23-01-1976 అవ్యక్త మురళి

23-01-1976         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

అంతిమ స్థితి యొక్క పురుషార్థం.

          అతీతమైన వ్యాయామం (డ్రిల్) నేర్పించేవారు, సుఖశాంతి దాత, సర్వుల మనోకామనలు పూర్తి చేసే దివ్య జ్యోతిబిందు స్వరూప శివబాబా మాట్లాడుతున్నారు -
             ప్రత్యక్షతా సంవత్సరం జరుపుకోవటానికి బాప్ దాదాని వార్తాపత్రికల ద్వారా, కార్డుల ద్వారా విశేష రూపంలో ప్రత్యక్షం చేయటానికి ప్రయత్నించారు. ఇవి కూడా సేవకి అవసర సాధనాలు. కానీ ఈ వార్తాపత్రికలు లేదా కార్డులు మొదలైనవి రోజు చూస్తారు, చదువుతారు,వింటారు, ఆ తర్వాత అది స్మృతిలో నిండిపోతుంది. సమాప్తి అని అయితే అనకూడదు, ఎందుకంటే సమయానికి ఆ స్మృతి స్వరూపంలోకి వస్తుంది. అందువలన సమాప్తి అని అనకూడదు, నిండింది అని అనాలి. వీటి ద్వారా కూడా భూమిలో ఎంతోకొంత అయినా స్నేహం మరియు పరిచయం యొక్క నీరు అయితే పడింది. కానీ ఆ బీజం నుండి ప్రత్యక్షతా ఫలం ఎలా వస్తుంది? నీళ్ళు అయితే వేశారు, ఎందుకు వేశారు? ఫలం కోసం. కానీ ఆ ఫలం ఎలా వస్తుంది? అంటే సంకల్పం ప్రత్యక్ష స్వరూపంలోకి ఎలా వస్తుంది? దీని కొరకు అయితే సదాకాలికంగా ఇక కార్డులు ముద్రిస్తూనే ఉండరు కదా!
         ఈరోజుల్లో ఎక్కువమంది ఆత్మల కోరిక ఏమిటి? సుఖ శాంతులు పొందాలనే కోరిక అయితే ఉంది. కానీ విశేష భక్తాత్మల కోరిక ఏమిటి? ఎక్కువమంది భక్తుల యొక్క కోరిక ఏమిటంటే ఒక్క సెకండు అయినా ప్రకాశం చూడాలని (సాక్షాత్కారం). మరయితే ఆ కోరిక ఎలా పూర్తి అవుతుంది? వారి కోరిక పూర్తి అయ్యే సాధనం - బ్రాహ్మణుల యొక్క నయనాలు. ఈ నయనాల ద్వారా బాబా యొక్క జ్యోతి స్వరూపం సాక్షాత్కారం అవ్వాలి. ఈ నయనాలు నయనాలుగా కనిపించవు, రెండు కాంతిగోళాలుగా కనిపిస్తాయి. ఆకాశంలో నక్షత్రాలు ఎలా మెరుస్తాయో అలాగే ఈ కళ్ళు సితారల వలె మెరుస్తూ కనిపించాలి. కానీ అలా ఎప్పుడు కనిపిస్తాయంటే స్వయం ప్రకాశ (లైట్) స్వరూపంలో స్థితులైనప్పుడు. కర్మలో కూడా లైట్‌గా అంటే తేలికగా మరియు స్వరూపంలో లైట్‌గా, స్థితి కూడా లైట్‌గా ఉండాలి. ఎప్పుడైతే ఇటువంటి పురుషార్థం,స్థితి, స్మృతి విశేషాత్మలకు ఉంటుందో ఆ విశేష ఆత్మలను చూసిన పురుషార్థీలందరికీ కూడా ఇదే పురుషార్థం ఉంటుంది. మాటిమాటికి కర్మ చేస్తూ పరిశీలించుకోండి - కర్మలో తేలికతనం ఉందా? కర్మ యొక్క భారం లేదు కదా? కర్మభారం తన వైపు లాక్కుంటుంది. ఒకవేళ కర్మలో ఆ భారం లేకపోతే అది తన వైపు లాగకపోతే అది కర్మయోగంలోకి పరివర్తన అయిపోతుంది.
           ప్రత్యక్షతా సంవత్సరం జరుపుకోవాలనే స్వరూపం మరియు సాధనాలు ఇవన్నీ అందరి బుద్ధిలో ఉన్నాయా? అటువంటి ప్లాన్ తయారుచేస్తారు కదా? సాకారంలో చూశారు కదా, ఎంతగా అతి కర్మలోకి వచ్చినా, విస్తారంలోకి వచ్చినా, రమణీయతలోకి వచ్చినా సంబంధ సంప్రదింపులోకి  వచ్చినా అంతగానే అన్నింటికీ అంతే అతీతంగా అయిపోవాలి. సంబంధంలోకి లేదా కర్మలోకి రావటం ఎంత సహజమో, అతీతంగా అవ్వటం కూడా అంతే సహజం అనిపించాలి - ఇటువంటి  అభ్యాసం కావాలి. సమయం అతిగా ఉన్నప్పుడు సెకండు కూడా అతిగా వెళ్తుంది. ఇప్పుడిప్పుడే అతి. ఇప్పుడిప్పుడే అంతం. ఇదే అంతిమ సంవత్సరం యొక్క లేదా అంతిమ స్థితి యొక్క పురుషార్థం. అటువంటి ప్లాన్ తయారుచేయండి. ఇదే అతి మరియు అంతం యొక్క వ్యాయామం. దీనిని ప్రయత్నిస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే అతి సంబంధంలోకి రావాలి, మరలా ఇప్పుడిప్పుడే అంతగా అతీతం అయిపోవాలి. లైట్‌హౌస్ లో లీనమైపోవాలి, లైట్‌హౌస్ అంటే మీ జ్యోతిదేశం. ఇప్పుడిప్పుడే కర్మ క్షేత్రంలోకి రావాలి, మరలా ఇప్పుడిప్పుడే పరంధామం వెళ్ళిపోవాలి.

మాతలతో మధుర సంభాషణ చేస్తున్న సమయంలో చెప్పిన అవ్యక్త బాప్ దాదా యొక్క మధుర మహావాక్యాలు:-  దు:ఖం లేదా గ్లానిలో కూడా కళ్యాణం ఉంది. బాప్  దాదాకి ఆది నుండి మాతలంటే విశేష స్నేహం, యజ్ఞ స్థాపనలో కూడా విశేషంగా ఎవరి పాత్ర ఉంది? నిమిత్తంగా ఎవరయ్యారు? మరియు అంతిమంలో కూడా ప్రత్యక్షత లేదా విజయీ నినాదం మ్రోగించడానికి ఎవరు నిమిత్తమవుతారు? మాతలు. సంగమయుగంలో గోపికలకి విశేష పాత్ర ఉంది. గోపీ వల్లభుడు అనే మహిమ కూడా ఉంది కదా! మాతలకి సదా ఇదే కోరిక ఉంటుంది - శ్రేష్టమైనవారు నన్ను సొంతం చేసుకోవాలి, మంచి వరుడు లభించాలి, మంచి ఇల్లు లభించాలని. మరి బాబాయే వచ్చి తనవారిగా చేసుకున్నారంటే ఇంకేమి కావాలి? ఈ కళ్యాణకారీ యుగంలో ఏవైనా పరిస్థితులు వస్తే ఆ పరిస్థితులు చూడకుండా, వర్తమానం చూడకుండా, వర్తమానంలో ఉన్న భవిష్యత్తును చూడండి. ఎవరైనా దు:ఖం ఇస్తున్నారు లేదా గ్లాని చేస్తున్నారనుకోండి. దానిలో కూడా నా కళ్యాణం ఉంది అని అనుకోండి. అందులో ఉన్న కళ్యాణం ఏమిటంటే ఆ దు:ఖం లేదా గ్లాని సుఖదాత యొక్క స్మృతికి దగ్గరగా తీసుకువెళ్తుంది. బాహ్యరూపంతో చూడకండి, కళ్యాణ రూపంతో చూడండి. అప్పుడు ఏ పరిస్థితి కఠిన పరిస్థితిగా అనిపించదు. దీనితో మీ ఉన్నతి చేసుకోగలరు.

ఈ మురళి యొక్క సారం -
1. భక్తుల కోరిక ఒక సెకను అయినా లైట్ ని చూడాలని. దానిని పూర్తి చేసేసాధనం బ్రాహ్మణులైన మీ నయనాలు. ఈ నయనాలు నయనాలుగా కాదు, కాంతిగోళాలుగా కనిపించాలి. దీని ద్వారా బాబా జ్యోతి స్వరూపం సాక్షాత్కారం అవ్వాలి. .
2. అంతిమస్థితికి ఇదే పురుషార్థం - ఇప్పుడిప్పుడే అతి మరియు ఇప్పుడిప్పుడే అంతం. ఏవిధంగా అయితే కర్మలోకి సంబంధంలోకి రావటం సహజమో అదేవిధంగా అతీతంగా అవ్వటం కూడా సహజం .
3. ఎటువంటి దు:ఖం వచ్చినా, గ్లాని జరిగినా దానిలో కూడా మీ కళ్యాణం అని భావించండి. ఈ దు:ఖం లేదా గ్లాని కూడా సుఖదాత యొక్క స్మృతికి సమీపంగా తీసుకువెళ్తుంది.

Comments