18-01-1981 అవ్యక్త మురళి

18-01-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్మృతి స్వరూపముగా అగుటకు ఆధారము స్మృతి మరియు సేవ.

భక్తులకు ఈ రోజు బాప్ దాదా తమ అమూల్యమైన మణులను చూస్తున్నారు. ప్రతి మణి తన తన స్థితి అను స్థానం పైన మెరుస్తూ అన్ని మణుల స్వరూపాలను బాప్ దాదా శృంగారంగా చేసుకున్నారు. ఈ రోజు బాప్ దాదా అమృతవేళ నుండి తమ శృంగార స్వరూపాలను(మణులను) చూస్తున్నారు. మీరందరూ సాకార సృష్టిలో ప్రతి స్థానాన్ని రకరకాలుగా పుష్పాలతో అలంకరిస్తారు. పిల్లల ఈ కష్టాన్ని కూడా బాప్ దాదా పై నుండి చూస్తూ ఉంటారు. ఈ రోజు పిల్లలైన మీరు ఎలాగైతే మధువనంలోని ప్రతి స్థానాన్ని తిరుగుతున్నారో ప్రదక్షిణ చేస్తున్నారో అలా బాప్ దాదా కూడా పిల్లలతో పాటు తిరుగుతూ ఉంటారు. మధువనంలో విశేషంగా నాలుగు ధామాలను తయారు చేశారు. ఇక్కడ మీరు వాటిని ప్రదక్షిణ చేస్తారు. అదే విధంగా భక్తులు కూడా నాలుగు ధామాలకు మహత్యముంచారు. ఎలాగైతే మీరు ఈ రోజు నాలుగు ధామాలు ప్రదక్షిణ చేస్తారో అలా భక్తులు అనుసరించారు. మీరు కూడా క్యూలో వెళ్తున్నారు. భక్తులు కూడా క్యూలో దర్శనం కొరకు ఎదురు చూస్తారు. ఎలాగైతే భక్తిలో సత్యవచన్ మహరాజ్ అని అంటారో అలా సంగమ యుగంలో సత్య వాక్కుతో పాటు మీ సత్కర్మలు మహోన్నతమైపోతాయి. అనగా స్మృతి చిహ్నముగా అవుతాయి. ఇవి సంగమ యుగము యొక్క విశేషత. భక్తులు భగవంతుని ముందు ప్రదక్షిణాలు చేస్తారు కానీ ఇప్పుడు భగవంతుడేమి చేస్తారు? భగవంతుడు పిల్లలైన మీ వెనుక ప్రదక్షిణ చేస్తారు. పిల్లలను ముందుంచి వెనుక తాను నడుస్తారు. అన్ని కర్మలలో పదండి పిల్లలూ! పదండి పిల్లలూ! అని అంటూ ఉంటారు. ఇది విశేషతే కదా. పిల్లలను యజమానులుగా(మాలిక్ గా) చేసి స్వయం బాలకునిగా (బాలక్) అవుతారు. అందుకే ప్రతిరోజు మాలేకం సలాం(యజమానులకు నమస్తే) అని చెప్తారు.

భగవంతుడు మిమ్ములను తనవారిగా చేసుకున్నారా లేక మీరు భగవంతుని మీవారిగా చేసుకున్నారా? ఏమంటారు? ఎవరు ఎవరిని తమ వారిగా చేసుకున్నారు? బాప్ దాదా అయితే పిల్లలు భగవంతుని తమవారిగా చేసుకున్నారని అంటారు. పిల్లలు చతురులైతే తండ్రి కూడా చతురులే. ఏ సమయంలో అజ్ఞాపించినా వెంటనే హాజరైపోతారు.

ఈ రోజు మిలనము చేసే రోజు. ఈ రోజుకు స్మృతి స్వరూప భవ అను వరదానముంది. కనుక ఈ రోజు స్మృతి భవ(స్మృతి స్వరూపాలను)ను అనుభవం చేశారా?

ఈ రోజు స్మృతి భవకు(స్మృతి స్వరూపమైనందుకు) ప్రతి ఫలంగా మిలనం చేయుటకు వచ్చారు. స్మృతి మరియు సేవ రెండిటి బ్యాలెన్స్ స్వతహాగా స్మృతి స్వరూపంగా చేస్తుంది. బుద్ధిలోనూ బాబా, నోటి ద్వారా కూడా బాబా అని రావాలి. ప్రతి అడుగు విశ్వకళ్యాణ సేవ కొరకే ఉండాలి. సంకల్పంలో స్మృతి, కర్మలో సేవ ఉండాలి. ఇదే బ్రాహ్మణ జీవితం. స్మృతి మరియు సేవ లేకుంటే బ్రాహ్మణ జీవితమే కాదు. అచ్ఛా

సర్వ అమూల్యమైన మణులకు(రత్నాలకు), స్మృతి స్వరూప వరదానీ పిల్లలకు, ప్రతి కర్మను సత్యమైన కర్మగా చేసే మహోన్నత మహారాజులు, సదా తండ్రి స్నేహములో సహ యోగములో ఉండేవారు - ఇటువంటి విశేష ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే. 

Comments