15-03-1981 అవ్యక్త మురళి

15-03-1981       ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్వదర్శన చక్రధారులు మరియు చక్రవర్తులే విశ్వకళ్యాణకారులు

ఈ రోజు జ్ఞాన సాగరులైన బాప్ దాదా తమ మాస్టర్ జ్ఞాన సాగరులైన పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. ప్రతి పుత్రుడు తండ్రి ద్వారా లభించిన జ్ఞానమును బాగా స్మరిస్తూ ఆనందిస్తున్నారు. ప్రతి ఒక్కరు నంబర్ వార్ వారి వారి యోగమనుసారము, శక్తి అనుసారము జ్ఞాన సాగర స్థితిని అనుభవం చేస్తున్నారు. జ్ఞాన సాగర స్థితి అనగా మొత్తం జ్ఞానంలో ప్రతి పాయింటులో అనుభవీ స్వరూపులుగా అగుట. బాప్ దాదా జ్ఞాన సాగర స్థితిలో స్థితమై ఉండండి అని ఆదేశిస్తే ఒక సెకండులోనే ఆ స్థితిలో స్థితము కాగలరా? కాగలరా లేక ముందే స్థితమైపోయారా? ఆ స్థితిలో స్థితమై విశ్వంలోని ఆత్మల వైపు చూడండి. ఏ అనుభవం చేస్తున్నారు? ఆత్మలందరూ ఎలా కనిపిస్తున్నారు? ఈ స్థితిలో స్థితమై ఎంత శక్తిశాలీ విశాల బుద్ధి ఉందో అనుభవం చేయండి. త్రికాలదర్శి, త్రినేత్రి, దూరదేశీ సర్వ శక్తివంతులు సర్వ గుణాలు, సర్వ ప్రాప్తి సంపన్న ఖజానాలతో యజమానుల స్థితి ఎంత ఉన్నతమైనది. ఆ ఉన్నత స్థితిలో కూర్చుని క్రిందికి చూడండి. అన్ని రకాలైన ఆత్మలను చూడండి. మొట్టమొదట మీ భక్త ఆత్మలను చూడండి. ఏమి కనిపిస్తోంది? ప్రతి ఇష్ట దేవతను అనేక విధాలుగా భక్తి చేసే రకరకాల భక్తుల వరుసలు(లైన్లు) ఉన్నాయి. లెక్కలేనంత మంది భక్తులు ఉన్నారు. కొంతమంది సతో ప్రధాన భక్తులు అనగా భావనా పూర్వకంగా భక్తి చేసే భక్తులున్నారు. కొంతమంది రజో, తమో గుణీ భక్తులు అనగా స్వార్థంతో భక్తి చేసే భక్తులు. అయితే వారు కూడా భక్తుల లైనులో ఉన్నారు. పాపం వెతుకుతున్నారు, తిరుగుతున్నారు, అరుస్తున్నారు. వారి పిలుపులు వినిపిస్తున్నాయా? (ఒక ఈగ బాబా ముందు తిరుగుతూ ఉంది) ఎలాగైతే ఈ ఈగ భ్రమిస్తూ ఉంటే దానికి స్థిరమైన స్థానము ఇవ్వాలనే సంకల్పం వస్తుందో, అలా భక్తులకు గమ్య స్థానము చూపించాలనే తీవ్ర సంకల్పం వస్తుందా? మంచిది. భక్తులను చూశారు.

ఇప్పుడు ధార్మిక ప్రజలను చూడండి. ఎన్ని రకాలైన పేర్లు, వేషాలు, కార్య విధానాలు ఆకర్షించే ఎన్ని రకాలైన సాధనాలను తమవిగా చేసుకున్నారు. ఇది కూడా చాలా మంచి ఉల్లాసమునిచ్చే ధర్మాల పెద్ద బజారుగా తయారైంది. ప్రతి ఒక్కరు షో కేసులు, తమ తమ విధుల షో పీసులు కనిపిస్తున్నాయి. కొంతమంది చాలా తిని, త్రాగుతున్నారు. కొంతమంది తినిడం మానేసి తపస్సు చేస్తున్నారు. ఒకరి పద్ధతి ఏమో బాగా తినండి, త్రాగండి, మజా చేయండి. మరొకరి పద్ధతి అన్నీ త్యాగం చేయండి. ఈ దృశ్యం అద్భుతంగా ఉంది కదా. కొంతమంది ఎర్ర రంగు దుస్తులు, కొంతమంది పసుపు రంగు దుస్తులు రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. వారిని చూచి ఓ మాస్టర్ జ్ఞాన సాగరులారా! మీకు ఏ సంకల్పం వస్తుంది? ధర్మాత్మలకు కూడా కళ్యాణకారులైన మాస్టర్ పరమాత్ములారా! ఏమి ఆలోచిస్తున్నారు? విశ్వమంతటికీ ఉద్గారమూర్తులైన మీకు ఈ ఆత్మలను కూడా ఉద్ధరించాలనే సంకల్పము ఉత్పన్నమవుతుందా? లేక స్వయాన్ని ఉద్ధరించుకొనుటలోనే బిజీగా ఉన్నారా? మీ సేవా కేంద్రములోనే బిజీగా ఉన్నారా? మీరు సర్వాత్మల తండ్రి అయిన పరమాత్ముని పిల్లలు. కనుక ఆత్మలందరూ మీ సోదురులు ఓ మాస్టర్ జ్ఞాన సాగరులారా! మీ సోదరుల వైపు కూడా మీ సంకల్ప దృష్టి ఎప్పుడు వెళ్తుంది? స్వయాన్ని విశాల బుద్ధి దూరదేశీగా అనుభవం చేస్తున్నారా? చిన్న చిన్న విషయాలలో సమయము గడిచిపోవడం లేదు కదా? ఉన్నతమైన స్థితిలో స్థితులవ్వండి. విశాలమైన కార్యం కనిపిస్తూ ఉందా?

ఇప్పుడు మూడవ వైపు కూడా చూడండి. వర్తమాన సంగమ సమయంతో పాటు భవిష్యత్తులో కూడా మీ రాజ్యంలో సహయోగమునిచ్చే వైజ్ఞానిక ఆత్మలు కూడా ఎంత శ్రమ చేస్తున్నారు. ఏమేమి పరిశోధనలు చేసి కొత్త కొత్తవి కనుగొన్నారు. ఇప్పుడు కూడా మీరు వింటున్నదంతా సైన్స్ వారి సహయోగంతోనే మైకు, హెడ్ ఫోన్ మొదలైనవి వింటున్నారు. రిఫైన్ పరికరాలు చేసి శ్రేష్ఠ ఆత్మలైన మీకు కానుకలుగా ఇచ్చి వెళ్లిపోతారు. వారిది కూడా ఎంత గొప్ప త్యాగం. ఎంత శ్రమ చేస్తున్నారు! ఎంత మంచి బుద్ది! వారు శ్రమ చేసి ప్రాలబ్దాన్ని మీకు ఇస్తారు. ఈ ఆత్మలకు కూడా కళ్యాణం చేయాలనే సంకల్పం వస్తుందా? లేక వీరు నాస్తికులని భావించి వీరేమి తెలుసుకుంటారని వదిలేస్తారా? అయితే నాస్తికులు కానీ, ఆస్తికులు కానీ అందరూ పిల్లలే కదా. మీ సోదరులే. సోదరత్వ సంబంధముతో కూడా ఈ ఆత్మలకు ఏదో ఒక విధంగా వారసత్వమైతే లభిస్తుంది కదా! విశ్వ కళ్యాణకారి రూపంలో వారి వైపు విశ్వ కళ్యాణ దృష్టి సారించలేరా? వీరు కూడా అధికారులే. అధికారం తీసుకునే రూపం ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. మంచిది. ముందుకు పదండి. 

దేశ-విదేశాల రాజ్యాధికారాన్ని చూడండి. చూశారా! వారి రాజ్యం కదులుతూ ఉందా? లేక స్థిరంగా ఉందా? రాజ్యనీతి దృశ్యం ఎలా కనిపిస్తూ ఉంది! కల్ప క్రితపు స్మృతి చిహ్నంలో ఒక ఆట చూపించారు. ఆ ఆట ఏమిటో తెలుసా? అది సాకార తండ్రికి కూడా ప్రియమైన ఆట. పాచికల ఆట(బారాకట్ట). ఇప్పుడిప్పుడే 12తో ముందుకు వెళ్లారు. ఇప్పుడిప్పుడే ఎంతగా ఓడిపోతారంటే - తమ పరివారమును కూడా పాలన చేసేందుకు ధైర్యం ఉండదు. ఇప్పుడిప్పుడే కిరీటం లేని మహారాజులుగా ఉంటారు. ఇప్పుడిప్పుడే ఓటు అడుక్కునే భికారులుగా అయిపోతారు ఇటువంటి ఆటను చూస్తున్నారా? పేరు, ప్రతిష్ఠలు సంపాదించాలనే ఆకలితో ఉన్నారు. ఇటువంటి ఆత్మలకు కూడా కొంతైనా దోసిలిని ఇవ్వండి. వీరిపై కూడా దయా హృదయ ఆత్మలుగా అయ్యి దయా దృష్టితో దాతా స్వరూపం ద్వారా చాలా కొద్దిగానైనా దానమిచ్చి వారిని కూడా సంతుష్టపరుస్తారు కదా! ప్రతి సెక్షన్లో ఎవరి సేవ వారికుంది. మీరు దానిని విస్తారము చేయండి. ఇంకా ముందుకు వెళ్లండి.

నలువైపులా ఉన్న జనరల్ పబ్లిక్ అందులో చాలా రకాలున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పాడుతున్నారు. నలువైపులా కావాలి కావాలి అనే పాట మ్రోగుతూ ఉంది. ఇప్పుడు ఇటువంటి పాటలు పాడేవారికి ఏ పాట వినిపిస్తే ఆ పాట సమాప్తమైపోతుంది. సర్వాత్మల పట్ల మహాజ్ఞానీ, మహాదానీ, మహాశక్తి స్వరూప వరదానీ మూర్తులు మాస్టర్ దాతలు ఒక్క సెకండు దృష్టి విధాతలై అందరి కళ్యాణం చేయాలనే శ్రేష్ఠ సంకల్పం ఉత్పన్నమవుతూ ఉందా? నలువైపులా చూచేందుకు పురసత్తు ఉందా? సర్చ్ లైట్ గా అయ్యారా? లేక లైట్ హౌస్ అయ్యారా? ఇప్పుడు నలువైపులా తిరగండి.

ఇటువంటి విశ్వ కళ్యాణకారులు, త్రికాలదర్శులు, త్రినేత్రులు, మాస్టర్ జ్ఞాన సాగరులు, మాస్టర్ విశ్వ రచయితలైన మీరు విశ్వంలో నలువైపులా ప్రదక్షిణ చేయండి. దృష్టి సారించండి. ప్రతి రోజూ విశ్వమంతా తిరగండి. అప్పుడు మీరు స్వదర్శ చక్రధారులనబడతారు. చక్రవర్తులుగా కూడా పిలువబడతారు. కేవలం స్వదర్శన చక్రధారులేనా! లేక చక్రవర్తులుగా కూడా అయ్యారా? రెండూ కదా!

ఇటువంటి మాస్టర్ జ్ఞాన సాగరులు విశ్వ ప్రదక్షిణ చేయువారు చక్రవర్తులు స్వరాజ్య అధికారులు సదా సర్వ ఆత్మ పట్ల దయా హృదయము కళ్యాణ భావన ఉండేవారు ఇటువంటి బాప్ సమాన్ శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే.

(ఈ రోజు దాదీ, దీదిలు ఇరువురూ బాప్ దాదా ముందు కూర్చుని ఉన్నారు) బాప్ దాదా విశేషంగా నిమిత్తమై ఉన్న ఆత్మలను చూసి ఎందుకు సంతోషిస్తున్నారు? ఏ తండ్రి అయినా తమ పిలల్లకు సింహాసనము ఇచ్చిన తర్వాత వారు సింహాసనముపై కూర్చుని ఎలా రాజ్య పాలన చేస్తున్నారో ఈ కలియుగ ప్రపంచములో చూడరు. కానీ అలౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి పిల్లలు సేవా సింహాసనాధికారులై సేవా కార్యాన్ని ఎలా నడిపిస్తున్నారో ప్రాక్టికల్ గా చూసి హర్షిస్తున్నారు. తండ్రి తన పిల్లలను చూడటం సంగమ యుగపు విశేషత. ఈ పరంపరే సత్యయుగములో కూడా కొనసాగుతుంది. అక్కడ కూడా తండ్రి తన పిల్లలకు రాజతిలకమునిచ్చి రాజ్య పాలన ఎలా చేస్తారో చూస్తారు. కలియుగములో ఎవ్వరూ అలా చూడరు. బాప్ దాదా అయితే ప్రతి రోజూ చూస్తారు. ప్రతి ఘడియలోని దృశ్యం, సంకల్పం, మాట, కర్మ అందరితో సంపర్కము బాప్ దాదా వద్ద ఎంత స్పష్టంగా ఉన్నాయంటే మీ వద్ద ఉండే దానికంటే ఎక్కువ స్పష్టంగా ఉన్నాయి. ప్రతి ఘడియలో పిల్లలు చేసే కార్యం చూసి తండ్రి సంతోషిస్తారు. ప్రాక్టికల్ గా రిటర్న్ ఇచ్చుటను చూస్తున్నారు. తండ్రి తమ సమానంగా చేశారు. పిల్లలు అందుకు బదులు ఇచ్చారు. అందువలన తండ్రి పిల్లలను చూసి సంతోషిస్తున్నారు.

ఒక దృశ్యాన్ని విశేషంగా హర్షిస్తున్నారు. ప్రతి రోజూ మీరు చేసే ఒక అద్భుతమైన రాస్(నృత్యాన్ని) చూస్తారు. ఈ రాస్ రోజంతా చాలా సేపు చూస్తారు. అందరూ చేస్తారు. కానీ విశేషంగా వీరు నిమిత్తంగా ఉన్నారు కనుక ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అది సంస్కారాలను కలిపే రాస్. అదే విధంగా ఏదైనా పని ప్రారంభిస్తే రాసి కలుపుతాం కదా. రాస్ చేయుటలో కూడా ఒకరినొకరు కలపడం జరుగుతుంది. కనుక రోజంతా ఈ రాస్ ఎంత సమయం చేస్తారు? బాప్ దాదా వద్ద టీ.వి, రేడియో మొదలైనవన్నీ ఉన్నాయి. అందులో ఎటువంటి దృశ్యం కనిపిస్తుంది? సంస్కారాల ఘర్షణ జరిగే దృశ్యం కూడా బాగుంటుంది. విదేశీయుల శరీరాలు ఎలాగైతే సాగుతాయో, ఎక్కడ కావాలంటే అక్కడ వంచగలరు. అలా వర్తమాన సమయంలో స్వయాన్ని మల్చుకోవడంలో కూడా సులభమవుతూ పోతున్నది. అందువలన ఆ దృశ్యం కూడా బాగున్నది. మొదట టైట్ గా ఉంటారు. తర్వాత కొంచెం లూజ్ అవుతారు. లూజ్ అయిన తర్వాత మిలనము జరుగుతుంది. మిలనము తర్వాత సంతోషంగా నాట్యం చేస్తారు. కనుక దృశ్యం ఎంత బాగుంటుంది. బాప్ దాదా వద్ద అన్నీ ఆటోమేటిక్ గా నడుస్తాయి. అన్ని సంగీత వాయిద్యాలు, అన్ని సాధనాలు సదా సిద్ధంగా(ఎవర్‌ డీ)గా ఉంటాయి. సంకల్పం చేస్తూనే ఎమర్జ్ అవుతాయి. ఈ రోజులలో సైన్స్ కూడా అన్ని సాధనాలను సూక్ష్మంగా తయారు చేస్తున్నాయి కదా. చాలా చిన్నదిగా ఉంటుంది. చాలా శక్తివంతముగా ఉంటుంది. సూక్ష్మవతనమంటేనే శక్తిశాలీ వతనము. చిన్న బిందువులు మీరు అన్నీ చూడగలరు. విస్తారము చేస్తే చాలా పెద్దదిగా చూస్తారు. చిన్నదిగా చేస్తే చాలా చిన్న బిందువైన పిల్లల శ్రమ, ధైర్యం చూసి బాప్ దాదా కూడా సమర్పణ అయిపోతారు. ఎందుకంటే భలే ఎటువంటి పిల్లలైనా ఒకసారి బాబా అని అన్నారంటే సమర్షణైపోతారు. ఎందుకంటే వారు కూడా పిల్లలే. తండ్రి సదా పిల్లలు తప్పు చేసినా అందులో కూడా మంచినే చూస్తారు. ఎలాగైతే మీ సాకార ప్రపంచములో చిన్న చిన్న పిల్లలను సంతోషపరచేందుకు ఎవరైనా క్రిందపడితే వారిని ఏమి దొరికింది అని అడుగుతారు కదా. మూడ్ మార్చేస్తారు. అలా ఇక్కడ కూడా పిల్లలు నడుస్తూ నడుస్తూ క్రింద పడి దెబ్బ(ఠోక్ రా) పడి తిన్నారంటే ఠోక్ రా వలన అనుభవీలై ఠాకూర్ గా (దేవతా విగ్రహము) వలె అయినారని అంటారు. తండ్రి దెబ్బలు చూడరు. దెబ్బల ద్వారా దైవీ గుణాలు(దైవత్వం) ఎంతవరకు వచ్చాయో అది చూస్తారు. అందువలన తండ్రికి ప్రతీ పుత్రుడు అతిప్రియమైనవారే. కాలినడక వారు కావచ్చు, అశ్వారూఢులు కావచ్చు ఎందుకంటే పదాతిదళము వారు లేకున్నా విజయం పొందలేరు. అందువలన ప్రతీ ఆత్మ అవసరమే. తండ్రి మూడు కాలాలను చూస్తారు. కేవలం వర్తమానాన్ని మాత్రమే చూడరు. పిల్లలు వర్తమానాన్ని మాత్రమే చూస్తారు. అందువలన అప్పుడప్పుడు ఇదేమిటి, ఇలా ఎందుకు జరిగింది అని భయపడతారు.

టీచర్లతో - టచర్లు తమ సమానమైన టీచర్లను ఎంతమంది తయారుచేశారు? పెద్దవారు పెద్దవారే. చిన్నవారు తండ్రి సమానమైనవారు. హ్యాండ్ తయారైతే సేవ లేకుండా ఉండలేరు. అప్పుడు సేవ స్వతహాగా వృద్ధి చెందుతుంది. బాప్ దాదా ముందే ఉచ్చరించిన(అడ్వాన్స్ గా చెప్పిన) మహావాక్యాలు ప్రాక్టికల్ గా జరుగుతాయి. ఇప్పుడు ఎంతవరకు చేరుకున్నారు? ఎలాగైతే మ్యాప్లో ప్రతి రాష్ట్రము ఒక బిందువు వలె కనిపిస్తుందో అలా సేవలో ఎంతవరకు చేరుకున్నారు? ఇంకా జరగాల్సిన సేవ చాలా ఉంది. ఇప్పుడు చాలా చాలా పెంచుకుంటూ వెళ్లండి. ఎన్నో సంవత్సరాల ముందు చెప్పిన మాటలు ఇప్పుడు వింటున్నారు. ఒక్కొక్క టీచరు అనేక సెంటర్లు సంభాళించాలని తండ్రి ఆశిస్తున్నారు. అప్పుడే నంబర్ వన్ టీచర్ అని అంటారు. కలియుగములోని ప్రధానమంత్రి ఒక్క రోజులో ఎన్ని స్థానాలకు తిరుగుతారు. మరి సంగమ యుగములోని టీచర్లు ఎన్ని స్థానాలకు తిరగాలి! అప్పుడే చక్రవర్తి రాజులు అని అంటారు. కనుక ఏమి చేయాల్సి వస్తుంది. ప్లాన్ తయారు చేయండి. విదేశీ సేవలో ఇంత శ్రమ చేయాల్సిన పని ఉండదు. భారతదేశంలో చాలా శ్రమ కలుగుతుంది. విదేశీ భూమి కావచ్చు అయినా విని వినిపించే మాటల పట్ల స్పష్టంగా ఉంటారు. భారతదేశంలో ఈ విషయంలో కూడా శ్రమ చేయాల్సి పడుతుంది. రెండవది - విదేశీ ఆత్మలు అన్నీ చూసి అలసిపోయారు. భారతీయులు చూడటం ఇప్పుడు ప్రారంభించారు. భారతదేశం వారిలో ఇప్పుడు కోరిక ఉత్పన్నమైనది. విదేశీయుల కోరిక పూర్తి అయినది. అందువలన భారతదేశంలో సేవ చేయడం కంటే విదేశాలలో సేవ చేయడం చాలా సులభం. మీరు అదృష్టవంతులు. ప్రత్యక్షఫలాన్ని త్వరగా వెలికి తీయగలరు.

పార్టీలతో - లౌకికులు ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళ్తూ ఉంటే ఇంట్లోని వారికి సంతోషముండదు. కానీ పిల్లలు బయటకు(విదేశాలకు) వెళ్తూ ఉంటే చూసి బాప్ దాదా సంతోషపడతారు. ఎందుకు? ఒక్కొక్క సుపుత్రుడు ఋజువునిచ్చేందుకు వెళ్తున్నాడని తెలుసు. పోవడం లేదు, ఇతరులను తీసుకొచ్చేందుకు వెళ్తున్నాడు. ఒక్కరు వెళ్తారు, అనేకమందిని తీసుకు వస్తారు. సంతోషం కులుగుతుంది కదా. ఎక్కడికి వెళ్లినా బాప్ దాదా జతను వదలలేరు. తండ్రి వదలాలనుకున్నా వదలలేరు. పిల్లలు వదలాలనుకున్నా వదలలేరు. ఇరువురూ బంధనంలో బంధింపబడి ఉన్నారు(సత్యయుగంలో వదిలేస్తారు). సత్యయుగంలో కూడా రాజ్య భాగ్యమునిచ్చి సంతోషిస్తారు. వీరు రాజ్యము బాగా పాలిస్తారని, పిల్లలపై నమ్మకము ఉంటుంది కనుక నిశ్చింతగా ఉంటారు. లండన్ వారు తమ సమీప ప్రదేశాలలో సేవను బాగా వృద్ధి పరిచారు. ఇప్పుడింకా నలువైపులా విశ్వమంతటా వ్యాపింపజేయండి. ఏయే  స్థానాలు ఖాళీగా ఉన్నాయో అక్కడ అంతా సేవ చేయండి. లండన్లో సేవలో సహయోగులుగా, అన్నీ హ్యాండ్స్ చాలామంది ఉన్నారు. మంచి ఋజువును ఇచ్చారు. అమృతవేళలలో శక్తిశాలీ స్మృతి కలిగి ఉండుటకు రకరకాల అనుభవాలు చేస్తూ ఉండండి. ఒకసారి జ్ఞాన స్వరూప స్థితిని, ఒకసారి ప్రేమ స్వరూపాన్ని అనుభవం చేయండి. ఇలా భిన్న భిన్నస్థితులను అనుభవం చేస్తూ ఉండుట వలన ఒకటేమో అనుభవం వృద్ధి చెందుతూ ఉంటుంది. రెండవది - స్మృతి చేయుటలో అప్పుడప్పుడు కలిగే అలసట లేక సోమరితనం ఇక మీదట రావు. ఎందుకంటే ప్రతి రోజూ కొత్త అనుభవం అవుతూ ఉంటుంది. రకరకాల స్థితులను అనుభవం చేస్తూ ఉండండి. ఒకసారి కర్మాతీత స్థితి, మరొకసారి ఫరిస్తా రూప స్థితి, మరోసారి ఆత్మిక సంభాషణను అనుభవం చేయండి. రకరకాలుగా అనుభవం చేయండి. ఒకసారి సేవాధారులై సూక్ష్మ రూపంతో ప్రదక్షిణ చేయండి, ఈ అనుభవాన్ని పెంచుకుంటూ ఉండండి. అచ్ఛా. ఓం శాంతి.

Comments