20-01-1981 అవ్యక్త మురళి

20-01-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మనస్సు బుద్ది సంస్కారాలకు అధికారులే వరదానమూర్తులు.

ఈ రోజు వరదాత మరియు విధాత అయిన తండ్రి తన మహాదాని మరియు వరదానీ పిల్లలను చూస్తున్నారు. ఈ సమయంలో అందరూ యథాశక్తిగా మహాదాని పాత్రను అభినయిస్తున్నారు. కాని ఇప్పుడు అంతిమ సమయం సమీపానికి వస్తున్నందున వరదానీ పాత్రను ప్రాక్టికల్ గా అభినయించాల్సి పడ్తుంది. మహాదానులు విశేషంగా వాచా ద్వారా సేవ చేస్తారు. కాని దాని జతలో మనసా సేవ యొక్క శాతము తక్కువగా ఉంది. వాచా శాతము ఎక్కువగా, మనసా శాతము దానికంటే తక్కువగా ఉంది. వరదానీ రూపములో వాచా శాతము తక్కువ, మనసా శాతము ఎక్కువగా ఉంటుంది. మనసా అనగా సంకల్పాల ద్వారా శుభ భావనలు మరియు శుభ కామనల ద్వారా కొద్ది సమయములో ఎక్కువగా సేవలో ప్రత్యక్ష ఫలాన్ని చూడగలరు.

వరదానీ రూపము ద్వారా సేవ చేయుటకు మొట్టమొదట స్వయంలో శుద్ధ సంకల్పాలు కావాలి. అలాగే ఇతర సంకల్పాలను ఒక్క సెకండులో అదుపు(కంట్రోల్) చేసే అభ్యాసము కావాలి. పూర్తి రోజంతా శుద్ధ సంకల్పాల సాగరంలో తేలియాడుతూ ఉండాలి. అంతేకాక కావలసినపుడు శుద్ధ సంకల్పాల సాగరం లోతుల్లోకి వెళ్ళి సైలెన్స్ స్వరూపులై పోవాలి. అనగా బ్రేక్ శక్తిశాలిగా ఉండాలి. సంకల్పశక్తి మీ అదుపులో ఉండాలి. దానితో పాటు(సంకల్ప శక్తితో పాటు) ఆత్మలోని రెండు విశేష శక్తులైన బుద్ధి, సంస్కారము కూడా ఈ మూడు మీ అధికారములో అనగా అధీనములో ఉండాలి. మూడింటిలో ఒక్క శక్తిపై అధికారము తక్కువగా ఉండినా వరదాన స్వరూప సేవ ఎంత చేయాలో అంత చేయలేరు.

ఈ సంవత్సరములో ఈ మహాయజ్ఞములో ఎన్ని మహాకార్యాలు రచిస్తారో అంత ఈ మహా యజ్ఞంలో మహాదానీ పాత్రను కూడా అభినయించాలి. దానితో పాటు ఆత్మలోని మూడు శక్తులపై సంపూర్ణ అధికారములో ఏయే లోపాలున్నాయో, వాటిని కూడా మహాయజ్ఞములో స్వాహా చేయాలి. ఎంత విశాల కార్యము చేయాలో అంత ఈ విశాల కార్యము పట్ల స్వ చింతకులు, శుభ చింతకులు, సదా శక్తుల మాస్టర్ విధాతలు, శ్రేష్ఠ సంకల్పాల ద్వారా మాస్టర్ వరదాతలు, సదా సాగరము లోతులలో అతిమధురమైన శాంతి స్వరూప లైట్ - మైట్ హౌసులుగా అయ్యి ఈ స్వరూపములో సేవ చేయాలి. 

ఎంతగా సాధనాల ద్వారా సేవ చేసే స్టేజి పైకి వస్తారో అంత సిద్ధి స్వరూపులై సైలెన్స్ స్వరూపాన్ని అనుభవం చేయాలి. సేవా సాధనాలు కూడా చాలా బాగా తయారుచేశారు. ఎంత విశాలమైన సేవా యజ్ఞాన్ని రచిస్తున్నారో అంత సంఘటిత రూపములో జ్వాల రూప శాంతి కూడా మహాయజ్ఞాన్ని రచించాలి. ఇది సేవా యజ్ఞము. ముందు వాణి(వాచా) ద్వారా విశ్వములోని ఆత్మలలో భూమిని దున్నాలి. దున్నునప్పుడు అలజడి వస్తుంది. దాని తర్వాత ఏ బీజమైతే వేస్తారో దానిని శీతలతా రూపంతో, సైలెన్స్ (శాంతి) శక్తితో శుద్ధి చేసి శీతలతో నీటిని పోయాలి. శీతలమైన నీరు పడగానే ఫలం వెలువడ్తుంది. మహాయజ్ఞం చేస్తూనే సేవలో చాలా భాగము పూర్తి చేశామని భావించకండి. ఇది భూమిని దున్ని బీజము వేయడమే ఇందులో కష్టము ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఫలం రావాలంటే మహాదాని తర్వాత వరదానీ సేవ చేయాల్సి వస్తుంది. వరదాని మూర్తులంటే స్వయం సదా వరదానాలతో సంపన్నులు. అన్నిటికంటే మొదటి వరదానము ఏది? దివ్య జన్మ లభిస్తూనే అందరికీ లభించిన మొదటి వరదానమేది? వరదానమంటే అందులో శ్రమ ఉండదు. సహజ ప్రాప్తి అగుటకు ఏ వరదానము లభించింది? ప్రతి ఒక్కరికి వేరు వేరు వరదానము లభించిందా లేక అందరికీ ఒకే వరదానమా? వినిపించడంలో అయితే మీ మీ వరదానాన్ని వేరు వేరుగా వినిపిస్తారు కదా. అందరికీ ఒకే వరదానం. శ్రమ లేకుండా, ఆలోచించకుండా అర్థము చేసుకోకుండా లభించింది. తండ్రి ఎటువంటి బలహీన ఆత్మనైనా ధైర్యహీన ఆత్మనైనా తనవారిగా స్వీకరించారు. ఎవరు  ఎలా ఉన్నా నా వారని అన్నారు. ఇలా సెకండులో వారసత్వానికి అధికారులుగా చేసే లాటరీ అనండి, అదృష్టమనండి, వరదానమనండి, తండ్రి స్వయంగా ఇచ్చారు. నీవు నా వాడివి అను స్మృతి స్విచ్ ను ఆన్ చేశారు. ఇటువంటి భాగ్యము లభిస్తుందని అలోచించను కూడా ఆలోచించలేదు. కాని భాగ్య విధాత తండ్రి భాగ్యము వరదానంగా ఇచ్చేశారు. ఈ సెకండు వరదానమే జన్మ జన్మాంతరాల మన వారసత్వాలకు అధికారిగా చేసింది. ఈ వరదానాన్ని స్మృతి స్వరూపములోకి తీసుకురావడం అనగా వరదానంగా అవ్వడం. తండ్రి ఏమో అందరికీ ఒక్క సెకండులో ఒకే విధంగా వరదానమిచ్చారు. చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు. దృష్టి, వృత్తిలో ఉండువారు కావచ్చు. సాధారణమైనవారు కావచ్చు, ఆరోగ్యవంతులు కావచ్చు, అనారోగ్యులు కావచ్చు, ఏ ధర్మానికి చెందినవారైనా, ఏ దేశానికి చెందిన వారైనా, చదువుకున్నవారు గాని లేక చదువుకోని వారుగాని అందరికి ఒకే వరదానమిచ్చారు. ఈ వరదానాన్ని జీవితంలోకి తీసుకు రావడంలో, స్మృతి స్వరూపంగా అగుటలో నెంబరు తయారయ్యింది. కొంతమంది నిరంతరము స్మృతి స్వరూపులుగా, కొంతమంది అప్పుడప్పుడు స్మృతి స్వరూపులుగా ఉంటున్నారు. ఈ తేడా కారణంగా రెండు మాలలు తయారయ్యాయి. ఎవరైతే సదా వరదాన స్మృతి స్వరూపంలో ఉన్నారో వారి మాల కూడా సదా స్మరించబడుతుంది. ఎవరైతే వరదానాన్ని, అప్పుడప్పుడు జీవితంలో తెచ్చుకుంటారో లేక స్మృతి స్వరూపంలో తెచ్చుకుంటారో వారి మాల కూడా అప్పుడప్పుడు స్మరించబడుంది. ఆ వరదానీ స్వరూపమనగా ఈ మొదటి వరదానంలో సదా స్మృతి స్వరూపంగా ఉంటారు. ఎవరైతే సదా తండ్రి వారిగా అయ్యి ఉంటారో వారే ఇతరులను కూడా సదా తండ్రి వారిగా చేయగలరు. ఈ వరదానాన్ని తీసుకురావడంలో ఎవ్వరూ శ్రమ చేయలేదు. తండ్రి స్వయంగా తనవారిగా చేసుకున్నారు. ఈ ఒక్క వరదానాన్ని సదా గుర్తుంచుకుంటే శ్రమ నుండి ముక్తులైపోతారు. వరదానాన్ని మర్చిపోతే శ్రమ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వరదానీ మూర్తీ ద్వారా సంకల్ప శక్తితో సేవ చేయండి.

ఈ సంవత్సరము స్వంత శక్తుల ద్వారా, స్వంత గుణాల ద్వారా నిర్జల ఆత్మలను తండ్రి సమీపానికి తీసుకురండి. వర్తమాన సమయంలో మెజారిటీ వారికి ఆధ్యాత్మికత వైపు రావాలనే శుభ కోరిక ఉత్పన్నమవుతూ ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మిక శక్తి ఏమేమి చేయగలదో మరెవ్వరూ చేయలేరు. కాని ఆధ్యాత్మికత వైపు నడవడానికి స్వయాన్ని ధైర్యహీనులుగా భావిస్తున్నారు. కనుక కోరిక అనే ఒక కాలు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. వారికి మీ శక్తి ద్వారా ధైర్యమనే రెండవ కాలునివ్వండి. అప్పుడు తండ్రి వద్దకు నడచి రాగలరు. ఇప్పుడైతే దగ్గరకు రావడానికి కూడా ధైర్యహీనంగా ఉన్నారు. మొదట మీ వరదానాల ద్వారా ధైర్యములోకి తీసుకు రండి. మీరు కూడా కాగలరని వారిని ఉత్సాహములోకి తీసుకురండి. అప్పుడు నిర్బల ఆత్మలు మీ సహాయోగం ద్వారా వారసత్వానికి అధికారులుగా కాగలరు. కుంటి వారిని నడిపించాలి. అప్పుడు వరదానీ మూర్తులైన మీకు మాటిమాటికి ధన్యవాదాలు చెప్తారు. కొంతమంది భక్తులుగా, కొంతమంది ప్రముఖులుగా అవుతారు, కొంతమంది లాస్ట్ సో ఫాస్ట్ గా కూడా అవుతారు. కనుక ఈ సంవత్సరంలో ఏమి చేయాలో తెలిసిందా?

ఎలాగైతే మహాయజ్ఞ సేవలో నలువైపులా ధ్వని వ్యాపింపజేశారో, అలా ఈ యజ్ఞ కార్యముతో పాటు శాంతి కుండపు వాయుమండలాన్ని, వైబ్రేషన్ల ధ్వనిని నలువైపులా వ్యాపింపజేయండి. ఎలాగైతే మహాయజ్ఞానికి కొత్త చిత్రాలు తయారు చేశారో, ప్రదర్శినీలు తయారు చేస్తున్నారో, ఉపన్యాసాలు తయారు చేస్తున్నారో, స్టేజీలు తయారు చేస్తున్నారో, అలా నలువైపులా ప్రతి బ్రాహ్మణ ఆత్మ తండ్రి సమానంగా చైతన్య చిత్రమైపోవాలి. లైటు-మైటు ప్రదర్శినీగా తయారైపోవాలి. సంకల్ప శక్తిని గురించి, సైలెన్స్ గురించి ఉపన్యాసాలు తయారు చేయాలి. కర్మాతీత స్టేజిపై వరదానీమూర్తి పాత్రను అభినయించాలి. అప్పుడు నా సంపూర్ణత సమీపానికి వస్తుంది. ఈ సంవత్సరంలోనే అతివిశాలమైన సేవా కార్యము ఏదైతే చేయాలో అది కూడా సంఘటిత రూపంలో ప్రత్యక్షము చేస్తాము. ఒకే బలము, ఒకే నమ్మకము అనే నినాదముతో సేవా స్టేజి పైకి రావాలి. బ్రాహ్మణులందరి సహయోగముతో కార్యాన్ని సంపన్నము చేయాలి. అలాగే ఇదే సంవత్సరంలో ఒకే సంకల్పము ద్వారా వరదానీ రూపం యొక్క విశాల కార్యం కూడా ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. ఇప్పుడు ఏం చేయాలి అర్థమయిందా?

ఇలా శబ్దములోకి వస్తున్నా, శబ్దానికి అతీత స్థితిలో స్థితమై ఉండేవారు, తమ ధైర్యం ద్వారా ఇతర ఆత్మలకు ధైర్యమునిచ్చేవారు, తమ సమీపత ద్వారా ఇతరులకు కూడా సమీపముగా తెచ్చేవారు, కుంటి ఆత్మలను పరుగు పందెములో తీసుకొచ్చేవారు, ఇటువంటి వరదానీ మహాదానీలు బాప్ దాదా సమీప ఆత్మలకు బాప్ దాదా యొక్క యాద్ ప్యార్ మరియు నమస్తే.

దాదీలతో:- సమయము సమీపానికి వస్తున్నదా లేక మీరు సమయానికి దగ్గరగా వస్తున్నారా? స్వయాన్ని తీసుకొస్తున్నారా? లేక సమయం స్వయాన్ని లాగుతున్నదా? డ్రామా మిమ్ములను నడిపిస్తున్నదా ? లేక మీరు డ్రామాను నడిపిస్తున్నారా ? మాస్టర్లు మీరా? లేక డ్రామానా? రచయిత డ్రామానా? లేక మీరా? ఇప్పుడు చాలాసార్లు వాచా ద్వారా డ్రామాలో ఏముందో అదే మారుతుందనే మాటలు వెలువడుతున్నాయి కానీ పోను పోను డ్రామాలో ఏమి జరుగుతుందో అది ఎంత స్పష్టంగా టచ్ అవుతుందంటే, అలా ఎప్పుడూ ఏమి జరగాలో అది జరుగుతుంది అని అనరు. అథారిటీలో ఇదే డ్రామాలో జరగాలి, అదే జరుగుతుంది అని అంటారు. ఎలాగైతే భవిష్య ప్రాలబ్దము స్పష్టంగా ఉందో అలా డ్రామాలో ఏమి జరుగుతుందో అది స్పష్టమౌతుంది. ఎవరు ఎంతగా ఇది నిశ్చితమై లేదు, జరుగుతుందో లేదో ఏం తెలుసు? అని అంటే మీరు అంగీకరిస్తారా? లేదు. ఈ విషయాలు జ్ఞానసాగరుని ఆధారముతో మాస్టర్ జ్ఞానసాగరులై పోయారు. జరగనే జరుగుతుంది అంతే. రేపు జరుగుతుందో లేక ఒక సెకండు తర్వాత అది కూడా ఇంత అథారిటీతో జ్ఞానసాగరుని శక్తితో, స్పష్టతా శక్తితో ఇది జరగనే జరుగుతుంది అని చెప్తారు. ఏం జరుగుతుందో చూస్తాములే అని చెప్పరు. ఇంతకు ముందు చూశాము, ఇప్పుడు మరలా అదే జరుగుతుంది అని చెప్తారు. ఇంత అథారిటీ గలవారిగా అవుతూ పోతారు. ఇది కూడా ఒక అథారిటీయే కదా. అయ్యే తీరాలి, మా రాజ్యము రానే వస్తుంది. ఎవరు ఎంతగా కదిలించాలని ప్రయత్నించినా, ఈ పాయింటుకు అథారిటీ అయినట్లు స్పష్టముగా చెప్తారు. అయితే కొంచెం ఏకాంత వాసులుగా అయినప్పుడు ఇది జరుగుతుంది. ఎంత ఏకాంతవాసులుగా ఉంటారో అంత బాగా టచ్ అవుతుంది. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అది వర్తమాన సమయము వలె స్పష్టమైపోతుంది. ఇప్పుడింకా సమయము తక్కువగా లభిస్తుంది. డ్రామాలో ఈ దృశ్యము ఏర్షాటై ఉంది, ఇది కూడా అనుభవమవుతుంది. అందువలన ఈ సంవత్సరంలో సేవలో ఎంత అలజడి జరుగుతుందో అంత పూర్తి అండర్ గ్రౌండులోకి పోయినట్లే ఉండండి. ఏదైనా కొత్త శక్తిశాలి ఇన్వెన్షన్(పరిశోధన) జరిగినప్పుడు చాలా అండర్ గ్రౌండులో చేస్తారు కదా. అలా ఇక్కడ ఏకాంతవాసులుగా అగుటే అండర్ గ్రౌండ్ లో ఉండుట. ఒకేసారి ఒక గంట, అర్ధగంట సమయం లభించదు. కనుక ఎంత సమయం లభిస్తే అంత సమయం ఏకాంతవాసులుగా కండి. ఇప్పుడు మాట్లాడుతూ ఉండినారు, 5 నిమిషాలు సమయం లభించినా సాగరం లోతుల్లోకి వెళ్ళిపోతారు. ఎవరైనా వచ్చినా వీరెక్కడో మరో స్థానంలో ఉన్నారు, ఇక్కడ లేరని భావిస్తారు. వారి సంకల్పాలు కూడా నిల్చిపోతాయి, మాట్లాడాలనుకున్నా మాట్లాడలేరు. సైలెన్స్ ద్వారా ఎంత స్పష్టమైన జవాబు లభిస్తుందంటే వాచా ద్వారా కూడా అంత స్పష్టంగా ఉండదు. సాకారంలో కార్య వ్యవహారాలు చేస్తున్నా మధ్య మధ్యలో అదృశ్య స్థితి అనుభవమౌతూ ఉండుట చూశారు కదా. వింటూ - వినిపిస్తూ, ఆదేశాలిస్తూ ఇస్తూ అండర్ గ్రౌండులోకి వెళ్లేవారు. కనుక ఇప్పుడే అభ్యాసపు అల అవసరము. నడుస్తూ - నడుస్తూ అదృశ్యమైపోయినట్లు అనిపించాలి. ఈ ప్రపంచములోనే లేరని అనిపించాలి. వీరు ఫరిస్తాలు ఈ దేహ ప్రపంచము, దేహ భావము నుండి అతీతమైపోయారని అనిపించాలి. దీనినే అందరూ సాక్షాత్కారము అంటారు. ఎవరు మీ ముందుకు వచ్చినా వారు ఇదే స్టేజిలో సాక్షాత్కారాన్ని అనుభవం చేస్తారు. ప్రారంభములో సాక్షాత్కారాలు జరిగాయి కదా. వాటి ద్వారానే శబ్ధము వ్యాపించింది కదా. ఇతరులు ఇంద్రజాలమన్నా లేక ఇంకా ఏమని అన్నా, శబ్దమేమో దీని ద్వారానే వ్యాపించింది కదా. ఇటువంటి స్థితిలో అనుభవ సమానమైన సాక్షాత్కారాలు జరిగితే అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. పేరు ప్రఖ్యాతమౌతుంది, సాక్షాత్కారమవుతుంది. ప్రత్యక్ష ఫలము అనుభవమవుతుంది. ఈ ప్రత్యక్ష ఫలము లభించే సీజన్లో ప్రత్యక్షత జరుగుతుంది. దీనినే వరదానీ రూపము అంటారు. ఎవరు వచ్చినా అనుభవము చేసి వెళ్లాలి. మాట్లాడుతూ మాట్లాడుతూ స్వయం అదృశ్యమై ఇతరులను కూడా అదృశ్యము చేసేస్తారు. ఇది కూడా జరుగుతుంది. వాచా ద్వారా పని నడిపించి చూస్తున్నారు. కాని అనుభవము చేసి చేయించే ఈ స్థితి సమస్యలను ఒక్క సెకండులో పరిష్కరిస్తుంది. తక్కువ సమయములో ఎక్కువ సఫలత లభిస్తుంది. ఈ రోజులలో ఎవరికైనా ఏ విషయమునైనా మాటల ద్వారా చెప్తే ఏమంటారు? ఇదంతా మాకు ముందే తెలుసునని అంటారు. అందరూ జ్ఞాన స్వరూపులైపోయారు. ఒక్క సెకండులో ఇది మాకు తెలుసునని అంటారు. ఈ మాటలే వినిపిస్తాయి. ఫలానా తప్పుకు ఏ శిక్ష లభిస్తుందో కూడా అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు కొత్త పద్ధతి కావాలి. అది ఇదే అనుభూతి తక్కువగా ఉంది, కాని పాయింట్లు తక్కువగా లేవు. ఎవరికైనా ఒక్క సెకండు కాలము శక్తి రూపాన్ని, శాంతి రూపాన్ని అనుభవం చేస్తే చాలు వారు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు. అచ్చా, ఓంశాంతి.

Comments