16-02-1978 అవ్యక్త మురళి

* 16-02-1978         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విశ్వము యొక్క అధికారులుగా అయి సర్వులచే సత్కరింపబడువారిగా అవ్వండి.

ఈరోజు బాప్ దాదా పిల్లల ప్రతి ఒక్కరి నయనాల ద్వారా, మస్తకము యొక్క రేఖల ద్వారా విశేషమయిన విషయాన్ని చూస్తున్నారు, అది ఏ విషయమై ఉంటుందో మీకు తెలుసా? దానిని బాబా ద్వారా 21 జన్మల కొరకు ఏమి లభిస్తుందో పరిచయములో ఇతరులకు వినిపిస్తారు. ఛాలెంజ్ చేస్తారు కదా! ఎవర్ హెల్దీ, వెల్దీ మరియు హ్యాపీ అనగా సదా ఆరోగ్యము, సంపద మరియు ఆనందము ఈ మూడింటి యొక్క ప్రాప్తి వర్తమాన సమయము యొక్క ప్రాప్తి అనుసారంగా 21 జన్మలు పొందుతారు. ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి ప్రాప్తి యొక్క రేఖలను మస్తకము మరియు నయనాల ద్వారా చూస్తున్నారు. ఇప్పటివరకూ ఛాలెంజ్ అనుసారంగా 'సదా' అన్న శబ్దము ప్రత్యక్ష రూపంలో ఎంతవరకూ ఉంది? ఛాలెంజ్ లో కేవలం ఆరోగ్యము మరియు సంపద అని అనరు, సదా ఆరోగ్యము, సదా సుసంపన్నము అని అంటారు. మొదట వర్తమానము మరియు ఆ వర్తమానము యొక్క ఆధారముపై భవిష్యత్తు ఉంటాయి కావున “సదా' అన్న శబ్దమును అండర్ లైన్ చేసి రిజల్టు ఎలా ఉందో చూస్తున్నారు. ఈ మాటలు వర్తమానానికి చెందినవా లేక భవిష్యత్తుకి చెందినవా? సేవ కొరకు ఇటువంటి స్థితి యొక్క ఆవశ్యకత ఇప్పుడు ఉందా లేక భవిష్యత్తులో ఉందా? ఒకే సమయంలో తనువు, మనస్సు మరియు ధనము. మనస్సు, వాణి మరియు కర్మల ద్వారా అన్ని రకాలైన సేవలు కలిసి జరగడం ద్వారా సహజ సఫలత ప్రాప్తమవుతుంది. ఇటువంటి స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? శారీరక వ్యాధి, వాతావరణము యొక్క ప్రభావము వల్ల, వాయుమండలము యొక్క ప్రభావము వల్ల లేక అన్నపానాదుల యొక్క ప్రభావము వల్ల రోగము యొక్క ప్రభావములోకి వచ్చేస్తారు. అలాగే మనస్సు యొక్క స్థితి పైన కూడా ప్రభావము పడుతుంది. సదా ఆరోగ్యవంతంగా ఉండేందుకు బదులుగా రోగులుగా అయిపోతారు. కాని, సదా ఆరోగ్యవంతులుగా ఉండేవారు ఈ విషయాలన్నింటిలోనూ జ్ఞానస్వరూపులుగా ఉన్న కారణంగా సురక్షితంగా ఉంటారు.

అదేవిధంగా సదా ఎవర్ వెల్దీగా అనగా సదా సర్వశక్తుల యొక్క ఖజానాలతో, సర్వగుణాల యొక్క ఖజానాలతో, జ్ఞానము యొక్క ఖజానాలతో సంపన్నంగా ఉండేవారు ఏమి చేయాలి, ఎలా చేయాలి, కోరుకుంటున్నాము కానీ చెయ్యలేకపోతున్నాము.... ఇలా ఎప్పుడూ శక్తుల యొక్క పేదరికపు మాటలను లేక సంకల్పాలను చేయజాలరు. వారు స్వయాన్ని సదా సంపన్నమూర్తులుగా అనుభవం చేసుకుంటారు మరియు ఇతర నిర్ధన ఆత్మలు కూడా సంపన్నమూర్తులను చూసి వారి నిండుదనము యొక్క ఛత్రఛాయలో స్వయాన్ని కూడా ఉల్లాస ఉత్సాహవంతులుగా అనుభవం చేసుకుంటారు, అలాగే ఎవర్ హ్యాపీ అనగా సదా సంతోషంగా ఉండేవారు, ఎటువంటి దు:ఖపు అలను ఉత్పన్నం చేసే వాతావరణం ఉన్నా, నీరసవాతావరణం ఉన్నా, అప్రాప్తి యొక్క అనుభవమును కలిగించే వాతావరణమున్నా అటువంటి వాతావరణంలో కూడా సదా సంతోషంగా ఉంటారు మరియు తమ సంతోషము యొక్క ప్రకాశము ద్వారా దుఃఖిత మరియు ఉదాసీన వాతావరణమును సూర్యుడు అంధకారమును ఏవిధముగా పరివర్తన చేసేస్తాడో అలా పరివర్తన చేసేస్తారు. అంధకార మధ్యంలో ప్రకాశమును వ్యాపింపచేయడం అశాంతిలో శాంతిని తేవడం, నీరస వాతావరణంలో సంతోషం యొక్క ప్రకాశమును తేవడం... దీనినే ఎవర్ హ్యాపీ అని అంటారు. ఇటువంటి సేవ యొక్క అవసరం ఇప్పుడే ఉంది కానీ భవిష్యత్తులో కాదు.

ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి ప్రాప్తి యొక్క రేఖలు సదాకాలికముగా మరియు స్పష్టముగా ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు. హస్తాల ద్వారా ఆయువు యొక్క రేఖలను చూస్తారు కదా! ఆయువు పొడుగ్గా ఉందా, నిరోగిగా ఉందా అని చూస్తారు కదా! అలాగే బాప్ దాదా కూడా రేఖలను చూస్తున్నారు. మూడు ప్రాప్తులు జన్మించినప్పటి నుండి ఇప్పటివరకూ అఖండముగా ఉన్నాయా లేక మధ్య మధ్యలో ప్రాప్తి యొక్క రేఖలు ఖండితమవుతున్నాయా, అవి ఎక్కువ కాలము ఉన్నాయా లేక అల్పకాలికముగా ఉన్నాయా అని పరిశీలించారు. రిజల్టులో అఖండముగా మరియు స్పష్టంగా ఉండడంలో లోపమును చూసారు. అఖండముగా ఉన్నవారు చాలా కొద్దిమందే ఉన్నారు. కాని, ఆ అఖండమైనవి కూడా స్పష్టంగా లేవు. అవి అఖండముగా లేనట్లుగానే ఉన్నాయి. కాని గతించినదేదో గతించింది, వర్తమాన సమయంలో విశ్వసేవ యొక్క స్టేజీపై హీరో మరియు హీరోయిన్ పాత్రను అభినయిస్తున్నప్పుడు అదే అనుసారంగా ఈ మూడు ప్రాప్తులు మస్తకము మరియు నయనాల ద్వారా సదాకాలికముగా మరియు స్పష్టముగా కనిపించాలి. ఈ మూడు ప్రాప్తుల యొక్క ఆధారము పైనే విశ్వకళ్యాణకారి యొక్క పాత్రను అభినయించగలరు. ఈరోజు సర్వాత్మలకు ఈ మూడు ప్రాప్తుల యొక్క అవసరమూ ఉంది. ఇటువంటి అప్రాప్తి ఆత్మలకు ప్రాప్తిని కలిగించి ఛాలెంజ్ ను ప్రత్యక్షతలోకి తీసుకురండి. దుఃఖిత, అశాంత ఆత్మలు, రోగగ్రస్త ఆత్మలు, శక్తిహీన ఆత్మలు ఒక్క క్షణ ప్రాప్తి యొక్క అంచలి కొరకు లేక ఒక్క బిందువు కొరకు ఎంతో దాహార్తితో ఉన్నారు. మీ అదృష్టవంతమైన, సదా సంతోషమయమైన అనగా హర్షితముఖమును చూసి వారు మానవ జీవితమును జీవించడమంటే ఏమిటో తెలుసుకుంటారు, దాని యొక్క ధైర్యము, ఉల్లాస ఉత్సాహమూ వారికి కలుగుతుంది. ఇప్పుడు జీవిస్తూ కూడా నిరాశ యొక్క చితిపై కూర్చుని ఉన్నారు. ఇటువంటి ఆత్మలను మరజీవాలుగా చేయండి. నవజీవనము యొక్క దానమును ఇవ్వండి అనగా మూడు ప్రాప్తులతోనూ సంపన్నంగా తయారుచేయండి. మూడు ప్రాప్తులూ మా జన్మసిద్ధ అధికారము అని సదా స్మృతిలో ఉండాలి. మూడింటినీ ప్రత్యక్ష ధారణ కొరకు డబల్ అండర్‌ లైన్ చేయండి. ప్రభావమును వేసేవారిగా అవ్వండి. ఎటువంటి ప్రకృతి లేక వాతావరణము యొక్క పరిస్థితుల యొక్క ప్రభావానికి పరవశులుగా అవ్వకండి. ఏవిధంగా కమలపుష్పము బురద మరియు నీటి యొక్క ప్రభావంలో ఉండదో అలాగే, ఇలా జరుగుతూనే ఉంటుంది, ఈ కాస్తయితే తప్పక జరగవలసిందే, అలా ఇంకా ఎవరూ తయారవ్వలేదు అనే ఇటువంటి ప్రభావములోకి రాకండి. ఎవరూ ఇంకా అలా తయారవ్వకపోయినా మీరు తయారై చూపించండి. ఏ విధంగా మొదటి నెంబర్లోకి మేము వచ్చి చూపిస్తాము, విశ్వమహారాజుగా తయారై చూపిస్తాము అని శుద్ధ సంకల్పమును ఉంచుతారో అలాగే వర్తమాన సమయంలో, మొదట నేను తయారవ్వాలి అన్న సంకల్పమును ఉంచండి. బాబాను అనుసరించి నెంబర్ వన్లో ఉదాహరణగా తయారై చూపిస్తాను అనేటువంటి లక్ష్యమును ఉంచండి. లక్ష్యముతో పాటు లక్షణములను ధారణ చేస్తూ ఉండండి. ఇందులో, మొదట నేను అన్న దృఢ సంకల్పమును ఉంచండి, ఇందులో ఇతరులను చూడకండి. సమయమును చూడండి మరియు బాబాను చూడండి అప్పుడే ఛాలెంజ్ మరియు ప్రాక్టికల్ లో సమానులు అని అంటారు, అచ్చా! ఎంతో వినిపించాము, అలాగే ఎంతో విన్నారు కూడా. ఈసారి బాప్ దాదా కేవలం వినిపించడానికి రాలేదు, చూసేందుకు వచ్చారు. బాబా చూసినప్పుడు ఏదైతే గమనించారో అది వినిపిస్తున్నారు. తయారవ్వవలసినవారు ఈ ఆత్మలలోని వారే అని బాబాకు తెలుసు. .అధికారి ఆత్మలు కూడా మీరే. కాని, పదే పదే స్మృతిని కలిగిస్తూ ఉంటారు, అచ్ఛా

ఇటువంటి విశ్వము యొక్క రాజ్య భాగ్యపు అధికారులకు, బాబా ద్వారా లభించే సర్వప్రాప్తుల యొక్క అధికారులకు, మాయ మరియు ప్రకృతి ద్వారా సత్కారము ప్రాప్తించుకొనే అధికారులకు ఇటువంటి సర్వశ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదాల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో మిలనము (ఆస్ట్రేలియ):1. మీరు సర్వీసబుల్ పిల్లలే కదా! సర్వీసబుల్ అనగా ప్రతి సంకల్పము, వాక్కు మరియు కర్మ, సేవలో కలిసి ఉండాలి. త్రిమూర్తీ తండ్రి యొక్క పిల్లలు కదా! కావున మూడు సేవలూ కలిసి జరగాలి. ఒకే సమయంలో మూడు సేవలూ జరిగినట్లయితే ప్రత్యక్ష ఫలము వెలువడగలదు కావున మూడు సేవలూ కలిసి నడుస్తున్నాయా? మనసు ద్వారా ఆత్మలకు బాబాతో బుద్ధియోగమును జోడింపచేసే సేవ, వాణి ద్వారా బాబా యొక్క పరిచయమును ఇచ్చే సేవ మరియు కర్మ ద్వారా దివ్యగుణ మూర్తులుగా తయారుచేసే సేవ జరగాలి కావున ముఖ్యమైన సబ్జెక్ట్ లైన జ్ఞానము, యోగము మరియు దివ్యగుణాలు మూడూ కలిసి జరగాలి. ఈ విధంగా ప్రతి క్షణము శక్తిశాలీ సేవ చేస్తున్నట్లయితే మినిట్ మోటార్ అని ఏదైతే గా యనముందో అలా ఒక్క క్షణంలో మరజీవాలుగా అయ్యే స్టాంపును వేయగలరు, ఇదే అంతిమ సేవ యొక్క రూపము. ఇప్పుడు వాణి ద్వారా చాలా మంచిది అని అంటున్నారు. కాని, మంచిగా అవ్వడం లేదు. ఎప్పుడైతే వాణి, మనస్సు మరియు కర్మ ద్వారా మూడింటి ద్వారా ఒకేసారి సేవ జరుగుతుందో అప్పుడు కేవలం చాలా బాగుంది అని అనరు, నేను ప్రత్యక్షంగా తయారై చూపించాలి అని అంటారు. ఈవిధంగా అనుభవంలోకి వచ్చేస్తుంది. కావున ఇటువంటి సేవాధారులుగా అవ్వండి. దీనినే వరదానీ మరియు మహాదానీ స్థితి అని అంటారు. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు బాగున్నాయి. బాబాకు కూడా యోగ్యులైన పిల్లలను చూసి ఎంతో సంతోషం కలుగుతుంది. ఇప్పుడింకా దివ్యగుణాల యొక్క సింగారమును పెంచాలి. మర్యాద యొక్క రేఖలో ఉంటూ మర్యాద పురుషోత్తముల యొక్క టైటిల్‌ను తీసుకోవాలి అన్న అటెన్షన్ ఉన్నట్లయితే ఈ కిరీటమును మరియు తిలకమును అటెన్షన్ ఇచ్చి ధారణ చేయండి.

2. సదా ప్రతి కర్మ చేస్తూ నటునిగా అయి కర్మ చేస్తున్నారా? స్వయమే స్వయమును సాక్షిగా అయి ఏ పాత్రనైతే అభినయించానో అది యదార్థముగా లేక మహిమాయోగ్యముగా, చరిత్ర రూపంలో చేసానా అని పరిశీలించుకోండి. ఎల్లప్పుడూ ఏ కర్మలైతే శ్రేష్ఠముగా ఉంటాయో వాటికే మహిమ జరుగుతుంది. కావున నటులుగా అయి కర్మ చేయండి, మళ్ళీ సాక్షిగా అయి అది మహాన్ గా ఉందా లేక సాధారణముగా ఉందా అని పరిశీలించండి. జన్మ అలౌకికముగా ఉన్నప్పుడు మరి కర్మ కూడా అలౌకికముగా ఉండాలే కాని సాధారణముగా కాదు. సంకల్పములోనే పరిశీలన కావాలి, ఎందుకంటే సంకల్పమే కర్మలోకి వస్తుంది. సంకల్పమునే పరిశీలించి పరివర్తన చేసేసినట్లయితే కర్మలు మహాన్ గా అవుతాయి. మొత్తం కల్పమంతటిలోని మహాన్ ఆత్మలు ప్రత్యక్షంగా ఉన్న మీరే. కావున సంకల్పంలో కూడా పరిశీలించండి మరియు పరివర్తన చేయండి. సాధారణతను మహానత లోకి పరివర్తన చేయండి, అచ్చా!

వీడ్కోలు సమయంలో: - ఏ విధంగా ఈరోజు సంతోషంలో నాట్యము చేస్తున్నారో అలాగే సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితి పైన కూడా నాట్యం చేస్తూ ఉండండి. చిత్రములో సర్పము పైన కూడా నాట్యము చేస్తున్నట్లుగా చూపిస్తారు కదా! ఈ జడచిత్రము మీ అందరి యొక్క స్మృతి చిహ్మమే. ఏ సమయంలో, ఏ పరిస్థితి వచ్చినా ఈ చిత్రమును గుర్తుంచుకోండి. మేము పరిస్థితి రూపీ సర్పము పైన కూడా నాట్యము చేసేవారము! ఈ సర్పములే మీ కంఠములో సఫలత యొక్క మాలలను వేస్తాయి, అచ్ఛా!

Comments