19-11-1979 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
బేహద్ వానప్రస్థీ అంటే నిరంతరం ఏకాంతంలో సదా స్మతి స్వరూపంగా ఉంటారు.
ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి యొక్క భాగ్యాన్ని గుణగానం చేస్తున్నారు. బాబా పిల్లల యొక్క భాగ్యం యొక్క శ్రేష్ఠ రేఖలను చూసి హర్షిస్తున్నారు. భాగ్యం యొక్క శ్రేష్ఠ రేఖల్లో విశేషంగా ఏమేమి విషయాలు చూస్తారో తెలుసా? ముఖ్య విషయం తిథి అనగా తారీఖు, సమయం, విశేష గ్రహం, కులం, ధర్మం మరియు సంపద, సంబంధం మరియు వృత్తి గురించి చూస్తారు. ఈ అన్ని విషయాల్లో భాగ్యాన్ని చూస్తారు. మీ అందరికీ మీ యొక్క ఈ అన్ని విషయాలు బాగా తెలుసా మీ అందరి తిథి ఏది? ఈనాటి వరకు కూడా భాగ్యాన్ని జన్మించిన తారీఖుతో లేదా రాశి ఆధారంగా చూస్తారు. అయితే మీ అందరి రాశి మరియు తారీఖు ఏది? మీ అందరి జన్మ తిథి ఏది? మీరందరూ అవతరించారా? బ్రాహ్మణులు ఎప్పుడు అవతరించారు? బాబా యొక్క అవతరణ తారీఖు ఏదైతే ఉందో మీ అందరిదీ కూడా అదే. బాబా అవతరించిన తారీఖే ఆదిరత్నాలు జన్మించిన తారీఖు. ఏ సమయం? ఈ సంగమ యుగమా, బ్రహ్మ ముహూర్త సమయమా? కనుక మీ అందరి యొక్క జన్మ సమయము బ్రహ్మ ముహూర్తం మరియు రాశి ఏమిటి? లౌకికంలో భిన్న భిన్న రాశులను చూపించారు. కానీ బాబా రాశియే మీ అందరి రాశి. బాబా విశ్వకళ్యాణకారి, ఇదే మీ అందరి రాశి. ఈ రాశిలో బాబా సమాన గుణాలన్నీ నిండి ఉన్నాయి. మరియు దశ కూడా గురువారం యొక్క దశ (గురు మహాదశ), కులము కూడా సర్వ శ్రేష్ఠం. డైరెక్టు ఈశ్వరీయ కులానికి చెందిన వారు మీది ఈశ్వరీయ కులము. మీ పొజిషన్ మాస్టర్ సర్వశక్తివాన్, సంపద తరగనిది మరియు అవినాశీ సంపద. ధర్మము పిలక బ్రాహ్మణులు, బుద్ధి లైను విశాలము మరియు త్రికాలదర్శి ఇప్పుడు ఆలోచించండి, ఇంత కంటే అధిక, శ్రేష్ఠ భాగ్య రేఖలు ఎవరికైనా ఉంటాయా? కర్మ రేఖలు నిరంతరం కర్మయోగీ, సహజయోగీ, రాజయోగీ. ఈ రేఖలన్నీ బాబా స్పష్టంగా గీశారు. భాగ్య సితారలు కిరీటం మరియు సింహాసనం కనిపిస్తున్నాయి. ఇంత కంటే శ్రేష్ఠ భాగ్యం ఇంకేమి ఉంటుంది.
ఈ రోజు బాప్ దాదా సదా సర్వ భాగ్యాలను చూస్తున్నారు. బాబా ఎలాగైతే భాగ్యాలన్నింటినీ చూసి హర్షిస్తున్నారో అలాగే మీరందరూ కూడా స్వయం యొక్క భాగ్యాన్ని చూసుకుని హర్షిస్తున్నారా? చిన్న చిన్న విషయాలలో భాగ్యాన్ని మరిచి పోవడం లేదు కదా? ఈ చిన్న చిన్న విషయాలన్నీ ఏమిటి? భక్తులకు మీరు చెప్తారు కదా! పూజలు మొదలైనవి బొమ్మలాట అని, బొమ్మల పూజ, బొమ్మలాట అని అనగా జన్మనిస్తారు, అలంకరిస్తారు, పూజిస్తారు, తిరిగి ముంచేస్తారు. దీనిని మీరు బొమ్మల పూజ లేదా బొమ్మలాట అని అంటారు. అదే విధంగా మాస్టర్ భాగ్య విధాత పిల్లలు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాల యొక్క బొమ్మలాట చాలా ఆడుతున్నారు. అవి వాస్తవ విషయాలు కావు. కానీ కర్మల ఖాతాను పూర్తి చేయడానికి లేదా ధారణలకు పరీక్ష పెట్టడానికి లేదా మీ స్థితిని పరిశీలించటానికి ఈ విషయాలు జీవితంలో కొత్త కొత్త రూపాల్లో వస్తుంటాయి. ఇవి నిర్జీవ విషయాలు, వికార విషయాలు. కానీ ఇలాంటివి ఎదురుగా వచ్చినప్పుడు జడమూర్తుల్లో ప్రాణం నింపినట్టుగా వీటిని కూడా చాలా విస్తారం చేస్తున్నారు. ఒక్కొసారి ఈర్ష్యా అనే బొమ్మ, ఒక్కొక్కసారి అహంకారం అనే బొమ్మ, ఒక్కొక్క సారి అనుమానం అనే బొమ్మ, ఒక్కొక్క సారి ఆవేశం అనే బొమ్మ, ఒక్కొక్క సారి గర్వం అనే బొమ్మ అనగా విగ్రహాలను తయారు చేసి ఆ విషయాలనే బొమ్మల్లో ప్రాణం నింపుతున్నారా? ఇదే సత్యమని అనుభవం చేసుకుంటున్నారు మరియు చేయిస్తున్నారు. ఇదే సరైన విషయమే అని ప్రాణం నింపుతున్నారు. ఆ తరువాత ఏం చేస్తున్నారు? మీ పాట ఒకటి ఉంది కదా "మునిగిపో మునిగిపో" అని. అలాగే మీరు కూడా ఏం చేస్తున్నారు? ఆ విషయమనే విగ్రహానికి ముందు వెనుక అనేక స్మృతులతో బాగా అలంకరిస్తున్నారు. దాంతో పాటు అక్కడ దేవికి లేదా విగ్రహానికి ఎలాగైతే నైవేద్యం పెడతారో అలాగే ఇక్కడ కూడా మీరు ఏ నైవేద్యం పెడుతున్నారు? జ్ఞాన విషయాలను వ్యతిరేక రూపంతో ఆలోచిస్తున్నారు అనగా వాటిని నైవేద్యంగా పెడుతున్నారు. ఇదిలా జరుగుతూనే ఉంటుంది, ఇదైతే అందరిలోనూ ఉంది, డ్రామానుసారంగా అందరూ పురుషార్థులే, కర్మాతీతంగా అంతిమంలో తయారవుతాం. ఇలా జ్ఞానము యొక్క రకరకాల వెరైటీ పాయింట్లతో రోజూ నైవేద్యం పెట్టి వాటిని గట్టిగా చేస్తున్నారు, పక్కా చేస్తున్నారు. మొదట పచ్చిగా ఉన్నదానిని భోజనం నైవేద్యంగా పెట్టి పక్కా చేస్తున్నారు. ఆ తరువాత ఆ పాయింట్లను అనగా ఆ నైవేద్యాన్ని ఒంటరిగా తినడం లేదు, తోటివారికి కుటుంబీకులను అనగా పరివారంలో ఇతర సహయోగులను కూర్చుండబెట్టి వారి బుద్ధికి కూడా ఈ భోజనాన్ని స్వీకరింపచేస్తున్నారు. కానీ అంతిమంలో ఏమి చేయాల్సి ఉంటుంది? జ్ఞాన సాగరుడైన బాబా యొక్క స్మృతిలో జరిగిపోయిందేదో జరిగిపోయిందని జ్ఞాన సాగరుని యొక్క అలలో, స్వ ఉన్నతి యొక్క అలలో హైజంప్ చేసే అలలో, స్మృతి స్వరూపం యొక్క స్మృతి అలల్లో మాస్టర్ జ్ఞాన సాగర స్వరూపం యొక్క అలల్లో ఇలా అనేక అలల మధ్యలో ఈ బొమ్మలను లేదా విగ్రహాలను ముంచేయవలసి ఉంటుంది. కానీ ఈ మొత్తంలో సమయాన్ని ఏమంటారు? భక్తిలో వాళ్లకు చెప్తారు కదా, సమయం వ్యర్థం, ధనం వ్యర్థం అని. అలాగే ఈ బొమ్మలాటలో సంగమయుగీ సర్వ శ్రేష్ఠ సమయం మరియు జ్ఞానం లేదా శక్తుల ఖజానాలను వ్యర్థం చేసుకోవడమే. కనుక ఈ చిన్న చిన్న విషయాలు ఏమయ్యాయి బొమ్మలాట. ఈ ఆటలో మిమ్మల్ని మీరు బిజీ చేసుకోకండి. సదా శ్రేష్ఠ భాగ్యాన్ని చూసుకోండి.
వర్తమాన సమయానుసారంగా ఇప్పుడు వానప్రస్థ స్థితికి సమీపంగా ఉన్నారు. వానప్రస్థీలు బొమ్మలాట ఆడరు. వానప్రస్థీలు ఏకాంతంగా మరియు స్మరణలోనే ఉంటారు. మీరందరూ బేహద్దులో వానప్రస్థీలు. సదా ఒకని అంతంలోనే అనగా నిరంతరం ఏకాంతంలో సదా స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఇదే బేహద్ వానప్రస్థీ స్థితి (బాప్ దాదా మూడు నిమిషాలు డ్రిల్ చేయించారు) ఈ స్థితిలో మంచిగా అనిస్తుందా? ఏది ఇష్టంగా ఉంటుందో అది ఎప్పుడూ స్మృతి ఉంటుంది. ఇప్పుడు బాబా లేదా మీరు ఏమి కోరుకుంటున్నారు? ఒకే విషయం కోరుకుంటున్నారు. తండ్రి మరియు పిల్లలు సమానం అయిపోవాలని. సదా స్మృతిలో లీనం అయి ఉండాలి. లీనమై ఉండడమే కోరుకోవడం లేదు, లీనమై ఉండటమే కాదు, సమానంగా అవ్వటమే లీనమవడం. అర్థమైందా ? బాబా ఏం కోరుకుంటున్నారో మరియు మీరేం కోరుకుంటున్నారో. ఈ సీజన్ స్వరూపాన్ని చూసేదా లేక కేవలం వినేదా? సమయం ఏమని పిలుస్తుందో తరువాత చెబుతాను. భక్తులు ఏమని పిలుస్తున్నారో దు:ఖీ, అశాంతీ ఆత్మలు ఏమని పిలుస్తున్నారో, ధర్మ నేతలు, వైజ్ఞానికులు, రాజనేతలు ఏమని పిలుస్తున్నారో, ప్రకృతి కూడా ఏమని పిలుస్తుందో అన్నీ తరువాత చెబుతాను. ఓ ఉపకారీ ఆత్మలని అందరూ పిలుస్తున్నారు. ఆ పిలుపు వినిపిస్తుందా లేక బొమ్మలాటలోనే బిజీగా ఉన్నారా? మంచిది. అందరి పిలుపులు తరువాత చెబుతాను. మీరు కూడా అమృత వేళలో పిలుపులు వినండి.
సదా శ్రేష్ఠ భాగ్యాన్ని స్మరణ చేసేవారికి, సదా బాబా సమానంగా స్మృతిలో లీనమై నిరంతరం ఏకాంత వాసీగా ఉండేవారికి, ప్రతి ఘడియను సఫలం చేసుకునే సఫలతా మూర్తులకు, భక్తి యొక్క ఆటను సమాప్తి చేసి మాస్టర్ జ్ఞాన సాగర స్వరూపంగా స్మృతి మరియు సమర్థ స్వరూపంగా అయ్యే వారికి, ఇటువంటి పదమాపద భాగ్యశాలీ పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment