16-05-1977 అవ్యక్త మురళి

* 16-05-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మాయ యొక్క యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు రెండు శక్తుల యొక్క అవసరం ఉంది.

బాప్ దాదా పిల్లలందరి పురుషార్ధంలోని వేగం యొక్క రిజల్టును చూస్తున్నారు. కొత్తవారు, పాతవారు ఇరువురి పురుషార్ధం యొక్క వేగమును చూస్తూ బాబాకు పిల్లలపై అతి స్నేహం కలిగింది మరియు దానితో పాటు దయ కూడా కలిగింది. స్నేహం ఎందుకు కలిగింది? చిన్నవారు, పెద్దవారు అంతా పరిచయం దొరకగానే పరిచయంతో పాటు తమ యథాశక్తి ప్రాప్తి యొక్క ఆధారముపై, గత జీవితము మరియు వర్తమాన బ్రాహ్మణ జీవితము ఈ రెండింటిలోనూ ఎంతో తేడాను అనుభవం చేసుకుంటూ భ్రమించేవారికి దొరికిన ఆధారమును చూస్తూ నిశ్చయ బుద్ధులుగా అయి పరస్పర సహయోగంతో పరస్పర అనుభవాల యొక్క ఆధారముతో తమ లక్ష్యం వైపుకు నడుస్తున్నారు. సంతోషము, శక్తి, శాంతి లేక సుఖము యొక్క అనుభూతిలో ప్రాపించిక లోక మర్యాదలను లెక్కచేయకుండా అలౌకిక జీవితము యొక్క అనుభవమనే పాదమును ముందుకు వేస్తూ ఉన్నారు. ప్రాప్తి కొరకు కొంత వదులుతున్నారు లేక త్యాగం చేస్తున్నారు. బాహ్యమైన స్పృహ ఉండదు. బాబా దొరకడంతో సర్వస్వం లభించింది. ఆ నషా లేక సంతోషములో త్యాగం కూడా త్యాగంగా అనిపించదు. స్మృతి మరియు సేవలలో తనువు, మనస్సు, ధనములతో నిమగ్నమైపోతారు. మొదటి నషా, మొదటి సంతోషము, మొదటి ఉల్లాసము, మొదటి ఉత్సాహము అతి ప్రియముగా అనుభవం చేసుకుంటున్నారు. ఈ త్యాగం మరియు ఆదికాలం యొక్క నషా త్రికాలదర్శీ మాస్టర్ జ్ఞానసాగర్, మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి యొక్క మొదటి ఆవేశములో ఏ విషయాల యొక్క స్పృహ లేదు. పురాతన ప్రపంచము యొక్క సర్వస్వము తుచ్ఛమైనదిగా, నిస్సారముగా అనుభవమవుతుంది. ప్రతి ఒక్కరి ఈ మొదటి స్థితిని చూస్తూ, ప్రతి ఒక్కరూ బాబా కోసం ఎంతటి త్యాగం మరియు లగ్నముతో ముందుకు వెళ్ళేందుకు పురుషార్ధం చేస్తున్నారు! అని ప్రతి ఒక్కరి మొదటి స్థితిని చూస్తూ ఎంతో స్నేహము కలిగింది. ఇటువంటి త్యాగమూర్తులు, జ్ఞానమూర్తులు మరియు నిశ్చయబుద్ది పిల్లలపై బాప్ దాదా కూడా తమ సర్వ సంపద సహితముగా బలిహారమయ్యారు. బాబా, మేము మీ వారము అని పిల్లలు ఏ విధంగా సంకల్పము చేసారో అలాగే బాబా కూడా దానికి జవాబుగా బాబా వద్ద ఏదుందో అదంతా మీదే అని అంటారు. ఇటువంటి అధికారులుగా కూడా అయ్యారు, కానీ, ముందు ముందు ఏం జరుగుతుంది? నడుస్తూ నడుస్తూ మహావీరులుగా అనగా ఆత్మిక యోధులుగా అయి మాయను ఎదిరిస్తారు. విజయులుగా అవుతాము అన్న అధికారమును కూడా గుర్తుంచుకుంటారు కానీ, మాయ యొక్క అనేక రకాలైన యుద్ధాలను ఎదుర్కొనేందుకు రెండు విషయాల యొక్క లోపము ఏర్పడుతుంది. ఆ రెండు విషయాలు ఏమిటి? ఒకటేమో ఎదుర్కొనే శక్తి లో లోపము, రెండవది పరిశీలనా మరియు నిర్ణయము యొక్క శక్తి లో లోపము. ఈ లోపాల యొక్క అనేకరకాలైన యుద్ధాలలో కాసేపు ఓటమి, కాసేపు విజయము కలుగుతున్న కారణంగా కాసేపు ఆవేశములోకి, మరికాసేపు స్పృహలోకి వస్తూ ఉంటారు. ఎదుర్కొనే శక్తిలో లోపము ఉండటానికి కారణమేమిటి? బాబాను సదా తోడుగా చేసుకోవడం రాకపోవడం. ఆ తోడుని ఉపయోగించుకోవడం రాకపోవడం. దీనికి సహజమైన విధానము అధికారి స్వరూపము యొక్క స్థితి. కావున బలహీనులుగా ఉండటం చూసి మాయ తన యుద్ధం మొదలు పెడుతుంది. 

పరిశీలనా శక్తి యొక్క లోపానికి కారణం ఏమిటి? బుద్ధి యొక్క ఏకాగ్రత లేకపోవడం. వ్యర్థ సంకల్పాలు లేక అశుద్ధ సంకల్పాల యొక్క అలజడి ఉంటుంది. ఒకరిలో సర్వరసాలను అనుభవం చేసుకొనే ఏకరసస్థితి ఉండదు. అనేక రసాలలో బుద్ది మరియు స్థితి ఊగిసలాడుతూ ఉంటుంది. ఈ కారణంగా పరిశీలనా శక్తి తగ్గిపోతుంది మరియు సరిగ్గా పరిశీలించని కారణంగా, మాయ తన గిరాకిగా చేసుకుంటుంది. ఇది మాయ అన్నది కూడా పరిశీలించలేరు. ఇది తప్పు అని కూడా తెలుసుకోలేరు. దాంతో ఇంకా మాయకు గ్రాహకులుగా లేక మాయకు మిత్రులుగా అయిపోయి బాబా ముందు లేక నిమిత్తులుగా అయి ఉన్న ఆత్మల ముందు కూడా తమ తెలివిని ప్రదర్శిస్తూ ఇది జరుగుతూనే ఉంటుంది, ఎప్పటివరకైతే సంపూర్ణులుగా అవ్వమో అప్పటివరకూ ఈ విషయాలు జరుగుతూనే ఉంటాయి అని అంటారు. ఇటువంటి అనేకరకాలైన విచిత్రమైన పాయింట్లను మాయ వైపు నుండి వకీలులుగా అయి బాబా ముందు లేక నిమిత్తమయి ఉన్న వారి ముందు ఉంచుతారు. ఎందుకంటే మాయకు మిత్రులుగా అయిన కారణంగా అపోజిషన్ పార్టీకి చెందినవారిగా అయిపోతారు. మాయాజీతులుగా అవ్వవల్సిన పొజిషన్ ను వదిలివేస్తారు. దానికి కారణం? పరిశీలనా శక్తి లో లోపము.

ఇటువంటి అద్భుతమైన మరియు రమణీయమైన కేసులు బాబా ముందుకు ఎన్నో వస్తాయి. పాయింట్లు కూడా చాలా చాలా బాగుంటాయి. క్రొత్త క్రొత్త ఇన్వెన్షన్లను కనుగొంటూ ఉంటారు. ఎందుకంటే వారికి వెన్నెముకగా మాయ ఉంటుంది. ఎప్పుడైతే బాప్ దాదా పిల్లల
యొక్క ఇటువంటి స్థితిని చూస్తారో అప్పుడు వారికి దయ కలుగుతుంది. బాబా నేర్పిస్తారు మరియు పిల్లలు చిన్న తప్పు యొక్క కారణంగా ఏం చేస్తారు? చిన్న తప్పును చేస్తారు, శ్రీమతంలో మన్మతమును కలిపివేస్తారు. దానికి కారణమేమిటి? నిర్లక్ష్యము మరియు బద్దకము, అనేక రకాలైన మాయ యొక్క ఆకర్షణలకు ఆకర్షితులవ్వడము. కావుననే మొదట ఉన్న ఉత్సాహము, ఉల్సాసము నడుస్తూ నడుస్తూ మాయాజీతులుగా అయ్యే సంపూర్ణ శక్తి లేని కారణంగా తగ్గిపోతుంది. పురుషార్థహీనులుగా అయిపోతారు. ఏం చేయాలి, ఎప్పటివరకూ చేయాలి, ఇలా జరుగుతుందని అసలు తెలియదు ఇలా వ్యర్థ సంకల్పాల యొక్క వలయాలలోకి వచ్చేస్తారు. కానీ ఈ విషయాలన్నీ సైడ్ సీన్ వంటివి, అనగా దారిలో కనిపించే దృశ్యాల వంటివే కానీ గమ్యము కాదు. వీటన్నిటినీ దాటివేయాలే కానీ వీటినే గమ్యముగా భావిస్తూ ఆగిపోకూడదు. కానీ చాలామంది పిల్లలు దీనినే తమ గమ్యముగా అనగా నా పాత్రయే ఇది లేక నా భాగ్యములో ఇదే ఉంది అని అంటూ ఇటువంటి దారిలో కనిపించే దృశ్యాలనే గమ్యముగా భావిస్తూ వాస్తవిక గమ్యము నుండి దూరమైపోతారు. కానీ ఉన్నతమైన గమ్యము పైకి చేరుకొనేందుకు ముందు ఎన్నో గాలివానలు, తుఫానులు వస్తాయి. స్టీమరు అటువైపుకు వెళ్ళేందుకు నడి సముద్రమును దాటి వెళ్ళవల్సి ఉంటుంది. కావున అంత తొందరగా కంగారుపడకండి, అలిసిపోకండి, ఆగిపోకండి. మిత్రుని తోడుగా ఉంచుకున్నట్లయితే ప్రతి కష్టము సహజమైపోతుంది. ధైర్యవంతులుగా అయినట్లయితే సహాయము తప్పక లభించి తీరుతుంది. తండ్రినే చూడండి, తండ్రినే అనుసరించండి. అప్పుడు సదా సహజంగా, ఉల్లాస ఉత్సాహాలతో కూడుకున్న జీవితమును అనుభవం చేసుకుంటారు. దారిలో వెళుతూ ఏ వ్యక్తిని లేక వైభవమును ఆధారముగా చేసుకోకండి. ఆ ఆధారాలు స్వయం నశ్వరమైనవి. మరి అవి అవినాశీ ప్రాప్తిని ఎలా కలిగించగలవు? 'ఒకే బలము, ఒకే విశ్వాసము' అన్న పాఠమును సదా పక్కాగా ఉంచుకోండి. అప్పుడు నడి సముద్రము నుండి సహజంగా దాటి వెళ్ళగల్గుతారు మరియు గమ్యమును సదా అనుభవం చేసుకుంటారు.

విన్నారా, ఇది పురుషార్థుల యొక్క రిజల్టు. మెజార్టీ నడి సముద్రంలో చిక్కుకుంటున్నారు. కానీ ఈ విషయాలన్నింటినీ, మీరు గమ్యాన్ని చేరుకోవటంలో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళేందుకు వచ్చే శుభసూచికాలుగా భావించండి అని బాబా అంటారు. వినాశనాన్ని
శుభసూచికమని, కళ్యాణకారి అని ఏ విధంగా అంటారో అలాగే ఈ పరీక్షలు కూడా పరిపక్వముగా చేసేందుకు ఆధారములు. మార్గమును దాటి ముందుకు వెళుతున్నారు అన్న దానికి ఇవే గుర్తులు. ఈ విషయాలన్నింటినీ చూస్తూ అలజడి చెందకండి. సదా ఇప్పుడిక లక్ష్యాన్ని చేరుకున్నట్లే అన్న సంకల్పమునే ఉంచండి, అర్థమైందా?

ఏ విధంగా కరెంటు పదే పదే పోతుంటే ఎవరికీ నచ్చదో అలాగే ఏక రస స్థితియే ఏ విధంగా నచ్చుతుందో అలాగే బాబాకు కూడా పిల్లల యొక్క ఏకరస స్థితియే నచ్చుతుంది. ఈ ప్రకృతి ఆటలాడుతుంది. కానీ మీరు కూడా అలా ఆటలాడకండి. సదా అచలముగా, అటలముగా, కదలికలేని విధంగా ఉండండి..

ఇటువంటి మాస్టర్ జ్ఞాన స్వరూపులకు, సదా విజయులుగా, సదా హర్షితముగా ఉండేవారికి మాయ యొక్క సర్వ ఆకర్షణల నుండి అతీతంగా ఉండేవారికి, లక్ష్యానికి చేరువగా వచ్చిన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

సేవా ధారీ గ్రూపుతో అవ్యక్త బాప్ దాదా : - ఎంత భవిష్యత్తును జమా చేసుకున్నారు? సేవకు ఫలము తప్పక లభిస్తుంది. అనగా ఏదైతే చేస్తారో దానికి వేల రెట్లు ఎక్కువగా జమా అవుతుంది. ఒక బీజము వేస్తే ఎన్నో ఫలాలు వెలువడతాయే కానీ ఒకే ఫలము వెలువడదు కదా! బీజమును ఒకటే వేస్తారు, కానీ ఫలములు ప్రతి సీజన్లోనూ లభిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ సేవ యొక్క ఫలము కూడా వేల రెట్లుగా జమా అవుతుంది మరియు ప్రతి జోన్ లోనూ లభిస్తూ ఉంటుంది. మనసా వాచా కర్మణా మూడు రకాలైన సేవలను ప్రతి ఒక్కరూ చేసారా? వాణి మరియు కర్మ యొక్క సేవతో పాటు మనసా శుభ సంకల్పముల ద్వారా, శ్రేష్ఠ వృత్తి ద్వారా కూడా ఎంతో సేవను చేయవచ్చు. మూడు సేవలను ఒకేసారి చేయకపోతే ఫలము అంత ఎక్కువగా ఫలీ భూతమవ్వదు. వర్తమాన సమాయానుసారంగా మూడు రకాల సేవలు ఒకేసారే జరగాలి గానీ వేరు వేరుగా కాదు... ఎప్పుడైతే మనస్సు శక్తిశాలిగా అవుతుందో అప్పుడు వాణిలో కూడా శక్తి వస్తుంది. లేకపోతే కేవలం వినిపించే పండితులుగా మాత్రమే అయిపోతారు. పండితులు కథను ఎంతో బాగా వినిపిస్తారు. కానీ వారిని పండితులు అనే ఎందుకంటారు? ఎందుకంటే చిలకల వలే చదివి వినిపిస్తూ ఉంటారు. జ్ఞానులు అనగా వివేకవంతులు, వివేకవంతులు సేవ చేయడం ద్వారా సఫలత లభిస్తుంది. వివేకవంతులైన పిల్లలు మూడు రకాలైన సేవలను కలిపి చేస్తారు. ధ్యానము చిత్రాలవైపు ఉండదు, అది బాబావైపు ఉంటుంది. అలాంటప్పుడు మూడు రకాల సేవలు ఒకేసారి జరుగుతాయి.

డ్యూటీగా భావిస్తూ సేవ చేసినట్లయితే ఆత్మలకు ఆత్మిక స్మృతి కలగదు. వారు కూడా వినడమును ఒక డ్యూటీగా భావిస్తూ విని వెళ్ళిపోతారు. దయాద్రహృదయులుగా అయి, దయ యొక్క భావనను ఉంచి సేవ చేసినట్లయితే ఆత్మలు జాగృతమయిపోతాయి. వారికి కూడా మీపై దయ కలుగుతుంది. మేము ఏదైనా చేయాలి అని అనిపిస్తుంది. బాబా పిల్లలు ఎల్లప్పుడు ముందుకు వెళ్ళేందుకే సంజ్ఞ చేస్తూ ఉంటారు. ఎంతైతే చేసారో అది డ్రామానుసారంగా చాలా బాగా చేసారు. బాగా శ్రమించారు, సమయమును ఇచ్చారు. దాంతో వర్తమానమూ జమా అయింది మరియు భవిష్యత్తు కొరకూ జమా అయింది. అచ్ఛా! 

Comments