16-01-1980 అవ్యక్త మురళి

16-01-1980         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సర్వశక్తివంతుని రాజయోగుల సభ లేక లోకపసంద్ సభ.

ఈ రోజు మొత్తం కల్పంలో సర్వ శ్రేష్ఠ బ్రాహ్మణుల లేక రాజయోగుల సభను చూస్తున్నారు. ఒకవైపు ఈనాటి అల్పకాలిక రాజ్యములోని రాజ్యసభ మరియు లోకసభ(పార్లమెంటు), రెండవ వైపు సర్వశక్తివంతుని ద్వారా తయారైన లోక ప్రియమైన రాజయోగుల సభ రెండు సభలూ తమ తమ పనులు చేస్తున్నాయి. హద్దులోని లోక్ సభ హద్దులోని చట్టాలను నియమాలను తయారుచేస్తుంది. లోక ప్రియమైన అనంతమైన బ్రాహ్మణ సభ అవినాశీ చట్టాలు, నియమాల రాజ్యాన్ని తయారు చేస్తూ ఉంది. ఎలాగైతే ఆ లోక్ సభ మరియు రాజ్యసభలోని నాయకులు తమ-తమ అల్పబుద్ధి ద్వారా రకరకాల అల్పకాలిక ఆలోచనలను వ్యక్తం చేస్తారో అలా బ్రాహ్మణుల రాజ్యసభ అనగా రాజయోగుల సభ విశ్వకళ్యాణము కొరకు పని చేస్తూ ఉంది. అందుకే ఈ సభ లోకప్రియ సభగా అవుతుంది. స్వార్థముంటే మన్ పసంద్ అని అంటారు. సంకల్పాలు విశ్వ కళ్యాణార్థముంటే లోక్ పసంద్ మరియు ప్రభు పసంద్ గా అవుతారు. ఏ సంకల్పాలు చేసినా, ఆలోచనలు చేసినా మొదట ఈ విచారాలు, సంకల్పాలు తండ్రి పసంద్ లేక ప్రభు పసంద్ గా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఎవరి పట్ల చాలా స్నేహముంటుందో వారికేది ఇష్టంగా ఉంటుందో అదే మీకు కూడా ఇష్టంగా ఉంటుంది. కనుక తండ్రికేది ఇష్టమో అదే మీకు ఇష్టముగా ఉండాలి. తండ్రికి ప్రియంగా ఉంటే అది స్వతహాగా లోకప్రియంగా అయిపోతుంది. ఎందుకంటే మొత్తం విశ్వం లేక లోకానికి తెలిసినా, తెలియకపోయినా, చూసినా, చూడకపోయినా అందరికంటే ప్రియమైన వారెవరు? ధర్మపితలు వారి ధర్మములోని ఆత్మలకు ప్రియంగా ఉంటారు. కాని ధర్మ పితలకు కూడా ప్రియమైనవారు ఒక్క తండ్రి అయిన పరమపిత ఒక్కరే. అందువలన అందరి నోటి నుండి అన్ని సమయాలలో రకరకాల భాషలలో ఒక్క తండ్రినే పిలుస్తారు. అందువలన లోకమంతటికి ప్రియమైన తండ్రికి ఏది ఇష్టమో అది స్వతహాగా లోకానికి ఇష్టమైపోతుంది. ఎందుకంటే తండ్రి లోకమంతటికీ ప్రియమైనవారు. ఇప్పుడు మిమ్ములను మీరు "నాకు లోక్ పసంద్ సభకు టికెట్ లభించిందా?" అని ప్రశ్నించుకోండి. తండ్రి ఎన్నుకున్నారు, ఇప్పుడు తండ్రి వారిగా అయ్యారు. తండ్రి ఏమో స్వీకరించారు. అయినా తండ్రి ప్రతిరోజూ నంబరువార్ అని అంటారు. అష్టరత్నాల మాలలో మొదటి నంబరు మణి ఎక్కడ, 16000 మాలలోని చివరి మణి ఎక్కడ? ఇరువురూ బాబా పిల్లలే కాని ఇరువురికీ వ్యత్యాసమెంత? అంత వ్యత్యాసమెందుకు వచ్చింది? అందుకు మూల కారణమేమి? ఒకే తండ్రి పిల్లలైనా అంత తేడా ఎందుకు?

1. విశ్వ కళ్యాణ కార్యము చేసేవారు 2. కార్యము చేయువారిని, కార్యమును మహిమ చేసేవారు అనగా ఒకరేమో కార్యము చేసేవారు రెండవవారు మహిమ చేసేవారు. ఒకరేమో చేసేవారు. రెండవవారు చేయాలి, జరగాలి, అవ్వాలి అనేవారు. కనుక ఒక్క బాబా పిల్లలే అయినా ఎంతో వ్యత్యాసము వచ్చేస్తుంది. "అవ్వాలి" అనునది "అయ్యాను లేక అవుతాను" లోకి మారాలి. ఎవరైతే అయినాను, అవుతాను అని అంటారో వారు “అయ్యో అయ్యో (హాహాకారాల) అనుట నుండి రక్షింపబడ్డారు." "కావాలనుకుంటున్నాను" అనేవారు ఒక్కోసారి చాలా ఉత్సాహంగా నాట్యము చేస్తూ ఉంటారు, ఒక్కోసారి హాహాకారాలు చేస్తూ ఉంటారు. వారు లోకపసందు సభలో మెంబర్లు కాదు. ఎలాగైతే అక్కడ పార్టీలో చాలామంది సభ్యులుంటారు కానీ పార్లమెంటు మెంబర్లు కొంతమందే ఉంటారు. అలా ఇక్కడ కూడా బ్రాహ్మణ పరివారములో సభ్యులుగా ఉండినా లోకపసందు సభలో సభ్యులు అనగా "లా అండ్ ఆర్డర్ " ప్రకారం రాజ్య అధికారము తీసుకునే వారి లిస్టులోకి రారు. వారేమో రాజ్య సింహాసనానికి అధికారులు, వీరేమో రాజ్యములోకి వచ్చే అధికారులు. 16 వేల మాలలోని వారు రాజ్యములోకి వచ్చే అధికారులు, కాని రాజ్య సింహాసనానికి అధికారులు కారు. అందువలన లోకపసందు(లోకప్రియ) సభలోకి టికెట్ బుక్ చేసుకోండి. అప్పుడు రాజ్య సింహాసనము స్వతహాగానే లభిస్తుంది.

ఈ రోజు బాప్ దాదా తమ మహోన్నత తీర్థ స్థానాలన్నిటిని తిరిగి చూచుటకు బయల్దేరారు. ఇప్పటి సేవాకేంద్రాలు భక్తిమార్గంలో తీర్థస్థాన రూపంలో పూజింపబడ్డాయి. అందువలన తీర్థ స్థానాలన్నీ తిరుగుతూ గంగ, యమునా, సరస్వతి, గోదావరి అన్నిటిని చూశారు. జ్ఞాన నదులన్నీ తమ-తమ సేవలలో లగ్నమై ఉన్నారు. అక్కడక్కడ చాలా కొద్దిమంది వారసులను చూచారు. మరి కొన్నిచోట్ల కొంతమంది కాబోయే వారసులను కూడా చూచారు. ఒక్కోచోట రాయల్ కుటుంబానికి అతి సమీపంగా రాజవ్యవహారాలను నడిపే వారిని చూచారు. వారు ఆజ్ఞలను జారీ చేసేవారు, వారు ఆజ్ఞానుసారము రాజ్యవ్యవహారాలను నడిపేవారు. వీరిని ఎక్కువగా చూశారు. వీరిని వేరే విధంగా చెక్ చేస్తూ రిజల్టు చూస్తూ ఉన్నారు. చివరికి రిజల్ట్ ఏమో వెలువడాలి కదా. అందువలన ఇప్పుడు అందరి పేపర్లు చెక్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు బాప్ దాదా విశేషంగా పవిత్రత సబ్జక్టులోని పేపర్లను చెక్ చేస్తున్నారు. ప్రతి బ్రాహ్మణ పుత్రుని పవిత్రతా ప్రకాశము ఎంతవరకు విస్తరిస్తున్నదో అనగా సేవా స్థానములో ప్రతీ ఆత్మ నుండి పవిత్రతా ప్రకంపనాలు ఎంతవరకు పడ్తున్నాయో విశేషంగా చూచేందుకు కూడా తిరుగుటకు వెళ్లారు. పవిత్రతా శాతం చిన్న బల్బు సమానంగా ఉందా లేక పెద్ద బల్బు సమానంగా ఉందా లేక సర్టిలైటు సమానంగా ఉందా లేక లైట్‌హౌస్ సమానంగా ఉందా అని చూస్తున్నారు. పవిత్రతా శక్తి ఎంతవరకు వాయుమండలాన్ని పరివర్తన చెయ్యగలదో - ఈ రిజల్టును చూచుటకు అన్ని తీర్థ స్థానాలను (సెంటర్లను) తిరిగి చూస్తున్నారు. తీర్థ స్థానపు గొప్పదనము నిమిత్తంగా ఉన్న సత్య తీర్థముపై ఆధారపడి ఉంది. నిమిత్త సేవాధారుల ప్రభావము ఎంత ఉంటుందో అంతే ప్రభావము నలువైపులా వ్యాపించు వైబ్రేషన్లపై వాయుమండలంపై ఉంటుంది.

కనుక ఈ రోజు బాప్ దాదా దినచర్య పవిత్రతా పేపర్లను చెక్ చేశారు. ఇలా ప్రతి స్థానము ఫలితాన్ని చూచారు. ప్రారంభము నుండి ఇంతవరకు పవిత్రతా అక్కౌంటు ఎలా ఉందో, సంకల్పము నుండి స్వప్నము వరకు మొత్తం చెక్ చేశారు. బాప్ దాదా తమ సహయోగులను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎమర్జ్ చేసుకుంటారు. ట్రిబ్యునల్ కూడా గాయనమైతే చేయబడింది. చివర్లో సహయోగుల ట్రిబ్యునల్ ఉంటుంది. ఇప్పుడైతే సంరక్షకులు మరియు సహయోగీ పిల్లల రూపములో ఎమర్జ్ చేస్తారు. ఎందుకు ఎమర్జ్ చేస్తారు? బాప్ దాదా కూడా చిన్న చిన్న సభలు జరుపుతారు కదా, ఎలాగైతే మీరు అప్పుడప్పుడు జోన్ హెడ్స్ మీటింగు జరుపుతారు కదా, అప్పుడప్పుడు సర్వీసబుల్ పిల్లల మీటింగ్ అప్పుడప్పుడు సేవాధారుల మీటింగ్ జరుపుతారో అలా బాప్ దాదా కూడా అక్కడ గ్రూపులు గ్రూపులుగా పిలుస్తారు. ప్రారంభంలో మనోరంజనం(ఎంటర్టైన్మెంట్) చేయు పిల్లల గ్రూపును కూడా తయారు చేశారు గుర్తుందా? అన్ని గ్రూపులకు వేర్వేరుగా భోజనం తినిపించారు. ఇప్పుడు భాగవతానికి వచ్చేశారు. భాగవతం చాలా పెద్దదిగా, విస్తారంగా ఉంటుంది. భక్తి మార్గములో కూడా గీత కంటే భాగవతాన్ని పెద్దదిగా తయారుచేశారు. గీతా జ్ఞానాన్ని కొంతమంది వినుటకు ఇష్టపడినా, పడకపోయినా భాగవతాన్ని అందరూ వింటారు. కనుక ఎలాగైతే సాకారంలో పిల్లలతో మనోరంజనం జరిపారో అలా ఇప్పుడు కూడా వతనంలో ఎమర్జ్ చేస్తూ ఉంటారు. పేపర్లను పిల్లలతోనే వెరిఫై చేయిస్తారు. ఎందుకంటే తండ్రి తన పిల్లలను సదా బాలకుల నుండి యజమానుల రూపంలో చూస్తారు. అందువలన నిమిత్తమైన పిల్లలను ప్రతి కార్యములో పెద్ద సోదరుని సంబంధముతో చూస్తారు. కనుక వారి మిలనము ఎలా ఉంటుంది. సోదరుడు, సోదరునితో వెరిఫై చేయిస్తాడు కదా. అందువలన బాప్ దాదా ఎప్పుడూ ఒంటరిగా ఉండరు. సదా పిల్లల జతలో ఉంటారు. ఒంటరిగా ఎక్కడా ఎప్పుడూ ఉండరు. అందువలన స్మృతి చిహ్నంలో కూడా పురుషార్థుల దిల్వాడా మందిరంలో బాబా ఒంటరిగా ఉన్నారా? పిల్లల జతలో ఉన్నారు కదా, చివరి రిజల్టు అయిన విజయ మాలలో కూడా ఒంటరిగా లేరు. ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని సదా జతలో ఉంచుకుంటారు. తండ్రి మీ సంపూర్ణ ఫరిస్తా రూపాన్ని ఎమర్జ్ చేస్తారు. ఆ టచింగ్ మీకు కూడా వస్తుందా? ప్రతీ రోజు వస్తుందా లేక అప్పుడప్పుడు వస్తుందా? మీరు సూక్ష్మవతనాన్ని ఇక్కడకు తీసుకొస్తారు. తండ్రి మిమ్ములను సూక్ష్మవతనానికి పిలుస్తారు. అప్పుడప్పుడు తండ్రి మీ వద్దకు వస్తారు. అప్పుడప్పుడు మిమ్ముల్ను తన వద్దకు పిల్చుకుంటారు. రోజంతా ఈ పనే చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పిల్లలతో ఆడ్తారు. అప్పుడప్పుడు ఆడిస్తారు, అప్పుడప్పుడు తనతో పాటు సేవలో ఉపయోగించుకుంటారు. అప్పుడప్పుడు తనతో పాటు సాక్షాత్కారము చేయించేందుకు తీసుకెళ్తారు. అప్పుడప్పుడు సాక్షాత్కారము చేయించుటకు పిల్లలనే పంపిస్తారు. ఎందుకంటే కొంతమంది జిద్దీ భక్తులు తమ ఇష్టదేవతలు సాక్షాత్కారము కాకుంటే తృప్తి చెందరు. వారి ముందు స్వయంగా తండ్రి ప్రత్యక్షమైనా వారు తమ ఇష్ట దేవతలనే ఇష్టపడ్డారు. అందువలన భిన్న భిన్న ఇష్టదేవతలు, దేవీలను భక్తుల వద్దకు పంపవలసి వస్తుంది. ఇంకేమి చేస్తారు? అప్పుడప్పుడు విశేష స్నేహీ, సహయోగీ పిల్లలకు విశేషంగా చెవిలో శక్తినిచ్చే మంత్రాన్ని కూడా ఇస్తారు. ఎందుకిస్తారు? ఎందుకంటే కొన్ని పనులు ఎటువంటివి వస్తాయంటే అందులో విశేష ఆత్మలు, సంరక్షక, సహయోగ పిల్లలు నిమిత్తంగా ఉన్నందున ధైర్యముతో, ఉల్లాసముతో, వారికి ప్రాప్తించిన శక్తులతో ఆ పనులు చేస్తూనే ఉన్నారు. కానీ అక్కడక్కడ ఎలాగైతే రాకెట్ చాలా పైకి పోవాలంటే అదనపు ఫోర్స్ పైకి పోయిన తర్వాత నిరాధారమైపోతుందో అలా అక్కడక్కడ కొన్ని పనులు  ఎటువంటివి వస్తాయంటే అక్కడ కేవలం ఒక సెకండు సూచన అవసరముంటుంది. అక్కడ టచింగ్ రావడం అనగా చెవిలో మంత్రం చెప్పుట. 

అచ్ఛా! వర్గీకరణము వచ్చింది కనుక తండ్రి కూడా ఆ రోజు వతనంలో ఏమేమి జరుగుతుందో తన వర్గీకరణ కార్యము గురించి చెప్పారు. ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకొనుటకు అడిషనల్ పేపరు తయారు చేసుకోవచ్చు. అప్పుడప్పుడు పరీక్ష రెండుసార్లు కూడా పెడతారు. కనుక పవిత్రతా పరీక్షలో ఇప్పుడు కూడా అడిషన్ చేసుకోవచ్చు. అప్పుడు మార్కులు జమ అవుతాయి. ఎందుకంటే ముఖ్యమైన ఆధారం మరియు సత్యమైన జ్ఞానానికి పరిశీలన - పవిత్రత. పవిత్రత ఆధారముపై సహజ యోగము, సహజ జ్ఞానం, సహజ ధారణ, సహజ సేవ చేయగలరు. నాలుగు సబ్జక్టులకు పునాది పవిత్రత. అందువలన మొదట ఈ పేపరు చెక్ చేస్తున్నారు. రిజల్టు తర్వాత వినిపిస్తాము. అచ్ఛా!

ఇలా ప్రతి సంకల్పములో ప్రభు పసందు, లోక పసందుగా, ప్రతి కార్యములో అధికారులై కర్మేంద్రియాలతో కర్మలు చేయించేవారు, అనగా రాజ్య సభకు అధికారులు, సదా తండ్రి జతలో మనసులో, కర్మలో, విశ్వ సేవలో సాథీలు, సదా సంకల్పము ద్వారా వాయుమండలాన్ని శ్రేష్ఠంగా చేసేవారు, తమ మహావరదానీ వృత్తితో వైబ్రేషన్లను వ్యాపింపజేయువారు, ఇటువంటి సమీప సహాయోగీ పిల్లలకు బాప్ దాదా యాద్ ప్యార్ ఔర్ నమస్తే. 

సఫలతకు ఆధారము - నిర్జయశక్తి కంట్రోలింగ్ (అదుపు చేయు) శక్తి (ఆఫీసర్ల గ్రూపు) - ఆఫీసర్లు తమ కార్యములో సఫలమయ్యేందుకు విశేషంగా నిర్ణయ శక్తి కంట్రోలింగ్ శక్తి అవసరము. ఆఫీసర్లలో ఈ రెండు శక్తులున్నాయంటే క్రిందివారిని నడిపించుటలో సఫలంగా ఉంటారు. అందువలన ఎలాగైతే ఆ ప్రభుత్వ ఆఫీసర్లు ఉన్నారో అలా పాండవ ప్రభుత్వములో ఈశ్వరీయ కార్యములో కూడా అనేక ఆత్మల కార్యాలయంలో మీరు ఆఫీసర్లు, అది హద్దు కార్యాలయము, ఇది అనంతమైన కార్యాలయము. ఎలాగైతే ఆ ప్రభుత్వంలో భిన్న భిన్న డిపార్ట్ మెంట్ల ఆఫీసర్లుగా ఉన్నారో, అలా పాండవ ప్రభుత్వములో విశ్వకళ్యాణ కార్యములో కూడా మీరు ఆఫీసర్లే. ఆఫీసర్ల అర్హతలు వినిపించాము కదా - కంట్రోలింగ్ శక్తి, నిర్ణయ శక్తి. కనుక ఈ ఈశ్వరీయ కార్యములో కూడా ఈ రెండు విశేష శక్తులున్నవారే సఫలతా మూర్తులుగా అవుతారు. ఎవరైనా ఒక ఆత్మ మీ సంపర్కములోకి మొదట వచ్చినప్పుడు వారికేం అవసరమో నిర్ణయించగలగాలి. వారికేమి కావాలో నాడిని పరిశీలించగలగాలి. వారి కోరిక అనుసారమే వారిని తృప్తిపరచగలగాలి. సేవలో స్వంత కంట్రోలింగ్ శక్తితో ఇతరుల సేవకు నిమిత్తంగా కండి ఇతరుల సేవ చేసినప్పుడు స్వయాన్ని కంట్రోల్ చేసుకునే కంట్రోలింగ్ శక్తి కారణంగా ఇతరులపై ఆ అచల స్థితి యొక్క ప్రభావము పడ్తుంది. అక్కడ ఎలాగైతే ఆఫీసర్లకు అర్హతలుంటాయో అలా ఇక్కడ కూడా ఈ అర్హతలుండాలి. అక్కడ ప్రభుత్వము రాజీ అయితే గవర్నరుగా చేస్తుంది, కాని ఇక్కడ విశ్వ కళ్యాణ సేవలో సేవాధారులుగా అయినందున విశ్వానికి రాజులుగా అయిపోతారు. కనుక విశేషంగా ఈ రెండు శక్తులు మీలో సదా ఉండాలి. అప్పుడు సదా సఫలత ఉంటుంది.

మీరు పాండవ ప్రభుత్వానికి కూడా ఇటువంటి మంచి ఆఫీసర్లు కదా. విశ్వ కళ్యాణము చేయు ఆఫీసును మీరు ఇలా మంచిగా నడిపిస్తున్నారు కదా. ఆఫీసర్లకు కూడా సేవ చేయుటకు చాలా మంచి అవకాశముంది. ఎందుకంటే మీ సంపర్కములోకి అనేకమంది ఆత్మలు వస్తూ ఉంటారు. మీ సంపర్కములోకి వచ్చు ఆత్మలను ఈశ్వరీయ సంపర్కములోకి తెచ్చుట కూడా ఒక ఛాన్సే కదా. మరి మీ వద్దకు వచ్చే ఆత్మలలో ఎంతమందిని పాండవ ప్రభుత్వ సంపర్కములోకి తెస్తారు? సంపర్కములోకి తెచ్చుట వలన ఒక్కసారి అయినా శాంతిని అనుభవం చేశారంటే వారు మాటిమాటికి మీ గుణగానము చేస్తారు. ఇప్పుడు ప్రజలను తయారు చేసుకునే ఆఫీసు తెరవండి. ఎలాగైతే ఆ ఆఫీసును సంభాళిస్తారో అలా ఈ ఆఫీసును కూడా సంభాళించండి. మీ అనుభవములో కూడా విశేషమైన శక్తి ఉంది. మీ అనుభవాన్ని విని కూడా అనేకమందికి చాలా అనుభవాలు అవుతాయి. ఈ రోజులలో వింటారు, వినిపిస్తారు కాని అనుభవము లేదు. అనుభవము కావాలని ఇష్టపడతారు. మీరు ఎంత అనుభవీలుగా ఉంటారో అంత ఇతరులకు అనుభవము చేయిస్తారు. అఫీసర్లందరూ సహజయోగులుగా ఉన్నారు కదా? లేక అప్పుడప్పుడు సహజయోగులు, అప్పుడప్పుడు కష్టపడే యోగులా? లౌకిక సేవలో కూడా సంపర్కాన్ని పెంచే సేవ ఉంది.

Comments