13-03-1981 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
డబుల్ రూపాలతో సేవ చేయుట ద్వారానే ఆధ్యాత్మిక జాగృతి.
ఈ రోజు బాప్ దాదా శుభ చింతకులందరి సంఘటనను(సమూహాన్ని) చూస్తూ ఉన్నారు. శుభ చింతకులు అనగా సదా శుభ చింతనలో ఉండేవారు, స్వ చింతనలో ఉండేవారు. ఇలాంటి స్వ చింతకులు లేక శుభ చింతకులుగా ఉన్న మీరు తండ్రి ద్వారా లభించిన సర్వ ప్రాప్తులు, సర్వ ఖజానాలు లేక శక్తులు ఈ ప్రాప్తుల నషాలో ఉన్నారా - దీని జత జతలో సంపూర్ణ ఫరిస్తా లేక సంపూర్ణ దేవతగా తయారు కావాలనే లక్ష్య స్మృతి స్వరూపులుగా ఉంటున్నారా? ఎంత నషాలో ఉంటే లక్ష్యం కూడా అంత స్పష్టంగా ఉంటుంది. సమీపంగా ఉంటేనే స్పష్టమవుతుంది. ఎలాగైతే పురుషార్థ రూపం ఎంత స్పష్టంగా ఉందో అలా సంపూర్ణ ఫరిస్తా రూపం కూడా అంత స్పష్టంగా అనుభవం అవుతుంది. అవుతానో కానో అనే సంకల్పం కూడా ఉత్పన్నం కాదు. ఒకవేళ అటువంటి సంకల్పమేదైనా వచ్చిందంటే - ఉదాహరణానికి “అవ్వాల్సిందే లేక తప్పక అవుతాము” ఇలాంటి సంకల్పాలు వస్తున్నాయంటే దీనిని బట్టి తమ ఫరిస్తా స్వరూపం అంత స్పష్టంగా, సమీపంగా లేదని ఋజువవుతుంది. ఉదాహరణానికి మీ బ్రహ్మాకుమార్ లేక బ్రహ్మాకుమారీ స్వరూపం స్పష్టంగా ఉంది కనుక నిశ్చయబుద్ధిగా అయ్యి మేము బ్రహ్మాకుమార్, బ్రహ్మాకుమారీలమే అని చెప్తారు. మేము కూడా బ్రహ్మాకుమార్-కుమారీగానైతే అవ్వాలి, నేనైతే బ్రహ్మకుమారీనే అని అనరు. “అయితే ఉండాలి" అనే శబ్దాలు రావు. మేమే బ్రహ్మాకుమారీ కుమారులము అని నిశ్చయంగా అంటారు. నేను అవునో కాదో అనే ప్రశ్న రానే రాదు. ఎవరు ఎంత విరుద్ధంగా మీరు బ్రహ్మాకుమార్-కుమారీ కానే కాదు అని వాదించినా, భారతదేశంలోని వారే బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలు, పెద్ద పెద్ద మహారథులు బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలు, మీరు విదేశీ క్రిస్టియన్లు, బ్రహ్మ భారతదేశానికి చెందినవాడు కనుక మీరు బ్రహ్మాకుమారీ-కుమారులు ఎలా అవుతారు? అని క్రాస్ ఎగ్జామినేషన్ చేసి పొరపాటున క్రిస్టియన్ కుమారీ కుమార్ అనడానికి బదులు బ్రహ్మాకుమార్-బ్రహ్మాకుమారీ అని అంటున్నారు అని ఎవరైనా అంటేమీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు(అంగీకరించరు) కదా! మేము బ్రహ్మాకుమార-కుమారీలము, ఇప్పుడే కాదు, అనేక కల్పాలు కూడా బ్రహ్మాకుమారీ-కుమారులమే అని నిశ్చయ బుద్ధితో చెప్తారు. ఇలా నిశ్చయంతో చెప్తారా లేక ఎవరైనా అడిగేతే ఆలోచనలో పడతారా? ఏం చేస్తారు? ఆలోచిస్తారా? లేక నిశ్చయంతో మేమే అని చెప్తారా? ఎలాగైతే మేము బ్రహ్మాకుమారీ-కుమారులమని పక్కా నిశ్చయముందో, స్పష్టముగా ఉందో, అనుభవం ఉందో అలా సంపూర్ణ ఫరిస్తా స్థితి కూడా స్పష్టంగా అనుభవం అవుతూ ఉందా? ఈ రోజు పురుషార్థులుగా ఉన్నాము రేపు ఫరిస్తాలుగా అవుతాము - ఇలాంటి పక్కా నిశ్చయముంటే మిమ్ములను ఎవ్వరూ ఈ నిశ్చయం నుండి తొలగించలేరు. ఇలాంటి నిశ్చయబుద్ధిగా ఉన్నారు కదా. ఫరిస్తా స్వరూప చిత్రము స్పష్టంగా మీ ముందు కనిపిస్తున్నదా? ఫరిస్తా స్వరూప స్మృతి, వృత్తి, దృష్టి కర్మ లేక ఫరిస్తాస్వరూప సేవ ఏమిటో, ఎలా ఉంటుందో అనుభవం ఉందా? ఎందుకంటే బ్రహ్మాకుమార్ లేక కుమారీ స్వరూప సేవ రూపం అయితే ప్రతి ఒక్కరూ యథా శక్తి అనుభవం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సేవకు రిజల్టు(పరిణామము) చూశాము. ఈ రూపంలో సేవ అవసరం ఉండేది. ఆ సేవ జరిగింది, జరుగుతూ కూడా ఉంది, ఇంకా జరుగుతూనే కూడా ఉంటుంది.
పోను పోను సమయం మరియు ఆత్మల కోరికల అవసరాన్ని బట్టి డబుల్ రూపంలో సేవ చేసే అవసరం ఉంటుంది. ఒకటేమో బ్రహ్మాకుమార-కుమారీల స్వరూపం అనగా సాకార స్వరూప సేవ, రెండవది సూక్ష్మ ఆకారీ ఫరిస్తా స్వరూప సేవ. బ్రహ్మా బాబా రెండు రూపాలలో చేసిన సేవలు చూశారు కదా. సాకార రూపం మరియు ఫరిస్తా రూపాల సేవ కూడా చూశారు. సాకార రూప సేవ కంటే అవ్యక్త రూప సేవ తీవ్ర వేగంతో జరుగుతుంది. ఇది తెలుసు కదా! అనుభవీలే కదా? ఇప్పుడు అవ్యక్త బ్రహ్మాబాబా అవ్యక్త రూపధారిగా అయ్యి అనగా ఫరిస్తా రూపంగా అయ్యి పిల్లలను అవ్యక్త ఫరిస్తా స్వరూప స్థితిలోకి ఆకర్షిస్తున్నారు. తండ్రిని అనుసరించడమైతే వస్తుంది కదా! అలాగని మేము కూడా శరీరం వదిలి అవ్యక్తమై వెళ్లాలని ఆలోచించడం లేదు కదా! ఇందులో ఫాలో చేయకండి. అవ్యక్త రూప ఉదాహరణ చూసి సులభంగా ఫాలో చేస్తారని బ్రహ్మాబాబా ఫరిస్తాగా అయ్యారు. సాకార రూపంలో లేనప్పటికీ ఫరిస్తా రూపం ద్వారా సాకార రూపం సమానంగానే సాక్షాత్కారము చేయిస్తున్నారు కదా! విశేషంగా ఇది విదేశీయులకు అనుభవముంది. మధువనంలో సాకార బ్రహ్మను అనుభవం చేస్తున్నారు కదా! బాబా గదిలోకి వెళ్ళి ఆత్మీక సంభాషణ చేస్తున్నారు కదా. చిత్రము కనిపిస్తుందా లేక చైతన్యంగా కనిపిస్తున్నారా? అనుభవం అవుతుంది కనుకనే ప్రేమతో బ్రహ్మను “బాబా” అని అంటున్నారు. మీ అందరి బ్రహ్మబాబానా లేక ముందు వచ్చిన పిల్లలకు మాత్రమే బ్రహ్మాబాబానా? అనుభవం ఆధారంతో చెప్తున్నారా లేక జ్ఞానం ఆధారంతో చెప్తున్నారా? అనుభవం ఉందా? ఎలాగైతే అవ్యక్త బ్రహ్మాబాబా సాకార రూప పాలన ఇస్తున్నారో, సాకార రూప పాలనను అనుభవం చేయిస్తున్నారో అలా మీరు వ్యక్తములో ఉంటూ అవ్యక్త ఫరిస్తా రూపాన్ని అనుభవం చేయండి. అందరికీ ఈ ఫరిస్తాలంతా ఎవరు, ఎక్కడ నుండి వచ్చారు? అని అనుభవం అవ్వాలి. ఎలాగైతే ఇప్పుడు నలువైపులా ఈ తెల్లటి వస్త్రధారులు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? అనే ధ్వని వ్యాపిస్తూ ఉందో అలా నలువైపులా ఇప్పుడు ఫరిస్తా రూపం సాక్షాత్కారమవ్వాలి. దీనినే డబుల్ సేవా రూపం అని అంటారు. శ్వేత వస్త్రధారులు మరియు తెల్లటి లైట్ ధారులు. వీరిని చూస్తూనే వద్దనుకున్నా కళ్లు తెరుచుకోవాలి. ఉదాహరణానికి చీకటిలో ఏదైనా చాలా తీవ్రమైన లైట్ ఎదురుగా వస్తే అకస్మాత్తుగా ఇదేమిటి, వీరు ఎవరు ఎక్కడ నుండి వచ్చారు? అని కళ్లు తెరుచుకుంటాయి కదా. ఇలాంటి అపూర్వమైన అలజడిని వ్యాపింపజేయండి. ఎలాగైతే మేఘాలు నలువైపులా వ్యాపిస్తాయో అలా నలువైపులా ఫరిస్తా రూపంతో ప్రత్యక్షమవ్వండి. దీనినే ఆధ్యాత్మిక జాగృతి అని అంటారు. ఇంతమంది దేశ విదేశాల నుండి ఎవరైతే వచ్చారో వారంతా బ్రహ్మాకుమార్-కుమారీ స్వరూపంతో సేవ చేశారు. ధ్వనిని వ్యాపింపజేసే, మేల్కొలిపే పని చేశారు. సంఘటన(ఐకమత్యపు) జండాను ఎగురవేశారు. ఇప్పుడు మరలా క్రొత్త ప్లాను చేస్తారు కదా. ఎక్కడ చూసినా ఫరిస్తాలు కనిపించాలి. లండన్లో చూసినా, ఇండియాలో చూసినా, ఎక్కడ చూసినా ఫరిస్తాలే ఫరిస్తాలు కనిపించాలి. అమెరికాలో, ఆస్ట్రేలియాలో చూసినా ఫరిస్తాలే ఫరిస్తాలు కనిపించడానికి ఏ ఏర్పాట్లు చేయాలి? వారు 10 సూత్రాల ప్రణాళికను తయారు చేశారు. అయితే దీనికి ఎన్ని సూత్రాలున్నాయి? వారిది 10 సూత్రాల కార్యక్రమము. ఇది 16 కళల సూత్రముతో కూడిన కార్యక్రమము. దీనిపై పరస్పరములో కూడా ఆత్మిక సంభాషణ చేయండి. ఇక ముందు కూడా వినిపిస్తూనే ఉంటాను. ప్లాన్ చెప్పాను, ఇప్పుడు ప్రోగ్రాము తయారుచేయండి. ముఖ్య సిద్ధాంతము తెలిపాను. ఇప్పుడు విస్తారమైన ప్రోగ్రాము చేయండి.
సదా శుభచింతనలో ఉండే శుభచింతకులకు, డబుల్ రూపం ద్వారా సేవ చేయువారికి, డబుల్ సేవా ధారులకు బ్రహ్మాబాబాను ఫాలో చేసేవారికి, నిరాకార తండ్రిని ప్రత్యక్షం చేయువారికి సదా తండ్రి సమానంగా సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్న ఆత్మలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.
టీచర్లతో :- టీచర్లు అనగా సదా సంపన్న ఆత్మలు. డ్రామానుసారంగా నిమిత్తమయ్యారు. బాగా పరిశ్రమ చేస్తున్నారు, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటారు. ఫలితం బాగుంది. ఇంకా కూడా మంచిగానే ఉంటుంది. సమయం దగ్గరకు వచ్చిన కారణంగా త్వర త్వరగా సేవ యొక్క విస్తారము పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే సంగమ యుగంలోనే త్రేతా యుగం అంతము వరకు ఉండే ప్రజలు, రాయల్ ఫ్యామిలీ వారు, జత జతలో కలియుగము అంతము వరకు తమ ధర్మానికి చెందిన ఆత్మలను తయారు చేయాలి. విదేశాలలోని అన్ని స్థానాలు పిక్ నిక్ స్థానాలుగా అవుతాయి. కాని బ్రాహ్మణ ఆత్మలైతే రాజ్య వంశములోకి వస్తారు. అక్కడ(విదేశాలలో) రాజ్యము చేసేది లేదు. రాజ్యమైతే ఇక్కడే చేస్తారు. అందరూ మంచిగా సేవ చేస్తున్నారు. కాని ఇప్పుడు ఇంకా సేవలో ముందుకు వెళ్తూ మనసా సేవ శక్తిశాలిగా ఎలా జరగాలో అందుకు విశేషమైన ప్లాను తయారు చేయండి. వాచా సేవతో పాటు మనసా సేవ కూడా చాలా దూరం వరకు పని చేస్తుంది. ఎలాగైతే ఈ రోజుల్లో ఫ్లయింగ్ సాసరు చూస్తారో అలా మీ అందరి ఫరిస్తా స్వరూపాలు నలువైపులా కనిపిస్తాయి. చక్రాకారంగా తిరిగే వీరెవరు? అనే శబ్దం వెలువడుతుంది. దీనిపై కూడా రిసర్చ్(పరిశోధన) చేస్తారు కాని పై నుండి క్రిందకు వస్తూనే మీ అందరి సాక్షాత్కారం జరుగుతుంది. ఫరిస్తా రూపంలో సాక్షాత్కారమవుతున్నా బ్రహ్మాకుమార-కుమారీలు వీరే అని అర్థము చేసుకుంటారు. ఇప్పుడీ అలజడిని వ్యాపింపచేయండి. అంతా అంత:వాహక శరీరంతో చుట్టూ తిరిగే అభ్యాసం చేయండి. ఎటువంటి సమయం వస్తుందంటే మీకు ప్లాను కూడా లభించజాలదు. సమయం ఎంత నాజూకుగా ఉంటుందంటే మీరు ముందే వచ్చేస్తారు. అంత:వాహక శరీరము ద్వారా విశ్వమంతా విహరించి వచ్చే అభ్యాసం తప్పక చేయండి. అందరూ ప్రత్యక్షంగా చూసి కలుసుకోవడానికి వచ్చేట్లుగా అభ్యాసం చేయండి. ఇతరులు కూడా అవును వీరు మా వద్దకు అదే ఫరిస్తాలు వచ్చారు అని అనుభవం చేయాలి. తర్వాత ఫరిస్తాలను వెతుక్కుంటూ బయల్దేరుతారు. ఒకవేళ ఇంతమంది ఫరిస్తాలు చుట్టూ విహరిస్తూ ఉంటే ఏమవుతుంది? స్వత:హాగానే అందరి అటెన్షన్ ఫరిస్తాల వైపు వెళ్తుంది. కావున ఇప్పుడు సాకార రూపంతో పాటు ఆకారీ సేవ కూడా తప్పకుండా జరగాలి. అచ్చా. ఇప్పుడు అమృతవేళలో శరీరం నుండి వేరై విశ్వమంతా విహరించండి.
ప్రశ్న:- ఆత్మిక సేవాధారులైన మీరు తప్పకుండా చేయాల్సిన అతి గొప్ప సేవ ఏది?
సమా :- ఎవరి దు:ఖాన్ని అయినా తీసుకుని సుఖాన్నివ్వడం - ఇదే అన్నిటికన్నా గొప్ప సేవ. మీరు సుఖసాగరులైన తండ్రి పిల్లలు. కావున ఎవరు కలిసినా కూడా వారి దు:ఖాన్ని తీసుకుంటూ వెళ్ళండి, సుఖాన్ని ఇస్తూ వెళ్ళండి. ఎవరి దు:ఖం అయినా తీసుకుని సుఖాన్నివ్వటం ఇదే అన్నింటికన్నా గొప్ప కంటే గొప్ప పుణ్యకార్యము. ఇలా పుణ్యము చేస్తూ చేస్తూ పుణ్యాత్మలుగా అయిపోతారు.
ప్రశ్న:- బ్రాహ్మణత్వపు జన్మ లేక మరుజీవా జన్మ యొక్క మొట్టమొదటి ప్రభావమేది? దాని గుర్తులు ఎలా ఉంటాయి?
సమా:- బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణులుగా అయినప్పుడు మొట్టమొదటి బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీల రంగు లేక ప్రభావము పడింది. బ్రహ్మాకుమారి కుమార్ అనగా ప్రతి సంకల్పం, మాట, కర్మ, సంబంధం, సంపర్కం మరియు సేవ అన్నింటిలో బ్రాహ్మణ స్థితి అనుసారం ప్రత్యక్ష జీవితంలో నడిచేవారు. ఏ శూద్ర సంస్కారమూ కనిపించరాదు. బ్రాహ్మణ రూపంలో ప్రతి కర్మ, ప్రతి సంకల్పము బ్రహ్మాబాబా సమానంగా ఉండాలి. తండ్రి ఎలాగో, పిల్లలు కూడా అలాగే ఉండాలి. తండ్రికి ఏ స్వభావం, సంస్కారం లేక సంకల్పం ఉన్నాయో పిల్లలకు కూడా అవే ఉండాలి. ఎలాగైతే తండ్రికి వ్యర్థం లేక బలహీన సంకల్పాలు ఉత్పన్నము కావో, తండ్రి అచంచలమైన స్థిరమైన స్థితిలో సదా స్థితమై ఉంటాడో అలా బ్రాహ్మణుల కర్తవ్యం లేక పిల్లల కర్తవ్యం - ఫాలో ఫాదర్ చెయ్యడం(తండ్రిని అనుసరించడం).
ప్రశ్న:- “ఫాలో ఫాదర్” యథార్థ అర్థం ఏమిటి?
సమా:- ఫాలో ఫాదర్ అనగా కేవలం ఈశ్వరీయ సేవాధారిగా అవ్వడమే కాదు. కానీ ఫాలో ఫాదర్ అనగా ప్రతి అడుగులో, ప్రతి సంకల్పములో బ్రహ్మాబాబాను ఫాలో చేయడం. ఎలాగైతే తండ్రికి ఈశ్వరీయ సంస్కారం, దివ్య స్వభావం, దివ్య వృత్తి, దివ్య దృష్టి సదా ఉంటుందో అలా వృత్తి, దృష్టి స్వభావం, సంస్కారం మీకు కూడా ఉండాలి. ఇలాంటి ఈశ్వరీయ గుణాలు కల్గిన స్వరూపం ఉండాలి. ఈ స్వరూపం ద్వారా తండ్రి గుణాలు మరియు కర్తవ్యాల రూపురేఖలు కనిపించాలి. ఎలాగైతే తండ్రి గుణగానం చేస్తారో లేక చరిత్రను వర్ణన చేస్తారో అలా మీలో కూడా ఆ సర్వగుణాలు ధారణవ్వాలి.
ప్రశ్న:- పిల్లల ఏ కర్మలు సదా కాలం కొరకు స్మృతి చిహ్నాలుగా తయారవుతాయి?
సమా:- ఏ కర్మలైతే స్మృతిలో ఉండి చేస్తారో, ఆ కర్మలు స్మృతి చిహ్నాలుగా అయిపోతాయి. కర్మయోగులనగా ప్రతీ కర్మ యోగయుక్తంగా, యుక్తియుక్తంగా, శక్తియుక్తంగా ఉండాలి.
ప్రశ్న:- ఎవరైతే కర్మయోగిగా ఉంటారో, వారి గుర్తులు ఎలా ఉంటాయి?
సమా:- వారిని ఏ కర్మా తమవైపు ఆకర్షించజాలదు. యోగులు తమ యోగ శక్తితో కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయిస్తారు. ఎవరైతే కర్మకు వశమై నడుస్తారో వారు కర్మయోగులు కారు. వారిని కర్మభోగులని అంటారు. ఎందుకంటే ఎవరైతే కర్మభోగానికి వశమైపోతారో అనగా కర్మభోగం అనుభవించడంలో మంచి లేక చెడు కర్మలకు వశీభూతమవుతారో వారు యోగులని అనిపించుకోరు. మీరు రాజయోగీ ఆత్మలు. ఎప్పుడూ కర్మకు అధీనమై కర్మలకు పరతంత్రులుగా(బానిసలుగా) కాలేరు.
Comments
Post a Comment