18-01-1980 అవ్యక్త మురళి

18-01-1980         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్మృతి దినాన పిల్లలకు బాప్ దాదా ఇచ్చిన శిక్షణలు.

ఈ స్మృతి దినాన స్మృతి స్వరూప పిల్లలు అనగా సమర్థ స్వరూప పిల్లలను చూచి బాప్ దాదా కూడా "సదా సమర్థ భవ" అను వరదానమునిస్తున్నారు. ఎలాగైతే ఈ రోజు స్మృతి దినాన స్వతహాగా స్మృతి స్వరూపంగా ఉన్నారో, ఒక్కరి లగ్నములోనే మగమై, ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు అనే తలంపులో ఉన్నారో అలా సహజ యోగులుగా, నిరంతరం యోగయుక్తులుగా, జీవన్ముక్తులుగా, ఫరిస్తా స్వరూపంలో సదా ఉండండి.

ఈ రోజు పిల్లలందరి చార్టు తండ్రి సమానం అవ్యక్త వతనవాసులుగా, స్నేహీలుగా, సదా లవలీన స్థితిలో ఉంది. అదే విధంగా తండ్రి సమానంగా న్యారా మరియు సదా ప్యారే భవ (అతీతంగా సదా ప్రియంగా అవ్వండి). ఈ సమర్థ దినాన నలువైపులా ఉన్న పిల్లల నుండి తండ్రిని ప్రత్యక్షము చేయాలనే ఒకే దృఢ సంకల్పము ఇప్పటికీ బాబా వద్దకు చేరుకుంటూ ఉంది. దేశ విదేశాలలోని పిల్లలందరూ ఉమంగ ఉత్సాహాలతో ఈ దృఢ సంకల్పము చేసి, కొంతమంది మనసు ద్వారా, కొంతమంది శరీరము ద్వారా సేవ స్టేజిపై ఉపస్థితమై ఉన్నారు. ఇక్కడ ఉంటున్నా బాప్ దాదా ముందు సేవ చేయాలనే ఉమంగ ఉత్సాహాలతో నిండిన పిల్లల ముఖాలు కనిపిస్తున్నాయి. ప్రపంచమంతా తిరిగి వచ్చేందుకు బాప్ దాదాకు ఎంత సమయం పడ్తుంది? మీరు సైన్సు సాధనాలైన టీ.వి.లు లేక రేడియోల ద్వారా స్విచ్ ఆన్ చేసి ఎంత సమయంలో చూస్తారో లేక వింటారో అంత సమయంలో బాప్ దాదా ప్రపంచమంతా చుట్టి వస్తారు. ఒక్కొక్క స్థానములోని పిల్లలు ఏమేమి చేస్తున్నారో బాప్ దాదా చూస్తున్నారు. ఎలాగైతే ఈరోజు అందరికీ సేవ చేయాలని ఒకే ధున్(చింత) ఉందో అలా ప్రతి ఒక్కరి బుద్ధిలో ప్రత్యక్షతా జండా ఎగురుతూ ఉంది. విశ్వమంతటా ఈ జండా ఎగరాలని ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంది. అందరి హృదయాలలో బాప్ దాదా నివసిస్తున్నారు. అందరూ తమ హృదయాలను చీల్చి మా హృదయాలలో తండ్రి ఉన్నారని చూపించుటకు ప్రాక్టికల్ గా పురుషార్థము చేస్తున్నారు. ఈ సమయములోని మీ అందరి రూపానికి స్మృతిచిహ్నంగా సేవకుని రూపంలో హనుమంతుడు ఉదాహరణంగా మహిమ చేయబడ్డాడు. కొంతమంది వాయుమండలం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయాలనే శ్రేష్ఠ సంకల్పాల బాణాలు వేస్తున్నారు. కొంతమంది తమ నోటి ద్వారా స్నేహ భరితమైన శక్తిశాలి మాటల ద్వారా తండ్రిని ప్రత్యక్షము చేయుటలో లగ్నమై ఉన్నారు. సేవ మరియు స్మృతుల బ్యాలెన్స్ కలిగిన ఇటువంటి దృశ్యాలను బాప్ దాదా చూస్తున్నారు. ఈరోజు స్నేహము కూడా సంపూర్ణ రూపంలో ఉంది, సేవ కొరకు శక్తి స్వరూపము కూడా ఎమర్జ్ రూపంలో (కనిపిస్తూ) ఉంది. ఈరోజులాగే మీరు సదా స్మృతి మరియు సేవల బ్యాలన్స్ లో ఉండాలి.

ఈ సంవత్సరం విశేషంగా ప్రతీ ఆత్మకు వారి యోగ్యతను బట్టి వారసత్వమునిచ్చు సంవత్సరం. కలవరపడుతున్న ఆత్మలందరిని వారి యోగ్యతల అనుసారము తృప్త ఆత్మలుగా తయారుచేయు సంవత్సరము. విశేషంగా ఈ సంవత్సరం స్మృతి మరియు సేవల బ్యాలన్స్ ఉంచుకోవాలి, సదా ఆనందంగా ఉండాలి. జత జతలో ఆత్మలందరికీ ఆశీర్వాదాలిస్తూ ఉండాలి. ఈ సంవత్సరం సంఘఠిత రూపంలో విశేష స్లోగన్ - "స్వయం పట్ల, అందరి పట్ల సదా విఘ్న వినాశకులుగా కండి." అందుకు సహజ సాధనం - ప్రశ్నార్థకానికి (క్వశ్చన్ మార్కుకు) సదా వీడ్కోలునిచ్చి ఫుల్ స్టాప్ ద్వారా సర్వశక్తుల స్టాకును ఫుల్ గా ఉంచుకోండి. ఈ సంవత్సరం విశేషంగా సర్వ విఘ్నాల ఫ్రూఫ్ అయిన చమ్ కీలీ ఫరిస్తా డస్సు సదా ధరించి ఉండండి, మట్టి డ్రస్సు ధరించకండి. అంతేకాక సదా సర్వ గుణాలనే నగలతో అలంకరింపబడి ఉండండి. విశేషంగా అష్టశక్తుల శస్త్రాలతో సదా అష్టశక్తుల శస్త్రధారీ సంపన్నమూర్తులై ఉండాలి. సదా కమలపుష్ప ఆసనముపై మీ శ్రేష్ఠ జీవితమనే పాదాలను ఉంచండి. ఇంకా ఏం చేస్తారు?

ప్రతిరోజూ అమృతవేళలో విశ్వవరదానీ స్వరూపములో విశ్వకళ్యాణకారీ తండ్రి జతలో విశ్వవరదానీ శక్తి మరియు విశ్వకళ్యాణకారుడైన శివునితో కంబైండు రూపములో ఉండండి. శివుడు మరియు శక్తి కంబైండు రూపములో మనసా సంకల్పాల ద్వారా లేక వృత్తి ద్వారా వైబ్రేషన్ల సుగంధాన్ని వ్యాపింపజేయండి. ఎలాగైతే ఈ రోజుల్లో స్థూల సుగంధ సాధనాలతో రకరకాల సువాసనలను వ్యాపింపజేస్తారో, కొన్ని సాధనాలు గులాబి సువాసనను, కొన్ని సాధనాలు మంచి గంధం సువాసనను వెదజల్లుతాయో అలా మీ ద్వారా సుఖము, శాంతి, శక్తి, ప్రేమ, ఆనందము అనే రకరకాల సువాసనలు వ్యాపిస్తూ పోవాలి. ప్రతిరోజూ అమృతవేళలో రకరకాల శ్రేష్ఠ వైబ్రేషన్లను పన్నీటి ఫౌంటెన్ వలె ఆత్మలపై వెదజల్లాలి. కేవలం సంకల్పమనే ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చెయ్యండి. ఆన్ చెయ్యడం వచ్చు కదా! ఎందుకనగా ఈ రోజు విశ్వములో అశుద్ధ వృత్తి అనే దుర్వాసన చాలా ఉంది. ఆ వృత్తులను ఇప్పుడు మీరు సుగంధ భరితముగా చేయండి. ఈ సంవత్సరములో ఏం చేయాలో తెలిసిందా! 

ఈ సంవత్సరంలో ఏయే రకాల పాత కొత్త సాధనాలున్నాయో వాటిని, శరీరము, మనసు, ధనము, సమయము మొదలైనవి ఏమేమున్నాయో వాటన్నిటిని ఉపయోగించి సర్వాత్మలలో ఏయే ఆత్మలు ముక్తికి యోగ్యులో ఏయే ఆత్మలు జీవన్ముక్తికి యోగ్ములో సెలెక్ట్ చేసి వారికి అటువంటి సందేశమునిచ్చి ఫైనల్ చెయ్యండి ఎలాగైతే ఫైలులోని ప్రతి కాగితముపై ఆఫీసరు తన సంతకం చేసి సంపన్నము చేసి ముందుకు వెళ్తాడో అలా సేవాధారులైన మీరంతా ప్రతి ఆత్మపై ముక్తి లేక జీవన్ముక్తుల సంతకం చెయ్యండి. ఫైనల్ ముద్ర వేస్తే ఫైల్ సంపూర్ణమైపోతుంది. ఈ సంవత్సరం ఏం చేయాలో అర్థమయిందా? సెలెక్షన్ చేసే మిషనరీ వేగవంతం చెయ్యండి. ఫైలు ఎంత సమయంలో తయారు చేస్తారో చూస్తాము. మొదట విదేశీయులు చేస్తారా లేక భారతీయులు చేస్తారా? ఎవరు ఏ ధర్మములోకి వెళ్తారో ఆ స్టాంపు(ముద్ర) వేయండి.

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న సర్వ స్నేహీ మరియు సేవాధారీ పిల్లలకు యాద్ ప్యార్ తెలుపుతున్నారు. ఈ రోజు శరీరముతో భలే వేర్వేరు స్థానాలలో ఉండినా మనసుతో తండ్రిని ప్రత్యక్షము చేయాలనే తపన(ధున్) కారణంగా తండ్రి వైపే మన్మనాభవగా ఉన్నారు. ఇటువంటి స్నేహీలు, సేవలో సదా అవినాశిగా ఉండువారు, సదా తండ్రి సేవలో తత్పరులుగా ఉండు, ప్రత్యక్షతా జండాను ఎగురవేసే సర్వ విజయీ ఆత్మలకు యాద్ ప్యార్ మరియు నమస్తే.

(ఈరోజు జానకీ దాదీ వీడ్కోలు తీసుకొని లండన్‌కు వెళ్తూ ఉండినారు - కనుక అందరి నుండి సెలవు తీసుకొని వెళ్ళుటకు జానకీదాదీని బాప్ దాదా తమ ప్రక్కనే గద్దెపై కూర్చోబెట్టుకున్నారు).

మురబీ(సంరక్షక) పిల్లలను బాప్ దాదా కూడా గౌరవిస్తారు. అందువలన బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు, వీడ్కోలు కాదు. వాస్తవానికి ఈమె మస్త్ ఫకీర్(ఆనందంగా ఉండే చింత లేని ఫకీరు). తండ్రి పిల్లలతో సాకారము ద్వారా కూడా విశ్వమంతా తిరుగుతారు. వాస్తవానికి తండ్రి ఒక్క సెకండులో విశ్వ పరిభ్రమణము చేస్తారు. కాని సాకార రూపములో పిల్లల ద్వారా సేవ చేయిస్తూ తిరుగుతారు. తండ్రిని విశ్వ భ్రమణము చేయించుటకు అనగా సేవా భ్రమణము చేయించుటకు వెళ్తున్నావు - ఈ సంవత్సరము విశేషత - "చక్రవర్తీ భవ". ముందు తండ్రి ఉంటారు. వెనుక మీరుంటారు(దాదీ). నీవు తండ్రిని భ్రమణము చేయిస్తావా లేక తండ్రి నిన్ను తన జతలో భ్రమణము చేయిస్తారా!

 (మధురమైన దీదీ బాప్ దాదా సన్ముఖంలో కూర్చొని ఉన్నారు)

ఈ రోజు పిల్లలందరూ వతనంలోకి ప్రేమతో వచ్చి చేరుకున్నారు. ఈ రోజు సమర్థ రోజును జరుపుకొనుటకు సేవ కొరకు ముందుగా వెళ్లిన ఆత్మలు కూడా వచ్చేశారు. వారి ఆత్మిక సంభాషణ కూడా చాలా బాగుంది. వారు తమ అద్భుతమైన విశ్వ సేవా పాత్రను చూసి హర్షితమవుతున్నారు. వేరే శరీరాలతో విశ్వ సేవలో వారి లౌకిక రాజయుక్త పాత్ర ఏదో బాప్ దాదా వినిపిస్తూ ఉండినారు. విశ్వములోని పతితపావని సరస్వతి నదికి గుప్త సేవాధారి అనే గాయనముంది. గంగా, యమునలు సాకారములో ప్రసిద్ధముగా ఉన్నాయి. కాని సరస్వతి సేవను గుప్త రూపములో కూడా చూపించారు. ప్రఖ్యాత రూపములో కూడా వీణాపాణిగా స్మృతి చిహ్నా రూపములో ఉంది. గుప్త రూపములో గుప్త నది రూపములో స్మృతి చిహ్నముంది. రెండు పాత్రలూ అద్భుతమైనవే. జన్మ ద్వారా సేవ పాత్రకు సంబంధముంది. ఎక్కడ విజయమో అక్కడ జన్మ ఏదో రాజ్యమును జయించుట కాదు. కాని జన్మ ద్వారా వికారాలపై విజయము లభిస్తుంది. ఎక్కడ జన్మిస్తారో అక్కడ విజయము, ఎక్కడ విజయము పొందుతారో అక్కడ జన్మ కాదు. ఇక్కడ కొద్దీ గొప్పో గాయనమేదైతే ఉందో ఆ పాత్ర ప్రాక్టికల్ గా నడవాల్సిందే. ఇప్పుడీ విశేష సేవాధారులు సమయము మరియు సాకార సేవాధారుల సేవ సమాప్తి కొరకు వేచి ఉన్నారు. ఎందుకంటే సాకార సేవ చేయు పాత్ర సమాప్తమైనప్పుడు నూతన రాజ్యమును ఇచ్చిపుచ్చుకొను అద్భుతమైన పాత్ర ప్రారంభమవుతుంది. కనుక అడ్వాన్స్ గ్రూపు అందులో కూడా విశేషంగా ఎవరైతే ప్రఖ్యాతి చెందిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారి సంఘటన చాలా శక్తిశాలిగా ఉంది. శ్రేష్ఠ జన్మ, ఫస్ట్ జన్మను ఇప్పించుటకు భూమిని తయారు చేయు అద్భుతమైన పాత్ర ఈ ఆత్మల ద్వారా తీవ్ర వేగంతో జరుగుతూ ఉంది. ఎలాగైతే వినాశకారులు బటన్ వత్తుటకు ఆగి ఉన్నారో అలా దివ్య జన్మ ద్వారా స్థాపన చేయించేందుకు నిమిత్తమై ఉన్న అడ్వాన్స్ సేవ చేయు పార్టీ టచింగ్ ఇచ్చుటకు, మెసేజ్ ఇచ్చుటకు, ప్రత్యక్షము చేయుటకు ఆగి ఉంది. వారేమో స్నేహ సంబంధముతో ప్రత్యక్షము చేస్తారు. ఇది కూడా విచిత్ర కథల రూపములో స్థాపన కొరకు జన్మించే పాత్ర రచింపబడి ఉంది. ముందు కృష్ణుడు తర్వాత రాధ జన్మిస్తారు కదా, కనుక వారి జన్మ స్థానము మరియు వారి స్థితి రెండూ సంపూర్ణమయ్యే కార్యము సమాప్తము చేసిన తర్వాత రాధ జన్మ తీసుకుంటుంది. అందువలన కృష్ణుడు పెద్ద, రాధ చిన్నదిగా అవుతుంది. ఎలాగైతే ఇక్కడ కూడా సేవా క్షేత్రములో మొదట భూమిని తయారు చేయుటకు జగదంబ వెళ్లిన తర్వాత తండ్రి వెళ్లాడో అలా జగదంబ మరియు సంరక్షక పుత్రుడు విశ్వకిశోర్ ఎదుర్కునే వారుగా ఉండినారు. మైదానములో ముందు చేసేవారుండినారు. అలాగే ఇప్పుడు కూడా వేరే రూపములో ఉన్నారు కాని పని చేసే సంస్కారమేమో అదే. స్థాపన చేయుటకు జన్మించు వారి కథలో ఇరువురూ హీరో పాత్రధారులే. గర్భ మహలును తయారు చేయిస్తున్నారు. ఇక్కడ కూడా కార్య వ్యవహారాలలో ఇరువురు మూర్తులూ నిమిత్తంగా ఉండినారు. కనుక ఈ మహలును తయారుచేయువారు కూడా ఇలాంటి శక్తివంతమైన వారే కావాలి. ఇక్కడ స్థాపనకు ఏర్పాట్లు చేశారు. అక్కడ మరలా మీ అందరి కొరకు విశేషంగా అష్టరత్నాల కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు, మహళ్లు తయారు చేస్తున్నారు. తయారైనపుడే కదా అక్కడకు ఆత్మలు వెళ్లేది. కనుక ఇప్పుడు అపవిత్ర సృష్టిలో పవిత్ర మహలును తయారుచేయడం - ఎంత శ్రేష్ఠమైన కార్యము చేయాల్సి వచ్చింది! ఈ పవర్ ఫుల్ కార్యము చేయుటకు అటువంటి శక్తిశాలి ఆత్మలు కావాలి. సాధారణమైనవారు చెయ్యలేరు. వారు కూడా ఏ తేదీకి మహలు తయారుకావాలో ఆ తేది చెప్పమని అడుగుతున్నారు. సాకార సేవా పాత్ర సమాప్తమైనపుడు ఈ కార్యము ప్రారంభమౌతుందని వారంటున్నారు. అందువలన ఈ సేవా పాత్ర ఎప్పటికి, ఏ తేదీకి సమాప్తమవుతుంది? ఆ తేదీయే రాజ్యము జన్మించే తేదీ అవుతుంది. వారి ఆత్మిక సంభాషణ విన్నారా? అక్కడ(వతనంలో) ఆత్మలందరూ ఎమర్జ్ అయ్యారు. కాని వారిలో కూడా గ్రూపులున్నాయి.

సేవాధారి పిల్లలను చూస్తూ బాబా చెప్తున్నారు-

అందరూ సేవకు చాలా మంచి మంచి ప్లానులైతే తయారు చేశారు. కాని నిమిత్తమైనవారు విశేషంగా మూడు విషయాలపై గమనమిచ్చినపుడే ఈ ప్లానులన్నీ సఫలమౌతాయి.
1. మొదటిది - ఏ ఆత్మలో ఏ విశేషత ఉందో ఆ విశేషతకు విలువనిచ్చి వారికి ఉమంగ ఉత్సాహములనివ్వాలి. అందుకై నిమిత్తమైనవారు కూడా అలసిపోని(అథక్) సేవాధారులుగా కావాల్సి వస్తుంది.
2 వారి సేవాకేంద్రాలను మరియు వారి సంపర్కములో ఏ సేవాకేంద్రాలు ఉన్నాయో, వాటి వాతావరణమును ఆత్మీయతతో నింపి ఉంచాలి.  దాని వలన స్వయం ఉన్నతి మరియు కొత్తగా వచ్చు ఆత్మల సహజ ఉన్నతి జరుగుతుంది. ఎందుకనగా వాతావరణము భూమిని తయారుచేస్తుంది. అందువలన సేవాకేంద్రపు వాతావరణము ఆత్మీయంగా ఉండాలి. సేవాకేంద్రానికి ఎవరు వచ్చినా వారు తమ గృహస్థ వ్యవహారాల చిక్కుల నుండి వస్తారు. గృహస్థ వాతావరణములో అలసిపోయి ఉంటారు కనుక వారికి అదనపు సహయోగము అవసరమవుతుంది. కనుక ఆత్మిక వాయుమండలముతో వారికి సహయోగమిచ్చి వారిని సహజ పురుషార్థులుగా చేయవచ్చు. ఎలాగైతే ఏయిర్ కండీషన్ వాతావరణాన్ని సృష్టిస్తుందో, చలికాలంలో వెచ్చటి స్థానము లభిస్తే, అక్కడకు వెళ్తూనే సుఖము అనుభవమవుతుందో, అలా ఆత్మీయత ఆధారముపై సేవాకేంద్రము వాతావరణము ఎలా ఉండాలంటే వచ్చినవారు ఈ స్థానము సహజంగా ఉన్నతి ప్రాప్తి చేసుకునేదని అనుభవం చేయాలి. అందువలన సేవాకేంద్రములోకి వస్తూనే బయట వాతావరణానికి, సేవాకేంద్రము వాతావరణానికి వ్యత్యాసము అనుభవము కావాలి. దీని వలన స్వతహాగా ఆకర్షింపబడతారు.
3. బ్రాహ్మణ పరివారపు విశేషత ఏమంటే అనేకమంది ఉండినా ఒక్కటిగానే ఉండుట. కనుక ప్రతి సేవాకేంద్రములో వైబ్రేషన్లు ఎలా ఉండాలంటే, వీరు అనేకమంది కాదు ఒక్కరే అని అనుభవం కావాలి. ఈ ఏకతా వైబ్రేషన్లు విశ్వములో ఒకే ధర్మమును, ఒకే రాజ్యమును స్థాపిస్తాయి. దీనిపై విశేష గమనముంచి భిన్నత్వాన్ని నిర్మూలించి ఏకతను తీసుకురావాలి. 

ఈ నూతన సంవత్సరంలో విశేషంగా ఈ మూడు విషయాలను ఆచరణలోకి తీసుకురండి. సేవాధారులు స్వయం కొరకు కాక సేవ పట్ల శ్రద్ధ చూపాలి. స్వయానికి ఉన్నవన్నీ సేవ కొరకు స్వాహా చేయువారు. ఎలాగైతే సాకార తండ్రి సేవలో తమ ఎముకలు కూడా స్వాహా చేశారో అలా ప్రతి కర్మేంద్రియము ద్వారా సదా సేవ జరుగుతూ ఉండాలి. నోటితో, కనులతో కూడా సేవ, సేవనే సేవ. అందరూ ఇటువంటి సేవాధారులే కదా!

ప్లాన్లు చాలా చాలా తయారు చేశారు. ఇప్పుడు ప్రాక్టికల్ లిస్టు వస్తుంది. ఎలాగైతే ప్లాన్ల ఫైలు వచ్చేసిందో అలా వాటి ఫలితము వస్తుంది. అచ్ఛా - అందరూ 108 మాలలో వచ్చేవారు కదా. అంతా ఆటోమేటిక్ గా అనౌన్స్ అయిపోతుంది. ప్రతీ ఒక్కరు తమ సీటు తీసుకుంటూ వారి నంబరు అనౌన్స్ చేస్తారు. సేవ యొక్క సీటు నంబరును అనౌన్స్ చేస్తుంది. సేవ మైకుగా అవుతుంది, నోరు మైకు వలె అనౌన్స్ చెయ్యదు. అచ్ఛా!

Comments