19-12-1979 అవ్యక్త మురళి

19-12-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సహజ స్మృతికి సాధనం - స్వయాన్ని ఈశ్వరీయ సేవాధారులమని భావించడం.

ఈ రోజు బాప్ దాదా తన సహయోగి లేక సహజయోగీ పిల్లలను చూస్తున్నారు. వారి పేరే ఈశ్వరీయ సేవాధారులు. ఇటువంటి పిల్లలను చూచి బాబా సదా హర్షిస్తున్నారు. ఈశ్వరీయ సేవాధారులనగా ఈశ్వరుడు లేక తండ్రి ఇచ్చిన సేవలో సదా తత్పరులై ఉండేవారు. పిల్లలకు కూడా ఈ విశేషమైన నషా ఉండాలి - "మా అందరికీ ఈశ్వరుడు ఏ సేవ అయితే ఇచ్చారో మేమంతా ఆ సేవలోనే లగ్నమై ఉన్నాము. ఏ కార్యము చేస్తున్నా ఆ కార్యము ఇచ్చినవారిని ఎప్పుడూ మర్చిపోరు. స్థూల కర్తవ్యమైనా అది కర్మణా సేవ కూడా ఈశ్వరీయ సేవయే. తండ్రి డైరెక్టుగా ఆదేశమిచ్చినప్పుడు కర్మణా సేవలో కూడా "తండ్రి ఆదేశానుసారము చేస్తున్నామనే స్మృతి ఉంటే ఎప్పుడూ బాబాను మర్చిపోరు. ఎలాగైతే ఎవరైనా విశేష ఆత్మ ద్వారా ఏదైనా విశేష కార్యము లభిస్తే, అంటే ఈ రోజులలో ప్రెసిడెంటు ఈ పని చేయమని ఎవరికైనా చెప్తే ఆ పని చేస్తూ ఆ వ్యక్తి ప్రెసిడెంటును ఎప్పుడూ మర్చిపోడు. సహజంగా స్వతహాగా ప్రెసిడెంటు స్మృతి ఉంటుంది. కోరుకోకపోయినా ఎదురుగా ప్రెసిడెంటే కనిపిస్తాడు. అలాగే మీ అందరికీ ఈ కార్యం స్వయం ఉన్నతోన్నతుడైన తండ్రి ఇచ్చారు. కార్యము చేస్తూ ఆ కార్యము ఇచ్చినవారిని ఎలా మర్చిపోతారు? అందువలన సహజ స్మృతికి సాధనము - సదా స్వయాన్ని ఈశ్వరీయ సేవాధారులుగా భావించండి.

భక్తిమార్గములో అర్థం తెలియని ఒక సామెత ఉంది. దానికి గౌరవం కూడా ఉంది. ఒక ఆకు కదిలిందంటే, దానిని కదిపిన వాడు కూడా భగవంతుడే? (భగవంతుని ఆజ్ఞ లేనిదే ఆకైనా అల్లాడదు). కాని ఆకు తండ్రి కదపరని ఇదంతా డ్రామానుసారము జరుగుతూ ఉందనే రహస్యం మీకు మాత్రమే తెలుసు. ఈ మహిమ స్థూలమైన ఆకులకు వర్తించదు. కాని మీరంతా కల్పవృక్షములోని మొదటి ఆకులు. సంగమయుగ నివాసులైన మీరందరూ బంగారు యుగపు ఆకులు. మీరు తండ్రి ద్వారా ఇనుము నుండి బంగారుగా అయ్యారు. ఈ సత్యమైన ఆకులను ఈ సమయములో డైరెక్టుగా స్వయం తండ్రే నడిపిస్తున్నారు. తండ్రి ఆదేశమేమంటే - సంకల్పము కూడా తండ్రి సంకల్పమే మీ సంకల్పమై ఉండాలి. ప్రతి సంకల్పము తండ్రి సమానం, ప్రతి మాట తండ్రి సమానంగా, ప్రతి కర్మ తండ్రి సమానంగా ఉండాలి. అనగా తండ్రి శ్రీమతం ఆధారంగానే మీ అందరి సంకల్పాలు నడుస్తున్నాయి. కనుక ఈ సమయములో ఆకులైన మీ అందరినీ తండ్రి శ్రీమతము ఆధారంగా నడిపిస్తున్నారు. ఆకు ఆకును కదిలించడమంటే నడిపిస్తున్నారు. ఒకవేళ శ్రీమతం లేకుండా ఏ సంకల్పము చేసినా అది వ్యర్థ సంకల్పమైపోతుంది. కనుక ఈ సామెత భక్తి సమయానికి చెందినది కాదు. ఇది సంగమ సమయములోని మహిమ. కనుక ఆకులైన మీరంతా తండ్రి శ్రీమతము అనుసారమే కదులుతున్నారు అనగా నడుస్తున్నారు కదా. నడిపించే పని కూడా తండ్రిదే. అయినా ఇంత కష్టమని ఎందుకు కనిపిస్తుంది. బరువంతా తండ్రే తీసుకున్నారు. అయినా సదా ఎందుకు ఎగురలేకున్నారు. తేలికైన వస్తువు సదా పైకి ఎగురుతూ ఉంటుంది. ఎంత తేలికైన వారంటే ప్రతి సంకల్పములో కూడా బాబా నడిపిస్తే నడవాలి. తండ్రి ఎలా నడిపిస్తే అలా నడుస్తాము అని మీరందరూ ప్రతిజ్ఞ చేశారు. నడిపిస్తానని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. మరి బుద్ధికి ఏ ఆజ్ఞనిచ్చారు? బుద్ధికి తండ్రి ఏ పనిని ఇచ్చారో మీకు తెలుసు కదా? బుద్ధి కూర్చునే స్థానము తండ్రి వద్ద ఉంది. విశ్వ సేవ చేయుటే మీ కర్తవ్యం. ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటాను, ఎలా నడిపిస్తే అలా నడుస్తాము అని ఏదైతే ప్రమాణము చేశారో, అది శరీరమునా బుద్ధినా? శరీరముతో పాటు మనసు కూడా ఇచ్చేశారు లేక కేవలం శరీరమును మాత్రమే ఇచ్చారా? శరీరమును బుద్ధిని ఎక్కడ కూర్చోబెడ్తారో, ఎలా నడిపిస్తారో ఏది చేయిస్తారో, ఏది తినిపిస్తారో అదే చేస్తాము అని కదా మీరు ప్రతిజ్ఞ చేసింది? కనుక బుద్ధికి భోజనం - శుద్ధ సంకల్పాలు. ఏది తినిపిస్తే, అదే తింటాము అని ప్రతిజ్ఞ చేసినప్పుడు వ్యర్థ సంకల్పాల భోజనాన్ని ఎందుకు తింటారు? ఎలాగైతే నోటి ద్వారా తమోగుణీ భోజనం, అశుద్ధ భోజనం తినలేరో, అలా బుద్ధి ద్వారా సంకల్పాల వికల్పాల అశుద్ధ భోజనం ఎలా తినగలరు? అలా చేస్తే ఏది తినిపిస్తే అది తింటాము అనే ప్రతిజ్ఞ తప్పిపోతుంది కదా. చెప్పడం, చేయడం సమానంగా చేసేవారు కదా? అందువలన మనసు, బుద్ధి కోసం కూడా ఈ ప్రతిజ్ఞను నిలుపుకుంటే సహజయోగులైపోతారు. తండ్రి చెప్పారంటే చేసేశారు(చేయాలి), మీ భారాన్ని మీపై ఉంచుకోకండి. ఎలా చేయాలి, ఎలా నడవాలి అనే భారం నుండి తేలికగా కాకుంటే ఉన్నత స్థితికి వెళ్లలేరు, అందువలన సంకల్పములో కూడా శ్రీమతానుసారము నడుస్తూ ఉంటే శ్రమను చేయుట నుండి రక్షింపబడ్డారు.

కొంతమంది పిల్లల శ్రమలోని రకరకాల పోజులను బాప్ దాదా చూస్తున్నారు. రోజంతటిలో అనేకమంది పిల్లల అనేక పోజులను చూస్తున్నారు. బాబా వద్ద ఆటోమేటిక్ కెమరా ఉంది. సైన్సు వారు అన్నిటినీ వతనం నుండే కాపీ చేశారు. ఎప్పుడైనా వతనంలోకి వచ్చి అక్కడ ఏమేమి వస్తువులున్నాయో చూడండి. ఏది కావాలంటే అది వెంటనే రెడీగా లభిస్తుంది. మీరంతా తెప్పించండి అని అంటారు. వతనాన్ని చూడాలనుకుంటున్నారా లేక అక్కడే ఉండాలనుకుంటున్నారా? (ట్రయల్ చేస్తాము). ట్రయల్ చేస్తామని చెప్పారంటే అనుమానమేమైనా ఉందా? మీ అందరినీ పిలవటానికే బ్రహ్మాబాబా ఆగి ఉన్నారు. మరి సంపన్నంగా ఎందుకు అవ్వడం లేదు? చాలా సులభంగా సంపన్నంగా కావచ్చు కాని ద్వాపర యుగం నుండి కల్తీ చేసే సంస్కారం చాలా ఉండిపోయింది. మొదట పూజలు కల్తీ చేశారు. దేవతలకు కోతి ముఖాన్ని పెట్టేశారు. శాస్త్రాలలో మిక్స్ చేసేశారు, తండ్రి జీవిత కథలో పిల్లల జీవిత కథను మిక్స్ చేసేశారు. అలాగే గృహస్థ జీవితంలో పవిత్ర ప్రవృత్తికి బదులు అపవిత్రతను కలిపేశారు. ఇప్పుడు కూడా శ్రీమతములో మన్మతాన్ని కలుపుతున్నారు. నిజమైన బంగారు తేలికగా ఉంటుంది. అందులో కల్తీ చేసినప్పుడది బరువైపోతుంది. శ్రీమతము అనగా శ్రేష్ఠమైన మతము అది తేలికగా చేస్తుంది, అందులో మన్మతము మిక్స్ చేసినందున భారమైపోతున్నారు. అందువలన నడవటం శ్రమ అనిపిస్తుంది. కనుక శ్రీమతంలో మిక్స్ చేయకండి. సదా తేలికగా ఉన్నందున వతనంలోని దృశ్యాలన్నీ ఇక్కడ ఉంటున్నా స్పష్టంగా చూడగలరు. ఈ ప్రపంచములోని ఏ దృశ్యమైనా స్పష్టంగా కనిపించినట్లు వాటిని కూడా అనుభవం చేస్తారు. కేవలం సంకల్ప శక్తిని అనగా మనసు, బుద్ధిని మన్మతము నుండి ఖాళీగా ఉంచుకోండి. మనసును నడిపించే అలవాటు చాలా ఉంది కదా - కనుక ఏకాగ్రము చేస్తారు అయినా ఇది వెళ్లిపోతుంది. మరలా ఏకాగ్రము చేయుటకు శ్రమ చేస్తారు. అలా చంచలం కాకుండా రక్షించుకునే సాధనం - ఎలాగైతే ఈ రోజుల్లో ఎవరైనా అదుపులోకి రాకుండా, చాలా విసిగిస్తూ, చాలా గంతులేస్తూ ఉంటారో లేక పిచ్చివారిగా అయిపోతే వారు శాంతిగా అయిపోయే ఇంజక్షన్ వేస్తారో, అలా మీ సంకల్ప శక్తి మీ అదుపులోకి రాకుంటే అశరీరి భవ అను ఇంజెక్షన్ వేసుకోండి. తండ్రి వద్ద కూర్చోండి. అప్పుడు సంకల్ప శక్తి వ్యర్థంగా గంతులేయదు. కూర్చోవటం కూడా రావడం లేదా? కేవలం కూర్చునే పనే ఇచ్చారు. ఇంకే పని ఇవ్వలేదు. ఇది చాలా సులభమని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. బుద్ధి అనే కళ్ళెమును తండ్రి ఇచ్చి మరలా తీసేసుకుంటారు. అందువలన మనసు వ్యర్థమనే కష్టంలో పడేస్తుంది. ఇప్పుడు వ్యర్థమైన కష్టము నుండి విడుదలకండి. తండ్రికి పిల్లల శ్రమను చూసి జాలి కలుగుతుంది కదా.

తండ్రి ప్రతి పుత్రుడు తండ్రితో పాటు సింహాసనముపై కూర్చోండి అని తండ్రి చెప్తున్నారు. సింహాసనాధికారులై మీ స్థూల కర్మేంద్రియాలను, సూక్ష్మ శక్తులను అనగా మనసు, బుద్ధి సంస్కారాలను కూడా ఆజ్ఞానుసారం నడపండి. సింహాసనాధికారులుగా ఉంటే ఆజ్ఞానుసారం నడిపించగలరు. సింహాసనము నుండి దిగి ఆజ్ఞాపిస్తున్నారు. అందువలన కర్మేంద్రియాలు కూడా వినడం లేదు. ఈ రోజుల్లో మళ్లీ కుర్చీ కోసమే ఆందోళన చేస్తున్నారు. మీకు సింహాసనమే ఆఫర్ లో ఉంది. అయినా క్రిందికి ఎందుకు వస్తున్నారు? క్రిందికి రావడం అనగా, నౌకరుగా అయిపోవడం. ఎవరి నౌకరు? మీ అనేక కర్మేంద్రియాలనే నౌకర్లు కూడా నౌకరుగా అయిపోతున్నారు. అందుకే కష్టపడ్తున్నారు. ఈశ్వరీయ నౌకరుగా కండి, ఈశ్వరీయ సేవాధారిగా కండి, నౌకర్లకు నౌకరు కాకండి. ఈశ్వరీయ సేవ సింహాసనముపై కూర్చుని కూడా చేయవచ్చు, క్రిందికి దిగే పనే లేదు. తండ్రి తమ జతలో కూర్చోపెట్టుకోవాలని అనుకుంటున్నారు. కాని మీరేం చేస్తున్నారు? సంగమ యుగములో యజమానిగా, భార్యగా అగుటకు బదులు బానిసగా అయిపోతున్నారు కనుక సత్యమైన యజమానికి సత్యమైన ఇల్లాలిగా కండి, బానిసగా కాకండి. ఎవరైతే సదా అందరి దృష్టి నుండి రక్షింపబడే పర్దా లోపల ఉంటారో, వారిపై ఎవ్వరి దృష్టి పడదు. అందువలన మాయకు కనపడకుండా పర్దా లోపల సాహెబ్(తండ్రి) జతలో కూర్చోండి. అప్పుడు సేవకులందరూ మీ సేవ చేయుటకు హాజరుగా ఉంటారు. ఏమి చేయాలో అర్థమయిందా? ఈ రోజు శ్రమ నుండి దూరమవ్వండి. సదా సహజ యోగిగా, సింహాసనాధికారిగా తండ్రి జతలో కూర్చోండి.

ఇప్పుడు గుజరాతు వారు, ఇండోర్ వారు వచ్చారు కదా. కనుక పర్దా లోపల ఉండండి. అనగా ఇన్-డోర్ అయిపోండి. ఇండోర్ వారు సదా డోర్ లోపలే ఉంటారు కదా. బయటకు రారు కదా, ప్రతి జోన్ వారు సేవను ఎవరంతకు వారు విస్తారము బాగానే చేస్తున్నారు. గుజరాతువారు హాలును పూర్తిగా నింపేశారు. గుజరాతు వారు స్వయాన్ని ఫుల్ గా చేసుకోండి. తర్వాత త్వరలో వతనములో విశ్రాంతిగా కూర్చుంటారు. ఇప్పుడైతే బ్రహ్మాబాబా పిల్లలను సమయానుసారము ఆహ్వానిస్తున్నారు. గుజరాతువారు ఏం చేస్తారు? గుజరాతువారు పెద్దగా శబ్దాన్ని వ్యాపింపజేసే మైకును తీసుకొని రండి. స్థూల శబ్ధము చేసే మైకును కాదు. చైతన్య మైకును తీసుకురండి. ప్రత్యక్షతా శబ్దాన్ని బాగా వ్యాపింపజేసే శక్తిశాలి మైక్ సెట్ను తీసుకురండి. అచ్ఛా!

ఇండోర్ జోన్ వారు ఎవరిని తెస్తారు. ఇండోర్ జోన్ నుండి శక్తిశాలి టీ.వి సెట్ను తీసుకురండి. దాని ద్వారా విశ్వానికి వినాశ కాలము స్పష్టముగా కనిపించాలి. భవిష్య ప్రకాశము కూడా కనిపించాలి. ఏం చేయాలో అర్థమయ్యిందా? ఎటువంటి వ్యక్తులను తయారు చేయాలంటే - వారి అనుభవాల టి.వి ద్వారా ప్రపంచానికి వినాశనము మరియు స్థాపనల సాక్షాత్కారమవ్వాలి. కనుక రెండు జోన్లు ఇటువంటి సెట్‌ను తయారు చేసుకొని రండి, అచ్ఛా!

ఇటువంటి ఈశ్వరీయ సేవాధారులకు, సదా శ్రమ నుండి ముక్తులుగా ఉండేవారికి, సదా యుక్తియుక్త సంకల్పాలు, కర్మలు చేసేవారికి, సదా తండ్రి శ్రీమతానుసారము ప్రతి సంకల్పము, కర్మ చేసేవారికి, సదా మాటలు, కర్మలను సమాప్తం చేసేవారికి ఇటువంటి తండ్రి జతలో ఉండే పిల్లలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే.

అవ్యక్త బాప్ దాదా మధుర మహావాక్యాలు విశేష టీచర్ల పట్ల - టీచర్లు విశేషంగా ఏ విషయంలో పురుషార్థం చేయాలి ? సేవాధారి పిల్లల సూక్ష్మ పురుషార్థమేది? సంకల్పాలను చెక్ చేసుకొనుట. సంకల్పాలలో స్మృతి మరియు సేవల బ్యాలన్స్ ఉందా? ప్రతి సంకల్పము శక్తిశాలిగా ఉందా? సేవాధారి పిల్లల సంకల్పాలు ఎప్పుడూ వ్యర్థమైనవిగా ఉండరాదు. ఎందుకంటే మీరు విశ్వకళ్యాణకారులు, విశ్వ నాటకరంగముపై పాత్రను అభినయించేవారు. విశ్వమంతా మిమ్మల్ని కాపీ చేస్తుంది. మీ సంకల్పము ఒక్కటి వ్యర్థముగా ఉండినా, అందరూ దానినే కాపీ చేస్తారు. అది మీ ఒక్కరి కొరకే కాదు. అనేకమంది వ్యర్థానికి నిమిత్తమవుతుంది. ఎలాగైతే మీ సేవకు లిఫ్ట్ అనే గిఫ్ట్ లభిస్తుందో, అనేకమంది చేసే సేవలలో మీకు భాగము లభిస్తుందో అలా మీరు ఏదైనా అటువంటి వ్యర్థ కార్యమేదైనా చేస్తే అనేకమందికి వ్యర్థము నేర్పించుటకు కూడా నిమిత్తమవుతారు. అందువలన ఇప్పుడు వ్యర్థ ఖాతాను సమాప్తం చెయ్యండి. ఉదాహరణానికి ఈ రోజులలో సైన్సు సాధనాల ద్వారా మనసు ఏకాగ్రతను చెక్ చేస్తారు కదా. లండన్ లేక వేరే స్థానాలలో సైన్సు సాధనాలతో చెక్ చేశారు కదా, అవి సైన్సు యంత్రాలు. కాని మీరు ప్రతి అడుగులో స్వయాన్ని చెక్ చేసుకునే సాధనాన్ని జతలో ఉంచుకోవాలి. ప్రపంచములోనివారు చెక్ చేసే యంత్రాన్ని జతలో ఉంచుకొని చెక్ చేసే సమయంలో పైన వేస్తారో అలా సేవాధారి పిల్లలు ఎల్లప్పుడూ చెకింగ్ సాధనాన్ని జతలో ఉంచుకోవాలి. టీచర్లగా అవ్వడం చిన్న మాటేమీ కాదు. పేరే కాదు, పేరుతో పాటు పని కూడా ఉంది.

సేవాధారి పిల్లలకు ఎప్పుడూ వ్యర్థము నడవరాదు. మీరే వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయని అంటే ఇతరులేం చేస్తారు? ఇతరులు వికల్పాలలోకి వెళ్లిపోతారు. సాధారణంగా ప్రతి ఒక్కరూ గమనమేమో పెట్టారు కాని ఇప్పుడు సూక్ష్మ అటెన్షన్ అవసరము. సంకల్పాలలో కూడా సేవ జరగాలి. సంకల్ప శక్తిని సేవలో బిజీగా చేసినారంటే వ్యర్థం స్వతహాగా సమాప్తమైపోతుంది. ఉదాహరణానికి ఈ రోజులలో యువశక్తి నష్టకారక కార్యములో నష్టము కాకుండా వర్షపు నీరు వ్యర్థం కాకుండా కట్టలు కట్టి వ్యర్థాన్ని కూడా సఫలము చేస్తున్నారు. అలా వ్యర్థముగా పోయే సంకల్ప శక్తిని సేవలో బిజీగా ఉంచుటే అది వ్యర్థానికి బదులు సమర్థమైపోతుంది. సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు జ్ఞాన శక్తులు ఏవియూ కొంచెం కూడా వ్యర్థంగా పోరాదు. ఇలా ప్రతి సంకల్పము, కర్మ, మాట మరియు సర్వ శక్తులను పొదుపు చేసేవారిగా ఉన్నారు కదా? లౌకికంలో కూడా పొదుపు చేసే ఇల్లు కాకుంటే ఆ ఇల్లు సరియైన రీతిలో నడవదు. అలాగే నిమిత్తముగా ఉన్న పిల్లలు పొదుపు చేయువారిగా లేకుంటే సెంటరు బాగా నడవదు. అది హద్దులోని ప్రవృత్తి. ఇది బేహద్ ప్రవృత్తి, కనుక సంకల్పాలు, మాటలు, శక్తులను అదనంగా ఎక్కడ ఖర్చు చేశాను అని చెక్ చేసుకోవాలి. తర్వాత చేంజ్ చేసుకోవాలి. సూక్ష్మ పురుషార్థమనగా అన్ని ఖజానాలకు పొదుపు బడ్జెట్ తయారు చేసి దాని అనుసారమే నడవడం. బడ్జెట్ తయారు చేయడమైతే వచ్చు కదా? ఎలాగైతే స్థూల ఖజానాల లెక్కాచారము తయారుచేస్తారో, అలా ఈ సూక్ష్మ లెక్కాచారమును తయారు చెయ్యండి. నిమిత్తమయ్యారు, త్యాగము చేశారు. అందుకు ప్రత్యక్ష ఫలముగా సెంటరు లభించింది, జిజ్ఞాసువులు లభించారు. ఇప్పుడింకా ముందుకు సాగండి. ఎంత చేశారో అంత లభించింది. ఇప్పుడు మరలా ప్రజలు, భక్తులు మీ పాదాలపై వంగాలి. ఇప్పుడు ఈ ప్రత్యక్ష ఫలాన్ని చూపించండి. తండ్రి సమానంగా బిరుదులు (టైటిల్స్) కూడా లభించాయి. ప్రకృతి కూడా యథాశక్తిపై దాసిగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీని కంటే ఇంకా ముందుకు వెళ్లండి. ఈ ప్రత్యక్ష ఫలము తప్పక ప్రాప్తిస్తుంది. కాని దీనిని స్వీకరించకండి. ఇప్పుడు సంకల్పాలతో కూడా సేవాధారులుగా కండి. వాచా సేవ అయితే 7 రోజుల కోర్సు పూర్తి చేసిన వారు కూడా చేస్తారు. కర్మణా సేవ కూడా అందరూ చేస్తారు. కాని మీ విశేషత - మనసా సేవ. ఈ విశేషతను ఉపయోగించి విశేష నంబరు తీసుకోండి. అందరూ సంతుష్టముగా ఉంటున్నారు కదా. సంతుష్టముగా ఉండాలి. ఏ ఆదేశము లభిస్తే దాని అనుసారమే నడుచుకోవాలి. ఇలా కూడా అనేకమందికి పాఠము నేర్పించుటకు నిమిత్తమవుతారు. మీరు ప్రాక్టికల్ గా పాఠము నేర్పించేవారు, నోటితో పాఠము చెప్పడం వేరే. బాగా జంప్ చేశారు. ఇప్పుడేం చేయాలి? జంప్ చేసిన తర్వాత స్టేజి - ఎగిరే స్టేజి. సదా అవ్యక్త వతనంలో విదేహి స్థితిలో ఎగురుతూ ఉండండి. అశరీరి స్టేజి పై ఎగురుతూ ఉండండి. అచ్ఛా!

Comments