* 22-01-1982 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
అభినందనలు మరియు వీడ్కోలు చెప్పండి.
ఈ రోజు విశ్వ కళ్యాణకారి అయిన బాప్ దాదా విశ్వములో నలువైపులా ఉన్న పిల్లలను సమ్ముఖముగా చూస్తున్నారు. పిల్లలందరూ తమ స్మృతి యొక్క శక్తి ద్వారా ఆకారీ రూపములో మధువనానికి చేరుకున్నారు. పిల్లల ప్రతి ఒక్కరి లోపల మిలనమును జరిపే శుభ సంకల్పం ఉంది. బాప్ దాదా పిల్లలందరినీ చూస్తూ. అదే విశేషత యొక్క ఆధారముపై ప్రతి ఒక్కరూ తమ తమ విశేష పాత్రను అభినయిస్తున్నారు. ఇదే బ్రాహ్మణ ఆత్మల యొక్క లేక బ్రాహ్మణ పరివారము యొక్క నవీనత. ఇందులో ఒక్క బ్రాహ్మణ ఆత్మ కూడా విశేషత లేకుండా సాధారణముగా లేదు. బ్రాహ్మణులందరూ అలౌకిక జన్మధారులు, అలౌకికమైనవారు. కావున అందరూ అలౌకికమైనవారు అనగా ఏదో ఒక విశేషత యొక్క కారణముగా విశేషముగా ఉన్నారు. విశేషత యొక్క అలౌకికత ఉంది. కావున బాప్ దాదాకు పిల్లలంటే ఎంతో గర్వము. అందరూ విశేష ఆత్మలు. ఇలాగే మీలో ఈ అలౌకిక జన్మ యొక్క అలౌకిక నషా, ఆత్మికత యొక్క నషా, మాస్టర్ సర్వశక్తివంతుడిని అనే నషా ఉన్నట్లుగా భావిస్తున్నారా! ఈ నషా అన్ని రకాల బలహీనతలను సమాప్తం చేస్తుంది. కావున సదాకాలం కొరకు సర్వ బలహీనతలకు వీడ్కోలు చెప్పేందుకు ముఖ్య సాధనము - సదా స్వయమునకు మరియు సర్వులకు సంగమయుగ విశేష ఆత్మ యొక్క విశేష పాత్రకు అభినందనలు తెలపండి. ఏ విధంగా ఏదైనా విశేషమైన రోజున ఏదైనా విశేష కార్యమును చేస్తే అప్పుడు ఏమి చేస్తారు? వారికి అభినందనలు తెలుపుతారు కదా! ఒకరికొకరు అభినందనలు తెలుపుతారు. కావున మొత్తం కల్పంలో సంగమయుగము యొక్క ప్రతిరోజు విశేషమైన రోజే మరియు మీరు విశేష యుగము యొక్క విశేష పాత్రధారులు, కావున విశేష ఆత్మలైన మీ యొక్క ప్రతి కర్మా అలౌకికమైనది అనగా విశేషమైనది. కావున సదా పరస్పరం అభినందనలు తెలుపుకోండి మరియు స్వయమునకు కూడా అభినందనలు తెలపండి, ఎక్కడైతే అభినందనలు ఉంటాయో అక్కడ వీడ్కోలు దానంతట అదే చెప్పగలుగుతారు. కావున ఈ డబుల్ విదేశీయుల సీజన్ యొక్క సారము - 'సదా అభినందనల ద్వారా వీడ్కోలు చెప్పాలి' అన్నది గుర్తుంచుకోండి. ఇక్కడికి వీడ్కోలు చెప్పి అభినందనలను జరుపుకునేందుకే వచ్చారు. కావున 'వీడ్కోలు మరియు అభినందనలు'. ఈ రెండు పదాలనూ గుర్తుంచుకోండి. వీడ్కోలు చెప్పాలి అని భావించడం కాదు, వీడ్కోలు చెప్పేయండి. వరదాన భూమిలోకి రావడం అనగా సదాకాలికముగా బలహీనతలకు వీడ్కోలు చెప్పడం. రావణుడినైతే తగులబెట్టేస్తారు కానీ రావణుని వంశం వారు తమ అధికారాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఏ విధంగా మీ సాకార ప్రపంచంలో ఎవరైనా గొప్ప ఆస్తి కలవారు శరీరాన్ని వదిలివేస్తే వారు మరచిపోయిన, ఎప్పుడూ కలవని సంబంధీకులు కూడా బయటపడతారో, అలాగే రావణుడినైతే అంతం చేసేస్తారు కానీ అతడి వంశం ఏదైతే తమ హక్కును తీసుకునేందుకు ఎదుర్కొంటుందో ఆ వంశమును అంతం చేయడంలో అప్పుడప్పుడూ బలహీనులైపోతారు. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము వీటి యొక్క వంశము అనగా అంశములు చాలా రాయల్ రూపముగా వశం చేసుకుంటాయి, లోభము యొక్క అంశము - అవసరము యొక్క రూపములో వస్తుంది, లోభము ఉండదు కానీ అన్నీ అవసరము అనిపిస్తాయి. అవసరాలకు కూడా హద్దు ఉంది కానీ అవసరాలు అనంతముగా అయిపోతే అవి లోభము యొక్క అంశాలుగా అయిపోతాయి.
అలాగే కామవికారము లేదు. సదా బ్రహ్మచారిగా ఉన్నారు కానీ ఎవరైనా ఆత్మపై విశేషమైన ఆకర్షణ ఉంటుంది, వారితో రాయల్ రూపములో స్నేహము ఉంటుంది, కానీ ఎక్స్ ట్రా స్నేహము అనగా కామము యొక్క అంశము. స్నేహము సరైనదే కానీ అందులో 'ఎక్స్ ట్రా' అన్నదే అంశము.
అదేవిధముగా క్రోధమును కూడా జయించేశారు కానీ ఎవరైనా ఆత్మలోని ఏదైనా సంస్కారమును చూసినప్పుడు స్వయం లోలోపల జ్ఞాన స్వరూపం నుండి కిందకు వచ్చేస్తారు మరియు ఆ ఆత్మ నుండి పక్కకు తప్పుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే తనను చూస్తూ, తన సంపర్కములో ఉంటూ స్థితి పైకీ, కిందకూ అవుతూ ఉంటుంది. కావున స్వభావాన్ని చూసి పక్కకు తప్పుకోవడం, అది కూడా ద్వేషము అనగా క్రోధము యొక్క అంశమే. ఏ విధంగా క్రోధాగ్నిలో తగులబడుతున్న కారణముగా దూరంగా ఉంటారో అలాగే ఈ సూక్ష్మమైన ద్వేషం కూడా క్రోధాగ్నితో సమానమైనదే. అది పక్కకు తప్పించేస్తుంది. దీనికి రాయల్ గా - మన స్థితిని పాడు చేసుకోవడం కన్నా పక్కకు తప్పుకోవడం మంచిది అని అంటారు. అతీతముగా అయ్యే స్థితి వేరు, పక్కకు తప్పుకోవడం వేరు. ప్రియముగా అయి అతీతముగా అయితే అది మంచిదే, కానీ సూక్ష్మమైన ద్వేష భావముతో 'వారు ఇలా ఉన్నారు, వారు మారనే మారరు' అనడం ద్వారా వారిని సదాకాలికముగా, సూక్ష్మంగా శపించేస్తున్నారు. సురక్షితముగా ఉండండి కానీ వారికి ఫైనల్ సర్టిఫికెట్ ను ఇచ్చేయకండి. అలాగే విశేషతను చూస్తూ సదా సర్వుల ప్రతి శ్రేష్ఠభావన మరియు శ్రేష్ఠ కామనను ఉంచుతూ ఈ అంశమునకు కూడా వీడ్కోలు చెప్పండి. మీ శ్రేష్ఠ భావన మరియు శ్రేష్ఠ కామనను వదలకండి. మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఇతర ఆత్మలను పడేసి రక్షించుకోకండి. ఈ ద్వేష భావము అనగా ఇతరులను పడేయడం. ఇతరులను పడేసి స్వయమును రక్షించుకోవడం బ్రాహ్మణ ఆత్మల యొక్క విశేషత కాదు. స్వయమును రక్షించుకోండి మరియు ఇతరులను కూడా రక్షించండి. దీనినే విశేషముగా అవ్వడం మరియు విశేషతలను చూడడం అని అంటారు. ఈ చిన్న, చిన్న విషయాలు నడుస్తూ, నడుస్తూ రెండు స్వరూపాలను ధారణ చేస్తాయి. ఒకటి నిరుత్సాహము మరియు ఇంకొకటి నిర్లక్ష్యము, కావున ఇప్పుడు రావణుని యొక్క అంశమునకు కూడా సదాకాలికముగా వీడ్కోలు చెప్పేందుకు ఈ రెండు రూపాలకూ వీడ్కోలు చెప్పండి మరియు సదా స్వయములో బాబా ద్వారా లభించియున్న విశేషతను చూడండి. ఇది నా విశేషత కాదు, ఇది బాబా ద్వారా లభించిన విశేషత. నా విశేషత అని భావించినట్లయితే మళ్ళీ అహంకారం యొక్క అంశం వచ్చేస్తుంది. నా విశేషతను ఎందుకు ఉపయోగించడం లేదు. నా విశేషతను గూర్చే తెలియదు. ఈ 'నేను' అనేది ఎక్కడినుండి వచ్చింది? విశేష జన్మ యొక్క కానుక విశేషతను పొందడం. కావున జన్మదాతయే ఈ కానుకను ఇచ్చారు. మరి అందులో 'నేను' అనేది ఎక్కడి నుండి వచ్చింది? నా విశేషత, నా స్వభావము, నా మనస్సు ఇది చెబుతోంది లేక నా మనస్సు ఇలా చేస్తోంది. ఇది నాది కాదు కానీ చింత ఉంది అని అంటారు. చింతించకండి అని మీరు అంటారు కదా! కావున ఈ అంశాలను సమాప్తం చేయండి మరియు సదా బాబా ద్వారా లభించిన స్వయము యొక్క విశేషత మరియు సర్వుల యొక్క విశేషతలను చూడండి, అనగా సదా స్వయమునకు మరియు సర్వులకు అభినందనలు తెలపండి. అందరి యొక్క అంశాలను అర్ధం చేసుకున్నారు కదా? ఇప్పుడు మోహం యొక్క అంశం ఏముంది? ఇంకా నష్టోమోహులుగా అవ్వలేదా?
అచ్చా! మోహము యొక్క రాయల్ రూపము - ఏదైనా వస్తువు లేక వ్యక్తి నచ్చుతారు. ఈ ఈ వస్తువు నాకు మంచిగా అనిపిస్తుంది, మోహం లేదు కానీ అదంటే నాకు ఇష్టం. ఎవరైనా వ్యక్తి లేక వస్తువు నచ్చుతోందంటే అలాగే అన్నీ నచ్చాల్సిందే. అతుకుల బట్టలూ నచ్చాలి, అలాగే గొప్పబట్టలూ నచ్చాలి, 38 రకాల భోజనాలూ నచ్చాలి, అలాగే ఎండిపోయిన రొట్టె మరియు బెల్లంకూడా నచ్చాలి. ప్రతి వస్తువూ మంచిదే, ప్రతి వ్యక్తీ మంచివాడే. వీరంటే ఎక్కువ ఇష్టం అన్నది ఉండకూడదు. ఈ వస్తువు ఎక్కువ నచ్చుతోంది అని భావిస్తూ కార్యములోకి తీసుకురాకండి. మందుగా భావిస్తూ తినండి కానీ అది నచ్చుతోంది కాబట్టి తినాలి అని భావించకూడదు. నచ్చడం అనగా ఆకర్షణ వెళుతుంది. కావున అది మోహము యొక్క అంశము. తినండి, తాగండి, ఆనందించండి కానీ అంశానికి కూడా వీడ్కోలు చెప్పి అతీతముగా అయి ప్రయోగించడంలో ప్రియమైనవారిగా అవ్వండి, అర్ధమయ్యిందా?
బాప్ దాదా యొక్క భండారము నుండి స్వతహాగానే అన్నివిధాలుగా సర్వ ప్రాప్తుల యొక్క సాధనాలూ తయారయ్యాయి. బాగా తినండి కానీ బాబా తోడుగా తినండి, ఒంటరిగా తినకండి. బాబాతో కలిసి తింటే బాబాతో కలిసి ఆనందంగా ఉంటే, స్వతహాగానే సదా రేఖ లోపల, అశోకవాటికలో ఉంటారు, అప్పుడు రావణుని యొక్క అంశం కూడా రాజాలదు. తినండి, తాగండి, ఆనందించండి కానీ రేఖ లోపలే ఉంటూ బాబాతో కలిసి ఏదైనా చేయండి, అప్పుడు ఏ విషయమూ కష్టమనిపించదు, ప్రతి విషయమూ మనోరంజకముగా అనుభవమవుతుంది. ఏమి చేయాలో అర్ధమయ్యిందా? సదా మనోరంజకముగా ఉండండి.
అచ్చా! డబుల్ విదేశీయులు సదా మనోరంజన యొక్క విధిని అర్థం చేసుకున్నారా? కష్టమనిపించడం లేదు కదా! బాబాతో పాటు కూర్చున్నట్లయితే ఎటువంటి కష్టమూ ఉండదు. ప్రతి ఘడియను మనోరంజనగా అనుభవం చేసుకుంటారు. ప్రతి క్షణమూ స్వయం ప్రతి మరియు సర్వుల ప్రతి అభినందనలతో కూడుకున్న మాటలే వెలువడుతూ ఉంటాయి. కావున వీడ్కోలు చెప్పి వెళ్ళాలి కదా! మీతో పాటు తీసుకువెళ్ళరు కదా! కావున ఈ సర్వ అంశాలకు వీడ్కోలు చెప్పి అభినందనలు తీసుకొని వెళ్ళండి. తయారుగా ఉన్నారు కదా! సర్వ డబుల్ విదేశీయులూ తయారుగా ఉన్నారా?
అచ్చా, బాప్ దాదా కూడా ఇలా సదాకాలికముగా వీడ్కోలు చెప్పేవారికి అభినందనలు తెలుపుతున్నారు. వీడ్కోలులకు పదమా పదమ అభినందనలు, అచ్ఛా!
ఇలా సదా మన్మనాభవ అనగా సదా మనోరంజన జరిపేవారికి, సదా ఒక్క బాబాలో మొత్తం ప్రపంచమంతటినీ అనుభవం చేసుకునేవారికి, ఇటువంటి విశేషతలను చూసే విశేష ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
సేవాధారులతో:- సేవాదారులకు మధువనం నుండి ఏ కానుక లభించింది? ప్రత్యక్షఫలమూ లభించింది మరియు భవిష్య ప్రారబ్ధము కూడా జమా అయ్యింది. కావున అది డబుల్ కానుక కదా! సంతోషమూ లభించింది. నిరంతర యోగము యొక్క అభ్యాసకులుగానూ అయ్యారు. ఈ ప్రత్యక్ష ఫలము లభించింది కానీ దీనితో పాటు భవిష్య ప్రారబ్ధము కూడా జమా అయ్యింది. కావున డబుల్ అవకాశము లభించింది కదా! ఇక్కడ ఉంటూ సహజయోగులుగా, కర్మయోగులుగా, నిరంతరయోగులుగా అయ్యే అభ్యాసము జరిగింది. ఇవే సంస్కారాలను ఇలా పక్కాగా చేసుకొని వెళ్ళండి, తద్వారా ఆ సంస్కారాలు అక్కడ కూడా ఉండాలి. ఏవిధంగా పాత సంస్కారాలు ఇష్టం లేకపోయినా కూడా కర్మలోకి వచ్చేస్తాయో అలాగే ఈ సంస్కారాలను కూడా పక్కా చేసుకోండి, తద్వారా సంస్కారాల కారణముగా ఈ అభ్యాసము కొనసాగుతూనే ఉంటుంది. అప్పుడు మాయ విఘ్నాన్ని కలిగించజాలదు, ఎందుకంటే సంస్కారాలు తయారైపోతాయి. కావున సదా ఈ సంస్కారాలను అండర్‌లైన్ చేస్తూ ఉండండి, ఫ్రెష్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఉంటూ నిర్విఘ్నముగా ఉన్నారా? ఎటువంటి విఘ్నమూ రాలేదా? మనస్సులో కూడా పరస్పరం ఘర్షణా వగైరా ఏవీ జరుగలేదు కదా? సంఘటనలో భిన్న భిన్న రకాల వారు ఉంటూ కూడా కేవలం తండ్రినే చూస్తూ ఉన్నారా లేక మధ్యమధ్యలో అన్నయ్యలను, అక్కయ్యలను కూడా చూసారా? ఎవరైతే సదా తండ్రినే చూస్తూ ఉంటారో వారు బాప్ దాదా యొక్క సమీప పిల్లలు. ఎవరైతే తండ్రితో పాటు అక్కయ్యలను, అన్నయ్యలను కూడా చూస్తూ ఉంటారో వారు సమీపమైన పిల్లలు కారు, దూరంగా ఉండే పిల్లలు. మరి మీరందరూ ఎవరు? సమీపమైనవారే కదా! కావున ఇదే స్మృతిలో ముందుకు వెళుతూ ఉండండి. బయట ఉంటూ కూడా 'తండ్రినే చూడండి లేక తండ్రినే అనుసరించండి' అన్న పాఠమును పక్కా చేసుకోండి, బాబాను అనుసరించేవారు ఎప్పుడూ ఏ పరిస్థితిలోనూ అలజడి చెందరు. ఎందుకంటే తండ్రి ఎప్పుడూ అలజడి చెందలేదు కదా! కావున తండ్రిని అనుసరించేవారు అచలముగా, స్థిరముగా, ఏకరసముగా ఉంటారు, అచ్చా - అన్ని ఆశలూ పూర్తయ్యాయా? అందరూ తమ తమ సేవలలో మంచి పాత్రను అభినయించారా? మంచి పాత్రను అభినయించేందుకు గుర్తు - ప్రతి సంవత్సరమూ ఆహ్వానము రావాలి. ఇది ప్రత్యక్షముగా స్మృతిచిహ్నాన్ని తయారుచేసుకోవడం.. ఆ స్మృతిచిహ్నాలైతే తయారవుతాయి కానీ ఇప్పుడు కూడా స్మృతి చిహ్నాన్ని తయారుచేస్తుంది. ఎవరైనా మంచి సేవను చేసి వెళితే వారిని పిలిపించండి అని అందరి నోటి నుండి వెలువడుతుంది, కావున ఇటువంటి ప్రమాణాన్ని చూపించాలి. సేవాధారుల నుండి సదాకాలికమైన సేవాధారులుగా అయిపోండి. వీరిని ఇక్కడే ఉంచుకోవాలి అని అందరూ అనాలి.
మధువన నివాసులతో: - మధువన నివాసులు అనగా సర్వప్రాప్తి స్వరూపులు, ఎందుకంటే మధువనము యొక్క విశేషత, మధువనము యొక్క విశేషమైన చదువు, మధువనము యొక్క విశేష వాయుమండలము అన్నీ మీకు లభించాయి. మధువనములో బయటివారు తమ కోరికలన్నింటినీ పూర్తి చేసుకునేందుకు వస్తారు మరియు మీరు సదా ఇక్కడే కూర్చొని ఉన్నారు. శరీరము ద్వారా కూడా బాప్ దాదాకు సదా తోడుగా ఉన్నారు, ఎందుకంటే మధువనములో అందరూ సాకారరూపములో తోడును అనుభవం చేసుకుంటారు. కావున శరీరము ద్వారానూ తోడుగా ఉన్నారు అనగా సాకారములోనూ తోడుగా ఉన్నారు మరియు ఆకార రూపములో కూడా బాబా తోడుగా ఉన్నారు. కావున డబుల్ తోడు ఉంది కదా! అన్నిరకాల గనుల పైన కూర్చున్నారు కావున అన్ని ఖజానాలకు అధిపతులుగా అయిపోయారు కదా! మధువనం వారి మనసు నుండి, ప్రతి క్షణము, ప్రతి శ్వాసలో మేము ఏదైతే పొందాలో అది పొందేసాము, ఈ భండారములో అప్రాప్తి అనే వస్తువే లేదు అన్న గీతమే వెలువడుతూ ఉండాలి. మధువనం వారు సదా తాజాఫలమును తింటూ ఉంటారు. కావున ఎవరైతే సదా తాజా ఫలమును తింటూ ఉంటారో వారు ఎంత ఆరోగ్యవంతంగా ఉంటారు! మీరందరూ వరదానీ ఆత్మలు, సదా బాప్ దాదా యొక్క పాలనలో పాలింపబడుతూ ఉంటారు. బయటివారైతే ఇతర వాతావరణాలలోకి వెళ్ళవలసి వస్తుంది, కావున వారికి విశేషముగా ఏదో ఒక వరదానాన్ని ఇవ్వవలసి వస్తుంది కానీ మీరైతే వరదాన భూమిలోనే కూర్చున్నారు. బయటివారికైతే పూర్తి సంవత్సరం సరిపడా రిఫ్రెష్ మెంట్ కావాలి. కావున మీ ఒక్కొక్కరితో బాప్ దాదా ఏమి మాట్లాడాలి. వారికైతే లైట్‌హౌస్, మైట్ హౌస్ గా అయి ఉండండి అని చెబుతారు. మరి మీకు కూడా ఇది చెప్పాలా? బయటివారికి ఈ విషయం యొక్క అవసరం ఉంది, ఎందుకంటే ఇదే వారిని కమలపుష్పంగా చేసేస్తుంది, తద్వారా వారు అతీతముగా మరియు ప్రియముగా ఉంటారు. ఇంట్లోకి ఎవరైనా వస్తే వారిని గూర్చి ఆలోచించవలసి ఉంటుంది. మీరైతే సదా ఇంట్లోనే ఉన్నారు. వారు డబుల్ పాత్రను అభినయించవలసి ఉంటుంది. కావున డబుల్ ఫోర్సు నింపవలసి ఉంటుంది. వారి కొరకు ఈ ఒక్కొక్క పదము సంసార సాగరములో నావలా పని చేస్తుంది. కానీ మీరైతే సంసార సాగరము నుండి వెలువడి జ్ఞానసాగరుని మధ్యలో కూర్చున్నారు. బాబాయే మీ ప్రపంచమయ్యారు, అచ్ఛా ఓం శాంతి.
Comments
Post a Comment