* 20-01-1982 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించేందుకు సహజ విధానము - గానం చేయడము మరియు నాట్యం చేయడం.
ఈరోజు దీపము తన దీపపు పురుగుల యొక్క సభలోకి వచ్చింది. ఈ ఆత్మిక సభ ఎంత అలౌకికమైనది మరియు శ్రేష్ఠమైనది! దీపమూ అవినాశియే, అలాగే దీపపు పురుగులు కూడా అవినాశియే. అలాగే వీరిరువురి ప్రీతి కూడా అవినాశియే. ఈ ఆత్మిక ప్రీతిని గూర్చి వీరిరువురూ తప్ప ఇంకెవరూ తెలుసుకోలేరు. ఎవరైతే తెలుసుకున్నారో వారే ప్రీతిని నిర్వర్తించారు మరియు వారే సర్వమునూ పొందారు. ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించడం అనగా సర్వమునూ పొందడం. నిర్వర్తించడం రాకపోతే పొందడం కూడా రాదు. ఈ ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించడం ఎంత సహజమో తెలుసుకోగలరు. ప్రీతి యొక్క రీతి ఏమిటో మీకు తెలుసు కదా? ఇది కేవలం రెండు విషయాల యొక్క రీతి మరియు అది కూడా ఎంత సరళమంటే దానిని గూర్చి మీ అందరికీ తెలుసు మరియు దానిని మీరు చేయగలరు కూడా! ఆ రెండు విషయాలు - ఒకటి గానం చేయడం మరియు ఇంకొకటి నాట్యం చేయడం. ఈ విషయంలో అందరూ అనుభవజ్ఞులే కదా? గానం చేయడం మరియు నాట్యం చేయడం అందరికీ ఇష్టమే కదా! కావున ఇక్కడ చేసేది ఏముంది? అమృతవేళ నుండి గీతమును గానం చేయడం ప్రారంభిస్తారు. దినచర్యలో కూడా గీతము ద్వారానే లేస్తారు. కావున బాబా యొక్క లేక మీ శ్రేష్ఠ జీవితము యొక్క మహిమను గానం చేయండి. జ్ఞానము యొక్క గీతమును గానం చేయండి. సర్వ ప్రాప్తుల యొక్క గీతమును గానం చేయండి. ఈ గీతమును గానం చేయడం రాదా? వస్తుంది కదా? కావున గీతమును గానం చేయండి మరియు సంతోషములో నాట్యం చేయండి. సంతోషములో నాట్యం చేస్తూ, చేస్తూ ప్రతి కర్మనూ చేయండి. ఏ విధంగా స్థూలమైన నాట్యములో కూడా మొత్తం శరీరము యొక్క నాట్యము. డ్రిల్ జరుగుతుందో భిన్న, భిన్న ఫోజులతో నాట్యం చేస్తారో అలాగే సంతోషము యొక్క నాట్యములో కూడా భిన్న భిన్న కర్మల యొక్క భంగిమలను ప్రదర్శిస్తారు. కాసేపు చేతులతో పని చేస్తారు. కాసేపు కాళ్ళతో పని చేస్తారు. అవి పనులు చేయడం కాదు. అవి నాట్యములోని భిన్న భిన్న భంగిమలు. కాసేపు చేతులతో నాట్యం చేస్తారు, కాసేపు కాళ్ళతో నాట్యం చేస్తారు. కావున కర్మయోగులుగా అవ్వడం అనగా భిన్న భిన్న రకాలుగా సంతోషములో నాట్యమాడుతూ ఉండడం. ఎవరికైతే గానం చేయడం మరియు నాట్యం చేయడం తెలుసో అటువంటివారే దీపమైన బాప్ దాదాకు ఇష్టము. ఇదే ప్రీతి యొక్క రీతి. కావున ఇది కష్టమేమీ కాదు కదా? ఇది కష్టమనిపిస్తుందా లేక సహజమా? ఇప్పుడు మధువనములో అయితే ఈజీ. ఈజీ అని అంటున్నారు కానీ అక్కడకు వెళ్ళాక కూడా ఇలాగే ఈజీ, ఈజీ అని అంటారు కదా! అక్కడకు వెళ్ళి మారిపోరు కదా? (ఇక్కడ ఈజీగా ఉన్నాము. అక్కడకు వెళ్ళి బిజీ అయిపోతాము) కానీ ఈ గానం చేయడము మరియు నాట్యము చేయడంలోనే బిజీగా ఉంటారు కదా!
సదా చెవులలో ఇదే మధురమైన వాయిద్యమును వింటూ ఉండండి, ఎందుకంటే గానము మరియు నాట్యముతో పాటు వాయిద్యము కూడా కావాలి కదా! మరి ఏ వాయిద్యమును వింటూ ఉంటారు? (మురళి) ఆ మురళీలో కూడా సారమునేదైతే ప్రతి మురళీలోనూ బాప్ దాదా మధురమైన పిల్లలూ, ప్రియమైన పిల్లలూ, చాలాకాలం తర్వాత కలిసిన పిల్లలూ .. అంటూ ప్రియస్మృతులను ఇస్తారో బాబా యొక్క ఈ స్నేహము యొక్క వాయిద్యమునే సదా చెవులలో వింటూ ఉండండి. అప్పుడు ఇతర విషయాలను వింటూ కూడా అవేవీ స్మృతిలోకి రావు, బుద్ధిలోకి రావు. ఎందుకంటే ఒకే వాయిద్యమును వినడములోనే బిజీగా ఉంటారు కదా! మరి అప్పుడు వేరేవి ఎలా వింటారు? అలాగే సదా గీతమును గానం చేయడంలో బిజీగా ఉన్నట్లయితే ఇతర వ్యర్ధమైన విషయాలను మాట్లాడేందుకు ఖాళీయే ఉండదు. సదా బాబాతో పాటు సంతోషములో నాట్యం చేస్తూ ఉన్నట్లయితే మూడవ వ్యక్తి ఎవరూ డిస్ట్రబ్ చేయలేరు. ఇద్దరి మధ్యలో మూడవ వ్యక్తి ఎవరూ రాలేరు. తద్వారా మాయాజీతులుగా అయిపోతారు కదా! వినేదీ లేదు, చెప్పేదీ లేదు. అలాగే మాయ వచ్చేదీ లేదు. మరి ప్రీతి యొక్క రీతి ఏమిటి? గానం చేయడం మరియు నాట్యం చేయడం. ఎప్పుడైతే రెండింటి నుండి అలసిపోతారో అప్పుడు మూడవ విషయం - పడుకోవడం. ఇక్కడి నిదురించడం ఏమిటి? నిదురించడం అనగా కర్మ నుండి డిటాచ్ అయిపోవడం. కావున మీరు కర్మేంద్రియాల నుండి డిటాచ్ అయిపోండి. అశరీరులుగా అవ్వడం అనగా నిదురించడం. స్మృతియే బాప్ దాదా యొక్క ఒడి, కావున ఎప్పుడైతే అలసిపోతారో అప్పుడు అశరీరులుగా అయి అశరీరి అయిన బాబా యొక్క స్మృతిలో మైమరచిపోండి అనగా నిదురించండి. ఏవిధంగా శరీరము ద్వారా కూడా ఎంతగానో పాడుతూ, నాట్యం చేస్తూ అలసిపోయినప్పుడు త్వరగా నిదుర వచ్చేస్తుందో అలాగే ఈ ఆత్మిక గీతమును గానం చేస్తూ, సంతోషములో నాట్యం చేస్తూ, చేస్తూ పడుకుంటారు మరియు మైమరచిపోతారు. కావున రోజంతటిలో ఏమి చేయాలో అర్ధమయ్యిందా? డబుల్ విదేశీయులు ఇందులో చాలా అభిరుచి కలవారు. కావున ఏ విషయము యొక్క అభిరుచి ఉంటుందో అదే చేయండి...చాలు. పడుకోవడం కూడా ఎంతో అభిరుచిగా పడుకుంటారు. కావున ఈ మూడు విషయాలు చేయడం వస్తుంది కదా! మరి ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించే సహజ విధానము ఏమిటో అర్ధం చేసుకున్నారా?
అచ్చా! ఒక్క విషయాన్ని ఇక్కడ డబుల్ విదేశీయులు వదిలి వెళ్ళండి, అదేమిటి? (ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయాన్ని వినిపించారు) ఒకరు ఉదాసీనతను, మరొకరు అలసటను అని చెప్పారు). అచ్చా! దీని ద్వారా మీరు ఏవైతే చెబుతున్నారో అవి ఇంకా ఇప్పటివరకూ ఉన్నాయని అనుభవం అవుతోంది. అచ్చా - చెప్పడం అనగా వదిలివేయడం. ఒక్క శబ్దాన్ని - ఈ డిప్రెషన్, డిప్రెషన్ అనే దానిని ఇంకెప్పుడూ అనకండి. రియలైజేషన్ అనండే కానీ డిప్రెషన్ అని అనకండి. ఎవరైతే బాబాకు డైవర్స్ ఇస్తారో (విడాకులు ఇస్తారో) వారే డిప్రెషన్లోకి వస్తారు. మీరైతే బాబాకు సదా తోడుగా ఉన్నారు. కావున ఈ డిప్రెషన్ అన్న పదం శోభించదు. సెల్ఫ్ రియలైజేషన్ జరిగింది. మరి డిప్రెషన్ ఎలా ఏర్పడగలదు? కావాలంటే ఎప్పుడైతే ద్వాపరయుగం పూర్తయిపోతుందో, కలియుగం ప్రారంభమవుతుందో అప్పుడు చెప్పండి. అంతకాలం వరకు దానికి విడాకులు ఇచ్చేయండి. అచ్ఛా!
పరివర్తన భూమిలో అవినాశీ పరివర్తన చేసేవారికి, సదా ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించే వారికి, దీపమునకు ప్రియాతి ప్రియమైన దీపపు పురుగులకు, సదా ఆత్మిక గీతమును గానం చేసేవారికి, సంతోషములో నాట్యం చేస్తూ ఉండేవారికి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బాబా యొక్క ఒడిలో నిదురించేవారికి, ఇటువంటి చాలాకాలం తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
టీచర్లతో అవ్యక్త బాప్ దాదా యొక్క మిలనము (డబుల్ విదేశీ టీచర్లతో):- అందరూ తమ తమ శక్తి అనుసారముగా సేవ యొక్క ప్రమాణమును ఇచ్చారు. మరియు ఇస్తూ ఉంటారు. సేవాధారులు అనగా ప్రతి క్షణము. ప్రతి శ్వాస. ప్రతి సంకల్పములో విశ్వం యొక్క స్టేజిపై పాత్రను అభినయించేవారు. కావున సదా స్వయమును విశ్వము యొక్క స్టేజిపై హీరో పాత్రను అభినయించే శ్రేష్ఠ ఆత్మగా భావిస్తూ నడుచుకుంటూ ఉండండి. ఇది కూడా మాలో అవకాశంగా లభించింది. కావున ఇతరులకు నిమిత్తముగా అవ్వడం ద్వారా స్వయం స్వతహాగానే ఆ విషయాలలో అటెన్షన్ గా ఉంటారు. కావున సదా బాప్ దాదా యొక్క తోడుగా సేవలో ఉపస్థితులై ఉన్నాము అన్న ఈ స్మృతిలో ఉంటూ ప్రతి కార్యమునూ చేస్తూ ఉండండి, తద్వారా సదా ముందుకు వెళుతూ ఉంటారు మరియు ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. మంచి ధైర్యమును ఉంచారు. బాబా యొక్క సహాయం కూడా లభిస్తోంది మరియు లభిస్తూనే ఉంటుంది. నిమిత్త శిక్షకులుగా అవ్వడం లేక ఆత్మిక సేవాధారులుగా అవ్వడం అనగా తండ్రిని అనుసరించడం, కావున బాబా సమానముగా, బాబా యొక్క ప్రియమైన వారిగా ఉన్నారు. బాప్ దాదా కూడా సేవాధారులను చూసి సంతోషిస్తారు. అందరూ సదా స్వయమును నిమిత్తముగా భావిస్తూ నమ్రచిత్తులుగా నడుచుకోండి. ఎంతగా నిమిత్తముగా మరియు నమ్రచిత్తులుగా అయి నడుచుకుంటారో అంతగా సేవలో సహజముగా వృద్ధి జరుగుతుంది. ఎప్పుడూ నేను చేసాను. నేను టీచరు అన్న భావమును ఉంచకండి. దీనిని సేవ చేసేందుకు బదులుగా సేవలో ఆగిపోయే కళలోకి వచ్చేందుకు ఆధారము అని అంటారు. నడుస్తూ, నడుస్తూ అప్పుడప్పుడూ సేవ తక్కువైపోవడానికి లేక సేవ తగ్గిపోవడానికి కారణము విశేషముగా నిమిత్తముగా భావించేందుకు బదులుగా నేను అనేది వచ్చేయడమే. ఈ కారణముగానే సేవ తగ్గిపోతుంది. అప్పుడు సంతోషము మరియు నషా కూడా ఎగిరిపోతాయి. కావున ఎప్పుడూ స్వయమూ ఈ స్మృతి నుండి దూరమవ్వకండి, అలాగే ఇతరులను బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవడంలో వంచితులను చేయకండి. ఇంకొక విషయం - సదా 'స్వపరివర్తన ద్వారానే ఎటువంటి ఆత్మనైనా మార్చాలి మరియు విశ్వమును మార్చాలి' అన్న ఈ స్లో గన్ను గుర్తుంచుకోండి. స్వపరివర్తనపై విశేషమైన అటెన్షన్ ను ఉంచండి, తద్వారా సేవ స్వతహాగానే వృద్ధినొందుతుంది. తగ్గిపోవడానికి కారణమును అర్ధం చేసుకున్నారు మరియు పెంచేందుకు ఆధారమునూ అర్ధం చేసుకున్నారు, కావున సదా సంతోషములో ముందుకు వెళుతూ ఉంటారు మరియు ఇతరులను కూడా సంతోషములోకి తీసుకువస్తూ ఉంటారు. అచ్చా!
కావున నెంబర్ వన్ యోగ్య టీచర్ లేక నెంబర్ వన్ సేవాధారి యొక్క లైన్ లోకి వచ్చేస్తారు. డబుల్ విదేశీయులందరూ నెంబర్ వన్ టీచర్లే కదా! బాగా కష్టపడుతున్నారు మరియు ప్రేమ కూడా బాగుంది. ప్రమాణాన్ని కూడా తీసుకువచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సేవాధారులు అనగా టీచర్లు. సేవా కేంద్రములో ఉన్నా లేక ఇంకెక్కడ ఉన్నా కానీ సేవాధారులే. ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క వృత్తే సేవాధారి. ఒక్కొక్కరికీ సేవలో ఒక్కొక్క పాత్ర లభించింది. కొందరు తీసుకువచ్చే సేవను చేయాలి. కొందరు విడిపించే సేవను. కొందరు భోగ్ తయారుచేసే సేవను, కొందరు భోగ్ నివేదించే సేవను చేయాలి. కానీ అందరూ సేవాధారులే. బాప్ దాదా అయితే అందరినీ సేవాధారులుగానే భావిస్తారు.
(ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కొరకు అందరూ కొత్త కొత్త ప్లాన్లను తయారుచేసారు, వాటిని బాప్ దాదాకు వినిపిస్తున్నారు.)
ప్లాన్ ను తయారుచేయడంలో బాగా కష్టపడ్డారు. అందుకు అభినందనలు. బుద్ధిని నడిపించడం అనగా మీ భాగ్యమును జమా చేసుకోవడం, కావున మీరు కేవలం మీటింగ్ చేయలేదు. జమా చేసుకున్నారు. సదా నిర్విఘ్నముగా, సదా విశ్వపరివర్తకులుగా మరియు సదా సంతుష్టముగా ఉండండి, అనగా సర్వులనూ సంతుష్టపరచండి. ఇదే సర్టిఫికెట్‌ను సదా తీసుకుంటూ ఉండండి. ఇదే సర్టిఫికెట్ ను తీసుకోవడం అనగా సింహాసనాధికారులుగా అవ్వడం. సంతుష్టముగా ఉండాలి మరియు సర్వులనూ సంతుష్టపరచాలి అనే లక్ష్యమును ఉంచండి, రెండింటి యొక్క బ్యాలెన్స్ ను ఉంచండి, అచ్ఛా! - ఏ ప్లాన్ నైతే తయారుచేసారో దానిని అందరూ ప్రాక్టికల్ లోకి తీసుకురండి. వి.ఐ.పి. ల యొక్క సంఘటనను తీసుకురండి.
Comments
Post a Comment