* 19-05-1977 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“ఆత్మజ్ఞానానికి పరమాత్మ జ్ఞానానికి గల వ్యతాసము"
స్వయాన్ని సదా స్వదర్శన చక్రధారులుగా అనుభవం చేస్తున్నారా? కేవలం అనుకుంటున్నారా లేక అనుభవం చేస్తున్నారా? ఒకటేమో అనుకోవడం, రెండవది స్వరూపములోకి తీసుకు రావడం, అనగా అనుభవం చేయుట. ఈ శ్రేష్ఠ జీవితము లేక శ్రేష్ఠ జ్ఞానము యొక్క శ్రేష్ఠతయే అనుభవము చేయుట. ప్రతి విషయము అనుభవంలోకి రానంతవరకు ఆత్మలిచ్చే జ్ఞానానికి, పరమాత్ముడిచ్చే జ్ఞానానికి తేడా ఏమీ ఉండదు. ప్రపంచములోని ఆత్మలు ఆత్మ జ్ఞానము వినిపిస్తారు, అర్థం చేయిస్తారు. కానీ అనుభవం చేయించలేరు. పరమాత్మ జ్ఞానం ప్రతీ విషయాన్ని అనుభవము చేయిస్తుంది. ఎగిరేకళలోకి తీసుకు వెళ్తుంది. అందువలన "ప్రతీ విషయాన్ని అనుభవం చేస్తున్నానా? అర్థము చేసుకొనే వాడినా, వినేవాడినా లేక అనుభవీ మూర్తినా?" అని మిమ్ములను మీరు ప్రశ్నించుకోండి. జీవితములో అనేక రకాలైన అనుభవాలు ఆత్మను జ్ఞానవంతముగా, శక్తివంతముగా చేస్తాయి. జ్ఞాన పాయింటులోనైనా శక్తివంతముగా లేకుంటే వారు అన్ని పాయింట్లలో అనుభవీ మూర్తులుగా కానట్లే అర్థం చేసుకొని, అర్థం చేసుకొని చేయించే వారు లేక వర్ణనా మూర్తులుగా మాత్రమే అవుతారు. కానీ మనన మూర్తులుగా కాలేరు. ఎలాగైతే ఇతరులకు 7 రోజుల కోర్సులో విశేషముగా ఏడు పాయింట్లు వినిపిస్తారో, ఆ ఏడు పాయింట్లు ముందుంచుకొని ఈ అన్ని పాయింట్లలో అనుభవీ మూర్తిగా ఉన్నానా? లేక ఏదైనా పాయింటులో అర్థము చేసుకున్నంత వరకే ఉన్నాను? ఏ పాయింటులో విన్నంత వరకే ఉన్నాను?” అని చెక్ చేసుకోండి. బాప్ దాదా ఫలితము చూసి - "అన్ని విషయాలలో అనుభవమూర్తులుగా అయినవారు చాలా తక్కువగా ఉన్నారని తెలుసుకున్నారు." ఎందుకంటే అనుభవజ్ఞులు అనగా సదా అన్ని ప్రకారాల దుఃఖాల నుండి, మోసాల నుండి, అలజడుల నుండి అతీతముగా ఉంటారు. అనుభవమే పునాది. అనుభవమనే పునాది గట్టిగా ఉంటే ఏ విధమైన స్వీయ సంస్కారాలకు గాని, ఇతరుల సంస్కారాలకు గాని, మాయ కలిగించే చిన్న - పెద్ద విఘ్నాలకు గాని, బలహీనంగా కారు, బలహీనమయ్యారంటే అనుభవమనే పునాది గట్టిగా లేనట్లే. అనుభవీ మూర్తులు సదా స్వయంను సంపన్నంగా భావిస్తూ బలహీనతలను కూడా బలహీనతలుగా భావించక జీవితంలో గట్టి ఆధారంగా భావిస్తారు. బలహీన స్థితి (విధిలేని స్థితి) అప్రాప్తికి గుర్తు. అనుభవీ మూర్తులు సర్వ ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు.
ఈ విధంగా దు:ఖపడుటకు, మోసపోవుటకు కారణం మాయ అని అంటారు. కాని అసలు కారణం మాయ ధరించే అనేక రూపాల అనుభవీగా లేకపోవటమే. అనుభవజ్ఞులు మాయను తెలివి తక్కువ బాలునిగా భావిస్తారు. ఎలాగైతే తెలియని పిల్లలు ఏమి చేసినా తెలియక చేశారని, అసలే తెలివి లేదు, అందులోనూ పిల్లలు, పిల్లలు పనులు ఇలాగే ఉంటాయని భావిస్తారు కదా, అలాగే అనుభవజ్ఞులు మాయ చూపే అనేక రకాలైన లీలలను అనుభవము లేనివారు, మాయ ద్వారా వచ్చే చిన్న సమస్యను కూడా పర్వతంలా భావించి మాయ చాలా బలమైనది, మాయను జయించుట కష్టమని భావిస్తారు. కారణమేమి? అనుభవం లేకుండుటే. అటువంటి ఆత్మలు బాప్ దాదా చెప్పిన మాటలు చెప్తారు, కాని దాని భావమును అర్థము చేసుకోరు. అనుభవము ఆధారముగా ఉండదు, శబ్దాలనే ఆధారముగా చేసుకొని - బాప్ దాదా కూడా ఇలా చెప్పారు - "మాయను జయించుట పిన్నమ్మ ఇంటికి వెళ్లి వచ్చినంత సులభము కాదు," "మాయ కూడా సర్వశక్తివంతమైనది." "ఇంకా ఎవ్వరూ సంపూర్ణము కాలేదు, చివర్లో సంపూర్ణమౌతారు........" ఇటువంటి మాటలను ఆధారంగా తీసుకొని నడుస్తూ ఉంటారు. ఆధారము బలహీనంగా ఉన్నందున మాటిమాటికి ఆందోళన చెందుతూ ఉంటారు. అందువలన కేవలం మాటలను ఆధారముగా తీసుకోకండి. తండ్రి భావమును అర్థము చేసుకోండి. అనుభవాన్ని ఆధారంగా చేసుకోండి. అలజడికి కారణము అనుభవము లేకపోవుటే. "మేము మాస్టర్ సర్వశక్తివంతులము," "విజయీ రత్నాలము" “ స్వదర్శన చక్రధారులము," "శివశక్తి పాండవ సైన్యము," "సహజ రాజయోగులం", " మహాదానులం", "వరదానులం", "విశ్వకల్యాణకారులం" అని చెప్పుకుంటారు, అలానే పిలవబడతారు కాని స్వకళ్యాణము కొరకు మాయాజీతులగుటకు ఏదైనా మాట వస్తే ఏమి చేస్తున్నారో? ఏమంటున్నారో? ఏమి చేస్తారో తెలుసు కదా? చాలా మజానిచ్చే ఆట ఆడతారు. జ్ఞాన సంపన్నుల నుండి పూర్తి అజ్ఞానులుగా అయిపోతారు. మాయ ఎలాగైతే తెలివి తక్కువ పిల్లవాడో, అలా మాయకు వశమై, జ్ఞాన సంపన్నులమని మర్చిపోయి, తెలివి తక్కువవారి వలె చేస్తారు. ఏం చేస్తున్నారు? “ ఇలాగని మాకు తెలియదు, ముందే తెలిసి ఉంటే ఇంత త్యాగం చేసేవారము కాదు, బ్రాహ్మణులుగా కాకపోదుము, ఇంత ఎదుర్కోవలసి వస్తుంది, సహించాల్సి వస్తుంది, ప్రతీ విషయములో మమ్మల్ని మార్చుకోవలసి వస్తుంది, ఇంతగా చావాల్సి వస్తుంది అని మాకు తెలియనే తెలియదు అని అంటున్నారు. త్రికాలదర్శులు జ్ఞానసంపన్నులు అయ్యుంటే, ఇలా అనుట, తెలివి తక్కువ పిల్లల మాటలు కదా? కానీ ఇవన్నీ ఎందుకు జరగుతాయి? ఎందుకనగా తండ్రిని సదా జతలో అనుభవము చేయకపోవడమే. సదా తండ్రి తోడును అనుభవం చేయువారు ఇటువంటి బలహీన సంకల్పాలు చేయరు. తండ్రిని తోడు ఉంచుకున్న కల్ప క్రితము వారి నశాకు స్మృతి చిహ్నం ఇప్పటికీ మహిమ చేయ్యబడుతూ ఉన్నది. అది ఏమిటి? " అక్షోణిల సైన్యము, పెద్ద పెద్ద మహారథులు ఎదురుగా ఉండినా పాండవులకు ఏ నశా(నషా) ఉండినది? "తండ్రి జతలో ఉన్నాడు" అక్షోణి(కౌరవ) సైన్యము అనగా రకరకాల మాయా స్వరూపాలు కూడా, తండ్రిని తోడుంచుకుంటే అక్షోణి సైన్యము కూడా ఒక్క క్షణములో భస్మీభూతమై పోతుంది. ఇటువంటి నశా స్మృతి స్వరూపంలో కూడా కీర్తించబడింది. మహావీరులను మహావీరులుగా భావించలేదు. చనిపోయిన శవాలలా భావించారు. ఇది ఎవరి స్మృతి చిహ్నం? తండ్రి జతలో ఉండు అనుభవీ ఆత్మలదే. అందువలన అనుభవీలు ఎప్పుడూ మోసపోరు. వారికి కష్టమనిపించదు. అజ్ఞానుల వలె కష్టమనుభవించరు. కల్పపూర్వ స్మృతి చిహ్నాన్ని ప్రాక్టికల్ గా అనుభవము చేస్తున్నారా లేక కేవలము వర్ధన చేస్తున్నారా? స్వ కళ్యాణము చేసుకోలేని, స్వయంను పరివర్తన చేసుకోలేని, తమ బలహీనతలను గొప్పగా భావించి వర్ణన చేయు పిల్లల స్థితిని చూచి, ఈ పిల్లలు అర్థము చేసుకొనేవారే గాని అనుభవీలు కారని బాప్ దాదా భావిస్తారు. అందువలన జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు కానీ శక్తిశాలురుగా లేరు. వింటూ వినిపిస్తున్నారు కానీ అర్థము చేసుకొని తండ్రి సమానంగా కావడం లేదు. సమానముగా కాని వారు మాయను ఎదుర్కోను కూడా లేరు. ఒకసారి ఉదాసీనంగా, ఒకసారి నవ్వుతూ ఉంటున్నారు. అందువలన ఏకాంతవాసులుగా అంతర్ముఖులుగా కండి. ప్రతి విషయాన్ని అనుభవము చేసి స్వయంను సంపన్నము చేసుకోండి. మొదటి పాదము - తండ్రి మరియు పిల్లలు - నేను ఎవరి సంతానాన్ని ప్రాప్తి ఏమి? ఈ మొదటి పాదమును అనుభవము చేసి అనుభవీ మూర్తులుగా అయితే సులభంగా మాయాజీతులుగా అవుతారు. అనుభవీలుగా కొంత సమయము మాత్రమే ఉంటున్నారు. ఎక్కువ సమయము వినుటలో, అర్థము చేసుకొనుటలో గడుపుతున్నారు. అనుభవీలంటే సదా సర్వ అనుభవాలతో ఉండువారు. తెలిసిందా? సాగరుని పిల్లలుగా అయ్యారు. కాని సాగరమనగా సంపన్నతను అనుభవము చేసుకొనుట లేదు.
సదా అంతర్ముఖులు అనగా హర్షితముఖులు, మాయ చేయు ప్రతీ దాడిని వెన్న నుండి వెంట్రుకను తీసినంత సులభంగా దాటువారు, ఇటువంటి సహయోగులు, సదా తండ్రి తోడును అనుభవము చేయువారు, సర్వ అనుభవీ మూర్తులకు బాప్ దాదా ప్రియసృతులు మరియు నమస్తే.
దీదిగారితో:- సాక్షిగా ఉంటూ ఆత్మల రకరకాల పాత్రలను చూస్తున్నారా? ఎవరి పాత్రనైనా చూచి, 'ఇలా ఎందుకు' అని అలజడి ఏమైనా కలుగుతున్నదా? మహారథులకు, ఆశ్వారూఢులకు గల ముఖ్యమైన తేడా ఇదే. అశ్వారూఢుల గుర్తు ఏది? ప్రశ్నార్థకము. మహారథుల గుర్తు - ఫుల్ స్టాప్, సైన్యములోనైనా ఫస్ట్ నంబరు, సెకండ్ నంబరు వారికి గుర్తులుంటాయి కదా. వారికి మెడల్ కూడా లభిస్తుంది. దాని ద్వారా వీరు ఫస్ట్, వీరు సెకండు అని తెలుస్తుంది, అయితే అనాది డ్రామాలో, ఆత్మిక సైన్యములో సేనానులకు ఏ మెడలూ ఇవ్వబడదు. కాని వారికి స్థితి అను మెడల్ స్వతహాగా ప్రాప్తి అవ్వనే అవుతుంది. ఏ మెడల్ తగిలించుకోరు. స్వతహాగా తగుల్కొనే ఉంటుంది. మహావీరుల మెడల్ - ఫుల్ స్టాప్ అని వినిపించాము కదా. కేవలం స్టాప్ కాదు, ఫుల్ స్టాప్. రెండవ నంబరు అనగా అశ్వారూఢుల గుర్తు - ఒకప్పుడు స్టాప్, ఒకప్పుడు ప్రశ్న. విశేషంగా వారి గుర్తు ప్రశ్నార్థకమే. దీని ద్వారా ఈ ఆత్మ ఏ స్థితిలో ఉన్నదో తెలుసుకోవాలి. ఈ గుర్తునే మెడల్ అని అంటారు. స్పష్టంగా కనిపిస్తుంది కదా? రోజు-రోజుకు ప్రతి ఆత్మ తమను తాము సాక్షాత్కారము చేయిస్తూ ఉంటుంది. కోరుకోక పోయినా ప్రతి ఒక్కరిస్టేజీ అనుసారము వారి స్థితి కనిపిస్తూ పోతుంది. వారి ముందు వచ్చే పరిస్థితులు, సమస్యలు వారు వద్దనుకున్నా, స్వయాన్ని దాచుకోలేరు. ఎందుకనగా ఇప్పుడు ఎటువంటి సమయము సమీపిస్తున్నదంటే, సమయ సమీపత వలన మాల స్వయంగానే తన సాక్షాత్కారమును చేయిస్తుంది. స్థితి ఆటోమేటికిగా తన నంబరును ప్రసిద్ధము చేస్తూ పోతుంది. ఇలా అనుభవమవుతున్నది కదా? ఎవరైనా ముందుకు వెళ్లాల్సి ఉంటే వారికి అటువంటి అవకాశమే లభిస్తుంది. ఎవరైనా వెనుక నంబరులోకి పోవలసి ఉంటే వారికి ఆటోమేటిక్ గా అటువంటి సమస్యలు, మాటలు ఎదురై, స్వతహాగా ముందుకు వెళ్లే కళ నిల్చిపోయే కళగా అయిపోతుంది. ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్లలేరు. గోడను (ఆటంకమును) దాటుకొనే శక్తి ఉండదు. అందుకు మూల కారణము - ప్రారంభము నుండి ప్రతి గుణమును, ప్రతి శక్తి పాయింటును అనుభవము చేయువారిగా నడుచుకోలేదు. అనుభవము పునాదిగా గల ఆత్మలు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. మెజారిటీ ఆత్మల ఆధారము - “సంఘటనను చూచుట లేక కేవలం సాత్విక జీవితమునకు ప్రభావితులగుట, ఏదైనా ఒక దానిని ఆధారముగా భావించి నడుచుకొనుట, లేక ఎవరి జతలోనైనా ఉల్లాస-ఉమంగాలతో నడచుట, ఎవరైనా చెప్పినందున నడుస్తూ ఉండుట, జ్ఞానము బాగుందని దాని ఆధారముతో నడచుట' - ఇటువంటి వారికి అనుభవమను పునాది గట్టిగా లేనందున నడుస్తూ - నడుస్తూ ఆగిపోతారు. అయితే నంబరువారీగా కావలసిందే. ఇప్పటికీ చాలామంది ప్రాప్తులుంటాయని వర్ణిస్తారు. కాని యోగి జీవితమని దేనినంటారో, దానిని చాలా తక్కువ కాలము అనుభవము చేస్తారు. “డ్రామా" అని అంటారు కానీ డ్రామా రహస్యమును తెలుసుకొని డ్రామా ఆధారముపై జీవితములో అనుభవము చేయువారు చాలా తక్కువమంది ఉన్నారు. ఇలా కనిపిస్తున్నది కదా? అయినా ఇటువంటి ఆత్మలకు కూడా సహయోగము ఇస్తూ గమ్యము వరకు తీసుకుపోవలసిందే కదా అని తండ్రి అంటున్నారు. తండ్రి తన మాట నిలబెట్టుకుంటారు కదా. కాని వారు సంగమ యుగములోని ప్రాప్తుల శ్రేష్ఠ భాగ్యమును పొందలేరు. సహయోగమనే లిఫ్ట్ ద్వారా నడుస్తూ ఉంటారు. కాని కల్పమంతా లభించకుండా, ఇప్పుడు లభించు ప్రాప్తి నుండి వంచితులుగా ఉండిపోతారు. ఇటువంటి వారిని చూచి దయ కూడా కలుగుతుంది. జాలి కూడా కలుగుతుంది. సాగరుని పిల్లల్లో కూడా చెరువులో స్నానము చేయుటకు అధికారులై పోతారు. చిన్న-చిన్న బలహీనతలకు సంబంధించిన విషయాలలో సమయము గడుపుట చెరువులో స్నానము చేయడం అవుతుంది కదా? అచ్ఛా!
పార్టీలతో:- అందరూ సదా తండ్రి తోడును అనుభవము చేస్తున్నారా? ఎందుకంటే తండ్రిని తమ తోడుగా చేసుకొనుట ముఖ్యమైన విషయము. సదా తండ్రిని తోడుగా చేసుకుంటే, మాయ స్వతహాగా మీ తోడును వదిలేస్తుంది. ఎందుకంటే ఈ ఆత్మలు నన్ను వదలి ఇతరులను తోడుగా చేసుకున్నారని గమనిస్తే మాయ దూరముగా వెళ్ళిపోతుంది. సదా తండ్రి జతలో ఉండండి. ఒక సెకండు కూడా దూరము కాకండి. తండ్రి (సాఖీ) తోడు నిభాయించుటకు రెడీగా ఉన్నప్పుడు ఎందుకు వదిలేస్తారు? తోడుగా ఉండుటలో లాభము కూడా ఉంది కదా, లాభమిచ్చే వారిని ఎప్పుడైనా వదిలేస్తారా? సాథీ, తోడుగా లేనందున పనులు ఒంటరిగా చేస్తారు, అందువలన కష్టమనిపిస్తుంది. తండ్రి తోడున్నారంటే ఏ పని అయినా జరిగిపోయినట్లే. దూరమైనారంటే చిన్న పని కూడా కష్టమనిపిస్తుంది. అందువలన అంతర్ముఖులై అనుభవాలలోకి వెళ్లండి. అప్పుడు శక్తిశాలురుగా అనుభవము చేస్తారు.
సదా స్వయం సంతోషంగా ఉన్నామని అనుభవము చేస్తున్నారా? ఎలాగైతే స్థూల ఖజానాల యజమాని సదా ఖజానాల నశాలో ఉంటాడో, అలా స్వయంను సంతోషాల ఖజానాతో నిండుగా భావించి నడుస్తున్నారా? ఖుషీ ఖజానా సదా స్థిరంగా ఉంటుందా లేక ఎప్పుడైనా దొంగిలింపబడుతుందా? ఎవరైనా ఖజానాను లూటీ చేస్తే ఖజానాతో పాటు సంతోషము కూడా వెళ్లిపోతుంది. ఖుషీ పోయిందంటే ఖజానాలు పోయినట్లే ఖజానాను తండ్రి ఇచ్చారు, కాని దానిని సంభాళించేవారు నంబరు వారుగా ఉన్నారు. ఈ ఖజానా మీదే అయితే, దానినెంతగా కాపాడుకుంటారు! చాలా చిన్న వస్తువును కూడా చాలా భద్రంగా కాపాడుకుంటారు. ఇది చాలా పెద్ద ఖజానా. కాపాడుకోవడం వస్తే సదా సంపన్నముగా ఉంటారు. ఇప్పుడు మీరు సదా సంతోషంగా ఉంటున్నారా? బ్రాహ్మణ జీవితమంటేనే సంతోషాల జీవితము. జీవితములో సంతోషము లేకుంటే ఏమియూ లేనట్లే. సదా అప్రత్తముగా ఉండండి. ఏ దారిలో ఖజానా కొల్లగొట్టబడుతూ ఉందో తెలుసుకొని ఆ దారిని మూసేయండి. అప్పుడు సదా శక్తిశాలురుగా అనుభవము చేస్తారు. ఖజానాను కాపాడుకొనుట నేర్చుకోండి. అందుకు ఆధారము - 'అప్రమత్తత (అటెన్షన్).' కనుక సదా సంతోషముగా ఉంటానని స్వయం మీకు మీరే ప్రమాణము చేసుకోండి. ఇతరుల ఎదుట ప్రమాణము చేస్తే, అది తాత్కాలికముగా కొంత కాలము మాత్రమే ఉంటుంది. కాని స్వయం మీకు మీరే ప్రతిజ్ఞ చేస్తే, ఏమి జరిగినా ప్రతిజ్ఞను ఎప్పుడూ భంగపరచరు. తండ్రి లభించారు, వారసత్వము లభించింది. ఇంకేమి కావాలి? ఇంత శ్రేష్ఠమైన ప్రాప్తిని పొందిన వారు ఎంత నషాలో ఉంటారు? సదా మాయాజీతులుగా సదా హర్షితులు, స్వీయ సేవ మరియు ఇతరుల సేవల బ్యాలన్స్ ఉంటే శ్రమ తక్కువ, సఫలత అధికముగా ఉంటుంది.
Comments
Post a Comment