14-06-1977 అవ్యక్త మురళి

* 14-06-1977         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

దేశము మరియు విదేశము యొక్క విహార సమాచారము.

విదేశము యొక్క విశేషతః - ఒకవైపు సృష్టి యొక్క పరివర్తనను చేసేందుకు, స్థూల సాధనాలను కనుగొనేందుకు మరియు ప్రకృతి యొక్క తత్వాలపై విజయముు నిమిత్తులై ఉన్న ఆత్మలైన వైజ్ఞానికులు తమ ఇన్వెన్షన్లను రిఫైన్ చేయుటలో నిమగ్నమై ఉన్నారు. వైజ్ఞానికులు, సమయము పొందాలనే కోరికతో, సర్వతత్వాలను తమ వశీభూతము చేసుకోవాలనే కోరికలో నిమగ్నమై ఉన్నారు. ప్రతి వస్తువును రిఫైన్ చేయడంలోనే తమ విజయం ఉందని వారు భావిస్తున్నారు. ఏవిధంగా కల్పపూర్వపు స్మృతి చిహ్నములోని రావణ రాజ్యము యొక్క విశేషతలో పంచ తత్యాలను తన వశీభూతము చేసుకోవడం గాయనం చేయబడ్డదో అలాగే కల్పపూర్వము వలే ఇదే కార్యంలో విదేశీ ఆత్మలు నిమగ్నమై ఉన్నారు. అలాగే వైజ్ఞానిక ఆత్మలు యోగీ ఆత్మలైన మీ కొరకు, మీ యొక్క శ్రేష్ఠ ప్రారబ్ధముగా స్వర్గము యొక్క రాజ్య భాగ్య ప్రాప్తి ఏదైతే లభించనుందో ఆ రానున్న స్వర్గంలో సర్వసుఖ సాధనాలు రాజయోగీ ఆత్మలైన మీకు లభించాలన్న ఉద్దేశ్యంతో అటువంటి సాధనాలను వారికి తెలియకుండా కూడా తయారుచేయడంలో ఎంతో వ్యస్థమై ఉన్నారు. అనగా దేవతలుగా అవ్వనున్న మీ కొరకు ప్రకృతి యొక్క సతో ప్రధానమైన శ్రేష్ట సాధనాలను కనుగొనడంలో మీ యొక్క సేవలోనే నిమగ్నమై ఉన్నారు. ఏ విధంగా మీరు బాబా ద్వారా లభించే సర్వప్రాప్తుల యొక్క లగ్నములో ఉంటారో అలాగే విదేశీ ఆత్మలు కూడా తమ సైన్స్ శక్తి ద్వారా సృష్టిని స్వర్గంగా తయారుచేయాలనే కోరికలో నిమగ్నమై ఉన్నారు. స్వర్గము అనగా అప్రాప్తి అనే వస్తువే లేని చోటు. ఇటువంటి కార్యం యొక్క లగ్నములో నిమగ్నమై ఉన్న ఆత్మలు డ్రామానుసారంగా నిమిత్తంగా అయి తమ కార్యమును ఎంతో బాగా చేస్తున్నారు. కానీ అవి మీ కొరకే చేస్తున్నారు. ఈ విధంగా వారందరూ మన ఏర్పాట్ల కొరకే నిమగ్నమై ఉన్నారు అని మీకు అనుభవమవుతోందా! ఎంత సత్యతతో, శుభ్రతతో వారు సేవ చేస్తున్నారు! వారి యొక్క కార్యమును మరియు లగ్నమును చూసినట్లయితే ఇది అనుభవం చేసుకుంటారు. సేవ యొక్క కార్యంలో ఎంతో బాగా నమ్మకంగా రాత్రింబవళ్ళు నిమగ్నమై ఉన్నారు. సేవాధారులుగా ఒకే లగ్నములో నిమగ్నమై ఉన్నారు. కానీ, సర్వ సుఖాల యొక్క సాధనాలను ప్రాప్తించుకొనే ఆత్మలైన మీరు ఎవరైతే విశ్వరాజ్యము యొక్క అధికారులుగా అవ్వనున్నారో వారు కూడా ఇదే లగ్నములో మగ్నమై ఉంటున్నారా లేక విఘ్నాలు మీ లగ్నాన్ని అవినాశిగా అవ్వనివ్వడం లేదా! లగ్నము యొక్క అగ్ని అవినాశిగా ప్రజ్వలితమై ఉంటోందా లేక కాసేపు లగ్నము కాసేపు విఘ్నము ఇలా ఉందా?

విదేశము యొక్క వైజ్ఞానిక ఆత్మలు నిరంతరము తమ కార్యంలో నిమగ్నమై ఉండే విశేషతను బాబా చూశారు. కావున ఏ గుణమైతే మీ సేవాధారులలో ఉందో అది విశ్వాధిపతులుగా అయ్యే ఆత్మలైన మీలో కూడా ఉంది కదా! కావున మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇంకొకవైపు విదేశాలలో పరమాత్మ జ్ఞానీ పిల్లలను కూడా చూశారు. వారిలో కూడా వర్తమాన సమయంలో ఒకే దృఢ సంకల్పము లేక లగ్నము ఉంది. ఇప్పుడు త్వరత్వరగా బాబా యొక్క సందేశమును ఇవ్వాలి అన్న ఉల్లాసము, ఉత్సాహమును చూశారు. విదేశములో నిమిత్తులైన విశేష ఆత్మలు, ఎవరి అను భవము యొక్క మాటల ద్వారా భారతవాసి కుంభకర్ణులు మేల్కొంటారో అటువంటి నిమిత్తులైన ఆత్మలను బాబా ముందు సమ్ముఖముగా ప్రత్యక్షము చేయాలి, అనగా సంబంధములోకి లేక సంపర్కములోకి తీసుకురావాలి, సమీప సమయము యొక్క సూచనను విదేశము ద్వారా భారతదేశములో వ్యాపింపచేయాలి అన్న ఈ ఒక్క దృఢ సంకల్పము యొక్క కంకణములో బందించుకున్న పరమాత్మ జ్ఞాని పిల్లలను బాబా చూశారు. వారికి కూడా రాత్రీ పగలూ రెండూ సమానంగా ఉన్నాయి. ఇదే లగ్నములో వారు మగ్నమై ఉన్నారు.

వర్తమాన సమయము యొక్క లగ్నములో మెజార్టీ విఘ్నముక్త ఆత్మలు, పరస్పరము స్నేహము మరియు సహయోగము యొక్క దారాలలో స్మరింపబడిన మాల యొక్క మణులు బాగా మెరుస్తూ కనిపించాయి. కొత్తవారిలోనేనా లేక పాతవారిలోనైనా అందరిలోనూ, ఈ శ్రేష్ఠ కార్యములో నేను కూడా ఒక వేలును వేయాలి, ఏదైనా చేసి చూపించాలి అన్న ఉత్సాహమే ఉంది. బాబా ఇంకేం చూశారు? సందేశాన్ని పొందే ఆత్మలు అనగా జిజ్ఞాసువులు కొద్ది సమయంలో శాంతి మరియు శక్తి యొక్క అంచలిని పొంది ఎంతో సంతోషిస్తూ ఉంటారు. నిమిత్తముగా అయి ఉన్న ఆత్మలను పరమాత్మ ద్వారా లేక గాడ్ ఫాదర్ ద్వారా పంపబడిన అలౌకిక ఫరిస్తాలుగా అనుభవము చేసుకుంటారు. కొద్దిగా తీసుకున్న సేవకు కూడా ప్రతిఫలాన్ని ఇవ్వడంలో తమ సంతోషమును అనుభవం చేసుకుంటారు మరియు వెంటనే రిటర్న్ ఇస్తారు. కొద్ది సేవకు కూడా ఎంతో ధన్యవాదాలు చెబుతారు. ఈ వర్తమాన సమయం లోని పరమాత్మ జ్ఞానుల యొక్క లేక నిమితమై ఉన్న ఆత్మల యొక్క, ఈ సేవ యొక్క చక్రములో చక్రవర్తులుగా అయ్యే పాత్ర ఏదైతే డ్రామాలో రచింపబడి ఉందో ఆ రచనకు కూడా స్థాపన మరియు వినాశనము యొక్క రహస్యముతో ఎంతో సంబంధము ఉంది. ఈ కొద్ది సమయం సేవను ఇవ్వడము లేక చక్రవర్తులుగా అయి తమ దృష్టి ద్వారా, వాణి ద్వారా, సంకల్పము ద్వారా లేక సూక్ష్మ శుభ భావన లేక వృత్తి ద్వారా అనేక రకాలుగా మీ యొక్క రాజధానిని తయారుచేయడంలో నిమిత్తులుగా అయి ఉన్న జ్ఞాని లేక విజ్ఞాని ఆత్మలు కూడా ప్రసిద్ధమవుతారు. సర్వశేష ఆత్మలైన మీ యొక్క దృష్టి ద్వారా నిమిత్తమై ఉండే సేవధారి ఆత్మలకు సేవ యొక్క ఫలితము లభిస్తుంది మరియు సేవాధారులుగా అయ్యే కార్యములో సహాయము లభిస్తుంది. మరి ఈ రహస్యముని అర్థం చేసుకున్నారా!

భారతదేశంలో మీ యొక్క భక్త ఆత్మలు లభిస్తారు, కానీ మూడు రకాలైన ఆత్మలు కావాలి. ఒకరేమో, బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే మరియు ప్రజలుగా అయ్యే ఆత్మలు. ఇంకొకరు, భక్త ఆత్మలు మరియు మూడోవారు మీ రాజధానిని తయారుచేసి ఇచ్చే ఆత్మలు. సేవాదారులు సర్వసుఖాల యొక్క సాధనాలను మరియు సామాగ్రిని తయారుచేయడంలో నిమిత్తులవుతారు మరియు మీరు ప్రారబ్దాన్ని  అనుభవిస్తారు. ఈ పంచ తత్వాలు మరియు ఈ పంచ తత్వాలతో తయారుచేయబడిన ఈ రిఫైన్ వస్తువులు అన్నీ మీ యొక్క సేవ కొరకు నిమిత్తమవుతాయి. ఇంతటి శ్రేష్ఠ స్వమానము మీ యొక్క స్మృతిలో ఉంటోందా లేక ఇప్పటివరకూ ఇంకా స్మృతి - విస్మృతి యొక్క ఆటలోనే నడుస్తున్నారా? స్మృతి స్వరూపము నుండి ఇక సమర్ధ స్వరూపంగా అవ్వండి. విదేశము యొక్క సమాచారము విన్నారా? అలాగే వర్తమాన చక్రవర్తి ఆత్మలు చక్రమును చుట్టిరావడంలో రహస్యముంది. ఎక్కడెక్కడైతే పరమాత్మ జ్ఞానీ ఆత్మలు ఈశ్వరీయ సేవా స్థానాన్ని తెరవడంలో నిమిత్తులయ్యారో మరియు ముందు ముందు ఏవైతే తెరవబడతాయో ఆ విదేశీ సేవా స్థానాలు అవుతాయి. భారతదేశంలోనూ స్మృతిచిహ్న స్థానా లైన మందిరాలు ఉన్నాయి కాని అవి ద్వాపరము తర్వాత తయారవుతాయి. కావున విదేశీ ఆత్మలకు కూడా భవిష్య స్థాపనతో సంబంధముంది. అర్ధమైందా? ఈ రోజు విదేశ సమాచారాన్ని బాబా వినిపించారు. మళ్ళీ తర్వాత భారతము యొక్క సమాచారాన్ని వినిపిస్తారు. ఈ సమాచారాలన్నింటినీ విన్న తర్వాత ఇక ఏం చేయాలి, కేవలం వినాలా లేక ఏమన్నా చేయాలా? ఇటువంటి సర్వ సాధనాలను పొందేందుకు స్వయాన్ని ఎల్లప్పుడూ విశ్వాధిపతులుగా అయ్యేందుకు యోగ్యముగా తయారుచేసుకోండి. నిరంతర యోగులుగా అవ్వడమే యోగీ ఆత్మలుగా అవ్వడం. ఈ విధంగా స్వయాన్ని భావిస్తున్నారా? తీవ్ర పురుషార్థులుగా అయి స్వయాన్ని కూడా సంపన్నంగా చేసుకోండి మరియు నిమిత్తముగా అయి ఉన్న సేవాధారీ ఆత్మలకు కూడా కార్యంలో సంపన్నంగా అయ్యేందుకు ప్రేరణను ఇవ్వండి, అప్పుడు విశ్వపరివర్తకులవుతారు.

సదా లగ్నము ద్వారా విఘ్నాలను వినాశనము చేసే విఘ్న వినాశ ఆత్మలకు, సదా దృష్టి మరియు వృత్తి ద్వారా కూడా విశ్వసేవలో తత్పరులై ఉండే ఆత్మలకు, సదా బాబా సమానంగా గుణాల యొక్క, జ్ఞానము యొక్క, శక్తుల యొక్క దానమునిచ్చే మహాదానులకు, ఆత్మిక దృష్టితో వరదానమునిచ్చే ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా: - విశ్వము యొక్క సర్వ ఆత్మలపై సదా దయ యొక్క లేక కళ్యాణము యొక్క భావన ఉంటోందా? కళ్యాణము యొక్క భావన హద్దులో ఉంటుందా లేక అనంతంగా ఉంటోందా? ఇప్పుడు విశ్వముపై కళ్యాణము యొక్క భావన ఉన్నట్లయితే దానంతటదే స్వయముపై కూడా ఉంటుంది. విశ్వకళ్యాణము చేయడమే సంగమ యుగ బ్రాహ్మణుల యొక్క విశేషమైన డ్యూటీ లేక ధర్మము మరియు కర్మ. తమ జన్మ సహితమైన పనిని చేయడం కష్టపనిపించదు. కావున సదా అమృతవేళ మీ యొక్క పొజిషన్ ను స్మృతిలోకి తీసుకురండి. నా పొజిషన్ విశ్వకళ్యాణకారిగా ఉందా అని పరిశీలించుకోండి. మీ పొజిషన్లో సెట్ అయినట్లయితే అపోజిషన్ నుండి స్వతహాగానే సురక్షితంగా ఉంటారు.

సదా సాక్షీ స్వరూపము యొక్క సీటుపై స్థితులై ఉంటూ మీ యొక్క మరియు ఇతరుల యొక్క ప్రతి పాత్రను చూస్తున్నారా? ఏదైనా డ్రామా యొక్క సీనును సీటులో కూర్చొని చూడడంలో ఎంతో మజా కలుగుతుంది. ఏ సీనునూ సీటులో కూర్చోకుండా చూడరు. కావున మీరు సాక్షీ స్వరూపము యొక్క సీటులో సదా స్థితులై ఉంటున్నారా? ఈ అనంతమైన డ్రామా సదా నడుస్తూనే ఉంటుంది. ఇది 2, 3 గంటల డ్రామా కాదు, ఇది అవినాశీ డ్రామా. కావున దీనిని సదా చూసేందుకు సీటు కూడా సదా ఉండాలి. రెండు గంటలు సీటుపై కూర్చొని వదిలివేయడం కాదు. ఎవరైతే సదా సాక్షిగా అయి చూస్తారో వారు ఎప్పుడూ ఓటమి లేక గెలుపు యొక్క దృశ్యమును చూసి అలజడి చెందరు, సదా ఏకరసముగా ఉంటారు. డ్రామా గుర్తున్నట్టయితే సదా ఏకరసముగా ఉంటారు. డ్రామాను మరచిపోయినట్లయితే  ఊగిసలాడుతూ ఉంటారు. డ్రామా అప్పుడప్పుడూ గురుంటున్నట్లయితే మరి రాజ్యము కూడా అప్పుడప్పుడూ మాత్రమే చేస్తారా? సాక్షిగా అప్పుడప్పుడూ మాత్రమే  మాత్రమే ఉన్నట్లయితే స్వర్గములో తోడుగా కూడా అప్పుడప్పుడూ మాత్రమే అవుతారు. మీరు జ్ఞాన సంపన్నులే కదా! మీకు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి ఉండి కూడా సాక్షీ స్వరూపము యొక్క స్థితిలో స్థితులై ఉండకపోవడానికి కారణం  అటెన్షన్ నిర్లక్ష్యం. స్వచింతనకు బదులుగా వ్యర్ధ విషయాలలో స్వచింతనను పోగొట్టుకుంటారు. స్వచింతనలో ఉండనివారు సాక్షీ స్వరూపులుగా ఉండలేరు, పరచింతనను సమాప్తము చేసేందుకు ఆధారము ఏమిటి? ప్రతి ఆత్మ పైనా శుభచింతన కలిగి ఉన్నటయితే పరచింతన ఎప్పుడూ చేయరు. కావున సదా శుభచింతన కలిగి శుభచింతకులుగా ఉండడం ద్వారా సదా సాక్షిగా ఉండగలుతారు. సాక్షి అనగా ఇప్పుడూ తోడుగా ఉండేవారు మరియు భవిష్యత్తులోనూ తోడుగా ఉండేవారు.

విశేష ఆత్మలు తమ ఏ విశేషతను చూపించారు? విశేష ఆత్మల యొక్క చివరి విశేషత ఏమై ఉంటుంది? బాప్ దాదా ఆ దృశ్యమును అడ్వాన్స్ గా చూస్తున్నారు. అది ఏ విశేషత? ఏ విధంగా సైన్స్ వారు ప్రతి వస్తువును రిఫైన్ చేస్తూ, వేగమును కూడా పెంచుతున్నారో, దానినే ఏ విధంగా మినిట్-మోటార్ అని అంటారో అలాగే విశేష ఆత్మల యొక్క చివరి విశేషత కూడా అదే విధంగా ఉంటుంది. ఒక్క క్షణంలో ఏ ఆత్మనైనా, ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క అనుభవం కలవారిగా చేసేస్తారు. వారు కేవలం దారిని మాత్రమే చూపరు, ఒక్క క్షణంలో శాంతిని లేక అతీంద్రియ సుఖమును అనుభవం చేయిస్తారు. జీవన్ముక్తి యొక్క అనుభవము సుఖము మరియు ముక్తి యొక్క అను భవము శాంతి. వాటిని ముందుకు రాగానే అనుభవం చేసుకుంటారు. ఇటువంటి వేగం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సైన్స్ పై సైలెన్స్ యొక్క విజయమును చూస్తూ అందరినోటా వాహ్వా అన్న శబ్దమే వెలువడుతుంది, సైలెన్స్ పైన కూడా మీరు విజయాన్ని పొందారు అని అంటారు. ఏదైతే సైన్స్ చేయలేదో దానిని సైలెన్స్ చేసి చూపించాలి. అందరూ శాంతిమయమైన, సుఖమయమైన జీవితమును గడపాలన్నదే సైన్స్ యొక్క లక్ష్యము కూడా. కావున ఏదైతే సైన్స్ చేయలేకపోయిందో దానిని చేయండి, అప్పుడే సైన్స్ పై విజయాన్ని పొందారు అని అంటారు. శాంతి కావలసిన వారికి శాంతి, సుఖము కావలసిన వారికి సుఖము లభించాలి. అప్పుడు గాయనం చేస్తారు, మిమ్మల్ని పూర్వజులుగా అంగీకరిస్తారు, ఇష్టదేవతలుగా భావిస్తారు మరియు పదే పదే తండ్రి యొక్క మహిమను చేస్తారు. ఇదే ఆధారముపై మళ్ళీ ద్వాపరములో భక్త ఆత్మల యొక్క మరియు ధర్మపితల యొక్క సంస్కారాలు ఎమర్జ్ అవుతాయి. ఈ విశేష కార్యము ఇప్పుడు జరగనున్నది. అప్పుడు చివరి విజయము యొక్క సమయము వచ్చేసిందని భావించండి. అందరికీ ఎంతో కొంత లభిస్తుంది. వీరు మన తండ్రి అని కేవలం భారతవాసీయులే భావించరు, అందరూ వీరు తమ వారని భావిస్తారు, కావుననే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనడం జరుగుతుంది కదా! ఇతర దేశాలవారు ఇప్పుడు, వీరు భారతదేశ పు తండ్రి యొక్క పరిచయమును ఇస్తున్నారు అని భావిస్తున్నారు. కానీ, గాడ్ ఈస్ వన్ అన్నప్పుడు మరి అందరూ ఆ ఒక్కరినీ అనుభవం చేసుకోవాలి కదా! ఎప్పుడైతే ఆ ఒక్కరినీ అనుభవం చేసుకుంటారో అప్పుడు విజయం లభిస్తుందని అర్థం చేసుకోండి. అందరి నోటి నుండి 'మా బాబా' అన్న ఒకే శబ్దము వెలువడుతుంది. కావున మళ్ళీ ద్వాపరము నుండి ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. అచ్ఛా! 

Comments