17-10-1981 అవ్యక్త మురళి

* 17-10-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

అన్ని పరిస్థితులకూ సమాధానము- ఎగిరే పక్షులుగా అవ్వండి
                             
బాప్ దాదా పిల్లలందరికీ నయనాల యొక్క భాష ద్వారా ఈ లోకము నుండి అతీతముగా అవ్యక్త వతనవాసులుగా తయారుచేసే ప్రేరణను ఇస్తున్నారు. ఏ విధముగా బాప్ దాదా అవ్యక్తవతన వాసులుగా ఉన్నారో అలాగే తతత్వము యొక్క వరదానమును ఇస్తారు. ఫరిస్తాల లోకములో ఉంటూ ఈ సాకార ప్రపంచములోకి కర్మ చేసేందుకు రండి. కర్మ చేసాక, కర్మయోగులుగా అయ్యాక మళ్ళీ ఫరిస్తాలుగా అయిపోండి. ఇదే అభ్యాసమును సదా చేస్తూ ఉండండి. సదా నేను ఫరిస్తాల లోకములో ఉండే అవ్యక్త ఫరిస్తా స్వరూపమును అన్న స్మృతి ఉండాలి. ఈ భూమిపై నివసించే వారము కాదు. ఆకాశ నివాసులము. ఫరిస్తాలు అనగా ఈ వికారీ ప్రపంచము, ఈ వికారీ దృష్టి, వృత్తుల నుండి అతీతముగా ఉండేవారు. ఈ విషయాలన్నింటి నుండి అతీతముగా ఉండేవారు. వారు సదా బాబాకు ప్రియమైనవారిగా ఉంటారు మరియు బాబా వారికి ప్రియమైనవారిగా ఉంటారు. ఇరువురూ పరస్పరం ఒకరి స్నేహములో ఒకరు ఇమిడిపోయి ఉంటారు. మరి ఇటువంటి ఫరిస్తాలుగా అయ్యారా? ఏ విధముగా బాబా అతీతముగా ఉంటూ కూడా ప్రవేశించి కార్యము కొరకు వస్తారో అలాగే ఫరిస్తా ఆత్మలు కూడా కర్మబంధన యొక్క లెక్కలో కాకుండా సేవ యొక్క బంధనలో శరీరములోకి ప్రవేశించి కర్మ చేస్తారు మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అతీతముగా అయిపోతారు. ఇటువంటి కర్మబంధన ముక్తులుగా ఉండండి, వారినే ఫరిస్తాలు అని అంటారు.

బాబాకు చెందిన వారిగా అయ్యారు అనగా పాత దేహము మరియు దైహిక ప్రపంచము యొక్క సంబంధము సమాప్తమయ్యింది కావున దీనిని మరజీవా జీవితము అని అంటారు. కావున పాత కర్మల యొక్క ఖాతాలు సమాప్తమయ్యాయి మరియు కొత్త బ్రాహ్మణ జీవితము యొక్క ఖాతా ప్రారంభమయ్యింది. మరజీవాలుగా అయ్యాము అని అందరికీ తెలుసు కదా, ఇది అందరూ అంగీకరిస్తారు కదా! అలా అయ్యారా లేక అవుతున్నారా? ఏమంటారు? అలా అయ్యారా లేక అవుతున్నారా? మరణిస్తున్నారా లేక మరణించేసారా? ఎప్పుడైతే మరణిస్తారో అప్పుడిక పాత లెక్క అంతా సమాప్తమైపోతుంది. బ్రాహ్మణ జీవితము కర్మ బంధనము యొక్క జీవితము కాదు. అది కర్మయోగీ జీవితము యొక్క జీవనముగా ఉంటుంది. అధికారులుగా అయి కర్మ చేసినట్లయితే అది కర్మ బంధన కాదు కానీ కర్మేంద్రియాలపై అధికారులుగా అయి ఏది కావాలనుకుంటే అది ఎలాంటి కర్మ కావాలనుకుంటే అలాంటి కర్మను ఎంత సమయం కర్మ చేయాలనుకుంటే అంతగా కర్మేంద్రియాలతో కర్మను చేయించేవారిగా ఉంటారు. కావున బ్రాహ్మణులు అనగా ఫరిస్తాలు, కర్మ బంధన ఆత్మలు కాదు. సేవ యొక్క శుద్ధ బంధన కలవారు. ఈ దేహము సేవార్ధము లభించింది. మీ కర్మ బంధనల లెక్కాచారాల జీవితము యొక్క లెక్కలు సమాప్తమయ్యాయి. ఇది కొత్త జీవితము, ఇదైతే అందరూ భావిస్తున్నారు కదా! పాత లెక్కలు ఇంకా ఇప్పటివరకూ మిగిలి లేవు కదా! మహారాష్ట్రవారు ఏమి భావిస్తున్నారు? టీచర్లు ఏమి భావిస్తున్నారు? లెక్కాచారాలను సమాప్తము చేయడంలో చురుకైనవారిగా ఉన్నారా లేక సాధారణముగా ఉన్నారా? వాటిని తీర్చుకోవడమైతే మీకు వస్తుంది కదా! ఫరిస్తాలుగా అయిపోయినట్లయితే శ్రమ నుండి విముక్తులైపోతారు. నడిచేవారు. పరిగెత్తేవారు, దుమికి వెళ్ళేవారు వీరందరికన్నా ఉన్నతమైనవారు ఎగిరి వెళ్ళేవారు. ఆత్మ ఎగిరే పక్షి వంటిది, అది నడిచి వెళ్ళే పక్షి కాదు కావున అనాది సంస్కారాలను భారము యొక్క కారణముగా మరచిపోయారు. ఫరిస్తాలకు బదులుగా కర్మ బంధనులుగా ఎగిరే పక్షులకు బదులుగా పంజరములోని పక్షులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పైకి ఎగిరే పక్షి యొక్క అనాది సంస్కారాలను ఎమర్ట్ చేయండి అనగా ఫరిస్తారూపములో స్థితులవ్వండి. తతత్వము యొక్క వరదానులుగా అవ్వండి, దీనినే సహజ పురుషార్ధము అని అంటారు. భిన్న భిన్న పరిస్థితులలో ఏమి చేయను, ఎలా చేయను అన్న శ్రమనేదైతే పడతారో దాని వల్ల పరిస్థితి పెద్దగా అయిపోతుంది మరియు మీరు చిన్నగా అయిపోతారు. పరిస్థితి శక్తిశాలిగా అయిపోతుంది మరియు మీరు బలహీనముగా అయిపోతారు. ఏ పరిస్థితిలోనైనా, ప్రవృత్తి యొక్క ఆధారముపై వచ్చే పరిస్థితి అయినా లేక మీ తనువు యొక్క సంబంధముతో వచ్చే పరిస్థితి అయినా లేక లౌకిక, అలౌకిక సంబంధము యొక్క ఆధారముపై వచ్చే ఏ పరిస్థితి అయినా మీ యొక్క లేక ఇతరుల యొక్క సంస్కారాల ఆధారముపై వచ్చే పరిస్థితులైనా అన్ని పరిస్థితులలోనూ ఏమిటి మరియు ఎందుకు అనే ప్రశ్నలకు ఏకైక జవాబు ఎగిరే పక్షులుగా అయిపోవడం. పరిస్థితి కిందకు మరియు మీరు పైకి వెళ్ళిపోండి. పైనుండి కింద ఉన్న వస్తువు ఎంత పెద్దగా ఉన్నా కానీ చిన్నగానే అనుభవమవుతుంది. కావున అన్ని పరిస్థితులను దాటి వెళ్ళేందుకు సహజమైన దారి ఫరిస్తాలుగా అవ్వండి మరియు ఎగిరే పక్షులుగా అవ్వండి. సహజ పురుషార్ధమేమిటో అర్ధమయ్యిందా? ఇది నా స్వభావము, నా సంస్కారము, నా బంధనము అన్న నాది అనే బంధనమును మరజీవాగా అయినప్పుడు మరి సమాప్తము చేయలేదా? ఫరిస్తా స్వరూపము యొక్క భాషలో నాది నాది అనేది ఉండదు. ఫరిస్తాలు అనగా నాది అనేది మీదిగా అయిపోవడం. ఈ నాది, నాది అనేదే నేల పైకి తీసుకువస్తుంది మరియు నీది, నీది అనడం సింహాసనాన్ని అధిష్ఠింపజేస్తుంది. కావున ఫరిస్తాలుగా అవ్వడం అనగా నాది, నాది అనే బంధనము నుండి ముక్తులుగా అవ్వడం. అలౌకిక జీవితములో కూడా నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు. మరి ఇటువంటి ఫరిస్తాలుగా అయ్యారా? మరి మహారాష్ట్రవారు ఏమవుతారు? మీకు ఫరిస్తాలుగా అవ్వడమైతే వస్తుంది కదా! అన్ని సమస్యలకూ ఒకే సమాధానం. ఎగిరే పక్షులుగా అవ్వాలి మరియు తయారుచేయాలి. ఇది గుర్తుంచుకోండి అర్ధమయ్యిందా? అచ్చా!

ఇటువంటి బాబా సమానముగా అవ్యక్త రూపధారీ ఫరిస్తా స్వరూపులకు, నాకు ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు అని భావించే ఇటువంటి అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో ఉండేవారికి, సదా కర్మేంద్రియ జీతులకు, కర్మయోగులకు మరియు కర్మాతీతులకు, ఇదే అభ్యాసములో ఉండేవారికి, సదా బంధనముక్తులకు, సేవ యొక్క బంధనలో ఉండేవారికి, ఈ విధంగా బాబా సమానముగా తతత్వము యొక్క వరదాని పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త మిలనము:- సదా స్వయాన్ని ఈ సృష్టి డ్రామాలో హీరో పాత్రధారులుగా భావిస్తూ నడుస్తున్నారా? హీరో పాత్రధారులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి అడుగులోనూ తమ పైన తమకు ధ్యానము ఉంటుంది. వారి ప్రతి అడుగూ సదా గాయన యోగ్యముగా మరియు వన్స్ మోర్ అనే విధముగా ఉంటుంది. హీరో పాత్రధారుల యొక్క అడుగులేవైనా పైకీ, కిందకూ అయితే వారు హీరోలుగా పిలువబడజాలరు. కావున మీరందరూ డబుల్ హీరోలు, హీరోలు విశేషపాత్రధారులు మరియు హీరో వంటి జీవితాన్ని తయారు చేసుకునేవారు కూడా, కావున ఈ విధంగా మీ స్వమానాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఒకటేమో తెలుసుకోవడం, ఇంకొకటి తెలుసుకొని నడుచుకోవడం. మరి మీరు తెలుసుకున్నారా? లేక తెలుసుకొని ఆ విధంగా నడుచుకుంటున్నారా? కావున సదా మీ హీరో పాత్రను చూస్తూ హర్షితముగా ఉండండి. ఓహో డ్రామా మరియు ఓహో నా పాత్ర! కర్మ కొద్దిగా సాధారణముగా అయినా హీరోలుగా పిలువబడజాలరు. ఏ విధంగా బాబా హీరోపాత్రధారియో వారి ప్రతి కర్మ గాయనము చేయబడుతుందో మరియు పూజ చేయబడుతుందో అలాగే బాబాతో పాటు సహయోగీ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా హీరో పాత్ర ఉన్న కారణముగా ప్రతి కర్మా గాయనయోగ్యముగా మరియు పూజా యోగ్యముగా అయిపోతుంది. మరి ఇంతటి నషా ఉందా లేక మరచిపోతున్నారా? అర్ధకల్పం మరచిపోయారు. మరి ఇప్పుడు కూడా మరచిపోవాలా? ఇప్పుడిక స్మృతి స్వరూపులుగా అయిపోండి. స్వరూపముగా అయ్యాక ఎప్పుడూ మరచిపోకూడదు. జీవితాన్ని శ్రేష్ఠముగా తయారుచేసుకునేందుకు సహజ సాధనము ఏమిటి? ఎప్పుడైతే స్వయాన్ని ట్రస్టీలుగా భావిస్తూ నడుచుకుంటారో అప్పుడు జీవితం శ్రేష్ఠముగా అవుతుంది. ట్రస్టీలు అనగా అతీతమైనవారు మరియు ప్రియమైనవారు. కావున అందరినీ బాబా ట్రస్టీలుగా చేసేసారు. మీరు ట్రస్టీలే కదా! ట్రస్టీలుగా అయి ఉండడం ద్వారా గృహస్థ స్వరూపం స్వతహాగానే తొలగిపోతుంది. గృహస్థ స్థితే శ్రేష్ఠ జీవితము నుండి కిందకు తీసుకువస్తుంది. ట్రస్టీకి తనది అంటూ ఏదీ ఉండదు. ఎక్కడైతే నాది అనేది ఉండదో అక్కడ స్వతహాగానే నష్టోమోహులుగా ఉంటారు. సదా నిర్మోహులు అనగా సదా శ్రేష్ఠులు, సుఖములో ఉండేవారు. మోహములో దు:ఖము ఉంటుంది కావున నష్టోమోహులుగా అవ్వండి.

ప్రవృత్తివారితో - అందరూ ప్రవృత్తిలో ఉంటూ సదా అతీతమైన మరియు ప్రియమైన స్థితిలో ఉండేవారే కదా! ప్రవృత్తి యొక్క ఏ లౌకిక సంబంధము లేక లౌకిక వాయుమండలము, వైబ్రేషన్లోకి రావడం లేదు కదా! ఈ లౌకికత్వము యొక్క విషయాలన్నింటి నుండి అతీతముగా అయి అలౌకిక సంబంధములో, వాయుమండలములో, వైబ్రేషన్ లో ఉంటున్నారా? లౌకికత్వమైతే లేదు కదా! ఇంటి యొక్క వాయుమండలమును కూడా ఇలాగే అలౌకికముగా తయారుచేసారా? అది లౌకిక ఇల్లులా అనిపించకూడదు. సేవాకేంద్రము యొక్క వాయుమండలము అనుభవమవ్వాలి. ఎవరు వచ్చినా వారికి ఇది అలౌకికత, లౌకికత కాదు అని అనుభవమవ్వాలి. ఎటువంటి లౌకికత యొక్క అనుభూతి కలుగకూడదు. వచ్చేవారు ఇది సాధారణమైన ఇల్లు కాదు. ఇది మందిరము అని అనుభవం చేసుకోవాలి. ఇదే పవిత్ర ప్రవృత్తివారి సేవ యొక్క ప్రత్యక్ష స్వరూపము. స్థానమూ సేవ చేయాలి, వాయుమండలము కూడా సేవ చేయాలి.  సేవాకేంద్రములో ఎవరైనా ఏవైనా స్వభావ సంస్కారాలకు వశమై అటువంటి నడవడిక నడిస్తే అందరూ ఆ విధంగా ఉండకూడదు అనే అంటారు. అలాగే మీ ఇంటిస్థానములో కూడా ఈ స్థానములో అటువంటి కర్మ ఏదీ జరుగకూడదు అన్న అనుభూతి కలగాలి. ఇటువంటి భావన, మేము ఇటువంటి కర్మలు చేయకూడదు అని హృదయంలో కలగాలి. ఏ విధంగా సేవకేంద్రములో ఏవైనా లోపాలను చూస్తే వాటిని సరిచేస్తారు కదా! అలాగే మీ లౌకిక స్థానమును మరియు స్థితిని సరిచేసుకోవాలి. ఇల్లు మందిరములా కనిపించాలి, గృహస్థములా కాదు. ఏ విధముగా మందిరము యొక్క వాయుమండలము అందరినీ ఆకర్షిస్తుందో అలాగే మీ ఇంటినుండి పవిత్రత యొక్క సుగంధము రావాలి. ఏ విధముగా అగరబత్తి యొక్క సుగంధము నలువైపులా వ్యాపిస్తుందో అదే విధముగా పవిత్రత యొక్క సుగంధము దూరదూరాల వరకూ వ్యాపించాలి. దీనినే పవిత్ర ప్రవృత్తి అని అంటారు. అచ్చా!

Comments