13-11-1981 అవ్యక్త మురళి

* 13-11-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

పరిశీలన మరియు నిర్ణయ శక్తి యొక్క ఆధారము - సైలెన్స్ యొక్క శక్తి.

ఈ రోజు నిర్వాణము అనగా వాణి నుండి అతీతమైన శాంత స్వరూప స్థితిని అనుభవం చేయిస్తున్నారు. ఆత్మలైన మీ యొక్క స్వధర్మము మరియు సుకర్మ, స్వకర్మ, స్వస్వరూపము, స్వదేశము శాంతియే. సంగమ యుగం యొక్క విశేష శక్తి కూడా సైలెన్స్ యొక్క శక్తియే. సంగమయుగ ఆత్మలైన మీ యొక్క లక్ష్యము ఇప్పుడు స్వీట్ సైలెన్స్ హోమ్ లోకి వెళ్ళడమే. అనాది లక్షణమైన శాంతి స్వరూపంగా ఉండడము మరియు సర్వులకు శాంతిని ఇవ్వడము, ఈ శక్తియే విశ్వంలో ఎంతో అవసరం. సర్వ సమస్యల యొక్క సమాధానము ఈ సైలెన్స్ యొక్క శక్తి ద్వారానే లభిస్తుంది, ఎందుకు? సైలెన్స్ అనగా శాంత స్వరూపం యొక్క గుర్తు, ఏకాంతవాసిగా ఉన్న కారణంగా సదా ఏకాగ్రంగా ఉంటుంది మరియు ఏకాగ్రత యొక్క కారణంగా విశేషంగా రెండు శక్తులు సదా ప్రాప్తమవుతాయి. ఒకటి - పరిశీలనా శక్తి, ఇంకొకటి - నిర్ణయ శక్తి. విశేషమైన ఈ రెండు శక్తులు వ్యవహారము మరియు పరమార్థము రెండింటి యొక్క సర్వ సమస్యలకు సహజ సాధనము.

పరమార్థ మార్గంలో విఘ్నవినాశకులుగా అయ్యేందుకు సాధనము - మాయను పరిశీలించగల్గడం, పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవడం. పరిశీలించని కారణంగానే మాయ యొక్క భిన్న భిన్న రూపాలను దూరం నుండే పారద్రోలలేకపోతారు. పరమార్థులైన పిల్లల ముందు మాయ కూడా రాయల్ ఈశ్వరీయ రూపమును రచించి వస్తుంది. దాన్ని పరిశీలించేందుకు ఏకాగ్రతా శక్తి కావాలి మరియు ఏకాగ్రతా శక్తి సైలెన్స్ శక్తి ద్వారానే ప్రాప్తమవుతుంది. 

వర్తమాన సమయంలో బ్రాహ్మణ ఆత్మలలో తీవ్ర గతి యొక్క పరివర్తన తక్కువగా ఉంది. ఎందుకంటే మాయ యొక్క రాయల్ ఈశ్వరీయ రోల్డ్ గోల్డ్ ను రియల్ గోల్డ్ గా భావిస్తారు. ఆ కారణంగా వర్తమానమును గుర్తించని కారణంగా ఎటువంటి మాటలు మాట్లాడతారు? నేను ఏదైతే చేశానో లేక చెప్పానో అది సరిగ్గానే చేశాను, నేను ఏ విషయంలో తప్పు? ఇలాగే నడవవలసి ఉంటుంది కదా అని అంటారు. తప్పు అయి ఉండి కూడా తప్పుగా భావించరు, అందుకు కారణం పరిశీలనా శక్తి యొక్క లోపము. మాయ యొక్క రాయల్ రూపమును రియల్ గా భావించుకుంటూ ఉంటారు. పరిశీలనా శక్తి ఉండని కారణంగా యదార్థమైన నిర్ణయాన్ని కూడా తీసుకోలేరు. స్వపరివర్తన చేయాలా లేక పరపరివర్తన చేయాలా అన్న నిర్ణయాన్ని కూడా తీసుకోలేరు. కావున పరివర్తన యొక్క గతి తీవ్రంగా ఉండాలి. సమయం తీవ్ర గతితో ముందుకు వెళుతోంది కాని సమయానుసారంగా పరివర్తన జరగడము మరియు స్వయం యొక్క శ్రేష్ఠ సంకల్పంతో పరివర్తన జరగడంలో, ఇందులో ప్రాప్తి యొక్క అనుభూతిలో రాత్రికి పగలుకీ ఉన్నంత తేడా ఉంది. ఏ విధంగా ఈ రోజుల్లో కారును నడుపుతారో, అందులో ఒకటి - సెల్ఫ్ స్టార్ట్ అయ్యే కారైతే ఇంకొకటి తోస్తే స్టార్ట్ అయ్యే కారు. రెండింటిలో తేడా ఉంది కదా! కావున సమయం యొక్క తోపుతో పరివర్తన అవ్వడము పురుషార్థం యొక్క బండి తోస్తే నడిచేదిగా ఉండడం. అది బండిలో స్వారీ చేయడం అవ్వలేదు, స్వారీని నడపడమయ్యింది. సమయం యొక్క ఆధారంపై పరివర్తితమవ్వడము అనగా కేవలం ప్రాప్తి యొక్క కొద్ది భాగాన్ని ప్రాప్తించుకోవడం. ఒకరేమో యజమానులు, ఇంకొకరు కొద్ధిగా షేర్లు తీసుకునేవారు. అధికారులైన యజమానులు ఎక్కడ, ఏదో కొద్దిగా అంచలి తీసుకొనేవారెక్కడ! దీనికి కారణమేమిటి? సైలెన్స్ శక్తి యొక్క అనుభూతి లేదు. దాని ద్వారా పరిశీలించే మరియు నిర్ణయం తీసుకునే శక్తి ప్రాప్తమవ్వడం ద్వారా పరివర్తన తీవ్రగతితో జరుగుతుంది. సైలెన్స్ శక్తి ఎంత గొప్పదో అర్థమైందా? సైలెన్స్ శక్తి క్రోధాగ్నిని శీతలంగా చేసేస్తుంది. సైలెన్స్ యొక్క శక్తి వ్యర్థ సంకల్పాల యొక్క అలజడిని సమాప్తం చేయగలరు. సైలెన్స్ యొక్క శక్తియే ఎటువంటి పురాతన సంస్కారాలనైనా అలాగే సమాప్తం చేసేస్తుంది. సైలెన్స్ యొక్క శక్తి అనేకరకాలైన మానసిక రోగాలను సహజముగా సమాప్తం చేయగలదు. సైలెన్స్ యొక్క శక్తి శాంతిసాగరుడైన తండ్రితో అనేక ఆత్మల యొక్క మిలనమును జరుపగల్గుతుంది. సైలెన్స్ యొక్క శక్తి అనేక జన్మలుగా భ్రమిస్తున్న ఆత్మలకు ఆధారం యొక్క అనుభూతిని కలిగించగల్గుతుంది. మహాన్ ఆత్మలుగా, ధర్మాత్ములుగా తయారుచేస్తుంది. సైలెన్స్ యొక్క శక్తి ఒక్క క్షణంలో మూడు లోకాలను తిరిగివచ్చేలా చేస్తుంది. ఇది ఎంత ఉన్నతమైనదో మీకర్థమైందా? సైలెన్స్ యొక్క శక్తి తక్కువ శ్రమతో, తక్కువ ఖర్చుతో ఎంతో ఆనందమయంగా చేయగల్గుతుంది. సైలెన్స్ యొక్క శక్తి - సమయం యొక్క ఖజానాలో కూడా ఎకానమీని కలిగిస్తుంది అనగా తక్కువ సమయంలో ఎక్కువ సఫలతను పొందగల్గుతారు. సైలెన్స్ యొక్క శక్తి ఆహాకారాల నుండి జయజయకారాలను ప్రాప్తింపజేయగలదు. సైలెన్స్ యొక్క శక్తి సదా మీ కంఠంలో సఫలత యొక్క మాలలను ధరింపజేయగలదు. జయజయకారాలు జరిగాయి. మాలలు కూడా పడ్డాయి. ఇంకేం మిగిలి ఉంది? అన్నీ జరిగిపోయాయి కదా? మీరు ఎంత గొప్పవారో విన్నారా! మహాన్ శక్తిని కార్యంలో తక్కువగా వినియోగిస్తారు.

వాణి ద్వారా బాణం వేయడం వచ్చింది, ఇప్పుడిక శాంతి యొక్క బాణాన్ని వేయండి, దాని ద్వారా ఇసుకలో కూడా పచ్చదనాన్ని తేగల్గుతారు. ఎంత కఠినమైన పర్వతం నుండైనా నీటిని తీయగల్గుతారు. వర్తమాన సమయంలో శాంతి యొక్క శక్తిని ప్రత్యక్షతలోకి తీసుకురండి. మధువనం యొక్క ధరణి కూడా ఎందుకు ఆకర్షిస్తుంది? శాంతి యొక్క అనుభూతి కల్గుతుంది కదా! అలాగే నలువైపులా ఉన్న సేవాకేంద్రాలను మరియు ప్రవృత్తి యొక్క స్థానాలను శాంతి కుండలిగా చేయండి. తద్వారా నలువైపులా శాంతి యొక్క కిరణాలు విశ్వంలోని ఆత్మలను శాంతి యొక్క అనుభూతి వైపుకు ఆకర్షితం చేస్తాయి, అయస్కాంతాలుగా అయిపోతాయి. మీ సర్వస్థానాలు శాంతి ప్రాప్తి యొక్క అయస్కాంతాలుగా అయిపోయే సమయం వస్తుంది. మీరు వెళ్ళవలసిన అవసరం రాదు, వారు స్వయం వస్తారు. కాని అది కూడా ఎప్పుడైతే సర్వులలో శాంతి యొక్క మహా శక్తి నిరంతరం సంకల్పము, వాక్కు మరియు కర్మలో ఏర్పడుతుందో అప్పుడే మాస్టర్ శాంతిదేవులుగా అయిపోతారు. కావున ఇప్పుడు ఏం చేయాలో అర్థమైందా?

(ఈ రోజు ఉదయం మధువనంలో కర్నాటక జోన్లోని అన్నయ్య ఒకరు హార్ట్ ఫేల్ అవ్వడంతో శరీరం వదిలివేసారు. శరీరం యొక్క అంతిమ సంస్కారాలను ఆబూలోనే చేయడం జరిగింది)

ఈ రోజు ఏ పాఠం నేర్చుకున్నారు? కర్నాటక గ్రూపు వారు ఏ పాఠమును పక్కా చేసుకున్నారు? సదా ఎవర్రడీగా ఉండే పాఠమును పక్కా చేసుకున్నారా? సదా దేహము, దేహము యొక్క సంబంధము, పదార్థాలు, సంస్కారాలు అన్నిటి యొక్క పెట్టా బేడ సదా మూయబడి ఉండాలి. చిత్రాలలో కూడా సర్దుకునే శక్తిని ఎలా చూపిస్తారు? పెట్టా బేడా ప్యాక్ అయి ఉంటాయి. అలాగే చూపిస్తారు కదా! ఇది చేయవలసి ఉంది. ఇలా అవ్వవలసింది, ఇంకా కొంత మిగిలి ఉంది అన్న సంకల్పం కూడా రాకూడదు. క్షణంలో తయారైపోవాలి. సమయం యొక్క పిలుపు రాగానే ఎవర్రడీగా ఉండాలి. ఈ పాఠమును పక్కా చేసుకున్నారా? ఇది కూడా ఆత్మ యొక్క భాగ్యరేఖను దిద్దుకోవడమే. అంతిమ సంస్కారాలు చేసే సమయంలో ఒక పండితుడిని లేక బ్రాహ్మణుడిని పిలుస్తారు. అది కూడా నామమాత్రపు బ్రాహ్మణుడిని పిలుస్తారు మరియు ఇక్కడ ఎంతమంది బ్రాహ్మణుల చేయి పడింది? మహాన్ తీర్థస్థానము మరియు సర్వశ్రేష్ఠ బ్రాహ్మణులు. స్మృతీ భవ అనే సహయోగము ఎంత శ్రేష్ఠభాగ్యమవుతుంది? కావున సదా ఎవర్రడీగా ఉండే విశేషమైన పాఠమును అందరూ చదువుకున్నారు. (ఆ అన్నయ్య యొక్క యుగల్ ను చూస్తూ బాబా ఇలా అన్నారు). ఏ పాఠం చదువుకున్నారు? మీ సఫలతా స్వరూపాన్ని చూపించారా? అంతటి ధైర్యవంతులేనా? శక్తి రూపం యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించారా? అచ్ఛా!

సదా తమ స్వస్వరూపము. స్వధర్మము, శ్రేష్ఠకర్మ, స్వదేశం యొక్క స్మృతి స్వరూపులకు, శాంతమూర్తులకు, సదా శాంతి యొక్క శక్తి ద్వారా సర్వులను శాంత స్వరూపులుగా తయారుచేసేవారికి, శాంతి సాగరుని యొక్క శాంతి అలలలో సదా తేలియాడేవారికి, సదా తేలియాడుతూ అనేకుల ప్రతి ధర్మాత్మగా, మహాన్ ఆత్మగా అయ్యే వారికి, ఇటువంటి శాంతి శక్తి స్వరూపులైన శ్రేష్ఠ పుణ్య ఆత్మలుగా అయ్యేవారికి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

కుమారులతో అవ్యక్త బాప్ దాదా యొక్క మిలనము: -

కుమారులకు సదా మేము కుమారులము. బ్రహ్మాకుమారులము, ఆత్మిక సేవాధారులము అని స్మృతి ఉండాలి. సేవాధారులు అనగా స్వయం సంపన్న స్వరూపులుగా ఉంటూ ఇతరులకు ఇచ్చేవారు. కావున సదా స్వయమును సర్వ ఖజానాలతో సంపన్నంగా అనుభవం చేసుకుంటున్నారా? సేవాధారులుగా భావిస్తూ సేవ చేసినట్లయితే సఫలతామూర్తులుగా ఉంటారు. సేవ యొక్క విశేషతయే సదా నమ్రచిత్తులుగా ఉండడం. నిమిత్తులుగా మరియు నమ్రచిత్తులుగా ఉండడం ఈ రెండు విశేషతలు సేవలో సఫలతా స్వరూపులుగా తయారుచేస్తాయి. కుమారులు సేవ యొక్క క్షేత్రంలో ముందుకు వెళ్ళేవారిగా ఉంటారు. కాని, ముందుకు వెళ్తూ నిమిత్తులుగా మరియు నమ్రచిత్తులుగా ఉండే నమ్రత లేకపోతే సేవ చేస్తారు, కష్టపడతారు కాని సఫలత తక్కువగా కనిపిస్తుంది. కావున కుమారులు సేవలో చురుకైనవారిగా అయితే ఉన్నారు కదా? అందరూ ప్లానింగ్ బుద్ధి కలవారే. ఏ విధంగా సేవ యొక్క పరుగులో చురుకుగా ఉన్నారో అలాగే ఈ రెండు విశేషతలలో కూడా చురుకైనవారిగా అవ్వండి. విశేషతల సహితంగా విశేష సేవాధారిగా అవ్వండి లేకపోతే అల్పకాలిక సఫలత అయితే లభిస్తుంది కాని నడుస్తూ నడుస్తూ కొద్ది సమయం తర్వాత తికమక పడిపోతారు. ఇలా ఎందుకు జరిగింది. ఇలా ఎలా అయ్యింది అన్న అడ్డుగోడ వచ్చేస్తుంది.

కావున సదా ఈ రెండు విషయాలను స్మృతిలో ఉంచుకోండి - దీని ద్వారా సేవలో ఫాస్ట్ గా మరియు ఫస్ట్ గా అయిపోతారు. కుమారులు సేవ చేయాలి కాని మర్యాదల యొక్క రేఖ లోపల ఉంటూ చేయాలి. ఆ తర్వాత చూడండి, సఫలత లభించి తీరుతుంది. 

కుమారులకు అన్నిరకాల అవకాశాలు ఉన్నాయి, సేవ చేయడంలోనూ అవకాశం ఉంది. పురుషార్థంలో ముందుకు వెళ్ళడంలోనూ అవకాశం ఉంది. అలాగే తమ పరివారమును ముందుకు తీసుకువెళ్ళే అవకాశమూ ఉంది. కుమార జీవితము చాలా అదృష్టవంతమైన జీవితము. కుమారులు సదా స్వతంత్రులు. ఎటువంటి బంధనానికీ వారు వశమవ్వరు. ఇలా స్వతంత్రంగా అనుభవం చేసుకుంటున్నారు కదా! స్వయం యొక్క వ్యర్థ సంకల్పాలు కూడా ఒక బంధనమే. ఈ బంధనాలు కూడా పైకి ఎక్కే కళ నుండి క్రిందకు తీసుకువస్తాయి. కావున నిర్బంధన కుమారులుగా ఉండండి, వ్యర్థ సంకల్పాలు కూడా సమాప్తమైపోతాయి. నిర్బంధన ఆత్మయే తీవ్రగతిలోకి వెళ్ళగల్గుతుంది. కుమారులు తమ జీవితాన్ని ఎంత శ్రేష్ఠంగా తయారుచేసుకుంటున్నారో చూసి బాప్ దాదాకు కుమారులపై ఎంతో గర్వంగా ఉంది. మావంటి భాగ్యవంతులు ఇంకెవరూ లేరు అన్న స్మృతిలోనే సదా ఉండండి. కుమారుల భాగ్యము కుమారులది, కుమారీల భాగ్యము కుమారీలది. కుమారీలు స్వతంత్రులుగా సేవ చేయలేరు. కుమారులైతే ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళి సేవ చేయగల్గుతారు. కుమారులకు బంధనమేముంది? కుమారీలైతే నేటి ప్రపంచపు లెక్కలో చూసినా బంధనలో ఉన్నారు. కుమారులైతే ఆల్ రౌండ్ సేవ చేయగలరు.

కుమారులు డబల్ లైట్. ఎటువంటి భారము వారిపై లేదు. సంకల్పాల యొక్క భారమూ లేదు, సంబంధ సంపర్కాల యొక్క భారమూ లేదు. కుమారులు నిర్బంధనులు, ఎందుకంటే వారు జ్ఞాన స్వరూపులుగా అయిపోయారు. జ్ఞాన స్వరూపులు ఎప్పుడూ వ్యర్థం వైపుకు వెళ్ళజాలరు. జ్ఞాన స్వరూపుల ముందుకు వ్యర్థ సంకల్పాలు కూడా రాజాలవు. సంకల్పంలో కూడా శక్తివంతంగా, కర్మలో కూడా శక్తివంతులుగా ఉంటారు. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు. మరి సదా మేము మాస్టర్ సర్వశక్తివంతులము అనే అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే కుమారుల చుట్టూ మాయ ఎంతగానో తిరుగుతూ ఉంటుంది. మాయకు కూడా కుమారీ, కుమారులు ఎంతగానో నచ్చుతారు. ఏ విధంగా మీరు బాబాకు చాలా ప్రియమైనవారో అలాగే మాయకు కూడా ప్రియమైనవారే. కావున మాయతో అప్రమత్తంగా ఉండండి. సదా స్వయాన్ని కంబైండ్ గా భావించండి, ఒంటరిగా కాదు. యుగల్ తోడుగా ఉండాలి. సదా కంబైండ్ గా భావించినట్లయితే మాయ రాజాలదు. 

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా యొక్క మిలనము:-

1. వర్తమాన సమయం యొక్క విశేషమైన అటెన్షన్ - వ్యర్థ సంకల్పాల యొక్క సమాప్తి. 

అందరూ స్వయాన్ని సమర్థ ఆత్మలుగా భావిస్తున్నారా? సమర్థ ఆత్మలు అనగా వ్యర్థం యొక్క ఖాతా సమాప్తమైపోయినవారు. లేకపోతే బ్రాహ్మణ జీవితంలో వ్యర్థ సంకల్పాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్ధమైన కర్మలు ఎంతో సమయాన్ని వ్యర్థం చేసేస్తాయి. ఎంత సంపాదననైతే జమా చేసుకోవాలనుకుంటారో అంతటి సంపాదనను జమా చేసుకోలేరు. వ్యర్థం యొక్క ఖాతా సమర్థులుగా అవ్వనివ్వదు. ఇప్పుడిక వ్యర్థ ఖాతాను సమాప్తం చేయండి. క్రొత్త పుస్తకాలు పెట్టేటప్పుడు పాతవాటిని సమాప్తం చేసేస్తారు. కావున వర్తమాన సమయంలో వ్యర్థం యొక్క ఖాతాను సమాప్తం చేసి సదా సమర్థంగా ఉండాలి అనే విశేషమైన ధ్యానమును ఉంచండి. మాస్టర్ సర్వశక్తివంతులు ఏది కావాలనుకుంటే అది చేయగలరు. ఎవరికైనా తనువు యొక్క లేక ధనం యొక్క శక్తి ఉంటే వారు ఏది కావాలనుకుంటే అది చేయగలరు. శక్తి లేకపోతే కావాలనుకుంటున్నా చేయలేకపోతారు. అలాగే మాస్టర్ సర్వశక్తి వంతులైన మీరు ఏమి చేయలేరు! కేవలం అటెన్షన్ ను ఉంచండి. పదే పదే అటెన్షన్ కావాలి. అమృతవేళ అటెన్షన్ ఉంచి, రాత్రివేళలో అటెన్షన్ ని ఉంచి మధ్యలో నిర్లక్ష్యులుగా అయిపోతే రిజల్ట్ ఏమౌతుంది? వ్యర్థం యొక్క ఖాతా సమాప్తమవ్వదు, ఎంతో కొంత పాత ఖాతా మిగిలిపోతుంది. కావున పదే పదే నేను మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న అటెన్షన్ ను ఉంచండి. బాగా చెకింగ్ కావాలి. ఎందుకంటే మాయ ఇప్పుడు కూడా తన అవకాశాన్ని తీసుకునేందుకు తయారుగా ఉంది. అది చివరలో అందరికన్నా ఎక్కువగా చురుకుగా అయిపోతుంది. ఎందుకంటే తాను సదాకాలికంగా వీడ్కోలు తీసుకోవలసి ఉంటుంది కదా! కావున తన తెలివినైతే చూపిస్తుంది కదా! కావున సదా అటెన్షన్ ని ఉంచండి. క్లాస్లోకి వెళ్ళి స్మృతిలో కూర్చుంటే ఆ సమయంలో ధ్యానముంటుంది కాని పదే పదే ధ్యానము ఉండాలి. మరియు ఎవరికైతే పదే పదే ధ్యానము ఉంటుందో వారు అన్ని టెన్షన్ల నుండి అతీతంగా ఉంటారు. మీరు ప్రియమైనవారే, బాబాకు చెందినవారిగా అయ్యారు. శ్రేష్ఠ భాగ్యము యొక్క తార ప్రకాశిస్తోంది. ఇంకేం కావాలి? పదే పదే బుద్ధి ద్వారా అటెన్షన్ ఉంచండి అన్న చిన్న పనినే ఇవ్వడం జరిగింది. అచ్చా,

Comments