23-11-1981 అవ్యక్త మురళి

* 23-11-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"త్యాగమును కూడా త్యాగం చేయడం.”

  ఈ రోజు బాప్ దాదా ఎవరిని కలుసుకునేందుకు వచ్చారు? మీకు తెలుసా? ఈ రోజు అనేక భుజాధారి అయిన బాబా తమ భుజాలను అనగా సదా సహయోగులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. విశేష సహయోగీ ఆత్మలు బాబా యొక్క కుడి భుజాలుగా అయి ప్రతి కార్యములోనూ ఎంతగా సదా ఎవర్రెడీగా ఉంటున్నారు? బాప్ దాదా డైరెక్షన్ యొక్క సూచనను ఇవ్వగానే కుడి భుజాలు అనగా విశేష భుజాలు అనగా ఆజ్ఞాకారులైన పిల్లలు సదా 'హా బాబా! మేము సదా తయారుగా ఉన్నాము' అని అంటారు. 'హే పిల్లలూ' అని బాబా అంటే 'అలాగే బాబా' అని పిల్లలు అంటారు. ఇటువంటి విశేషమైన భుజాలను బాబా చూస్తున్నారు. నలువైపులా ఉన్న విశేష భుజాల ద్వారా పిల్లల యొక్క హాజీ బాబా, ఇప్పుడే చేస్తాము బాబా, హాజరు బాబా' అన్న ఇదే శబ్దాన్ని వింటున్నారు. ఇటువంటి పిల్లల యొక్క మధుర ఆలాపనలు బాప్ దాదా వద్దకు చేరుకుంటున్నాయి. బాప్ దాదా కూడా ఇటువంటి పిల్లలను చూసి పిల్లలను సదా, 'ప్రియమైన పిల్లలూ, సుపుత్రులైన పిల్లలూ, విశ్వము యొక్క సింగారమైన పిల్లలు, మాస్టర్ భాగ్య విధాతలు, మాస్టర్ వరదాతా పిల్లలు' అని పిలుస్తారు. 

ఈ రోజు బాప్ దాదా ఇటువంటి పిల్లల యొక్క పేర్లను లెక్కిస్తున్నారు. ఎంత పెద్ద మాలను తయారుచేసి ఉంటారో చెప్పండి! చిన్న మాలా లేక పెద్ద మాలా? ఆ మాలలో మీ అందరి యొక్క పేర్లు ఎక్కడ ఉంటాయి? చివరిలోని రిజల్టు యొక్క మాలను గూర్చి అడగడం లేదు, వర్తమాన సమయంలో ఇటువంటి కుడిభుజాలు ఎంతమంది ఉన్నారు అన్న మాలను తయారుచేస్తున్నారు. వర్తమాన సమయం యొక్క నెంబర్‌నైతే సహజముగా చెప్పగలరు కదా! మాల యొక్క నెంబర్‌ను లెక్కిస్తూ, లెక్కిస్తూ బ్రహ్మా బాబా ఒక విశేషమైన మాటను పలికారు.బాబా ఏమని ఉంటారు? ఈనాటి విశేషమైన విషయం కుడి భుజాలు అనగా సహయోగులను గూర్చినది. ఇదే సహయోగము యొక్క విషయంపై ఈ రోజు ప్రవృత్తిలో ఉంటూ, ప్రవృత్తి యొక్క వృత్తి నుండి అతీతముగా ఉండే, వ్యవహారములో ఉంటూ అలౌకిక వ్యవహారము యొక్క ధ్యానమును సదా ఉంచే ఇటువంటి అతీతమైన మరియు బాబాకు ప్రియమైన విశేషమైన పిల్లల యొక్క విశేషతను చూస్తున్నారు. వాయుమండలపు అగ్ని యొక్క సెగ నుండి కూడా దూరంగా ఉంటారు. ఇటువంటి అగ్నినుండి ఫ్రూఫ్ గా ఉండే పిల్లలను బాప్ దాదా చూసారు. ఈ రోజు ఇటువంటి డబుల్ పాత్రధారులైన లౌకికములో కూడా అలౌకికత యొక్క పాత్రను అభినయించే పిల్లల యొక్క మహిమను గానం చేస్తున్నారు. 

డబుల్‌ పాత్రధారుల విశేషత ఒకటి వర్ణించబడ్డది. ఇటువంటి అనాసక్తులైన పిల్లలు కూడా ఉన్నారు. సంపాదిస్తారు, సుఖ సాధనాలను ఎన్ని కావాలనుకుంటే అన్నింటిని ప్రోగు చేసుకోగలరు కానీ సాధారణముగా తింటారు. సాధారణముగా నడుచుకుంటారు. సాధారణముగానే ఉంటారు. మొదట అలౌకిక సేవ యొక్క విశేషమైన భాగాన్ని తీస్తారు. లౌకిక కార్యము, లౌకిక ప్రవృత్తి, లౌకిక సంబంధాలు, సంపర్కాలను కూడా నిర్వర్తిస్తారు కానీ తమ బుద్ధి విశాలముగా ఉన్న కారణముగా వారిని అసంతుష్టులుగా కూడా చేయరు మరియు ఈశ్వరీయ సంపాదనను జమా చేసుకొనే రహస్యాన్ని తెలుసుకుంటూ విశేషమైన భాగమును రహస్య యుక్తులుగా తీస్తారు కూడా! ఈ విశేషతలో గోపికలు కూడా తక్కువేమీ కాదు. ఇటువంటి గుప్తమైన గోపికలు కూడా ఉన్నారు. లౌకికములో అర్ధభాగస్వాములు అని పిలువబడతారు కానీ తండ్రితో వ్యాపారం చేయడంలో పూర్తి భాగస్వాములుగా ఉన్నారు. ఇటువంటి సత్యమైన హృదయం గల స్వచ్ఛ హృదయ గోపికలు కూడా ఉన్నారు. అలాగే పాండవులూ ఉన్నారు. ముందు చెప్పారు కదా! ఈ రోజు ఇటువంటి పిల్లల యొక్క పేర్లను లెక్కిస్తున్నారు. ఇలా ఎకానమీ చేసి కార్యములో ఉదారచిత్తతతో వినియోగిస్తారు. తమ విశ్రాంతి యొక్క సమయాన్ని తమ విశ్రాంతి కొరకు కాక, ధనం యొక్క భాగం ఉంటూ కూడా 75 శాతం అలౌకిక కార్యములో వినియోగిస్తారు మరియు నిమిత్త మాత్రంగా లౌకిక కార్యాన్ని నిర్వర్తిస్తారు. ఇటువంటి త్యాగవంతులైన పిల్లలు సదా అవినాశీ భాగ్యవంతులు. కానీ ఇటువంటి యుక్తియుక్తమైన పాత్రనుఅభినయించేవారు ఎక్కువ సంఖ్యలో లేరు. వేళ్ళపై లెక్కించదగినవారిగా ఉన్నారు. అయినా డబుల్ పాత్రధారులైన ఇటువంటి విశేష ఆత్మల యొక్క మహిమ కూడా తప్పకుండా వర్ణన చేయబడ్డది.

రెండవరకం పిల్లలు కూడా ఉన్నారు, వారు చేస్తారు కూడా. కానీ సెకండ్ నెంబర్ గా అయిపోతారు. గుప్తదానము - మహాదానము చేసే గుప్త మహాదానుల యొక్క విశేషత - త్యాగాన్ని కూడా త్యాగం చేయడం. శ్రేష్ఠ కర్మ యొక్క ఫలమేదైతే ప్రాప్తమవుతుందో దాని ప్రత్యక్ష ఫలము - సర్వుల ద్వారా మహిమ జరగడం సేవాధారులకు శ్రేష్ట గాయనము యొక్క సీటు లభిస్తుంది, గౌరవము, పదవి యొక్క సీటు లభిస్తుంది..సిద్ధి తప్పకుండా ప్రాప్తమవుతుంది. ఎందుకంటే ఈ సిద్ధులు మార్గములోని మజిలీల వంటివి. ఇవి చివరి గమ్యము కాదు, కావున వీటిని కూడా త్యాగము చేసే త్యాగవంతులుగా, భాగ్యవంతులుగా అవ్వండి. వారినే మహాత్యాగులు అని అంటారు. ఇప్పుడిప్పుడే చేయడం, మళ్ళీ ఇప్పుడిప్పుడే తినేయడంలో జమా అనేది జరుగదు. ఈ అల్పకాలిక సిద్ధులు కర్మ యొక్క ప్రత్యక్ష ఫలము యొక్క రూపములో తప్పకుండా ప్రాప్తమవుతాయి. ఎందుకంటే సంగమయుగం ప్రత్యక్ష ఫలమును ఇచ్చే యుగము. భవిష్యత్తులో అయితే అనాదిగా నియమ ప్రమాణముగా లభించవలసిందే కానీ సంగమయుగము వరదానీయుగము. ఇప్పుడిప్పుడే చేస్తే మళ్ళీ ఇప్పుడిప్పుడే లభిస్తుంది, కానీ దానిని అప్పుడే తినడం అనేది చేయకండి. దీనిని ప్రసాదముగా భావించి పంచండి లేక బాబా ముందు భోగ్ గా నివేదించండి. అప్పుడు ఒకటికి కోటానురెట్లుగా జమా అయిపోతుంది కావున వ్యాపారము చేయడంలో తెలివైనవారిగా అవ్వండి, అమాయకులుగా అవ్వకండి. విన్నారు కదా! - ఇది సెకండ్ నెంబర్ వారి విషయము.

అచ్చా మూడవ నెంబర్ వారిని గూర్చి కూడా వింటారా? వీరు సేవలో సహయోగులుగా తక్కువ అవుతారు కానీ సీటు తీసుకోవడంలో మొదటే తీసుకోవాలనుకుంటారు. సర్వ ఖజానాలను స్వయం యొక్క విశ్రాంతి కొరకు ఎక్కువగా వినియోగించుకుంటారు.

మొదటి నెంబర్ ఏకనామి మరియు ఎకానమీ వారు. రెండవ నెంబర్ వారు సంపాదించుకొని తినేవారు మరియు మూడవ నెంబర్ వారు సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ. వారు ఇతరుల యొక్క సంపాదనను కూడా తింటారు. వారు తెప్పించుకుంటారు మరియు తింటారు. శ్రేష్ఠ ఆత్మల భాగ్యము యొక్క భాగాన్ని త్యాగవంతులైన పిల్లల యొక్క ప్రత్యక్ష ఫలమును తింటారు. సర్వ ప్రాప్తులనూ త్యాగవంతులైన వారు త్యాగం చేస్తారు కానీ మూడవ నెంబర్ వారు వారి యొక్క భాగాన్ని కూడా స్వయం స్వీకరించేస్తారు. వారు సంపాదించేవారు కారు, కేవలం తినేవారే. ఈ కారణముగా నెంబర్ వన్ పిల్లలు భారమును దించుకునేవారిగా ఉంటే వీరు భారమును పెంచుకునేవారిగా ఉంటారు. ఎందుకంటే వారు తమ శ్రమ యొక్క తిండిని తినరు. ఇటువంటి తింటూ, తాగుతూ ఉండే ఆత్మలను కూడా చూసారు. ఇప్పుడు మూడు (3) నెంబర్లనూ విన్నారా? ఇప్పుడు నేను ఎవరు అని ఆలోచించుకున్నారా? అచ్చా.

ఈనాటి ఆత్మిక సంభాషణలో ప్రవృత్తిలో ఉంటూ ఎకానమీగా మరియు ఏకనామిగా ఉండే పిల్లల యొక్క మహిమను పదే, పదే గానం చేసారు. అచ్ఛా

ఇటువంటి సదా హా బాబా, హాజర్ బాబా అని అనేవారికి, సదా స్వయం త్యాగమునుకూడా త్యాగం చేస్తూ ఇతరులను భాగ్యవంతులుగా తయారుచేసేవారికి, సదా బాప్ దాదాతో శ్రేష్ఠమైన వ్యాపారమును చేసేవారికి, సదా సేవలో సర్వ ఖజానాలను వినియోగించేవారికి, ఇటువంటి గుప్త దాతలకు మహాభాగ్యశాలీ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

రాజస్థాన్(జైపూర్) గ్రూప్ నకు సేవా వృద్ధి యొక్క విశేషమైన సూచనలు మరియు ప్లాన్లను ఇస్తున్నారు.

మీరు రాజస్థాన్‌ను కూడా రాజ సింహాసనము యొక్క స్థానములో ఉన్నారు. కావున రాజ సింహాసనము యొక్క స్థానముపై ఏమేమి చేస్తున్నారు? ఈ సంవత్సరమంతటిలో ఏయే నవీనతలను చేసారు?మహాతీర్ధమును దర్శించేందుకు యాత్రికుల యొక్క పార్టీలను తెచ్చారా? లౌకిక యాత్రలలో కూడా గుంపును తయారుచేసుకొని వెళతారు. పూర్తి ట్రైన్ ను నింపి తీసుకు వెళతారు. మరి రాజధాని వారు ఈ మహాతీర్ధయాత్రను ఎంతమంది ద్వారా చేయించారు? రాజస్థాన్ యొక్క రాజగద్దెవారు ముఖ్య స్థానమైన మధువనానికి ఎంతమందిని తీసుకువచ్చారు? బస్ నింపి తీసుకువచ్చారా లేక ఈ రాజస్థాన్ లో యాత్రికులే లేరా? మీరేమి భావిస్తున్నారు? యాత్రికులు లేరా లేక మార్గదర్శకులు తయారవ్వలేదా? ఇంతమంది మార్గదర్శకులుగా అయిపోయినట్లయితే మరి యాత్రికులు ఎంతమంది ఉండాలి? మరి యాత్రికులను తీసుకువస్తారా లేక స్వయమే వస్తారా? ఈ సంవత్సరం ప్రోగ్రాం తయారుచేస్తారా లేక వచ్చే సంవత్సరం తయారుచేస్తారా? అచ్ఛా! ఏదైనా కొత్త ప్లాన్‌ను తయారుచేసారా? ఏ విధంగా జైపూర్ అంతర్జాతీయ స్థానమో మరి అలా తక్కువలో తక్కువ ఇప్పటివరకూ ఎవరూ చేయనటువంటి ఏదో ఒక విశేషతను తప్పకుండా చేయండి. ముఖ్యమైన స్థానములో చాలా సుందరమైన పెద్ద బోర్డు పెట్టండి. అదైతే చేయగలరు కదా! బోర్డ్ ఎంత ఆకర్షణీయంగా ఉండాలంటే నడుస్తూ, తిరుగుతూ అందరి యొక్క దృష్టి అటువైపుకు వెళ్ళాలి. దాని అలంకరణ మరియు వ్రాయబడిన విషయం ఎలా ఉండాలంటే సంకల్పించకపోయినా అందరూ దానిని తప్పకుండా చూడాలి. మ్యాటర్ కూడా ఎటువంటిది తయారుచేయాలంటే దానిని చూసి అందరూ ఇది చేయాలి, అక్కడకు వెళ్ళాలి అని భావించాలి. అలా నడుస్తూ, తిరుగుతూ సందేశము లభిస్తూ ఉండాలి. అందులో చిరునామా ఉండాలి. అలాగే అక్కడి విశేషమైన ఆహ్వానము కూడా ఉండాలి. ఇలా తక్కువ పదాలతో ఆకర్షణీయమైన మ్యాటర్ను తయారుచేయండి మరియు బోర్డ్ యొక్క అలంకరణ యొక్క ప్లాన్‌ను తయారుచేయండి. దాని ద్వారా అనేకులకు సందేశము లభిస్తూ ఉంటుంది. ఇటువంటి ముఖ్యమైన స్థానాలపై ఖర్చు జరిగినా నష్టమేమీ లేదు. మరి ఇప్పుడు ఇది చేసి చూపించండి. ఏదైనా కొత్త ఇన్వెన్షనన్ను కనుగొనండి, చూడాలనుకోకపోయినా అది అందరినీ మెరుస్తూ ఆకర్షించాలి. ఇటువంటి ప్లాను ఏదైనా తయారుచేయండి. చిరునామా, ఫోన్ నెంబర్.. అన్నీ వ్రాయబడి ఉండాలి. ఆహ్వానము కూడా ఉండాలి. తద్వారా ఎవరో ఒక విశేషమైన ఆత్మ మేల్కొంటారు. ఎక్కడైతే ముఖ్యంగా అందరూ రావడం, పోవడం ఉంటుందో, అందరి దృష్టి వెళ్ళే స్థానంలో అటువంటి స్థానములో ఏదైనా చేయండి, కానీ ఎంత ఆకర్షణీయంగా ఉండాలంటే దానిని చూడకుండా ఎవరూ ఉండలేకపోవాలి. అచ్చా - ఇంకొకటి ఏమి చేస్తారు? ఎవరో ఒక విశేష ఆత్మ చేత ప్రతి నెలా యాత్రను తప్పకుండా చేయించాలి. ఇటువంటి లక్ష్యాన్ని ఉంచండి. బస్ నింపుకొని రాకపోయినా ఒకరిద్దరినైనా తీసుకురాగలరా? ఎటువంటి విశేష ఆత్మను తీసుకురావాలంటే, తాను అనేకులకు సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్తముగా అయిపోవాలి. సాధనాలన్నీ ఉన్నాయి. కానీ కేవలం చేసేవారు చేసినట్లయితే సహజమైపోతుంది. ఒకసారి సంపర్కములోకి తీసుకువచ్చి వదిలివేయకండి. పదే, పదే సంపర్కమును ఉంచుతూ ఉండండి. ఇటువంటి సంపర్కము వారు చెబితే ఒప్పుకోకపోవడం అనేది జరుగదు, మరేమి చేస్తారు? ఎల్లప్పుడూ నేనే చేయాలి అని భావించండి. ఇతరులను చూడకండి. ఇందులో ఎవరు చేస్తారో వారే అర్జునులు. నన్ను చూసి ఇతరులు చేస్తారు. మరి అప్పుడు ఏమవుతుంది? నేను చేయాలి. అప్పుడు అందరూ చేయడం మొదలుపెడతారు అని ప్రతి ఒక్కరూ ఈ పాఠమును చదవండి. ఇందులో ఇతరులను చూడకుండా స్వయమును మైదానములోకి తీసుకురండి, అచ్ఛా స్వయములోనైతే సరిగ్గానే ఉన్నారు. ఇక సేవలో కూడా నెంబర్ వన్ గా అవ్వండి. సేవలో కూడా పూర్తి మార్కులను తీసుకోవాలి, అచ్చా!

టీచర్లతో - టీచర్లకు డబుల్ ఛాన్స్ లభించింది. డబుల్ ఛాన్స్ ఎందుకు లభిస్తుందంటే వారు అనేకులకు పంచుతారు. ఎందుకంటే శిక్షకులు అనగా సదా ఇతరుల సేవ కొరకు జీవించేవారు. శిక్షకుల యొక్క జీవితము సదా ఇతరులకు నేర్పించేందుకే ఉంటుంది. అది స్వయం కొరకు కాదు. సేవ కొరకు ఉంటుంది. ఎప్పుడైతే మాస్టర్ శిక్షకులు లేక సత్యమైన సేవాధారులు సదా ప్రతి క్షణమూ మరియు ప్రతి సంకల్పము ఇతరులను చదివించేందుకే ఉన్నాయి అని భావిస్తారో, అటువంటి లక్ష్యమును ఉంచుతారో అప్పుడు అటువంటి మాస్టర్ శిక్షకులు లేక సేవాధారులు సదా సఫలతా మూర్తులుగా ఉంటారు. జీవించడమూ సేవయే, నడవడమూ సేవయే, మాట్లాడడం, ఆలోచించడం.. అన్నీ సేవ కొరకే. ప్రతి నరనరంలోనూ సేవ యొక్క ఉల్లాసము మరియు ఉత్సాహము నిండి ఉండాలి. ఏవిధంగా నరాలలో రక్తం ప్రవహిస్తూ ఉంటేనే జీవితము ఉంటుందో అలాగే సేవాధారులలో ప్రతి నరము అనగా ప్రతి సంకల్పములో ప్రతి క్షణమూ సేవ యొక్క ఉల్లాస, ఉత్సాహాలనే రక్తము నిండి ఉండాలి. మీరు ఇటువంటి సేవాధారులే కదా! గుడ్ నైట్ చెప్పినా సేవయే, గుడ్ మార్నింగ్ చెప్పినా సేవయే. అందులో స్వయము యొక్క సేవ స్వతహాగానే ఇమిడి ఉంటుంది, కావున అటువంటివారినే సత్యమైన సేవాధారులు అని అంటారు. సేవాధారుల యొక్క స్వప్నాలు కూడా ఎలా ఉంటాయి? సేవతో కూడుకొన్నవే ఉంటాయి. వారు స్వప్నములో కూడా సేవయే చేస్తూ ఉంటారు. మీరు అటువంటివారేకదా? సేవాదారులకు లిఫ్ట్ కూడా చాలా ఎక్కువగా లభిస్తుంది. ప్రాపంచికమైన అనేక బంధనాల నుండి మీరు ముక్తులుగా ఉన్నారు. ఇక్కడే జీవన్ముక్త స్థితి యొక్క ప్రాప్తి ఉంది. సేవాధారులు అంటేనే బంధనముక్తులు, జీవన్ముక్తులు. ఎన్ని హద్దులోని బాధ్యతల నుండి మీరు విముక్తులయ్యారు మరియు అలౌకిక బాధ్యత కూడా తండ్రిదే కదా! దాని నుండి కూడా మీరు విముక్తులయ్యారు. కేవలం సేవ చేయండి, ముందుకు వెళ్ళండి. బాధ్యత యొక్క భారము కూడా లేదు. ఎవరిపైనైనా ఏదైనా భారము ఉందా? సెంటర్ యొక్క భారము ఉందా? సెంటర్‌ను నడిపే భారమూ లేదు. జిజ్ఞాసువులు ఎలా వస్తారు? అన్నచింత ఉంటుందా? (ఉంటుంది). అదికూడా భారమే కదా!

ఎప్పుడైతే నేను వృద్ధి చేసే దానను కాను, బాబా యొక్క స్మృతి ద్వారా స్వతహాగానే వృద్ధి జరుగుతుంది అని భావిస్తారో అప్పుడే సఫలత కూడా లభిస్తుంది. నేను పెంచుతున్నాను అని భావించినట్లయితే అది పెరగజాలదు. బాబాకు భారమును ఇచ్చేసినట్లయితే అది పెరుగుతూ ఉంటుంది. కావున దీని నుండి కూడా నిశ్చింతులుగా ఉండాలి. ఎంతగా స్వయం తేలికగా ఉంటారో అంతగా సేవ మరియు స్వయము సదా పైకి ఎదుగుతూ ఉంటారు అనగా ఉన్నతిని పొందుతూ ఉంటారు. ఎప్పుడైతే నేను అనేది వస్తుందో అప్పుడు భారము పెరుగుతుంది మరియు కిందకు వచ్చేస్తారు. కావున సదా భారము నుండి కూడా నిశ్చింతులుగా అవ్వండి. కేవలం సదా స్మృతి యొక్క నషాలో ఉండండి. సదా బాబాతో పాటు కంబైన్డ్ గా ఉన్నట్లయితే ఎక్కడైతే బాబా కంబైన్డ్ గా ఉంటారో అక్కడ సేవ ఎంతటిది? అది స్వతహాగానే ఉంటుంది కదా! మీరు అనుభవజ్ఞులే కదా? కావున శిక్షకులు అనగా సేవాధారులకు ఇది కూడా లిఫ్ట్ అవుతుంది కదా! స్మృతిలో ఉండండి మరియు ఎగురుతూ ఉండండి. సేవ కొరకు నిమిత్తులుగా ఉన్నారు, చేయించేవారు చేయిస్తున్నారు అని భావించండి. అప్పుడు తేలికగానూ ఉంటారు మరియు సఫలతా మూర్తులుగానూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడైతే తండ్రి ఉంటారో అక్కడ సఫలత లభించి తీరుతుంది. అచ్ఛా

బాప్ దాదా తమ తోటివారిని చూసి ఎంతో సంతోషిస్తారు. మీరు మాస్టర్ భాగ్య విధాతలు. భాగ్య విధాతను స్మృతి చేసి అనేకుల భాగ్యము యొక్క భాగ్యరేఖను దిద్దుతారు. మీరు సదా సంతుష్టులే. అది అడుగవలసిన అవసరం ఉందా? మాస్టర్ శిక్షకులను అడగడం కూడా అవమానపరచడమే అవుతుంది కదా! మీరు సదా సంతుష్టులే మరియు సదా సంతుష్టముగానే ఉంటారు, అచ్ఛా

మహారాష్ట్ర మరియు రాజస్థాన్ యొక్క మేళా పూర్తయ్యిందా? ఈ రోజు కూడా డ్రామాలో రచింపబడుతోంది. ఇది మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ప్రతి ఘడియకూ, ప్రతి క్షణానికీ కూడా తనదైన మహత్వము ఉంది. సంగమయుగమే మహత్వపూర్ణమైన యుగము, మహాన్ గా అయ్యే యుగము మరియు మహాన్ గా తయారుచేసే యుగము. కావున సంగమయుగము యొక్క ప్రతి క్షణానికీ మహత్వము ఉంది. సంగమయుగములో శిక్షకులు అనగా సేవాధారులుగా అవ్వడంలో మహత్వము ఉంది. అలాగే ప్రవృత్తిలో ఉంటూ కూడా అతీతముగా ఉండడంలో కూడా మహత్వము ఉంది. గోపికలుగా అవ్వడంలోనూ మహత్వము ఉంది. పాండవులుగా అవ్వడంలోనూ మహత్వము ఉంది. ప్రతి ఒక్కరికీ వారి, వారి మహత్వము ఉంది. కానీ నిమిత్తులైన శిక్షకులకు అవకాశం చాలా బాగుంది. కావున అందరూ అవకాశమును తీసుకొనేవారే కదా! అచ్చా-ఓం శాంతి.

Comments