* 22-06-1977 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సితారల ప్రపంచం యొక్క రహస్యం.
ఈరోజు బాప్ దాదా సర్వసితారలను మెరుస్తున్న రూపంలో చూస్తున్నారు. సితారలన్నీ మెరుస్తూనే ఉన్నాయి కాని ఆ మెరుపులో కూడా నెంబర్ ఉంది. సితారల లోకము అనగా మీ లోకమును చూసారా? తారల ప్రపంచం యొక్క మహిమను గానం చేస్తారు కానీ అది ఏ తారల ప్రపంచమో, దాని రహస్యమును గూర్చి మీ అందరికి తెలుసా? ప్రతి సితారకు తన తన ప్రభావాన్ని చూపిస్తారు. తారల యొక్క ఆధారముపై జన్మపత్రిని మరియు భవిష్యత్తును తెలియజేస్తారు. చైతన్య రూపములో జ్ఞానసితారలైన మీరందరూ కల్పములోని ప్రతి ఆత్మ యొక్క జన్మపత్రికి ఆధారమూర్తులు జ్ఞాన సితారల యొక్క శ్రేష్ట జన్మ మరియు వర్తమాన జన్మ యొక్క ఆధారముపై రానున్న ప్రారబ్దము యొక్క జన్మ అనగా పూజ్య పదవి యొక్క జన్మ ఉంటుంది. మరియు పూజ్యత్వము యొక్క ఆధారముపై రానున్న పూజారి యొక్క జన్మ, ఇలా 84 జన్మల కథ యొక్క ఆధారముపై అన్య ధర్మ ఆత్మల యొక్క జన్న పత్రి ఆధారపడి ఉంటుంది. మీ జన్మ పత్రిలో వారి యొక్క జన్మ పత్రి రచింపబడి ఉంది. హీరో మరియు హీరోయిన్ పాత్రధారులైన మీ యొక్క ఆధారముపై మొత్తం డ్రామా అంతా రచింపబడి ఉంది.
మీ యొక్క పూజారీ స్థితి ప్రారంభమవ్వడం మరియు అన్య ఆత్మల యొక్క ధర్మముల స్థాపన జరుగడం ఇది పూర్వజ ఆత్మలైన మీ యొక్క ఆధారము పైనే ఉంది. ఇలా చిన్న చిన్న శాఖలు వెలువడతాయి. స్మృతి చిహ్న రూపములో హద్దులోని తారల యొక్క ఆధారముపై భవిష్యదర్శులుగా అవుతారు. ఎందుకంటే ఈ సమయంలో చైతన్య సితారలైన మీరు త్రికాలదర్శులుగా ఉన్నారు. ప్రతి ఆత్మ యొక్క భవిష్యత్తును తయారుచేసేందుకు నిమిత్తులుగా అయి ఉన్నారు. ముక్తినైనా ఇవ్వండి లేక జీవన్ముక్తినైనా ఇవ్వండి. కానీ అసలు జీవన్ముక్తి యొక్క ద్వారాలను తెరిచేందుకు జ్ఞాన సూర్యుడైన బాబాతో పాటు జ్ఞాన సితారలైన మీరూ నిమిత్తులవుతారు. కావున మీ యొక్క జడ స్మృతిచిహ్నాలైన సితారలు కూడా భవిష్యత్తును దర్శింపజేసేవిగా అయ్యాయి. అనగా భవిష్యత్తును చూపించేందుకు నిమిత్తమయ్యాయి. కావున జడ స్మృతిచిహ్నాలైన హద్దులోని సితారలను చూస్తూ మీ సితార స్వరూపము స్మృతిలోకి వస్తోందా? సితారలలో కూడా రకరకాల వేగాలను చూపిస్తారు. భ్రమణము చేసే వేగము కొన్నింటికి ఎక్కువగా చూపిస్తారు మరియు కొన్నింటికి తక్కువగా చూపిస్తారు. కొన్ని సితారలు సంఘటిత రూపములో ఉంటాయి, కొన్ని సితారలు ఒకదానికొకటి కొంత దూరముగా ఉన్నట్లుగా చూపిస్తారు. కొన్ని పదే పదే తమ స్థానాన్ని మారుస్తూ ఉంటాయి. అలాగే కొన్ని తోకచుక్కలు ఉంటాయి. అనేక రకాలైన చైతన్య సితారల యొక్క స్థితి, వురుషార్ధము యొక్క స్పీడ్, సంఘటిత రూపములో అచలము మరియు అలజడి యొక్క రూపము సేవాధారి లేక సర్వస్నేహి లేక సహయోగి యొక్క స్వరూపము, శ్రేష్ఠ గుణాలు మరియు కర్తవ్యాల యొక్క స్వరూపములను స్మృతిచిహ్న రూపములో ఆవిధముగా చూపించారు.
సితారలకు చంద్రునితో సంబంధమును చూపించారు. కొన్ని చంద్రునికి సమీపముగా ఉన్నాయి, కొన్ని దూరముగా ఉన్నాయి. జ్ఞాన సూర్యుని సంతానమై ఉండి కూడా చంద్రునితో పాటు ఉన్న చిత్రము ఎందుకు తయారుచేయబడ్డది? దీనికి కూడా రహస్యము ఉంది. చంద్రుడు అని పెద్ద తల్లి అయిన బ్రహ్మను అనడం జరుగుతుంది. జ్ఞానసూర్యుని నుండి సర్వశక్తుల యొక్క, జ్ఞానము యొక్క ప్రకాశమును తప్పకుండా తీసుకుంటారు కానీ డ్రామాలో పాత్రను అభినయించేందుకు సాకార రూపములో ఆది పిత అయిన బ్రహ్మ మరియు బ్రాహ్మణులే తోడుగా ఉంటారు. జ్ఞానసూర్యుడు ఈ చక్రము నుండి అతీతముగా ఉంటారు. ఈ కారణముగానే స్మృతిచిహ్న
చిత్రములో కూడా చంద్రునికి మరియు సితారలకు సంబంధం ఉంది. నేను ఎటువంటి సితారను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సంఘటిత రూపములో సర్వుల యొక్క స్నేహులుగా మరియు సదా సహయోగులుగా అయ్యే స్థితి ఉంటుందా లేక సంఘటనలో స్వభావములను, సంస్కారములను, స్థితిని మార్చేసుకుంటారా? అనగా స్థానాన్ని మారుస్తూ ఉంటారా? సదా ప్రకాశిస్తున్న విశ్వమును ప్రకాశవంతం చేసే సితారలుగా ఉన్నారా? లేక స్వయానికి స్వయమే జ్ఞానము యొక్క ప్రకాశము మరియు స్మృతి యొక్క శక్తిని ఇచ్చుకోలేకపోతున్నారా? అన్య ఆత్మల యొక్క ప్రకాశము మరియు శక్తి యొక్క ఆధారముపై నిలుచున్నారా? సదా స్వయాన్ని త్రికాలదర్శి స్థితిలో స్థితులుగా చేసుకుంటున్నారా? ఈ విధంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మూడు రకాలైన సితారలు ఉన్నాయని వినిపించాను కదా! ఒకరేమో సదా లక్కీ సితారలు, ఇంకొకరు సదా సఫలత యొక్క సితారలు, మూడవవారు ఆశాసితారలు. ఈ మూడింటిలోనూ నేను ఎటువంటివాడిని? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరెవ్వరో మీకు తెలుసు కదా! ఈ చిక్కు ప్రశ్నను విడదీసారు. కదా! స్వయాన్ని స్వయమే పరిశీలించుకోండి, అరమయ్యిందా? అచ్చా, ఈరోజు మురళిని వినిపించేందుకు రాలేదు. కలుసుకునేందుకు వచ్చాను. ఈ మిలనమే కల్పకల్పము రచింపబడి ఉంది. ఈ మిలనము యొక్క స్మృతిచిహ్నముగానే అనేక చోట్ల అనేక రూపాలలో మేళాలను జరుపుకుంటారు, అచ్ఛా!
సదా బాబాతో మిలనము జరిపేవారికి, సంకల్పము, వాక్కు మరియు కర్మలలో సఫలతా సితారలకు, సదా బాబాను తోడుగా చేసుకునే సమీప సితారలకు, ప్రతి సంకల్పములోనూ విశ్వమునకు ప్రకాశమును, శక్తిని ఇచ్చేవారికి, సదా మెరుస్తున్న సితారలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో బాప్ దాదా: సదా స్వయాన్ని ప్రతి కర్మ చేస్తూ తనువు యొక్క, ధనము యొక్క, ప్రవృత్తి యొక్క ట్రస్టీలుగా భావిస్తూ నడుస్తున్నారా? ట్రస్టీల యొక్క విశేషత ఏమిటి? ఒక్క శబ్దములో చెప్పాలంటే ట్రస్టీ అనగా నష్టామోహ. ట్రస్ట్రీకి ఎవరిపైనా మోహము ఉండదు. ఎందుకు? ఎందుకంటే నాది అనేది లేదు. నాది అన్నదానిలోకే మోహము వెళుతుంది. ప్రవృత్తి కొరకు ఏ సాధనాలైతే లభించాయో లేక సేవార్థము ఏ సంబంధాలైతే ఉన్నాయో వాటిలో నాది అనేది ఉంచక బాప్ దాదాచే ఇవ్వబడిన వస్తువుగా భావిస్తూ సేవ చేసినట్లయితే లేక సాధనాలను కార్యములో వినియోగించినట్లయితే సహజముగానే ట్రస్టీలుగా అయిపోతారు. ట్రస్టీ అనగా నాది అనేది సమాప్తమై బాబా, బాబా అన్న శబ్దమే ముఖము నుండి వెలువడాలి. ఇటువంటి స్థితి ఉందా? లేక ఏ సాధనాలనైతే కార్యములో వినియోగిస్తున్నారో వాటిపై నాది అనే అభిమానము ఉందా? నాది అనేది ఉంటే దేహాభిమానం వస్తుంది. తనువుపై కూడా ట్రస్టీలుగా ఉన్నట్లయితే దేహము యొక్క అభిమానము ఉండజాలదు. ఎప్పటినుండైతే జన్మ తీసుకున్నారో అప్పటినుండి మొదట ఏప్రతిజ్ఞను చేసారు? నాది ఏదైతే ఉందో అది బాబాది అని మరజీవాలుగా అయిపోయారు కదా! మరి ఈ నాది అనేది ఎక్కడినుండి వచ్చింది? ఇచ్చిన వస్తువును ఎప్పుడూ తిరిగి తీసుకోవడం జరుగదు. కావున సదా దేహీ అభిమానులుగా అయ్యేందుకు అనగా నష్టామోహులుగా అయ్యేందుకు సహజ సాధనము ఏమిటి? నేను ట్రస్టీని. కల్పపూర్వపు స్మృతిచిహ్నములో కూడా అర్జునుని యొక్క స్మృతిచిహ్నమును ఏదైతే చూపించారో అందులో అర్జునుడికి ఎప్పుడు కష్టమనిపించింది? ఎప్పుడైతే నాది అనేది వచ్చిందో అప్పుడు కష్టమనిపించింది. నాది అనేది సమాప్తమైపోతే నష్టామోహ అనగా స్మృతిస్వరూపముగా అయిపోయారు. నా పతి, నా పత్ని, నా ఇల్లు, నా కొడుకు, నా దుకాణము, నా ఆఫీసు....ఈ నాది, నాది అనేదే సహజమైనదానిని కష్టతరం చేసేస్తుంది. సహజమార్గానికి సాధనము నష్టామోహ అనగా ట్రస్టీ. ఈ స్మృతి ద్వారా స్వయాన్ని మరియు సర్వులను సహజయోగులుగా చేయండి. అర్ధమయ్యిందా?
వెరైటీ స్థానాల నుండి వచ్చిన మీరందరూ ఈ సమయంలో మధువన నివాసులుగా ఉన్నారా? ఈ సమయంలో స్వయాన్ని గుజరాతి, పంజాబి, యు. పి నివాసిగా భావించడం లేదు కదా! సదా స్వయాన్ని పరంధామ నివాసిగా లేక పాత్రను అభినయించేందుకు మధువన నివాసిగా భావిస్తున్నారా? మధువన నివాసిని అని భావించడం ద్వారా నషా లేక సంతోషము ఉంటుంది. మధువనములో ఎంత కష్టముగా ఉన్నా కానీ ఇక్కడ ఉండడమే ఎంతో ఇష్టమవుతుంది. ఇంట్లో డన్ లప్ పరుపులు ఉన్నా ఇక్కడే ఎంతో నచ్చుతుంది. ఎందుకంటే, మధువన నివాసులుగా అవ్వడం ద్వారా ఆటోమేటిక్ గా, సహజయోగులుగా, నిరంతరయోగులుగా అయిపోతారు. మధువనము యొక్క మహిమ కూడా ఉంది. మధువనము మరియు మధువనము యొక్క మురళి ఎంతో ప్రసిద్ధమైనది. కావుననే మధువనానికి రావడం అందరూ ఇష్టపడతారు. కావున ఎల్లప్పుడూ స్వయాన్ని మధువన నివాసిగా భావిస్తూ నడవండి. తద్వారా సహజయోగి యొక్క స్థితి ఉంటుంది. మధువనము, గుర్తుకు రావడం ద్వారా స్థితి సదా సంతోషముగా ఉంటుంది. మధువనము గుర్తుకు వచ్చినట్లయితే వ్యర్ధ సంకల్పాలు సమాప్తమై సమర్ధ సంకల్పము యొక్క అనుభవము గుర్తుకు రావడం ద్వారా సమర్ధులుగా అయిపోతారు. మీరు ఇంటికి వెళ్ళడం లేదు, సేవా స్థానానికి వెళుతున్నారు. ఇంటికి వెళ్ళినా కానీ చదువు, తండ్రి మరియు సేవ గుర్తు ఉన్నట్లయితే సంతోషము మరియు నషా ఉంటుంది. సదా బాబాను తోడుగా చేసుకునేవారు సదా నషా మరియు సంతోషములో స్థిరంగా ఉంటారు. సదా బాబా మరియు సేవ ఇదే స్మృతిలో ఉన్నట్లయితే సమర్ధులుగా ఉంటారు. స్థితి సదా స్థిరంగా ఉంటుంది, అచ్చా!
ఎప్పుడైనా, ఎటువంటి పేపర్ వచ్చినా కంగారు పడకండి. ఇది ఎందుకు వచ్చింది? అని ప్రశ్నార్ధకాలలోకి రాకండి. ఇలా ఆలోచించడంలో సమయాన్నివ్వరం చేయకండి. ప్రశ్నార్థకాలు సమాప్తం మరియు పుల్‌స్టాప్. అప్పుడు క్లాస్ బదిలి అవుతుంది. అనగా పేపర్లో పాసైపోతారు. ఫుల్‌స్టాప్ పెట్టేవారు ఫుల్ పాసవుతారు. ఎందుకంటే ఫుల్‌స్టాప్ బిందువు యొక్క స్థితి. చూస్తూ కూడా చూడకండి, వింటూ కూడా వినకండి. బాబా వినిపించినదే వినండి, బాబా ఏదైతే ఇచ్చారో అదే చూడండి. ఈ అభ్యాసము ద్వారానే ఫుల్ పాస్ అవుతారు. పేపర్‌లో పాసయ్యేందుకు గుర్తు ముందుకు వెళ్లడం. అనగా పైకి ఎక్కే కళను అనుభవం చేసుకుంటారు. అతీంద్రియ సుఖము యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. సర్వప్రాప్తుల యొక్క అనుభవము ఆటోమేటిక్ గా కలుగుతూ ఉంటుంది. అచ్ఛా!
Comments
Post a Comment