25-01-1980 అవ్యక్త మురళి

25-01-1980         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బిందువు (జ్ఞాన సాగర పరమాత్మ)తో బిందువు (ఆత్మ) మిలనము.

ఈ రోజు బాప్ దాదా పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. మురళీలయితే చాలా విన్నారు. అన్ని మురళీల సారం ఒక్కటే శబ్దము "బిందువు”. దీనిలో మొత్తం విస్తారమంతా ఇమిడి ఉంది. బిందువుగా అయితే అయ్యారు కదా? బిందువుగా అవ్వడం, బిందువును స్మృతి చేయడం మరియు ఏదైతే గడిచిపోయిందో దానికి బిందువును పెట్టడం ఇది సులభంగానే అనుభవం అవుతుంది కదా! ఇది అతి సూక్ష్మమైనది మరియు అతిశక్తివంతమైనది. దీని ద్వారా మీరందరూ సూక్ష్మ ఫరిసాలై, మాస్టర్ సర్వశక్తివంతులై పాత్రను అభినయిస్తారు. సారము సులభంగా ఉందా లేక కష్టంగా ఉందా? డబల్ విదేశీయులు ఏమంటారు? సహజమా? డబల్ ఫారెనర్స్ కు డబల్ సహజమా? ఇప్పుడైతే బాప్ దాదా సార స్వరూపాన్ని చూడాలని అనుకుంటున్నారు.

ప్రతీ పుత్రుడు ఎలాంటి దివ్య దర్పణంగా కావాలంటే మీ ఈ దర్పణం ద్వారా ప్రతి మనుష్య ఆత్మకు తమ మూడు కాలాలు కనిపించాలి. ఇలాంటి త్రికాలదర్శనం చేయించే దర్పణంగా ఉన్నారా? ఈ దర్పణంతో “ఎలా ఉంటిని, ఇప్పుడు ఎలా ఉన్నాను, భవిష్యత్తులో ఏమి లభిస్తుంది” ఈ మూడు కాలాలు స్పష్టంగా కనిపించినట్లయితే సహజంగానే తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఆకర్షితులై వచ్చేస్తారు. ఎప్పుడైతే సాక్షాత్కారం అవుతుందో అనగా తెలుసుకుంటారో, తెలుసుకోవడం అనగా స్పష్టంగా చూసినంతగా అనుభవం అవ్వాలి. అనేక జన్మల దప్పిక లేక అనేక జన్మల ఆశలు అనగా ముక్తిలోకి వెళ్ళాలని లేక స్వర్గంలోకి వెళ్ళాలను కోరిక ఇప్పుడు పూర్తి కాబోతోంది అని తెలుసుకొని అనుభవం చేసుకొన్నప్పుడు సహజంగానే ఆకర్షితులై వస్తారు. రెండు రకాల ఆత్మలున్నారు. భక్త ఆత్మలు ప్రేమలో లీనం కావాలనుకుంటున్నారు, కొంతమంది ఆత్మలు జ్యోతిలో లీనం కావాలనుకుంటున్నారు. ఇరువురూ లీనం కావాలనే అనుకుంటున్నారు. ఇలాంటి ఆత్మలకు సెకండులో తండ్రి పరిచయాన్ని, తండ్రి మహిమను, వారి ద్వారా లభించు ప్రాప్తులను వినిపించి సంబంధంలో లవలీన స్థితిని(మగ్నావస్థను) అనుభవం చేయించండి. ప్రేమలో లీనమైతే సహజంగానే లీనమయ్యే రహస్యాన్ని కూడా అర్థం చేసుకుంటారు. కావున వర్తమాన సమయంలో లవలీనమయ్యే స్థితిని అనుభవం చేయించండి. భవిష్య ప్రాప్తిలో లీనమయ్యే మార్గాన్ని తెలపండి. అప్పుడు సహజంగా ప్రజలను తయారు చేసుకునే కార్యం పూర్తవుతుంది. ఇలాంటి త్రికాలదర్శులను తయారుచేసే దివ్యదర్పణంగా అయ్యారా? ఇలాంటి దివ్య దర్పణంలో ప్రతీ సమయంలో తమ పురుషార్థ ఫలితపు చిత్రాన్ని గీసుకొని - నేను సమర్థంగా ఉన్నానా? లేక వ్యర్థంలోకి వెళ్లానా? అని చెక్ చేసుకోండి. వ్యర్ధం యొక్క పోజు(భంగిమ) మరియు సమర్థత యొక్క పోజు రెండూ కనిపిస్తాయి. సమర్థ భంగిమ మాస్టర్ సర్వశక్తివంతులు లేక హృదయ సింహాసనాధికారులుగా ఉంటుంది. వ్యర్థ భంగిమ ఎలా ఉంటుంది? వీరు సదా యుద్ధంలోని యోధుల ఫోజు (భంగిమ) కలిగి ఉంటారు. సింహాసనాధికారిగా కాక యుద్ధ మైదానంలో నిల్చొని ఉంటారు. సింహాసనాధికారులు సఫలతా మూర్తులుగా, యుద్ధ మైదానంలో నిల్చున్న వారు కష్టం(పరిశ్రమ) చేసే మూర్తులుగా ఉంటారు. చిన్న విషయంలో కూడా పరిశ్రమ (కష్టపడుతూ ఉంటారు) చేస్తూ ఉంటారు. వారు స్మృతి స్వరూపులుగా ఉంటారు, వీరు ఫిర్యాదుల స్వరూపంగా ఉంటారు. ఇలా తమ స్వరూపాన్ని కూడా చూసుకుంటూ ఉంటారు, ఇతరులకు కూడా మూడు కాలాలను దర్శనం చేయిస్తారు. ఇలాంటి దివ్యదర్పణంగా కండి. అర్థమయిందా!

ఈ రోజు డబల్ విదేశీయులను, గుజరాత్ వారిని కలుసుకోవాలి. ఇరువురూ డాన్స్ చేయడంలో రాశి ఒకటే. వారూ బాగా నాట్యము చేస్తారు, వీరు కూడా బాగా నాట్యము చేస్తారు. గుజరాత్ వారు కూడా ప్రేమ స్వరూపులుగా ఉన్నారు; డబల్ ఫారెనర్స్ కూడా ప్రేమ అనుభవం ఆధారంతోనే పరుగెత్తి వచ్చారు. జ్ఞానంతో పాటు ప్రేమ లభించింది. ఆ ఆత్మిక ప్రేమనే వీరిని భగవంతుని వారిగా తయారు చేసింది. డబల్ ప్రేమ లభించింది. ఒకటి తండ్రి ప్రేమ, రెండవది పరివారం ప్రేమ. ప్రేమ అనుభవమే దీపపు పురుగు(పర్వానే)గా చేసింది. విదేశీయులకు ప్రేమ అనునది అయస్కాంతము వలె పని చేస్తుంది. తర్వాత వినుటకు లేక మరణించడానికైనా రెడీ అయిపోతారు. ఈ విధంగా చనిపోవడం మీకు ఇష్టమే కదా! ఇలా మరణించడం అనగా స్వర్గంలోకి వెళ్ళడం. అందుకే మరణించిన వారిని స్వర్గస్థులైనారని అంటారు. అక్కడ మరణించేవారెవ్వరూ స్వర్గానికి వెళ్ళరు. కానీ సంగమ యుగంలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గానికి వెళ్తారు. వారు దీనిని కాపీ చేసి ఎవరైతే దేహంతో చనిపోతారో వారిని ఫలానావారు స్వర్గానికి వెళ్ళారని వార్తాపత్రికలలో వేస్తారు. కావున మరణించడం ఇష్టమే కదా! మీరు మీ ఇష్టానుసారంగానే మరణించారు కదా. విధి లేక బలవంతంగా అయితే మరణించలేదు కదా. ఇదంతా మరజీవులుగా అయ్యే వారి సభ కదా. పాత ప్రపంచంలో ఎక్కడా మీ శ్వాస ఆగిపోలేదు కదా! ఇక్కడ చనిపోయినవారు కూడా లేచి నవ్వుతారు. ఇది ఆశ్చర్యం కదా.(ఫారెనర్స్ బాబా మాటలకు నవ్వుతూ ఉన్నారు.) మీ క్రిష్టియన్ ఫిలాసఫీలో కూడా శవానికి ప్రాణం పోస్తారని ఉంది కదా! ముందు చనిపోయి శవమైపోయారు. తర్వాత ప్రాణం వచ్చింది. క్రొత్త జన్మ జరిగింది. ఈ విధంగా చనిపోడంలో ఆనందముంది. భయం లేదు. 

దాదీలతో :- వర్తమాన సమయం వతనంలో మహావీరుల విశేష సభ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో తెలుసా? ఎలాగైతే స్థాపనా సమయంలో బాప్ దాదా బ్రహ్మ సంపూర్ణ స్వరూపం ద్వారా సాక్షాత్కారాలు చేయించే సేవ తీసుకున్నారో అలా వర్తమాన సమయంలో అష్టరత్నాలే ఇష్టరత్నాలు. కావున బాప్ దాదా వారిని కూడా శక్తి రూపంలో జత జతలో సాక్షాత్కారం చేయించే సేవ చేయిస్తారు. స్థూల శరీరం ద్వారా సాకార ఈశ్వరీయ సేవలో బిజీగా ఉంటారు. కానీ ప్రస్తుత సమయంలో అనన్యులైన శ్రేష్ఠ ఆత్మల ద్వారా డబల్ సేవ నడుస్తుంది. ఏ విధంగా బ్రహ్మ ద్వారా స్థాపనలో వృద్ధి జరిగింది. అలాగే ఇప్పుడు శివశక్తి కంబైన్డ్ సాక్షాత్కారం ద్వారా, సాక్షాత్కారం మరియు సందేశం లభించే కార్యము మీ సూక్ష్మ శరీరాల ద్వారా కూడా జరుగుతూ ఉంది. కావున బాప్ దాదా అనన్యమైన పిల్లలను ఈ సేవలో కూడా సహయోగులుగా చేసుకుంటున్నారు. అందువలన సూక్ష్మ సేవ కొరకు ప్రాక్టికల్ ప్లాన్ తయారు చేయుటకు అక్కడ సభ జరుగుతుంది. అందువలన మహావీరులైన పిల్లలు కర్మ చేస్తూ కూడా కర్మ బంధనాల నుండి ముక్తులై సదా డబల్ లైట్ రూపంలో ఉండాలి. తండ్రి సూక్ష్మ వతనంలో ఎమర్జ్ చేసుకున్నారు, సేవ చేయించారు అనే అనుభూతిని ముందు ముందు చాలా చేస్తారు. ఇప్పుడు డబల్ సేవ యొక్క పాత్ర నడుస్తూ ఉంది. బాప్ దాదా అనన్యమైన పిల్లల సంఘటన ద్వారా భక్తులకు, సైన్స్ వారికి ఇరువురికీ టచింగ్ చేయించే సేవను చేయిస్తూ ఉంటారు. వారిలో అనన్యమైన భక్తి సంస్కారం నింపుతూ ఉన్నారు. వీరు అర్ధకల్పం వరకు భక్తి కొనసాగిస్తూ ఉంటారు. సైన్స్ వారిలో(శాస్త్రవేత్తలలో) పరివర్తన చేసే మరియు రిఫైన్ సాధనాలు తయారుచేయు సంస్కారాలను నింపుతారు. ఏ సాధనాలు ఉన్నాయో అవి సంపన్నంగా అవుతూనే వాటి సుఖాన్ని సంపూర్ణ ఆత్మలు(స్వర్గంలో) తీసుకుంటారు. ఈ శాస్త్రవేత్తలు తీసుకోలేరు. కావున ఈ రెండు కార్యాలు సూక్ష్మ సేవ ద్వారా జరుగుతూ ఉన్నాయి. అర్థమయిందా!

పూర్తి రోజంతటిలో సూక్ష్మవతనవాసిగా అయ్యి ఎంత సమయం ఉంటున్నారు? లేక స్థూల సేవ ఎక్కువగా ఉందా. మీరు ఎంత బిజీగా అయినా ఉండండి, తండ్రి తన కార్యాన్ని చేయించుకునే తీరుతారు. తమ సంపూర్ణ ఆకారాన్ని అనుభవం చేశారా? సాకారంలో ఉన్న బాబా ఆకార రూపంలోకి వెళ్ళారు. మీ అందరిదీ కూడా సంపూర్ణ ఆకారీ స్వరూపం ఉంది. అలా అందరూ నెంబరువారీగా ప్రతి ఒక్కరూ సాకారం నుండి ఆకారీ రూపంగా అవుతారు. ఆకార రూపంగా అయ్యి సేవ చెయ్యడం మంచిదా లేక సాకార శరీరాన్ని పరివర్తన చేసుకొని కొత్త శరీరం తీసుకొని సేవ చెయ్యడం మంచిదా! అడ్వాన్స్ పార్టీ వారైతే సాకార శరీరాన్ని మార్చుకొని సేవ చేస్తున్నారు. కానీ కొంతమంది పాత్ర అంతిమం వరకు సాకారీ మరియు ఆకారీ రూపం ద్వారా కూడా నడుస్తుంది. మీకు ఏ పాత్ర ఉంది? కొంతమందిది అడ్వాన్స్ పార్టీలో పాత్ర ఉంది. కొందరిది అంత: వాహక శరీరం ద్వారా సేవ చేసే పాత్ర ఉంది. రెండు పాత్రలకు తమ తమ మహత్యము ఉంది. ఇందులో ఫస్ట్, సెకండ్ అనే మాట లేదు. వెరైటీ పాత్రల మహత్యము ఉంది. అడ్వాన్స్ పార్టీ చేసే కార్యము కూడా తక్కువదేమీ కాదు. వారు చాలా వేగంగా తమ ప్లాన్‌ను తయారు చేస్తున్నారు. వారు అక్కడ కూడా ప్రసిద్ధంగా ఉన్నారు. 

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక :- అందరూ సదా మణుల వలె మెరుస్తున్నారా? మణి సదా మెరుస్తూ ఉంటుంది కదా! ఒక్కొక్క మణికి ఎంతో విలువ ఉంటుంది. ఇలా తమను విలువైన వారిగా చేసుకుంటున్నారా? మేము విశ్వంలో అమూల్య రత్నాలమని భావిస్తున్నారా? ఈనాటి మానవులు మీ విలువ కట్టలేరు. ఎందుకంటే మీరు తండ్రి వారుగా అయ్యారు కదా! ఎవరైతే తండ్రి వారిగా అయ్యారో వారు అమూల్య రత్నాలుగా అయ్యారు. మొత్తం విశ్వంలో సర్వ శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యారు. ఇంత సంతోషం ఉంటుందా? ఎలాగైతే శారీరిక వ్యాపారాలు సదా జ్ఞాపకం ఉంటాయో అలా ఆత్మ కర్తవ్యాలు ఎప్పుడూ మర్చిపోరాదు. తండ్రి యొక్క అమూల్య రత్నాలుగా అవ్వడమే సంగమ యుగంలోని శ్రేష్ఠ భాగ్యము. ఈ భాగ్యాన్ని ఎలా మర్చిపోగలరు. అన్ని సేవలలో సహయోగం ఇస్తున్నారా? ఆల్ రౌండ్ సేవాధారులుగా ఉన్నారా? సేవ చేసే అవకాశం లభించడం ఇది కూడా డ్రామాలో ఒక లిఫ్ట్. ఎంత యజ్ఞసేవ చేస్తారో అంత ప్రాప్తుల ప్రసాదం స్వత:గానే ప్రాప్తిస్తుంది. నిర్విఘ్నంగా ఉంటారు. ఒకసారి సేవ చేస్తే వెయ్యి రెట్ల సేవాఫలము ప్రాప్తి అవుతుంది. సదా స్థూల, సూక్ష్మ సేవలు నడుస్తూనే ఉండాలి. ఎవరినైనా తృప్తి పరచడం ఇది అన్నింటికంటే గొప్ప సేవ. అతిథులను సత్కరించుట చాలా గొప్ప భాగ్యము. అతిథులు భాగ్యశాలుర ఇంటికే వస్తారని అంటారు.

2. అందరూ మాయను తెలుసుకుంటూ మాయకు తెలియనివారిగా ఉంటున్నారు కదా? దేవతలకు మాయ దాడి అంటే ఏమిటో తెలియదు. (వారిని మాయ ఏమిటని అడిగితే తెలియదు కదా! అలాగే మీరు కూడా మాయ గురించి తెలుసుకుంటూనే మాయ చేసే యుద్ధం గురించి తెలియనివారిగా ఉండండి). మాయ నామ రూపాలు కూడా కనిపించకుండా సమాప్తి చెయ్యండి. మాయ ఎప్పుడూ ఆతిధిగా కావడం లేదు కదా. ద్వారం మూసేశారు కదా? కోట దృఢంగా ఉంటే శత్రువులు రారు. ఉన్నతమైన స్థితిలో ఉండటం అనగా ఉన్నతమైన గోడ. ఎప్పుడూ క్రింది స్థితిలోకి రాకండి. తండ్రి వారిగా ఎప్పుడైతే అయ్యారో, తండ్రి వారిగా అగుట అనగా నాది అనేది(మేరాపన్) సమాప్తి కావడం. మోహం జన్మించుటకు ఆధారము 'నాది'. నాది అనేది లేకపోతే మోహం ఎక్కడ నుండి వస్తుంది. తమను హద్దు రచయితగా భావిస్తే వికారాల ఉత్పత్తి జరుగుతుంది. సదా సోదర-సోదర స్మృతిలో ఉన్నట్లయితే ఏ వికారమూ ఉత్పన్నం కాదు.

3. సదా స్వయాన్ని గుప్తముగా ఉన్న కాని బాగా ప్రసిద్ధి గాంచిన(అన్ నోన్ బట్ వెరీ వెల్ నోన్ Unknown But Very Well Known) యోద్ధులమని భావిస్తూ యుద్ధ మైదానములో మాయాజీతులై ఉంటున్నారా? సాధారణంగానే కూర్చుని ఉన్నారు, సాధారణంగానే నడుస్తారు, తింటారు కాని నడుస్తూ - తిరుగుతూ కూడా మాయతో యుద్ధము చేసి విజయులుగా అవుతూ ముందుకు పోతున్నారు. బయటికి ఏ పని చేస్తున్నా లోపల మాయపై విజయము పొంది విశ్వరాజ్యాధికారము తీసుకుంటున్నారు. కనుక మీరు గుప్తముగా ఉన్నవారు కదా. ప్రత్యక్షత జరిగినప్పుడు అందరికీ మీరు ఎవరో, ఏమి చేస్తూ ఉండినారో అనుభవమవుతుంది. ఎవరి జతలో సర్వశక్తివంతులైన తండ్రి ఉన్నారో వారి విజయం నిశ్చితం. పాండవుల పతి సర్వశక్తివంతుడు. కనుకనే పాండవులు సదా విజయులుగా ఉండినారు. వారి తోడును ఎప్పుడూ వదలరాదు. ఒంటరిగా ఉన్నారంటే మాయ దాడి చేస్తుంది. తండ్రి జతలో ఉంటే మాయ బలిహారమైపోతుంది. మాయాజీతుల ముందు మాయ దాసిగా తయారై నమస్కరిస్తుంది. ఈ మాయా మేళ(జాతర)లో సాథీ అయిన తండ్రిని వదలరాదు. సాథీని(తోడును) వదిలారంటే దారి మర్చిపోతారు. తర్వాత బిగ్గరగా ఏడ్వవలసి వస్తుంది. సదా మాయ మీకు నమస్కరించాలి, దాడి చేయరాదు.

Comments