13-01-1978 అవ్యక్త మురళి

* 13-01-1978         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఎదురుచూడడం కన్నా, ముందే ఏర్పాట్లను చేయండి.

బాబా పిల్లలను చూసి సదా హర్షితమవుతూ ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ వర్తమాన సమయంలో విశ్వంలోని ఆత్మలలోనూ శ్రేష్ఠమైనవారు మరియు భవిష్యత్తులో కూడా విశ్వం ద్వారా పూజ్యనీయులు. ఇటువంటి సర్వ శ్రేష్ఠమైన, గాయనయోగ్యమైన మరియు పూజా యోగ్యమైన యోగీ ఆత్మలు, జ్ఞానీ ఆత్మలు, దివ్యగుణధారులు, సదా విశ్వసేవాధారులైన బాప్ దాదాలతో పాటు సదా స్నేహము మరియు సహయోగములో ఉండే ఇటువంటి పిల్లలను చూసి బాబాకు ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది. నెంబర్ వారీగా ఉన్నా కానీ చివరి నెంబర్ లోని మణి కూడా విశ్వం ముందు ఎంతో ఉన్నతమైనది. ఇటువంటి మీ మహానతను, మీ మహిమను తెలుసుకొని నడుస్తున్నారా లేక నడుస్తూ, నడుస్తూ స్వయాన్ని సాధారణంగా భావించుకుంటున్నారా? అలౌకికమైన తండ్రి ద్వారా ప్రాప్తించిన అలౌకిక జీవితము, అలౌకిక కర్మ సాధారణమైనవి కావు. చివరి నెంబర్లో ఉన్న మణిని కూడా ఈనాడు అంతిమం వరకూ భక్త ఆత్మలు తమ కనుపాపలపై పెట్టుకుంటారు. ఎందుకంటే లాస్ట్ నెంబర్ వారు కూడా బాప్ దాదా యొక్క నయనాలలోని తారలే, ప్రకాశిస్తున్న రత్నాలే. ఇటువంటి ప్రకాశిస్తున్న తారలను ఇప్పటివరకూ కూడా భక్తులు తమ నయనాలపై పెట్టుకుంటారు. మీ శ్రేష్ఠ భాగ్యమును తెలుసుకొని వర్ణన చేస్తూ కూడా తెలియనట్లుగా అవ్వకండి. ఒక్కసారైనా మనస్సుతో, సత్యమైన హృదయంతో స్వయాన్ని బాబా యొక్క సంతానంగా నిశ్చయం చేసుకుంటే ఆ ఒక్క క్షణం యొక్క మహిమ మరియు ప్రాప్తి ఎంతో అపారమైనది. డైరెక్ట్ గా బాబా యొక్క సంతానంగా అవ్వడం ఎంత పెద్ద లాటరీయో మీకు తెలుసా! ఒక్క క్షణంలో నామ సంస్కారము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయిపోతుంది. ప్రపంచమూ మారిపోతుంది, సంస్కారములూ మారిపోతాయి, దృష్టి, వృత్తి, స్మృతి అన్నీ ఒక్క క్షణం యొక్క ఆటలో మారిపోతాయి. కాని ఇటువంటి శ్రేష్ఠమైన క్షణాన్ని మరిచిపోతారు. ప్రపంచంలోని వారు ఇంకా ఇప్పటివరకూ మరిచిపోలేదు. కాని ఆత్మలైన మీరు చక్రము తిరుగుతూ మారిపోయారు కాని ప్రపంచంలోనివారు మరిచిపోలేదు. ఇప్పుడు మీ అందరి భాగ్యమును వర్ణన చేస్తూ వారు ఎంతో సంతోషిస్తూ ఉంటారు. స్వయంగా భగవంతుడే లభించేసాడని భావిస్తారు. ప్రపంచంలోనివారే మరవనప్పుడు మరి సర్వ అనుభవీ మూర్తులైన, సర్వప్రాప్తులను చేయించే ఆత్మలైన మీరు ఎందుకు మరిచిపోతున్నారు? మరిచిపోకూడదు కానీ మరిచిపోతారు.

ఈ కొత్త సంవత్సరంలో బాప్ దాదాకు ఏ కొత్తదనాన్ని చూపిస్తారు? ఏ సమయమైతే ఇవ్వబడిందో ఆ సమయానుసారంగా అందరూ సంపూర్ణంగానే కనిపించాలి. లక్ష్యం అనుసారంగా సర్వ బ్రాహ్మణ ఆత్మల యొక్క పురుషార్థము సంపన్నంగా ఉండాలి. మీరు పరివర్తన కొరకు తయారుగా ఉన్నారు కదా! ఇప్పుడు ఏ సమయమైతే లభించిందో అది బ్రాహ్మణుల యొక్క స్వపురుషార్థము కొరకు కాదు. ప్రతి సంకల్పము, ప్రతి వాక్కు ద్వారా దాత యొక్క పిల్లలు విశ్వ ఆత్మల కొరకు తనకు లభించిన ఖజానాలను ఇచ్చేందుకే ఈ సమయం ఉంది. ఈ ఎక్స్ ట్రా సమయం స్వయం యొక్క పురుషార్థం కొరకు కాదు, ఇది ఇతరుల కొరకు. గుణములు మరియు ఖజానాలు ఇచ్చేందుకే ఈ సమయము ఉంది. బాబా ఏ కార్యము కొరకైతే సమయాన్ని మరియు ఖజానాలను ఇచ్చారో వాటిని వాటికొరకు కాక స్వయం కొరకు సమయమును మరియు సంపదను వినియోగించినట్లయితే అది కూడా ద్రోహమే అవుతుంది. ఈ విశేష సంవత్సరము బ్రాహ్మణ ఆత్మలకు మహాదానులుగా, వరదానులుగా అయ్యే సంవత్సరము. ఈ నెలలో విశేషమైన యోగము యొక్క కార్యక్రమము జరుగుతుందని, వచ్చే నెలలో విశేషంగా సేవ కొరకు వినియోగించాలని ఇలా మీరు ఏవిధంగా ప్రోగ్రామును తయారుచేస్తారో అలాగే డ్రామా ప్లాననుసారంగా ఈ ఎక్స్ ట్రా సమయము మహాదానులుగా అయ్యేందుకే లభించింది. పాత భాష, పాత విషయాలు, పాత ఆచార, వ్యవహారములు, మొదలైన వాటి గురించి మీకు బాగా తెలుసు. ఈ సంవత్సరం వాటి కొరకు కాదు. ఏ విధంగా బాబా ముందు స్వయాన్ని సమర్పణ చేసుకున్నారో అలాగే ఇప్పుడు మీ సమయాన్ని మరియు సర్వ ప్రాప్తులను జ్ఞానము, గుణము మరియు శక్తులను విశ్వ సేవార్థము సమర్పణ చేయండి. ఏ సంకల్పమైతే ఉత్పన్నమవుతుందో అది విశ్వసేవ కొరకు ఉందా అని పరిశీలించండి. ఈ విధంగా సేవ కొరకు అర్పితమవ్వడం ద్వారా సహజంగానే సంపన్నమయిపోతారు. ఏదైనా సేవ యొక్క విశేష కార్య క్రమమును చేసినప్పుడు విశేష కార్యంలో బిజీగా ఉన్న కారణంగా స్వయం యొక్క విశ్రాంతిని లేక స్వయానికి ప్రాప్తిని కలిగించే విషయాలను లేక నడుస్తూ, నడుస్తూ ఇతర ఆత్మల ద్వారా వచ్చే చిన్న చిన్న పరీక్షలపై ధ్యానమును ఇవ్వరు. వాటన్నింటినీ వదిలివేస్తారు. ఎందుకంటే సదా కార్యమును మీ ముందు ఉంచుకుంటారు మరియు బిజీగా ఉంటారు. సమయమును స్వయం కొరకు వినియోగించక విశేషంగా సేవలో వినియోగిస్తారు. అలాగే ఈ క్రొత్త సంవత్సరంలో ప్రతి క్షణము మరియు సంకల్పము సేవ కొరకే అని భావించడం ద్వారా ఈ కార్యంలో నిమగ్నమై ఉండడం ద్వారా పరీక్షలను ఎలా దాటుతారంటే అసలు అవి లేనే లేనట్లుగా అనుభవమవుతుంది. అసలు ఈ విషయము ఏమిటి మరియు ఏమి జరిగింది అన్నది సంకల్పంలో కూడా రాదు. స్వయాన్ని సంపూర్ణంగా చేసుకోవడం ద్వారా ఈ సేవ యొక్క లగ్నంలో ఈ చిన్నా పెద్దా పరీక్షలు స్వతహాగానే సమర్పణ అయిపోతాయి. అగ్నిలో ప్రతి వస్తువు యొక్క నామరూపాలు ఏ విధంగా మారిపోతాయో అలాగే పరీక్షల యొక్క నామరూపాలు కూడా మారి ఆ పరీక్ష ప్రాప్తి యొక్క రూపముగా మారిపోతుంది. మాయ అన్న పదాన్ని చూసి కంగారుపడరు, సదా విజయులుగా అయ్యే సంతోషములో నాట్యమాడుతూ ఉంటారు. మాయను తమ దాసిగా అనుభవం చేసుకుంటే దాసి సేవాధారిగా అవుతుందా లేక తనను చూసి భయపడతారా? స్వయం సమర్పితమైపోతే సేవలో మాయ స్వతహాగానే సరెండర్ అయిపోతుంది. కానీ సరెండర్ అవ్వకపోతేనే మాయ కూడా మంచిగా అవకాశాన్ని తీసుకుంటుంది. ఆ అవకాశాన్ని తీసుకున్న కారణముగా బ్రాహ్మణులపై కూడా అధిపతిగా అయిపోతుంది. మాయను అధిపతిగా అవ్వనివ్వకండి. స్వయం సేవ యొక్క అవకాశాన్ని తీసుకోండి, ఛాన్స్ గా అవ్వండి. ఇప్పుడు సమయం ఎందుకు లభించిందో మీరు విన్నారా? ఇప్పుడు ఏవిధమైన ఫిర్యాదునూ చేయకండి. సమయం యొక్క లెక్కతో చూస్తే ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా అవ్వాలి. సంపూర్ణమయ్యే ఆత్మ ఎప్పుడూ ఫిర్యాదులు చేయదు. ఇవి తప్పక జరుగుతూనే ఉంటాయి అన్న ఈ భాషను వారు మాట్లాడరు. కొత్త సంవత్సరము, కొత్త భాష, కొత్త అనుభవం. పాత వస్తువులను సంభాళించడం బాగానే ఉంటుంది కానీ ఉపయోగించడం బాగోదు. కావున మరి మీరెందుకు ఉపయోగిస్తున్నారు? 5,000 సంవత్సరాల కొరకు సంభాళించి పెట్టండి. పాతవాటిపై ప్రీతిని ఉంచకండి.


ఎల్లప్పుడూ భక్త ఆత్మలు, బికారీ ఆత్మలు మరియు తపిస్తున్న ఆత్మల ముందు స్వయాన్ని సాక్షాత్ తండ్రిగా మరియు సాక్షాత్కారమూర్తిగా భావిస్తూ నడవండి. ఈ మూడు లైన్లు చాలా పొడుగ్గా ఉన్నాయి. ఈ క్యూలను సమాప్తం చేయడంలో నిమగ్నమైపోండి. దాహార్తితో ఉన్న ఆత్మల యొక్క దాహాన్ని తీర్చండి. బికారులకు దానమివ్వండి, భక్తులకు భక్తి యొక్క ఫలితముగా తండ్రిని కలిసే మార్గమును తెలియజేయండి. ఈ క్యూను సంపన్నం చేయడంలో బిజీగా ఉన్నట్లయితే స్వయంను గూర్చిన - ఎందుకు అనే ప్రశ్నల యొక్క క్యూ సమాప్తమైపోతుంది. సమయం గూర్చి ఎదురుచూస్తూ ఉండకండి, ఈ మూడు రకాల ఆత్మలను సంపన్నంగా తయారుచేసేందుకు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమై ఉండండి. వినాశనం ఎప్పుడు జరుగుతుంది? అని ఇక ఇప్పుడైతే అడగరు కదా! క్యూను సమాప్తం చేసినట్లయితే పరివర్తన యొక్క సమయం కూడా సమాప్తమైపోతుంది. సంగమం యొక్క సమయం సత్వ యుగం కన్నా శ్రేష్టమైనదిగా అనిపించడం లేదా? అలసిపోయారా? ఏమిటి? వినాశనం ఎప్పుడవుతుంది? అని అడుగుతున్నారంటే అలసిపోయారు కాబట్టే అడుగుతున్నారని కదా! బాబాకు పిల్లలపై అతి స్నేహముంది. బాబాకు ఈ మేళా ఎంతో నచ్చుతుంది కానీ పిల్లలకు స్వర్గం నచ్చుతోందా? స్వర్గం 21 జన్మలు లభిస్తుంది కానీ ఈ సంగమం లభించదు. కావున అలసిపోకండి. సేవలో నిమగ్నమైపోతే ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసుకుంటారు. మీ భవిష్య ఫలము నిశ్చితమై ఉంది కానీ ప్రత్యక్ష ఫలము యొక్క అనుభవం యొక్క సుఖము మొత్తం కల్పమంతటిలోనూ లభించదు. కావున భక్తుల యొక్క పిలుపును వినండి, దయార్ద హృదయులుగా అవ్వండి, మహాదానులుగా అవ్వండి, మహాపుణ్యాత్ముల యొక్క పాత్రను అభినయించండి. అచ్చా!

ఇటువంటి బాబా యొక్క ఆజ్ఞాకారులకు దృఢ సంకల్పం గలవారికి మరియు క్షణములో ఆజ్ఞాకారులుగా అయ్యేవారికి, బాబా సమానముగా సదా విశ్వకళ్యాణకారులకు, మహాదానులకు మహాన్ వరదానులకు, సర్వులను సంపన్నం చేసేవారికి సదా స్వయాన్ని సేవలో తత్పరులుగా చేసుకునేవారికి ఇటువంటి బాబా సమానమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో బాబా యొక్క మిలనము: అందరూ ఒక్క విషయమును గూర్చి ఎదురు చూస్తున్నారు. అది ఏ విషయము? ప్రారంభంలో 'నేను ఎవరు'? అన్న చిక్కు ప్రశ్న ఒకటి ఉంది. అదే చివరి వరకు ఉంటుంది. భవిష్యత్తులో నేను ఏమవుతాను? లేక మాలలో నేను ఎక్కడ ఉన్నాను? అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ ఎదురుచూపు ఎప్పుడు సమాప్తమవుతుంది? అష్ట రత్నాలలో ఎవరు ఉంటారు, 100 లో ఎవరు ఉంటారు అని ప్రతి ఒక్కరూ పరస్పరం చర్చించుకుంటూ ఉంటారు కూడా. 16 వేల యొక్క ప్రశ్నే లేదు. అసలు ఎనిమిదిలో లేక 100లో ఎవరు ఉంటారు? మేము ఏ మాలలో ఉంటాము అని విదేశీయులు ఆలోచిస్తూ ఉంటారు. ప్రారంభంలో వచ్చినవారు, లాస్ట్ సో ఫాస్ట్ అని అన్నారు కదా! మరి మా స్థానం ఉంటుందా? లేక చివరిలో వచ్చేవారి స్థానం ఉంటుందా? అసలు ఈ లెక్క ఏమిటి? అని ఆలోచిస్తూ ఉంటారు. ఆ లెక్క బాబా వద్ద ఉంది కదా ! ఇంకా ఫిక్స్ చేయబడలేదు. మీరు ఆర్ట్ కాంపిటీషన్ జరిపినప్పుడు చిత్రాలను ఎలా ఎంచుకున్నారు? మొదట కొన్నింటిని పక్కన పెట్టారు, మళ్ళీ అందులో 1, 2, 3 నెంబర్లను ఫిక్స్ చేసారు. మొదట ఎంచుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత నెంబర్ వారీగా ఫిక్స్ అవుతారు. కావున ఇప్పుడు అలా ఎంచుకోబడ్డారు కానీ ఇంకా ఫిక్స్ చేయబడలేదు. వెనుక వచ్చేవారు ఏమవుతారు? ఎల్లప్పుడూ కొన్ని సీట్లు చివరి వరకూ ఉంటాయి. రిజర్వేషన్ చేసినప్పుడు కూడా చివరి వరకూ కొంత కోటాను ఉంచుతారు. కానీ ఆ కోటాలో కోట్లాదిమందిలో ఏ కొందరో, ఆ కొందరిలోనూ ఏ ఒక్కరో వస్తారు.

అచ్చా! మీరందరూ ఏ మాలలో ఉన్నారు? మీపై మీరు విశ్వాసాన్ని ఉంచుకోండి. ఏదో ఒక అద్భుతమైన విషయం జరుగుతుంది మరియు దాని ఆధారముపై మీ అందరి ఆశలు పూర్తయిపోతాయి అష్టరత్నాల యొక్క విశేషత ఒక విశేషమైన విషయంలో ఉంది. అష్టరత్నాలలో స్మృతిచిహ్నం విశేషముగా ఉన్నట్లుగా అష్టశక్తులేవైతే ఉన్నాయో ఆ ప్రతి శక్తి వారి జీవితములో ప్రత్యక్షముగా కనిపిస్తుంది. ఒక్క శక్తి కూడా ప్రత్యక్ష జీవితములో తక్కువగా కనిపించినట్లయితే విగ్రహం యొక్క భుజాలలో ఒక భుజం ఖండితమైపోతే అది ఏ విధముగా పూజ్యార్హతను కోల్పోతుందో అలాగే ఒక్క శక్తి యొక్క లోపం కనిపించినా అష్టదేవతల యొక్క లిస్టులో ఫిక్స్ చేయబడినట్లుగా పిలువబడరు. ఇంకొక విషయం - అష్టదేవతలు భక్తులకు విశేషమైన ఇష్టులుగా భావింపబడతారు. ఇష్టులు అనగా మహాపూజ్యులు. ఇష్టుల ద్వారా భక్తులు ప్రతి ఒక్కరికీ ప్రతి ఒక్క విధి మరియు సిద్ధి ప్రాప్తమవుతుంది. అలాగే ఇక్కడ కూడా అష్టరత్నాలెవరైతే ఉంటారో వారు సర్వ బ్రాహ్మణ పరివారము ముందు ఇప్పుడూ ఇష్టులుగా అనగా ప్రతి సంకల్పం మరియు నడవడిక ద్వారా విధి మరియు సిద్ధి యొక్క మార్గదర్శన చేసేవారిగా అందరి ముందు ఇప్పుడు కూడా ఇదే విధంగా మహాన్ మూర్తులుగా భావింపబడతారు. కావున అష్టశక్తులూ ఉంటాయి మరియు పరివారం ముందు ఇష్టులుగా అనగా శ్రేష్ఠ ఆత్మ, మహాన్ ఆత్మ, వరదానీ ఆత్మ యొక్క రూపములో ఉంటారు. ఇదే అష్టరత్నాల యొక్క విశేషత, అచ్చా! 

పార్టీలతో బాప్ దాదా: 

1. ప్రపంచం యొక్క వైబ్రేషన్లు లేక మాయ నుండి సురక్షితముగా ఉండేందుకు సాధనము.

సదా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న లగ్నములో మగ్నమై ఉన్నట్లయితే వారు మాయ యొక్క ప్రతి యొక్క యుద్ధం నుండి సురక్షితముగా ఉంటారు. యుద్ధ సమయంలో బాంబులను వేసినప్పుడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతారు. అప్పుడు దాని యొక్క ప్రభావం వారిపై పడదు. అదేవిధముగా ఎప్పుడైతే ఒకే లగ్నములో మగ్నమై ఉంటారో అప్పుడు ప్రపంచం యొక్క వైబ్రేషన్ల నుండి, మాయ నుండి సదా సురక్షితముగా ఉంటారు. యుద్ధం చేసే ధైర్యం కూడా మాయకు ఉండదు. లగ్నములో మగ్నమై ఉండండి. ఇదే సురక్షతకు సాధనము.

2. బాబా యొక్క సమీప రత్నాల యొక్క గుర్తులు. 

బాబా సమీపముగా ఉండేవారిపై బాబా యొక్క సత్సాంగత్యము యొక్క రంగు అంటి ఉంటుంది. సత్యము యొక్క సాంగత్యము యొక్క రంగే ఆత్మీయత. కావున సమీప రత్నాలు సదా ఆత్మిక స్థితిలో స్థితులై ఉంటారు. శరీరములో ఉంటూ కూడా అతీతముగా ఆత్మిక స్థితిలో స్థితులై ఉంటారు. శరీరమును చూస్తూ కూడా చూడకూడదు మరియు ఆత్మ ఏదైతే కనిపించదో అది ప్రత్యక్షముగా కనిపించాలి. ఇదే అద్భుతం! ఆత్మిక నషాలో ఉండేవారే బాబాను తోడుగా చేసుకోగలరు, ఎందుకంటే బాబా కూడా ఆత్మయే. 

3. పురాతన ప్రపంచము యొక్క సర్వ ఆకర్షణల నుండి అతీతముగా అయ్యేందుకు సహజ సాధనము. 

"ఎల్లప్పుడూ మనం అవినాశీ, ఖజానాలకు అధిపతులము అన్న నషాలో ఉండండి. జ్ఞానము, సుఖశాంతులు, ఆనందము మొదలైన బాబా యొక్క ఖజానాలేవైతే ఉన్నాయో ఆ సర్వగుణాలు మనవే. కొడుకు తండ్రి ఆస్తికి స్వతహాగానే ఆధిపతి అవుతాడు. అధికారీ ఆత్మకు తన అధికారం యొక్క నషా ఉంటుంది. నషాలో అన్నీ మర్చిపోతారు కదా! ఇప్పుడు ఏ స్మృతీ ఉండదు. బాబా మరియు నేను అన్న ఈ ఒక్క స్మృతియే ఉండాలి. ఈ స్మృతి ద్వారానే పురాతన ప్రపంచము యొక్క ఆకర్షణల నుండి తమంతట తామే అతీతమైపోతారు. నషాలో ఉండేవారిముందు సదా తమ లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. ఫరిస్తా స్వరూపము మరియు దేవతా స్వరూపమే ఆ లక్ష్యము.

4. ఒక్క క్షణము యొక్క అద్భుతమైన ఆటతో పాస్ విత్ హానర్ గా అయిపోవాలి. ఇప్పుడిప్పుడే శరీరములోకి రావడం, మళ్ళీ ఇప్పుడిప్పుడే శరీరము నుండి అతీతముగా అవ్యక్త స్థితిలో స్థితులైపోవడం. ఈ క్షణము యొక్క ఆట యొక్క అభ్యాసము ఉందా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎలా కావాలనుకుంటే అలా అదే స్థితిలో స్థితులై ఉండగలగాలి. అంతిమ పేపర్ ఒక్క క్షణముదే. ఎవరైతే ఈ క్షణము యొక్క అలజడిలోకి వస్తారో వారు ఫెయిల్ అవుతారు, ఎవరైతే అచలముగా ఉంటారో వారు పాసవుతారు. అటువంటి నిగ్రహ శక్తి ఉందా? ఇప్పుడు ఇటువంటి అభ్యాసము తీవ్రరూపములో ఉండాలి. ఎంతటి హంగామా జరుగుతుంటే అంతగా స్వయం యొక్క స్థితి అతి శాంతముగా ఉండాలి. సముద్రము బయట శబ్దమయంగా ఉన్నా లోపల మటుకు చాలా శాంతిగా ఉంటుంది. ఇటువంటి అభ్యాసం కావాలి. నిగ్రహశక్తి కలవారే విశ్వమును కంట్రోల్ చేయగలుగుతారు. ఎవరైతే స్వయమునే కంట్రోల్ చేసుకోలేరో వారు విశ్వరాజ్యాన్ని ఎలా చేయగలరు? ఇముడ్చుకునే శక్తి కావాలి. ఒక్క క్షణములో విస్తారము నుండి సారములోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఒక్క క్షణములో విస్తారము నుండి సారములోకి వచ్చేయాలి, ఇదే అద్భుతమైన ఆట.

5. అతీంద్రియ సుఖము యొక్క ఊయలలో ఊగుతూ ఉండండి, మిమ్మల్ని సర్వ ఆత్మలు సుఖము యొక్క ఊయలలో ఊగుతూ ఉండడం చూసి తామూ దుఃఖితుల నుండి సుఖస్వరూపులుగా అయిపోవాలి. మీ నయనాలు, నోరు, ముఖము అన్నీ సుఖమునివ్వాలి. ఇటువంటి సుఖవంతులుగా అవ్వండి. ఎవరైతే ఇలా సుఖమునిచ్చేవారిగా అవుతారో వారికి సంకల్పములో కూడా దుఃఖము యొక్క అల రాజాలదు, అచ్ఛా 

Comments