12-12-1979 అవ్యక్త మురళి

12-12-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

ఆత్మిక అలంకారాలు మరియు వీటితో అలంకరింపబడిన మూర్తులు.

ఈ రోజు బాప్ దాదా తన పిల్లలందరినీ విశేషంగా, అలంకార స్వరూపంలో చూస్తున్నారు. ప్రతి ఒక్కరినీ శృంగారింపబడిన అలంకారధారిగా, అత్యంత సుందరమైన మూర్తిగా చూస్తున్నారు. మిమ్మల్ని మీరు అలా చూసుకున్నారా? ఏయే అలంకారాలు ధారణ చేశారు? తమ ఆత్మిక అలంకారాల శృంగారాన్ని సదా ధారణ చేసి నడుస్తున్నారా?

ఈ రోజు అమృతవేళలో అలంకరింపబడిన ప్రతి పుత్రుని మూర్తిని చూశారు. ఏమి చూశారు? ప్రతి పుత్రుడు అత్యంత సుందరమైన ఛత్రఛాయ క్రింద కూర్చొని ఉన్నాడు. ఈ ఛత్ర ఛాయ క్రింద ఉన్నందున ప్రకృతి మరియు మాయా దాడుల నుండి సురక్షితంగా ఉన్నారు. చాలా గొప్ప ఆత్మిక రక్షక సాధనం లోపల ఉన్నారు. కొద్దిగానైనా సూక్ష్మ వైబ్రేషన్లు కూడా ఈ ఛత్రఛాయ లోపలకు రాలేవు. ఇటువంటి ఛత్రఛాయలో విశ్వకళ్యాణ బాధ్యత కల్గిన కిరీటధారులు కూర్చుని ఉన్నారు. డబల్ కిరీటం చాలా అందంగా అలంకరింపబడి ఉంది. ఒకటి సంపూర్ణ పవిత్రతా లెక్కతో  ప్రకాశ కిరీటం. రెండవది సేవా కిరీటం. ఇందులో నంబరు వారుగా ఉన్నారు. కొంతమంది పిల్లల మూడు స్థితుల పవిత్రత అనగా సంకల్పం, మాట మరియు కర్మల పవిత్రతా ప్రకాశ కిరీటము చాలా ఎక్కువగా వ్యాపించి ఉంది. ఈ మూడు స్థితుల పవిత్రత అనుసారంగా ప్రకాశ కిరీటం నలువైపులా తన ప్రకాశాన్ని వ్యాపింపజేస్తూ ఉంది. ఈ ప్రకాశము కొంతమందిలో ఎక్కువగా, కొంతమందిలో తక్కువగా ఉంది. జత జతలో సేవా బాధ్యత అనుసారంగా లైట్ శక్తిలో తేడా ఉంది. అనగా శాతంలో తేడా ఉంది. కొందరి పవర్ 10 అయితే, కొందరి పవర్ 1000. శాతాన్ని బట్టి, వ్యాపింపజేసే శక్తిని బట్టి నంబరు వారు కిరీటధారులుగా ఉన్నారు.

కిరీటాలలో ఎలా నంబరు ఉందో అలా ఛత్రఛాయలో కూడా తేడా ఉంది. కొంతమంది ఛత్రఛాయ ఎంత పెద్దదిగా ఉందంటే ఆ ఛత్రఛాయ లోపల ఉంటూనే అన్ని పనులు చెయ్యగలుగుతున్నారు. ఈ ఛత్రఛాయ లోపల ఉంటూనే మొత్తం విశ్వమంతా భ్రమణం చెయ్యవచ్చు. అంత అనంతమైన ఛత్రఛాయ ఉంది. కొందరికి నంబరు వారుగా యథాశక్తిగా హద్దులో ఉంది. ఇలాంటి పరిమిత ఛత్రఛాయలో కూర్చొని ఉండడం అనగా తమ పురుషార్థంలో సదా స్మృతిలో ఉండుటకు బదులుగా నియమ ప్రమాణంగా, సమయ ప్రమాణంగా స్మృతిలో ఉండువారు. 4 గంటలు చేయువారు, 8 గంటలు చేయువారు అనగా స్మృతిని కూడా హద్దులోకి తీసుకొచ్చేవారు. స్మృతి చేసేది అనంతమైన తండ్రిని కాని స్మృతి చేయువారు అనంతమైన స్మృతిని కూడా హద్దులోకి తీసుకొచ్చారు. సంబంధం అవినాశిగా ఉన్నా సంబంధాన్ని నిభాయించేవారు సమయాన్ని నిశ్చితం చేసుకొని వినాశిగా చేసేశారు. ఒకప్పుడు తండ్రితో సంబంధం. ఒకప్పుడు వ్యక్తులతో సంబంధం, ఒకప్పుడు వైభవాలతో సంబంధం, ఒకప్పుడు తమ పాత స్వభావ-సంస్కారాలతో సంబంధం పెట్టుకుంటారు. తీసుకునేందుకేమో అవినాశి అధికారం, అవినాశి వారసత్వం కాని ఇచ్చే సమయంలో వినాశి వారసత్వంను కూడా దాచుకుంటారు. తీసుకోవడంలో విశాల హృదయులుగా ఉన్నారు కాని ఇవ్వడంలో అక్కడక్కడ పొదుపు చేస్తారు. పొదుపు ఎలా చేస్తారో తెలుసా? చాలామంది పిల్లలు చాలా తెలివిగా తండ్రితో ఆత్మిక సంభాషణ చేస్తారు. అందులో ఏం చెప్తారు? ఫలానా - ఫలానా విషయంలో ఇంత పరివర్తన చేసుకున్నాము. ఇంకా కొద్దిగా ఉంది. అది కూడా అయిపోతుంది అని అంటారు. కొద్దిగా ఉంది కదా. తీసుకోవడంలో మాత్రము కొద్ది కొద్దిగా ఇవ్వండి అని అడగరు. బాబా ఎవరైనా మహారథులకు విశేషమైన గౌరవమిస్తే మేము కూడా అధికారులమే కదా అని సంకల్పం వస్తుంది. తీసుకోవడంలో కొంచెం కూడా వదిలిపెట్టరు. కాని ఇవ్వడంలో కొద్ది కొద్దిగా ఇస్తూ సమాప్తి చేసేస్తారు. ఇలా పొదుపు చేస్తారు. నేర్పరితనంతో తండ్రిని కూడా ఓదారుస్తారు. "బాబా, తప్పకుండా సంపన్నమవుతాము, అయిపోతాము అని అంటారు." ఒక్క సెకండులో అధికారం తీసుకునేటప్పుడు, ఇవ్వడంలో కూడా విశాల హృదయులుగా ఉండండి. పరివర్తన చేసుకునే శక్తిని పూర్తి శాతంలో ఉపయోగించండి. నిరంతర స్మృతిని హద్దులోకి (పరిమితంలోకి) తీసుకొచ్చారు. అందువలన ఛత్రఛాయలో కూడా నంబరు ఉండుటను గమనించారు. నంబరు వారుగా ఉన్న కారణంగా మాయ వైబ్రేషన్లున్న వాతావరణము, వ్యక్తి వైభవాలు, స్వభావ-సంస్కారాలు యుద్ధం చేస్తాయి. లేకుంటే ఛత్రఛాయ లోపల సదా సురక్షితంగా ఉండగలరు.

కిరీటధారులనూ చూశారు, ఛత్రధారుల(సింహాసనాధికారులు)నూ చూశారు. జత జతలో కిరీటధారులైన సింహాసనాధికారులందరినీ కూడా చూశారు. సింహాసనం గురించి తెలుసు కదా. తండ్రి హృదయ సింహాసనం. కాని ఈ సింహాసనం ఎంత పవిత్రమైనదంటే, ఈ సింహాసనంపై సదా పవిత్రంగా ఉన్నవారే కూర్చోగలరు. తండ్రి తన సింహాసనం నుండి దింపరు కాని స్వయం మీరే దిగేస్తారు. పిల్లలందరూ సదా హృదయ సింహాసనాధికారులుగా ఉండమని తండ్రి ఆఫర్ చేస్తారు. కాని స్వతహాగా ఉన్న కర్మల గతి చక్రం ప్రమాణంగా తండ్రిని సదా అనుసరించువారే సదా కూర్చోగల్గుతారు. సంకల్పంలోనైనా అపవిత్రత లేక అమర్యాద వచ్చిందంటే సింహాసనాధికారిగా అగుటకు బదులు పడిపోయే కళలోకి అనగా క్రిందికి వచ్చేస్తారు. ఎలాంటి కర్మలు చేస్తారో, వాటి అనుసారంగా అదే సమయంలో పశ్చాత్తాపపడ్డారు లేక సింహాసనాధికారుల నుండి పడిపోయే కళలోకి వచ్చామని అనుభవం చేస్తారు. ఎవరైనా ఎక్కువగా చెడు కర్మలు చేసినట్లైతే పశ్చాత్తాప స్థితిలోకి వచ్చేస్తారు. ఒకవేళ వికర్మలు జరగకుండా, వ్యర్ధ కర్మలు జరిగినట్లైతే పశ్చాత్తాప స్థితి ఉండదు కాని అనుభవం చేసుకునే స్థితి ఉంటుంది. మాటిమాటికి వ్యర్థ సంకల్పాలను చెయ్యరాదని అనుభవం చేసుకునే స్థితికి తీసుకొస్తున్నట్లయితే, ఇది కూడా తప్పే. ఒక విధంగా ముళ్లలాగా గుచ్చుకుంటూ ఉంటాయి. ఎక్కడ పశ్చాత్తాప స్థితి లేక అనుభవం చేసుకునే స్థితి ఉంటుందో అక్కడ సింహాసనాధికారీ స్థితి ఉండదు. మొదటిది - సింహాసనాధికారి స్థితి. రెండవది - చేసిన తర్వాత అనుభవం చేసుకునే స్థితి. ఇందులో కూడా నంబరు ఉంది. కొంతమంది చేసిన తర్వాత అనుభవం చేసుకుంటారు, కొంతమంది చేస్తున్న సమయంలోనే అనుభవం చేసుకుంటారు. కొంతమంది కర్మ చెయ్యడం కంటే ముందే “ఏదో జరగబోతోంది, ఏ తుఫానో రాబోతోంది" అని గ్రహిస్తారు. రావడానికి ముందే అనుభవం చేసుకొని, గ్రహించి సమాప్తి చేసేస్తారు. కావున రెండవది అనుభనం చేసుకునే స్థితి. మూడవది - పశ్చాత్తాప స్థితి. దీనిలో కూడా నంబర్లున్నాయి. కొంతమంది పశ్చాత్తాపంతో పాటు పరివర్తన చేసుకుంటారు. కొంతమంది పశ్చాత్తాపపడ్డారు కాని పరివర్తన చేసుకోలేరు. పశ్చాత్తాపం ఉంది కాని పరివర్తనా శక్తి లేదు కనుక దీని కొరకు ఏం చేస్తారు? 

ఇలాంటి సమయంలో విశేషంగా స్వయం పట్ల ఏదో ఒక వ్రతం లేక నియమాన్ని ఉంచుకోవాలి. ఎలాగైతే భక్తి మార్గంలో కూడా అల్పకాలిక కార్య సఫలత కొరకు విశేష నియమాన్ని లేక వ్రతాన్ని ధారణ చేస్తారు కదా, వ్రతంతో వృత్తి పరివర్తన అవుతుంది. వృత్తితో భవిష్య జీవితం అనే సృష్టి మారిపోతుంది. ఎందుకంటే విశేష వ్రతం కారణంగా మాటిమాటికి అవే శుద్ధ సంకల్పాలు, దేని కోసం వ్రతం పెట్టుకున్నారో అది స్వతహాగానే గుర్తుకొస్తుంది. భక్తులు విశేషంగా ఏ దేవీ లేక దేవత గురించి వ్రతం పెట్టుకుంటారో, కోరుకోకపోయినా రోజంతా ఆ దేవీ దేవతలే గుర్తుకొస్తారు. దానికి బదులుగా తండ్రి ఆ దేవీ లేక దేవత ద్వారా వారి ఆశను పూర్తి చేస్తారు. కనుక భక్తుల వ్రతానికి కూడా ఫలం లభిస్తున్నపుడు జ్ఞానీ ఆత్మలైన మీ అధికారి పిల్లలకు శుద్ధ సంకల్పాలనే వ్రతానికి లేక దృఢ సంకల్పమనే వ్రతానికి ప్రత్యక్ష ఫలం తప్పక లభిస్తుంది. విన్నారు కదా. అందరినీ సింహాసనాధికారులుగా చూశారు కాని కొంతమందిని సదా కాలం కొరకు చూశారు. కొంతమందిని ఎక్కుతూ దిగుతూ చూశారు. ఇప్పుడిప్పుడే సింహాసనాధికారులుగా ఉంటారు, ఇప్పుడిప్పుడే క్రిందికి వస్తారు. నాల్గవ అలంకారం ఏమి చూశారు?

ప్రతి ఒక్కరి వద్ద స్వదర్శన చక్రాన్ని చూశారు. అందరూ స్వదర్శన చక్రధారులుగా ఏమో ఉన్నారు కాని కొంతమంది చక్రం స్వతహాగానే తిరుగుతూ ఉంది. కొందరు చక్రాన్ని తిప్పాల్సి వస్తుంది. కొందరు సరియైన దిశలో తిప్పడానికి బదులు వ్యతిరేక దిశలో తిప్పుతున్నారు. స్వదర్శన చక్రానికి బదులు మాయా చక్రంలోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఎడమవైపుకు తిప్పేశారు కదా. స్వదర్శన చక్రం తిప్పుటకు బదులు పరదర్శన చక్రం తిప్పేస్తారు అనగా ఇది ఎడమవైపుకు తిప్పడమవుతుంది. మాయాజీతులుగా కావడానికి బదులు పరదర్శన చక్రంలోకి వచ్చేస్తారు. దీనితో ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నల వల తయారవుతుంది. దీనిని స్వయమే రచించుకొని, స్వయమే అందులో చిక్కుకుపోతారు. కావున ఏమేమి చూశారో విన్నారా?

నాలుగు అలంకారాలతో అలంకరింపబడి ఉన్నారు కాని నంబరు వారుగా ఉన్నారు. ఇప్పుడు ఏమి చేస్తారు? బేహద్ ఛత్ర ఛాయలోకి రండి. అనగా అప్పుడప్పుడు స్మృతి అనే అంతరాన్ని తొలగించి నిరంతర స్మృతి అనే ఛత్రఛాయలోకి వచ్చేయండి. పవిత్రత మరియు సేవల డబల్ కిరీటాన్ని ధరించుటలో శాతాన్ని బేహద్ లో చెయ్యండి. అనగా బేహద్ లో వ్యాపిస్తున్న లైట్ కిరీటధారిగా కండి. ఇవ్వడం మరియు తీసుకోవడంలో సెకండు అభ్యాసిగా అయ్యి సదా సింహాసనాధికారులుగా కండి. ఎక్కడం మరియు దిగడంలో అలసిపోతారు. సదా బేహద్ ఆత్మిక విశ్రాంతిలో సింహాసనాధికారులుగా ఉండండి. అనగా నిర్బంధన ఆత్మగా విశ్రాంతి స్థితిలో ఉండండి. మాస్టర్ జ్ఞాన స్వరూపులై సదా స్వతహాగా స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. పరదర్శన చక్రం అనగా ఎందుకు? ఏమి? అనే ప్రశ్నల వల నుండి సదా ముక్తులుగా అయితే ఏమవుతుంది? సదా యోగయుక్తులు. జీవన్ముక్తులైన చక్రవర్తులుగా అయ్యి తండ్రి జతలో విశ్వకళ్యాణమనే సేవా చక్రంలో తిరుగుతూ ఉంటారు. విశ్వ సేవాధారులు చక్రవర్తి రాజులుగా అయిపోతారు.

ఇటువంటి సదా అలంకారులకు, సదా స్వదర్శన చక్రధారులకు, మాయ యొక్క ప్రతి స్వరూపాన్ని మాస్టర్ జ్ఞాన సాగరుల స్థితిలో స్థితమై ముందే గుర్తించేవారు, అనేక మాయదాడులను సమాప్తి చేసి మాయను బలి తీసుకునే వారు, తండ్రికి కంఠకరంగా అయ్యేవారు, అవినాశి సర్వ సంబంధాల ప్రీతి యొక్క రీతిని సదా నిభాయించేవారు, ఇటువంటి తండ్రి సమానంగా ఉన్న పిల్లలకు బాప్ దాదా ప్రియస్మృతులు మరియు నమస్తే.

యు.పి నివాసులు వచ్చారు. ఉత్తర ప్రదేశ్ విశేషత ఏమిటంటే అక్కడ భక్తిమార్గపు తీర్థ స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జ్ఞాన సేవాకేంద్రాల విస్తారం కూడా బాగా చేస్తున్నారు. యు.పిలో భక్త ఆత్మలు కూడా చాలామంది ఉన్నారు. కనుక మాస్టర్ భగవంతులైన మీరిప్పుడు భక్తుల పిలుపు విని ఇంకా త్వరత్వరగా వారికి భక్తి ఫలాన్ని ఇవ్వండి. ఇస్తూ ఉన్నారు కాని ఇంకా వేగాన్ని పెంచండి. యు.పి  వారు అనేకమంది పేదవారిని షావుకార్లుగా చేసే చాలా మంచి అవకాశాన్ని తీసుకుంటున్నారు. దయాహృదయులై దయాభావనను బాగా చూపిస్తున్నారు. కౌరవ గవర్నమెంట్ యొక్క చిత్రపటంలో (Map) కూడా యు.పి విశాలంగా ఉంది. ప్రదేశం(ఏరియా) చాలా పెద్దది. అలాగే పాండవ గవర్నమెంట్ పటంలో కూడా సేవా ఏరియాలో అన్నిటికంటే నంబరువన్ గా చేసి చూపించండి విశేషంగా ఈ సంవత్సరంలో మిగిలిన గుప్తమైన వారసులను ప్రత్యక్షం చెయ్యండి. ఇప్పటివరకు ఏదైతే చేశారో అది చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా నలువైపులా ఉన్న ఆత్మలు "వన్స్ మోర్ మరోసారి చెయ్యండి" అని అనాలి. ఓహో ఓహో అని చప్పట్లు కొట్టాలి. ఇలాంటి విశేష కార్యాన్ని కూడా యు.పి వారు చెయ్యాలి. ఇప్పుడు ఇంకా ఎక్కువగా జ్ఞాన స్థానాలను తయారుచెయ్యండి. తీర్థ స్థానాలను జ్ఞాన స్థానాలుగా యూ.పి వారు చేస్తూ వెళ్లండి. మంచిది. వచ్చినవారందరూ పురుషార్థంలో ముందుకు వెళ్తున్నారు. అందుకు అభినందనలు. దాని కంటే ఇంకా ఎక్కువగా హైజంప్ చేయుటకు సదా స్మృతి స్వరూపులుగా కండి.

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా వ్యక్తిగత కలయిక -

1)సహజయోగీ చిత్రము - విష్ణువు శేషపాన్పు - మీరు అందరూ సదా పునాదిలాగా, దృఢంగా ఉండేవారు. సదా అచంచలంగా ఉన్నారు కదా? కదిలిపోయేవారు కాదు కదా? అంగదుని మహిమ ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. అది ఎవరి మహిమ? మీ మహిమే ఇప్పుడు మరలా వింటున్నారు కదా. కల్పక్రితము ఎవరైతే విజయం పొందుకున్నారో ఆ విజయ ఢంకా ఇప్పుడు కూడా వింటున్నారు. కల్పకల్పమూ విజయులుగా అయిన చిత్రము ఇప్పుడు కూడా మీ ఎదురుగా ఉంది. అనేకసార్లు మీరు విజయులుగా అయ్యారు. అందువలన సహజయోగులని అంటారు. అనేకసార్లు చేసిన దానిని మరలా చెయ్యడం సహజమవుతుంది కదా. కొత్తగా చెయ్యడం లేదు కదా! తయారైన దానిని తయారు చేస్తూ ఉన్నారు. అందువలన తయారై ఉంది, మరలా తయారు చేస్తూ ఉన్నారని అంటారు. తయారై ఉంది, కాని మరలా రిపీట్ చేసి తయారు చేసుకుంటున్నారు. ఇంతకుముందు కూడా పదమాపదమ్ భాగ్యశాలిగా అయ్యారు, ఇప్పుడు కూడా అవుతూ ఉన్నారు. ఇలాంటి సహజ యోగులుగా ఉన్నారు. వీరి గుర్తులు, వీరు ఉండే విధానం, వీరి నడవడికల చిత్రాన్ని ఎలా చూపించారు? విష్ణువు శేష పాన్పు అనగా పామును కూడా శయ్యగా చేసుకున్నారు. అనగా అవి అధీనమైపోయారు. వారు అధికారిగా అయ్యారు. లేకుంటే పామును ఎవ్వరూ తాకను కూడా తాకరు. పామును పాన్పుగా చేసుకున్నారనగా విజయులుగా అయ్యారు. వికారాలనే పాములను అధీనము చేసుకొని పాన్పుగా చేసుకున్నారు అంటే నిశ్చింతులుగా అయ్యారు కదా, ఎవరు విజయులుగా అవుతారో వారు విష్ణు సమానంగా సదా నిశ్చింతగా, హర్షితంగా ఉంటారు. సంతోషంగా కూడా ఎప్పుడు ఉంటారు? జ్ఞానాన్ని మననము చేస్తూ ఉంటే సంతోషంగా ఉంటారు. కనుక ఆ చిత్రము మీదే కదా! ఎవరైతే తండ్రికి పిల్లలుగా అయ్యారో, విజయులుగా అవుతూ ఉన్నారో, వారిదే ఈ చిత్రము. వికారాలను అధీనంగా చేసుకున్న అధికారిని అని సదా ఎదురుగా చూసుకోండి. ఆత్మ సదా విశ్రాంత స్థితిలో ఉండాలి. శరీరము నిదురించే విశ్రాంతి కాదు. సేవలో ఎముకలను ఇవ్వాలి. ఆత్మ నిశ్చింత స్థితిలో ఉండుటే విశ్రాంతి. ఎందుకనగా ఇప్పుడు భ్రమించుట నుండి రక్షింపబడ్డారు.

మాతలందరూ గోపికలే గోపీవల్లభుని జతలో ఊయలలో ఊగేవారిగా ఉన్నారు కదా? అర్ధకల్పము జడ చిత్రాలను చాలా ప్రేమతో ఊపారు. ఇప్పుడు ఊపడం సమాప్తమై ఊగడం ప్రారంభమైపోయింది. అప్పుడప్పుడు సుఖ ఊయలలో, అప్పుడప్పుడు శాంతి ఊయలలో.......... ఇలా అనేక ఊయలలున్నాయి. ఎందులో కావాలంటే అందులో ఊగండి. క్రిందికి రాకండి. మాతలకు ఊయల మంచిగా అనిపిస్తుంది కదా, అందువలననే పిల్లలను కూడా ఊయలలో ఊపుతూ ఉంటారు. భక్తిలో చాలా ఊపారు. ఇప్పుడు భక్తి ఫలం తీసుకుంటారు కదా? భక్తి అనగా ఊపడం, ఫలము అనగా ఊగడం. ఇప్పుడు ఏదైతే ఫలం లభిస్తూ ఉందో అది తింటున్నారా లేక చూసి చూసి సంతోషపడ్తున్నారా? మాతలలో ఈ అలవాటు కూడా ఉంటుంది తినకుండా అలాగే ఉంచుకుంటారు. కాని ఇది ఎంత తింటే అంత పెరుగుతుంది. ఒక్క సెకండు తిన్నట్లయితే ఆ ఒక్క సమయంలోని అనుభూతి సదా కొరకు అనుభవిగా చేస్తుంది. అందువలన బాగా తినండి మాతలను చూసి తండ్రికి చాలా సంతోషమవుతుంది. వీరిని ప్రపంచము నిరాశావాదులుగా చేసింది కాని వారినే తండ్రి శిరోకిరీటధారులుగా చేసేశారు. వారు పాత చెప్పుగా భావించారు. తండ్రి శిరోకిరీటధారులుగా చేశారు కనుక ఎంత సంతోషముండాలి! పాండవులకు కూడా సదా సహయోగులుగా, సదా తోడుగా ఉండే గాయనముంది. స్మృతి చిహ్నంలో కూడా గోపీవల్లభునితో పాటు గోపబాలురుగా చూపించారు. ప్రతి కార్యంలో సహయోగులు, సదా తోడుగా ఉండేవారే కదా? అందరూ స్మృతి మరియు సేవ రెండిటిలో నిమగ్నమై ఉండండి. సేవతో భవిష్య ప్రాలబ్ధం తయారవుతుంది. స్మృతితో వర్తమానంలో సంతోషంగా ఉంటారు. అప్రాప్తి అను వస్తువే ఉండదు. సదా తృప్తిగా ఉంటారు.

Comments