17-03-1981 అవ్యక్త మురళి

17-03-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఈ సహజ మార్గంలో కష్టానికి కారణాలు, అందుకు నివారణ.

ఈ రోజు విశేషంగా డబుల్ విదేశీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చాము. డబల్ విదేశీయులు డబల్ భాగ్యశాలురు, ఎందుకు? ఒకటేమో బాప్ దాదాను తెలుసుకొని వారి వారసత్వానికి అధికారులుగా అయ్యారు. రెండవది - లాస్ట్ సో వచ్చినా ఫాస్ట్ గా వెళ్లి ఫస్ట్ లోకి వచ్చేందుకు చాలా పోటీ పడ్తున్నారు. కృషి చేస్తున్నారు. లాస్ట్ లో వచ్చేవారు ఏ లెక్కతోనైనా భాగ్యశాలురే. ఎందుకంటే అంతా రెడీగా తయరైన తర్వాత వచ్చారు. ముందు వచ్చిన పిల్లలు మననం చేశారు, వెన్న తీశారు, మీరంతా ఆ వెన్నను తినే సమయంలో వచ్చారు. ముందు వచ్చిన పిల్లలు దారిని ఏర్పరిచి తయారు చేసి అనుభవీలైపోయారు. కనుక మీకు చాలా చాలా సులభమైపోయింది. మీరంతా వారి అనుభవాల సహయోగంతో సులభంగా గమ్యానికి చేరుకున్నారు. కనుక డబల్ భాగ్యశాలురుగా అయ్యారు కదా. డ్రామానుసారము డబల్ భాగ్యమైతే లభించింది. అయితే మీరిప్పుడు ఏం చేయాలి ? ఇక ముందు ఏం చేయాలి?

ఎలాగైతే నిమిత్తముగా ఉన్న అనుభవీ మహారథులందరు తమ అనుభవాల ద్వారా మీ అందరికీ సేవ చేశారో, అలా మీరందరూ మీ అనుభవాల ఆధారముతో అనేకమందిని అనుభవీలుగా తయారు చేయాలి. అనుభవాలు వినిపించడం అన్నిటికంటే సులభమైనది.
జ్ఞాన పాయింట్లు ఏవైతే ఉన్నాయో, అవి కేవలం పాయింట్లుగా కాదు. ప్రతి పాయింటును అనుభవం చేయాలి. కనుక ప్రతి పాయింటు యొక్క అనుభవాన్ని వినిపించడం ఎంత సులభము! ఇంత సహజంగా అనుభవం చేస్తున్నారా లేక కష్టమనిపిస్తున్నాదా? ఒకటేమో అనుభవం ఆధారముగా ఉన్నందున సులభము. రెండవది, ఆది నుండి అంతము వరకు బాప్ దాదా ఒక కథ వలె వినిపిస్తున్నారు. కనుక కథ వినడం, వినిపించడం చాలా సులభం. తండ్రి ఇప్పుడేదైతే వినిపిస్తున్నారో, దానిని ఆత్మలైన మీరంతా మొదటిసారి వినడం లేదు. అనేకసార్లు విన్నారు. ఇప్పుడు మరలా రిపీట్ చేస్తున్నారు. కనుక ఏ విషయాన్ని అయినా రిపీట్ చేయుటకు, వినుటకు, వినిపించుటకు చాలా సులభంగా ఉంటుంది. కొత్తదైతే కష్టమనిపిస్తుంది. కాని చాలాసార్లు విన్న విషయాన్ని రిపీట్ చేయడం చాలా సులభంగా ఉంటుంది. స్మృతిలో చూడండి - ఎంత సమీపమైన స్మృతి! సమీప బంధు-మిత్రులను స్మృతి చేయడం కష్టమనిపించదు. వద్దనుకున్నా వారి స్మృతి వస్తూనే ఉంటుంది. ఇక ప్రాప్తిని చూడండి, ప్రాప్తి ఆధారముపై కూడా స్మృతి చేయడం చాలా సులభము. జ్ఞానము చాలా సులభము ఇప్పుడైతే అపురూప పిల్లలైన మీకు జ్ఞాన-యోగాలు చాలా సులభమైపోయాయి. జ్ఞానమిచ్చే కోర్సు 7 రోజులలోనే పూర్తి అవుతుంది. యోగ శిబిరము మూడు రోజులలోనే పూర్తయిపోతుంది. కనుక సాగరాన్ని బిందెలో ఇమిడ్చివేశారు. సాగరాన్ని ఎత్తడం కష్టము కానీ బిందెను ఎత్తడం కష్టము కాదు. మీకు సాగరాన్ని బిందెలో ఇమిడ్చి కేవలం బిందెనిచ్చారు అంతే. రెండు శబ్దాలలో జ్ఞాన యోగాలు రెండూ వచ్చేస్తాయి. ఆప్ ఔర్ బాప్(మీరు, మీ తండ్రి). కనుక ఈ రెండు శబ్దాలలోనే యోగమూ వచ్చేసింది, జ్ఞానము కూడా వచ్చేసింది. ఈ రెండు శబ్దాలను ధారణ చేయడం ఎంత సులభము! అందువలన దీని టైటిలే సహజ రాజయోగము. పేరు ఎలా ఉందో అలానే అనుభవం చేస్తున్నారా? ఇంతకంటే సులభమైనదేదైనా ఉంటుందా? అయితే కష్టమని ఎందుకు అనిపిస్తుంది? అందుకు కారణం మీలోని బలహీనతలే. ఏదో ఒక పాత సంస్కారము సులభ మార్గం మధ్యలో బంధనమై ఆటంకము కలిగిస్తుంది. శక్తి లేనందున రాయిని పగులగొట్టేందుకు ప్రయత్నిస్తారు. అలా పగులగొడుతూ పగులగొడుతూ వ్యాకులపడతారు. అయితే సులభ పద్ధతి ఏది? రాయిని పగులగొట్టరాదు, పైకెగిరి దాటిపోవాలి. ఇలా ఎందుకు జరిగింది? ఇలా జరిగి ఉండరాదు, ఇలా ఎంత వరకు జరుగుతుంది? ఇది చాలా కష్టము, ఇలా ఎందుకు జరిగింది? మొదలైన వ్యర్థ సంకల్పాలు చేయడమే రాయిని పగులగొట్టడం కానీ డ్రామా అనే ఒక్క శబ్దము గుర్తు వచ్చిందంటే, ఈ డ్రామా శబ్దము ఆధారముతో హైజంప్ చేస్తారు. దానితో అనగా పగులగొట్టేందుకు కొన్ని రోజులు లేక నెలలు పడుతుంది. కనుక ఇది మీ బలహీనత, జ్ఞానానిది కాదు. 

రెండవ బలహీనత ఏమంటే సమయానికి ఆ పాయింట్ టచ్ కాదు(జ్ఞాపకం రాదు). పాయింట్లు బుద్ధిలో లేక డైరీలో చాలా ఉంటాయి. కానీ సమయమనే డైరీలో ఆ సమయంలో ఆ పాయింటు కనిపించదు. దీని కొరకు జ్ఞానములోని ముఖ్యమైన పాయింట్లు ప్రతిరోజూ రివైజ్ చేస్తూ ఉండండి. అనుభవంలోకి తీసుకొస్తూ ఉండండి. చెక్ చేసుకుంటూ ఉండండి (పరివర్తన చేసుకుంటూ ఉండండి). అప్పుడిక ఎప్పుడూ సమయం వృధా కాదు. అంతేకాక కొద్ది సమయంలోనే చాలా అనుభవాలు అవుతాయి. సదా స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేస్తారు. అర్థమయ్యిందా. ఇప్పుడు, ఎప్పుడూ వ్యర్థ సంకల్పాలనే సుత్తితో సమస్యలనే రాతిని పగులగొట్టకండి. ఇప్పుడీ కూలి పని చేయడం వదిలేయండి, చక్రవర్తులుగా కండి. హృదయ సింహాసనాధికారులుగా కండి, కిరీటధారులుగా కండి, తిలకధారులుగా కండి

జర్మనీ వారితో:- సహజ జ్ఞాన యోగాల అనుభవీ మూర్తులుగా అయ్యారా? బాప్ దాదా ప్రతీ శ్రేష్ఠ ఆత్మ భాగ్యాన్ని చూస్తున్నారు. ఎలాగైతే బాబా ప్రతి ఒక్కరి మస్తకముపై ప్రకాశిస్తున్న నక్షత్రాన్ని(ఆత్మను) చూస్తున్నారు, అలా మీరు కూడా మీ మస్తకంపై సదా ప్రకాశిస్తున్న నక్షత్రాన్ని చూసుకుంటున్నారా? నక్షత్రము మెరుస్తూ ఉందా? ప్రకాశిస్తున్న నక్షత్రాన్ని మాయ ఎప్పుడైనా కప్పివేయడం లేదు కదా? మాయ వస్తూ ఉందా? మాయాజీతులై జగత్ జీతులుగా ఎప్పుడవుతారు? ఈ రోజు ఇప్పుడే దృఢ సంకల్పం చేయండి - మాస్టర్ సర్వశక్తివంతుడనై, మాయాజీత్ గా అయ్యే చూపిస్తాను. ధైర్యముంది కదా. ధైర్యముంచితే బాప్ దాదా కూడా తప్పక సహాయము చేస్తారు. ఒక అడుగు వేయడం సులభమే కదా. కనుక ఈ రోజు నుండి అందరూ సహజ యోగులనే టైటిల్ ను వరదాన భూమి నుండి వరదాన రూపంలో తీసుకెళ్ళండి. ఇది జర్మన్ గ్రూపు కాదు. సహజయోగీ గ్రూపు. ఏ సమస్య వచ్చినా కేవలం తండ్రికి వదిలేయండి(అప్పగించండి) అత్యంత ప్రీతితో 'బాబా' అని అనండి. ఆ సమస్య సమాప్తమైపోతుంది. 'బాబా' అనే శబ్దాన్ని హృదయపూర్వకంగా అనడమే ఒక ఇంద్రజాలము. మీకు ఇంత శ్రేష్ఠమైన ఇంద్రజాల శబ్దము లభించింది. అయితే మాయ వచ్చిందంటే, అది ఆ సమయంలో మరపింపజేస్తుంది. మాయ మొట్టమొదట తండ్రిని మరపింపజేసే పని చేస్తుంది. అందువలన దీనిపై గమనముంచాల్సి వస్తుంది. అటెన్షన్ ఉంచినారంటే సదా కమలపుష్ప సమానంగా స్వయాన్ని అనుభవం చేస్తారు. మాయ కల్పించే సమస్యల మురికి ఎంత ఎక్కువగా ఉన్నా మీరు స్మృతి ఆధారముతో మురికి నుండి సదా దూరంగా ఉంటారు. కమలపుష్పము మీ చిత్రమే కదా. అందుకే జర్మనీ వారు తమ ప్రదర్శనలో కమలపుష్పాన్ని తయారుచేశారు. కేవలం బ్రహ్మాబాబా ఒక్కరే కూర్చొని ఉన్నారా? లేక మీరు కూడా కూర్చొని ఉన్నారా? మీ ఆసనం కమల పుష్ప స్టేజి(స్థితి). ఆసనాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ఉంటే సదా నవ్వుతూ ఒకే మూడ్ లో ఛీయర్‌ ఫుల్ గా ఉంటారు. అందరూ మిమ్ములను చూచి వీరు సదా సహజ యోగులు, సదా ఛీయర్ గా(సంతోషంగా) ఉంటారని మహిమ చేస్తారు. సదా బాబా శబ్దము యొక్క ఇంద్రజాలాన్ని స్థిరంగా ఉంచుకోండి. ఈ మాయ విషయాలు గుర్తుంచుకోండి. జర్మనీ వారి విశేషత ఏమంటే - చాలా ప్రేమతో పరుగెత్తుకుంటూ, ఆకర్షితులవుతూ మధువనానికి వచ్చారు. మధువనంపై ప్రేమ అనగా తండ్రిపై ప్రేమ. బాప్ దాదాకు కూడా పిల్లలపై అంతే ప్రేమ ఉంది. తండ్రికి పిల్లలపై ఎక్కువ ప్రేమ ఉందా?(తండ్రికి పిల్లలపై). మీకు కూడా తండ్రి కంటే పదమా రెట్లు ఎక్కువ ప్రేమ ఉంది. తండ్రి సదా పిల్లలను ముందుంచుతారు కదా. పిల్లలు తండ్రికి కూడా యజమానులే. ఎందుకంటే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు, తండ్రి యజమానులుగా చేస్తారు. వారు యజమానిగా కారు. కనుక మీరు తండ్రి కంటే ముందున్నారు కదా.
పిల్లలంటే తండ్రికి ఇంత ప్రేమ ఉంది. ఒక్క జన్మకు కాదు. 21 జన్మల భాగ్యము అది కూడా అవినాశి భాగ్యము. ఇది గ్యారంటీ కదా.

జర్మన్ గ్రూప్ వారు అద్భుతం చేసి చూపించాలి. ఎలాగైతే ఇప్పుడు కష్టపడి గీతా భగవానుని చిత్రాన్ని తయారు చేశారో, అలా ఎవరైనా పేరు ప్రఖ్యాతులు గల వ్యక్తి వచ్చారంటే, అతని ద్వారా గీతా భగవంతుడు శివుడు అనే మాట వ్యాపించాలి. బాప్ దాదా పిల్లల శ్రమను చూసి చాలా చాలా అభినందనలు తెలుపుచున్నారు. చాలా మంచి టాపిక్ ను ఎన్నుకున్నారు. ఈ టాపిక్ ను ఋజువు చేశారంటే విశ్వములో జయ జయ ధ్వనులు వ్యాపిస్తాయి. ఇప్పుడు ఎలాగైతే అలా ఇంకా ఎక్కువగా శ్రమించి శబ్దాన్ని పెద్దగా వ్యాపింపజేయాలి. బాగా విచార సాగర మథనం చేశారు. చిత్రాన్ని చాలా బాగా తయారు చేశారు.

ప్రశ్న :- బాప్ దాదా ఏ ఆధారముతో ప్రతీ స్థానము యొక్క ఫలితాన్ని చూస్తారు?
సమా :- ఆ స్థానము యొక్క వాయుమండలము లేక స్థితి ఎలా ఉందో, దాని ఆధారముతోనే బాప్ దాదా ఆ స్థానము యొక్క రిజల్టును చూస్తారు. ఒకవేళ కఠినమైన భూమి నుండి లేక బంజరు భూమి నుండి రెండు పుష్పాలు వచ్చినా అవి 100 పుష్పాల కంటే ఎక్కువ. బాబా రెండుగా చూడరు. ఆ రెండు కూడా 100కి సమానంగా చూస్తారు. ఎంత చిన్న సేవా కేంద్రమైనా, చిన్నదని భావించకండి. కొన్నిచోట్ల క్వాలిటీ(మంచి ధారణ చేయు ఆత్మలు) ఉంది. కొన్ని చోట్ల క్వాంటిటీ(సంఖ్యలో ఎక్కువ మంది) ఉంది. పిల్లలైన మీరు ఎక్కడికి వెళ్లినా అక్కడ సఫలత మీ జన్మసిద్ధ అధికారము.

ప్రశ్న :- ఏ డబల్ స్వరూపంతో సేవ చేస్తే వృద్ధి జరుగుతూ ఉంటుంది?
సమా:- రూపము మరియు బసంత్ (జ్ఞాన-యోగాలు). ఈ రెండు స్వరూపాలతో సేవ చేయండి. దృష్టితో సేవ మరియు నోటితో కూడా సేవ చేయండి. ఒకే సమయంలో రెండు రూపాలతో సేవ చేస్తే డబల్ రిజల్టు వస్తుంది.

నైరోబియా పార్టీతో :- సదా లాస్ట్ నుండి ఫస్ట్ లోకి వెళ్ళే దీపము ముందు దీపపు పురుగులు సదా కొరకు కాలిపోయి మరజీవాగా అగుటలో సదా తెలివైనవారు. పక్కా దీపపు పురుగులు కదా? దీపపు పురుగులను చూచి, దీపము(బాబా) కూడా సంతోషిస్తారు. ఇటువంటి దీపపు పురుగులను చూచి దీపము కూడా గర్వపడతారు. కనుక మీరు సదా తండ్రి స్మృతి స్వరూప పిల్లలు. ఎలాగైతే మీరు తండ్రిని స్మృతి చేస్తారో అలా తండ్రి కూడా మిమ్ములను స్మృతి చేస్తారు. మీరు తండ్రికి పరోక్షంగా జడ చిత్రాల ద్వారా చైతన్యానికి మాలలు ధరింపజేయుటకు ప్రయత్నించారు, బాప్ దాదా పిల్లల గుణాల మాలను స్మృతి చేస్తూ ఉంటారు. కనుక మీరు ఎంత అదృష్టవంతులు? తండ్రిని ఆత్మలు స్మృతి చేస్తారు, కానీ మహాన్ ఆత్మలైన మిమ్ములను తండ్రి స్మృతి చేస్తారు. అందువలన తండ్రి కంటే ఉన్నతమైన వారైపోయారు. అందుకే పిల్లల స్థానము తండ్రి కిరీటముపై ఉంది. కిరీటము కంటే విలువైనవి మణులు. నిజమైన మణులు లేక నిజమైన వజ్రాలు ఎంతగా ప్రకాశిస్తాయి! ఈ రోజులలో సత్యమైన ముత్యాలు కూడా అసత్యమైన వాటికి సమానంగా ఉన్నాయి. సత్యయుగములో ప్రతి ముత్యము బల్బు వలె కాంతినిస్తుంది. చాలా మెరిసిపోతూ ఉంటుంది. ఇక్కడ వివిధ రంగుల కాంతి కొరకు బల్బుల పైన ఆయా రంగు కాగితాలు చుట్టారు. అక్కడ ఎన్ని రంగుల వజ్రాలుంటాయో అన్నీ భిన్న భిన్నమైన న్యాచురల్ రంగుల కాంతి వస్తుంది. ప్రకాశము కొద్దిగా వచ్చినా గది అంతా ప్రకాశవంతముగా అనుభవమవుతుంది. కనుక మీరంతా బాప్ దాదా కిరీటములోని సత్యమైన వజ్రాలు. ఒకటేమో ప్రకాశించే హీరా(వజ్రము), ఒకటేమో శ్రేష్ఠమైన ముఖ్యమైన పాత్రను అభినయించేవారు అనగా హీరో, హీరోయిన్లు. సదా మేము డబల్ హీరా అనే నశాలో ఉండండి.

నైరోబీ వారి సుగంధము వతనము వరకు వస్తూ ఉంది. ధైర్యము గల పిల్లలు. ఇంత పెద్ద గ్రూపు వచ్చారంటే అది ధైర్యానికి ఋజువు కదా. నైరోబివారు తండ్రి సమానమైన సేవాధారులని ఋజువైపోతుంది అందుకే కదా సేవ చేసి అందరినీ ఇంతవరకు తీసుకొచ్చారు. ఇది సేవకు ప్రత్యక్ష ఋజువు. దృఢ నిశ్చయానికి ఫలము లభించింది కదా. నిశ్చయ బుద్ధిగలవారుగా అయ్యారు. తండ్రి సహాయము ద్వారా అసంభవము సంభవమైపోయింది. చిన్న కుటీరము నుండి పెద్ద మహలు లభించింది. బాప్ దాదా తన మహలును (సెంటరును) చూచారు. బాప్ దాదా తన పనిని వదిలేయరు. తండ్రి సదా పిల్లలను సంభాళిస్తూనే ఉంటారు. లౌకికములో కూడా తల్లి తన పిల్లలకు సమీపంగానే తిరుగుతూ ఉంటుంది, ఎందుకంటే పిల్లలపై ప్రేమ, స్నేహము ఉంది. కనుక బాప్ దాదా లేక మాత-పితలు పిల్లల వద్దకు రాకుండా ఎలా ఉంటారు? అందువలన ప్రతి రోజూ పిల్లల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. బాప్ దాదా ఇరువురూ సాకార శరీరము నుండి అశరీరులుగా అయ్యారు. ఒకరేమో అవ్యక్త శరీరధారి(బ్రహ్మ), మరొకరు నిరాకారులు. ఇరువురికీ నిదురించే అవసరమే లేదు. అందువలన ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడకు చేరుకోగలరు.

ఇప్పుడు ఆఫ్రికాలో ఎన్ని సెంటర్లున్నాయి? ఆఫ్రికా వైశాల్యములో చాలా పెద్దది. అన్ని చోట్లకు వెళ్ళండి. సేవను ముందుకు తీసుకెళ్తూ పోండి. అలా చేస్తూ ఉంటే ఎవ్వరూ మీపై ఫిర్యాదులు చేయరు. అంతే కాదు, అన్ని చోట్లా సేవాకేంద్రాలు తెరవాలి. సేవ చేసి సందేశమిచ్చి గీతా పాఠశాలలు తెరుస్తూ ముందుకు సాగుతూ పోండి.

టీచర్లతో :- టీచర్లంటేనే తండ్రి సమానం తమ సంకల్పాలు, మాటలు, కర్మల ద్వారా అనేక మందిని పరివర్తన చేయువారు. కేవలం మాటలతోనే కాదు, సంకల్పాలు, కర్మలతో కూడా సేవాధారులు. ఎవరైతే మూడు సేవలలో సఫలతా మూర్తులుగా ఉంటారో, వారే గౌరవప్రదంగా ఉత్తీర్ణులైపోతారు. మూడింటిలో మార్కులు సమానంగా ఉండాలి. కనుక మీరు ఇలా పాస్ విత్ ఆనర్ గా అయ్యే టీచర్లు కదా? పాస్ అయ్యేవారు. చాలామంది ఉంటారు, కాని పాస్ విత్ ఆనర్ గా విశేషమైనవారే అవుతారు. కనుక ఏ లక్ష్యముంచుకున్నారు? ప్రతిరోజు మీ దినచర్యను ఈ మొత్తం రోజంతటిలో మూడు సేవలలో బ్యాలన్స్ ఉండినదా? అని చెక్ చేసుకోండి. బ్యాలన్స్ ఉంచుకుంటే అన్ని గుణాలు అనుభవం చేస్తూ ఉంటారు. నడుస్తూ తిరుగుతూ స్వయానికి, సర్వులకు సర్వ గుణాలను అనుభవం చేయించగలరు. అందరూ - వీరు గుణదానము చేస్తారని అంటారు. ఎందుకంటే దివ్యగుణాల శృంగారము స్పష్టంగా కనిపిస్తుంది. చివర్లో అందరూ - “దేవిగారు, దేవిగారు” అని నమస్కరిస్తారు. ఈ చివరి సంస్కారమే ద్వాపరము నుండి దేవీ పూజ రూపంలో నడుస్తుంది. కనుక మీరిలా ఉన్నారు కదా? ఒకరికొకరు తండ్రి గుణాల లేక స్వయం ధారణ చేసిన గుణాల సహయోగమునిస్తూ గుణమూర్తులుగా తయారు చెయ్యాలి. ఇది అన్నిటి కంటే గొప్పలో గొప్పదైన సేవ. గుణదానము కూడా ఉంచి ఎలాగైతే జ్ఞానదానముందో అలా గుణదానము కూడా ఉంది.
ఇప్పుడు ఒక్కొక్కరు 8-8, 10-10 సెంటర్లు సంభాళించవలసి వస్తుంది. అలా చేస్తే సేవ బాగా జరిగిందని అంటారు. ఇప్పుడు ఒక్కొక్క సెంటరును 4-5 మందిని సంభాళిస్తున్నారు, తర్వాత ఒక్కొక్కరు అనేక సెంటర్లను సంభాళించవలసి వస్తుంది. ఇప్పుడు సేవను ఇంకా ముందుకు తీసుకెళ్ళండి.

Comments