24-12-1979 అవ్యక్త మురళి

24-12-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ప్రపంచాన్ని ప్రకాశవంతము చేసేవారి సభ.

   ఈ రోజు బాప్ దాదా తమ ప్రతి పుత్రుని చూచి హర్షితమవుతున్నారు, ఎందుకంటే తమ ప్రతి పుత్రుడు ఎంత శ్రేష్ఠమైన ఆత్మనో, బాప్ దాదాకు తెలుసు. ప్రతి పుత్రుడు ప్రపంచానికి ఒక వెలుగు, ఒక జ్యోతి అనగా పిల్లలందరు ప్రపంచ జ్యోతులు. అంతేకాక బాప్ దాదాకు కూడా కంటి నక్షత్రాలు. బాబా తన పిల్లలను కనులపై కూర్చోబెట్టుకునే నడుస్తారు. అనగా బాప్ దాదా కనులలో ఇమిడి ఉన్నారు. కనులను చాలా మహిమ చేస్తారు. కనులు లేకుంటే మానవ జీవితానికి ప్రపంచమే లేదు. ఎలాగైతే శరీరములో కనులకు మహత్వముందో అలా మీలో ప్రతి పుత్రుడు ప్రపంచానికి వెలుగు లేక జ్యోతిలాంటి వారు. ప్రపంచ జ్యోతులైన మీరు ఈ స్థితిలో స్థితమై ఉంటే ప్రపంచము కూడా సుఖమయమవుతుంది. శ్రేష్ఠంగా తయారవుతుంది. ప్రపంచ జ్యోతులు లేక ప్రపంచానికి కంటి పాపలైన మీరు మీ శ్రేష్ఠమైన స్థితి నుండి క్రిందికి వచ్చారంటే ఈ ప్రపంచం కూడా అసార ప్రపంచంగా తయారవుతుంది. ఇంతగా మీ అందరిపై ప్రపంచం ఆధారపడి ఉంది. మీరు మేల్కొంటే ప్రపంచం మేలుకుంటుంది, మీరు నిదురిస్తే ప్రపంచం నిద్రపోతుంది అని అంటారు కదా. ఈ విధంగా మీరు ప్రపంచానికి ఆధారమూర్తులు. మీ ఉన్నతమయ్యే కళతో అందరూ ఉన్నతమయ్యే సంబంధముంది. మీ అవనతమయ్యే కళకు విశ్వం పడిపోయే కళకు సంబంధముంది. ఇలా ప్రతి ఒక్కరిపై ఇంత బాధ్యత ఉంది - ఇలా భావించి నడుస్తున్నారా? ఇటువంటి స్మృతి ఉందా? బాప్ దాదా ప్రతి పుత్రుని వర్తమాన స్థితి చూస్తున్నారు. ప్రతి ప్రపంచ జ్యోతి ఎంతవరకు వెలుగుతూ ప్రపంచాన్ని ప్రకాశవంతంగా చేస్తున్నదో చూస్తున్నారు. కనులనే జీవన జ్యోతులని అంటారు. మీరందరూ ప్రపంచానికి జ్యోతులు. ప్రపంచ జ్యోతులైన లైటు వెలగకుంటే లేక కదులుతూ ఉంటే ఎలా అనుభమవుతుంది? ఆ సమయము బాగుంటుందా? అలాగే ప్రపంచ జ్యోతులైన మీరు అలజడిలో ఉంటే విశ్వంలోని ఆత్మల పరిస్థితి ఏమవుతుంది?

ప్రపంచ నక్షత్రాలు లేక ప్రపంచ జ్యోతులైన మీ అందరి పైనే అందరి దృష్టి ఉంది. అందరూ వేచి ఉన్నారు. దేనిని గురించి? భక్తి మార్గములో ఒక శంకరుని గురించే శంకరుడు కన్ను తెరుస్తూనే సృష్టి పరివర్తన జరిగిపోయిందని చెప్పారు కాని ఈ మహిమ శివ వంశీ ప్రపంచ జ్యోతులైన మీదే. ఈ ప్రపంచ జ్యోతులైన మీరు సంపూర్ణ స్థితికి ఎప్పుడు చేరుకుంటారో అనగా సంపూర్ణత అనే కన్ను తెరుస్తూనే సెకండులో అయినా పరివర్తనైపోతుంది. కనుక ఓ ప్రపంచ జ్యోతులారా! సంపూర్ణత అనే కన్ను ఎప్పుడు తెరుస్తారో చెప్పండి. కన్ను ఇప్పుడు కూడా తెరచుకునే ఉంది. కాని ఇప్పుడింకా మధ్య మధ్యలో మాయ ధూళి ఏది కన్ను కదులుతూ ఉంది. స్థూల కనులలో కూడా ధూళి పడిందంటే కంటి స్థితి ఏమవుతుంది. ఏకాగ్ర రీతిలో దృష్టి ఇవ్వలేరు కదా, మొత్తం విశ్వమంతా ప్రపంచ జ్యోతులైన మీ కనుల నుండి ఒక్క సెకండు దృష్టి తీసుకోవడానికి మా ఇష్ట దేవీ దేవతల దృష్టి మాపై ఎప్పుడు పడ్తుందా? ఎప్పుడు ఆ దృష్టి ద్వారా మేము తృప్తి చెందుతామా అని ఎదురు చూస్తున్నారు. ఇలా దృష్టితో తృప్తి పరచే వారే స్వయం తమ కనులను నలుపుకుంటూ ఉంటే దృష్టితో వారిని ఎలా తృప్తి పరుస్తారు? దృష్టితో తృప్తి పడే వారి క్యూ చాలా పెద్దదిగా, పొడవుగా ఉంది. అందువలన సదా సంపూర్ణత అనే కన్ను తెరచుకునే ఉండాలి. బాప్ దాదా ప్రపంచ జ్యోతులు కూడా తమ కనులను ఏకాగ్రంగా ఉంచుకోలేకున్నారు. కొంతమంది తృప్తి పరుస్తూ పరుస్తూ తేలికగా తూగుతూ కూడా ఉన్నారు. తూగేవారు దృష్టితో ఎలా తృప్తి పరుస్తారు? సంకల్పాలను మింగడమే తూగడం. మీ భక్తులు మిమ్ములను చూస్తున్నారు. దర్శనీయ మూర్తులేమో తూగుతున్నారు. కనుక భక్తుల స్థితి ఎలా ఉంటుంది? అందువలన కళ్లను నలపడం, తూగడం మానేయాల్సి వస్తుంది. అప్పుడే దర్శనీయ మూర్తులుగా అవుతారు.

అమృతవేళలో ప్రపంచ జ్యోతులు కదులుతున్నాయా లేక ఏకాగ్రంగా ఉన్నాయా అని బాప్ దాదా చూస్తున్నారు. అనేక రకాలైన రూపు రేఖలు చూశారు. అవేవో మీ అందరికీ తెలుసు కదా. వర్ణన కూడా ఏమి చేయాలి? జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుండి మీ గొప్పతనాన్ని తెలుసుకొని, కర్తవ్యాన్ని తెలుసుకొని సదా వెలిగే జ్యోతులై ఉండండి. సెకండులో స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేయగలరు. ఇది అభ్యాసం చేయండి. ఇప్పుడిప్పుడే కర్మయోగిగా ఉండాలి. ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిలో ఉండాలి. పాత ప్రపంచములోని ఉదాహరణ ఇస్తారు కదా - మీ రచన అయిన తాబేలు సెకండులో లేక అవయవాలన్నిటిని సర్దుకుంటుంది లేక లోపలికి ముడుచుకుంటుంది. ఈ శక్తి మీ రచనలో కూడా ఉంది. మాస్టర్ రచయితలైన మీరు ఈ శక్తి మీ రచనలో కూడా ఉంది. మాస్టర్ రచయితలైన మీరు ఈ శక్తి ఆధారంతో సెకండులో సర్వ సంకల్పాలను సమాప్తము చేసి, ఒకే సంకల్పములో ఒక సెకనులో స్థితము కాగలరా?

నలువైపులా పరిస్థితులు అలజడి కలిగించేవిగా ఉన్నా, ఒక సెకండులో అచలంగా, స్థిరంగా అయిపోండి. పుల్‌స్టాప్ పెట్టడం ఎంత సులభమంటే, చిన్న పిల్లలు కూడా పెట్టగలరు. ప్రశ్నార్థకం పెట్టలేరు కాని ఫుల్ స్టాప్ పెట్టగలరు. కనుక వర్తమాన సమయం అలజడి పెరిగే సమయం, కాని ప్రకృతి అలజడి అవుతూ ఉంటే ప్రకృతి పతులు అచలంగా, స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ప్రకృతి కూడా చిన్న చిన్న పరీక్షలు తీసుకుంటూ ఉంది. అంతిమ పరీక్షలో పంచతత్వాలు భయంకర రూపంలో ఉంటాయి. 1. ఒకవైపు ప్రకృతి యొక్క భయంకర రూపము 2. రెండవ వైపు పంచ వికారాలు అంతిమ సమయమైనందున అతి భయంకర(వికరాల) రూపములో ఉంటాయి. తమ అంతిమ యుద్ధాన్ని ప్రయోగించి పరీక్షించేవిగా ఉంటాయి. 3. మూడవ వైపు సర్వాత్మలు రకరకాల రూపంలో ఉంటారు. ఒకవైపు తమోగుణీ ఆత్మల యుద్ధము, రెండవ వైపు భక్త ఆత్మల రకరకాల పిలుపులు వినిపిస్తూ ఉంటాయి. 4. నాల్గవ వైపు ఏముంటాయి? పాత సంస్కారాలు. అంతిమ సమయములో, అవి కూడా తమ అవకాశం తీసుకుంటాయి. ఒకసారి వచ్చి తర్వాత సదా కాలానికి వీడ్కోలు తీసుకుంటాయి. సంస్కారాల స్వరూపం ఎలా ఉంటుంది? కొంతమంది వద్దకు కర్మ సంబంధాల బంధన రూపంలో వస్తాయి. కొంతమంది వద్దకు వ్యర్థ సంకలాల రూపంలో వస్తాయి. కొంతమంది వద్దకు విశేషంగా నిర్లక్ష్యం మరియు సోమరితనం రూపంలో వస్తాయి. ఇలా నలువైపులా అలజడి కలిగించే వాతావరణముంటుంది. రాజ్య శక్తి, ధర్మ శక్తి, విజ్ఞాన శక్తి, ఇంకా అనేక రకాల బాహుబలం కలిగిన వారందరూ తమ శక్తుల అలజడిలో ఉంటారు. ఇటువంటి సమయంలో ఫుల్ స్టాప్ పెట్టడం వస్తుందా లేక ప్రశ్నార్థకం ఎదురుగా వస్తుందా? ఇంత సమేట్ నే కి శక్తిని(సర్దుకునే శక్తిని) అనుభవం చేస్తున్నారా? చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి,  ప్రకృతిలోని అలజడిని చూస్తూ ప్రకృతి పతులై ప్రకృతిని శాంతింపజేయండి. మీ ఫుల్ స్టాప్ పెట్టే స్థితి ద్వారా పరివర్తన చేయండి. ఇటువంటి అభ్యాసము ఉందా? ఇలా సమయాన్ని ఆహ్వానిస్తున్నారు కదా? సర్దుకునే శక్తిని జమ చేసుకోండి. దీని కొరకు విశేషమైన అభ్యాసం చెయ్యాలి. ఇప్పుడిప్పుడే సాకారి, ఇప్పుడిప్పుడే ఆకారి, ఇప్పుడిప్పుడే నిరాకారి. ఈ మూడు స్థితులలో స్థితమై ఉండడం ఎంత సహజమై పోవాలంటే సాకార స్థితిలో ఎంత సహజముగా స్థితులైపోతున్నారో అంత ఆకారి, నిరాకారి స్థితులలో కూడా స్థితమవ్వాలి. ఎందుకంటే అవి మీ స్థితులే. కనుక మీ స్థితిలో స్థితులవ్వటం సులభంగా ఉండాలి. ఎలాగైతే సాకారంలో ఒక డ్రస్సును మార్చుకొని మరో డ్రస్సును ధరిస్తారో అలా ఈ స్వరూప స్థితిని కూడా పరివర్తన చేసుకోగలగాలి. సాకార స్వరూప స్థితిని వదిలి ఆకారి ఫరిస్తా స్వరూపమైపోండి. అంటే ఫరిస్తా స్థితి అనే డ్రస్సును ఒక సెకండులో ధరించండి. డ్రస్సు మార్చుకోవడం రాదా? ఇటువంటి అభ్యాసం చాలా సమయం నుండి చేయాలి. అప్పుడు అటువంటి సమయములో ఉత్తీర్ణులవుతారు. అర్థమయిందా? సమయ వేగం ఎంత విరాట రూపం తీసుకోనున్నదో తెలుసా? ఇలాంటి సమయం కొరకు సదా సిద్ధంగా ఉన్నారు కదా? లేక తేదీ చెప్పినప్పుడు తయారవుతారా? తేదీ తెలిసిపోతే ఆత్మాభిమానిగా అగుటకు బదులు తేది అభిమానిగా అయిపోతారు. అప్పుడు ఫుల్ పాస్ కాలేరు. అందువలన తేది చెప్పబడదు. కాని తేది స్వయం స్వతహాగానే మీ అందరికీ టచ్ అవుతుంది. ఎలాగైతే ఈ కనుల ముందు ఏదైనా దృశ్యం కనిపిస్తే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అంత స్పష్టంగా అడ్వాన్స్ గానే భవిష్యత్తును అనుభవం చేస్తారు. కాని దీని కోసం ప్రపంచ జ్యోతులైన మీ కనులు సదా తెరవబడే ఉండాలి. మాయ ధూళి పడిందంటే స్పష్టంగా చూడలేరు. అర్థమయిందా? ఏ అభ్యాసం చేయాలి? డ్రస్సు మార్చుకునే అభ్యాసం చేయండి.

ఈ రోజు మధువనములో మూడు నదుల సంగమం ఉంది. ఢిల్లీ, యు.పి, విదేశీయులు. త్రివేణి సంగమం ఉంది. ఈ రోజు సాగరుడు గంగలో స్నానము చేయుటకు వచ్చాడు. తండ్రి ఏమో గంగలనే ముందుంచుతారు. మూడు నదులు కూడా తమ తమ ప్రవాహాలతో పావనంగా చేయు సేవలో లగ్నమై ఉన్నాయి. ఒకరి మహిమ మరొకరి మహిమ కంటే గొప్పగా ఉంది. ఎందుకంటే శబ్దము ఫారిన్ నుండే వెలువడ్తుంది. ఢిల్లీలో రాజధాని తయారవుతుంది. యు.పిలో స్మృతి చిహ్నాలు తయారవ్వాల్సి ఉంది. కనుక ముగ్గురికి తమ తమ శ్రేష్ఠ మహత్యముంది కదా. ఫారిన్ వారి శబ్ధము ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఢిల్లీలోని పాత సింహాసనము కదులుతుంది. యు.పిలోని భక్తులందరు తమ ఇష్ట దేవతలను వెతికి భక్తికి ఫలము తీసుకొనుటకు తహతహలాడుతున్నారు. భక్తులు కూడా తమ ఇష్ట దేవతలను కలుసుకునేందుకు తయారవుతూ ఉన్నారు. ఇప్పుడు మాస్టర్ భగవానులు తయారైతే దర్శించుకునే పర్దా తెరవబడుంది. దర్శించుకునే వారి సమయము. ఇప్పుడు ముగ్గురు కూడా తమ తమ కార్యాల వృద్ధిలో తీవ్రత తీసుకురండి. ఫారిన్ వారు శబ్దాన్ని త్వరగా చేర్చండి. ఢిల్లీ వారు రాజధానిని త్వరగా తయారు చేయండి, యు.పి వారు భక్తుల దాహాన్ని త్వరగా తీర్ధండి. అప్పుడు జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. మూడు నదులు ఏమేమి చేయాలో తెలిసిందా? ఫారిన్ వారు వెంటనే (ఫారన్) చేయాలి. ఫారిన్ వారు పురుషార్థం బాగా చేశారు. నగలేమో తయారు చేసుకున్నారు. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు నగల మధ్య వజ్రాలు పొదగాలి. హీరో, హీరోయిన్ల పాత్ర చేసేవారు కదా. సరే యు.పి వారు ఏం చేస్తారు? యు.పిలో సందు సందులో ఒక మందరిముంది. అలా యు.పిలో సందు సందులో సేవాకేంద్రముండాలి. అప్పుడు భక్తికి, జ్ఞానానికి పోటీ జరుగుతుంది. భక్తి, జ్ఞానము ముందు నమస్కరిస్తుంది. ఢిల్లీ ఏం చేస్తుంది? యమునా నది తీరాన రాజయోగ మహలు తయారైనప్పుడు ఆ నదీ తీరములో మహళ్లు తయారవుతాయి. ఇప్పుడు రాజయోగ ప్లేస్ ను తయారు చేయండి. తర్వాత ప్యాలెస్ (రాజ భవనము) తయారవుతుంది. పునాది ఏమో ఇప్పుడే వెయ్యాలి కదా. ఇప్పుడు రాజయోగ భవనము తయారవుతుంది. యు.పి వారు ధర్మ యుద్ధపు డ్రామా చూపించాలి. ఇప్పుడు ఏ ధర్మ నేతల కనులు పైకి చూస్తూ ఎదురిస్తూ ఉండినారో వారి కనులిప్పుడు క్రిందికి దించుకున్నారు. కాని ఇప్పుడింకా తలలు వంచాలి. ఇప్పుడు వారు మీ స్టేజిల పైకి వస్తున్నారు. కాని వారి స్టేజి పైకి మిమ్మల్ను చీఫ్ గెస్ట్ గా పిలవాలి. అప్పుడు తలలు వంచారని అంటారు. అచ్ఛా!

బాప్ దాదా సంకల్పాలన్నీ పూర్తి చేయువారు, శ్రేష్ఠమైన శుభ ఆశల దీపాలు, సదా ఫుల్‌స్టాప్ పెట్టేవారు, సదా ఎవర్ రెడీగా ఉండువారు, చాలా కాలము అభ్యాసము చేసినవారు. స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేయువారు, త్రివేణీ నదులకు బాప్ దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే

పార్టీలతో జ్ఞాన యుక్త ఆత్మల విశేష కర్తవ్యము - భక్తి స్థానాలను జ్ఞాన స్థానాలుగా చేయుట - తండ్రి ఇచ్చే జ్ఞానము తప్ప ఏ ఇతర జ్ఞానమైనా రసహీనమైదని అనగా అందులో ఏ సారము లేదని ఆత్మలందరికీ అనుభవం చేయిస్తున్నారా? "మేము ఏమి చేస్తున్నాము, వీరు(బి.కెలు) ఏమి పొందుకుంటున్నారు అని వారు అనుభవం చేయాలి." మేము వినేవారము, వీరు వినిపించేవారు, మేము వెతికేవారము, వీరు పొందుకునేవారు అని అందరూ అనుభవం చేసినప్పుడు జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. సేవ కొరకు నిమిత్తముగా ఉన్న శ్రేష్ఠ ఆత్మలైన మీరు ఎంతగా సర్వ అనుభవాల రసములో ఉంటారో, వారు స్వయాన్ని అంత నీరసంగా అనుభవం చేస్తారని భావిస్తున్నారా? ఇప్పుడు వారికి వీరు వెన్న తినేవారు, మేము మజ్జిగ తాగేవారము అని సంకల్పమొస్తూ ఉందా? సందు సందులో మందిరానికి బదులు రాజయోగ కేంద్రము, అనుభూతి కేంద్రము ఉండాలని వినిపించాను కదా. భక్తి స్థానాలను జ్ఞాన స్థానాలుగా చేయుటే జ్ఞాన యుక్త ఆత్మల విశేష కర్తవ్యము. జ్ఞాన స్థానాలు ఎప్పుడు తయారవుతాయి? ఎప్పుడైతే భక్తిపై వైరాగ్యము వస్తుందో అప్పుడు జ్ఞాన బీజము పడ్తుంది. ఇలా మీ మనసా సేవ ద్వారా కూడా వాతావరణాన్ని తయారుచేయండి. భక్తి ద్వారా ఏమీ లభించలేదని అనుభవం చేయాలి. ఇలా ఉపరాంగా అయినప్పుడు జ్ఞాన బీజము సులభంగా పడ్తుంది. అందుకై ఏ సాధనాన్ని ఉపయోగించాలి. బాగా పేరు ప్రఖ్యాతులు కలసినవారిలో స్నేహీ ఆత్మలుగా ఉన్నవారిని సమీపానికి తీసుకురండి. ఒకటేమో స్వార్థము కలిగినవారు, రెండవది స్నేహ యుక్త ఆత్మలు. స్నేహ యుక్త ఆత్మలను సమీపానికి తెస్తూ ఉండండి. పదే పదే స్నేహ మిలన సంపర్కములో వారిని సమీపానికి తెస్తే వారి ద్వారా అనేకమందికి కళ్యాణము జరుగుతుంది. మొదట మీరు కొంచెము కష్టపడాల్సి వస్తుంది. తర్వాత వారే స్వయంగా తమ సంఘటనను వృద్ధి చేసుకుంటూ పోతారు. ఎలాగైతే విదేశాల నుండి ప్రత్యక్షతా శబ్దము వెలువడుతుందో అలా ధర్మ స్థానాల నుండి భక్తి చేస్తున్నా ఇంకా ఏదో కావాలనే శబ్దము వెలువడాలి. భక్తి ద్వారా ఏ కోరికలున్నాయో అవి పూర్తి కావడం లేదు - ఎందుకు? అనే ప్రశ్న రావాలి. ఈ ప్రశ్ననే బాబాను ప్రత్యక్షం చేస్తుంది. ఉదాహరణానికి ఇప్పుడు ధర్మ నేతలలో ధర్మములో ఎందుకు అన్ని కలహాలు, పొట్లాటలు వస్తున్నాయి, ధర్మము ఎందుకన్ని తుంటలు తుంటలుగా అవుతూ ఉంది అనే ఆందోళన ఉంది. మనసులో ఈ చిక్కు ప్రశ్న అయితే ఉత్పన్నమయ్యింది. కాని ఈ చిక్కుకు మూలము తెలియాలి - ఇది ఇంకా జరగలేదు. మేము ఏమి చేయాలనుకున్నామో అది జరగడం లేదని అర్థం చేసుకున్నారు. కాని ఇది జరగాలి. అందుకు ఏం చేయాలి అనే ప్రశ్న ఉత్పన్నమగుట లేదు. భక్తికి ఫలమెందుకు లభించుట లేదు? భక్తిలో ఏమి జరగాలో అది ఎందుకు జరగడం లేదు? - ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడే బాబా దగ్గరకు వస్తారు, వెతుకుతారు.

భక్తులపై జాలి కలుగుతూ ఉందా? భక్తులు అమాయకులు కదా. అమాయకులపై జాలి తప్పక కలుగుతుంది. ఇప్పుడు సంఘటిత రూపములో భక్తులకు, అమాయకులకు స్థిరమైన స్థానాన్ని తప్పక చూపించాలి అని దృఢ సంకల్పము చేయండి. అప్పుడు నంబర్ వన్‌గా కాగలరు.

(విదేశీ పిల్లలకు క్రిస్మస్ శుభాకాంక్షలు) కిస్మి(ఎండు ద్రాక్ష) వంటి మధురాతి మధురమైన పిల్లలందరికీ నూతన సంవత్సర నూతన ఉమంగాలు. నూతన సంతోష తరంగాలతో నిండిన ఖుషీ శుభాకాంక్షలు. నూతన సంతోష తరంగాలతో నిండిన ఖుషీ శుభాకాంక్షలు. పూర్తి సంవత్సరమంతా ఇలా తోడుగా ఉండే అనుభవం చేస్తారు. ఈ క్రిస్మస్ పండుగ రోజు సదా కొరకు తండ్రితో కంబైండుగా ఉండు వరదానాన్ని తీసుకొచ్చింది. 'కంబైండ్ భవ' ఈ రోజు ఎలాగైతే ఇద్దరిద్దరు కలిసి డాన్స్ చేస్తారో, అలా సంవత్సరమంతా తండ్రి మరియు మీరు(బాప్ ఔర్ ఆప్) సంతోషంగా నాట్యము చేస్తూ ఉంటారు. సర్వ శక్తుల ప్యాకెట్ (పాట్లము)ను బాప్ దాదా బహుమతిగా ఇస్తున్నారు. ఇది మాస్టర్ సర్వశక్తివంతులై సదా మాయాజీతులుగా ఉండు అత్యంత గొప్ప బహుమతి. అచ్ఛా!

Comments