23-01-1980 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
పవిత్రత యొక్క మహాత్యము.
బాప్ దాదా తన మహాన్ ఆత్మలను, ధర్మాత్మలను, పుణ్యాత్మలను మహాన్ పవిత్ర ఆత్మలందరినీ చూసి హర్షిస్తున్నారు. పరమాత్మ పిల్లలు పరమ పవిత్ర పిల్లలుగా ఉంటారు. పవిత్రతయే మహానత. పవిత్రతతో గొప్పతనముంది. పవిత్రతకే గౌరవముంది. పవిత్రత కారణంగానే పరమ పూజ్యులుగా, కీర్తనకు యోగ్యులుగా అవుతారు. పవిత్రతయే శ్రేష్ఠమైన ధర్మము అనగా ధారణ. "పవిత్రతను దానం ఇవ్వడము" ఈశ్వరీయ సేవలో అత్యంత శ్రేష్ఠమైన పుణ్యము. పవిత్రంగా తయారు చేయుటే పుణ్యాత్మగా తయారు చేయడం, ఎందుకంటే ఏ ఆత్మనైనా ఆత్మహత్యా మహా పాపం నుండి విడిపిస్తారు. అపవిత్రమగుట అనగా ఆత్మహత్య చేసుకోవడం. పవిత్రత ప్రాణదానం అవుతుంది. పవిత్రంగా చేయడం అనగా పుణ్యాత్మగా తయారు చేయుట. గీతాజ్ఞానం లేక వర్తమాన సమయంలో పరమాత్మ జ్ఞానాన్ని సార రూపంలో చెప్పే స్లోగన్ కూడా పవిత్రత మహాత్యం గురించి చెప్తుంది. "పవిత్రులు కండి - యోగులు కండి" ఈ స్లోగనే మహాన్ ఆత్మగా కావడానికి ఆధారము, బ్రాహ్మణ జీవితం యొక్క పురుషార్థము నెంబర్ కూడా పవిత్రత పైననే ఆధారపడి ఉంటుంది. భక్తి మార్గంలో స్మృతి చిహ్నాలు కూడా పవిత్రత ఆధారంగానే ఉంటాయి. ఏ భక్తులు కూడా మీ స్మృతి చిహ్న చిత్రాన్ని పవిత్రత లేకుండా తాకను కూడా తాకలేరు. ఏ రోజు విశేషించి దేవీ దేవతల పండుగ జరుపుకుంటారో ఆ రోజు కూడా సదాకాలపు పవిత్రతకే మహత్వం ఇస్తారు. అయితే భక్తులు అల్పకాలిక ఉంటుంది. జ్ఞానం యొక్క అర్థము సదా కాలంగా ఉంటుంది. భక్తులు అల్పకాలిక నియమాలు పాటిస్తారు. ఉదాహరణానికి నవరాత్రి జరుపుకుంటారు. జన్మాష్టమి లేక దీపావళి లేక ఏ విశేష ఉత్సవం జరుపుకున్నా పవిత్రత నియమాన్ని అల్పకాలం కొరకు తప్పక పాలన చేస్తారు. శారీరిక పవిత్రత కావచ్చు లేక ఆత్మకు సంబంధించిన నియమాలు కావచ్చు. రెండు రకాల శుద్ధి(స్వచ్ఛతను) తప్పకుండా ఉంచుకుంటారు.
తమ స్మృతి చిహ్న విజయమాలను స్మృతి చేసినా, వారు పవిత్రతతో విధి పూర్వకంగానే స్మృతి చేస్తారు. మీరు సిద్ధి స్వరూపులుగా అవుతారు. సిద్ధి స్వరూపులైన ఆత్మల పూజ కూడా విధి పూర్వకంగానే ఉంటుంది. పవిత్రత మహత్యము తెలుసు కదా? అందువలన మొదట ముఖ్యమైన పేపర్ పవిత్రత గురించే చెక్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ పవిత్రత పేపర్‌ను పరిశీలించుకున్నారా, ప్రోగ్రాం ప్రమాణంగా ఉన్నతి అయితే చేసుకున్నారు. మొత్తం రిజల్ట్ లో అన్నిటి కంటే ఎక్కువగా కర్మణాలో శాతం బాగుంది. వాచాలో కర్మణా ఫలితం కంటే 25% తక్కువగా ఉంది. మనసాలో కర్మణా రిజల్ట్ కంటే 50% తక్కువగా ఉంది. మనసా సంకల్పాలకు, స్వప్నాలకు కొంచెం తేడా ఉంది. దీనిలో కూడా జన్మించిన తారీఖు నుండి ఇప్పటి వరకూ ఉన్న ఫలితంలో చాలా మంది పురుషార్థం చేయడంలో హెచ్చు తగ్గులున్నాయి. మచ్చ పడడం, చెరుపుకోవడం. అప్పుడప్పుడూ సంకల్పాలు రావడం, తొలగించుకోవడం జరుగుతూ ఉంది. అప్పుడప్పుడూ వాచాలో, కర్మణాలో మచ్చ పడినా మరలా తొలగించుకున్నారు. ఇలా తొలగించుకునే వారు, సమాప్తి చేసుకునేవారు చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది తీవ్ర పురుషార్థులను కూడా చూశారు. వారు తమ సంస్కారాలనే మచ్చలను తొలగించుకొని ఇప్పటి వరకు ఎలాంటి మచ్చలు అంటకుండా పూర్తిగా స్వచ్ఛమైన, శుద్ధమైన పేపర్ లాగా కనిపించారు. ఈ విధంగా స్వప్నం వరకు కూడా తొలగించుకున్నారు. గౌరవనీయంగా పాసయ్యే మహాన్ పవిత్రాత్మలను కూడా చూశారు. వారి విశేషత ఏమి చూశారు.
వారికి బ్రాహ్మణ జన్మ లభించినప్పటి నుండి ఇప్పటి వరకు పురుషార్థం చెయ్యాల్సిన అవసరమే లేదు. వారిలో బ్రాహ్మణ జీవితపు విశేష లక్షణము - బ్రాహ్మణ ఆత్మల అనాది-ఆది సంస్కారం ఉంది. ఇలాంటి సహజ సంస్కారాలున్నందున స్వప్నంలో, సంకల్పంలో కూడా వారికి అపవిత్రత ఎమర్జ్ కాలేదు. సంకల్పాలు రావడం, విజయులుగా కావడం అనే దానికంటే సహజ సంస్కార రూపంలో పవిత్ర సంకల్పాలు నడిచాయి. ఈ సబ్జెక్ట్ లో పురుషార్థం చెయ్యాల్సిన అవసరం రాలేదు. ఇలాంటి పరమ పూజ్య సంస్కారం కల్గిన వారిని కూడా చూశారు. కానీ అటువంటి వారిని చాలా తక్కువ మందిని చూశారు. జ్ఞానవంతులై ఇతరులకు పవిత్రంగా అయ్యే విధిని చెప్తూ, ఇతరుల బలహీనతలను వింటూ వారికి తండ్రి శ్రీమతం ఇస్తూ, స్వయం సదా వింటూ, తెలుసుకుంటూ అన్నీ చేస్తూ సదా స్వచ్ఛంగా ఉన్నారు. అనగా పవిత్రతా సబ్జెక్ట్ సిద్ధిస్వరూపులుగా ఉన్నారు. అందువలన ఇలాంటి పరమ పవిత్ర ఆత్మల పూజ కూడా సదా విధి పూర్వకంగా జరుగుతుంది. అష్టదేవతల రూపంలో కూడా పూజ జరుగుతుంది. అష్ట శక్తుల ప్రత్యక్ష స్వరూపంగా, అష్ట దేవతలుగా ప్రత్యక్షమవుతారు. కావున పేపర్ల ఫలితం విన్నారా.
కావున మనసు పరివర్తన అగుటకు డబల్ అటెన్షన్ ఇవ్వండి. సంపన్నంగా అయ్యే వరకు సంకల్పాలు వస్తూనే ఉంటాయి అని అనుకోకండి. సంకల్పం అనగా బీజాన్ని కూడా యోగాగ్నిలో కాల్చేయండి. అర్ధకల్పం వరకు ఆ బీజము ఫలమునివ్వరాదు. వాచాలో ముఖ్యమైన రెండు ఆకులు కూడా రాకూడదు. కర్మణా అనే కాండము, కొమ్మలు, రెమ్మలు కూడా రాకూడదు. చాలా కాలం భస్మమైన బీజం జన్మజన్మాంతరాల వరకు ఫలం ఇవ్వదు. అంతిమంలో ఈ సబ్జెక్టులో సంపూర్ణమగుట కాదు. చాలా కాలపు అభ్యాసమే అంతిమంలో పాస్ చేయిస్తుంది. అంతిమంలో సంపూర్ణం అవుతామనే సంకల్పాన్ని మొదటనే సమాప్తి చెయ్యండి. ఇప్పుడు తయారైతే అంతిమంలో కూడా తయారవుతారు. ఇప్పుడు కాకుంటే అంతిమంలో కూడా కాలేరు. అందువలన ఈ నిర్లక్ష్యం అనే నిద్ర నుండి మేల్కోండి. దీనిలో కూడా నిద్రపోతే పోగొట్టుకున్నట్లే మేము అంతిమంలో సంపూర్ణమవుతామని అనుకున్నామని ఫిర్యాదు చెయ్యకండి. అంతిమంలో సంపూర్ణంగా అవ్వడమంటే ఏమిటో అర్థం చేసుకోండి ఏ విశేష బలహీనతనైనా అంతిమంలో సంపూర్ణం చేసుకుంటాము అనే సంకల్పం ఎప్పుడూ రానివ్వకండి. పురుషార్థం చేసి బ్రాహ్మణ జీవితం యొక్క నగలను కూడా ఇప్పుడు తయారు చేసుకోవాలి. మర్యాదలను, నియమాలను పాలన చేసే ఆ మెరుపును(నగిషిని) కూడా ఇప్పటి నుండి తీసుకొచ్చుకోవాలి. పాలిష్ కూడా ఇప్పుడే చేసుకోవాలి. అంతిమంలో కేవలం పాలిష్ చేసిన దానిని నిమిత్త మాత్రముగా తుడవాలి, అంతే. ఆ సమయంలో పాలిష్ కూడా చేయలేరు. కేవలం ఇతర ఆత్మల శ్రేష్ఠ సేవ కొరకు మాత్రమే సమయం లభిస్తుంది. ఆ సమయంలో పురుషార్థ స్వరూపం ఉండదు. మాస్టర్ దాతా స్వరూపం ఉంటుంది. ఇవ్వడమే తీసుకోవడం. కేవలం తీసుకోవడం మాత్రమే సమాప్తమైతే పాలిష్ ఎలా చేస్తారు. తమలో ఆ మెరుపును నింపుకోవడంలో నిమగ్నమై ఉంటే విశ్వకళ్యాణకారీ పాత్రను అభినయించలేరు. అందువలన ఇప్పుడు మాస్టర్ రచయితలుగా అయ్యే సంస్కారాన్ని ధారణ చెయ్యండి. బాల్య సంస్కారాన్ని సమాప్తి చెయ్యండి. మాస్టర్ రచయితగా అయ్యి ప్రాప్తించిన శక్తులు లేక ప్రాప్తించిన జ్ఞానము, గుణాలు లేక సర్వ ఖజానాలను ఇతరుల పట్ల వరదానులుగా అయ్యి మహాజ్ఞానులుగా, మహాదానులుగా అయ్యి ఇస్తూ వెళ్ళండి. వరదానీ అనగా తమ శక్తుల ద్వారా వాయుమండల ప్రభావం, వైబ్రేషన్ల ప్రభావం ద్వారా ఆత్మలను పరివర్తన చెయ్యడం. మహాన్ జ్ఞానులనగా వాచా ద్వారా లేక సేవా సాధనాల ద్వారా ఆత్మలను పరివర్తన చెయ్యడం. మహాదానులనగా పూర్తి బలహీనులుగా, మనసు బలహీనంగా ఉన్న అసమర్థ ఆత్మలకు అదనపు బలాన్నిచ్చి ఆత్మిక దయాహృదయులుగా అవ్వడం. మాయపై కూడా దయాహృదయులుగా అవుతారు. ఎవరైనా తప్పు పని చేస్తూ ఉంటే వారిపై దయ చూపుతూ ఉంటే అది మాయపై దయ చూపినట్లవుతుంది. ఇలాంటి సమయంలో లాఫుల్ గా కూడా కావాల్సి ఉంటుంది. అక్కడ ఆకర్షణ ఉంటుంది కాని దానిని దయ అని అనుకుంటారు. దీనినే మాయపై దయ చూపించడం అని అంటారు. ఇలాంటి దయాహృదయులుగా అవ్వకండి. అందువలన ఆత్మిక దయాహృదయులుగా అవ్వాలి. లేకపోతే శబ్దాన్ని లాభదాయకంగా తీసుకుంటారు. కావున మహాదానీ అనగా పూర్తిగా నిరాశ(హోప్ లెస్) కేసులో ఆశను ఉత్పన్నం చేసేవారు. తమ శక్తుల ఆధారంతో వారికి సహయోగాన్ని ఇవ్వాలి. అనగా మహాదానం చెయ్యాలి. ఇది ప్రజల కొరకు మహాదానం. వారస్ క్వాలిటీ వారిపట్ల మహాదానిగా కాదు. దానం సదా పూర్తి పేదవారికే ఇవ్వడం జరుగుతుంది. ఆధారం లేనివారికి ఆధారం ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రజల పట్ల మహాదానులుగా లేక అంతిమంలో భక్త ఆత్మల పట్ల మహాదానులుగా అవ్వాలి. పరస్పరంలో బ్రాహ్మణులు ఒకరి పట్ల ఇంకొకరు మహాదానులుగా కారు. మీరు పరస్పరం సహయోగులు, సాథీలు, భాయీ-భాయీ (సోదరులు), సమాన పురుషార్థులు. కావున వారికి సహయోగమివ్వండి, దానం కాదు. అర్థమయిందా! కావున ఇప్పుడీ సంకల్పాన్ని కూడా సమాప్తం చెయ్యండి. ఎప్పుడో అవుతామనే శబ్ధము కూడా సమాప్తం చెయ్యండి. తీవ్ర పురుషార్థులు ఎప్పుడు అని అనరు కానీ ఇప్పుడే అని అంటారు. కావున సదా తీవ్ర పురుషార్థిగా కండి.
సదా విశ్వకల్యాణకారులకు, మహాన్ పవిత్ర ఆత్మలకు, సంకల్పం లేక స్వప్నంలో కూడా అపవిత్రత నుండి అతీతంగా ఉండే పరమపూజ్యులకు, ఇప్పుడు కూడా గౌరవనీయులు, గాయనయోగ్యులుగా, కర్మయోగులుగా సదా సంకల్పం మరియు స్వరూపం ద్వారా సేవాధారులుగా ఉన్న పుణ్యాత్మలకు, వరదానీ మహాదానీ పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో- అందరూ ఎవరెడీగా మరియు ఆల్‌రౌండర్ గా ఉన్నారా? ఎవరెడీ అనగా ఆర్డర్ వచ్చిన వెంటనే బయలుదేరేవారు అనగా ఆర్డర్ లభించగానే అలాగే(హాజీ) అనేవారు. ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని అడగరు. ఏమవుతుంది, ఎలా అవుతుంది, నడుస్తామో లేక నడవలేమో అని సంకల్పం వస్తే వారిని ఎవరెడీగా ఉన్నారని అనరు. తీవ్రపురుషార్థుల విశేషత ఎవరెడీ మరియు ఆల్‌రౌండర్. మనసా సేవకు అవకాశం లభించినా, వాచా సేవకు అవకాశం లభించినా లేక కర్మణా సేవకు అవకాశం లభించినా ప్రతి సబ్జెక్ట్ లో నంబర్ వన్ గా ఉండాలి. వాచా సేవలో నంబర్‌వన్‌గా, కర్మణా సేవలో నంబర్ రెండుగా, మనసా సేవలో మూడవ నెంబరుగా ఉండరాదు. ఎంత స్నేహంతో వాచా సేవ చేస్తారో అంత స్నేహంతోనే మనసా సేవ కూడా చేయగలగాలి. మనసా సేవ చేసే అభ్యాసాన్ని పెంచండి. వాచా సేవ 7 రోజుల కోర్సు కుటుంబంలో ఉన్నవారు కూడా చెయ్యగలరు. మీ పని వాతావరణాన్ని శక్తిశాలిగా తయారు చెయ్యడం. మీ స్థానం, పట్టణం, భారతదేశం లేక విశ్వ వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారు చెయ్యడం. మనసా సేవలో సఫలత లభిస్తుందో లేదో చెక్ చేసుకోండి. మనసా సేవలో సఫలత లభిస్తూ ఉంటే సదా స్వయం మరియు సేవాకేంద్రం నిర్విఘ్నంగా ఉన్నతి చెందే కళలో ఉంటుంది. వృద్ధి కళ అనగా సంఖ్య వృద్ధి అగుట కాదు. వృద్ధికళ సంఖ్యలో కూడా, క్వాలిటీలో కూడా ఉండాలి. అంతేకాక వాతావరణం మరియు స్వయం మీతోడుగా ఉన్నవారిది కూడా వృద్ధికళగా ఉండాలి. దీనినే వృద్ధికళ అని అంటారు. కావున ఇలాంటి అనుభవం చేస్తున్నారా? అమృతవేళ స్వయం శక్తిశాలిగా ఉన్నారా? అమృతవేళ సోమరితనం విఘ్నంగా అవుతుందని అనడం లేదు కదా. విశ్వానికి లైట్ మరియు మైట్ ల వరదానం ఇచ్చే విధంగా అమృతవేళ ఉండాలి. అమృతవేళ స్మృతిలో స్వయానికి స్వయం సంతుష్టంగా ఉన్నారా?
ముఖ్యమైన సబ్జెక్ట్ "స్మృతి". బాప్ దాదా చక్రం తిరిగినప్పుడు కొంచెం శక్తిశాలీ వైబ్రేషన్ల లోపం కనిపిస్తూ ఉన్నది. నేమీనాథ్ గా అయితే అవుతారు అనగా నియమానుసారం కూర్చుంటారు కానీ అనుభవీమూర్తిగా కండి. నియమ ప్రమాణంగా అన్నప్పుడు అది బలవంతమైతుంది కదా! ఒకవేళ అనుభవమైతే తమంతకు తామే కూర్చుంటారు. ఏ విషయం అనుభవమవుతుందో వద్దనుకున్నా అది తనవైపు లాక్కుంటుంది. ఎలాగైతే వాచా సేవ ద్వారా ఖుషీ అనుభవమైనప్పుడు వద్దనుకున్నా ఆ వైపు పరుగెడతారు కదా! అలాగే అమృతవేళను శక్తిశాలిగా తయారు చేసుకోండి. దాని ద్వారా మనసా సేవలో కూడా అనుభవాన్ని పెంచుకోగలరు. అంతిమంలో వాచా సేవకు అవకాశముండదు. మనసా సేవలో కూడా సర్టిఫికెట్ లభిస్తుంది. ఎందుకంటే ఎంత పెద్ద క్యూ ఉంటుందంటే, మీరు మాట్లాడను కూడా మాట్లాడలేరు. ఇప్పుడు కూడా మేళా చేస్తున్నప్పుడు, గుంపు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? శాంతితో వారికి శుభ భావన మరియు శుభ కామనలతో దృష్టినిస్తారు కదా. కావున అంతిమంలో కూడా తమ ప్రభావం వెలువడినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు స్థూల లైట్ ప్రభావంతో వస్తారు. ఆ సమయంలో తమ ఆత్మిక లైట్ ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో మనసా సేవ చెయ్యాల్సి ఉంటుంది. దృష్టితోనే తృప్తి పరచాల్సి ఉంటుంది. తమ వృత్తితో వారి వృత్తిని పరివర్తన చేయాల్సి ఉంటుంది. తమ స్మృతితో వారిని సమర్థంగా చెయ్యాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఉపన్యసిస్తారా? కనుక మనసా సేవ చేసే అభ్యాసం తప్పకుండా చెయ్యాలి. ఇతరులకు చెప్పగలిగే అనుభవీ మూర్తులుగా అవ్వండి, అది కూడా స్వంత అనుభవం ఆధారంతో చెప్పండి. అర్థమయిందా? మనసా సేవను పెంచండి. ఇప్పుడు నిర్విఘ్న వాయుమండలాన్ని తయారు చెయ్యండి. దీనిలో ఏ ఆత్మకు కూడా విఘ్న రూపంగా అయ్యే ధైర్యం ఉండరాదు. విఘ్నం వచ్చింది, దానిని తొలగిస్తారు. ఇందులో కూడా సమయం వృథా అవుతుంది కదా! కావున ఇప్పుడు కోటను దృఢంగా చెయ్యండి. పరస్పరం స్నేహీ, సహయోగులై నడిచినట్లయితే అందరూ ఫాలో చేస్తారు(అనుసరిస్తారు). స్వయం మీరెలా చేస్తే అలా అందరూ మిమ్ములను అంగీకరిస్తారు.
2. అందరూ అంగదుని సమానం అచలంగా, స్థిరంగా ఉండేవారే కదా! రావణ రాజ్యం యొక్క ఏ పరిస్థితి అయినా, వ్యక్తి అయినా సంకల్ప రూపంలో కూడా కదిలించరాదు. మీ కాలి గోటిని కూడా కదిలించరాదు. సంకల్పంలో కదలడం అనగా గోరు కదలడము. కావున సంకల్ప రూపంలో కూడా వ్యక్తి గాని, పరిస్థితి గాని కదిలించరాదు. అప్పుడప్పుడూ ఎవరైనా సంబంధీకులు లేక దైవీ పరివారం వారు నిమిత్తంగా అవుతారు, విఘ్నరూపంగా అవుతారు. కానీ అంగదుని సమానంగా సదా అచంచలంగా ఉండే వ్యక్తి విఘ్నాలను, పరిస్థితులను దాటుకుంటారు. ఎందుకంటే జ్ఞానవంతులుగా ఉంటారు. ఈ విఘ్నము ఎందుకు వచ్చిందో వారికి తెలుస్తుంది. ఈ విఘ్నాలు పడేయుటకు కాదు కానీ ఇంకా దృఢంగా తయారు చెయ్యడం కొరకు వస్తాయి. వారు కన్ ఫ్యూజ్ కారు. ఉదాహరణానికి పరీక్ష హాలులో పేపర్ వచ్చినప్పుడు బలహీన విద్యార్థికన్ ఫ్యూజ్ అవుతాడు. మంచి విద్యార్థి పేపరు చూసి సంతోషిస్తాడు. ఎందుకంటే ఈ పరీక్ష పాసై పై క్లాసుకు వెళ్తానని బుద్ధిలో ఉంటుంది. వారికి కష్టమనిపించదు. బలహీనులు ప్రశ్నలనే లెక్క పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రశ్న ఎందుకు వచ్చింది? ఇది ఎవరు ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఎవరైనా నిమిత్త పేపర్ గా అయ్యి వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకిలా చేస్తారు? ఇలా చెయ్యకూడదు కదా అనే ప్రశ్నలు రాకూడదు. ఏది జరిగినా మంచియే జరిగింది, అని మంచిని తీసుకోండి. ఉదాహరణానికి హంస ముత్యాలను ఏరుకుంటుంది కదా. రాళ్ళను వేరు చేస్తుంది. పాలను నీటిని వేరు చేస్తుంది. పాలను తీసుకొని నీటిని వదిలేస్తుంది. ఏదైనా విషయం ముందుకు వస్తే నీరు అనుకొని వదిలేయండి. ఎవరు కలిపారు? ఎందుకు కలిపారు? ఇలా కాదు. ఇందులో కూడా సమయం వృధా అవుతుంది. ఒకవేళ ఎందుకు, ఏమి? అనుకుంటూ పరీక్ష అంతిమ సమయం అయిపోతే ఫెయిల్ అయిపోతారు. వృధా చేశారంటే ఫెయిల్ అయిపోతారు. ఎందుకు, ఏమిటి అనే దానిలో శ్వాస పోయినట్లయితే ఫెయిల్ అవుతారు. ఏ విషయంలో అయినా ఫీల్ కావడం అనగా ఫెయిల్ అవ్వడం. మాయ పులి రూపంలో వచ్చినా మీరు యోగాగ్నిని వెలిగించి ఉంచండి. అగ్ని ముందు ఏ భయంకరమైన పులి లాంటి వస్తువు కూడా దాడి చెయ్యలేదు. సదా యోగాగ్ని వెలుగుతూ ఉంటే మాయ ఏ రూపంలోనూ రాలేదు. అన్ని విఘ్నాలు సమాప్తమైపోతాయి.
Comments
Post a Comment