18-01-1982 అవ్యక్త మురళి

* 18-01-1982         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

18 జనవరి బాధ్యతా కిరీటధారులుగా అయ్యే రోజు.

ఈ రోజు ప్రపంచం యొక్క జ్యోతి తమ నయనాలలోని రత్నాలను కలుసుకునేందుకు వచ్చారు. చాలాకాలం తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలు బాబా యొక్క నయనాలలోని తారలు. ఏ విధంగా శరీరములోని కళ్ళలో ప్రకాశము లేకపోతే ప్రపంచమే లేదో అలాగే విశ్వంలో ఆత్మిక ప్రకాశమైన మీరు లేకపోతే విశ్వములో ప్రకాశమే లేదు. అంతా అంధకారమే. కావున మీరందరూ బాప్ దాదా యొక్క నయనాలలోని ప్రకాశము, స్నేహము యొక్క గీతాలు అమృతవేళ నుండి వతనములో వినిపిస్తున్నాయి. పిల్లల ప్రతియొక్కరి గీతము ఒకరికన్నా ఒకరిది చాలా ప్రియమైనది. మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణను కూడా ఎంతో విన్నారు. పిల్లల ప్రేమ యొక్క ముత్యాల మాలలు బాప్ దాదా కంఠములో అలంకరింపబడ్డాయి. ఇటువంటి ముత్యాల యొక్క మాలలు కూడా బాప్ దాదా కంఠములో మొత్తం కల్పంలో ఇప్పుడే వేయబడతాయి. మళ్ళీ ఈ అమూల్యమైన స్నేహపు ముత్యాలమాల స్మరింపబడజాలదు, కంఠములో పడజాలదు. ఈ ఒక్కొక్క ముత్యము లోపల ఏమేమి ఇమిడియున్నాయి? ప్రతి ఒక్క ముత్యములోనూ 'నా బాబా, ఓహో బాబా' అన్నదే ఉంది. ఎన్ని మాలలు ఉన్నాయో చెప్పండి! ఆ మాలల ద్వారా బాప్ దాదా ఎంత అలౌకికముగా అలంకరింపబడియుంటారు! స్నేహానికి గుర్తుగా స్థూలముగా మాలలను అలంకరించారు. ఇక్కడ స్థూల అలంకరణ ద్వారా అలంకరించారు కానీ వతనములో అమృతవేళ నుండే బాప్ దాదాను అలంకరించడం ప్రారంభించారు. ఒకదానిపై ఇంకొక మాల, అలా బాప్ దాదాకు అది సుందరమైన అలంకరణగా అయిపోయింది. మీరు కూడా ఆ చిత్రమును చూస్తున్నారు కదా!

ఈ రోజు ఇది విశేషముగా పిల్లలందరి యొక్క పట్టాభిషేక దివసము. ఈ రోజు ఆదిదేవుడైన బ్రహ్మాబాబా స్వయం సాకార బాధ్యతలను అనగా సాకారరూపము ద్వారా సేవ యొక్క కిరీటమును నయనాల యొక్క దృష్టి ద్వారా చేతిలో చేయి వేస్తూ ప్రియమైన పిల్లలకు అర్పణ చేసారు. కావున ఈ రోజు బ్రహ్మాబాబా సాకారరూపము యొక్క బాధ్యతాకిరీటమును పిల్లలకు ఇచ్చే పట్టాభిషేకం యొక్క రోజు(దాదీతో). ఈనాటి ఆరోజు గుర్తుంది కదా! ఈనాడు బ్రహ్మా బాబా పిల్లలకు 'బాబా సమాన భవ' అనే వరదానమును ఇచ్చిన రోజు. 

బ్రహ్మా బాబా యొక్క సంకల్పము యొక్క మాటలను లేక నయనాల యొక్క భాషను విన్నారా? అది ఏమిటి? 'పిల్లలూ, సదా బాబా సహయోగము యొక్క విధి ద్వారా వృద్ధిని పొందుతూ ఉండండి' అన్న నయనాల యొక్క ప్రేరణా భాషలో చెప్పారు. ఇవే అంతిమ పలుకులు, వరదానీ వాక్యాలను ప్రత్యక్ష ఫలము యొక్క రూపములో చూస్తున్నారు. బ్రహ్మా బాబా యొక్క అంతిమ వరదానమునకు మీరందరూ సాకార స్వరూపము. మీరు వరదానము యొక్క బీజము నుండి వెలువడిన వెరైటీ ఫలాలు. ఈ రోజు శివబాబా బ్రహ్మకు వరదానాల యొక్క బీజము ద్వారా వెలువడిన సుందరమైన విశాల వృక్షమును చూపిస్తున్నారు. సైన్స్ యొక్క సాధనాల ద్వారా ఒక్క వృక్షము నుండి వెరైటీ ఫలాలు వెలువడాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ బ్రహ్మా బాబా వరదానము యొక్క వృక్షము, సహజయోగము యొక్క పాలన ద్వారా పాలింపబడే వృక్షము ఎంత విచిత్రమైనది మరియు మనస్సుకు సంతోషమును కలిగించే వృక్షము! ఒకే వృక్షములో వెరైటీ ఫలాలు ఉన్నాయి, వేర్వేరు వృక్షాలు లేవు. వృక్షం ఒక్కటే, ఫలాలు అనేక రకాలు. అటువంటి వృక్షాన్ని చూస్తున్నారా? ప్రతి ఒక్కరూ తమను ఈ వృక్షములో చూస్తున్నారా? కావున ఈరోజు వతనములో ఇటువంటి విచిత్రమైన వృక్షము కూడా ఎమర్జ్  అయ్యింది. ఇటువంటి వృక్షము సత్యయుగములో కూడా ఉండదు. సైన్స్ వారు ఏ ప్రయత్నమునైతే చేస్తున్నారో దానికి ఫలము ఎంతో కొంత లభిస్తుంది. ఒకే ఫలములో 3, 4 ఫలాల యొక్క రసము అనుభవమవుతుంది. వీరు కష్టపడతారు మరియు మీరు తింటారు. ఇప్పటినుండే తింటున్నారా?

ఈనాటి విశేషత ఏమిటో మీరు విన్నారు కదా? ఏ విధముగా ఆదిలో బ్రహ్మా బాబా యొక్క స్థూలధనమును వీలునామా వ్రాసి పిల్లలకు అప్పజెప్పారో అలాగే తమ అలౌకిక ఆస్తిని కూడా పిల్లలకు విల్లు చేసారు. కావున ఈరోజు పిల్లలకు విల్లు వ్రాసి ఇచ్చే రోజు. ఇదే అలౌకిక ఆస్తి యొక్క విల్లు యొక్క ఆధారముపై కార్యములో ముందుకు వెళ్ళే విల్ పవర్ ప్రత్యక్ష ఫలాన్ని చూపిస్తోంది. పిల్లలను నిమిత్తముగా చేసి విల్ పవర్ యొక్క విల్లును ఇచ్చారు. ఈనాటి ఈ రోజు విశేషముగా బాబా సమానముగా వరదానులుగా అయ్యే రోజు. ఈ రోజు స్నేహము మరియు శక్తి యొక్క కంబైన్డ్ వరదానులుగా అయ్యే రోజు. రెండింటినీ ప్రత్యక్షముగా అనుభవం చేసుకున్నారు కదా! అతి స్నేహము మరియు అతి శక్తి (దాదీజీతో) ఆ అనుభవం గుర్తుంది కదా! ఆ బాధ్యతా కిరీటము గుర్తుంది కదా, అచ్ఛా! ఈనాటి మహత్వమును తెలుసుకున్నారు, అచ్ఛా!

ఇలా సదా బాబా యొక్క వరదానాలతో వృద్ధినొందేవారికి, సదా ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అనే ఇదే స్మృతిస్వరూపులకు, సదా బ్రహ్మా బాబా సమానముగా ఫరిస్తా భవ యొక్క వరదానులకు, ఈ విధంగా సమానముగా మరియు సమీపముగా ఉండే పిల్లలకు సమర్ధ దివసమునాడు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీ - దీదీలతో - మీరు సాకార బాబా యొక్క వరదానాలకు విశేష అధికారీ ఆత్మలు కదా? సాకార బాబా పిల్లలైన మీకు ఏ వరదానమును ఇచ్చారు? ఏ విధంగా బ్రహ్మా బాబాకు ఆదిలో తతత్వము అనే వరదానము లభించిందో అలాగే బ్రహ్మా బాబా పిల్లలకు కూడా విశేషముగా తతత్వము అనే వరదానమును ఇచ్చారు. కావున మీరు విశేషమైన తతత్వము అనే వరదానము యొక్క అధికారులు, వారసులు. ఇదే వరదానమును సదా స్మృతిలో ఉంచుకోవడం అనగా సమర్ధ ఆత్మలుగా అవ్వడం. ఈ వరదానము యొక్క స్మృతి ద్వారా ఏ విధంగా బ్రహ్మా బాబా యొక్క ప్రతి కర్మలోనూ బాబా ప్రత్యక్షముగా అనుభవమయ్యే వారో అలాగే మీ ప్రతి కర్మలోనూ బ్రహ్మా బాబా ప్రత్యక్షమవుతారు. బ్రహ్మా బాబాను ప్రత్యక్షం చేసే ఆదిరత్నాలు ఎంత కొద్దిమంది నిమిత్తముగా అయ్యారు! విశేష ఆత్మలైన మీ యొక్క ముఖము ద్వారా బ్రహ్మా బాబా యొక్క మూర్తిని అనుభవం చేసుకోవాలి మరియు అనుభవం చేసుకుంటున్నారు కూడా. బ్రహ్మాకుమారిగా కాదు, బ్రహ్మా బాబా సమానముగా బ్రహ్మా బాబా యొక్క అనుభూతి కలగాలి. మీరు ఇటువంటి సేవ కొరకు నిమిత్తమైన విశేషమైన వరదానీ ఆత్మలు. అందరూ ఏమంటారు? బాబాను చూసాము, బాబాను పొందాము అని అంటారు. మరి అనుభవం చేయించేవారు, ప్రత్యక్షము చేసేవారు ఎవరు? కిరీటధారులైన విశేష ఆత్మలగు మీ ద్వారా ఇప్పుడు త్వరలో మళ్ళీ, బ్రహ్మావత్సలైన శక్తుల యొక్క రూపములో, శక్తిలో శివుడు ఇమిడియుండి శివశక్తులుగా మరియు తోడుగా బ్రహ్మా బాబా ఉన్నట్లుగా ఇటువంటి సాక్షాత్కారాలు నలువైపులా ప్రారంభమవుతాయి. బ్రహ్మాకుమారికి బదులుగా బ్రహ్మా బాబా కనిపిస్తారు. సాధారణ స్వరూపానికి బదులుగా శివశక్తి స్వరూపము కనిపిస్తుంది. ఏ విధంగా ఆదిలో సాకారుని యొక్క లీలను చూసారో అలాగే అంతిమంలో కూడా జరుగుతాయి. కేవలం ఇప్పుడు శివశక్తి స్వరూపము యొక్క సాక్షాత్కారము కూడా అందులో కలుస్తుంది. ఎంతైనా సాకార తండ్రి అయితే బ్రహ్మాబాబాయే కదా! కావున సాకారరూపములో వచ్చిన పిల్లలు బాబాను చూస్తారు మరియు తప్పకుండా అనుభవం చేసుకుంటారు. ఈ సమాచారాన్ని కూడా వింటారు. బ్రహ్మా బాబా కేవలం శరీరము యొక్క బంధన నుండి బంధనముక్తులై ఇంకా తీవ్రగతి యొక్క రూపములో సహయోగిగా అయ్యారు, ఎందుకంటే డ్రామానుసారముగా వృద్ధి జరగడం అనేది అనాదిగా రచింపబడియుంది.

ఎక్కువ స్థానముపై ప్రకాశమును వ్యాపింపజేయాలంటే ఏమి చేస్తారు? ఆ ప్రకాశాన్ని పైకి ఎత్తుతారు కదా! సూర్యుడు కూడా ఎప్పుడైతే ఉన్నత స్థానములో ఉంటాడో అప్పుడే విశ్వములో ప్రకాశమును వ్యాపింపజేయగలుగుతాడు. కావున సాకార సృష్టికి శక్తిని ఇచ్చేందుకు బ్రహ్మా బాబా కూడా ఉన్నతస్థానము యొక్క నివాసిగా అవ్వవలసిందే. ఇప్పుడైతే క్షణములో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ కార్యము చేయగలరు మరియు చేయించగలరు. ముఖము ద్వారా లేక పత్రాల ద్వారా ఇంతటి కార్యమును ఎలా చేయగలరు? కావున తీవ్ర విధి ద్వారా పిల్లల యొక్క సహయోగిగా అయి కార్యమును చేస్తున్నారు. అన్నింటికన్నా తీవ్రగతి యొక్క సేవాసాధనము సంకల్పశక్తియే. కావున బ్రహ్మా బాబా శ్రేష్ఠ సంకల్పము యొక్క వృద్ధి ద్వారా విధిలో సదా సహయోగిగా ఉన్నారు. కావున వృద్ధి యొక్క గతి కూడా తీవ్రమవుతోంది కదా! విధి తీవ్రముగా ఉంటే వృద్ధి కూడా తీవ్రముగా ఉంటుంది. తోటను చూసి హర్షిస్తారు కదా! అచ్చా!

సాకార బాబా యొక్క లౌకిక పరివారము: (నారాయణ భాయ్ మరియు వారి యుగల్)

అన్ని కార్యాలూ సరిగ్గా కొనసాగుతున్నాయా? ఇంకెప్పుడు ఇటువైపుకు జంప్ చేస్తావు? ఇంతటి వృద్ధిని చూసి సహజవిధి అనుభవంలోకి రావడం లేదా? ఏమి ఆలోచిస్తున్నావు? ఇది కేవలం సంకల్పాల యొక్క విషయమే కదా! ఇంకా ఏమైనా చేసేది ఉందా? సంకల్పం చేయగానే అది జరుగుతుంది. ఈ విదేశీయులు కూడా ఎంత దూరదూరాల నుండి వచ్చి చేరుతున్నారు! దేని ఆధారముపై? వెళ్ళి తీరవలసిందే, చేయవలసిందే అన్న సంకల్పం చేసారు. కావున చేరుకున్నారు కదా! కావున దూరం నుండి కూడా దృఢ సంకల్పం యొక్క ఆధారముపై అధికారులుగా అయిపోయారు. మీరైతే బాల్యము నుండే అధికారులు. బాల్యము గుర్తుందా? మరి ఏమవుతారు? చూస్తూ ఉంటారా లేక పైకి ఎగిరే కళ యొక్క ఆధారముపై బాబా సమానముగా ఫరిస్తాగా అవుతారా? నీవు చూస్తూనే ఉన్నావు కానీ అలా ఎప్పటివరకూ చూస్తావు? ఎప్పటివరకూ ఆలోచించాలి? బాప్ దాదా అదే స్నేహము యొక్క రెక్కలతో పిల్లలను ఎగిరింపజేయాలనుకుంటారు కానీ ఆ రెక్కలపై కూర్చునేందుకు కూడా ఏమి చేయాలి? డబుల్ లైట్ గా అయితే అవ్వవలసి ఉంటుంది కదా! అన్నీ చేస్తూ కూడా డబుల్ లైట్ గా అవ్వవచ్చు. ఇది కేవలం కల్పన యొక్క ఆట మాత్రమే. అంతా క్షణము యొక్క ఆట. మరి ఒక్క క్షణము యొక్క ఆట రాదా? బాబా ఏమి చేసారు? క్షణములో ఆటను ఆడారు కదా! ఎప్పుడైతే ఇరువురూ ఒకరికొకరు సహయోగులుగా అవుతారో అప్పుడు చేయగలుగుతారు. ఒకే చక్రము కూడా నడువజాలదు, రెండు చక్రాలూ కావాలి. ఎంతైనా బాప్ దాదా ఇంటికైతే వస్తున్నారు, బాప్ దాదా సదా పిల్లలను పైనే ఉంచుతారు. ఉన్నతుడైన తండ్రి పిల్లలను కూడా ఉన్నతముగానే చూడాలనుకుంటారు. ఇది ఒక నియమం కదా! ఇప్పుడు పిల్లలు ఎక్కడ సీటు తీసుకుంటారు అన్నది మీ చేతులలో ఉంది. అవసరమైతే బాగా ఆలోచించుకో! ఇది ఒక్క క్షణము యొక్క విషయం మాత్రమే. ఒక్క క్షణములోనే ఈ వ్యాపారం చేస్తారు, అచ్చా!

Comments