19-03-1981 అవ్యక్త మురళి

19-03-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విశ్వ రాజ్యాధికారిగా ఎలా అవ్వాలి?

ఈ రోజు బాప్ దాదా తన కుడి భుజాలను చూస్తున్నారు. తండ్రి యొక్క ఎన్ని అలసిపోని భుజాలు సేవలో తత్పరులై ఉన్నారో చూస్తున్నారు. ప్రతీ భుజానికి తమ తమ విశేషత ఉంది. కుడి భుజమంటే సదా బాప్ దాదా ఆజ్ఞానుసారముగా ప్రతీ సంకల్పము, ప్రతీ అడుగు వేయువారు. తండ్రికి భుజాలుగా అయ్యారు. అందుకే బాప్ దాదా కూడా తన భుజాలను చూచి హర్షిస్తున్నారు. కుడిభుజాలందరి చేతిలో ఏముంది? రాజ్య భాగ్యము యొక్క గోళము(గ్లోబు) ఉంది. కృష్ణుని చేతిలో వెన్నముద్ద(గ్లోబును) చూపిన చిత్రాన్ని కూడా చూశారు కదా. అయితే కృష్ణుడు ఒక్కడే ఒంటరిగా రాజ్యమేమైనా చేస్తాడా? మీరందరూ తోడుగా ఉంటారు కదా. కనుక అది మీ అందరి చిత్రము కూడా అయ్యింది. ఎందుకంటే అధికారులుగా అయితే ఇప్పుడే అవుతారు. ఇప్పటి అధికారతనపు సంస్కారము 21 జన్మల వరకు కొనసాగుతుంది. ఇప్పుడు కూడా రాజులే, భవిష్యత్తులో కూడా రాజులుగానే అవుతారు. ఇప్పటి రాజ్యాధికారులే విశ్వ రాజ్య అధికారులుగా అవుతారు. కనుక ఇప్పుడు రాజ్యాధికారులుగా ఉన్నారా? అందరి రాచ కార్యాలు బాగా జరుగుతున్నాయా? మీ అందరి రాజ్య పరిస్థితి ఎలా ఉంది? రాజ కర్మచారులందరూ (కార్యకర్తలందరూ) నియమ నిబంధనలలో ఉన్నారా? ఇక్కడే ఒకవేళ అప్పుడప్పుడు నియమాలలో ఉండి, అప్పుడప్పుడే లేకుంటే అక్కడ ఏమి చేస్తారు? అక్కడ కూడా 1, 2 జన్మలకు మాత్రమే రాజులుగా అవుతారు. 21 జన్మలకు అవ్వాలి. మరి ఇక్కడ 'అప్పుడప్పుడు' అనేది ఎందుకు? ఇక్కడి సంస్కారమే అక్కడ కూడా ఉంటుంది. అందుకే సదా రాజులుగా అవ్వాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా నివాసులైతే అందరితో పరుగు పందెపు రేసును చేస్తున్నారు కదా? ఏ నంబరు వరకు చేరుకున్నారు? (హృదయ సింహాసనము వరకు) అందులో కూడా ఏ నంబరు? అయినా పురుషార్థము మంచిగా చేస్తున్నారు. మర్యాదాపురుషోత్తముల సంస్కారము నింపుకునే లక్ష్యము ఉంచుకోవడంలో బాగున్నారు. సత్యమైన సీతలై గీత లోపల ఉండే లక్ష్యములో మంచి ధైర్యముంచారు. రావణుని ఆకర్షణలోకి రావడం లేదు కదా. రావణుని బహు రూపాలను బాగా తెలుసుకున్నారా? రావణుని గురించి కూడా జ్ఞాన స్వరూపులుగా అయ్యారా? జ్ఞానము తక్కువైన కారణంగానే రావణుడు తనవారిగా చేసుకుంటాడు. జ్ఞాన సంపన్నుల ఎదురుగా అతడు దగ్గరకు కూడా రాలేడు. భలే బంగారు రూపాన్ని ధరించినా, వజ్రాల రూపాన్ని ధరించినా మీ వద్దకు రాలేదు. ఆస్ట్రేలియాలో రావణుడు వస్తాడా? దాడి చేయుటకు కాదు, నేర్పించుటకు వస్తాడు కదా. రావణునికి మీరందరూ అర్ధకల్పపు మిత్రులు. కనుక మీరంటే అతనికి కూడా చాలా ఇష్టము. అందుకే వదలాలనుకోడు. మరి ఏమి చేస్తారు? అతని మిత్రత్వాన్ని నిభాయించరా? (నిభాయించము)

ఇప్పుడు రావణుడు 10 భుజాలతో మీకు 10 రకాలుగా సేవ చేస్తాడు. ఇన్ని భుజాలు సేవలో వినియోగిస్తాడు. 10 భుజాల జోరుతో మీ కొరకు చాలా త్వర త్వరగా, చాలా సుందరాతి సుందరమైన రాజ్యాన్ని తయారు చేస్తాడు. ఎందుకంటే నేనిప్పుడు రాజ్యము చేయలేనని, రాజ్యము తయారు చేసి ఇవ్వవలసి వస్తుందని రావణుడు కూడా అర్థము చేసుకున్నాడు. ఏదైనా పని చేయాలంటే - 10 గోర్ల (వేళ్ల) బలముతో చెయ్యాలని అంటారు కదా. ఈ ప్రకృతి 5 తత్వాలు, వీటితో పాటు 5 వికారాలు కూడా పరివర్తన చెంది 5 విశేషమైన దివ్యగుణాల రూపంలో మీ సేవ కొరకు వస్తాయి. కనుక రావణునికి ధన్యవాదాలు తెలపాలి కదా. రావణుని సైన్యము మీ కొరకు చాలా శ్రమ చేస్తున్నారు. ఎంతమంది లగ్నమై ఉన్నారో చూస్తున్నారా? విదేశాలలో సైన్స్ ద్వారా ఎన్ని ఏర్పాట్లు (తయారీలు) చేస్తున్నారు! అవన్నీ ఎవరి కొరకు తయారవుతున్నాయి? మా కొరకే అని చెప్పండి.

ఆస్ట్రేలియావారు ధైర్య గుణాన్ని చాలా బాగా చూపించారు. అందుకే బాప్ దాదా ఈ రోజు విశేషంగా ఆస్ట్రేలియా వారితో పిక్నిక్ చేస్తారు. ప్రతి స్థానానికి తన తన విశేషత ఉంది. ఇతరులకు అవకాశమిచ్చి ఇలాంటి చాన్స్ లర్ గా అయినందుకు బాప్ దాదా అందరికీ ఒక విశేషమైన బహుమతినిస్తున్నారు. అది ఏది? విశేషంగా ఒక శృంగారమునిచ్చారు. సదా శుభచింతకులుగా ఉండే తిలకము. కిరీటముతో పాటు ఈ తిలకము తప్పక ఉండాలి. ఆత్మ బిందువు మెరిసినట్లే మస్తకము మధ్యలో ఈ తిలకపు మణి కూడా మెరుస్తూ ఉంది. మీరంతా శుభచింతక గ్రూపు కదా. పరచింతనకు విడాకులిచ్చే సదా శుభ చింతకులు. ఇలాంటి మాట ఏదైనా మీ ముందుకు వస్తే శుభచింతక మణి అనే ఈ బహుమతి సదా స్మృతిలో ఉండాలి. అప్పుడు ఆస్ట్రేలియాలో సదా శక్తిశాలి వైబ్రేషన్లు, శక్తిశాలి సేవ మరియు సదా ఫరిస్తాల సభ కనిపిస్తుంది. శక్తులు, పాండవుల సంఘటన కూడా బాగుంది. సేవ చేయాలనే ఉత్సాహము కూడా బాగుంది. సేవనైతే అందరూ చేస్తారు కానీ సేవలో ఏ సంస్కారాలు లేక సంకల్పాల విఘ్నాలు లేకుండా ఉండుటే సఫలతా స్వరూప సేవ. ఈ విషయాల వలననే సేవ వృద్ధి చేయుటకు సమయము పడుతూ ఉంది. కనుక సదా నిర్విఘ్న సేవాధారులుగా కండి. ఆస్ట్రేలియా నివాసులు ఎన్ని సేవా కేంద్రాలు తెరిచారు? సేవలో ఉమంగము బాగుండాలి. భలే ఎక్కడికైనా వెళ్లండి, మీ సేవగా భావించి పని చేయండి. ఇది ఆస్ట్రేలియా వారిది, ఇది జర్మనీ వారిది అని కాదు. మనది బాబా సేవ లేక విశ్వ సేవ. దీనినే బేహద్ వృత్తి (ఆలోచన) అని అంటారు. మీరు బేహద్ వృత్తి గలవారు కదా. ఎక్కడకు వెళ్లినా అంతా మనదే. మీరు విశ్వకళ్యాణకారులు. కేవలము ఆస్ట్రేలియా లేక చుట్టుప్రక్కల వారి కళ్యాణకారులు కాదు. సేవ వృద్ధి చెందుటకు ఈ నియమాలు నిమిత్తంగా చేశారు. మంచి ఉత్తేజంతో సేవను సంభాళించుటకు నిమిత్తంగా ఇలా చేశారు. ఇప్పుడిక ముందుకు ఏమి చెయ్యాలి? సేవా కేంద్రాలు, గీతా పాఠశాలలు కూడా తెరిచారు. ఇప్పుడేం చేస్తారు? (సూక్ష్మ సేవ) సూక్ష్మ సేవతో పాటు ఇంకా కొంచెము చేయాలి. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వము స్వాగతము పలికేలాంటి వి.ఐ.పి ని ఆస్ట్రేలియా వారు ఇంకా తీసుకురాలేదు. ప్రభుత్వము వరకు శబ్దము వెళ్లడమంటే శబ్ధము పెద్దగా రావడం (ప్రసిద్ధి చెందడం). వద్దనుకున్నా భారతీయుల చెవుల్లో బలవంతంగానైనా శబ్ధము పడాలి. ఇప్పుడు విదేశాలలో ఏ స్థానమైనా ఇటువంటి సేవ చెయ్యాలి. కుంభకర్ణుని చెవుల్లో అమృతము పోస్తున్నట్లు చిత్రములో చూపుతారు కదా. ఇటువంటి సేవ జరిగినపుడే విదేశీయుల శబ్దము భారతదేశము వరకు చేరిందని అంటారు. ఇప్పుడు చిన్న చిన్న వాయిద్యాల వరకు చేరారు, పెద్ద విజిల్ (ఈల) మ్రోగించాల్సి వస్తుంది. అప్పుడు బాప్ దాదా మీ అందరికీ చాలా మంచి బహుమతినిస్తారు. ఇలాంటి శబ్దము వచ్చినపుడే జయ జయ ధ్వనుల సన్నాయి మేళాలు మ్రోగుతాయి లేకుంటే భారతదేశ కుంభకర్ణులు అంత సులభంగా మేల్కొనేవారు కాదు. ఇప్పుడైతే కేవలము ఇదేమిటి? అని అటు ఇటు మసులుతూ గురకలు పెడుతూ ఉన్నారు. ఇప్పుడేమి చెయ్యాలో తెలిసిందా. విదేశాలలో ప్రతీ స్థానంలో ఇలాంటి ధైర్యవంతులున్నారు. ఈసారి నైరోబీ వారు చాలా బాగా ప్రయత్నించారు. బాగా శ్రమ చేశారు. అఫిషియల్ ప్రోగ్రాము చేసినపుడే శబ్దము వ్యాపిస్తుంది. పర్సనల్ ప్రోగ్రామ్ చేస్తే శబ్దము పెద్దగా వ్యాపించదు. ఇలాంటి సేవ చేసినపుడే మహా యజ్ఞము సమాప్తి సమారోహము చేయగలరు. ఇప్పుడైతే ప్రారంభము చేశారు.

శక్తి సేన తయారైనట్లు (రెడీ అయినట్లు) అనిపిస్తుంది. ముఖము మరియు నడవడికలు రెండూ శక్తి రూపములో కనిపిస్తున్నాయి. యూనిఫామ్ కూడా బాగుంది. అందరి బ్యాడ్జ్ లు కూడా బాగా మెరుస్తున్నాయి. బాగా శ్రమ చేశారు. ఆస్ట్రేలియా నివాసులు ప్రారంభములో ఎంత స్వతంత్ర సంస్కారవంతులుగా ఉండినారో ఇప్పుడు మర్యాదలలో కూడా అంత బాగున్నారు. ఇప్పుడు తండ్రి మధురమైన బంధనలోకి వచ్చేశారు. అందరూ బాగున్నారు. ఎలాగైతే నగను స్వరూపములోకి తెస్తారో అలా ఈ నగలు కూడా తయారైపోయారు. పాలిష్ అయిపోయారు. పాండవులు కూడా మంచి సేవాధారులుగా ఉన్నారు. గౌరవము ఇచ్చి పుచ్చుకోవాలి. ఈ మంత్రముతో సదా సహజంగా సేవ వృద్ధి అవుతూ ఉంటుంది. ఇప్పుడు గౌరవమిచ్చుటనూ నేర్చుకున్నారు, తీసుకొనుట కూడా నేర్చుకున్నారు. గౌరవమివ్వడమే తీసుకోవడం. ఇది సదా గుర్తుంచుకోండి. కేవలము గౌరవము తీసుకుంటే లభించదు. కానీ ఇస్తే లభిస్తుంది. అందువలన పరస్పరములో స్నేహము, ఐక్యత బాగుంటుంది. ఈ మంత్రము పక్కాగా గుర్తుంది కదా. 

దీదీ, దాదీలతో- వైర్ లెస్ సెట్ మీ వద్ద ఉంది కదా? సెకండు కంటే త్వరగా కర్తవ్యము చేయించు చోటుకు వైర్ లెస్ ద్వారా ఆదేశమును ఇవ్వగలరు. ఎందుకంటే ఎంతగా సేవ వృద్ధి చెందుతూ పోతుంది. అప్పుడీ పత్ర వ్యవహారము, టెలిగ్రామ్, టెలిఫోన్ మొదలైనవి ఏమి చెయ్యగలవు. ఈ రోజు ఇది బాగుంటుంది, రేపు పని చేయదు. అప్పుడు మొత్తం సేవనంతా ఎలా నడపగలరు? దీనికై సాధనాలు చేసుకోవాల్సి పడ్తుంది. హాలు కూడా నిర్మిస్తారు. భండారా(కిచెన్) కూడా నిర్మించారు. ఇది వచ్చేవారికి సరిపోతుంది కాని నలువైపులా సేవాకేంద్రాల ఇంత విస్తారాన్ని ఎలా హ్యాండిల్ చేయగలరు? అందరినీ ఇక్కడకు పిలుస్తారా? ప్రజలైతే క్యూలో వస్తారు. వారసులు క్యూలో రారు కదా. అందుకే విశేషంగా సెకండులో కర్మాతీత స్థితి ఆధారంతో మీరు సంకల్పము చేస్తూనే అక్కడకు ఎలా చేరుతుందంటే, మీరు మాట్లాడుతూ ఉంటే అక్కడ వారు వింటున్నట్లు చేరుతుంది. ఇలాంటి అనుభవాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఆ సమాచారాలు కూడా, ఇలా ఇక్కడ అనుభవాలు జరిగాయని వార్తాపత్రికలలో వస్తాయి. సాక్షాత్కారాలు కూడా అవుతాయి మరియు సంకల్పాల సిద్ధి కూడా జరుగుతుంది. ఇప్పుడీ విశేషత కూడా వస్తూ ఉంటుంది. మహారథుల పురుషార్థము విశేషంగా ఈ అభ్యాసము చేయడమే. ఇప్పుడిప్పుడే కర్మయోగము, ఇప్పుడిప్పుడే కార్మతీత స్థితి. ఒకే స్థానములో నిల్చొని ఉన్నా నలువైపులా సంకల్పాల సిద్ధి ద్వారా సేవలో సహయోగులుగా అవుతారు.

చాలా సమయము ఇవ్వవలసి వస్తుంది. ఎంత సమయమిస్తారో అంత అందరి వద్ద ఖుషీ గనులు నిండుతూ ఉంటాయి. మీ సమయమివ్వడమంటే సంతోషాల ఖజానాను నింపుట. ఇతరుల సంతోషమును చూచి ఇంకా వారికి ఉమంగ-ఉత్సాహాలను ఇవ్వాలనే సంకల్పము వస్తుంది. అందరూ బాగానే అనుభవం చేస్తున్నారు. సమయము తప్పక ఇవ్వవలసిందే. కానీ సమయపు సఫలత వెయ్యి రెట్లు ఎక్కువ అయిపోతుంది. అందుకే అందరికీ మధువనపు ఆకర్షణ రోజురోజుకు ఇంకా పెరుగుతూ పోతుంది. ఇది నిమిత్త ఆత్మలైన మీ సేవా ఫలము. 

ఆస్ట్రేలియాలోని భిన్న -భిన్న సేవాకేంద్రాల నుండి వచ్చిన సోదరీ - సోదరులతో అవ్యక్త బాప్ దాదా మధుర మిలనము - 

1) ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ అవుతూ ఉందా? స్వయాన్ని ఇటువంటి పదమాపదమ్ భాగ్యశాలురుగా అనుభవము చేస్తున్నారా? మొత్తం రోజులో ఎన్ని పదమాలు జమ అవుతాయి? లెక్కించగలరా? పాండవులంతా కలిసి సేవలో వృద్ధి తెస్తున్నారు. ఇది చాలా బాగుంది. సదా పరస్పరము ఒకరికొకరు సంతుష్టంగా ఉన్నారా? అందరూ సదా ఏకమతంగా, ఏకరసంగా ఉన్నారా? ఇది కూడా ఒక చాలా మంచి ఉదాహరణ. ఒకరు చెప్తే రెండవవారు అంగీకరించుట, ఇదే సత్యమైన స్నేహానికి రెస్పాన్స్ ఇటువంటి ఉదాహరణను చూచి ఇతరులు కూడా సంపర్కములో వచ్చేందుకు ధైర్యమునుంచుతారు. సంఘటన కూడా సేవా సాధనంగా అవుతుంది. ఒకే తండ్రి, ఒకే మతము. ఇదే సంస్కారము ద్వారా సత్యయగములో ఒకే రాజ్య స్థాపన చేస్తారు. నిర్విఘ్న సేవ జరుగుతూ ఉంది కదా? ఎలాంటి గొడవలు లేవు కదా. వీరి ఐక్యత బాగుందని ఐక్యతతో ఘెరావ్ చేశారని మాయ గమనించిందంటే వచ్చేందుకు ధైర్యము చేయదు. ఒక్కొక్కరు స్వయాన్ని సేవకు నిమిత్తులమని భావించి నడుస్తున్నారు. ఒక్కరు కాదు, మనమంతా నిమిత్తులమే. తండ్రి నిమిత్తంగా చేశారనే స్మృతి ఉంటే సఫలత జరుగుతూ ఉంటుంది. మనన శక్తి ద్వారా స్వ స్థితి కూడా శక్తిశాలిగా అవుతూ పోతుంది. 

2) సదా స్వయాన్ని నిర్బంధన ఆత్మగా అనుభవము చేస్తున్నారా? ఎలాంటి బంధనమూ అనుభవం కావడం లేదు కదా? జ్ఞాన సంపన్న శక్తితో బంధనాలను సమాప్తము చేయలేరా? జ్ఞానములో లైట్, మైట్ రెండూ ఉన్నాయి కదా. జ్ఞాన సంపన్నులు బంధనములో ఎలా ఉండగలరు? ఎలాగైతే రాత్రి, పగలు కలిసి ఉండవో అలా మాస్టర్ జ్ఞాన సంపన్నులు, బంధనాలు రెండూ కలిసి ఉండలేవు. జ్ఞాన సంపన్నులంటే నిర్బంధనులు. గతం గత: కొత్త జన్మ జరిగిన తర్వాత గత సంస్కారాలు ఇంకా ఎందుకు ఇమర్జ్ చేస్తారు? బ్రాహ్మకుమార - కుమారీలకు బంధనాలెలా ఉంటాయి? బ్రహ్మాబాబా నిర్బంధనులు కనుక పిల్లలు బంధనాలలో ఎలా ఉండగలరు? అందుకే సదా "నేను మాస్టర్ జ్ఞాన సంపన్న ఆత్మను” అనే స్మృతిలో ఉండాలి. తండ్రి వలె పిల్లలుండాలి.

3) సదా సఫలత మా జన్మ సిద్ధ అధికారము, ఇంత నషా ఉందా? సఫలత వస్తుందా లేక రాదా అన్న ప్రశ్నే లేదు. సఫలతామూర్తిని అనే నషా ఉంటుందా? మాస్టర్ శిక్షకులయ్యారు కదా. ఎలా తండ్రికి శిక్షకుని యోగ్యతలు ఉన్నాయో అలా మాస్టర్ శిక్షకులకు కూడా ఉంటుంది కదా. తండ్రి సమానంగా అయ్యారు కదా?(ఔను) ఈ ఔను ఔను అనే పాట బాగా పాడారు. తండ్రి గుణాలు అందరికీ వినిపించి నాట్యము చేస్తూ, చేయిస్తారని దీని ద్వారా సిద్ధమవుతుంది. కుమారీలను చూచి బాప్ దాదా చాలా సంతోషిస్తారు. ఎందుకంటే వారు త్యాగము చేసి తపస్వీలుగా అయ్యారు. పిల్లల త్యాగము, ధైర్యము చూచి తపస్సులో ఉమంగమును చూచి బాప్ దాదా సంతోషిస్తున్నారు. తండ్రిని భక్తులు మహిమ చేస్తారు కానీ తండ్రి పిల్లల మహిమ చేస్తారు. మాలను మీరు ఎన్ని జన్మలు స్మరించారు? దానికి బదులుగా ఇప్పుడు తండ్రి పిల్లల మాలను స్మరిస్తున్నారు. తండ్రి ఏ సమయంలో మాలను స్మరిస్తారో మీరు చూస్తున్నారు(అమృతవేళలో). కనుక తండ్రి మాల స్మరించు సమయంలో మీరు నిద్రపోరు కదా. శక్తులైతే నిద్రించేవారిని మేల్కొల్పేవారు. స్వయం వారే ఎలా నిద్రిస్తారు? రిజల్ట్ బాగుంది. సర్టిఫికెట్ లభించడం కూడా అదృష్టమే. ఆస్ట్రేలియా వారికి మంచి సర్టిఫికెట్ లభిస్తున్నది. మీ పూలతోటను నిశ్చయము మరియు ధైర్యమనే నీటితో తడుపుతూ ఉంటే వృద్ధి చెందుతూ ఉంటారు. వృద్ధి జరుగుతూ ఉంటుంది. 

డా. నిర్మల బెహన్ తో- బాప్ దాదా ఎంత మహిమ చేసినా అది తక్కువే. మీరు ఇలాంటి మహిమా యోగ్య రత్నము. పేరు వంటి నిర్మాణచిత్త గుణముతో విజయులుగా అయ్యారు. సహన శక్తి మరియు ఎదిరించే శక్తి ఆధారముపై అన్ని స్థానాలను నిర్విఘ్నంగా చేశారు. బాప్ దాదా ప్రత్యక్ష ఫలాన్ని చూచి చాలా సంతోషిస్తున్నారు. అందుకే సదా మీరు విశేష ఆత్మల లిస్ట్ లో ఉన్నారు. సదా తండ్రి సహాయము లభిస్తూ ఉంటుంది. ఇంకా లభిస్తూనే ఉంటుంది. విశేషంగా మీ మస్తకముపై సదా తండ్రి చెయ్యి ఉంటుంది. సదా ఈ చిత్రాన్ని మీ వద్ద ఉంచుకోండి. సర్వ దైవీ పరివార స్నేహము మరియు సర్టిఫికెట్ కూడా ఉంది.

Comments