18-01-1978 అవ్యక్త మురళి

* 18-01-1978         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బాప్ దాదాల సేవకు ప్రతిఫలం.

ఈరోజు స్మృతి దివసంనాడు అనగా సమర్థ దివసమునాడు పిల్లలందరూ తమ తమ లగ్నము అనుసారంగా భిన్న భిన్న రూపాలతో స్మృతి చేశారు. బాప్ దాదాల వద్దకు నలువైపులా ఉన్న స్నేహి, సహయోగి శక్తి స్వరూప ఆత్మల యొక్క అన్ని రూపముల స్మృతి వతనం వరకు చేరుతుంది. బాప్ దాదా ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికి తమ స్మృతిని బట్టి ప్రతిఫలం అదే సమయంలో లభిస్తుంది. ఏ రూపంతో ఎవరు స్మృతి చేసినా అదే రూపంతో బాప్ దాదా పిల్లల ముందు తప్పక ప్రత్యక్షమవుతారు. యోగీ ఆత్మలకు యోగము యొక్క విధి లభిస్తుంది. చాలామంది పిల్లలు యోగీ ఆత్మగా అయ్యేందుకు బదులుగా వియోగీ ఆత్మలుగా అయిపోతారు. ఆ కారణంగా మిలనానికి బదులుగా వియోగమును అనుభవం చేసుకుంటారు. యోగీ ఆత్మ సదా బాప్ దాదాల యొక్క హృదయ సింహాసనాధికారిగా ఉంటుంది, ఎప్పుడూ దూరమవ్వదు. వియోగ ఆత్మలు వియోగము ద్వారా బాప్ దాదాను తమ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నము చేస్తుంది. వర్తమానాన్ని మరిచి గతమును తల్చుకుంటూ ఉంటుంది. ఆ కారణంగానే బాప్ దాదా కాసేపు ప్రత్యక్షంగా కనిపిస్తారు, కాసేపు పరదా లోపల దాగి ఉన్నట్లుగా కనిపిస్తారు. కానీ, బాప్ దాదా సదా పిల్లల ముందు ప్రత్యక్షంగా ఉన్నారు. వారు పిల్లల నుండి దాగి ఉండలేరు. తండ్రి పిల్లల కొరకే ఉన్నారు. ఎప్పటివరకైతే పిల్లల స్థాపన కర్తవ్యము యొక్క పాత్ర ఉంటుందో అప్పటివరకూ బాప్ దాదా పిల్లల యొక్క ప్రతి సంకల్పంలో మరియు ప్రతి క్షణంలో తోడుగా ఉంటారు. కలిసి వెళతాము అని బాప్ దాదా వాగ్దానం చేశారు. ఎప్పుడు వెళతారు? ఎప్పుడైతే కార్యం సమాప్తమవుతుందో అప్పుడు వెళతారు. మరి బాబాను ముందే ఎందుకు పంపించి వేస్తున్నారు? బాబా వెళ్ళిపోయారు అని అంటూ అవినాశీ సంబంధమును వినాశీ సంబంధంగా ఎందుకు మారుస్తున్నారు? కేవలం పాత్ర పరివర్తన అయింది అంతే. మీరు కూడా సేవా స్థానాన్ని మారుస్తూ ఉంటారు కదా! అలాగే బ్రహ్మా బాబా కూడా తమ సేవా స్థానాన్ని మార్చారు. రూపం అదే, సేవ కూడా అదే. వర్తమాన సమయంలో సహస్ర భుజుడైన బ్రహ్మ యొక్క పాత్ర నడుస్తోంది కావుననే సాకార సృష్టిలో ఈ రూపం యొక్క గాయనము మరియు స్మృతిచిహ్నము ఉన్నాయి. భుజాలు తండ్రి లేకుండా కర్తవ్యమును చేయజాలవు. భుజాలు తండ్రిని ప్రత్యక్షం చేయిస్తున్నాయి. చేయించేవారు ఉన్నారు కావుననే చేస్తున్నారు. ఆత్మ లేకుండా ఏవిధంగా భుజాలు ఏమీ చేయలేవో అలాగే కంబైండ్ రూపంలో ఉన్న బాప్ దాదా రూపీ ఆత్మ లేకుండా భుజాల రూపంలో ఉన్న పిల్లలు ఏమి చేయగలరు? ప్రతి కర్తవ్యములోనూ అంతిమం వరకు మొదటి కార్యము యొక్క భాగము బ్రహ్మదే కదా! బ్రహ్మా అనగా ఆదిదేవుడు, ఆదిదేవుడు అనగా ప్రతి శుభకార్యము యొక్క ఆదిని చేసేవాడు. బాప్ దాదా ఆది చేయకుండా అనగా ప్రారంభించకుండా ఏ కార్యమైనా ఎలా సఫలమవ్వగలదు. ప్రతి కార్యంలోనూ మొదట బాబా యొక్క సహయోగముంది. అనుభవమూ చేసుకుంటారు మరియు వర్ణన కూడా చేస్తారు అయినా కానీ అప్పుడప్పుడూ మరిచిపోతారు. ప్రేమ సాగరంలో ప్రేమ యొక్క ఆలలలో ఏమైపోతారు? అలలతో ఆడుకోవాలే కానీ ఆ అలలకు వశీభూతులైపోకూడదు. గుణగానం చేయండి కానీ ప్రభావితమైపోకండి.

పిల్లలు నాతోడుగా ఉన్నారు కానీ వియోగమనే పరదాను వేసి చూస్తూ ఉన్నారని బాప్ దాదా గమనిస్తున్నారు, మళ్ళీ వెదకడంలో సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. సదా హాజరై ఉండే ఆ హుజూర్‌ను కూడా దాచివేస్తారు. దాగుడుమూతల ఆట మీకు ఎంతో నచ్చితే దానిని ఆటగా భావిస్తూ తప్పక ఆడండి కానీ స్వరూపంగా అయిపోకండి. బాబా కేవలం ఉత్సాహపరిచే విషయాలను వినిపించడం లేదు సేవ యొక్క స్పీడుకు ఇంకా అతి తీవ్రగతిని ఇచ్చేందుకు కేవలం స్థానాన్ని పరివర్తన చేశారు. ఎందుకంటే పిల్లలు కూడా బాబా సమానంగా సేవ యొక్క గతిని అతి తీవ్రంగా చేయడంలో బిజీగా ఉండాలి. ఇది స్నేహం యొక్క ప్రతిఫలం.

పిల్లలకు బాబాపై ఎంతో స్నేహం ఉందని బాబాకు తెలుసు. కానీ, బాబాకు పిల్లలతో పాటు సేవపై కూడా ఎంతో స్నేహం ఉంది. బాబా యొక్క స్నేహానికి ప్రత్యక్ష స్వరూపం సేవపై స్నేహం ఉండడం. ఏ విధంగా క్షణ క్షణం బాబా బాబా అని అంటారో అలాగే ప్రతి క్షణం బాబా మరియు సేవ ఉండాలి, అప్పుడే సేవ యొక్క కార్యం సమాప్తమవుతుంది మరియు కలిసి వెళతారు. ఇప్పుడు బాబా పిల్లలు ప్రతి ఒక్కరిని లైట్ - మైట్ హౌస్ ల యొక్క రూపంలో చూస్తున్నారు. మైకులు శక్తిశాలిగా అయిపోయాయి కాని లైట్, మైట్ మరియు మైక్ (ప్రకాశము, శక్తి, వాక్కు) మూడూ కలిసి శక్తిశాలిగా ఉండాలి. శబ్దంలోకి రావడం సహజమనిపిస్తుంది కదా! ఇప్పుడు ఎంతటి శక్తిశాలి స్థితిని తయారుచేయాలంటే ఆ స్థితి ద్వారా ప్రతి ఆత్మకు శక్తి, సుఖము మరియు పవిత్రత ఈ మూడింటి యొక్క ప్రకాశమును మీ శక్తి ద్వారా ఇవ్వగల్గాలి. సాకార సృష్టిలో ఏ రంగు యొక్క లైటును వెలిగిస్తే నలువైపులా అదేవిధమైన వాతావరణమేర్పడుతుంది. పచ్చని లైటు ఉంటే నలువైపులా అదే ప్రకాశము వ్యాపిస్తుంది. ఒకే స్థానంలో ఉంటూ కూడా ఒకే లైటు వాతావరణాన్ని మార్చివేస్తుంది. మీరు కూడా ఎర్రలైట్ ను వేసినప్పుడు స్మృతి యొక్క వాయుమండలము దానంతట అదే తయారవుతుంది. స్థూలమైన లైటు వాతావరణాన్ని పరివర్తన చేయగల్గినప్పుడు మరి లైట్ హౌస్ లైన మీరు పవిత్రత యొక్క ప్రకాశంతో లేక సుఖం యొక్క ప్రకాశంతో వాయుమండలమును తయారుచేయలేరా? స్థూలమైన లైటు కళ్ళతో చూస్తారు, ఆత్మిక లైటు అనుభవంతో తెలుసుకుంటారు. వర్తమాన సమయంలో ఈ ఆత్మిక లైట్ల ద్వారా వాయుమండలమును పరివర్తన చేసే సేవను చేయాలి. ఇప్పుడు సేవ యొక్క రూపం ఎలా ఉండాలో విన్నారా? రెండు సేవలూ ఇప్పుడు తోడుగా కలిసి జరగాలి. మైక్ మరియు మైట్ (వాచా మరియు శక్తి) రెండూ కలిసి ఉండాలి. అప్పుడు సహజంగా సఫలతా మూర్తులుగా అయిపోతారు.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా:

1. అనంతమైన తండ్రికి కూడా హద్దులోని నెంబర్‌ను వేయవలసి వస్తుంది లేకపోతే తండ్రి మరియు పిల్లల యొక్క మిలనంలో రాత్రీ పగలూ ఏమిటి? మీ ప్రపంచంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. అక్కడ అందరూ బాబాకు సమీపంగా ఉంటారు. బిందువుకు ఎంత స్థానం కావాలి? ఇక్కడ శరీరానికి జాగా కావాలి. అక్కడ తప్పక సమీపమై తీరుతారు. ఇక్కడ ప్రతి ఒక్క ఆత్మ తాము సమీపంగా రావాలనుకుంటారు. ఎంతగా బాబా యొక్క గుణాలలో, స్థితిలో సమీపంగా ఉంటారో అంతగా అక్కడ ఇంట్లోనైనా, రాజ్యంలోనైనా స్థానంలో సమీపంగా ఉంటారు. స్థితి స్థానానికి సమీపంగా తీసుకువస్తుంది. ఇదే అద్భుతము. ప్రతి ఒక్కరూ తాము సమీపంగా ఉన్నారని భావిస్తారు మరియు సామీప్యమును కూడా అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే అనంతమైన తండ్రి అపారమైన వారు, అఖండమైనవారు కావున అందరూ సమీపంగా అవ్వగలరు. సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టపర్చాలి, ఇదే వర్తమాన సమయం యొక్క స్లోగన్. అసంతుష్టత అనగా అప్రాప్తి, సంతుష్టత అనగా ప్రాప్తి. సర్వప్రాప్తులూ కలవారు ఎప్పుడూ అసంతుష్టులు కాజాలరు.

2. సదా స్వయాన్ని ఈశ్వరీయ విద్యార్థిగా భావిస్తున్నారా? ఈశ్వరీయ విద్యార్థి జీవితం అన్నింటికన్నా ఉత్తమమైన జీవితంగా మహిమ చేయబడుతుంది. ఈవిధంగా సదా, బెస్ట్ అనగా శ్రేష్ఠ జీవితమును అనుభవం చేసుకుంటున్నారా? విద్యార్థులు సదా నవ్వుతూ, ఆడుతూ మరియు చదువుతూ ఉంటారు. ఇంకే విషయమూ బుద్ధిలో విఘ్నరూపంగా అవ్వదు. అలాగే చదవడము, చదివించడము, నిర్విఘ్నంగా ఉండడం, బాబాతో లేవడం, కూచోవడం, తినడం, తాగడం ఇదే ఈశ్వరీయ విద్యార్థి జీవితం. లౌకికంలో ఉంటూ కూడా బాబా యొక్క తోడు ఉంది కదా! శరీరము ఎక్కడ ఉన్నా కానీ మనస్సు బాబా మరియు సేవలో లగ్నమై ఉండాలి. తినడము, తాగడము, తిరగడము అన్నీ బాబాతో పాటు ఉండాలి. దీనికే మహిమ ఉంది. ప్రియమైన వస్తువేదైతే ఉంటుందో దానిని వదిలి ఉండడం కష్టమవుతుంది. తోడుగా ఉండడం, యోగమును ఉంచడం కష్టం కాదు. యోగము తెగిపోవడం కష్టం, ఇటువంటి అనుభవం కలిగి ఉండడమునే ఈశ్వరియ విద్యార్థి జీవితం అని అంటారు. ఎవరికైతే వదలడం కష్టమవుతుందో, యోగమును తెంచడం కష్టమవుతుందో, తోడుగా ఉండడంలో ఏ కషమూ ఉండదో ఆ జీవితమే ఉత్తమమైన జీవితం. సదా నవ్వుతూ ఉండండి, పాడుతూ ఉండండి మరియు బాబాతో కలిసి నడుస్తూ ఉండండి. ఇటువంటి తోడు మొత్తం కల్పమంతటిలోనూ ఎప్పుడూ లభించజాలదు. సంగమ యుగంలోనూ ఇటువంటివారిని ఇంకెవరినైనా వెదికేందుకు ప్రయత్నించినా దొరకగలరా? దొరకరు కదా! బాబా మిమ్మల్ని వెదికారా లేక మీరు బాబాను వెదికారా? మీరు కూడా వెదికారు కానీ తప్పు మార్గంలో వెదికారు. తండ్రిని వెదకవలసిన చోట సోదరులను వెదికారు కావుననే వెదకలేకపోయారు.

3. స్వయం యొక్క పురుషార్ధంలో మరియు సేవలో సదా వృద్ధి జరుగుతూ ఉండేందుకు సహజ సాధనం ఏమిటి? వృద్ధి యొక్క సహజ సాధనము అమృతవేళ నుండి విధి పూర్వకంగా నడవడం. అప్పుడు జీవితం వృద్ధి నొందుతుంది. ఏ కార్యమైనా విధి పూర్వకంగా చేసినప్పుడే సఫలమవుతుంది. బ్రాహ్మణులు అనగా విధిపూర్వకమైన జీవితం. ఏదైనా విషయంలో స్వయం యొక్క పురుషార్థంలో లేక సేవలో వృద్ధి జరగకపోతే తప్పకుండా ఏదో ఒక విధిలో లోపం ఉంది. కావున అమృతవేళ నుండి రాత్రి వరకూ మనసా, వాచా, కర్మణా లేక సంపర్కముల ద్వారా విధి పూర్వకంగా ఉన్నామా అనగా వృద్ధి జరిగిందా అని పరిశీలించండి. వృద్ధి జరగకపోతే కారణమును గూర్చి ఆలోచించి నివారణ చేయండి అప్పుడు నిరుత్సాహపడరు. జీవితం విధి పూర్వకంగా ఉన్నట్లయితే వృద్ధి తప్పకుండా జరుగుతుంది, అచ్ఛా !

మధువన నివాసులైన సోదరీ సోదరులతో: మధువన నివాసులందరూ సదా బాబా యొక్క స్మృతిలో లవలీనమై ఉండేవారే కదా! బాబా సమానంగా సదా అలసట లేనివారిగా సదా డబల్ లైట్ స్థితిలో స్థితులై ఉంటున్నారు కదా! ఎవరు ఎంత తేలికగా ఉంటే అంత అలసట లేకుండా ఉంటారు. ఏవిధమైన భారమైనా అలసిపోయేలా చేస్తుంది. శారీరక భారము కలవారు కూడా అలసిపోతారు కదా! తేలికగా ఉన్నవారు అంతగా అలసిపోరు. అలాగే ఎటువంటి భారమైనా మానసికమైనదైనా, సంబంధ సంపర్కాలకు చెందినదైనా సరే భారము తప్పక అలసటలోకి తీసుకువస్తుంది. మధువన నివాసులకు అథక్ భవ అన్న వరదానము లభించి ఉంది, కావున మీరు అలసట లేనివారే కదా! ఇంకా మేళాలు నడపాలా? ఎంతగా ముందుకు వెళతారో అంతగా ఈ మేళాలు పెద్దగానే అవుతాయి కానీ తగ్గవు. ఎంతగా పెంచుతూ ఉంటారో అంతగా పెరుగుతూనే ఉంటాయి. ఎంతగా ప్లాను తయారుచేసినా, ఎంతగా పెంచుతూ ఉంటారో అంతగా పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే సంగమ యుగంలోనే ఈశ్వరీయ పరివారము వృద్ధినొందుతుంది. ఎంతగా సమయం తక్కువగా ఉందో అంతగా వృద్ధి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎక్కువమంది వచ్చేస్తే మేము వెనకబడిపోతామని భావించడం లేదు కదా! ఎవరైతే స్వయం త్యాగమూర్తులుగా అవుతారో వారిని గూర్చి స్వతహాగానే ఆలోచన ఉంటుంది. మీరు నిష్కాములుగా ఉన్నారు కదా! ఎంతగా ప్రతి కామన నుండి అతీతంగా ఉంటారో అంతగా ప్రతి కామన సహజంగానే పూర్ణమవుతుంది. సంతోషంలో, ప్రాప్తిలో అలసట అనేది ఉండదు. మధువన నివాసులు పురుషార్థం యొక్క క్రొత్త యుక్తులను తయారుచేయాలి. వాటిని అందరూ అనుసరించాలి. క్రొత్త సంవత్సరం ప్రారంభమయ్యింది కాబట్టి క్రొత్త విషయాన్ని కనుగొనాలి. సహజ పురుషార్థం యొక్క క్రొత్త ఇన్వెన్షను కనుగొనండి మరియు ప్రత్యక్షంగా అనుభవం చేసి ఇతరులకు వినిపించండి. సర్వ ఆత్మలు మిమ్మల్ని ఉన్నతమైన దృష్టితో చూస్తారు. ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను ఉన్నతమైన దృష్టితో ఎలా చూస్తారో అలాగే మిమ్మల్నందర్నీ సర్వ శ్రేష్ఠులుగా, ఉన్నతులుగా, సౌభాగ్యశాలులుగా, సమీప ఆత్మలుగా ఇటువంటి దృష్టితో చూస్తారు కావున ఏ దృష్టితో చూస్తారో అందులోనే స్థితులై ఉండండి. మీ లేవడము, కూర్చోవడము, నడవడము అన్నింటినీ అందరూ చరిత్ర యొక్క రూపంలో చూస్తారు. బాబా యొక్క ప్రతి కర్తవ్యమును మీరు చరిత్ర యొక్క రూపంలో చూశారు కదా! అలాగే వారూ చూస్తారు. కావున ప్రతి కర్మను చేస్తూ చరిత్రవంతులుగా అయి నడవవలసి ఉంటుంది కానీ సాధారణంగా కాదు. మధువనం విశ్వం ముందు పేజీ వంటిది. స్టేజ్ పై నటులెవరైతే ఉంటారో వారి ప్రతి కదలిక పైనా ఎంతో ధ్యానముంటుంది. చేయి పైకి ఎత్తినా ఎంతో ధ్యానంతో ఎత్తుతారు ఎందుకంటే తమను అందరూ చూస్తున్నారు అని వారికి తెలుసు. మీ యొక్క ప్రతి కార్యానికి మహత్వముంది. బాప్ దాదా కూడా మధువన ఆత్మలకు ఎంత మహత్వముందో అదే మహత్వంతో చూస్తారు, అచ్చా! 

స్వతహాగా, సహజ యోగులుగా ఎలా అవ్వగలరు అని క్రొత్త ప్లానును తయారుచేయండి ఎందుకంటే ఈ సంవత్సరం అందరూ, ఇక చివరలో సహజ యోగము మరియు స్వతహ యోగము యొక్క అనుభవము తప్పకుండా కలగాలి అన్న లక్ష్యమును ఉంచి నడుస్తున్నారు. కావున సహజ యోగము ఏ ఆధారంపై జరుగుతుంది లేక స్వతహ యోగులుగా ఏ యుక్తి ద్వారా అవ్వగల్గుతారు? ఈ ప్లానును తయారుచేయండి మరియు అనుభవం చేయండి, ఆ తర్వాత అందరికీ వినిపించండి అప్పుడు మీ గుణగానము చేస్తారు. శ్రమ తక్కువగా మరియు సఫలత ఎక్కువగా ఉండాలి. ఇటువంటి క్రొత్త పురుషార్థం యొక్క విధానాలను తయారుచేయండి. ఎటువంటి ప్లానును తయారుచేయాలంటే దానిని చూసి అందరూ మధువన నివాసులకు కృతజ్ఞతలు చెప్పాలి. అచ్ఛా! 

Comments