21-03-1981 అవ్యక్త మురళి

21-03-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సత్యమైన హెలీ పండుగ ఎలా జరుపుకోవాలి?

ఈ రోజు చింతలేని పురానికి చక్రవర్తి తన నిశ్చింత పురములోని యజమానులను కలుసుకునేందుకు వచ్చారు. ఇలాంటి యజమానులను చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే బాలకులుగా ఉన్న ప్రతి ఒక్కరూ యజమానులుగా అయ్యారు. సంగమయుగానికి, మూలవతనానికి, స్వర్గానికి - ఈ మూడు నిశ్చింత పురాలకు యజమానులుగా ఉన్నారు. బాప్ దాదా ఇలాంటి యజమానులను చూసి, యజమానులందరికి ఈ రోజు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రంగులు చల్లుకునే హోలీ పండుగ శుభాకాంక్షలు కాదు. కానీ బాబా వారిగా అయ్యారు (హో లియే) కనుక శుభాకాంక్షలు. అందరూ బాబా వారిగా అయిపోయారు(హో లియే). అయిపోయారు కదా! ఏ పాట పాడ్తారు? “తండ్రి వారిగా అయిపోయాము" ఎవరైతే తండ్రి వారిగా అయిపోయారో వారికే హోలీ శుభాకాంక్షలు. అవుతారా లేక అయిపోయారా? హోలీ అనగా - గడిచిపోయినదేదో గడిచిపోయింది అని భావించి బాబా వారిగా అయిపోతారో అప్పుడు సంతోషాన్ని పిచికారీ చేసుకోగలరు. పిచికారితో రంగులు చల్లుకుంటారు కదా! అయితే మీ పిచికారి నుండి ఎన్ని ధారలు వస్తున్నాయి? ఈ రోజుల్లో ఒకే పిచికారీతో భిన్న భిన్న రంగులు కూడా వేసుకుంటారు. ఆ రంగులైతే అంటుకుంటాయి, మరలా తొలగిపోతాయి. అందువలన వారు తమ వస్త్రాలను లేక ముఖాన్ని సరి చేసుకోవలసి వస్తుంది. కాని మీ రంగు ఎంత శ్రేష్ఠమైనది మరియు ప్రియమైనదంటే ఆ రంగు ఎవరికి వేసినా వారు ఇంకా వేయండి, ఎల్లప్పుడూ వేస్తూనే ఉండండి అని అంటారు. తమ సంతోషపు పిచికారి మనుష్యులను ఎంతగానో పరివర్తన చేసి దేవాత్మలుగా తయారు చేస్తుంది. ఒక ధార - “నేను ఒక శ్రేష్ఠ ఆత్మను". ఇది సంతోషము కలిగించే ధార. నేను విశ్వ యజమానికి బాలకుడను, నేను సృష్టి ఆది-మధ్య-అంత జ్ఞాన సాగరుడను, నేను ఉన్నతోన్నతమైన తండ్రితో పాటు ఈ శ్రేష్ఠమైన రంగస్థలముపై హీరో పాత్రధారిని - ఇలాంటి ఎన్నో సంతోషం కలిగించు పాయింట్ల ధారలు మీ పిచికారీలో ఉన్నాయి. ఇలాంటి సంతోష పిచికారి ద్వారా ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారు కదా! రెండవది - సర్వ ప్రాప్తులతో నిండిన ధారల పిచికారి. ఉదాహరణకు అతీంద్రియ సుఖము. ఆత్మ-పరమాత్మల కలయికలోని ఆత్మిక ప్రేమ ఇలా ఇంకా ఆలోచించండి. ఇవి సాధారణమైనవి.

మూడవ పిచికారి - సర్వ శక్తుల పిచికారి. విదేశీయులు ఈ పిచికారీ ఎప్పుడైనా చూచారా? ఉదాహరణానికి పన్నీరు బుడ్డికి ఎన్ని రంధ్రాలుంటాయి? ఇలాంటి పిచికారీతో దూరం నుండి వేసినట్లయితే చాలా ఫోర్సుతో దూరం వరకు వెళ్తుంది. జ్ఞానం యొక్క అలౌకిక పిచికారీనైతే చూశారు కదా! మంచిది. నాల్గవ పిచికారీ - జ్ఞానంలోని ముఖ్యమైన పాయింట్లు. ఇలాంటి పిచికారీలతో హోలీ ఆడినట్లయితే దేవాత్మలుగా అయిపోతారు. గోపీవల్లభుడు గోప-గోపికలతో ఒక్క రోజు మాత్రమే హోలీ ఆడరు కానీ సంగమ యుగములోని అన్ని రోజులూ హోలీ రోజులే. సంగమ యుగంలో హోలీ(పవిత్ర) రోజులు మరియు సత్యయుగంలో హాలిడేలు(శెలవు రోజులు) ఉంటాయి. ఇప్పుడు హాలిడే జరుపుకోకూడదు. ఇప్పుడు కష్టము కూడా ప్రేమతో చేస్తున్నందున హాలిడేలను(సెలవు రోజులుగా) అనుభూతి చేయిస్తుంది. బాప్ దాదా పిల్లల యొక్క ఒక దృశ్యాన్ని పైనుండి చూశారు. పిల్లలు కష్టపడుతున్న దృశ్యాన్ని చూశారు.(ఎక్కడ కొత్త హాలు తయారవుతూ ఉందో అక్కడ అన్నయ్యలు రోజూ రాళ్లు ఎత్తుతున్నారు). మందిరాలలో పూజింపబడేవారు, ప్రకృతి కూడా దాసిగా అయ్యి సేవ చేస్తుంది, తండ్రి కూడా వారి మాలను స్మరిస్తూ ఉంటారు. అయితే అటువంటి పిల్లలు ఇప్పుడేం చేస్తున్నారు? రాళ్లు మోస్తూ ఉన్నారు. ప్రేమ కారణంగా ఈ కష్టము కష్టమనిపించదు. ఇది మా కార్యము, ఇంటి కార్యము, యజ్ఞ సేవ అని భావించారు. కావున బాప్ దాదాపై ప్రేమ ఉన్న కారణంగా ఈ కష్టం కూడా ఒక ఆటలాగా అనిపించింది కదా. సంగమ యుగంలో ఎంత కష్టపడితే అంతగా స్వాతంత్య్రముంటుంది. ఎందుకంటే బుద్ధి, శరీరము ఎంత బిజీగా ఉంటే అంత వ్యర్థ సంకల్పాల నుండి ఫ్రీగా ఉంటారు. అందువలన సంగమ యుగంలో శ్రమ చేయడమే హాలిడే అవుతుంది. పిల్లలను చూసి బాప్ దాదా పరస్పరంలో ఆత్మిక సంభాషణ చేసుకుంటున్నారు. ఇప్పుడు హాలు తయారు చేయుటకు రాళ్లు మోస్తున్నారు, కాని ఈ ఒక్కొక్క రాయి వేల రెట్లు వృద్ధి చెంది వజ్రాలు, ముత్యాలుగా అవుతాయి. మీ మహళ్లలో ఈ వజ్రాలు, ముత్యాలు ఎంతో అలంకరింపబడి ఉంటాయి. అక్కడ మహల్ తయారు చేసుకోవలసిన అవసరం లేదు. ఇక్కడ చేసిన శ్రమకు ఫలముగా అక్కడ అలంకరింపబడిన మహల్ లభిస్తుంది. చాలా సంతోషంగా సేవలో మగ్నమై ఉండుట బాప్ దాదా చూశారు. ఇప్పుడు హోలీ ఎలాంటిదో అర్థమయ్యిందా!

మొదట కాల్చాలి తర్వాత జరుపుకోవాలి. ఒక రోజు కాలుస్తారు, రెండవ రోజు జరుపుకుంటారు. మీరు కూడా ఒక రోజు హోలీ అనగా జరిగిపోయిందేదో జరిగిపోయిందని అంటారు అనగా వెనుకటివన్నీ కాల్చేస్తారు. అప్పుడే మేము బాప్ దాదావారిగా అయ్యామని పాట కూడా పాడ్తారు. ఇదే సంతోషంగా జరుపుకోవడం. స్మృతిచిహ్నం యొక్క హోలీ జరుపుకునే రోజు దేవతల రూపాన్ని బాగా అలంకరించి సంపూర్ణ రూపంలో తయారుచేస్తారు. కాని అందులో కూడా విశేషించి మస్తకంపై లైటు వెలిగిస్తారు. ఇది మీ స్మృతిచిహ్నము. ఎప్పుడైతే మస్తకంలో జ్యోతి వెలుగుతుందో అప్పుడు దేవతగా తయారైపోతారు. తండ్రి వారిగా అయిపోయారంటే దేవతగా తయారైపోతారు. మీరు అనుభవం చేస్తారు, వారు మీ అనుభవాలను స్మృతిచిహ్నంగా జరుపుకుంటారు. మీరు హోలీ ఎలా జరుపుకుంటారో, వారు ఏం చేస్తారో అర్థమయిందా? యథార్థం ఏమిటో, స్మృతిచిహ్నం ఏమిటో అర్థమయిందా?(పెద్ద పెద్ద వారు మహామూర్తుల సమ్మేళనాలు కూడా చేస్తారు). ఇది కూడా రైటే. ఎందుకంటే తండ్రి వచ్చిన తర్వాత గొప్ప గొప్ప వారు కూడా మహామూర్తులుగా అవుతారు. ఎంత గొప్పవారో అంత మూర్ఖులుగా అవుతారు. తండ్రినే తెలుసుకోలేకుంటే మహామూర్ఖులుగా అయినట్లే కదా. ఇది కూడా తమ కల్పక్రితపు మహామూర్ఖతకు స్మృతిచిహ్నంగా జరుపుకుంటారు. మొత్తం అర్థం లేని వ్యతిరేక కార్యాలే చేస్తుంటారు. తండ్రి “నన్ను తెలుసుకోండి" అని చెప్తూ ఉంటే వారు తండ్రి లేనే లేరని అంటారు. కావున వ్యతిరేకం అయ్యింది కదా. మీరు తండ్రి వచ్చారని చెప్తారు, వారు అది జరగదని అంటున్నారు. కావున ఉల్టా పనులు చేస్తున్నట్లే కదా. ఇలా పండుగ గురించి చాలా విస్తారం చేసేశారు. కాని సారమేమంటే - ఇది తండ్రి,
పిల్లల మంగళ మిలనానికి స్మృతిచిహ్నము. సంగమ యుగమే మంగళ మిలనము చేసే యుగము. భారతదేశంలో ఉండే పిల్లలకైతే ఈ విషయాలు తెలుసు. ఈ రోజు విదేశాల నుండి వచ్చిన పిల్లలకు వినిపిస్తున్నారు. ఎందుకంటే రాజ్యం భారతదేశంలోనే చేయాలి కదా! అమెరికాలో చేయరు కదా. భారతదేశ విషయాలు తప్పకుండా వింటారు. అర్థం చేసుకుంటారు కదా. మీ విషయాలను ఎలా తయారుచేశారో చూడండి. ఎంతో తేడాగా చేసేశారు.

ఇలా అయిపోయినదానిని అయిపోజేసి గతించినదానికి ఫుల్ స్టాప్) హోలీ పాటలు పాడేవారికి, సదా భిన్న భిన్న పిచికారీల ద్వారా ఆత్మిక వస్త్రాలను రంగులతో అలంకరించుకునే వారికి, సదా తండ్రితో మంగళ మిలనము జరుపుకునేవారికి, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యేవారికి చింతలేని పురాలకు యజమానులుగా ఉండేవారికి బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

మురళీలైతే చాలా విన్నారు. ఇక వినడానికి ఏమైనా ఉందా? ఇప్పుడు కలుసుకోవాలి మరియు జరుపుకోవాలి. వినడం, వినిపించడం కూడా చాలా అయిపోయింది. సాకార రూపంలో వినిపించారు, అవ్యక్త రూపంలో కూడా ఎన్నో వినిపించారు. ఒక సంవత్సరం కాదు, 13 సంవత్సరాలు వినిపించారు. ఇప్పుడు 13వ సంవత్సరంలో 'నా వారిగా' అవ్వాలి కదా! నీ వాడిని అని ఇదే ధ్యాసలో ఉన్నట్లయితే మొత్తం వినిపించే సారమంతా వచ్చేస్తుంది. నిన్న పిల్లలు జరుపుకునే దృశ్యము కూడా చూశారు. బాగా నవ్వుకున్నారు, బాగా ఆడుకున్నారు. బాప్ దాదా నవ్వుతూ ఉన్నారు. ఎల్లప్పుడూ ఇలాగే నవ్వుతూ, నాట్యం చేస్తూ ఉండండి కానీ అవినాశిగా ఉండండి. బాప్ దాదా పిల్లలు ఆనందంగా, నవ్వుతూ ఉన్న దృశ్యాన్ని చూసి 'అవినాశి భవ' అనే వరదానాన్ని ఇస్తున్నారు. కాళ్లు అయితే అలసిపోతాయి. కాని బుద్ధితో సంతోషంగా నాట్యం చేస్తూ ఉండండి. అవ్యక్త వతనవాసిగా అయ్యి ఫరిస్తా డ్రస్సులో నాట్యం చేస్తూ ఉంటే అవినాశిగా నిరంతరము చేయగలరు. ఇది కూడా సంగమ యుగంలోని విధిపూర్వక మనోరంజనము. తర్వాత మరలా ఉండదు. అందువలన బాగా ఆడుకోండి, తినండి, ఆనందంగా ఉండండి. కాని 'అవినాశి' శబ్దాన్ని కూడా గుర్తుంచుకోండి. 

అమెరికా - ఒక్కొక్క రత్నము అనేకమంది ఆత్మల కళ్యాణానికి నిమిత్తంగా అయ్యారు. ఆత్మలు భ్రమించడం చూసి దయ వస్తుంది కదా. ఇప్పుడింకా ఎక్కువగా దు:ఖ హాహాకారాలు పెరుగుతాయి. సుఖ ప్రకాశము కొంచెం కూడా కనిపించదనునట్లు అనుభవం చేస్తారు. ఈ సుఖ సాధనాలన్నీ వారికి దు:ఖ సాధనాలుగా అనుభవమవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో కేవలం ఒక్క తండ్రి మరియు వారి పిల్లల సహాయం మాత్రమే వారికి కనిపిస్తుంది. మొత్తం దేశంలో అంధకారం మధ్యలో ఒకే లైట్ హౌస్ కనిపిస్తుంది. ఇది నెమ్మది నెమ్మదిగా అతిలోకి త్వరత్వరగా పోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో లైట్ మరియు మైట్ ఇచ్చే అభ్యాసమున్న ఆత్మలు కావాలి. ఇదే అభ్యాసంలో ఉంటున్నారా? ఒకే సమయంలో మూడు రకాల సేవలు చేయాల్సి ఉంటుంది. మనసుతో, వాచాతో, కర్మణాతో కూడా చెయ్యాలి. కర్మణా సేవతో వారిని కూర్చోబెట్టుకొని ఓదార్చాలి. కావున ఇలాంటి ఏర్పాట్లు చేస్తూ పోండి. ఎందుకంటే అమెరికాలో ఎన్ని ఎక్కువ వైభవాలు ఉన్నాయో, ఎంత పెద్ద స్థానంగా ఉందో అంత ఎక్కువగా దు:ఖము కూడా అనుభవము చేస్తారు. ఇప్పుడు వినాశనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి కదా! వినాశనానికి నిమిత్తంగా ఉన్న ఆత్మలతో పాటు మీరు స్థాపనకు నిమిత్తంగా ఉన్న ఆత్మలు కూడా మీ జండాను ప్రత్యక్షం చేస్తారు. కనుక స్థాపనా కార్యంలో విశేష ఆత్మను ఎవరు తీసుకొస్తారు? (అమెరికా) విశేష ఆత్మలను తీసుకొచ్చినట్లయితే అమెరికా సేవాకేంద్రం కూడా వి.ఐ.పి గా అవుతుంది కదా. 

స్యాన్ ఫ్రాన్సిస్ కో- స్థానం ఎలాంటిదో, స్థానం అనుసారంగా ఏ జండాను ఎగురవేస్తారు! సైన్సు వాళ్ల స్థానాలు ఇంకా చాలా ఉన్నాయి. కాని ఇక్కడి విశేషత ఏమిటి? ధార్మిక నేతలు చాలామంది ఉన్నారు. ఒక్క ధార్మిక నేతకైనా అనుభవం చేయిస్తే పేరు ఎంతో ప్రసిద్ధి చెందుతుంది. కావున ఈ విశేషతను చూపించండి. వాళ్లు కూడా ప్రాక్టికల్ అనుభవం విన్నారంటే అనుభవం ఆధారంతో ఆకర్షితమవుతారు. కావున ఈ నవీనతను చూపించండి. కుమారీలు ఇలాంటి విద్వాంసులకు బాణాలు వేశారు కదా! ఇది కల్పక్రితపు స్మృతిచిహ్నం కదా! కావున వారు ఎలాంటి కుమారీలు? మీరే కదా! ఎవరైనా నిమిత్తంగా కండి. బ్రహ్మకుమారులు సమీపంలోకి తీసుకొస్తే బ్రహ్మకుమారీలు విజయాన్ని ప్రాప్తి చేసుకొని విజయ జండాను ఎగురవేస్తారు. బ్రహ్మకుమారులు వేటను తీసుకొస్తే మీరు ఆ వేటను తమవారిగా చేసుకొని మరజీవాగా తయారు చేస్తారు. మొదటి కార్యము పాండవులది. ఫలితం వచ్చేందుకు కొంత సమయం పడుంది. ఏ బీజం వేస్తున్నారో దాని ఫలం తప్పకుండా వస్తుంది. ప్రేమతో వారికి సేవ చెయ్యాలి. వారిని మీరు మహాత్ములు, మహాత్ములు అని అంటూ తమ మహానతను చూపించాలి. ఒకవేళ మొదటే వారిని - మీకు ఏమీ రాదు, మీరు తప్పు చేస్తున్నారని అంటే వారు మీరు చెప్పేది వినను కూడా వినరు. అందువలన మొదట వారిని మహిమ చెయ్యండి. మురళీలో వింటారు కదా. ఎలుక ఏమి చేస్తుంది? మొదట ఊదుతుంది తర్వాత కొరుకుతుంది. ఇలా చెయ్యండి. ఎందుకంటే వారు వికారీ ప్రపంచానికి స్తంభాలు(పిల్లర్లు) ఇచ్చి నిలబెట్టే పని చేశారు కదా! ఏదైతే చేశారో దానికి మహిమ చేస్తారు కదా. మంచిది, మంచిది అని అంటూ మంచిగా చేస్తూ వెళ్లండి. కనుక మీరు ఎలాంటి కార్యము చేయాలో అర్థమయిందా. వారు కూడా మీ సందేశకులుగా అవుతారు. వారి ధ్వని గొప్పగా ఉంటుంది కదా! పెద్దవారు మైకులుగా ఉంటారు. అందువలన ఇలాంటి వారిని సంపర్కంలోకి తీసుకురండి. వారి పేరు మంచిగా ఉండాలి, గొప్పగా ఉండాలి. మీరు వారి ద్వారా మీ పెద్ద కార్యాన్ని నెరవేర్చుకోవచ్చు. బ్రాహ్మణాత్మలను వృద్ధి చేసే సేవ అయితే చేయాల్సిందే. కానీ ఇది అదనంగా చేయాలి. ఏదైనా పెద్ద ప్రోగ్రాం పెట్టండి. ఆ ప్రోగ్రాంలో ఇటువంటి వి.ఐ.పిలకు ఏదైనా హోదా ఇచ్చి పిలిపించేందుకు ప్రయత్నించండి. వారిని ఈ కార్యంలో సహయోగులుగా చేసుకోండి. వారి వద్దకు ఎవరైనా అనుభవీ పరివారాన్ని తీసుకెళ్తే వారి ప్రాక్టికల్ జీవితపు ప్రభావం వారిపై ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే వారు కూడా వీళ్లు ఏం చేస్తున్నారో నిదర్శనం చూడాలని కోరుకుంటారు. 

ఆఫ్రికా - సేవను వృద్ధి చేయుటలో ఉత్సాహ - ఉల్లాసాలు సదా ఉంటాయి కదా. ఎలాగైతే చేప నీరు లేకుండా ఉండలేదని ఉదాహరణ ఇస్తారో అలా బ్రాహ్మణులు సేవ లేకుండా ఉండలేరు. ఎందుకంటే సేవ చేయుట ద్వారా ఒకటేమో స్వఉన్నతి, దానితో పాటు అనేక ఆత్మల ఉన్నతి కూడా జరుగుతుంది. కావున తమ ఉన్నతి కారణంగా కూడా ప్రాప్తి జరుగుతుంది, అంతేకాక ఇతరుల ఉన్నతి ఏదైతే జరుగుతుందో అందులో కూడా భాగం జమ అవుతుంది. అందువలన బాప్ దాదా బ్రాహ్మణులనగా స్మృతి మరియు సేవలో సదా నిమగ్నమై ఉండేవారని చెప్తారు. స్మృతిలో ఉంటూ సేవ చెయ్యడం అనగా లాభమే లాభముంటుంది. ఎలాగైతే కష్టం ప్రేమలోకి మారిపోతుందో అలా సేవ ఫలితం రూపంలోకి మారిపోతుంది. కనుక ఇలాంటి సేవ చేయాలనే ఉత్సాహం ఉంటుందా? ఎవరు ఎంత చేస్తారో అది వారికి కోటాను రెట్లుగా జమ అవుతుంది. ఆఫ్రికాలో భావన కల్గిన సహయోగీ ఆత్మలున్నారు. సేవలో సహయోగమిచ్చే ఉమంగ-ఉత్సాహాలు బాగా ఉన్నాయి. ఒక్కొక్క రత్నం చాలా విలువైన వారే కాక అతిప్రియమైనవారు. 

“తండ్రిని చూడండి(సీ ఫాదర్)" ఈ మంత్రాన్ని సదా ఎదురుగా ఉంచుకొని ఉన్నతి చెందే కళలో నడుస్తూ పోండి. తండ్రిని చూడటం, తండ్రిని ఫాలో చేయడం చేస్తే ఎగురుతూ ఉంటారు. ఆత్మలను ఫాలో చేస్తే కిందికి వచ్చేస్తారు. ఎప్పుడూ ఆత్మలను చూడకండి. ఎందుకంటే ఆత్మలందరూ పురుషార్థులే. పురుషార్థిని అనుసరిస్తే పురుషార్థిలో మంచితనమూ ఉంటుంది, దానితో పాటు కొంత లోపం కూడా ఉంటుంది, సంపన్నంగా ఉండరు. కావున తండ్రిని ఫాలో చెయ్యండి, సోదరీ సోదరులను కాదు. తండ్రి ఎలాగైతే ఏకరసంగా ఉన్నారో ఫాలో ఫాదర్ చేసేవారు కూడా ఏకరసంగా ఉంటారు. 

భారతవాసీ పిల్లలను చూస్తూ బాప్ దాదా అంటున్నారు - విదేశీయుల భాగ్యం విదేశీయులది, భారతీయుల భాగ్యం భారతీయులది. భారతదేశంలోని వారు భాగ్యశాలురుగా కాకపోతే విదేశాల వారు ఎలా వస్తారు. విదేశీయుల మహిమ లాస్ట్ నుండి ఫాస్ట్ లెక్కతో ఉంది. కాని ఎవరు ఆదిలో ఉన్నారో వారు ఆదిలోనే ఉంటారు. భారతవాసులు భగవంతుని తమవారిగా చేసుకున్నారు. వారికి భగవంతుడు తయారుగా, రెడీమేడ్ గా లభించారు. ఒకవేళ భారతవాసులు తండ్రిని గుర్తించకపోతే విదేశీయులకు పరిచయం ఎవరిస్తారు? తండ్రిని ప్రత్యక్షం చెయ్యడానికి నిమిత్తంగా మొదట భారతవాసులే ఉన్నారు. గుప్తం నుండి మొదట ప్రత్యక్షం చేసినవారు భారతవాసులే. ఎలాగైతే మొదట దుకాణం ప్రారంభించినప్పుడు చిన్న తోపుడు బండిపై లేక కాలిబాటపై పెడ్తారు తర్వాత వృద్ధి చెందుతూ పెద్ద దుకాణంగా అవుతుందో అలా భారతవాసులు మొదట కష్టపడ్డారు. దుకాణం తెరిచారు. అప్పుడు కదా మీరు వచ్చింది. భారతవాసీ పిల్లలు ఎంత సహించారో అంత విదేశీయులు ఎక్కడ సహించారు. ఎవరైతే సహించడంలో నంబరువన్ గా ఉన్నారో వారికి వారసత్వం కూడా అదే లెక్కతో లభిస్తుంది. మీరు ప్రాక్టికల్ గా చరిత్రను తయారు చేసేవారు, వారు వినేవారిగా ఉంటారు. మీరు మా కళ్లతో బ్రహ్మలో శివబాబాను చూశామని అంటారు - ఇదే మీ విశేషత. వాస్తవానికి అందరూ ఒకరి కంటే ఒకరు ముందున్నారు. ఎందుకంటే డ్రామానుసారం సంగమ యుగానికి ఎలాంటి వరదానం లభించిందంటే - ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంది. ఇప్పుడు హోలీ విశేషతను, ఉపన్యసించేవారి విశేషతను చూడండి. భోలీదాదీ లేకపోయినా పని నడవదు కదా. మంచిది, ఈమె కూడా హోలీ ఆడుతూ ఉంది. ఈ రోజంతా జరుపుకోవడమే. ఈమె కూడా పిచికారీ చేస్తూ ఉంది. 

Comments