17-12-1979 అవ్యక్త మురళి

17-12-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

అమృతవేళ అనే మానస సరోవరములో హోలీ హంసలు.

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న ఆత్మిక హంసల లేక హెలీ హంసల సమూహాన్ని చూస్తున్నారు. పవిత్రమైన హంసలందరూ సదా జ్ఞాన రత్నాలను గ్రహిస్తూ ఇతరులచే గ్రహింపజేయిస్తారు. హంసల భోజనము అమూల్యమైన ముత్యాలు. అలాగే హోలీ హంసలైన మీ అందరి బుద్ధికి భోజనము - జ్ఞాన రత్నాలు. అమృతవేళలో బాప్ దాదాతో ఆత్మిక సంభాషణ చేయుట ద్వారా, ఆత్మిక కలయిక ద్వారా, జ్ఞాన రత్నాలను ధారణ చేస్తారు. శక్తులను ధారణ చేస్తారు. అలాగే మొత్తం రోజంతటిలో మనన శక్తి ద్వారా ధారణ చేసిన రత్నాలను లేక శక్తులను మీ జీవితంలో ధారణ చేసి, ఇతరులచే ధారణ చేయిస్తారు.

అమృతవేళలో బాబాతో మిలనము చేసే శక్తి, గ్రహించే శక్తి అనగా ధారణ చేసే శక్తి తండ్రి ద్వారా ప్రతి రోజు లభించే విశేష శుద్ధ సంకల్పాల ప్రేరణను క్యాచ్ చేసే శక్తి - ఈ శక్తులు చాలా ఎక్కువగా అవసరము. అమృతవేళ సమయములో ప్రతి ఒక్కరు ధారణ చేసే శక్తి ద్వారా ధారణామూర్తులుగా అవుతారు. అమృతవేళలో విశేషంగా రెండు మూర్తులుగా అవ్వాలి. 1. ధారణా మూర్తి 2. అనుభవీ మూర్తి, ఎందుకంటే అమృతవేళలో బాప్ దాదా విశేషంగా పిల్లల కొరకు దాతా స్వరూపంలో కలుసుకొనుటకు సర్వ సంబంధాలలో స్నేహ సంపన్న స్వరూపంలో, సర్వ ఖజానాలలో జోలెను నింపే భోళా భండారీ రూపంలో ఉంటారు. ఆ సమయంలో ఏది చేయాలనుకున్నా, తండ్రిని ఒప్పించాలనుకున్నా, సంతోషపరచాలనుకున్నా, సంబంధాలను నిభాయించాలనుకున్నా సహజ విధులను అనుభవం చేయాలనుకున్నా సర్వ విధులు, సిద్ధులు సహజంగా ప్రాప్తి చేసుకోగలరు. ప్రాప్తుల భండారం, ఇచ్చే దాత సహజంగా ప్రాప్తిస్తారు. సర్వ గుణాల ఖజానా, సర్వ శక్తుల ఖజానా, పిల్లల కొరకు తెరవబడి ఉంటుంది. అమృతవేళలో చేయు ఒక్క సెకండ్ అనుభవం మొత్తం రోజంతా(పగలు మరియు రాత్రి) సర్వ ప్రాప్తుల స్వరూపాన్ని అనుభవం చేయుటకు ఆధారము. బాప్ దాదా కూడా ప్రతి ఒక్కరితో మనస్ఫూర్తిగా మాట్లాడుటకు, ఫిర్యాదులు వినుటకు, బలహీనతలను నిర్మూలించుటకు అనేక రకాల పాపాలను భస్మము చేయడానికి, మురిపాన్ని, ప్రేమను (లాడ్ ప్యార్) ఇవ్వడానికి అన్నిటికీ ఫ్రీగా (తీరికగా) ఉంటారు. ఆ సమయములో అఫిషియల్ గా (గంభీరంగా హెదా రూపంలో) ఉండరు. భోలా భండారీ రూపంలో ఉంటారు. ఇంత సువర్ణ అవకాశం ఉన్నా, కొంతమంది మాత్రమే ఆ అవకాశం తీసుకుంటున్నారు. కొంతమంది అవకాశాన్ని తీసుకునేవారిని చూస్తున్నారు. ఎందుకు? వారికి కూడా తీసుకోవాలనే కోరిక ఉంది. అయినా మధ్యలో ఏదో ఆటంకముంది? అది ఏమిటో తెలుసా?

మాయ కూడా చాలా తెలివిగలది. విశేషంగా అది కూడా ఆ సమయములోనే తండ్రి నుండి వేరు చేయుటకు వచ్చేస్తుంది. విశేషంగా సాకులు చెప్పే ఆటలోకి పిల్లలను ఆకర్షిస్తుంది. ఎలాగైతే గారడి చేసేవారు తమ గారడి జనులకు ఆకర్షిస్తారో, అలా మాయ కూడా అనేక ప్రకారాలైన నిర్లక్ష్యం, సోమరితనం మరియు వ్యర్థ సంకల్పాలనే సాకులతో ఆకర్షిస్తుంది. అందువలన సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. తర్వాత ఇటువంటి బంగారు సమయాన్ని పోగొట్టుకున్నందున సహజ ప్రాప్తుల నుండి వంచితులైనందున రోజంతటికి బలహీన పునాది పడిపోతుంది. మొత్తం రోజులో ఎంత పురుషార్థం చేసినా ఆదికాలంలో పునాది బలహీనంగా ఉన్నందున శ్రమ ఎక్కువగా చేయవలసి వస్తుంది. ప్రాప్తి తక్కువగా ఉంటుంది. ప్రాప్తి తక్కువగా ఉన్న కారణంగా రెండు ప్రకారాలైన అవస్థను అనుభవం చేస్తారు. ఒకటేమో నడుస్తూ నడుస్తూ అలసట అనుభవం చేస్తారు, రెండవది నడుస్తూ నడుస్తూ వ్యాకులపడతారు. తర్వాత ఏమి ఆలోచిస్తారు? గమ్యానికి ఎప్పుడు చేరుకుంటామో తెలియదు, సమయం సమీపంగా ఉందో లేక దూరంగా ఉందో? ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుందో, సత్యయుగ సృష్టిలోకి ఎప్పుడు వెళ్తామో? ఈ ప్రవృత్తి బంధనాలు ఎప్పటి వరకు ఉంటాయో ? అని వర్తమాన ప్రాప్తులను వదిలేసి భవిష్యత్తులోకి చూస్తూ ఉంటారు.

వర్తమాన ప్రాప్తుల లిస్టును సదా ఎదురుగా ఉంచుకుంటే "ఎప్పుడు జరుగుతుంది? అనే ప్రశ్న సమాప్తమై జరుగుతూ ఉంది లేక తప్పక జరుగుతుంది" అనే దానిలోకి వచ్చేస్తారు. వ్యాకులపడుటకు బదులు సంతోషంగా ఉంటారు. వర్తమానము నుండి వేరు కాకండి. మాయ సాకులను గుర్తించండి. మాయ తన సాకులతో మిమ్ములను రాజీ చేసుకుంటుంది. అందుకే బాబాను ఆకర్షించలేకపోతున్నారు. అనగా సహజ సాధనాన్ని ఉపయోగించలేకున్నారు. వరదాన రూపంలో ప్రాప్తి చేసుకొనుటకు బదులు శ్రమించి ప్రాప్తి పొందుటలో లగనమైపోతున్నారు. అందువలన అమృతవేళ అంటే సహజ ప్రాప్తులు పొందే వేళ అని తెలుసుకొని దాని లాభాన్ని పొందండి. తెరవబడిన భండారాలతో(ఖజానాలతో) ప్రాలబ్ధమనే జోలెను నింపుకోండి, వరదాత మరియు భాగ్య విధాతల ద్వారా అమృతవేళలో అదృష్ట రేఖను ఎంత కావాలంటే అంత గీయించుకోండి. అప్పుడు వారు గీయుటకు రెడీగా ఉంటారు. భాగ్య రేఖను వరదాత ద్వారా సహజంగా, శ్రేష్ఠంగా గీయించుకోండి. ఆ సమయములో వీరు భోలా భగవంతుని రూపంలో ప్రేమ స్వరూపంలో ఉంటారు. కనుక ప్రేమ ఆధారంతో శ్రేష్ఠ రేఖను గీయించుకోండి, ఏది కావాలంటే దానిని, ఎన్ని జన్మలకు కావాలంటే అన్ని జన్మలకు అష్ట రత్నాలలోకి లేదా 108 మాలలోకి ఎలా కావాలంటే అలా గీయించుకోమని బాప్ దాదా ఓపన్ గా ఆఫర్ చేస్తున్నారు. ఇంతకంటే ఇంకేమి కావాలి?

యజమానులుగా కండి. అధికారము తీసుకోండి. అమృతవేళలో ఏ ఖజానాకూ తాళమూ ఉండదు, తాళం చెవి ఉండదు. శ్రమ అనే తాళం చెవి అసలే లేదు. అప్పుడు లేకుంటే మొత్తం రోజంతా శ్రమ అనే తాళం చెవిని ఉపయోగించవలసి వస్తుంది. ఆ సమయంలో మనస్ఫూర్తిగా "బాబా నేను ఎవరినైనా, ఎలా ఉన్నా నీ వాడినే " అని కేవలం ఒక సంకల్పం చేయండి. మాయ గారడి ఆటలు దాటుకొని నా జతలో వచ్చి కూర్చుంటే చాలు. ఈ మాయ ఆటలు మీ మార్గంలో వచ్చే ప్రక్క దృశ్యాలు(సైడ్ సీన్స్) అవి చూస్తూ ఆగిపోకండి. వచ్చేయండి. నా వద్ద కూర్చోండి. సంకల్పాన్ని బుద్ధిని అనగా మనసును-బుద్ధిని తండ్రికి సమర్పించండి. అలా చేయుట రావడం లేదా? తండ్రి ఇచ్చిన వస్తువును తండ్రికి ఇవ్వడంలో కష్టమెందుకు? ఒకసారి 'నీది' ఒకసారి 'నాది' అని అంటూ నీది, నాది అనే చక్రంలోకి వచ్చేస్తున్నారు. అమృతవేళ అయ్యింది, కనులు తెరుచుకుంటాయి. వెంటనే ఒక సెకండులో జంప్ చేసి తండ్రి జతలో కూర్చోండి. జతలో ఉన్నందున తండ్రి ఖజానాలన్నీ మీవే అని అనుభవమవుతుంది. జ్ఞానం ఆధారంగా కాదు, ప్రాప్తి ఆధారంగా అనుభవమవుతుంది. అధికారమనే సింహాసనముపై కూర్చోవడం వలన అధికారి స్థితి అనుభవమవుతుంది. కనుక తండ్రి ఖుదాదోస్త్ (ఈశ్వరీయ స్నేహితుని) రూపంలో అధికారమనే సింహాసనాన్ని ఆఫర్ చేస్తున్నారు(తీసుకోమంటున్నారు) లేవండి, సింహాసనముపై కూర్చోండి. కొద్ది సమయం ఈ సింహాసనం పై కూర్చున్నా ఏది కావాలంటే అది తయారుచేసుకోగలరు. ఎలాగైతే హద్దులోని రాజు కొద్ది సమయం కొరకు రాజ్యాధికారాన్ని తీసుకొని తనకు కావాల్సింది పొందుతాడో అలా ఇప్పుడు అనంతమైన సింహాసనాధికారిగా అయ్యి ఈ వర్తమాన స్వర్ణిమ సమయంలో, సహజంగానే మీ స్వర్ణిమయుగ స్థితిని తయారు చేసుకోగలరు. అంతేకాక భవిష్య బంగారు యుగ ప్రపంచములో శ్రేష్ఠ పదవిని పొందగలరు. అర్థమయ్యిందా? ఇది సహజ పురుషార్థ సమయము, సహజ సాధనాలున్నాయి. వీటిని వదిలేసి కష్టంలోకి ఎందుకు వెళ్లిపోతున్నారు? ఇప్పుడు సహజ పురుషార్థులుగా అవుతారా లేక కష్టపడే వారిగా అవుతారా? తండ్రి సులభంగా లభించినప్పుడు మార్గము కష్టంగా ఎలా ఉంటుంది? సహజ పురుషార్థులుగా కండి. కష్టమనే నామ-రూపాలను సమాప్తము చేస్తే ప్రపంచములోని కష్టాలను సమాప్తం చేయగలరు.

ఈవిధంగా సదా అధికారులకు, సింహాసనాధికారులకు మాయగారడిలో ఉత్తీర్ణులయ్యే వారికి, సదా తండ్రి జ్ఞాన రహస్యాలను తెలుసుకున్న వారికి, శ్రమను ప్రేమలోకి పరివర్తన చేసుకున్నవారికి, వ్యాకులపడుటకు బదులు సంతోషంగా ఉండేవారికి, మీ సంతోషంతో ప్రపంచాన్ని సంతోషంగా చేయువారికి - ఇలా సదా తండ్రి జతలో ఉండేవారికి సర్వ శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

అవ్యక్త బాప్ దాదాతో పార్టీలతో వ్యక్తిగత కలయిక - 

1)మనసా సేవ చేయుటకు సహజ సాధనం అటూట్ (దృఢమైన) నిశ్చయం - ఎవరైతే నిశ్చయ బుద్ధి గలవారై విజయులుగా ఉంటారో, ఆ నిశ్చయ బుద్ధి గలవారి ద్వారా వాయుమండలం శుద్ధమవుతూ పోతుంది. వారు మనసా సేవ చేయగలరు. ఎందుకంటే నలువైపులా ఉన్నవారు నిశ్చయ బుద్ధిగల ఆత్మలను చూచి వీరికేదో లభించిందని భావిస్తారు. ఎంత గర్విష్టులైనా, జ్ఞానము వినని వారైనా ఆంతరికములో వీరి జీవితము కొంత బాగుపడిందని తప్పక భావిస్తారు. కనుక ప్రారంభము నుండి ఎవరైతే స్థిరమైన నిశ్చయబుద్ధి గలవారిగా ఉంటారో వారి ద్వారా ఈ సేవ జరుగుతూనే ఉంటుంది. ఇది కూడా మనసా సేవే కదా.

2)మాయ నుండి సురక్షితంగా ఉండుటకు సాధనం - అటెన్షన్ అనే కాపలాదారుడు బాగా మేల్కొని జాగరూకుడై ఉండాలి - అందరూ సదా స్వదర్శన చక్రధారులై నడుస్తున్నారా? తమ స్వదర్శన చక్రధారీ స్వరూపము గుర్తుంటుందా? ఎవరైతే సదా స్వదర్శన చక్రధారులుగా ఉంటారో వారు అనేక ప్రకారాలైన మాయ చక్రాల నుండి ముక్తులుగా ఉంటారు. ఒక స్వదర్శన చక్రము అనేక వ్యర్థ చక్రాలను సమాప్తము చేస్తుంది, మాయను పారద్రోలుతుంది. స్వదర్శన చక్రధారుల ముందు మాయ నిల్చోలేదు. స్వదర్శన చక్రధారులు మాలామాల్ గా ఉండు కారణంగా అచలంగా ఉంటారు. ఈ విధంగా సదా సంపన్నంగా,మాలామాల్ గా ఉంటున్నారా? మాయ ఖాళీ చేయుటకు ప్రయత్నిస్తుంది. కాని ఎవరైతే సదా ముందు జాగ్రత్తలో ఉంటారో, మేలుకొని ఉంటారో, వెలుగుచున్న జ్యోతిగా(జాగ్ తీ జ్యోతి) ఉంటారో వారిని ఏమీ చేయలేదు, అటెన్షన్ అనే కాపలాదారుడు బాగా మేల్కొని ఉంటే సదా సురక్షితంగా ఉంటారు. కనుక సదా వెలుగుచున్న జ్యోతులుగా కండి. అందుకు జ్ఞాపక చిహ్నాలుగా మందిరాలలో కూడా అఖండ జ్యోతిని వెలిగిస్తారు, ఆరిపోనివ్వరు. అఖండ జ్యోతిని వెలిగించే పద్ధతి ఎప్పటి నుండి వచ్చింది? సంగమ యుగములో మీరందరు చైతన్యములో వెలిగే జ్యోతులుగా అయ్యారు. అందుకే ఈ స్మృతి చిహ్నము అప్పటి నుండి కొనసాగుతూ వస్తున్నది. ఒకవేళ ఆరిపోతే అశుభంగా భావిస్తారు. కనుక చైతన్యములో మీరంతా ఎవరు? అఖండ జ్యోతులు, ఖండితమైన వస్తువులెప్పుడూ పూజింపబడవు.

3)తండ్రి ద్వారా చేయబడిన మహిమను స్మరణ చేయుట వలన సమర్థ స్థితి అనుభమవుతుంది. సదా మీ భాగ్య మహిమను గానము చేస్తూ ఉంటారా? స్థూలములో సాధారణ పాటలు పాడుతూ ఉండినా, ఎంత సంతోషిస్తారు. (వినేవారు, పాడేవారు) భక్తి మార్గములో కీర్తించినప్పుడు కూడా ఎంత సంతోషిస్తారు. కనుక మీరందరూ కూడా తండ్రి మహిమ చేస్తూ పాడిన పాటలు సదా పాడుతూ ఉండండి. ముందు నేనెలా ఉండినాను? ఇప్పుడు తండ్రి నన్నెలా తయారు చేశారు అని దీనినే స్మరణ చేస్తూ సదా హర్షితంగా ఉండండి. ఈ స్మృతిలోనే సమర్థత ఇమిడి ఉంది. ఎందుకంటే తండ్రి సమర్థంగా చేశారు కదా, స్పష్టములో కూడా అనుకోనిది సాకార స్వరూపములో అనుభవం చేస్తున్నారు. అందువలన బాప్ దాదా పిల్లలందరినీ లక్కీ సితారలని అంటారు. కనుక మీరు లక్కీ సితారలే కదా?

సదా ప్రకాశించేవాటినే నక్షత్రాలని అంటారు. తండ్రి ద్వారా ఏ శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా లభించిందో వాటితో ప్రకాశిస్తూ ఉండండి. అలా ఉన్నారా? మేఘాలతో కప్పబడేవారు కాదు కదా. సదా మీ ప్రకాశముతో విశ్వాన్ని ప్రకాశవంతము చేసేవారుగా ఉన్నారా? సంతోషంగా(ఖుషీ - ఖుషీగా) పాత ప్రపంచ విషయాలను వదిలేశారు. ఇప్పుడు మీరు పాత ప్రపంచ నివాసులు కాదు, సంగమ యుగ నివాసులు. కనుక పాత ప్రపంచము నుండి దూరమయ్యారా లేక దూరమవ్వాలా - ఏమనుకుంటున్నారు? ఎవరైనా పాత మిత్రుని కలుసుకొనుటకు పాత ప్రపంచములోని వస్తువులను కొనుక్కోవటానికి వెళ్లడం లేదు కదా? ఆ రోజుల్లో బార్డర్ లో నిల్చొని అప్పుడప్పుడు తెలిసి తెలిసి శత్రు దేశములోకి వెళ్తారు. మీరు బార్డర్ దాటి మరలా పాత ప్రపంచములోకి వెళ్లిపోవడం లేదు కదా? నూతన ప్రపంచము మీ ముందే నిలబడి ఉంది. పాత ప్రపంచ తీరాన్ని వదిలేశారు. సంకల్పములో కూడా పాత ప్రపంచములోకి వెళ్లకండి. వెళ్లారంటే చిక్కుకుపోతారు. అందువలన సదా స్వయాన్ని సంగమయుగ వాసులుగా భావించండి. అలా భావిస్తే తండ్రి గుర్తుకొస్తారు. వారసత్వము గుర్తుకొస్తుంది.

పురుషార్థములో స్వ ఉన్నతి మరియు సేవలో వృద్ధి - రెండిటి బ్యాలన్స్ ఉండాలి. రెండిటికి ప్లాన్లు తయారు చేస్తున్నారా? ఇప్పుడు ఏ ప్లాను తయారుచేశారు? (ఉజ్జయినిలో కుంభమేళాలో ఆధ్యాత్మిక మేళా) మేళాలో సేవ ధూం - ధాంగా చేయుటకు తయారవుతున్నారా? బాగుంది. కాని మేళా వాతావరణము ఎంత శాంతియుతంగా ఉండాలంటే - ఆందోళన మరియు దొమ్మి(గుంపులు గుంపులు), తోపులాట వృత్తి నుండి వచ్చినవారు, ఇదేదో ప్రత్యేకమైన స్థానములోకి వచ్చినామని అనుభవం చేయాలి. నలువైపులా శబ్ధము వ్యాపించి ఉంటుంది. మీ వద్దకు వచ్చినవారు శాంతి వరదానమిచ్చువారిగా ఉండాలి. మీ శాంతి వైబ్రేషన్లు వారిని శాంతింపజేయాలి. దీని వలన మేళా అంతటా రెండు నిముషాలు అక్కడకు వెళ్లాము, ఆ కొంతసేపట్లో చాలా బాగా శాంతిని అనుభవించి వచ్చాము అనే శబ్ధము వ్యాపిస్తుంది. ఎలాగైతే ప్రారంభములో యజ్ఞ స్థాపన జరిగే సమయంలో వచ్చే వారు 'ఓం' ధ్వని ద్వారా ఇదేదో శాంతినిచ్చే స్థానమని భావించారో, అలా ఈ కుంభమేళాలో శాంతిని అనుభవం చేయాలి. మేళాలో వచ్చేవారి మూడే వేరే విధంగా ఉంటుంది. ఆ మేళా ఒక బజారు వలె ఉంటుంది. కనుక అక్కడ నుండి వచ్చేవారు అదే రూపములో అశాంతితో వస్తారు. అటువంటి వారికి శాంతిని అనుభవం చేయించుట చాలా అవసరము. దీని ద్వారా ఈ మేళా ప్రత్యేకంగా కనిపిస్తుంది. 

అందరినీ స్నేహ పూర్వకంగా ఆహ్వానించండి. మీ స్నేహము చూచి అందరూ సంతోషిస్తారు. ఎవరు ఎలా మాట్లాడినా, మీరు శాంతిగా, ప్రేమగా మాట్లాడితే దాని ప్రభావము కూడా పడ్తుంది. సమయానుసారము స్టేజి పైకి వచ్చేవారిని చూచి లోపల నుండి అంగీకరిస్తారు. ఇప్పుడు అందరి కనులు కొద్దిగా క్రిందికి వంగాయి, కాని తల వంచలేదు. చివరికి అందరూ వంగేవారే. అందరూ వంగుట అనగా జయ జయ ధ్వనులు వినిపించుట. మరలా క్రాంతి తర్వాత శాంతిగా అయిపోతుంది. ఇప్పుడు వంగుటలో మొదటి పోజ్ ప్రారంభమయ్యింది. చివరికి కాళ్ల వరకు వంగుతారు.

4)దయాహృదయుడైన తండ్రి సంతానమైన దయా హృదయం గల పిల్లల కర్తవ్యము - అందరూ భికారీ జీవితాన్ని కూడా అనుభవం చేశారు. ఇప్పుడు మాలామాల్ గా (ధనవంతులుగా, సంపన్నంగా) తయారయ్యారు. మాలామాల్ గా అయ్యే పిల్లలు ఎవరిని చూచినా, ఈ ఆత్మకు కూడా స్థానము లభించనీ, కళ్యాణము జరగనీ అని దయ కలుగుతుంది. కనుక ఎవరు సంపర్కములోకి వచ్చినా వారికి తప్పకుండా తండ్రి పరిచయమునివ్వండి. ఉదాహరణానికి ఎవరైనా మీ ఇంటికి వస్తే వారికి మంచినీళ్లు ఇస్తారు కదా, అలాగే వెళ్లిపోతే శుభంగా భావించరు కదా. అలాగే సంపర్కములోకి ఎవరు వచ్చినా వారికి తండ్రి పరిచయమునే మంచి నీళ్లు తప్పక ఇవ్వండి. కొద్దిగా వినిపిస్తే మంచి నీళ్లు ఇచ్చినట్లు - 7 రోజుల కోర్సు చేయిస్తే బ్రహ్మ భోజనము తినిపించినట్లవుతుంది. ఏదో కొంత తప్పకుండా ఇవ్వాలి, ఎందుకంటే మీరు దాత పిల్లలు కదా, అచ్ఛా!

Comments