15-12-1979 అవ్యక్త మురళి

15-12-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విదేశీ పిల్లలతో అవ్యక్తబా దాదా కలయిక.

ఈ రోజు పదమాపదమ్ భాగ్యశాలీ పిల్లలందరినీ చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. ఒక్కొక్కరు విశ్వం షో కేసులో అమూల్యమైన రత్నాలుగా ఉన్నారు. ప్రతి రత్నము తమ తమ విలువను గురించి యథా శక్తిగా తెలుసుకున్నారు. కానీ బాప్ దాదా ఎల్లప్పుడూ పిల్లలందరి సంపన్న స్థితినే చూస్తారు. వర్తమాన ఫరిస్తా రూపం, భవిష్య దేవతా స్వరూపం, మధ్యలోని పూజ్య స్వరూపం. ఈ మూడు రూపాలను, ఆది-మధ్య-అంత్యాన్ని చూస్తూ ప్రతీ రత్నం విలువను గురించి తెలుసుకుంటారు. ప్రతీ రత్నం కోటాను కోట్లలో కొద్ది మందిలో కూడా అతి కొద్దిమందిగా ఉన్నామని తమను భావిస్తున్నారా? విశ్వంలోని కోట్ల ఆత్మలను ఒకవైపు ఉంచండి, ఇంకొకవైపు స్వయాన్ని ఉంచుకుంటే కొన్ని కోట్ల మంది కంటే తమ ప్రతి ఒక్కరి వర్తమానము మరియు భవిష్యత్తు శ్రేష్ఠమైనవి. సదా ఇటువంటి నషా ఉంటుందా? ఈ రోజు వరకు కూడా తమ పూజ్య స్వరూపం అయిన దేవీ లేక దేవతా రూపాన్ని భక్తులు పూజిస్తూనే ఉన్నారు. తమ జడ చిత్రాలలో చైతన్య దేవతలను ఆహ్వానిస్తున్నారు. రండి, వచ్చి అశాంతి నుండి విడిపించండి అని పిలుస్తున్నారు. భక్తుల పిలుపు, తమ భవిష్యత్తులో కాబోయే ప్రజల ఆహ్వానం కూడా మీకు వినిపిస్తున్నదా?

ఈ రోజుల్లో రాజకీయల అలజడిని చూసి విశ్వానికి మహారాజ, మహారాణులైన మిమ్ములను లేక వైకుంఠ రామరాజ్యము లాంటి రాజ్యం కావాలని అందరూ ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు. రామరాజ్యంలో లేక సత్యయుగ వైకుంఠంలో మీరందరూ తండ్రితో పాటు రాజ్యాధికారులు కదా. కనుక అధికారులైన మిమ్ములను మీ ప్రజలు మరలా ఆ రాజ్యాన్ని తీసుకురండి అని ఆహ్వానిస్తున్నారు. శ్రేష్ఠ ఆత్మలైన మీ అందరికీ వారి ధ్వని వినిపించడం లేదా? అందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆకలితో అరుస్తున్నారు, కొంతమంది మానసిక అశాంతితో అరుస్తున్నారు. కొంతమంది పన్నుల భారంతో అరుస్తున్నారు, కొంతమంది తమ కుటుంబ సమస్యలతో, కొందరు తమ కుర్చీ (పదవి)లోని అలజడి కారణంగా అరుస్తున్నారు. పెద్ద పెద్ద రాజ్యాధికారులు పరస్పరము ఒకరు ఇంకొకరితో భయపడి అరుస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు చదువు భారంతో ఆరుస్తున్నారు. చిన్నవారి నుండి పెద్దవారి వరకు అందరూ అరుస్తున్నారు. నలువైపులా అరవడం మీ చెవుల వరకు చేరుతూ ఉందా? ఇలాంటి సమయములో తండ్రితో పాటు మీరందరూ శాంతిస్తంభాల వంటివారు. అందరి దృష్టి శాంతి స్తంభం వైపు వెళ్తూ ఉంది. అందరూ హాహాకారాల తర్వాత జయ జయ ధ్వనులు ఎప్పుడు జరుగుతాయో అని చూస్తూ ఉన్నారు. శాంతిస్తంభాలైన మీరు చెప్పండి - ఎప్పుడు జయ జయ ధ్వనులు చేస్తారు? ఎందుకంటే బాప్ దాదా సాకార రూపంలో నిమిత్తంగా పిల్లలైన మిమ్ములనే ఉంచారు. కావున ఓ సాకారీ ఫరిస్తాల్లారా! తమ ఫరిస్తా రూపంతో విశ్వంలోని దు:ఖాన్ని దూరం చేసి సుఖధామాన్ని ఎప్పుడు తయారు చేస్తారు? తయారుగా ఉన్నారా? విదేశీయులు లాస్టు నుండి ఫాస్ట్ గా వెళ్లేవారు కదా. సర్వుల సద్గతిని ఎప్పుడు చేస్తున్నారు? ఎవర్‌ రెడీగా ఉన్నారా? బాప్ దాదా అందరినీ పిల్లల వైపుకే సైగ చేస్తారు. శక్తులకు పూజ ఎక్కువగా ఉంది. రెండు వైపులా చాలా పెద్ద లైను ఉంటుంది. పాండవులకు స్మృతి చిహ్నంగా హనుమంతుని వద్ద, శక్తుల వైపు నుండి వైష్ణవి దేవి వద్ద - ఇద్దరి వద్ద చాలా పెద్ద లైను ఉంటుంది. రోజురోజుకు లైను పెరుగుతూ పోతుంది. కావున భక్తులందరికీ భక్తికి ఫలము గతి-సద్గతులను ఇచ్చేవారు కదా. కావున తమను సదా మాస్టర్ గతి - సద్గతి దాతలుగా భావించి గతి సద్గతుల ప్రసాదాన్ని భక్తులకు పంచండి. ప్రసాదం పంచడం వస్తుందా? టోలీ పంచే అభ్యాసమైతే అయ్యింది. ఇప్పుడీ ప్రసాదాన్ని పంచండి.

ఈ రోజు విశేషించి విదేశీయులను కలవడానికి వచ్చాను. విశ్వంలో ఏమి చూశానో ఈ రోజు అమృతవేళ దృశ్యం వినిపించాను. ఒకటి ఆర్తనాదాలు(చిల్లానా), రెండవది నడిపించడం(చలానా). ఒకవైపు అరుస్తూ ఉన్నారు, మరొకవైపు అందరూ కార్యాన్ని ఒత్తిడితో నడిపిస్తున్నారు. అన్ని విషయాలలో నడిపించాల్సిందే అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎవరైనా స్వయం నడవలేకపోతే గట్టిగా పట్టుకొని లేక కృత్రిమ చక్రాలు అమర్చుకొని నడిపిస్తారు. ఈనాటి భాషలో ప్రతి కార్యంలో ఏదో ఒక సాధనాన్ని చక్రాలుగా చేసుకోకుంటే కార్యం జరగదు. కావున ఇది చక్రాలు తగిలించుకునే సీజన్, ఈనాటి ఫ్యాషన్. దీనిని బట్టి కార్యం దానంతకది జరగదని, ఒత్తిడితో నడిపిస్తున్నారు లేక చక్రాలు అమర్చి నడిపిస్తున్నారని ఋజువవుతుంది. కావున ఈ రోజు సమాచారం విశ్వంలో ఆర్తనాదాలు చేయుట, పనిని గాని, జీవితాన్ని గాని నడిపించడం. అందువలన ఈరోజు ప్రభుత్వము కూడా తాత్కాలికమైనదే(పని జరిపించుటకే). కనుక చలానా, చిల్లానా - ఇదే ఈ రోజు విశ్వంలోని పరిస్థితి. కొంతమంది అరుస్తూ ఉన్నారు, కొంతమంది నడిపిస్తూ ఉన్నారు. ప్రపంచ సమాచారాన్ని విన్నారు కదా. విదేశీయులలో కూడా విశేషతలున్నాయి. అందుకనే బాప్ దాదా దూర దూర దేశాల నుండి కూడా తన పిల్లలను వెతుక్కున్నారు. మేము ఇలాంటి తండ్రికి అల్లారుముద్దు పిల్లలుగా అవుతామని ఎప్పుడైనా స్వప్నంలోనైనా అనుకున్నారా? కానీ తండ్రి తన పిల్లలను మూలమూలల నుండి వెతుక్కుని తమ పరివార పుష్పగుచ్ఛంలో ఉంచుకున్నారు. కనుక భిన్న భిన్న స్థానాల నుండి వచ్చిన వారంతా ఒకే బ్రాహ్మణ పరివార పుష్పగుచ్ఛంలోని వెరైటీ పుష్పాలు.

విదేశీయుల విశేషత - డబల్ విదేశీ పిల్లలకు డ్రామానుసారం విశేషించి లిఫ్ట్ కూడా లభించింది. ఈ లిఫ్ట్ ఆధారంతో లాస్ట్ వచ్చినా ఫాస్ట్ గా ముందుకు బాగానే వెళ్తున్నారు. ఆ లిఫ్ట్ యొక్క గిఫ్ట్ ఏది? విదేశీయుల విశేషత అనగా విదేశీయుల విశేష సహాయం ఇందువల్లనే లభించింది. విదేశాలలో సుఖ సాధనాలను అన్ని రకాలుగా అనుభవించి ఇప్పుడు అలసిపోయి ఉన్నారు. భారతీయులు ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. కనుక విదేశీయులకు అల్పకాల సాధనాలతో పొట్ట నిండింది. ఎవరి పొట్ట అయినా నిండిన తర్వాత వారి ముందు ఏమి పెట్టినా ఆసక్తి వాటిపై ఉండదో అలా వైభవాలతో, వస్తువులతో, అల్పకాలిక సుఖాలతో వారి మనసు నిండిపోయింది. అందువలన విదేశీయులకు విశేష లిఫ్ట్ లభించింది. ఒకవైపు సాధనాల నుండి సహజంగానే దూరమయ్యారు అంతేకాక ఎవరి అవసరం ఉందో వారి తోడు లభించింది. అందువలన సహజంగానే “ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు" అనే స్థితిని అనుభవం చేస్తున్నారు. త్యాగమైతే తప్పక చేశారు కానీ హృదయం నిండిన తర్వాత చేశారు. విదేశీయులకు మొదటి నుండే ఈ లిస్ట్ ఉంది. బుద్ధి సాధనాల నుండి దూరమైపోయింది మరియు తోడును వెతుక్కునే వాతావరణం మొదలయ్యింది. కనుక భారతవాసులకు వదిలిపెట్టడం కష్టమనిపిస్తుంది, హృదయము విదీర్ణమవుతుంది. విదేశీయులు ఉత్సాహంతో దాటుకొని ఒక్క దెబ్బతో వదిలిపెట్టారు, అవి వదిలిపోయాయి. రెండవది - విదేశీయులు ఏది ఆలోచిస్తే అదే చేస్తారు - ఈ సంస్కార స్వభావాలు నిండి ఉన్నాయి. దేనినీ లక్ష్యపెట్టరు. (డోంట్ కేర్ చేస్తారు), ఎదిరిస్తారు. ఆలోచించింది చెయ్యాల్సిందే అని భావిస్తారు. వాళ్లు ఏమంటారో, వీళ్లు ఏమంటారో అని ఆలోచించరు. లోకమర్యాదలను ముందే దాటుకున్నారు. అందువలన పురుషార్థంలో భారతీయుల కంటే సహజంగా, వేగంగా ముందుకెళ్లారు. భారతీయులకు లోకమర్యాదలు ఎక్కువగా ఉంటాయి. డబల్ విదేశీయులకు లోకమర్యాదలు ముందే తొలగిపోయాయి. సగం సంబంధాలు ముందే తెగిపోయాయి. అందువలన చివర్లో వచ్చినా వేగంగా ముందుకెళ్తారు. అర్థమయిందా. విదేశీయులకు డ్రామానుసారంగా విశేషత ఉంది. అజ్ఞాన విషయాలు ఉన్నాయి. కాని డ్రామాలో ఈ సంస్కారాలు పరివర్తనగుటలో సహజ సాధనంగా అయ్యాయి. అందువలన విదేశీయులకు సహజమవుతుంది. విదేశీయులు నిర్మోహులుగా కావడంలో తెలివి గలవారిగా ఉన్నారు. ఇండియావారు కూడా విదేశాలలో ఉంటూ విదేశీ వాతావరణంలోకి అయితే వచ్చేస్తారు కదా. విదేశీయులు జంప్ చేయడంలో తెలివిగల వారైపోయారు. విదేశీయుల విశేషత ఏమిటో అర్థమయిందా? 

ఆస్ట్రేలియా పార్టీ - ఆస్ట్రేలియా వారు చాలా బాగా సేవను వృద్ధి చేశారు. మీరు తప్పిపోయిన ఆత్మలను తండ్రితో కలిపే ఆత్మిక సేవాధారులు. ఒక్కొక్కరు స్వయం తండ్రికి సమీపంగా వస్తూ ఇతరులను తీసుకొచ్చే రత్నాలు. బాప్ దాదా కూడా ఇలాంటి ఆత్మిక సేవాధారులను చూసి సంతోషిస్తారు. కొత్త కొత్త వారు పాతగా అనిపిస్తారు. ఎందుకనగా కల్పకల్పములో అధికారులు. ఆస్ట్రేలియా వారి విశేషత ఏమంటే ఏ విశేష సహయోగం లేకుండానే తమ పాదాలపై నిలబడి, తండ్రి సంబంధ-సంపర్కాల ఆధారంతో సేవ చేశారు, వృద్ధి చేశారు. కనుక అందరూ సదా తండ్రికి సమీపంగా అనుభవం చేస్తున్నారు కదా? (శక్తులు). శక్తుల జండా ఉన్నతంగా ఉంది. శ్రమ పాండవులు చేశారు, జండా శక్తులకు ఇచ్చారు. ఇదే మంచిది. ఎందుకంటే శక్తులు మార్గదర్శకులుగా (గైడ్ గా) ఉన్నారు, పాండవులు రక్షకులుగా(గార్డ్ గా) ఉన్నారు. గార్డ్ స్వయం వెనుక ఉండి మార్గదర్శకులను ముందుంచుతారు. కనుక శక్తులు మార్గదర్శకులై అందరికీ మార్గాన్ని చూపిస్తున్నారా? శక్తులా లేక కుమారీలా? శక్తుల విశేషత - సదా మాయాజీతులు. మాయను అనగా యుద్ధం చేసేవారిని తన సవారీగా చేసుకునేది. ఇలా ఉంది కదా!

బాప్ దాదా విదేశీ పిల్లలను 10 - 12 సంవత్సరాల క్రితమే ఆహ్వానించారు. మీరు అంత మధురమైన ఆత్మలు! అందరూ సదా బాప్ దాదా ద్వారా ప్రాప్తించిన సుఖము, శాంతి లేక ఆనందమనే ఊయలలో ఊగుతూ ఉంటారు కదా? ఎవరైతే సదా ఊయలలో ఊగేవారిగా ఉంటారో వారు భవిష్యత్తులో కూడా సాకార రూపంలోని భిన్న భిన్న రూపాలతో పాటు ఊయలలో ఊగుతారు. కనుక అందరూ శ్రీకృష్ణుని జతలో ఊగుతారు కదా! ఎప్పుడైతే తండ్రి సమానంగా అవుతామో అప్పుడు తండ్రితో పాటు ఊయలలో ఊగవచ్చు లేకుంటే దూరంగా కూర్చుని చూసేవారిగా అవుతారు. ఇక్కడ సదా తోడుగా ఉండేవారు అక్కడ కూడా తోడు తోడుగా ఊగుతారు. ప్రతీ ఒక్కరు స్వర్గానికి వెళ్లే టికెట్ బుక్ చేసుకున్నారా? ఏ క్లాసు టికెట్ బుక్ చేసుకున్నారు? ఏయిర్ కండిషన్ టికెట్ ఎవరికి లభిస్తుంది? ఇక్కడ ప్రతీ పరిస్థితిలో ఎవరైతే సురక్షితంగా ఉంటారో, ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రతి సమస్యను సెకండులో దాటుకునేవారు. ఏయిర్ కండిషన్ టికెట్ బుక్ చేసుకొనుటకు మొదట ఈ సర్టిఫికెట్ కావాలి. ఆ టికెట్ కొరకు ఎలా పైకమిస్తారో, అలా ఇక్కడ సదా విజయులుగా అయ్యే ధనం కావాలి. దీనితో టికెట్ లభించగలదు. చాలా కష్టపడి ధనం జమ చేసుకొని ఇక్కడకు వచ్చారు కదా! ఈ ధనాన్ని జమ చేసుకోవడం దాని కంటే సహజము. ఎవరైతే సదా తండ్రి జతలో ఉంటారో వారికి ప్రతీ సెకండు చాలా సంపాదన జమ అవుతూ ఉంటుంది. కనుక ఇంత సమయం నుండి ఎంత సంపాదన జమ చేసుకున్నారు? మంచిది, కొత్త ప్లాను ఏమి తయారు చేశారు? శక్తులు మరియు పాండవుల సంఘటన బాగుంది. పరస్పరంలో నిర్విఘ్నంగా ఉంటూ స్నేహీ, సహయోగులుగా అయ్యి నడుస్తున్నారా? ఏ గొడవా జరగడం లేదు కదా? ఇంకా ఎక్కువ కంటే ఎక్కువగా నిర్విఘ్న సేవా కేంద్రాలను తయారు చేయండి. అప్పుడు బహుమతి లభిస్తుంది. సెంటర్లు ఎక్కువగా కూడా ఉండాలి, నిర్విఘ్నంగా కూడా ఉండాలి. (బాప్ దాదా మా వద్దకు ఆస్ట్రేలియాలో వస్తారా?) బాప్ దాదా రోజూ చుట్టి వస్తారు. పిల్లలు తండ్రిని గుర్తు చేసుకుంటే, వారి స్మృతికి తండ్రి బదులివ్వకుండా ఎలా ఉంటారు! మీరే ఆలోచించండి. బాప్ దాదా రోజూ అమృతవేళ ప్రతీ పుత్రుని సంభాళించుటకు, చూచుటకు మొత్తం విశ్వమంతా తిరుగుతారు. మీరు ఆత్మిక సంభాషణ చేయడం లేదా? వస్తారు కనుకనే ఆత్మిక సంభాషణ చేస్తారు. రోజూ ఆత్మిక సంభాషణ చేస్తారా లేక అప్పుడప్పుడు చేస్తారా? ఒకటి కూర్చోవడం, రెండవది మిలనం జరుపుకోవడం. కూర్చుంటున్నారు కాని శక్తిశాలి స్థితిలో కూర్చున్నట్లయితే సదా సమీపతను అనుభవం చేస్తారు.

ఇప్పుడు ఎప్పటి వరకైతే ఉంటారో అప్పటి వరకు కలుసుకుంటూనే ఉంటారు. “బాబా” అని అన్నారు, వెంటనే తోడును అనుభవం చేస్తారు. ఏ మాట వచ్చినా సెకండులో 'బాబా' అని అనగానే తోడును అనుభవం చేసుకున్నారు. ఈ 'బాబా' అను శబ్దమే ఇంద్రజాల శబ్ధము. ఎలాగైతే మ్యాజిక్ ఉంగరం లేక ఏదైనా మ్యాజిక్ వస్తువును వస్తువును జతలో ఉంచుకుంటారో అలా 'బాబా' శబ్దాన్ని తమతో ఉంచుకోండి. అప్పుడు ఎప్పుడైనా, ఏ కార్యములో అయినా ఎలాంటి కష్టమూ రాదు. ఏదైనా విషయము జరిగిపోయినా 'బాబా' అను శబ్దం గుర్తు చేసుకుంటూ, చేయిస్తూ ఉంటే అది నిర్విఘంగా జరిగిపోతుంది. బాబా బాబా అనే మహామంత్రాన్ని సదా జ్ఞాపకం ఉంచుకుంటే వారి ఛత్రఛాయ క్రింద నడుస్తున్నామని సదా అనుభవం చేస్తారు. 

మొరీషియస్ - సదా తండ్రి ద్వారా లభించిన ఖజానాలతో ఆడుకుంటూ ఉంటారు కదా? ఎవరైతే అల్లారు ముద్దు పిల్లలుగా, గారాల పిల్లలుగా ఉంటారో వారు సదా రత్నాలతో ఆడుకుంటారు. మీ అందరికీ బాప్ దాదా ద్వారా తరగని జ్ఞానరత్నాలు ప్రాప్తించాయి. ఆ తరగని ఖజానాతో ఆడుకుంటున్నారా? ఈ రత్నాలతో ఆడుకుంటూ, ఇతరులను కూడా సంపన్నంగా చెయ్యడంలో సదా బిజీగా ఉంటున్నారా? ఇదే పని కదా? పోతే ప్రవృత్తి(కుటుంబం) నిమిత్త మాత్రంగా ఉంది. బ్రాహ్మణ జీవిత కర్తవ్యం - వినడం మరియు వినిపించడం. ఇదే అసలు కర్తవ్యము.(బంధనాలలో ఉన్నారు) బంధనాలలో ఉన్నవారు ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తిగా ఉంటారు. బంధనముక్తులై తండ్రితో ఎప్పుడు కలవాలి అని ప్రతి క్షణం తపన ఉంటుంది. శరీరం అక్కడ ఉన్నా మనసు తండ్రి వద్ద ఉంటుంది. బంధన శరీరానికి గాని మనసుకు కాదు కదా! శరీరాన్ని ఎన్ని తాళాలు వేసి ఉంచినా మనసుకు తాళాలు వేయలేరు కదా! మాయాజీత్ గా అయినట్లయితే మనసు స్వతంత్రంగా ఉంటుంది. బంధనాలలో ఉన్నవారు తమ వృత్తి ద్వారా, శుద్ధ సంకల్పాల ద్వారా విశ్వ వాయుమండలాన్ని పరివర్తన చేయవచ్చు. వారికి ఈ సేవ చేయు అవకాశం చాలా పెద్దది. ఈ రోజుల్లో మనసా సేవనే కావాలి. ఎందుకంటే విశ్వానికి మానసిక శాంతి అవసరం. కనుక మనసా ద్వారా శాంతి వైబ్రేషన్లను వ్యాపింపజేయవచ్చు. శాంతిసాగరుడైన తండ్రి స్మృతిలో ఇదే సంకల్పంలో ఉండుటను మనసా సేవ అని అంటారు. స్వతహాగానే శాంతికిరణాలు వ్యాపిస్తూ ఉంటాయి. కనుక శాంతిని దానమిచ్చే మహాదానిగా ఉన్నారు కదా?

ఎక్కడైతే తండ్రి తోడుగా ఉంటారో అక్కడ ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఒకవేళ ఎవరైనా కొద్దిగా గొడవ చేసినా నెమ్మది నెమ్మదిగా చల్లబడతారు. ఉదాహరణానికి దీపావళికి దోమలు వస్తాయి, సమాప్తమైపోతాయి కదా! మీరు సాగరుని పిల్లలు మాస్టర్ సాగరులు. పూర్తి విశ్వాన్ని సత్యమైన ఆర్యులుగా తయారు చేసేవారు. కావున ఎవరైనా ఏమి చెయ్యగలరు? చెరువు సాగరంలో ఇమిడిపోయి సమాప్తమైపోతుంది. మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో తండ్రి మిమ్ములను అంతకు కోటాను రెట్లు స్మృతి చేస్తారు. అందువలన ప్రతి రోజు స్మృతికి బదులు(ఫలం) ఇవ్వడానికి విశ్వమంతా తిరుగుతారు. పిల్లలు భలే నిద్రపోతున్నా తండ్రి పిల్లలందరినీ పర్యవేక్షిస్తూ సదా తమ కార్యాన్ని చేస్తూనే ఉంటారు. కొందరు క్యాచ్ చేస్తారు, కొందరు చెయ్యలేరు. అది పిల్లల పురుషార్థం. అదే సమయంలో బుద్ది గుర్తిస్తే చాలా అనుభవం చేయగలరు. రోజంతటికి ఆహారం లభిస్తుంది. పేపరు (పరీక్ష) రావడం అనగా అనుభవీగా తయారు చేయడం - సదా కాలము కొరకు విఘ్నవినాశక డిగ్రీని తీసుకోవాలి. అందువలన పేపరు వచ్చిందంటే క్లాసు ముందుకు వెళ్లామని భావించండి. బాప్ దాదా పిల్లలను సదా రక్షిస్తూ ఉంటారు. అందువలన సదా వారి చత్రఛాయలో ఉండండి.

Comments