24-01-1978 అవ్యక్త మురళి

* 24-01-1978         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

నిరంతర సేవాధారి.

బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి మస్తకము మధ్యలో మెరుస్తున్న సితారను లేక వజ్రమును చూస్తూ హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రకాశము అతీతంగా మరియు ప్రియంగా ఉంది. ఈ మెరుస్తున్న తారల ద్వారా ప్రతి ఆత్మ యొక్క భాగ్యరేఖలు స్పష్టంగా కనిపిస్తాయి. తప్పిపోయిన పిల్లలు తమ భాగ్యమును తయారుచేసుకొనేందుకు ఎంతో గుప్తంగా మరియు ప్రత్యక్షంగా ఏవిధంగా పురుషార్ధం చేస్తున్నారో చూసి బాప్ దాదా ఎంతో గర్విస్తున్నారు. పిల్లల యొక్క నషాను మరియు తీవ్ర పురుషార్థమును చూసి బాబా కూడా పిల్లలపై బలిహారమవుతారు అనగా పిల్లల యొక్క కంఠహారంగా అయిపోతారు. ఏ విధంగా హారము సదా కంఠంలో స్మరింపబడుతూ ఉంటుందో అలాగే పిల్లల యొక్క ముఖముపై, నయనాలలో, బుద్దిలో బాబాయే ఇమిడి ఉన్నారు అనగా బాబాను తమ కంఠహారంగా చేసుకున్నారు. ఈ రోజు బాప్ దాదా పిల్లల యొక్క గీతమును గానం చేస్తున్నారు. పిల్లల మహిమ యొక్క ఏ గీతమును గానం చేశారు. పిల్లలు ప్రతి ఒక్కరిలోనూ బాబాను ప్రత్యక్షం చేయాలి అనే ఉల్లాసమును చూశారు. పిల్లలు లేకుండా బాబా ప్రత్యక్షమవ్వలేరు కూడా. కావున బాబాను కూడా ప్రత్యక్షం చేసేవారు మరి ఎంత శ్రేష్ఠమైనవారు? ఇంతటి నషా, సేవ యొక్క స్మృతి సదా ఉండాలి. ఏ విధంగా బాబా అవినాశియో, ఆత్మ అవినాశియో, సంగమ యుగం యొక్క సర్వప్రాప్తులు అవినాశియో అలాగే స్మృతి లేక శక్తి కూడా అవినాశిగా ఉండాలి, తేడా ఉండకూడదు. తేడా రావడము అనగా మంత్రమును మరిచిపోవడమే. మంత్రము గుర్తున్నట్లయితే నషాలో తేడా ఉండజాలదు.

ఈరోజు బాప్ దాదా కలుసుకొనేందుకు వచ్చారు. వినిపించడమైతే ఎంతో వినిపించారు, కానీ ఈరోజు వినిపించిన దాని యొక్క స్వరూపమును చూసేందుకు వచ్చారు. స్వరూపంలో ఏం చేస్తున్నారు? సేవ ఎంతో బాగా చేశారు, అనేక అజ్ఞానీ ఆత్మలకు స్మృతిని అనగా జాగృతిని కలిగించారు. ఢిల్లీ యొక్క ధరణి సర్వ బ్రాహ్మణ ఆత్మలను కదలికలోకి తీసుకువచ్చింది. వీరు ఎవరు మరియు ఈ కర్తవ్యము ఏమిటి అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమైంది. నిదురించిన మనిషిని మేల్కొల్పితే కళ్ళు తెరుస్తూ కాస్త నిద్ర యొక్క నషా ఉన్న కారణంగా ఎవరు, ఏమిటి అని ఏ విధంగా ప్రశ్నిస్తాడో అలాగే ఢిల్లీ నివాసులైన అజ్ఞానీ ఆత్మలకు కూడా ఎవరు; ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. వినడంలో మరియు చూడడంలో తేడాను అనుభవం చేసుకున్నారు. ఇంతమంది బ్రాహ్మణులను చూసి తప్పకుండా ఇది అద్భుతమే, సాధారణ కన్యలు, మాతలు గుప్తముగానే ఇంతటి సేనను తయారుచేశారే, ఇలా ఎప్పుడూ ఆలోచించలేదు, ఇలా ఎప్పుడూ భావించలేదు అని ఆశ్చర్యపోయారు. అందరి యొక్క దివ్య ముఖములు బాప్ దాదా యొక్క మూర్తిని కర్తవ్యము ద్వారా మనుష్యుల ముందు తప్పక ప్రత్యక్షం చేశాయి. ఇప్పుడు కేవలం కదలికను తీసుకువచ్చారు. భూమిలో మొదట నాగలిని దున్నుతారు కదా! అలాగే నాగలి దున్నుతూ ఇంకొకవైపు బీజాలు కూడా వేయడం జరుగుతుంది. అలాగే మీ భవిష్య రాజధానిలో లేక మీ ఆది ధరణిలో ఇటువంటి కదలికరూపీ హాలమును నడిపారు. ఏదో శక్తి ఉంది, సాధారణ శక్తి కాదు అని భావిస్తున్నారు. ఈ కదలికతో పాటు ఈ బీజాన్ని కూడా నాటారు. సమ్ముఖముగా చూడకపోయినా నలువైపులా వీరు ఎవరు మరియు ఏమిటి అన్న సందడిని వ్యాపింపజేసారు. ప్రభుత్వము యొక్క చెవుల దాకా ఈ శబ్దం చేరుకుంది. ఇప్పుడు ఈ బీజమును వాణి ద్వారా మరియు స్మృతి యొక్క శక్తి ద్వారా ఫలీభూతం చేయాలి. కాని ఇప్పటివరకూ ఏదైతే చేశారో అదంతా బాగానే చేశారు.

బాప్ దా దా విదేశాల నుండి వచ్చిన పిల్లలను లేక భారతదేశము నుండి వచ్చిన పిల్లలను ఎవరైతే సేవలో తమ అంగులిని ఇచ్చారో అనగా తమ రాజ్యము యొక్క పునాదిని వేశారో వారిని చూసి హర్షిస్తున్నారు. ఈ కాన్ఫరెన్సు బ్రాహ్మణుల యొక్క తమ తమ రాజధాని యొక్క అధికారులుగా అయ్యేందుకు పునాది రాయిని వేసే వేడుక. కావున ఏదైనా విదేశ సేవా కేంద్రం యొక్క ఆత్మలు లేక భారతదేశంలోని ఏ జోను మిగల లేదు, అందరు వచ్చారు. మీచే చేయబడిన ఈ గుప్త సేవ కొద్దిసేపటిలో ప్రత్యక్ష రూపాన్ని చూపిస్తుంది. ఇప్పుడు గుప్త వేషంలో మీ పునాది రాయిని వేసారు, అనగా బీజమును వేసారు. కాని, సమయానుసారంగా ఈ బీజమునే ఫలము యొక్క రూపంలో మీరందరూ చూస్తారు. ఈ ప్రపంచంవారే మిమ్మల్ని ఆహ్వానిస్తారు, సన్మానిస్తారు. (ఎందరో దగ్గుతున్న శబ్దము వచ్చింది) చాలా కష్టపడ్డారా? ప్రకృతి యొక్క ప్రభావము ఎక్కువైపోయింది, దీని ఫలితము కూడా తప్పక లభిస్తుంది. విదేశీ ఆత్మలకు ఋతువును బట్టి తమను తాము నడపుకోగలగడమును అనుభవం చేసుకోవడం కూడా ఎంతో అవసరం. ఈ అనుభవం కూడా కావాలి. ప్రతి ఒక్కరూ చిన్నా పెదా అందరిదీ ఈ సేవలో మహత్యముంది. కష్టపడడం కూడా బాగా కష్టపడ్డారు. మొదటి పునాదిగా ఈ ప్రశ్న ఉత్పన్నమైంది ఇప్పుడిక మళ్ళీ ఆ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. 

ఈరోజు బాప్ దాదా ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. ఏవిధంగా నిరంతర యోగీ అన్న వరదానము బాబా ద్వారా ప్రాప్తమయ్యిందో అలాగే నిరంతర సేవధారీ అన్న వరదానమూ లభించింది. నిదురిస్తున్నా సేవ జరుగుతూ ఉండాలి. మీరు నిదురించేటప్పుడు ఎవరైనా చూస్తే శాంతి, ఆనందము యొక్క వైబ్రేషన్లను అనుభవం చేసుకోవాలి. కావుననే చాలా మధురమైన నిదుర పట్టింది అని అంటారు. నిదురలో కూడా తేడా ఉంటుంది. ప్రతి సంకల్పములోను, ప్రతి కర్మలోను సేవ ఇమిడి ఉండాలి. వారినే నిరంతర సేవాధారులు అని అంటారు. బాబా మరియు సేవ. ఏ విధంగా బాబా అతి ప్రియమనిపిస్తారో, బాబా లేకుండా జీవితం లేదో అలాగే సేవ లేకుండా జీవితము ఉండకూడదు. ఇటువంటి నిరంతర యోగులు మరియు నిరంతర సేవాధారులే విఘ్నవినాశకులుగా ఉంటారు. బాబా యొక్క స్మృతి మరియు సేవ ఇవి డబల్ లాక్ గా పనిచేస్తాయి కావుననే మాయ రాజాలదు. సదా డబల్ లాక్ ఉంటోందా అని పరిశీలించండి. ఒకే తాళం ఉన్నట్లయితే మాయ వచ్చే అవకాశం ఉంటుంది కావున పదే పదే బాబా యొక్క స్మృతి మరియు సేవలో తత్పరులై ఉంటున్నామా అన్న ధ్యానమును ఉంచండి. ప్రతి కర్మేంద్రియము ద్వారా బాబా యొక్క స్మృతిని కలిగించే సేవను చేయాలి అని గుర్తుంచుకోండి. ప్రతి సంకల్పము ద్వారా విశ్వకళ్యాణకారిగా అయి లైట్ హౌస్ యొక్క కర్తవ్యమును చేయాలి. ప్రతి క్షణం యొక్క శక్తిశాలీ వృత్తి ద్వారా నలువైపులా శక్తిశాలీ వైబ్రేషన్ లను వ్యాపింపచేయాలి అనగా వాయుమండలమును పరివర్తన చేయాలి. ప్రతి కర్మ ద్వారా ప్రతి ఆత్మకు కర్మ యోగీ భవ యొక్క వరదానమును ఇవ్వాలి. ప్రతి అడుగులోనూ స్వయం కొరకు అపారమైన సంపాదనను జమా చేసుకోవాలి. కావున సంకల్పము, సమయము, వృత్తి మరియు కర్మ నాలుగింటినీ సేవ కొరకు వినియోగించండి అటువంటి వారినే నిరంతర సేవాధారి అనగా సర్విసబుల్ అని అంటారు. అచ్చా!

ఏవిధంగా మధువనంలో మేళా ఉందో అలాగే అంతిమంలో ఆత్మల యొక్క మేళా కూడా జరగనున్నది. మీకు మధువనం నచ్చుతోందా లేక విదేశము నచ్చుతోందా? మధువనము అని దేనిని అంటారు? ఎక్కడైతే బ్రాహ్మణుల యొక్క సంఘటన ఉందో అక్కడ మధువనము ఉంటుంది. కావున ప్రతి విదేశ స్థానమును మధువనముగా తయారుచేయండి. మధువనముగా తయారుచేసినట్లయితే బాప్ దాదా కూడా వస్తారు ఎందుకంటే మధువనములో వస్తాను అని బాప్ దాదా వాగ్దానం కూడా చేశారు. ముందు ముందు ఎన్నో అద్భుతాలు చూస్తారు. ఇప్పుడు ఏ విధంగా భారతదేశం యొక్క సంఖ్య పెరుగుతోందో అలాగే కొద్ది సమయంలో విదేశము యొక్క సంఖ్యను పెంచండి. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నలువైపులా శబ్దం వ్యాపించిపోవాలి. వీరు ఎవరు, ఏమిటి అన్న ప్రశ్నలు అందరిలోనూ ఉత్పన్నమవ్వాలి. ఎప్పుడైతే ఇటువంటి సంఘటనను తయారుచేస్తారో, అప్పుడు ఎక్కడైతే సంఘటన ఉంటుందో అక్కడ బాప్ దాదా కూడా హజరై ఉంటారు. అక్కడ సంతోషం ఉంటుందా లేక ఇక్కడకు రావడంలోనే సంతోషం కలుగుతుందా? ఎంత చెప్పినా సరే పెద్ద పెద్దయే, చిన్న చిన్నయే. ఎందుకంటే డైరెక్ట్ సాకార తనువు యొక్క జన్మ భూమి మరియు కర్మ భూమి, చరిత్ర భూమి యొక్క విశేష మహత్వమైతే ఉంది కదా! కావుననే భక్తిలో కూడా ఏమీ లేకపోయినా కానీ స్థానమునకు విశేషమైన మహత్వము ఉంది. విగ్రహం పాతబడిపోయినా, ఇంట్లో ఎంతో మంచి సుందరమైన మూర్తి ఉన్నా భకులు స్థానం యొక్క మహత్వమును ఉంచుతారు. కావున స్థానం యొక్క మహత్వము ఉంది, కాని మీరు మీ పూదోటను పెంచండి. మధువనం వంటి మ్యాపును తయారుచేయండి. మినీ మధువనము ఉన్నా దానిని చూడాలని కూడా అందరికీ ఆకర్షణ కలుగుతుంది, అచ్చా!

బాప్ దాదా వర్తమాన సేవకు ధన్యవాదాలు చెబుతున్నారు మరియు భవిష్య సేవ కొరకు స్మృతిని కలిగిస్తారు. బాప్ దాదాకు పిల్లలపై ఎక్కువ స్నేహము అని అనండి, శుభమైన మమత అని అనండి, తల్లికి పిల్లలపై మమత ఉంటుంది కదా! తపించరు కాని తమలో ఇముడ్చుకుంటారు, ఉదాసీనులుగా అవ్వరు కాని పిల్లలను సమ్ముఖంగా ఎమర్జ్ చేసి స్నేహము యొక్క సాగరంలో ఇమిడ్చివేస్తారు. బాబాకు స్నేహము ఉంది కావుననే మీకు కూడా స్నేహము ఉత్పన్నమవుతుంది కదా! స్నేహము ఉంది కాబట్టే అవ్యక్తము నుండి కూడా వ్యక్తములోకి వస్తారు.

ఇటువంటి స్నేహ బంధనలో బందించేవారికి, స్నేహముతో బాబాను ప్రత్యక్షం చేసేవారికి, సేవ ద్వారా విశ్వకళ్యాణార్థం నిమిత్తంగా అయ్యేవారికి, సదా మహాదాని మరియు వరదాని, ఇటువంటి నిరంతర యోగులకు, నిరంతర సేవా ధారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

రాజస్థాన్ పార్టీతో అవ్యక్త బాప్ దాదా: - మధువనంలో ప్రతి అడుగులోనూ సహజ సంపాదన యొక్క అనుభవం కలుగుతుంది. మధువనమును వరదాన భూమి అని అన్నారు. వరదానము అని సహజ ప్రాప్తినే అంటారు. కావున మధువనంలోకి రావడంతోనే కష్టపడడం సమాప్తమైపోతుంది మరియు సహజంగా ప్రాప్తి లభించడం ప్రారంభమవుతుంది. కావున ఈ కొద్ది సమయంలో ఎంతటి సంపాదనను చేసుకున్నారు? మధువనములోకి రావడము అనగా సంపాదన యొక్క గనిని పోగు చేసుకోవడం. కావున ఇంతటి మహత్వమును తెలుసుకొని కొద్ది సమయంలో సంపాదనను జమా చేసుకున్నారా? ఎందుకంటే మధువనము డైరెక్ట్ బాప్ దాదా యొక్క కర్మ భూమి, చరిత్ర భూమి, సేవా భూమి, తపస్యా భూమి. ఇక్కడ తపస్సు యొక్క వైబ్రేషన్లు, వాయుమండలములు ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ ఈ భూమి పైకి రావడం ద్వారా సహజంగా అనుభవం చేసుకోగల్గుతారు. ఏదైనా విశేషమైన సంపాదన యొక్క సీజన్ ఉంటే ఆ సీజన్లో సంపాదించకుండా ఉండలేరు. నిదురించే సమయాన్ని కూడా త్యజించివేస్తారు. కావున మధువనంలో సంపాదన యొక్క ఎక్స్ ట్రా లాటరీ ఉంది. మీరు తపస్వీ కుమారులే కదా! తపస్వీ యొక్క తపస్సు కేవలం కూర్చొనే సమయంలోనే కాదు, తపస్సు అనగా లగ్నము. నడుస్తూ, తిరుగుతూ, భోజనం చేస్తూ కూడా ఆ లగ్నము ఉంది కదా! ఒక్కరి స్మృతిలో, ఒక్కరి తోడుగా భోజనమును స్వీకరించడం కూడా తపస్సే అవుతుంది కదా! ఏ అవకాశమైతే లభిస్తుందో దానిని బాగా తీసుకొని సంపన్నంగా అవ్వండి మరియు ఇతరులను కూడా తయారుచేయండి.

2. జ్ఞానసాగరుని పిల్లలైన మీరు సదా జ్ఞాన రత్నాల తోటే ఆడుకుంటున్నారా? అన్నింటికన్నా అతి పెద్దవి అవినాశీ రత్నాలు జ్ఞాన రత్నాలే. జ్ఞాన సాగరుని పిల్లలు జ్ఞాన రత్నాలతో ఆడతారు. అర్థకల్పము రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు మరియు రాళ్ళతో ఆడుకున్నారు. కావుననే దుఃఖము, అశాంతి ఉన్నాయి. ఇప్పుడు వేటితో ఆడుకుంటారు? జ్ఞానరత్నాలు. రాజకుమారులు ఏవిధంగా బంగారము, వెండి బొమ్మలతో ఆడుకుంటారో అలాగే జ్ఞానసాగరుని పిల్లలైన మీరు జ్ఞానరత్నాలతో ఆడుకుంటారు. జ్ఞానరత్నాలతో ఆడుకుంటే దుఃఖము, అశాంతి యొక్క అలలు రాజాలవు. జ్ఞానరత్నాలూ ఉన్నాయి, జ్ఞానమూ ఉంది. జ్ఞానము యొక్క ఆధారంపై దుఃఖము, అశాంతి యొక్క అలలు రాజాలవు. ఇప్పుడు ఇది క్రొత్త జీవితము. దుఃఖము, అశాంతితో కూడుకున్న జీవితము నాది కాదు అది ఇతరులది అని అనిపిస్తుంది. గతించిన జీవితంపై నవ్వు కలుగుతుంది.

3. ఇప్పుడు మీరు సంతుష్ట మణులే కదా! మణి ఎల్లప్పుడూ మస్తకము మధ్యలో మెరుస్తూ ఉంటు కిరీటము లోపల ఎన్నో సుందరమైన మణులు ఉంటాయి. అలాగే సంతుష్టమణిగా ఎవరైతే ఉంటారో ఎల్లప్పుడూ మస్తకములో ఉంటారు అనగా బాబా యొక్క స్మృతిలో ఉంటారు. బాబా కూడా వారిని తలుచుకుంటు పిల్లలు బాబాను స్మృతి చేస్తే బాబా కూడా రిటర్న్ ఇస్తారు. సదా బాబా యొక్క స్మృతిలో ఉండేవారు. ఆ పరిస్థితులలోనూ సంతుష్టంగా ఉంటారు. పరిస్థితి అసంతుష్టమయంగా ఉన్నా, దుఃఖము యొక్క ఘటనకు సదా సంతోషంగా ఉంటారు. దుఃఖపు పరిస్థితులలో సుఖము యొక్క స్థితి ఏకరసంగా ఉండాలి. జ్ఞానం యొక్క ఆధారంపై పర్వతం వలే ఉండే పరిస్థితి కూడా ఆవగింజ వలే అనుభవమవుతుంది అనగా ఏమీ లేనట్టుగా అనుభవమవుతుంది. ఎందుకంటే అందులో కొత్త ఏమీ లేదు (నథింగ్ న్యూ). ఇటువంటి స్థితి ఉందా? ఏది. జరిగినా సరే, నథింగ్ న్యూ. అటువంటి వారినే మహావీరులు అని అంటారు.

4. స్వయాన్ని పదమా పదమ భాగ్యశాలులుగా భావిస్తున్నారా? ప్రతి అడుగులోనూ అపారమైన సంపద జమా అవుతోంది. ఇటువంటి లెక్కలేనన్ని ప్రాప్తులకు అధిపతులుగా అనుభవం చేసుకుంటున్నారా? మొత్తం అంతటిలో ఇటువంటి శ్రేష్ఠభాగ్యమును తయారుచేసుకొనేవారు కోట్లాదిమందిలో ఏ ఒక్కగా ఉంటారు కదా! కోట్లాదిమందిలో ఏ ఒక్కరో, ఆ కొద్దిమందిలోనూ ఏ ఒక్కరో అన్న గాయనమేదైతే ఉందో అది ఆత్మలైన మన యొక్క గాయనమే ఎందుకంటే సాధారణ రూపంలో వచ్చిన తండ్రిని, తండ్రి యొక్క కర్తవ్యమును తెలుసుకోవడము కోట్లాదిమందిలో ఏ ఒక్కరి పాత్రయో! తెలుసుకున్నారు, అంగీకరించారు మరియు పొందారు. విశ్వానికి అధిపతి మనవాడైనప్పుడు మరి విశ్వము కూడా మనదైపోయింది కదా! బీజము మన చేతిలో ఉంటే వృక్షము కూడా మన చేతిలో ఉన్నట్లే కదా! ఎవరికోసమైతే వెదుకుతూ ఉన్నామో వారినే పొందేసాము. ఇంట్లో కూర్చొని ఉంటూ కూడా భగవంతుని పొందాము, మరి ఎంతగా సంతోషించాలి. భగవంతుడు నన్ను తన వానిగా చేసుకున్నారు అను ఈ సంతోషంలోనే ఉన్నట్లయితే కనులు ఎటువైపుకూ వెళ్ళవు. ముందు చూస్తున్నా కానీ దృష్టి అటువైపుకు వెళ్ళదు. బాబా లభించడంతో సర్వస్వమూ లభించింది. ఇదే అన్నింటికన్నా పెద్ద సంతోషము. ఈ సంతోషంలోనే మనస్సుతో నాట్యమాడుతూ ఉండండి. ఇంతకన్నా సంతోషమయమైనది ఇంకేముంది. కావున అతీంద్రియ సుఖమును గూర్చి అడగాలనుకుంటే గోపగోపికలను అడగండి అన్న గాయనము ఉంది. 

Comments