* 18-11-1981 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సంపూర్ణత యొక్క సమీపతకు గుర్తు.
మాటలను చెప్పేందుకు వచ్చారు. హృదయరాముని హృదయంలో ఏ ఒక్క విషయముంటుందో పిల్లలకు ఈ రోజు మనోభిరాముడైన బాబా తమ హృదయ సింహాసనాధికారులైన పిల్లలతో తమ మనసులోని తెలుసు. హృదయరాముని హృదయంలో సదా సర్వులకు విశ్రాంతిని కలిగించే, ఇటువంటి హృదయం గల పిల్లలు ఉంటారు. బాబా హృదయంలో పిల్లలందరి పైన ఒకే ఆశ ఉంది. పిల్లలందరూ విశేష ఆత్మలుగా, విశ్వాధిపతులుగా అవ్వాలి, విశ్వరాజ్య భాగ్యానికి అధికారులుగా అవ్వాలి అనే ఉంటుంది. పిల్లలు ప్రతి ఒక్కరూ ఒకరికన్నా ఒకరు శ్రేష్ఠంగా అలంకరింపబడి, గుణసంపన్నులుగా, శక్తి సంపన్నులుగా, నెంబర్ వన్ గాఅవ్వాలి అని ఉంటుంది. ప్రతి ఒక్కరి విశేషత ఒకరికన్నా ఒకరిది ఎక్కువ ఆకర్షణమయంగా ఉండాలి. విశ్వం చూసి ప్రతి ఒక్కరి యొక్క గుణాలను గానం చేయాలి. ప్రతి ఒక్కరూ విశ్వ ఆత్మల కొరకు లైట్ హౌస్ గా ఉండాలి, మైట్ హౌస్ గా ఉండాలి, ధరణిలో మెరుస్తున్న తారలుగా ఉండాలి. ప్రతీ తార యొక్క శ్రేష్ఠ కర్మ, శ్రేష్ట సంకల్పం ద్వారా జమా చేయబడిన విశేషతలు లేక ఖజానాలు ఎంత అపారంగా ఉండాలంటే, ప్రతి ఒక్క తారలోనూ తమ విశేష ప్రపంచం కనిపించాలి. ప్రతి ఒక్కరూ చూస్తూ, చూస్తూ తమ దు:ఖాలను మరచిపోయి సుఖాలను అనుభవం చేసుకొని హర్షితమైపోవాలి. ప్రతి ఒక్కరి సర్వప్రాప్తుల యొక్క అలౌకిక ప్రపంచాన్ని చూసి వాహ్, వాహ్ యొక్క గీతాలను గానం చేయాలి. ఇది మనోభిరాముడైన బాప్ దాదా యొక్క హృదయంలోని విషయం.
ఇప్పుడు పిల్లల హృదయంలో ఏముంది? ప్రతి ఒక్కరికీ తమ తమ హృదయంలో ఏముందో బాగా తెలుసు కదా! ఇతరుల హృదయాలను గూర్చి కూడా తెలుసా లేక కేవలం మీ హృదయాన్ని గూర్చి తెలుసా? పరస్పరం ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు మీ హృదయంలోని ఉల్లాస ఉత్సాహ విషయాలను వినిపిస్తారు కదా! అందులో ముఖ్యంగా ఏం వర్ణన చేస్తారు? అందరిలోనూ విశేషంగా బాబా ఏదైతే అంటారో అది చేసి చూపించాలి అని, లేక బాబా సమానంగా అయి తీరుతాము అని ఇదే సంకల్పము ఉంటుంది. కావున బాబా హృదయంలోని మరియు పిల్లల హృదయంలోని విషయమైతే ఒక్కటే. అయినా కాని పురుషార్థులు నెంబర్ వారీగా ఎందుకున్నారు? అందరూ నెంబర్ వన్‌గా ఎందుకు లేరు? అందరూ నెంబర్ వన్ గా అవ్వగలరా? అందరూ విశ్వరాజులుగా అవ్వగలరా లేక అలా కూడా అవ్వలేరా? కేవలం ఒక్కరు విశ్వరాజుగా అవుతారా లేక ఇతరులు కూడా అవుతారా? తమ తమ సమయాలలో విశ్వరాజులుగా అవుతారా? మరి అందరూ మేము విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నాము లేక విశ్వరాజ్యాధికారులుగా అవుతున్నాము అని ఎందుకంటున్నారు? రాజ్యంలోకి వస్తారా లేక రాజ్యం చేస్తారా? కొందరు చేసేవారిగా, కొందరు రాజ్యంలోకి వచ్చేవారిగా అవుతారా లేక అందరూ రాజ్యం చేసేవారిగా అవుతారా? ఏమవుతుంది? ప్రజలైతే ఇంకా ఎంతో మంది లభిస్తారు. వారిని గూర్చి చింతించకండి. కేవలం రాజ్యంలోకి వచ్చేందుకే ఇంతగా కష్టపడుతున్నారా? రాజ్యం పొందేందుకు కాక రాజ్యంలోకి వచ్చేందుకు కష్టపడుతున్నారా? మరి అందరూ రాజ్యం చేస్తారు కదా! ప్రతి ఒక్కరూ మేమైతే చేస్తాము, మిగిలినవారు వచ్చినా రాకపోయినా అది వారికి తెలియాలి అని భావిస్తున్నారా? మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు కదా! రాజులుగా అయ్యే యోగమును నేర్చుకుంటున్నారా లేక రాజ్యంలోకి వచ్చే యోగమును నేర్చుకుంటున్నారా? మీరు రాజయోగులు కదా! రాజ్యంలోకి వచ్చే యోగులైతే కారు కదా! అందరూ నెంబర్ వన్ గా అవుతారా లేక అంతిమం వరకూ నెంబర్ వారీగానే ఉంటారా?
ప్రతి ఒక్కరూ తమ స్టేజ్ అనుసారంగా, తమ లెక్క అనుసారంగా నెంబర్ వన్ గా అయితే అవుతారు కదా! ఇంతకుముందు కూడా వినిపించాను కదా! వారి కొరకు అదే నెంబర్ వన్ గోల్డెన్ స్టేజ్ అవుతుంది కదా! అన్నింటికన్నా శ్రేష్ఠమైన నెంబర్ వన్ స్థితిగలవారిగా వారి లెక్క అనుసారంగా అంతిమంలో అయ్యే తీరుతారు కదా! తమ లెక్క అనుసారంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయితే అవుతారు కదా! మొత్తం కల్పమంతటిలో ఆ ఆత్మ యొక్క నెంబర్ వన్ శ్రేష్ఠ స్థితి అయితే అదే ఉంటుంది కదా! ఆ లెక్కలో చూస్తే నెంబర్ వారీగా ఉంటూ కూడా నెంబర్ వన్ గా అయిపోతారు. ప్రతి ఆత్మకు తమ తమ సంపూర్ణ స్థితి ఉంది. ఏ విధంగా బ్రహ్మాబాబా యొక్క పురుషార్థ స్థితిని మరియు సంపూర్ణ స్థితిని రెండింటినీ చూశారో మరియు సంపూర్ణస్థితిలోకి చేరుకోవడం ద్వారా ఏ విశేషతలను అవ్యక్త రూపంలో కూడా పాత్రలోకి తీసుకువస్తున్నారో అది కూడా అనుభవం చేసుకుంటున్నారు. ఏవిధంగా బ్రహ్మాబాబా అలాగే ప్రతీ బ్రాహ్మణ ఆత్మ యొక్క సంపూర్ణ స్థితి స్వరూపం ఉంది. దాన్ని అవ్యక్త వతనంలో బాప్ దాదా యొక్క సంపూర్ణ స్థితి మరియు పురుషార్థ స్థితి ఈ రెండింటి యొక్క తేడాను అనుభవం చేసుకుంటున్నారో సంపూర్ణ స్వరూపాన్ని ఎమర్జ్ చేసి చూస్తూ ఉంటారు మరియు వారు అది చూపించగలరు కూడా. అలా చూస్తూ ప్రతీ ఒక్కరి సంపూర్ణ స్వరూపము ఎంత ఆత్మిక నషా కలిగినదై ఉందో చూస్తున్నారు. ఇప్పుడు సంపూర్ణతను పొందుతున్నారు మరియు తప్పకుండా పొందాలి కూడా. కాని కొందరు పిల్లల యొక్క సంపూర్ణ స్థితి సమీపంగా ఉంది. బ్రహ్మా బాబాకు సదా తమ సంపూర్ణ స్థితి మరియు భవిష్య ప్రారబ్దము అనగా ఫరిస్తా స్వరూపము మరియు దేవపద స్వరూపము రెండూ సదా ఎంత స్పష్టంగా స్మృతిలో ఉండేవంటే దాని వల్ల తమ ముందు నుండి వెళ్ళేవారు కూడా పురుషార్థీ స్వరూపమై ఉన్నా కాని ఫరిస్తా రూపమును మరియు భవిష్య శ్రీకృష్ణ రూపమును చూసేవారు మరియు వర్ణన చేసేవారు. అలాగే పిల్లల్లో కూడా సంపూర్ణతకు సమీపంగా వస్తున్నప్పుడు దానికి గుర్తుగా వారు స్వయమూ సామీప్యతను అనుభవం చేసుకుంటారు మరియు ఒకరులకు కూడా అనుభవం చేయిస్తారు. వ్యక్తంలో ఉంటూ అవ్యక్త రూపాన్ని అనుభవం చేసుకుంటారు, తద్వారా తమ ముందుకు వచ్చే ఆత్మలు వ్యక్త భావాన్ని మరచి అవ్యక్త స్థితిని అనుభవం చేసుకుంటాయి. ఇది సామీప్యతకు గుర్తు. కొందరు పిల్లలకు ఇప్పుడు సంపూర్ణత స్పష్టంగా మరియు సమీపంగా అనుభవమవ్వదు. వారి గుర్తులు ఏమిటి? స్పష్టమైన మరియు సమీపంగా ఉన్న వస్తువును అనుభవం చేసుకోవడం సహజమవుతుంది మరియు దూరంగా ఉండే వస్తువును అనుభవం చేసుకునేందుకు అందులో విశేషంగా బుద్ధిని పెట్టవలసి వస్తుంది. అలాగే ఇటువంటి ఆత్మలు కూడా జ్ఞానం యొక్క ఆధారంపై బుద్ధియోగం ద్వారా సంపూర్ణ స్థితిని తమ వైపుకు లాక్కొని శ్రమతో అందులో స్థితులై ఉండగలుగుతారు.
రెండవ విషయం- ఇటువంటి ఆత్మలకు స్పష్టంగా మరియు సమీపంగా ఉండని కారణంగా నేనైతే అవ్వాలి కాని అలా అవ్వగల్గుతానా లేదా అన్న సంకల్పము కూడా అప్పుడప్పుడూ ఉత్పన్నమవుతుంది. స్వయంప్రతి కాస్త వ్యర్థ సంకల్పం యొక్క రూపంలో అనుమానం ఉత్పన్నమవుతుంది. దానినే సంశయం యొక్క రాయల్ రూపము అని అంటారు. అనుమానము ఒక చిన్న అల రూపంలో వచ్చినా పోతారు. కాని నిశ్చయబుద్ధి గలవారు విజయులుగా అవుతారు. అందులో ఈ స్వప్నమాత్రమైన సంకల్పము, అల సమానమైన సంకల్పం కూడా ఫైనల్ నెంబర్ లో దూరం చేసేస్తుంది. అటువంటివారి విశేష సంస్కారము లేక స్వభావము - ఇప్పుడిప్పుడే చాలా ఉల్లాస ఉత్సాహాలలో ఎగురుతూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే స్వయంతో నిరుత్సాహులుగా అయిపోతారు. పదే పదే జీవితంలో ఈ మెట్లను దిగుతూ మరియు ఎక్కుతూ ఉంటారు. ఉత్సాహము మరియు నిరుత్సాహము యొక్క మెట్లకు కారణమేమిటి? తమ సంపూర్ణ స్థితి స్పష్టంగా మరియు సమీపంగా లేదు. మరి ఇప్పుడు ఏంచేయాలి? ఇప్పుడు సంపూర్ణ స్థితిని సమీపంగా తీసుకురండి, ఎలా తీసుకువస్తారు? దాని విధిని గూర్చి కుడా మీకు తెలుసు. ఏమి తెలుసు? అదైతే నవ్వు పుట్టించే విషయమే. బాప్ దాదా ఏం చూస్తారు? చాలామంది పిల్లలు అందరూ కాదు కాని మెజార్టీ ఏమి చేస్తూ ఉంటారు? ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క ముద్దు పిల్లలైన కారణంగా ఎక్కువ ఒయ్యారాలు చూపుతారు. కావున ఎక్కువ ప్రియమైనవారిగా ఉన్న కారణంగా నాజూకుగా అయిపోతారు. నాజూకుగా ఉన్నవారు ఒయ్యారాలు చేస్తారు. ఏం చేస్తారు? బాబా యొక్క విషయాలను బాబాకే వినిపించడం మొదలుపెడతారు! మీరు నాజూకుగా అయిపోతారు మరియు బాబాతో మా తరఫున మీరు చేయండి అని అంటారు. సహన శక్తి యొక్క దృఢత్వము తక్కువగా ఉంది. సహన శక్తి అన్ని విఘ్నాల నుండి రక్షించే కవచం వంటిది. కవచాన్ని ధరించని కారణంగా నాజూకుగా అయిపోతారు. నేను చేయాలి అన్న పాఠము చాలా కచ్చాగా ఉంటుంది మరియు ఇతరులు చేయాలి లేక బాబా చేయాలి అన్న పాఠము నాజూకుగా చేసేస్తుంది. ఈ కారణంగానే నిర్లక్ష్యము అనే పరదా వచ్చేస్తుంది మరియు సంపూర్ణ స్థితి సమీపంగా మరియు స్పష్టంగా కనిపించదు. కావున మూడు లోకాలను చుట్టి వచ్చేందుకు బదులుగా ఉత్సాహము మరియు నిరుత్సాహము యొక్క విషయాలలో ఇదే ప్రపంచంలో లేక ఇదే మెట్లను దిగుతూ, ఎక్కుతూ ఉంటారు. కావున అందుకొరకు ఏం చేయవలసి ఉంటుంది? ప్రియమైన వారిగా తప్పకుండా అవ్వండి కాని, నిర్లక్ష్యం యొక్క ప్రియమైన వారిగా అవ్వకండి. అప్పడేమైపోతారు? మీ సంపూర్ణతను సహజముగానే పొందగల్గుతారు. మొదట మీ సంపూర్ణ స్థితిని మీరు స్వయమే వరించాలి, అనగా సదా ఉల్లాస ఉత్సాహాల యొక్క వరమాలను ధరించాలి. అప్పుడు మళ్ళీ లక్ష్మిని వరిస్తారు లేక నారాయణుడిని వరిస్తారు. ఏం చేయాలో అర్థమైందా? మీ అందరి యొక్క సంపూర్ణ స్థితి పురుషార్థులైన మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. ఎప్పుడైతే మీరందరూ సంపూర్ణ స్థితిని పొందుతారో అప్పుడే సంపూర్ణ బ్రహ్మా మరియు బ్రాహ్మణులు కలిసి బ్రహ్మ ఇంటికి వెళ్ళగల్గుతారు మరియు మళ్ళీ రాజ్య అధికారులుగా అవ్వగల్గుతారు. అచ్ఛా!
ఇటువంటి సంపూర్ణ స్థితిలోని సమీప ఆత్మలకు, బ్రహ్మా బాబాతో పాటు సంపూర్ణ స్థితిని వరించేవారికి, సదా తమ సంపూర్ణ స్థితి యొక్క అనుభూతి ద్వారా ఇతరులకు కూడా సంపూర్ణంగా అయ్యే ప్రేరణను ఇచ్చేవారికి, ప్రతి ఒక్కరికీ తమ సంతుష్టత ద్వారా దర్పణంగా అయి సంపూర్ణ స్థితిని స్పష్టంగా సాక్షాత్కరింపజేసే వారికి, సదా సంతోషంగా ఉండే ఇటువంటి అదృష్టవంతులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
టీచర్లతో- మీరు బాబా సమానమైన ఆత్మిక సేవాధారులు. మరి సేవాధారులకు ఏ కానుక కావాలి? సమానమైన వారు పరస్పరం ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఒకరికొకరు కానుకను ఇచ్చుకుంటారు కదా! కావున సేవాధారులు బాబా సమానమైనవారు. కావున బాబా ఏ కానుకను ఇస్తారు? లేక మీరు ఇస్తారా? జ్ఞానమునైతే ఎంతో విన్నారు. మురళి కూడా విన్నారు. ఇప్పుడిక మిగిలిందేమిటి? సేవాధారులు బాప్ దాదాలకు అతి సమీప ఆత్మలు. సమీప ఆత్మలకు బాప్ దాదా ఏ కానుకను ఇస్తారు. సేవాధారులకు ఈ రోజు బాప్ దాదా విశేషంగా స్వర్ణిమ వాక్యాల యొక్క కానుకను ఇస్తారు, అదేమిటి? 'సదా ప్రతిరోజూ స్వయం ఉత్సాహంలో ఉంటూ సర్వులకూ ఉత్సాహమును కలిగించే ఉత్సవాన్ని జరుపుకోండి'. ఇది సేవాధారుల కొరకు స్నేహపూర్వకమైన కానుక. ఇదే కానుకను మళ్ళీ మురళిలో స్పష్టం చేద్దాము కాని, కానుక అయితే చిన్నదే బాగుంటుంది. కావున ఈ రోజు మురళిని వినిపించను కాని సారరూపంలో ఉత్సాహంలో ఉంటూ ఉత్సాహమును కలిగించే ఉత్సవాన్ని జరుపుకోండి అని వినిపిస్తున్నాను. దీని ద్వారా ఏం జరుగుతుంది? ఏదైతే కష్టపడవలసి వస్తుందో అది సమాప్తమైపోతుంది. సంస్కారాలు కలుపుకోవడము, సంస్కారాలను అంతం చేసుకోవడము యొక్క శ్రమ నుండి ముక్తులైపోతారు. ఎవరైనా విశేష ఉత్సవాన్ని జరుపుకున్నప్పుడు అందులో తనువు యొక్క రోగము, ధనము యొక్క లోపము, సంబంధ సంపర్కాల యొక్క గొడవలు అన్నింటినీ మర్చిపోతారు. అలాగే ఈ ఉత్సవాన్ని సదా జరుపుకుంటూ ఉన్నట్లయితే సమస్యలన్నీ సమాప్తమైపోతాయి. మళ్ళీ సమయమును, శక్తులను వినియోగించవలసిన అవసరముండదు. అందరూ ఫరిస్తాలుగా అయి వెళుతున్నట్లుగానే సదా అనుభవం చేసుకుంటారు. ఫరిస్తాల యొక్క పాదాలు ధరణిపై నిలువవు అన్న నానుడి కూడా ఉంది. ఎవరైతే సంతోషంలో నాట్యమాడుతూ ఉంటారో వారు ఎగురుతూనే ఉంటారు, వారి పాదాలు నేలపై ఉండవు అనే అంటారు. కావున అందరూ ఎగిరే ఫరిస్తాలుగా అయిపోతారు. కావున ఆత్మిక సేవాధారులు ఇప్పుడు ఈ సేవను చేయండి. కోర్సును ఇవ్వడం, ఇప్పించడం, ప్రదర్శిని చేయించడం, మేళాలు చేయడం, చేయించడం మొదలైనవి ఎంతో కష్టపడి చేసారు. ఇప్పుడు ఈ శ్రమను సహజతరం చేసే సాధనము ఇదే. దీని ద్వారా ఇంట్లో ఉంటూనే దీపంపై దీపపు పురుగులు స్వతహాగానే పరిగెత్తుకుంటూ వస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. ఎంతవరకూ ఇలా కష్టపడుతూ ఉంటారు? ఈ సాధనాలు కూడా పరివర్తితమవుతాయి కదా! కావున తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రత్యక్షము లేక తక్కువ శ్రమతో ఎక్కువ సఫలతను పొందే సాధనము - ఈ కానుక. దానితో మీరు మేళాలను జరుపవలసిన అవసరముండదు. అందుకు బదులుగా మేళాలు చేసేవారు మరియు అనేకులు నిమిత్తులుగా అయిపోతారు. మీకు ఆహ్వానమును ఇచ్చి పిలుస్తారు. ఇప్పుడు కూడా భాషణ కొరకు ముందే నిర్మింపబడ్డ వేదికల పైకి పిలుస్తున్నారు కదా! అలా మేళాలు మొదలైన వాటి కొరకు అంతగా కష్టపడవలసిన అవసరం ఆపై ఉండదు. ఇప్పుడు మీరందరూ దీదీలను, దాదీలను ప్రారంభోత్సవాలకు పిలుస్తారు. ఆ తర్వాత మీరు కూడా దీదీలుగా, దాదీలుగా అయిపోతారు. ప్రారంభం చేసే దర్శనీయమూర్తులుగా అయిపోతారు, మరి ఇది మంచిదే కదా! ఇప్పటివరకూ టెంట్లు వేయడము, గైడ్ లను పిలవడము, తయారుచేసేవారిని పిలవడము ఇదే శ్రమపడుతూ ఉండాలా? అచ్చా! ఇప్పుడు కానుక అయితే లభించింది కదా! మరి ఇప్పుడు మీరేం ఇస్తారు? ఎప్పుడు ఉత్సాహమును తగ్గించుకోము, అలాగే ఇతరుల ఉత్సాహాన్ని తగ్గనివ్వము అన్న సంకల్పాన్నే చేయండి. ఇదే ఇవ్వడము. ఏమి జరిగినా కాని స్థూల వ్రతమును ఉంచినప్పుడు అందులో కూడా ఆకలి, దప్పికలు కలుగుతూ ఉంటాయి కాని అవి కలుగుతున్నా వ్రతమును వదలరు. కళ్ళు తిరిగి పడిపోయినా కాని వ్రతనిష్టను వదలరు, కావున అలాగే మీరు కూడా ఎటువంటి సమస్య వచ్చినా కాని, ఉత్సాహాన్ని అంతం చేసేవారు ఎవరు వచ్చినా కాని మా ఉత్సాహాన్ని వదలము అలాగే ఇతరుల ఉత్సాహాన్ని తగ్గనివ్వము, ముందుకు వెళతాము మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకువెళతాము అని వ్రతమును చేపట్టండి. కావున సదా ఉత్సవాలు ఉంటాయి. సదా మేళాలు జరుగుతాయి. సదా సెమినార్లు జరుగుతాయి, సదా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లు జరుగుతాయి, అచ్ఛా! కానుకా లభించింది. దాన్ని తీసుకున్నారు కూడా, ఇంకేం కావాలి?
విదేశీ పిల్లల సేవలకు అభినందనలు తెలుపుతూ సేవ కొరకు ఇంకొన్ని సూచనలు.
బాప్ దాదా ఎప్పుడూ సేవను వద్దనరు. సేవను ఇంకా బాగా చేయండి, ఎవరికి ఆహ్వానమును ఇవ్వవలసి ఉంటే వారికి ఇవ్వవచ్చు. విదేశీయులకు సేవ యొక్క అభినందనలు. సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలలో అందరూ ముందుకు వెళుతున్నారు మరియు ఇలా ముందుకు వెళ్ళే విశేష ఆత్మల యొక్క సేవార్థం నిమిత్తులుగా అయిపోతారు. ఎవరినైతే విశేషమైన వి. ఐ.పి.లు అంటారో ఇప్పుడు ఆ వి.ఐ.పి.లను వెలికితీసే సమయం వచ్చేసింది. కావున సేవ ద్వారా స్వతహాగానే వెలువడుతూ ఉంటారు. అందరికీ విశేషంగా ఆత్మికత యొక్క అనుభూతిని కలిగించండి, శాంతి, శక్తి యొక్క అనుభూతిని కలిగించండి. జ్ఞానమైతే ఎంతో ఉంది కాని ఒక్క క్షణం యొక్క అనుభూతియే వారి కొరకు నవీనత. మొత్తం విదేశంలో మెజార్టీ కృత్రిమంగా ఉంది కావున యదార్థమైన శాంతి, యదార్థమైన సుఖము, యదార్థమైన స్వరూపం యొక్క అనుభూతే లేదు. అది ఒక్క క్షణము కలిగినా నవీనతను అనుభవం చేసుకుంటారు. విదేశంలో సదా క్రొత్త వస్తువునే ఇష్టపడతారు. కావున ఈ నవీనతను చూపండి. ఎటువంటి నామమాత్రపు మహాత్ములు ఈ అనుభూతిని చేయించలేరు. ఆత్మ, పరమాత్మ అనే పదములనైతే వింటూ ఉంటారు కాని సంబంధాన్ని జోడింపజేసి అనుభూతిని కలిగించడమే నవీనత. దీనినే రియాల్టీని అనుభవం చేసుకోవడం అని అంటారు. ఇదే సాధనము. సేవాధారులైన సమీప రత్నాలందరికీ పేరు పేరునా ప్రియస్కృతులు. అచ్ఛా!
Comments
Post a Comment