* 16-01-1982 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
''నా తండ్రి వచ్చేసారు" అన్న ఈ శబ్దమును వ్యాపింపజేసేందుకు నలువైపులా ఫరిస్తాల రూపములో వ్యాపించిపోండి.''
ఈరోజు బాబా ఎక్కడకు వచ్చారో మరియు ఎవరిని కలుసుకునేందుకు వచ్చారో మీకు తెలుసా? ఈ రోజు ఈశ్వరుడు ఈశ్వరీయ నేస్తముగా అయి వచ్చారు. మరి స్నేహితులు కలుసుకున్నప్పుడు ఏమి చేస్తారు? పాడుకుంటారు, నవ్వుకుంటారు, తింటారు, ఆనందిస్తారు. కావున ఈ రోజు బాప్ దాదా వినిపించేందుకు రాలేదు. మిలనమును జరిపేందుకు వచ్చారు. ఎంత దూరదూరాల నుండి మరియు ఎన్ని వెరైటీల వారు ఈశ్వరీయ నేస్తాలుగా వచ్చి చేరుకున్నారో బాప్ దాదా చూస్తున్నారు. ఒక్క భగవంతుడిని స్నేహితునిగా చేసుకున్న తర్వాత ఒక్క ఈశ్వరీయ నేస్తము తప్ప ఇంకెవరూ లేరు అని అనే ఎంత మంచి నేస్తాలు మీరు! కావున ప్రతి ఒక్కరి స్నేహము యొక్క తమ తమ చిత్రాలను చూస్తున్నారు. సదాకాలికమైన, సత్యమైన స్నేహములో హృదయంలో ఏ సంకల్పాలు వస్తే వాటన్నింటినీ స్నేహితునికి వినిపించడం జరుగుతుంది. మరి భగవంతుడిని అటువంటి నేస్తముగా చేసుకున్నారు కదా? అవినాశీ ప్రీతి యొక్క సంబంధాన్ని జోడించారు కదా! ఇప్పుడిప్పుడే జోడించి మళ్ళీ ఇప్పుడిప్పుడే తెంచేసుకునేవారిగా అయితే లేరు కదా! మీరు ఏమి భావిస్తున్నారు? అవినాశీ స్నేహము ఉందా? మొత్తం కల్పంలో ఇటువంటి తండ్రి, నేస్తము సర్వసంబంధాలను నిర్వర్తించేవారు ఇంకెవరైనా లభిస్తారా? మొత్తం కల్పమంతా చుట్టివచ్చారు. మరి అలాంటివారెవరైనా లభించారా? తమ స్నేహితులను మరియు సర్వ సంబంధీకులను కూడా తండ్రియే వచ్చి వెతికి పట్టుకున్నారు, మీరు వెతకలేకపోయారు. అవినాశీ సర్వసంబంధాలను జోడించేందుకు ఆధారము లేక విధి మీకు బాగా తెలుసా? సదా 'నా బాబా' అన్న ఒక్క విషయమే గుర్తుండాలి. నావారు, నావారు అని అంటూ ఉండడం ద్వారా అధికారీ ఆత్మలుగా అయిపోతారు. ఇవేమైనా కష్టమా? బాబా నా తండ్రి అని అన్నప్పుడు మరి పిల్లలు బాబా నా వారు అని భావించడంలో కష్టమేముంది? ఈ నా అనే శబ్దము 21 జన్మల వరకూ తెగిపోని సంబంధాన్ని జోడించేందుకు ఆధారము. ఇటువంటి సహజ సాధనాన్ని ఉపయోగిస్తున్నారా? అనుభవజ్ఞులుగా అయిపోయారు కదా? ఎంతమంది కొత్త కొత్త పిల్లలు తమ కల్పము యొక్క అధికారమును పొందేందుకు వచ్చి చేరుకున్నారో మరియు తమ అధికారాన్ని కూడా పొందుతున్నారో ఈ రోజు బాప్ దాదా చూస్తున్నారు. కావున అధికారీ పిల్లలను చూసి బాప్ దాదా హర్షిస్తున్నారు.
జపాన్ బొమ్మలు బాగున్నారా? చాలా స్నేహముతో చూస్తున్నారు. దేశము మరియు ధర్మము యొక్క ముసుగులు ఉన్నా కానీ బాప్ దాదా తమ పిల్లలను తమవారిగా చేసుకున్నారు కావున జపానీ బొమ్మలు ఏ గీతమును గానం చేస్తారు? 'మై బాబా'. అందరూ ఒకరికన్నా ఒకరు ప్రియమైనవారు, అలాగే చూడండి, ఫ్రాన్స్ పిల్లలు ఎంత ప్రియముగా ఉన్నారో? భాషను అర్ధం చేసుకోకపోయినా బాబానైతే అర్ధం చేసుకుంటారు. బ్రెజిల్, మెక్సికో మొదలగు గ్రూపులందరూ చాలా బాగున్నారు. ఈసారి దూరదూరాల నుండి గ్రూపులు మంచి పురుషార్ధం చేసి వచ్చి చేరుతున్నారు. లండన్, అమెరికా వారైతే మొదటినుంచీ ఉన్నవారే. కొత్త కొత్త స్థానాలలోని చాలా సుందరమైన పూలగుచ్ఛాలను చూస్తూ బాప్ దాదా ఎంతో హర్షిస్తున్నారు. అన్నింటికన్నా ఎక్కువ దూరమైన స్థానమేది? (పరంధామం) అది నిజమే, స్థానం ఎంత దూరంగా ఉన్నా వచ్చి చేరుకోవడంలో ఒక్క క్షణం పడుతుంది, అంతేనా లేక ఇంకా ఆలస్యమవుతుందా?
(హాంగ్ కాంగ్ పిల్లలు కూడా వచ్చి చేరుకున్నారు - చైనీస్ భాష మాట్లాడేవారు) - ఈశ్వరీయ పూలగుచ్చితము యొక్క అతి శోభనీయమైన పుష్పాలు మీరు. స్వయమును ఇటువంటి పూలగుచ్ఛితము యొక్క పుష్పాలుగా అనుభవం చేసుకుంటున్నారా? అచ్చా - బాప్ దాదా అందరి పేర్లు చెప్పలేరు కదా! కావున ఏయే దేశాల నుండి వచ్చారో ఆ పిల్లలందరూ అతి ప్రియమైనవారే. బాప్ దాదాతో మిలనమును జరిపేందుకు వచ్చారు మరియు బాప్ దాదా కూడా పిల్లలందరినీ చూసి పిల్లల విశేషత యొక్క గీతమును గానం చేస్తున్నారు. బార్బడె వారు కూడా ఎంతో సంతోషిస్తున్నారు. ట్రినిడాడ్ మాతలు కూడా చాలా మంచివారు. వారు సంతోషములో మైమరచిపోయి ఊగుతూ ఉండేవారిలా సంతోషము యొక్క ఊయలలో ఊగేవారిగా కనిపిస్తున్నారు. మారిషస్ యొక్క కుమారీల పాత్ర కూడా చాలా బాగుంది. ప్రతి కుమారి 100 బ్రాహ్మణుల కన్నా ఉత్తమురాలు. నలుగురు కన్యలు వచ్చినా 400 మంది బ్రాహ్మణులు వచ్చినట్లే. మా గ్రూప్ చాలా చిన్నగా ఉంది అని భావిస్తున్నారు కానీ మీలో 400 మంది ఇమిడియున్నారు. తక్కువేమీ కాదు. ఆస్ట్రేలియా మరియు లండన్ వారు రేస్ చేస్తున్నారు మరియు జర్మనీ మధ్యలో ప్రియమైనదిగా అయిపోయింది. దుబాయివారు కూడా ఒక్కరు లక్షకు సమానము. నైరోబీవారు
అందరికన్నా ఎక్కువ అద్భుతం చేసారు. మినీ పాండవ భవనాన్ని, దేనినయితే ఎవరూ తయారుచేయలేదో దానిని నైరోబీవారు తయారుచేసారు. మంచి వైట్ హౌస్ ను తయారుచేసారు. జర్మనీ యొక్క శాఖలు కూడా ఎన్నో ఉన్నాయి. అమెరికా యొక్క శాఖలు కూడా ఎన్నో ఉన్నాయి. మొత్తం యూరోప్ అంతా మంచి పురుషార్ధం చేసి లండన్ మరియు ఆస్ట్రేలియా సమానముగా వృద్ధినొందుతున్నారు. అమెరికా వారు ఏమి చేస్తున్నారు? అమెరికా వారు చాలా మంచి చతురతను చూపారు. అమెరికావారు అనేక మూలమూలలలో తమ శక్తిసేన మరియు పాండవుల యొక్క సైన్యమును పెట్టేసారు. ఇప్పుడు నలువైపులా మీరు ముట్టడి చేసారు, మళ్ళీ ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు క్షణములో వైట్‌హౌస్ లైట్ హౌస్ యొక్క విజయం జరుగుతుంది. ఎందుకంటే, వినాశనం యొక్క జ్వాలకు కూడా అమెరికాయే నిమిత్తమవుతుంది మరియు స్థాపన యొక్క విశేష కార్యములో కూడా అమెరికా యొక్క పాండవ గవర్నమెంట్ అనండి, పాండవ సైన్యం అనండి, వారే నిమిత్తమవుతారు. మరి అలా తయారుగా ఉన్నారు కదా? (అవును) మరి ఆర్డర్ ఇవ్వాలా? జపానీ బొమ్మలు ఏమంటారు? అన్నింటికన్నా పెద్దది, అన్నింటికన్నా సుందరమైన పూలగుచ్చితమును బాప్ దాదాకు సమర్పిస్తారు కదా! జర్మనీ ఏమి చేస్తారు? జర్మనీవారు ఎటువంటి ప్రకాశమును వ్యాపింపజేయాలంటే దాని ద్వారా అంధులకు కూడా కళ్ళు లభించాలి, ఆత్మిక బాంబు లేక సైలెన్స్ శక్తి యొక్క బాంబు ద్వారా అది చేయాలి.
దుబాయి వారు ఏమి చేస్తారు? అక్కడ దాగియున్న బ్రాహ్మణులు తమ ప్రతాపమును తప్పకుండా చూపిస్తారు. ఇతర ధర్మాలలో ఉంటూ కూడా బ్రాహ్మణ ఆత్మలు దాగియుండలేరు, కావున వారు కూడా పెద్ద గ్రూపును తయారుచేసి వస్తారు. లోలోపల తయారవుతున్నారు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు. దూరంలో ఉన్నవారు (బ్రెజిల్, మెక్సికో పిల్లలు) ఏమి ఆలోచిస్తున్నారు? దూరం నుండి ఎటువంటి గొప్ప శబ్దమును వ్యాపింపజేస్తారంటే, దాని ద్వారా నేరుగా దూరం నుండే భారతదేశము యొక్క కుంభకర్ణుల వరకూ వచ్చి చేరుకుంటారు.
గయానా అయితే అమెరికా (న్యూయార్క్) యొక్క పునాది. గయానా ఏది చేసిందో అది ఇప్పటివరకూ ఇంకా ఎవరూ చేయలేదు. గయానా ఆత్మల యొక్క విశేషత ఏమిటంటే వారు వి.ఐ.పి.లు అయి ఉండి కూడా పూర్తి వారస క్వాలిటీవారు.
కెనడా నుండి త్రిమూర్తులు వచ్చారు. త్రిమూర్తులలోనే మొత్తం ప్రపంచమంతా ఇమిడియుంది. ఇప్పుడు కెనడా గుప్తముగా ప్రత్యక్షత యొక్క రేస్లో ముందుకు వెళుతోంది. మంచి నెంబర్ తీసుకుంటుంది.
మలేషియా కూడా చాలా బాగా కష్టపడింది. నేను ఒంటరిగా వచ్చాను అని భావించకండి, మీ లోపలే ఆ ఆత్మలంతా ఇమిడియున్నట్లున్నారు. బాప్ దాదా ఒక్కరిని చూడడం లేదు, మీలో ఇమిడియున్న సమీపమైన మరియు స్నేహీ ఆత్మల యొక్క దృశ్యమును కూడా దూరమునుండే చూస్తున్నారు. ఆ ఆత్మల యొక్క శబ్దము మీకు కూడా వినిపిస్తోంది కదా!
న్యూజిలాండ్ సేవకు నిమిత్తమైయున్న ఆత్మలు శక్తిశాలీ ఆత్మలు, కావున సదా బాప్ దాదా యొక్క పూతోట వికసించి ఉంటుంది. స్థానము చిన్నగా ఉంది కానీ సేవ గొప్పగా ఉంది.
ఆస్ట్రేలియా మరియు లండన్ యొక్క శాఖలైతే ఎన్నో ఉన్నాయి. హాలండ్ లో కూడా వృద్ధి జరుగుతోంది. ఒక్క వెలిగిన దీపము నుండి దీపమాల తయారవుతుంది.
ఇప్పుడు చూడండి - ఒక్కొక్కరి పేరును చెబుతున్నారు. కానీ వచ్చే సంవత్సరం ఎంతటి వృద్ధి జరుగుతుందంటే వారి పేర్లను చెప్పడం కూడా కష్టమైపోతుంది.
ఇప్పుడు మసీదుల పైకి, చర్చిల పైకి ఎక్కి తమ తమ గీతాలను గానం చేస్తారు, మసీదులో అల్లా పేరుతో పిలుస్తారు. చర్చిలో గాడ్ ను పిలుస్తారు, మందిరాలలో రావాలి, రావాలి అని పిలుస్తారు కానీ ఇప్పుడు ఎటువంటి సమయం వస్తుందంటే అన్ని మందిరాలు, మసీదులు గురుద్వారాలు, చర్చిలు మొదలైనవన్నీ కలిసి వారందరి నుండి ఒకే శబ్దము వెలువడుతుంది, అందరూ 'మా తండ్రి వచ్చేసారు' అనే అంటారు. ఆపై ఫరిస్తాలైన మిమ్మల్ని, వీరు ఎక్కడికి వెళ్ళారు? అని వెతుకుతారు. నలువైపులా ఫరిస్తాలే ఫరిస్తాలు వారికి కనిపిస్తారు. మొత్తం ప్రపంచంలో ఫరిస్తాలు వ్యాపించిపోతారు. మేఘాలు వ్యాపించినట్లుగా వ్యాపిస్తారు మరియు అందరి దృష్టి ఏంజిల్స్ అయిన మీవైపు మరియు తండ్రి వైపు ఉంటుంది. మరి, ఫరిస్తా యొక్క సాక్షాత్కారమును చేయించగలిగే అటువంటి స్థితికి చేరుకున్నారా? ఇప్పుడు కొద్దికొద్దిగా కదులుతున్నట్లయితే సమయం వచ్చినప్పుడు అదంతా అంతమైపోతుంది, ఎందుకంటే కల్పకల్పమూ నిమిత్తమైయున్న ఫరిస్తాలు మీరే కదా! మీరు కాక ఇంకెవరు? కావున కొద్దికొద్దిగా కదిలే పాత్రను లేక ఆటను ఏదైతే చూపిస్తారో అదంతా ఇక త్వరగానే సమాప్తమైపోతుంది. ఆపై అందరి నోటి నుండి మాయ వెళ్ళిపోయింది మరియు మేము మాయాజీతులుగా అయిపోయాము అన్న శబ్దమే వెలువడుతుంది. ఆ సమయం వస్తోంది, అచ్ఛా!
ఈ రోజు ఇది అందరి యొక్క పిక్నిక్. బాప్ దాదా ఈ రోజు పిక్నిక్ లో పిల్లలందరి నుండి కానుకను తీసుకుంటారు. మీరు ఇచ్చేందుకు తయారుగా ఉన్నారా? సదా క్లియర్ గా మరియు కేర్ ఫుల్ గా ఉండడమే ఈ రెండు శబ్దాల యొక్క గిఫ్ట్. కావున దీనికి రిజల్ట్ గా హర్షితముగా అయ్యే తీరుతారు. మీరు క్లియర్ గా అవ్వడం లేదు, కావుననే సదా ఏకరసముగా ఉండడం లేదు మరియు డిప్రెషన్, డిప్రెషన్ అనే ఏ పదమునైతే పదే పదే వాడతారో అది కూడా వస్తుంది. కావున ఏ విషయాలు వచ్చినా వాటన్నింటినీ క్లియర్ చేసేయండి. బాప్ దాదా ద్వారా కానీ, మీకు మీరుగా కానీ లేక నిమిత్తమైయున్న ఆత్మల ద్వారా కానీ క్లియర్ చేసుకోండి. మీ లోపలే ఉంచుకోకండి. ఎందుకు, ఏమిటి అని అనకండి. మీరు రెండు పదాల యొక్క గిఫ్ట్ ను ఇవ్వండి మరియు బాప్ దాదా నుండి త్రిమూర్తి బిందువు యొక్క కానుకను తీసుకోండి. గిఫ్ట్ ను పోగొట్టుకోకండి. గిఫ్ట్ ను సదా బుద్ధిరూపీ పెట్టెలో సురక్షితముగా ఉంచుకోండి. మరి ఈ ఇవ్వడము మరియు తీసుకోవడం మీకు మంజూరేనా? అచ్చా! ఎప్పుడు ఏమి జరిగినా తిలకము దిద్దుకోండి, అప్పుడు సదా సురక్షితముగా ఉంటారు. తిలకమును దిద్దుకోవడం వస్తుంది కదా!
Comments
Post a Comment