14-02-1978 అవ్యక్త మురళి

* 14-02-1978         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“సమీప ఆత్మల యొక్క గుర్తులు" 

సదా స్వయాన్ని బాప్ దాదా తోడుగా అనగా సదా సమీపముగా అనుభవం చేసుకుంటున్నారా? సమీప ఆత్మల యొక్క గుర్తులు ఏమిటి? ఎవరు ఎంతగా సమీపముగా ఉంటారో అంతగా స్థితిలో, కర్తవ్యములో, గుణాలలో బాబా సమానముగా అనగా సదా సంపన్నముగా అనగా దాతగా ఉంటారు. ఏవిధముగా బాబా ప్రతి క్షణములో మరియు సంకల్పములో విశ్వకళ్యాణకారులుగా ఉంటారో అలాగే బాబా సమానముగా వారు విశ్వకళ్యాణకారులుగా ఉంటారు. విశ్వకళ్యాణకారుల యొక్క ప్రతి సంకల్పము ప్రతి సంకల్పము ప్రతి యొక్క ఆత్మ ప్రతి శుభభావనలతో కూడుకున్నదై ఉంటుంది. ఒక్క సంకల్పము కూడా శుభభావన లేకుండా ఉండదు. ఏ విధముగా బీజము ఫలాలతో నిండుగా ఉంటుందో అనగా మొత్తం వృక్షమంతటి యొక్క సారము బీజములో నిండి ఉంటుందో అలాగే సంకల్ప రూపీ బీజములో శుభభావన, కళ్యాణము యొక్క భావన, సర్వులను బాబా సమానముగా తయారుచేసే భావన నిర్బలులను శక్తివంతులుగా సుఖశాంతమయంగా తయారుచేయాలి అనే భావన మొదలైన ఈ సర్వ రసాలు లేక సారము ప్రతి సంకల్పములను నిండి ఉంటుంది. ఏ సంకల్ప రూపీ బీజములు ఈ సారము లేకుండా ఖాళీగా అనగా వ్యర్ధముగా ఉండవు. కళ్యాణము యొక్క భావనతో సమర్ధముగా ఉంటాయి. 

స్థూలమైన సంగీతము ఆత్మలను అల్పకాలికంగా, ఉల్లాసంలోకి తీసుకువస్తుంది, తాము కోరుకోకపోయినా అందరి కాళ్ళు నాట్యమాడడం మొదలుపెడతాయి కదా! మనస్సు నాట్యమాడడం మొదలుపెడుతుంది, అలాగే ఉదాసీనమై ఉన్న ఆత్మ బాబాతో మిలనమును జరుపుకున్న అనుభవమును చేసుకుంటుంది మరియు సంతోషములో నాట్యమాడడం మొదలుపెడుతుంది. విశ్వకళ్యాణకారి యొక్క కర్మ, కర్మయోగిగా ఉన్న కారణముగా ప్రతి కర్మా చరిత్ర సమానముగా, గాయన యోగ్యముగా ఉంటుంది. ప్రతి కర్మ యొక్క మహిమ కీర్తించదగినదిగా ఉంటుంది. ఏ విధంగా భక్తులు కీర్తనలలో చూడడం అలౌకికం, నడవడం అలౌకికం అంటూ వర్ణన చేస్తారో, ప్రతి కర్మేంద్రియం యొక్క మహిమను అపారముగా, ఏ విధముగా చేస్తూ ఉంటారో అలాగే ప్రతి కర్మా మహాన్. అనగా మహిమా యోగ్యముగా ఉంటుంది. ఇటువంటి ఆత్మనే బాబా సమానమైన సమీప ఆత్మ అని అంటారు. ఇటువంటి విశ్వకళ్యాణకారి ఆత్మ యొక్క ప్రతి క్షణము యొక్క సంపర్కము ఆత్మలకు సర్వకామనల యొక్క ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది. కొందరు ఆత్మలకు శక్తి యొక్క, కొందరు ఆత్మలకు శాంతి యొక్క కొందరికి కష్టమైన దానిని సహజముగా చేసే అనుభవం, ఆధీనులను అధికారులుగా తయారుచేసే విధంగా, ఉదాసీనత నుండి హర్షితముగా అయ్యేలా ... ఈ ఈ విధంగా విశ్వకళ్యాణకారీ మహాన్ ఆత్మ యొక్క సంపర్కము, సదా ఉల్లాసమును మరియు ఉత్సాహమును కలిగిస్తుంది. పరివర్తనను అనుభవం చేయిస్తుంది. ఛత్రఛాయను కూడా అనుభవం చేయిస్తుంది. ఇటువంటి విశ్వకళ్యాణకారులు అనగా సమీప ఆత్మలుగా అయ్యేవారినే, ఇటువంటివారినే లగ్నములో మగ్నమై ఉండే ఆత్మలు అని అనడం జరుగుతుంది. మీరు అలా అవుతున్నారు కదా!

అధికారులుగా తయారుచేసారు. ఈ అధికారము అందరికీ లభించింది, కానీ విశ్వాధిపతులుగా తయారయ్యే అధికారము విశ్వకళ్యాణకారులుగా అవ్వడం యొక్క ఆధారము పైనే లభిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ అధికారిగా అయ్యానా అని తమను తాము ప్రశ్నించుకోండి. రాజ్య భాగ్యానికి అధికారిగా అయ్యారా? సింహాసనాధికారులుగా అయ్యేందుకు అధికారులుగా అయ్యారా లేక రాయల్ ఫ్యామిలీలోకి వచ్చేందుకు అధికారులుగా అయ్యారా? 

విదేశీ ఆత్మలు స్వయాన్ని ఏ విధంగా భావిస్తున్నారు? అందరూ రాజ్యం చేస్తారా? లేక రాజ్యములోకి వస్తారా? లేక ఏది లభించినా సరే అని భావిస్తున్నారా? విదేశీ ఆత్మలనుండి సత్యయుగపు 8 రాజ్యాధికారాలలో సింహాసనాధికారులుగా అవుతాము అని ఎవరు భావిస్తున్నారు? రాజ్యాధికారాలలో లక్ష్మీనారాయణ్ ది ఫస్ట్ సెకండ్... ఎందులో వస్తారు. ఆ రాజ్యాధికారములలోకి వచ్చేందుకు ఏం చేయవలసి ఉంటుంది? లేక కేవలం ఎనిమిదే కదా! అని ఆలోచిస్తున్నారా? ఇది చాలా సహజము. అన్ని వేళలలోనూ, అన్ని పరిస్థితులలోనూ అష్టశక్తులు మీ తోడుగా, సదా ప్రత్యక్షంగా ఉండేవిధముగా చూసుకోండి. 2-4 శక్తులు ఉంటూ ఏ ఒక్క శక్తి తగ్గిపోయినా రాజ్యాధికారాలలోకి రాజాలరు. అష్టశక్తులలో సమానత ఉండాలి మరియు ఒకే సమయంలో 8 శక్తులు ప్రత్యక్షంగా ఉండాలి. సహనశక్తి 100 శాతం ఉంది కానీ నిర్ణయ శక్తి 60 శాతం లేక 50 శాతం ఉంది అని కాదు. రెండింటిలోనూ సమానత కావాలి. అనగా శాతం పూర్తిగా ఉండాలి. అప్పుడే సంపూర్ణ రాజ్యసింహాసనానికి అధికారులుగా అవుతారు. ఇప్పుడు ఏమవుతారో చెప్పండి. 8 లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యము లేక సింహాసనమునకు అధికారులుగా అవుతారా?

విదేశీ ఆత్మలలో ఉల్లాస, ఉత్సాహాలు బావున్నాయి. పిల్లలు ధైర్యమును ఉంచితే బాబా సహాయం చేస్తారు. హైజంప్ తీసుకునే ఉదాహరణగా అవ్వవచ్చు కానీ ఈ విషయాలన్నీ ధ్యానములో ఉంచుకోవలసి ఉంటుంది. మీరు. విశేష ఆత్మలు. కావుననే, రేసులో పరుగు తీసేవారు, ఇటువంటి ఉల్లాస ఉత్సాహాలు కలవారు, దూరంగా ఉంటూ కూడా సమీపముగా అనుభవం చేసుకునేవారు, ఇటువంటి ఆత్మలు కూడా తప్పక ఉన్నారని బాప్ దాదాకు కూడా తెలుసు. ఇప్పుడు స్టేజిపై ప్రత్యక్షంగా మీ పాత్రను అభినయించండి. పురుషార్ధమును ముందుకు తీసుకువెళ్ళాలి. మొదటినెంబర్ యొక్క విశేషత ఏమిటి? అదేవిధంగా మీ యొక్క పురుషార్ధమును చేయాలి. ప్రతి కర్మలోనూ పైకి ఎక్కే కళ ఉండాలి, అచ్ఛా

ఆఫ్రికా పార్టీతో : అందరూ తీవ్ర పురుషార్థులే కదా! తీవ్రపురుషార్ధము అనగా ఆలోచించగానే చేయడం, ఆలోచించడంలో మరియు చేయడంలో తేడా ఉండకూడదు. కొన్ని విషయాలలో ప్లాన్‌ను ఎన్నో తయారుచేస్తారు కానీ ప్రాక్టికల్ లో తేడా వచ్చేస్తుంది. కావున తీవ్ర పురుషార్థులు ఎవరైతే ఉంటారో వారు ఏ ప్లాన్ అయితే తయారుచేస్తారో అదే ప్రాక్టికల్ గా జరుగుతుంది. కావున మీరు ఇటువంటి పురుషార్థులేనా? పరాయి రాజ్యం ఉన్న కారణముగా మీ వైపుకు పరిస్థితులు ఎన్నో వస్తాయి. కానీ ఎవరైతే సదా బాబా తోడుగా ఉంటారో వారి ముందు పరిస్థితులు కూడా స్వస్థితి యొక్క ఆధారముపై పరివర్తన చెందుతాయి. పర్వతము కూడా ఆవగింజలా మారిపోతుంది. ఎన్నోసార్లు ఈ విషయాలన్నింటినీ దాటి వెళ్ళినట్లుగా, అందులో, కొత్త ఏమీ లేనట్లుగా అనుభవమవుతుంది. కొత్త విషయాలలోనే కంగారుపడవలసి ఉంటుంది. కానీ మీకు కొత్త ఏమీ లేదు. ఈవిధంగా అనుభవం చేసుకునేవారు సదా కమలపుష్ప సమానముగా ఉంటారు. నీరు కింద ఉంటుంది, కమలం పైన ఉంటుంది. అలాగే పరిస్థితి కింద ఉంటుంది, మనం పైన ఉంటాము. కింద విషయము కిందే ఉంటుంది. ఎప్పుడైనా, ఏదైనా విషయం వస్తే బాప్ దాదా మన తోడుగా ఉన్నారు అని భావించండి. సర్వశక్తివంతుని ముందు ఎంత పెద్ద పరిస్థితి అయినా చీమ సమానమైనదే. పరిస్థితి ఎలా వున్నా సరే - ఎవరైతే బాబాకు చెందినవారిగా అయ్యారో వారి యొక్క బాధ్యత బాబాదే. ఎక్కడ ఉంటామో, ఎలా ఉంటామో, ఏమి తింటామో అని ఆలోచించకండి. సత్యమైన హృదయానికి తండ్రి తోడుగా ఉంటారు. ఎప్పటివరకైతే తండ్రి ఉంటారో అప్పటివరకు పస్తులతో ఉండజాలరు. భక్తులకే అనేకరకాలైన అనుభవాలు కలుగుతూ ఉంటాయి, వారు బికారులు, వారి కడుపు కూడా నిండుతుంది మరి మీరు అధికారులు కదా! మీరు పస్తులతో ఎలా ఉండగలరు? కావున ఏమవుతుందోనని కొద్దిగా కూడా భయపడకండి. ఏదైతే జరుగుతుందో అది మంచియే జరుగుతుంది. కేవలం ఎంతవరకు నిశ్చయం ఉంది అన్న చిన్న పరీక్ష ఉంటుంది. పరీక్షలు కూడా జీవితమంతా ఉండవు కదా! గంట లేక రెండు గంటలు పరీక్షలు ఉంటాయి. బాప్ దాదా సదా తోడుగా ఉన్నట్లయితే పరీక్షను ఎదుర్కొనే సమయంలో ఒకే బలం, ఒకే విశ్వాసం ఉన్నట్లయితే అసలు ఏమీ లేనట్లుగానే దానిని దాటివేస్తారు. స్వప్నంలో జరిగిన విషయం మేల్కొన్న తర్వాత సమాప్తమైపోయినట్లుగా ఇది కూడా పెద్ద రూపంలో కనిపించినా నిజానికి అది ఏమీ లేదు. మరి మీరు ఇంతటి నిశ్చయబుద్ధి కలవారేనా? ప్రతి ఒక్కరి మస్తకము పైనా విజయము యొక్క తిలకము దిద్దబడి ఉంది. కావున ఇటువంటి విజయ తిలకధారులైన ఆత్మల యొక్క ఓటమి ఎలా జరుగగలదు? ఎంతో కష్టపడి వచ్చారు, పరిస్థితిని దాటి వచ్చారు. కావున బాప్ దాదా కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదికూడా డ్రామాలో ఉంది. ఏవిధంగా స్టీమర్ మునిగిపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క వైపుకు వెళ్ళిపోతారో అలాగే ఇక్కడ కూడా ద్వాపరయుగములో అందరూ తప్పిపోయారు. కొందరు విదేశాలలోకి, కొందరు దేశములోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు బాబా చెల్లాచెదరైన పిల్లలను పోగు చేస్తున్నారు. ఇప్పుడు ఇక నిశ్చింతగా ఉండండి. ఏది జరిగినా సరే, అది ముందు బాబా ముందుకు వెళ్తుంది. మీరు మహావిరులే కదా! భట్టి మధ్యలో ఫిల్లికూనలు సురక్షితంగా ఉన్నాయి అన్న కథను విన్నారు కదా! ఏమి "జరిగినా సరే, మీరు సురక్షితంగా ఉంటారు. కేవలం మాయా ప్రూఫ్ యొక్క దుస్తులు ధరించి ఉండాలి. మాయా
యొక్క దుస్తులు సదా మీ తోడుగా ఉన్నాయి కదా! విమానంలో కూడా, ఎమర్జన్సీలో ఏదైనా జరిగితే గరించండి అని డ్రస్ ను ఇస్తారు. కావున మీకు చాలా సహజమైన సాధనము లభించింది.

ఒక్కొక్క రత్నము ఎంతో విలువైనది. ఎందుకంటే, రత్నాలు విలువైనవి కాకపోతే కోట్లాదిమందిలో ఏ ఒక్కరిగానో మీరు ఎలా వస్తారు? ఎవరిని పొందేందుకు ప్రపంచమంతా తపిస్తోందో వారు నన్ను తనవారిగా చేసుకున్నారు. ఒక్క క్షణము యొక్క దర్శనము కొరకు ప్రపంచం తపిస్తోంది, కానీ మీరు స్వయం పిల్లలుగా అయిపోయారు కావున ఎంతటి నషా, ఎంతటి సంతోషము ఉండాలి! సదా మనస్సు సంతోషములో నాట్యమాడుతూ ఉండాలి. వర్తమాన సమయంలోని సంతోషము యొక్క ఈ నాట్యమునకు గుర్తు చిత్రములో కూడా చూపిస్తారు. కృష్ణుడిని ఎల్లప్పుడూ నాట్యమాడుతున్న భంగిమలో చూపిస్తారు కదా! 

ఏవిధముగా బాబా వంటివారు ఎవరూ లేరో అలాగే మీ వంటి భాగ్యవంతులు ఇంకెవ్వరూ ఉండరు. అచ్ఛా! ఎవరైతే చేరుకోలేకపోయారో వారికి కూడా ఎంతో ప్రియస్మృతులను ఇవ్వండి. బాప్ దాదా యొక్క స్నేహము తప్పకుండా సమీపముగా తీసుకువస్తుంది. అమృతవేళ లేచి బాబాతో ఆత్మిక సంభాషణ చేసినట్లయితే అన్ని పరిస్థితులకు స్పష్టమైన సమాధానము కనిపిస్తుంది. ఏమి జరిగినా దానికి సమాధానము ఆత్మిక సంభాషణలో లభిస్తుంది. మధువన వరదాన భూమి నుండి విశేషముగా ఈ వరదానమును తీసుకొని వెళ్ళండి, తద్వారా ఇతర లిస్టు కూడా లభిస్తాయి. భారమును ఎత్తేందుకు బాబా కూర్చున్నప్పుడు మరి మీరు ఎందుకు ఎత్తుతున్నారు? ఎంతగా తేలికగా ఉంటారో అంతగా పైకి ఎగురుతూ ఉంటారు. తేలికగా అవ్వడం ద్వారా ఉన్నతమైన స్థితి ఎలా ఏర్పడుతుందో అనుభవం చేసుకుంటారు.

బాబాను తెలుసుకున్నారు, పొందారు. ఇంతకన్నా గొప్ప భాగ్యము ఇంకేదీ ఉండదు. ఇంట్లో కూర్చునే మీకు బాబా లభించారు. పిల్లలూ, మేల్కొనండి అని బాబాయే వచ్చి మేల్కొలిపారు కదా! ఏ దేశంలో ఉన్నా సరే స్థితి మటుకు సదా బాబా తోడుగా ఉండే విధముగా ఉండాలి. దేశం నుండి దూరంగా ఉన్నా కానీ బాబా తోడుగా ఉండేవారు అతి సమీపమైనవారు. కుమారీలు నిర్విఘ్నులుగా ఉన్నారు, ఎందుకు? సేవ కొరకు. డ్రామాలో ఇది కూడా ఒక లిప్టే. ఈ లిఫ్ట్ ద్వారా లాభాన్ని పొందాలి. ఎంతెంతగా మీ సమయమును ఈశ్వరీయ సేవలో వినియోగిస్తూ ఉంటారో అంతగా లౌకిక సేవ యొక్క సహయోగము కూడా లభిస్తుంది, అది బంధనగా ఉండదు. కుమారీలంటే బాబాకు ఎంతో ప్రేమ, ఎందుకంటే ఏ విధముగా బాబా నిర్బంధనులో అలాగే కుమారీలూ నిర్బంధనులే. కావున వారు బాబా సమానమైన వారయ్యారు కదా! అచ్ఛా

ట్రినిడాడ్, గయానా వారితో : వరదాన భూమిలోకి వచ్చి అనేక వరదానాలతో స్వయాన్ని సంపన్నముగా చేసుకున్నారు. మధువనము సంపాదనతో జోలెను నింపుకునే స్థానము. మధువనానికి రావడం అనగా స్వయాన్ని వర్తమానము మరియు భవిష్యత్తు కొరకు అధికారులుగా తయారుచేసుకునే స్టాంపు వేసుకోవడం. అధికారిగా అయ్యేందుకు సాధనము మాయ యొక్క ఆధీనతను వదలడం. కావున మీరు అధికారులే కదా! అచ్చా!

కెనడా: కెనడా వారు ఎన్ని రత్నాలను వెలికి తీసారు? సంఖ్య లేకపోయినా క్వాలిటీ అయితే ఉంది కదా! ఒక దీపముతో దీపమాల తయారయినట్లుగా ఒక్కరి ద్వారా ఇంతమంది తయారయ్యారు కదా! కావున ప్రతి ఒక్కరూ నేనొక్కడిని, అనేకులకు సందేశమునిచ్చి మాలను తయారుచేయాలి అని భావించాలి. సంపర్కములోకి వచ్చి వారికీ బాబా యొక్క పరిచయమును ఇస్తూ ఉన్నట్లయితే ఎవరో ఒకరు వెలువడతారు. ఎవరూ వెలువడడంలేదు ధైర్యమును కోల్పోకండి. తప్పక వెలువడతారు. కొన్ని భూములు ఆలస్యంగా ఫలమునిస్తాయి, కొన్ని త్వరగా ఇస్తాయి. కావున డ్రామానుసారముగా ఎక్కడ సేవకు నిమిత్తులయినా తప్పకుండా ఎవరో రత్నాలు ఉన్నారు కావుననే అక్కడ నిమిత్తులయ్యారు. ఇప్పుడు మేము సేవ యొక్క ప్రమాణాన్ని ఇవ్వాలి అన్న లక్ష్యమును శక్తిశాలిగా ఉంచుకోండి. అప్పుడు సఫలత తప్పక లభించి తీరుతుంది. 

లెస్టర్ వారితో: సదా అతీంద్రియ సుఖములో ఊగుతూ ఉన్నారు కదా! తండ్రి లభించారు, సర్వమూ లభించాయి. ఈ స్మృతి ద్వారా అతీంద్రియ సుఖము యొక్క అనుభూతి దానంతట అదే కలుగుతుంది. దుఃఖము అంటే ఏమిటో తెలియని విధముగా దుఃఖము యొక్క నామరూపాలే లేకుండా ఉంటుంది. భవిష్యత్తులో దుఃఖము మరియు అశాంతి యొక్క జ్ఞానము ఏ విధముగా ఉండదో అలాగే ఇప్పుడు కూడా దుఃఖము, అశాంతి యొక్క ప్రపంచమే వేరు అని అనుభవం చేసుకుంటారు. వారు కలియుగమువారు, మనము సంగమయుగము వారము. సంగమయుగం వారి వద్ద దుఃఖము, అశాంతుల యొక్క నామరూపాలే ఉండవు. దుఃఖితులను చూస్తే దయ కలుగుతుంది. దుఃఖము యొక్క అనుభవమును ఎంతో కాలంగా చేసారు. ఇప్పుడు సంగమయుగము అతీంద్రియ సుఖములో ఉండే సమయము. ఈ అనుభవము సత్యయుగములో కూడా ఉండదు. సమయాన్ని బట్టి లాభాన్ని పొందండి. ఇది అతీంద్రియ సుఖమును పొందే సీజన్. కావున సీజన్ లో పొందకపోతే మరి ఇంకెప్పుడు పొందుతారు? బాబా యొక్క స్మృతియే ఊయల. ఈ ఊయలలోనే ఊగుతూ ఉండండి. దీనికన్నా కిందకు రాకండి. లెస్టర్ వారు కూడా సేవలో ముందునెంబర్ లో ఉన్నారు. లండన్లో లెస్టర్ యొక్క మహిమ కూడా బాగుంది. దయాద్ర హృదయులు, వారు తమ తోటివారిని పెంచుతున్నారు. కుమారులు, కుమారీలు, యుగళులు అందరూ బ్రాహ్మణులే కనిపించాలి. వృద్ధినొందుతున్నారు. రిజల్ట్ బాగుంది కానీ ఇంకా పెంచండి. సంఖ్య ఎంతగా పెరిగిపోవాలంటే ఎక్కడ చూసినా బ్రాహ్మణులే కనిపించాలి. 

మారిషస్: సదా స్వయం బాబా ద్వారా సర్వప్రాప్తులతో సంపన్నంగా భావిస్తున్నారా? ఏ విధముగా బాబా సాగరులో, (సాగరము అనగా సంపన్నులు) అలాగే స్వయాన్ని కూడా సంపన్నముగా భావిస్తున్నారా? సంపన్నముగా లేనట్లయితే మాయ యొక్క యుద్ధం ఏదో ఒక రూపంలో జరుగుతూ ఉంటుంది. సంపన్నులు అనగా మాయాజీతులు. సంగమములోనే మాయాజీతులుగా అయ్యే విషయం ఉంటుంది కానీ సత్య యుగములో ఉండదు. మాయాజీత్ అన్నది వర్తమాన సమయం యొక్క టైటిలే. దానిని ఇప్పుడే అనుభవం చేసుకోవాలి. ఎంత లగ్నం ఉంటుందో అంతగా నిర్విఘ్నులుగా ఉంటారు, అచ్ఛా

Comments