగులు కలుసుకునే యుగము. పేరుకు కష్టపడుతున్నామని అంటారు. కానీ కష్టము లేనే లేదు. పుత్రునిగా అవ్వడమేమైనా కష్టమా? వారసత్వం లభించిందా లేక కష్టంగా లభించిందా? పుత్రుడు శిరోకిరోటంగా ఉంటాడు. ఇంటికి శృంగారంగా ఉంటాడు. తండ్రికి బాలునిగా, అతడే యజమానిగా అవుతాడు. యజమానిగా అయినప్పుడు మళ్ళీ క్రిందకు ఎందుకు వస్తారు? తమ పేరు ఎంత ఉన్నతంగా ఉందో చూడండి. మీకు ఎన్ని శ్రేష్ఠమైన పేర్లు ఉన్నాయి. పని మరియు పేరు రెండూ ఒక్కటే కదా. సదా తండ్రితో పాటు శ్రేష్ఠమైన స్థితిలో ఉండండి. అసలు స్థానమైతే అదే తమ స్థానాన్ని ఎందుకు వదుల్తారు? అసలు స్థానాన్ని వదిలేయడం అనగా రక రకాల విషయాలలో భ్రమించడం. విశ్రాంతిగా కూర్చోండి, నషాలో కూర్చోండి, అధికారంతో కూర్చోండి. క్రిందికి వచ్చి ఇప్పుడేమి చేయాలి అని అంటారు. అసలు క్రిందకు ఎందుకు వస్తారు. ఏదైనా భారాన్ని ఎందుకు అనుభవం చేస్తారు? భారం మీ తలపై ఉంచుకోకండి. నాది అనేది వచ్చినప్పుడు భారం తల పైకి వచ్చేస్తుంది. నేనేం చేయాలి, ఎలా చేయాలి, చేయాల్సి వస్తుంది అని అంటారు. నిజంగా మీరేమైనా చేస్తున్నారా? లేక కేవలం పేరు మీది, పని చేసేది తండ్రా? ఆ రోజు ఆటబొమ్మను చూశారు కదా - అది స్వయం నడిచిందా లేక ఎవరైనా నడిపించారా. సైన్స్ నడిపించగలిగినప్పుడు తండ్రి నడిపించలేడా? పిల్లల పేరును ప్రసిద్ధి చేయడానికి తండ్రి పిల్లలను నిమిత్తంగా తయారు చేస్తాడు. ఎందుకంటే తండ్రి నామా-రూపాలకు అతీతంగా ఉంటారు. భారం నాకు ఇచ్చేయండి, మీరు కేవలం నాట్యం చేయండి, ఎగరండి అని తండ్రి పిల్లలకు ఆఫర్ చేస్తూ ఉంటే మీరు భారం ఎందుకు ఎత్తుకుంటారు? సేవ ఎలా జరుగుతుంది. ఎలా ఉపన్యసించాలి?... ఈ ప్రశ్నలే వద్దు, కేవలం నిమిత్తంగా భావించి సంబంధం పవర్‌హౌస్ తో జోడించి కూర్చోండి తర్వాత ఉపన్యసిస్తారో లేదో చూడండి. ఆ ఆటబొమ్మ నడవగలిగినప్పుడు మీ నోరు మాట్లాడలేదా! మీ బుద్ధికి ఉపాయాలు తోచవా? ఎలా అని అన్నారంటే తీగపై రబ్బరు తొడుగు వచ్చినట్లువుతుంది. రబ్బరు వచ్చిన కారణంగా కనెక్షన్(సంబంధం) జోడింపబడదు. ప్రత్యక్ష ఫలం కనిపించదు. అందువలన ఏమవుతుందో తెలియదు అంటూ అలసిపోతారు. మిమ్ములను తండ్రి నిమిత్తంగా చేశారంటే తప్పకుండా జరుగుతుంది. ఏదైనా స్థానంలో 6-8 మందే ఉంటే ఇంకొక స్థానము నుండి తయారుచేయండి, మనసును ఎందుకు కష్టపెట్టుకుంటారు. చుట్టూ తిరగండి, చుట్టు ప్రక్కల ఉన్న స్థానాలకు వెళ్లండి. తిరగడానికి చక్రం చాలా పెద్దదిగా ఉంది. ఎక్కడ నుండి అయినా 8 మంది తయారైతే అది కూడా తక్కువేమి కాదు మూల మూలల దాగి ఉన్నవారిని బయటికి తీసినట్లయితే తమ గుణాలను ఎంతగానో గానం చేస్తారు. తండ్రితో పాటు నిమిత్తమైన ఆత్మకు కూడా హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు ఇస్తారు కదా. వారినేమైనా వదిలేస్తారా !. ఆ ఆత్మ వంచితంగా ఉండిపోతుంది. ఎంతమంది వెలువడితే అంతమందిని వెలికి తీయండి, తర్వాత ముందుకు సాగండి. ఇప్పటి వరకు విశ్వంలో ఒక మూల వరకే చేరుకున్నారు. వేట కూడా చాలా ఉంది. అడవి కూడా చాల పెద్దదిగా ఉంది. ఎందుకు ఆలోచిస్తున్నారు. ఆలోచించడానికి కారణమేమి? బుద్ధిలో వ్యర్థం నిండిన కారణంగా టచింగ్ అవ్వడం లేదు. పరిశీలన శక్తి పని చేయడం లేదు. బుద్ది ఎంత స్పష్టంగా ఉంటుందో అంత ఏ వస్తువు ఎలా ఉందో అలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు, ఏమిటి అని అనడం వలన నిర్ణయ శక్తి టచింగ్ పవర్ పని చేయదు. తర్వాత అలసట కలుగుతుంది లేక వ్యాకులపడతారు. ఎక్కడకు వెళ్లినా అక్కడ ఎవరో ఒక దాగి ఉన్న రత్నం వెలువడింది. అందువలనననే అక్కడికి చేరుకున్నారు కదా! ఎక్కడకు వెళ్లినా ఒక్కరు కూడా వెలువడని స్థానం లేదు. ఒక చోట వారసులు, ఒక చోట ప్రజలు, ఒక చోట షాహుకార్లు అందరూ కావాలి కదా. అందరూ రాజులుగా అయితే అవ్వరు. ప్రజలు కూడా కావాలి. ప్రజలను తయారు చేసే ఈ కార్యం నిమిత్తమైన పిల్లలే చేయాలి లేక మీరు రాయల్ ఫ్యామిలీని తయారు చేస్తే బాబా ప్రజలను తయారు చేస్తారా ? ఇరువురిని తయారు చేయాలి కదా ! కేవలం రెండు మాటలు చూడండి. ఒకటి లైన్ క్లియర్ గా ఉందా? రెండవది మర్యాదలనే రేఖ లోపల ఉన్నామా? ఈ రెండు విషయాలు సరిగ్గా ఉంటే ఎప్పుడూ వ్యాకులపడరు. ఎవరి కనెక్షన్ బాగుంటుందో తండ్రితో కావచ్చు. నిమిత్తమైన వారితో కావచ్చు వారు ఎప్పుడూ అసఫలతను పొందరు. కేవలం తండ్రితోనే సంబంధం ఉండడం కూడా కరెక్టు కాదు. పరివారంతో కూడా ఉండాలి. ఎందుకంటే తండ్రితో అయితే శక్తి లభిస్తుంది కాని ఎవరి సంబంధంలోకి రావాలి? కేవలం తండ్రితోనా? రాజధాని అంటే పరివారంతో సంపర్కంలోకి రావాలి. మూడు సర్టిఫికెట్లు తీసుకోవాలి. కేవలం ఒక్కటి కాదు.

ఒకటి - తండ్రికి ఇష్టమైనవారు అనగా తండ్రితో సర్టిఫికెటు, రెండవది - లోక పసంద్ అనగా దైవీ పరివారంతో సంతుష్టతా సర్టిఫికెటు, మూడవది - మనసుకు ఇష్టము అనగా తమ మనసులో కూడా సంతుష్టత ఉండాలి. మీతో మీరు కూడా అయోమయం కారాదు చేయగలనో, లేదో, నడవగలనో లేదో తెలియడం లేదు అని అనుకున్నారంటే తమ మనసుకు ఇష్టమైనవారిగా అనగా తమ మనసు ఇచ్చే సంతుష్టతా సర్టిఫికెట్లు లభించనట్లే. ఈ మూడు సర్టిఫికెట్లు కావాలి. త్రిమూర్తిగా ఉన్నారు కదా. కనుక ఈ త్రిమూర్తి సర్టిఫికేట్ కావాలి. రెండింటితో కూడా పని నడవదు. మూడు కావాలి. కొంత మంది మేము మాతో సంతుష్టముగా ఉన్నాము. తండ్రి కూడా సంతుష్టంగా ఉన్నారు, సరిపోతుందిలే అని అనుకుంటారు కానీ అలా కాదు. తండ్రి సంతుష్టంగా ఉండి మీరు కూడా సంతుష్టంగా ఉంటే పరివారము సంతుష్టంగా లేకపోవడం అనేది జరగదు. పరివారాన్ని సంతుష్టం చేసేందుకు కేవలం చిన్న విషయం గుర్తుంచుకోండి. కేవలం గౌరవమునివ్వండి, గౌరవము తీసుకోండి. ఈ రికార్డు రాత్రి - పగలు నడుస్తూ ఉండాలి. ఈ రికార్డు నిరంతరము నడుస్తూ ఉండాలి. ఎవరూ ఎలా ఉన్నా మీరు దాతలు అయ్యి ఇస్తూ వెళ్లండి. వారు గౌరవమిచ్చినా, ఇవ్వకున్నా మీరు ఇస్తూ వెళ్లండి. ఇందులో నిష్కాములుగా కండి. నేను ఇంత ఇచ్చాను వారు ఏమి ఇవ్వలేదు. నేను వందసార్లు ఇచ్చాను వారు ఒక్కసారి కూడా ఇవ్వలేదు అని అనుకోకండి. దీనిలో నిష్కాములుగా అయినట్లయితే పరివారం స్వతహాగా సంతుష్టమవుతారు. ఈ రోజు కాకుంటే రేపు అయినా సంతుష్టమవుతారు. మీరు ఇచ్చింది జమ అవుతూ ఉంటుంది. అలాగా జమ అయిన ఫలము తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. తండ్రికి ఇష్టమైనవారిగా అవ్వడానికి ఏమి కావాలి? తండ్రి అయితే చాలా అమాయకుడు తండ్రి ఎవరిని చూచినా అందరూ చాలా మంచివారే అని అంటారు, మంచివారు కాని వారెవ్వరూ కనిపించరు. ఒక్కొక్క పాండవుడు, ఒక్కొక్క శక్తి, ఒకరి కంటే ఒకరు ముందుగా ఉన్నారు. కావున తండ్రికి ఇష్టమైనవారిగా అవ్వడానికి సత్యమైన మనసు ఉంటే సాహెబ్ అయిన పరమాత్మ రాజీ అవుతారు అనగా ప్రసన్నమవుతారు. ఎవరైనా కావచ్చు సత్యత ఉండాలి. సత్యత తండ్రిని జయిస్తుంది. ఇక ఇష్టమైనవారిగా అయ్యేందుకు ఏమి కావాలి? మన్మతంపై నడవకండి. మనసుకు ఇష్టమైన వస్తువు అది వేరు. మనసుకు ఇష్టమైనవారిగా అయ్యేందుకు చాలా సహజ సాధనం శ్రీమతం రేఖ లోపల ఉండాలి. సంకల్పం చేసినా శ్రీమతం రేఖ లోపలే ఉండాలి. మాట్లాడండి, కర్మలు చేయండి, ఏది చేసినా రేఖ లేపలే ఉండాలి. అప్పుడు సదా స్వయంతో సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టంగా చేయగలరు. సంకల్పం అనే గోరు కూడా బయటికి వెళ్ళరాదు.

ఎంత లగ్నముందో, ఎంత దృఢ సంకల్పముందో బాప్ దాదాకు కూడా తెలుసు. కేవలం మధ్య మధ్యలో కొదిగా నాజూకుగా(సునితంగా) అయిపోతారు. నాజూకుగా అయినపుడు చాలా నఖరాలు చేస్తారు (ఒయ్యారాలు ఒలకపోస్తారు). వీరికి టికెట్ ప్రేమయే. ఈ టికెట్ తోనే వస్తారు. ప్రేమ లేకుంటే ప్రేమ టికెట్ లేకుండా ఇక్కడకెలా రాగలరు? ఈ టికెట్ మధువనవాసులుగా చేస్తుంది. నలువైపులా సేవకు నిమిత్తంగా అవుతారు. బాప్ దాదా అయితే ఆఫరీన్(అవకాశం) ఇచ్చారు. చేసిన ప్రమాణాన్ని నిభాయించారు. ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. స్థాపన అయితే చేశారు కదా. స్వ ఉన్నతి, సేవా ఉన్నతి - రెండింటి బ్యాలెన్స్ ఉంటే సదా ఉన్నతి జరుగుతూ ఉంటుంది,
జమ జరుగుతుంది............... 

ఇది కూడా ఒక విశేషతను చూశారు. చాలా సమయం నుండి స్వతంత్రంగా ఉన్నవారు తమను తాము సంఘటిత రూపంలో నడిపించుకుంటున్నారు. ఇది కూడా చాలా మంచి పరివర్తన. ఒక్కొక్కరు వేరుగా ఉండేవారు. 4-6 మంది కలిసి ఉంటూ సంస్కారాలను కలుపుకొని ఉంటున్నారు - ఇది కూడా స్నేహానికి బదులివ్వడమే. పాండవ భవనం, శక్తి భవనము రెండూ సఫలంగా ఉన్నాయి. ఇది కూడా విశేషతే. బాప్ దాదా ఈ విధంగా బదులివ్వడాన్ని చూసి సంతోషపడుతున్నారు. ఒక్క బాబా వారిగా ఉండడం, పొదుపుగా ఉండడం కూడా బదులివ్వడమే కదా. తమ శరీర నిర్వహణతో పాటు సేవా నిర్వహణ చేయడం, రెండిటిలో సగం, సగం చేసి నడిపించడం - ఇది కూడా మంచి పద్ధతిని కనుగొన్నారు. డబల్ కార్యం అయినట్లవుతుంది కదా. సంపాదించారు, సేవలో ఉపయోగించారు. శరీరానికి కావచ్చు, సేవకు కావచ్చు కాని ఇక్కడ సంపాదించారు, సేవలో ఉపయోగించారు. ఇక్కడ బ్యాక్ బ్యాలన్స్ తయారవ్వదు కాని భవిష్యత్తుకు జమ జరుగుతుంది. బుద్ధి అయితే ఫ్రీగా ఉంది కదా. వచ్చింది మరియు ఉపయోగించారు. చక్రవర్తిగా అయ్యారు. శక్తులు మరియు పాండవులు ఇరువురికి పరుగు పందెం జరుగుతుంది. దీపం వెలిగించి మరియు ఇతరులది వెలిగించేందుకు బయలుదేరారు. లక్ష్యం చాలా మంచిగా పెట్టుకున్నారు. భారతదేశంలో హ్యాండ్స్ (భుజాలను) తయారు చేసే శ్రమ చేస్తారు. విదేశంలో రెడిగా తయారైన హ్యాండ్స్ సహజంగానే బయటకు వస్తారు. ఇది కూడా వరదానం. వెనుక వచ్చేవారికి ఈ లిఫ్టు ఉంది. ఇక్కడ ఉన్నవారికి బంధనాలు తెంచుకునేందుకు సమయం పడుతుంది. వీరి బంధనాలు తెంచబడే ఉన్నాయి. కావున అది లిఫ్టు అయింది కదా. కేవలం మానసిక బంధనం ఉండరాదు. మంచిది. 

Comments