21-11-1981 అవ్యక్త మురళి

* 21-11-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మీరు వదిలితే ముక్తులవుతారు.

సదా సహయోగి, సదా పిల్లల యొక్క స్నేహి అయిన బాప్ దాదా తమ సహయోగి పిల్లలకు, సదా తోడుగా ఉండే పిల్లలకు ఈ రోజు వతనము యొక్క, బాప్ దాదా యొక్క రమణీయమైన విషయాన్ని వినిపిస్తారు. మీరందరూ ఆత్మిక రమణీయమూర్తులే కదా! కావున ఇటువంటి పిల్లలకు బాప్ దాదా కూడా రమణీయమైన విషయాన్ని వినిపిస్తారు. ఈ రోజు వతనంలో బాప్ దాదా ముందు ఒక చాలా సుందరమైన, అలౌకికమైన, అర్థసహితమైన వృక్షము ఎమార్జ్ అయ్యింది. వృక్షం చాలా సుందరంగా ఉంది మరియు వృక్షం యొక్క శాఖలు అనేకం ఉన్నాయి. ఒకటి చిన్నదైతే ఒకటి పెద్దది. ఒకటి లావుదైతే ఒకటి సన్నది. కాని ఆ అలౌకిక వృక్షం పైన భిన్న భిన్న రకాలైన రంగు రంగుల సుందరమైన పక్షులు ఉన్నాయి. అవన్నీ తమ తమ కొమ్మలపై కూర్చున్నాయి. ఆ పక్షుల కారణంగా వృక్షము చాలా సుందరంగా ఉంది. కొన్ని పక్షులు ఎగురుతూ బాప్ దాదా చేతి వేళ్ళపై వచ్చి కూర్చుంటున్నాయి. కొన్ని భుజం పైన కూర్చున్నాయి. కొన్ని బాబా చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కొన్ని కొమ్మల పైనే కూర్చొని దూరం నుండే నయన మిలనము జరుపుతున్నాయి. ఎంతో సంతోషంగా ఉన్నాయి. కాని ఇతర పక్షుల మిలనము యొక్క ఆటను చూస్తూ ఎంతో సంతోషిస్తున్నాయి. తాము స్వయం సమీపంగా రాలేదు. ఇటువంటి దృశ్యాన్ని చూసి బ్రహ్మాబాబా నవ్వుతూ ఆ పక్షుల్ని పిలిచేందుకు చప్పట్లు కొట్టారు. 'పిల్లలూ రండి, పిల్లలూ రండి' అంటూ చాలా మధురంగా పిలిచారు. అయినా పక్షులు రాలేదు. రెక్కలు కూడా ఉన్నాయి, ఆ రెక్కలను కదిలిస్తున్నాయి కూడా. కాని తమ కాళ్ళతోటే ఆ కొమ్మలను ఎంత గట్టిగా పట్టుకున్నాయంటే దాని వల్ల అవి ఎగురుతూ సమీపంగా రాలేకపోయాయి. మరి ఏమైంది? కావాలనుకున్నా ఎగరలేకపోయాయి. 'బాబా- బాబా' అంటూ చాలా ప్రేమగా పిలిచాయి. అనడం మొదలుపెట్టాయి. అవి ఏమనుంటాయి? 'ఎగిరించండి, ఎగిరించండి' అని అన్నాయి. 'వదలించండి, వదిలించండి' అని అన్నాయి. అప్పుడు బాప్ దాదా 'వదిలించండి, వదిలించండి అని అనడం కాదు, మీరు వదిలితే ముక్తులైపోతారు' అని అన్నారు. కాని ఆ పక్షుల్లో కొన్ని చతురముగా ఉన్నాయి. కొన్ని బలహీనంగా ఉన్నాయి. కొమ్మనూ వదలాలనుకోవడం లేదు అలాగే బాబా యొక్క తోడును కూడా తీసుకోవాలనుకుంటున్నాయి. రెండూ కావాలనుకుంటున్నాయి. ఇవి చతురులైన పక్షులు మరియు బలహీనమైన లేక అమాయక పక్షులు వదలాలనుకుంటున్నాయి కాని ముక్తిని పొందేందుకు యుక్తి రావడం లేదు. అమాయకపు పక్షులు తమ అమాయకత్వంలో వీటిని వదలాలి అని కూడా భావించడం లేదు. కావున ఇటువంటి పక్షులను చూసి బాప్ దాదా పదే పదే వారితో, మీరు వదిలితే వదిలిపోతారు అని చెప్పారు. కాని వారు తమ పలుకులే పలుకుతున్నారు. బాప్ దాదా యుక్తిని కూడా చెప్పారు కాని, కాస్తంత కొమ్మ తోడును వదులుతూ మళ్ళీ వెంటనే పట్టుకుంటున్నారు. కావున పిలుస్తున్నారు, అంటూ ఉన్నారు కాని ఎగిరే పక్షిగా అయి బాబాతో సమీప మిలనము యొక్క అనుభవము మరియు విశ్వ పరిక్రమ అనగా అనంతమైన సేవ యొక్క పరిక్రమణను అనుభవం చేసుకోలేకపోతున్నారు.

ఇప్పుడు మీరందరూ నేను ఎక్కడ ఉన్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కొమ్మపై ఉన్నారా లేక బాబా భుజంపై ఉన్నారా లేక బాబా చేతివేలిపై నాట్యం చేస్తున్నారా లేక వారి చుట్టూ విహరిస్తున్నారా? మిమ్మల్ని మీరైతే తెలుసుకోగలరు కదా! వదిలితే ముక్తులైపోతాము అనే పాఠమును ఎంతగా పక్కా చేసుకున్నాము? ఈ పాఠము సదా స్మృతి ఉంటోందా లేక ఇతరులు వదిలిస్తే నేను వదులుతాను లేక బాబా వదిలిస్తే ముక్తమవుతాను అన్న పాఠమునైతే చదవడం లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ కొమ్మనూ మీ బుద్ధిరూపీ పాదము ద్వారా పట్టుకొని కూర్చోలేదు కదా? ఏదైనా స్వభావ సంస్కారము లేక ఏదైనా శక్తి యొక్క లోపం ఉన్న కారణంగా, లేక నిర్బలులుగా ఉన్న కారణంగా కొమ్మనే పట్టుకొని కూర్చోవడం లేదు కదా! ప్రతి విషయంలోనూ వదిలితే ముక్తులైపోతారు అనే పాఠమును ప్రాక్టికల్ లోకి తెస్తున్నారా? ఈ పాఠము బ్రహ్మాబాబాను నెంబర్ వన్లోకి తీసుకువెళ్ళింది. మొదటి నుండీ వదిలేసారు కాబట్టి ముక్తులైపోయారు కదా! తోటివారు నన్ను వదలితే మరియు సంబంధీకులు నన్ను వదిలితే నేను స్వతంత్రుడనవుతాను అని ఆలోచించలేదు కదా! విఘ్నాలు కలిగించేవారు విఘ్నాల నుండి వదిలితే, భిన్న భిన్న పరిస్థితులు నన్ను వదిలితే నేను ముక్తుడనవుతాను అని ఎప్పుడైనా భావించారా? సదా స్వయమునకు ఇదే వీరత్వమును పక్కాగా ప్రాక్టికల్ లో చూపించారు. మరి మీరు కూడా అలా బాబాను అనుసరించారా? దీనినే ఎవరు లేస్తే వారే అర్జునులు అని అనడం జరుగుతుంది. కావున వారు అర్జునులుగా అయిపోయారు కదా! అనగా బాబాకు అతి సమీపంగా, సమానంగా, కంబైండ్ గా అయిపోయారు. మీరందరూ కూడా బాగా కంబైండ్లో ఉన్నారు అని అంటారు కదా! మరి మీరు ఇలా అయ్యారా? లేక ఒక్కోసారి ఒక్కోలా ఈ కరెంటు వలె అవుతున్నారా? (కరెంటు పదేపదే వస్తోంది మరియు పోతోంది) కావున ఒక్కోసారి మీరు వదలడం ద్వారా, ఇంకొకసారి వేరేవారు వదలడం ద్వారా స్వతంత్రులవ్వడం లేదు కదా? ఈ ఆటనైతే ఆడడం లేదు కదా? ఈ కరెంటు కూడా ఆటాడుతోంది కదా! కాసేపు రావడం కాసేపు పోవడం ఇది కూడా ఆటయే. కావున ఇటువంటి ఆటనైతే ఆడడం లేదు కదా! సదా ఉండడం నచ్చుతోందా లేక రావడము, పోవడము నచ్చుతోందా? కావున ప్రతి విషయంలోను, స్వభావ పరివర్తనలో కాని, సంస్కారాల పరివర్తనలో కాని, ఒకరికొకరు సంపర్కంలోకి రావడంలో, పరిస్థితులను లేక విఘ్నాలను దాటడంలో ఏ పాఠమును పక్కా చేయాలి? 'స్వయం వదిలితేనే స్వతంత్రులవుతారు. పరిస్థితులు మిమ్మల్ని వదలవు, కాని మీరు వదిలితే విముక్తులవుతారు. ఇతర ఆత్మలు సంస్కారాల యొక్క ఘర్షణలోకి వస్తాయి. అప్పుడు కూడా నేను వదలితేనే ముక్తుడనవుతాను అని భావించాలి. వీరు ఘర్షణను వదిలితే ముక్తుడవుతాను అని భావించడం కాదు. వారు వదిలితే ముక్తులవ్వడం అనేది ఉంటే, ఒక ఘర్షణ సమాప్తమై ఇంకోటి ప్రారంభమైపోతుంది. అది వదిలితే నేను ముక్తుడ్నవుతాను అని భావించినట్లయితే ఎంతవరకూ ఎదురుచూస్తూ ఉండిపోతారు? ఈ మాయ యొక్క విఘ్నాలు లేక చదువులోని పరీక్షలు సమయ ప్రతి సమయము భిన్న భిన్న రూపాలలో రావలసిందే. కావున పాసయ్యేందుకు నేను చదివితే పాసవుతానా లేక టీచర్ పరీక్షను తేలికగా చేస్తే పాసవుతానా? ఏం చేయవలసి ఉంటుంది? నేను చదివితేనే పాసవుతాను అన్నదే సరైనది కదా! అలాగే ఇక్కడ కూడా అన్ని విషయాలను నేను స్వయం పాసై వెళ్ళాలి. ఫలానా వ్యక్తి పాస్ చేయాలి. ఫలానా పరిస్థితి పాస్ చేయాలి అని కాదు, నేనే పాసవ్వాలి అని భావించాలి. దీనినే మీరు వదిలితే ముక్తులవుతారు అని అంటారు. ఎదురు చూడకండి, ఏర్పాట్లు చేసుకోండి. లేకపోతే, పక్షులుగానూ ఉన్నారు. రెక్కలూ ఉన్నాయి. ఎంతో సుందరంగానూ ఉన్నారు. బాబా యొక్క వృక్షంపై కూడా కూర్చొని ఉన్నారు అనగా బ్రాహ్మణ పరివారము వారిగా కూడా అయ్యారు కాని ఏదో ఒక రకమైన స్వయం యొక్క సంస్కారము లేక స్వభావము లేక ఇతరుల స్వభావము మరియు సంస్కారమును చూసే మరియ వర్ణన చేసే బలహీనత ఉంటుంది. పురుషార్ధంలో నిరాధారముగా కాక ఆధారమును ఉంచుకుంటారు. ఏదో ఒక వ్యక్తి లేక వస్తువు యొక్క ఆకర్షణ ఉంటుంది, ఏదో ఒక గుణము లేక శక్తి యొక్క లోపము ఉంటుంది. ఇవి భిన్న భిన్న కొమ్మలు. కావున ఈ కొమ్మలలో ఏదో ఒక కొమ్మను పట్టుకొని కూర్చోవడం లేదు కదా! ఏదైనా కొమ్మను పట్టుకొని ఉన్నట్లయితే, సదా బాబా యొక్క వేలును పట్టుకొని నాట్యమాడడము అనగా శ్రీమతం యొక్క వేలు యొక్క ఆధారంపై నడవడము అనే సామీప్యతను అనుభవం చేసుకోలేరు, లేక సదా బాబా యొక్క ప్రతి కర్తవ్యంలో సహయోగులు అనగా భుజంపై నాట్యం చేసేవారిగా అవ్వలేరు. ఒకరేమో సదా సహయోగులు, మరోకరు కాసేపు సహయోగులుగా, కాసేపు వియోగులుగా అయ్యేవారు. అలా ఎందుకు? ఎందుకంటే ఏదో ఒక కొమ్మను పట్టుకోవడంతో సహయోగులుగా అయ్యేందుకు బదులుగా వియోగులుగా అయిపోతారు. మరి ఇప్పుడు నేను ఎవరు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, అర్థమైందా? ఈనాటి పాఠమును పక్కా చేసుకున్నారా? 'స్వయం వదిలితేనే ముక్తులవుతారు'. ఇది పక్కా చేసుకున్నారా? కొమ్మనైతే వదలరు కదా! అలసిపోతారు కదా! అప్పుడు కొమ్మను వదిలి కూర్చుండిపోతారు. ఒకసారి స్వయంతో అలసిపోతారు, మరొకసారి ఇతరులతో అలసిపోతారు. మరోసారి సేవతో అలసిపోతారు. అప్పుడు మళ్ళీ కొమ్మను పట్టుకొని, మమ్మల్ని వదిలించండి, వదిలించండి అని అరుస్తూ ఉంటారు. స్వయం పట్టుకొని ఉంటారు మరియు తండ్రి వదిలించాలంటారు, అలా ఎందుకు? కావున బాబా సదా వదిలేంచేందుకు యుక్తిని తెలియజేస్తారు. కానీ వదలవలసినదైతే స్వయమే కదా! మీరు చేస్తే మీరే వదులుతారు. ఇది కూడా బాబాయే చేస్తే మరి పొందేది ఎవరు? బాబా చేస్తే మీరు పొందుతారా? కావుననే బాబా చేయువానిగా అయి నిమిత్తంగా మిమ్మల్ని ఉంచుతారు. కావున మహారాష్ట్ర మరియు రాజస్థాన్లో పక్షులందరూ సుందరంగా ఉన్నారు కదా!

బాంబేలో సుందరమైన పక్షులు ఉంటాయి కదా! అలాగే రాజస్థాన్లో కూడా ఉంటాయి. అందరూ బాబా యొక్క సుందరమైన పక్షులే, రెక్కలు ఉన్న పక్షులే. కాని కొమ్మలలోని పక్షులో లేక ఎగిరే పక్షులో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. కొందరికి అలవాటు ఉంటుంది. ఎంతగా ఎగిరించినా మళ్ళీ వెళ్ళి కూర్చుండిపోతారు. ఏ విషయంలోనైనా వశీభూతులవ్వడము అనగా కొమ్మను చేతితో పట్టుకోవడము.  వశీకరణ మంత్రాన్ని మర్చిపోతే వశీభూతులవుతారు. మరి మహారాష్ట్ర పక్షులు ఎవరు? ఎగిరే పక్షులు మొత్తం మహారాష్ట్ర పక్షులంతా ఎటువంటివారు? మీరంతా ఎగిరే పక్షులా, కొమ్మలలో ఉండేవారా? రాజస్థాన్ నుండి ఎటువంటి పక్షులు వచ్చారు? 

వదిలితే ముక్తులవుతాము అని భావించేవారా లేక వదిలేసాము, ముక్తులైపోయాము అని భావించేవారా? అలసిపోతే కొమ్మను పట్టుకుంటారు. రాజస్థాన్ పక్షులు చాలా సుందరమైనవి, ప్రసిద్ధమైనవి. మీరు నాట్యం చేసే పక్షులే కదా! ఎవరికీ వశమవ్వరు కదా! చుట్టూ తిరిగే పక్షులు అనగా బాగా ఆలోచిస్తూ ఉండేవారు. ఇది చేస్తాము. ఇది చేసి చూపిస్తాము అని అంటారు కాని తిరుగుతూనే ఉంటారు. సమీపంగా ఎగరరు. చేద్దాములే, జరుగుతుందిలే, చూపిద్దాములే, ఆలోచిద్దాములే... ఇలా లేలే అంటూ ఉండేవారు కూడా ఎందరో ఉన్నారు. వీరు చుట్టూ తిరుగుతూ ఉండేవారు. మరి మీరు ఎటువంటి గ్రూపును తీసుకువచ్చారు? బాంబే నుండి ఎవరిని తీసుకువచ్చారు? రాజస్థాన్ నుండి ఎవరిని తీసుకువచ్చారు? అందరూ సుందరమైనవారే, ఎందుకంటే బాబాకు చెందినవారిగా అయిపోయారు. బ్రాహ్మణులుగా అవ్వడము అంటే రంగు అంటుకోవడము. రంగు వచ్చేసింది. అలాగే రెక్కలు కూడా వచ్చేసాయి, ఇక మిగిలింది - మీరు వదిలితే స్వతంత్రులవుతారు. అచ్ఛా- ఈ రోజు రమణీయులైన పిల్లలు వచ్చారు కదా, కావున బాప్ దాదా కూడా వతనం యొక్క రమణీకమైన విషయాలు వినిపించారు. అచ్ఛా!

ఈ విధంగా సదా బాబా సమానంగా, ఎగిరే పక్షులుగా అయ్యే వారికి, సదా అనంతమైన సేవలో పరిక్రమణ చేసేవారికి, సదా అన్నిరకాల కొమ్మల యొక్క బంధనల నుండి ముక్తులుగా ఉండేవారికి, ఇటువంటి సదా స్వతంత్ర పక్షులకు, సదా బాబా యొక్క వేలిపై నాట్యం చేసే అనగా శ్రీమతం యొక్క ఆధారంపై సదా శ్రేష్ఠ సంకల్పాలు, మాటలు మరియు కర్మలు చేసే ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా యొక్క మధుర మిలనము - రాజస్థాన్ మరియు మహారాష్ట్ర జోన్లతో

1. ఎవరి నరనరాలలో అయితే రాముని స్మృతి యొక్క శబ్దము ఉంటుందో వారే సత్యమైన సీతలు.

మీరు స్వయాన్ని సత్యమైన సీతలుగా భావిస్తున్నారా? సత్యమైన సీత అనగా ప్రతి అడుగును శ్రీమతం యొక్క రేఖ లోపల వేసేవారు. మరి సదా మీరు రేఖ లోపల ఉంటారు కదా! రాముడు ఒక్కడే, మిగిలినవారంతా సీతలే. సీతలు రేఖ లోపలే కూర్చోవాలి. సదా బాబా యొక్క స్మృతి, సదా బాబా యొక్క శ్రీమతము అనే రేఖ లోపల ఉండేవారే సత్యమైన సీతలు. శ్రీమతం లేకుండా ఒక్క అడుగు కూడా ఉండకూడదు. ఏ విధంగా రైలును పట్టాలపై నిల్చోబెట్టినప్పుడు అది దానంతటదే ఆ దారి గుండా వెళుతూ ఉంటుందో అలాగే రోజూ అమృతవేళ స్మృతి యొక్క రేఖపై నిల్చోండి. అమృతవేళ పునాది వంటిది, అమృతవేళ సరిగ్గా ఉంటే రోజంతా సరిగ్గా ఉంటుంది. ప్రవృత్తిలో ఉండేవారు వారికి విశేషంగా అమృతవేళ యొక్క ఫౌండేషన్ పక్కాగా ఉండాలి. అప్పుడు రోజంతా స్వతహాగానే సహయోగం లభిస్తూ ఉంటుంది. కాని ప్రవృత్తిలో ఉంటూ కూడా సదా ఒక్క తండ్రి యొక్క సత్యమైన సీతగా అయి ఉండండి. సీతకు సదా రాముని యొక్క స్మృతి ఉండాలి. నరనరాలలోనూ రాముని స్మృతి యొక్క శబ్దము ఉండాలి. మీరు ఇటువంటి సత్యమైన సీతలే కదా! దీనినే అతీతముగా మరియు ప్రియముగా ఉండడం అని అంటారు. ఎంతగా అతీతంగా ఉంటారో అంతగా బాబాకు ప్రియమైనవారిగా ఉంటారు.

2. ప్రతి అడుగులోనూ కోటానురెట్ల సంపాదనకు సాధనము - స్వయాన్ని విశేష ఆత్మగా భావిస్తూ నడుచుకోండి.

సదా ప్రతి అడుగులోనూ కోటానురెట్ల సంపాదనను జమా చేసుకునేందుకు సాధనము ప్రతి అడుగులోనూ స్వయాన్ని విశేష ఆత్మగా భావించడము. కావున స్మృతి ఎలా ఉంటుందో దానిని బట్టి స్థితి స్వతహాగానే ఏర్పడుతుంది. కర్మలు కూడా విశేషమైపోతాయి. కావున నేను విశేష ఆత్మను అని సదా ఈ స్మృతి ఉండాలి. ఎందుకంటే మీరు నన్ను మీ సొంతం చేసుకున్నారు. ఇంతకన్నా పెద్ద విశేషత ఇంకేముండగలదు? భగవంతుని పిల్లలుగా అయిపోవడము అన్నింటికన్నా పెద్ద విశేషత. సదా ఇదే స్మృతిలో ఉండడం అనగా అభినయిస్తున్నారు. కోటాను రెట్ల సంపాదనను జమా చేసుకోవడము. ఎవరికి చెందినవారిగా అయ్యారు మరియు ఎలా అయ్యారు అన్నది స్మృతిలో ఉంచుకున్నా సంపాదన జరుగుతూ ఉంటుంది. విశ్వంలోని ఆత్మల యొక్క దృష్టి ఈ బ్రాహ్మణ జీవితము ఆది నుండి అంతిమం వరకూ స్టేజ్ పై పాత్రను అభినయించే జీవితం. నేను అనంతమైన విశ్వం యొక్క స్టేజీ పైన ఉన్నాను అన్నది సదా స్మృతిలో ఉన్నట్లయితే స్వతహాగానే ప్రతి కర్మ పైనా ధ్యానము ఉంటుంది. ఇంతటి అటెన్షన్ ను ఉంచి కర్మ చేసినట్లయితే సంపాదన జమా అవుతూ ఉంటుంది.

3. సమీప ఆత్మలకు గుర్తు - సదా బాబా సమానంగా ఉండడం.

సదా స్వయాన్ని బాబాకు సమీప ఆత్మగా భావిస్తున్నారా? సమీప ఆత్మలకు గుర్తు ఏమిటి? సదా బాబా సమానంగా ఉంటారు. బాబా గుణాలు ఏవైతే ఉన్నాయో అవి పిల్లల గుణాలుగా ఉంటాయి. తండ్రి యొక్క కర్తవ్యము సదా పిల్లల యొక్క కర్తవ్యంగా ఉంటుంది. ప్రతి సంకల్పము మరియు కర్మలో బాబా సమానంగా ఉండడమునే సమీప ఆత్మ అని అంటారు. ఎవరైతే సమీప స్థితిలో ఉంటారో వారు సదా విఘ్న వినాశకులుగా ఉంటారు. వారు ఎటువంటి విఘ్నానికి వశీభూతులవ్వరు. విఘ్నాలకు వశీభూతులైనట్లయితే విఘ్నవినాశకులు అని పిలవబడజాలరు. ఎటువంటి విఘ్నమునైనా దాటేవారినే విఘ్నవినాశకులు అని అంటారు. కావున ఎప్పుడూ ఎటువంటి విఘ్నమునూ చూసి కలత చెందడం లేదు కదా! ఎందుకు మరియు ఏమిటి అనే ప్రశ్నలైతే కలగడం లేదు కదా? ఈ స్మృతి ఉన్నట్లయితే విఘ్నవినాశకులుగా అయిపోతారు. అనేకసార్లు చేసిన విషయమునే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. మీరు ఇటువంటి సహజయోగులు. ఈ నిశ్చయంలో ఉండే విఘ్నవినాశక ఆత్మలు స్వతహాయోగులుగా మరియు సహజయోగులుగా ఉంటారు.

4. సంగమ యుగము సమర్థ యుగము. దీని ద్వారా వ్యర్థమును సమాప్తం చేసి సమర్థులుగా అవ్వండి. 

సదా స్వయాన్ని సమర్ధ ఆత్మలుగా భావిస్తూ నడుచుకుంటున్నారా? సర్వశక్తివంతుని స్మృతి ఉన్నట్లయితే మీరు స్వతహాగానే సమర్థులు. సమర్థ ఆత్మల యొక్క గుర్తులు ఏమిటి? ఎక్కడైతే సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్ధము సదాకాలికంగా సమాప్తమైపోతుంది. సమర్థ ఆత్మలు అనగా వ్యర్థము నుండి దూరమయ్యేవారు. సంకల్పంలో కూడా వ్యర్ధం ఉండకూడదు. ఇటువంటి సమర్థుడైన తండ్రి పిల్లలు సదా సమర్థులుగా ఉంటారు. అర్థకల్పం వ్యర్థం ఆలోచించి వ్యర్థం చేశారు. ఇప్పుడు ఈ సంగమ యుగము సమర్థయుగము. సమర్థ యుగము, సమర్థుడైన తండ్రి, సమర్థులైన ఆత్మలు. మరిక వ్యర్థం సమాప్తమయ్యింది కదా! మేము సమర్ధయుగవాసులము, సమర్థుడైన తండ్రి యొక్క పిల్లలము. సమర్థ ఆత్మలము అన్నది సదా స్మృతిలో ఉంచుకోండి. సమయం ఎలా ఉందో, తండ్రి ఎలా ఉన్నారో అలాగే పిల్లలూ ఉండాలి. కలియుగం వ్యర్థము. కలియుగ తీరాన్ని వదిలివేసాక సంగమయుగ వాసులుగా అయిపోయాక స్వతహాగానే వ్యర్ధం యొక్క తీరం నుండి దూరమైపోయారు. కావున కేవలం సమయం యొక్క స్మృతి ఉన్నట్లయితే సమయానుసారంగా స్వతహాగానే కర్మ జరుగుతుంది. అచ్ఛా ఓం శాంతి.

Comments