24-05-1977 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
తండ్రికి డైరక్టుగా పిల్లలైన వారే డబల్ పూజకు అధికారులుగా అవుతారు
బాప్ దాదా ప్రతి పుత్రుని భాగ్యమును చూచి హర్షితులవుతున్నారు. మొత్తం విశ్వంలో కోట్లలో కొంతమందిగా మహిమ చేయబడిన ఆత్మలు, తండ్రిని పొందుకున్న ఆత్మలు ఎంత కొద్దిమంది ఉన్నారు! కేవలం తెలుసుకొనుటే కాక తెలుసుకొనుటతో పాటు పొందవలసినదేదో పొందుకున్నారు. ఇటువంటి తండ్రికి అతిస్నేహీ సహయోగీ పిల్లల భాగ్యమును చూస్తూ ఉండినారు. వాస్తవానికి ఆత్మలంతా వారి పిల్లలే కాని మీరు వారికి డైరక్టు ప్లిలలు, శివవంశీ బ్రహ్మకుమార కుమారీలు. విశ్వమంతటిలో ఎవరైనా ఇతరాత్మలు ధర్మ క్షేత్రములో గాని, రాజ్య క్షేత్రములో గాని గొప్పవారిగా లేక ప్రసిద్ధి గాంచిన వారుగా ఉండవచ్చు! ధర్మపితలుగా ఉండవచ్చు, జగద్గురువులుగా పిలిపించుకోవచ్చు కాని మాతాపితల సంబంధముతో అలౌకిక జన్మ, అలౌకిక పాలన మీకు తప్ప వారెవ్వరికీ ప్రాప్తి కాదు. అలౌకిక మాత-పితల అనుభవము వారికి కలలో కూడా లభించదు. కాని శ్రేష్ఠ ఆత్మలైన మీరు పదమాపదమ్ పతి ఆత్మలైన మీరు ప్రతిరోజు మాతాపితల ప్రియస్మృతులు, సర్వ సంబంధాల ప్రియస్మృతులు తీసుకొనుటకు పాత్రులు. ప్రతి రోజు ప్రియస్మృతులు లభిస్తున్నాయి కదా. కేవలంప్రియస్మృతులే కాదు, సర్వశక్తివంతులైన తండ్రి పిల్లలైన మీ సేవాధారిగా అయ్యి ప్రతి అడుగులో తోడు నిభాయిస్తారు. అతి స్నేహంతో శిరో కిరీటములుగా, కంటి పాపలుగా చేసుకొని తమ జతలో తీసుకెళ్లారు. ఇటువంటి భాగ్యము జగద్గురువులకు గాని, ధర్మపితలకు గాని లేదు. ఎందుకంటే శ్రేష్ఠ ఆత్మలైన మీరు సన్ముఖములో తండ్రి నుండి శ్రీమతము తీసుకుంటున్నారు. ప్రేరణ ద్వారా, టచింగ్ ద్వారా కాదు, ముఖవంశావళి వారు. నేరుగా నోటి ద్వారా వింటున్నారు. ఇటువంటి భాగ్యము ఏ ఆత్మలకుంది? మెజారిటీ భారతవాసులు పేదవారు, అమాయక ఆత్మలు. అసలు మాకు తండ్రి ఎప్పుడైనా లభిస్తారా? అని నిరాశ చెందినవారుగా ఉండినారు. అటువంటి నిరాశ చెందినవారికే మరలా ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము లభించింది. ఎవరైనా నిరాశ చెందినవారు ఆశావాదులుగా, అసంభవమనుకున్నది సంభవమౌతే ఎంత నషా, ఖుషీ కలగుతుంది! ఇటువంటి భాగ్యము సదా మీ సృతిలో ఉంటుందా?
మొత్తం డ్రామాలో ఇతర ధర్మాత్మలను, మిమ్ములను చూడండి. ఎంత గొప్ప తేడా ఉంది? మొదటిది మీకు వినిపించాను - మీరు డైరక్టు పిల్లలు. మాత-పితల సంబంధము మరియు సర్వ సంబంధాల సుఖమును అనుభవము చేస్తున్నారు. డైరక్టు పిల్లలైనందున మీకు సహజంగా విశ్వ రాజ్య వారసత్వము సహజముగా ప్రాప్తి అవుతుంది. సృష్టి ఆదికాలము అనగా సత్యయుగము అంటే స్వర్గములోని సతో ప్రధాన సంపూర్ణ ప్రాప్తి ఆత్మలైన మీకు మాత్రమే లభిస్తుంది. మిగిలిన ఆత్మలందరూ మధ్య కాలములో వస్తారు. శ్రేష్ఠ ఆత్మలైన మీరు అనుభవం చేయగా మిగిలిన సుఖాన్ని లేక రాజ్యమును రజో ప్రధాన రూపంలో పొందుతారు. మీకు ధర్మము మరియు రాజ్యము రెండూ ప్రాప్తి అవుతాయి. కాని ఇతర ఆత్మలకు ధర్మముంటే రాజ్యముండదు, రాజ్యముంటే ధర్మముండదు. ఎందుకంటే ద్వాపరయుగము నుండి ధర్మము, రాజ్యము వేరైపోతాయి. అందుకు గుర్తు మొత్తం డ్రామాలో డబల్ కిరీటధారులు మీరు మాత్రమే. ఇంకా ఏమైనా చూశారా? ఇంకా విశేషతలున్నాయి. సంపూర్ణ ప్రాప్తి అంటే తనువు, మనసు, ధనము, సంబంధము, ప్రకృతి యొక్క సర్వ సుఖాలు అన్నింటిలో అప్రాప్తి వస్తువేదియూ ఉండదు. దు:ఖమునకు నామ రూపాలు కూడా ఉండవు. ఇటువంటి శ్రేష్ఠ ప్రాప్తి ఇతర ఏ ఆత్మలకు లభించదు. డైరక్టు పిల్లలైనందున అత్యంత శ్రేష్ఠమైన తండ్రి సంతానమైనందున, పరమ పూజ్య తండ్రి సంతానమైనందున ఆత్మలైన మీరు కూడా డబల్ రూపములో పూజింపబడతారు. 1). సాలిగ్రామ రూపంలో 2). దేవీ దేవతా రూపంలో. ఇటువంటి విధి పూర్వక పూజ్యులుగా ధర్మపితలు గాని, గొప్ప పేరు ప్రఖ్యాతులు గలవారు గాని కాలేరు. కారణమేమి? ఎందుకంటే మీరు డైరకు వంశావళి. మీరు ఎంత భాగ్యశాలురో అర్థమయిందా? స్వయం భగవంతుడే మీ భాగ్యాన్ని పెంచుతున్నారు! కనుక సదా మీ భాగ్యాన్ని గుర్తుంచుకోండి. బలహీనమైన పాటలు పాడకండి. భక్తులు బలహీనమైన పాటలు పాడ్తారు. పిల్లలు తమ భాగ్యమును వర్ణిస్తూ పాడ్తారు. కనుక ఇప్పుడు మిమ్ములను మీరు నేను భక్తుడినా? కొడుకునా? అని ప్రశ్నించుకోండి. మీ శ్రేష్ఠ భాగ్యమేదో అర్ధమయిందా? అచ్ఛా,
ఇటువంటి పదమాపదమ్ భాగ్యశాలురకు, బాబా డైరక్టు మొదటి రచనకు, సర్వ సంబంధాల సుఖానికి అధికారులు, సర్వప్రాప్తులకు అధికారులు, రాజ్యభాగ్యానికి, డబల్ పూజకు అధికారులు, తండ్రికి శిరస్సుకు కూడా శిరీటాలు - ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే.
Comments
Post a Comment