20-06-1977 అవ్యక్త మురళి

* 20-06-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సదా సహజయోగులుగా అయ్యేందుకు సాధనము - మహాదానులుగా అవ్వడం.

బ్రాహ్మణ ఆత్మలందరూ స్వయాన్ని సహజయోగిగా లేక నిరంతర యోగం యొక్క శ్రేష్ఠ స్థితిలో సదా స్థితులై ఉంచాలి అన్న పురుషార్ధంలో ఉంటారు. సహజయోగులుగా అవ్వాలన్న లక్ష్యం అందరికీ ఉంది కానీ, తమ బలహీనతల యొక్క కారణంగా కాసేపు సహజంగా, కాసేపు కష్టంగా అనుభవం చేసుకుంటారు. బలహీనత అంటూ కష్టతరం చేసుకుంటారు. నిజానికి ప్రతి ఒక్క శ్రేష్ఠ ఆత్మ లేక బ్రాహ్మణ ఆత్మ, మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మ, త్రికాలదర్శి ఆత్మ, మాస్టర్ జ్ఞాన సాగర ఆత్మ ఏ కర్మలోనూ లేక సంకల్పములోనూ కష్టమును అనుభవం చేసుకొనజాలదు. సహజయోగిగా ఉండడంతో పాటు ఇటువంటి శ్రేష్ఠ ఆత్మ స్వతహయోగిగా ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి శ్రేష్ఠ ఆత్మకు బాబా మరియు సేవ, ఇదే ప్రపంచము. బాబా యొక్క స్మృతి మరియు సేవయే బ్రాహ్మణ జన్మ యొక్క సంస్కారము. బాబా మరియు సేవ తప్ప వారికి ప్రపంచంలో ఇంక ఏమీ కన్పించదు మరియు ఇంకే సంకల్పమూ ఉత్పన్నమవ్వజూలదు. ఏ మనుష్య ఆత్మల యొక్క బుద్ది అయినా ఈ ప్రపంచంలో సంబంధములు మరియు ప్రాప్తి వైపుకే వెళుతూ ఉంటుంది. బ్రాహ్మణ ఆత్మల కొరకు సర్వసంబంధాల యొక్క ఆధారము మరియు సర్వప్రాప్తుల యొక్క ఆధారము ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ కారు. కావున స్వతహయోగులుగా అవ్వడం కష్టమా లేక సహజమా? ఎక్కడైతే సంబంధాలు మరియు సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడకు బుద్ది కోరుకోకపోయినా పరిగెడుతూ ఉంటుంది, కావున స్వతహయోగులుగా అయ్యారు కదా! సహజయోగులుగా మరియు స్వతహయోగులుగా లేరంటే తప్పకుండా బాబాతో సర్వసంబంధాల యొక్క అనుభవం లేనట్లే. సర్వసంబంధాలతో బాబాను తమవారిగా చేసుకోలేదు.  సర్వప్రాప్తులకూ ఆధారము ఒక్క తండ్రియే అన్న అనుభవమును తమదిగా చేసుకోలేదు.

ఇప్పుడు సహజయోగులుగా అయ్యేందుకు ఏ ప్రయత్నము చేస్తారు? సహజయోగులుగా అవ్వాలనుకుంటున్నారు కదా! సహజయోగులుగా అయ్యేందుకు సాధనం సదా స్వయాన్ని సంకల్పము ద్వారా, వాణి ద్వారా మరియు ప్రతి కార్యము ద్వారా విశ్వములోని సర్వ ఆత్మలకు సేవాధారిగా భావిస్తూ సేవలోనే మీ సర్వస్వాన్నీ వినియోగించండి. బాబా ద్వారా బ్రాహ్మణ జీవితము యొక్క ఖజానాలేవైతే లభించాయో వాటినన్నింటినీ ఆత్మల యొక్క సేవలో వినియోగించండి. శక్తుల యొక్క ఖజానా, గుణాల యొక్క ఖజానా, జ్ఞానము యొక్క ఖజానా లేక శ్రేష్ఠ సంపాదన యొక్క సమయం యొక్క ఖజానాను సేవలో వినియోగించండి, అనగా సహయోగులుగా అవ్వండి. మీ వృత్తి ద్వారా వాయుమండలమును శ్రేష్ఠముగా తయారుచేసే సహయోగమును ఇవ్వండి. స్మృతి ద్వారా సర్వులకు మాస్టర్ సమర్థ శక్తివాన్ స్వరూపము యొక్క స్మృతిని కలిగించండి. వాణి ద్వారా ఆత్మలను స్వదర్శన చక్రధారులుగా, త్రికాలదర్శులుగా చేసే సహయోగమును ఇవ్వండి. కర్మ ద్వారా సదా కమల పుష్ప సమానంగా ఉండే లేక కర్మ యోగులుగా అయ్యే సందేశమును ప్రతి కర్మ ద్వారా ఇవ్వండి. తమ శ్రేష్ఠమైన తండ్రి నుండి సర్వసంబంధాల యొక్క అనుభూతి ద్వారా సర్వ ఆత్మలకు సర్వసంబంధాలను అనుభవం చేయించే సహయోగమును ఇవ్వండి. మీ ఆత్మిక సంపర్కము యొక్క మహత్వమును తెలుసుకొని శ్రేష్ట సమయము యొక్క సూచనను ఇవ్వండి. సమయానుసారంగా వర్తమాన సంగమ యుగము యొక్క ఒక్క క్షణము అనేక జన్మల యొక్క ప్రాప్తిని కలిగించేందుకు నిమిత్తమై ఉంది. ఒక్క అడుగులో వేల రెట్ల సంపాదన నిండి ఉంది. ఇటువంటి సమయము యొక్క ఖజానాను తెలుసుకున్న మీరు ఇతరులకు కూడా ఇది సమయానుసారంగా ప్రాప్తమయ్యే పరిచయమును ఇవ్వండి. ప్రతి విషయం ద్వారా సహయోగులుగా అవ్వండి, తద్వారా సహజయోగులుగా అయిపోతారు.
 
సహయోగులుగా అవ్వడం మీకు వస్తుంది కదా! ఎవరైతే స్వయం ఖజానాలతో సంపన్నంగా ఉంటారో వారే సహయోగులుగా అవుతారు. సంపన్న ఆత్మకు అనేక ఆత్మలపై మహాదానులుగా అయ్యే సంకల్పము స్వతహాగానే కలుగుతుంది. మహాదానులుగా అవ్వడము అనగా 
సహయోగులుగా అవ్వడం మరియు యోగులుగా అవ్వడం అనగా సహజయోగులుగా అవ్వడం. మహాదానులు సర్వఖజనాలను స్వయం కొరకు ఉపయోగిస్తారు మరియు సేవ కొరకు ఇంకా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే అనేక ఆత్మలు మహాదానులుగా అయి ఇవ్వడమే తీసుకోవడం. సర్వుల ప్రతి కళ్యాణకారులుగా అవ్వడమే స్వయం కళ్యాణకారులుగా అవ్వడం, దానమివ్వడం అనగా ఒకటికి వంద రెట్లు జమా చేసుకోవడం, కావున వర్తమాన సమయం స్వయం కొరకు, చిన్న చిన్న విషయాలలో చీమల వంటి విఘ్నాలలో మీ సర్వ ఖజానాలను స్వయం కొరకు ఉపయోగించే సమయం కాదు. అనంతమైన సేవాధారులుగా అవ్వండి, తద్వారా స్వయం యొక్క సేవ సహజంగా జరుగుతుంది. విశాలహృదయులుగా అయి ఉదారచిత్తతతో ప్రాప్తి యొక్క ఖజానాలను పంచుతూ ఉండండి. ఉదారచిత్తులుగా అవ్వడం ద్వారా స్వయం యొక్క ఉద్దరణ స్వతహాగానే జరుగుతుంది. విఘ్నాలను తొలగించడంలో సమయాన్ని ఉపయోగించేందుకు బదులుగా సేవ యొక్క లగ్నములో సమయాన్ని ఉపయోగించండి. ఇటువంటి మహాదానులుగా అవ్వాలంటే మీ ప్రతి సంకల్పము మరియు శ్వాసలోనూ సేవలో ఉండాలి, కావున సేవా లగ్నము యొక్క ఫలములో విఘ్నాలు సహజంగానే వినాశనమైపోతాయి. ఎందుకంటే వర్తమాన సమయం ప్రత్యేక ఫలం లభించే సమయం. సేవ యొక్క ఫలితంగా ఇప్పుడే సంతోషమును, శక్తిని అనుభవం చేసుకుంటారు. కానీ, సత్యమైన హృదయంతో కూడిన సేవ ఉండాలి. సత్యమైన హృదయంపై స్వామి రాజీ అవుతారు. 

కొంతమంది పిల్లలు మేము సేవ చేస్తున్నాము కానీ ఫలము లభించడం లేదు, అనగా సఫలత లభించడం లేదు, ఇలా ఎందుకవుతోంది అని అంటారు. ఎందుకంటే సేవను రెండు రకాలుగా చేస్తారు. ఒకటేమో, హృదయపూర్వకంగా చేస్తారు, ఇంకొకటి, చూపించుకొనేందుకు అనగా పేరును పొందాలి అన్న అల్పకాలికమైన కోరికతో చేస్తారు. ఎప్పుడైతే బీజమే అల్పకాలికంగా ఉంటుందో అటువంటి బీజము యొక్క అల్పకాలిక ఫలము ప్రసిద్ధులుగా చేస్తుంది, కానీ సఫలత యొక్క ఫలము వారికి ఎలా లభిస్తుంది? పేరు కావాలి అన్న భావన యొక్క ఫలము పేరు ప్రతిష్టల యొక్క రూపంలో ప్రాప్తమవుతుంది. చూపించుకోవాలి అన్న సంకల్పము యొక్క బీజము ఉన్న కారణంగా అందరిముందూ ప్రత్యక్షతలోకి వస్తారు. అందరి నోటి నుండి అల్పకాలికమైన మహిమ యొక్క ఫలంగా సేవ బాగా చేస్తున్నారు అన్న మహిమ ప్రాప్తమవుతుంది. మరి అల్పకాలికమైన ఫలము లభించిందంటే పరిపక్వము కాని ఫలమును స్వీకరించినట్లే. కావున సంపూర్ణ ఫలము యొక్క ప్రాప్తి అనగా పరిపక్వమైన ఫలము యొక్క ప్రాప్తి ఎలా లభించగలదు? దాని రిజల్టు ఎలా ఉంటుంది? అపరిపక్వమైన ఫలాన్ని స్వీకరించిన కారణంగా అనగా అల్పకాలికమైన కామనను పూర్ణము చేసుకుంటున్న కారణంగా సదా శక్తిశాలిగా అవ్వలేరు, అధికారులుగా అవ్వలేరు మరియు సేవ చేస్తూ కూడా బలహీనంగా ఉన్న కారణంగా స్వయంతోనూ సంతుష్టంగా ఉండలేరు అలాగే సర్వులను సంతుష్టపర్చలేరు. ఎల్లప్పుడూ ఇంత చేస్తున్నా కూడా సఫలత ఎందుకు లభించడం లేదు అన్న ప్రశ్నయే ఉంటుంది. వీరు ఇలా చేస్తున్నారు, అలా ఎందుకు చేస్తున్నారు, ఇలా జరగకూడదు, ఇది జరగాలి... ఇలాంటి ప్రశ్నలలోనే ఉంటారు. కావున సేవాధారులుగా కూడా హృదయపూర్వకంగా అవ్వండి.

సత్యమైన హృదయంతో సేవాధారులుగా అయ్యేవారి యొక్క విశేష లక్ష్యము ఏమిటి? నిరుత్సాహంతో ఉన్న ఆత్మను ఉత్సాహవంతులుగా తయారుచేసేవారు ఎటువంటి అవగుణాలు కలిగిన ఆత్మలనైనా, నిరుపేద ఆత్మలనైనా బాబా ద్వారా లభించిన గుణాల యొక్క ఖజానాల ద్వారా నిరుపేదలను షావుకారులుగా తయారుచేసే శ్రేష్ఠ సంకల్పమును లేక శుభభావనను ఉంచుతారు. సత్యమైన హృదయము కల సేవాధారులు సదా ప్రత్యక్ష ఫలము లభించి ఉన్న కారణంగా స్వయాన్ని సఫలతామూర్తులుగా అనుభవం చేసుకుంటారు, కావున ఈ విధంగా సదా సహయోగులుగా అయినట్లయితే సహయోగము యొక్క పలితంగా సహజయోగులుగా అయిపోతారు. సదా సహయోగులుగా అవ్వడం ద్వారా సదా బిజీగా ఉంటారు. సంకల్పంలో కూడా బిజీగా ఉన్నట్లయితే స్వయంతో లేక బాబాతో ఏయే ఫిర్యాదులైతే చేస్తున్నారో అవి సహజంగానే సమాప్తమైపోతాయి. 

సదా ప్రతి సంకల్పంతోనూ సేవ చేసేవారికి అల్పకాలికమైన ఫలమును త్యాగము చేసేవారికి, సదా సఫలతామూర్తులుగా అయ్యేవారికి, ప్రతి ఆత్మ యొక్క ఉద్దరణార్థం నిమిత్తులుగా అయ్యేవారికి, ఉదారచిత్త ఆత్మలకు, సదా బాబా మరియు సేవలో తత్సరులై ఉండేవారికి, ఇటువంటి సమీప ఆత్మలకు, సదా సర్వఖజానాల యొక్క మహాదానులుగా ఉండే ఆత్మలకు, ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.. 

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా: - ఆత్మ యొక్క సర్వగుణాలను అనుభవం చేసుకున్నారా? జ్ఞానస్వరూపము, ప్రేమస్వరూపము లేక సుఖ, శాంతి, ఆనంద స్వరూపము యొక్క స్వయం యొక్క గుణాలను అనుభవం చేసుకున్నారా? ఆనంద స్వరూపము లేక జ్ఞాన స్వరూపము యొక్క స్టేజ్ ఏమిటి? ఆ స్టేజిలో స్థితులై ఉండే అనుభవముందా? ఈ అనుభవమును పొందడం అనగా సర్వ గుణాలను అనుభవం చేసుకోవడం లేక కేవలం శాంతిని పొందడము స్వయం పైనే ఉంది. ప్రతి గుణము యొక్క అనుభవం ఉన్నట్లయితే పరిస్థితి యొక్క సమయంలో కూడా అనుభవం యొక్క ఆధారంపై పరిస్థితిని మార్చివేస్తారు. కావున వర్తమాన సమయంలో ప్రతి గుణము యొక్క అనుభవజ్ఞులుగా అయ్యే పురుషార్థమునే చేయాలి. ఏవిధంగా స్థూలమైన లిఫ్ట్ లో ఏ నెంబరు యొక్క స్విచ్ ని నొక్కితే అక్కడికి చేరుకుంటారో అలాగే ఇది బుద్ధి యొక్క లిఫ్ట్. స్మృతి యొక్క స్విచ్ ను ఆన్ చేయగానే అక్కడికి చేరుకుంటారు. కొన్నిసార్లు లిఫ్ట్ ఉన్నా కానీ అది పనిచేయదు. పైకి వెళ్ళే స్విచ్ ను నొక్కుతారు కానీ అది క్రిందకు వెళ్ళిపోతుంది, లేక రెండవ నెంబరు స్విచ్ నొక్కితే 3 లేక 4 లోకి వెళ్ళిపోతుంది. కావున మీది అలా లేదు కదా! మీ లిఫ్ట్ మీ కంట్రోల్ లో ఉండాలి. కోరుకోకపోయినా క్రిందకు వచ్చేస్తున్నారంటే తప్పకుండా ఎక్కడో ఏదో కనెక్షన్ లూజ్ గా ఉండి ఉంటుంది. కంట్రోలింగ్ పవర్ లేరు. ఎవరైతే స్వయన్ని కంట్రోల్ చేసుకోలేరో వారు రాజ్యాన్ని ఎలా కంట్రోల్ చేయగలరు? అక్కడ రాజ్యము నియమానుసారంగా ఉంటుంది, అలాగే ప్రకృతి కూడా ఆజ్ఞానుసారంగా నడుచుకుంటుంది. కానీ ఇక్కడ ప్రకృతి మోసం చేసేస్తుంది. మరి ప్రకృతిపై అధికారులుగా ఎవరవుతారు? ఎవరైతే స్వయం యొక్క అధికారులుగా ఉంటారో, ఎటువంటి సంకల్పము, స్వభావం, వ్యక్తి లేక వైభవము యొక్క ఆధీనులుగా అవ్వరో వారినే అధికారులు అని పిలవడం జరుగుతుంది, వారు తమ స్వభావానికి కూడా ఆధీనులుగా ఉండరు. నా స్వభావం ఇలా ఉంది, కావున ఇలా చేసేసాను అని అంటే అది ఆధీనులుగా అవ్వడమే కదా! అధికారులు సదా శక్తిశాలురుగా ఉంటారు.

ఓహో బాబా, ఓహో డ్రామా అన్న గీతమునే గానము చేస్తూ ఉండండి. తద్వారా సదా లగ్నములో మగ్నమై ఉంటారు, ఎందుకంటే ఎవరైతే సాక్షిగా అయి ప్రతి పాత్రనూ అభినయిస్తారో వారే లగ్నములో మగ్నమై ఉండగలరు. ఎవరైనా ఏదైనా గీతమును పాడినప్పుడు వారు అందులోనే మగ్నమై ఉంటారు, అలాగే ఈ గీతమును పాడేవారు కూడా సదా ఒకే లగ్నములో మగ్నమై ఉంటారు. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న గీతమునే పాడుతూ ఉంటారు. ఇది చాలా పెద్ద సైన్యము ఎంత పెద్ద సైన్యము ఉంటుందో అంతగా తమ రాజ్యమును సహజంగా పొందుతారు. ఇంతమంది తమ దృఢ సంకల్పంతో ఏది కావాలనుకుంటే అది చేయగల్గుతారు. ఆ ఆత్మజ్ఞానులు కూడా తమ భౌతికమైన తపస్సుతో, అల్పకాలికమైన తపస్సుతో అల్పకాలికమైన సిద్ధిని పొందుతారు. కానీ మీరు ఆత్మిక తపస్వులు, పరమాత్మ జ్ఞానులు. వారి సంకల్పము ఏమేమి చేయగలదు? ఎల్లప్పుడూ విజయీ రత్నము అన్న స్మృతి ఉండడం ద్వారా మాయ యొక్క అనేకరకాలైన విఘ్నాలు అసలు అవేవీ లేనట్లుగానే సమాప్తమైపోతాయి. మీరు ఎటువంటి విజయులుగా అవ్వాలంటే శత్రువు యొక్క నామరూపాలు కూడా మాయమైపోవాలి అని అంటారు కదా! సదా విజయం యొక్క నషా లేక స్మృతి ఉన్నట్లయితే మాయ యొక్క విఘ్నాల యొక్క నామరూపాలు కూడా ఉండవు. మాయ యొక్క విఘ్నాలు చనిపోయిన చీమ వంటివి. కావున వాటిని చూసి భయపడేవారిగా అయితే లేరు కదా! శూరవీరులు, మహావీరులు విఘ్నాలను చూసి భయపడరు. మీరు విఘ్నాలను అర్థం చేసుకున్నారు కదా! అవి ఎలా వస్తాయి, వాటిని ఎలా సమాప్తం చేయాలి అన్న వాటన్నిటి యొక్క జ్ఞానము ఉంది కదా! విఘ్నాలు ముందుకు తీసుకువెళ్ళేందుకే వస్తాయి. విఘ్నాలు రావడం వల్ల అనుభవజ్ఞులుగా మరియు దృఢంగా అవుతారు. వాటిని గూర్చి తెలిసిన జ్ఞానులు, వివేకవంతులు విఘ్నాల ద్వారా లాభాన్ని పొందుతారే కానీ భయపడరు. విఘ్నము ముందుకు తీసుకువెళ్ళేందుకే వస్తుంది. ఇది గుర్తుకు రావడం ద్వారా మహావీరులుగా అయిపోతారు. వ్యర్థ సంకల్పాలను చూసి కంగారుపడడం లేదు కదా! సంకల్పాలపై విజయాన్ని పొందేవారు వాటిని చూసి ఎప్పుడూ భయపడరు, భయపడినట్లయితే మాయ బలహీనులుగా ఉండడం చూసి ఇంకా యుద్ధం చేస్తుంది. వీరు ధైర్యవంతులు అని గమనిస్తే వీడ్కోలు తీసుకుంటుంది.

Comments