* 12-03-1982 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
చైతన్య పుష్పాలలో రంగు, రూపము, సుగంధము యొక్క ఆధారము.
ఈరోజు తోటమాలియైన బాబా తమ చైతన్య పూలతోటలో వెరైటీ రకాల పుష్పాలను చూస్తున్నారు. ఇటువంటి ఆత్మిక పూలతోట బాప్ దాదాకు కూడా కల్పములో ఒకేసారి లభిస్తుంది. ఇటువంటి ఆత్మిక పూలతోట ఆత్మిక సుగంధము కల పుష్పాల యొక్క శోభ ఇంకే సమయములోనూ లభించజాలదు. ఎంత ప్రసిద్ధమైన పూలతోట ఉన్నా కానీ అది దీని ముందు ఎలా అనుభవమవుతుంది? ఇది వజ్రతుల్యమైనదైతే అది గవ్వతుల్యమైనది. నేను ఇటువంటి చైతన్యమైన ఈశ్వరీయ పూలతోట యొక్క ఆత్మిక పుష్పమును అనే ఇటువంటి నషా మీకు ఉంటోందా? ఏ విధముగా బాప్ దాదా ప్రతి పుష్పము యొక్క రంగు, రూపము మరియు సుగంధము మూడింటినీ చూస్తారో అదేవిధముగా మీ రంగు, రూపము మరియు సుగంధమును గూర్చి మీకు తెలుసా?
రంగుకు ఆధారము జ్ఞానము యొక్క సబ్జెక్ట్. ఎంతెంతగా జ్ఞానస్వరూపముగా అవుతారో అంతంతగా రంగు ఆకర్షణీయముగా ఉంటుంది. ఏ విధముగా స్థూల పుష్పాల యొక్క రంగును చూసినప్పుడు భిన్నభిన్న రంగులను చూస్తూ కూడా కొన్ని రంగులు విశేషముగా దూరము నుండే ఆకర్షిస్తూ ఉంటాయి. చూడడంతోనే వారి నోటి నుండి ఇవి ఎంత సుందరమైన పుష్పాలు! అన్న మహిమ తప్పకుండా వెలువడుతుంది మరియు వాటిని సదా చూస్తూ ఉండాలి అని మనస్సులో కలుగుతుంది. అలాగే జ్ఞానము యొక్క రంగులో రంగరింపబడిన పుష్పాలు ఎంత సుందరముగా ఉంటాయి. అలాగే రూపము మరియు సుగంధమునకు ఆధారము - స్మృతి మరియు దివ్యగుణమూర్తులుగా ఉండడం. కేవలం రంగు ఉంటూ మరియు రూపము లేకపోతే ఆకర్షణ ఉండదు మరియు రంగు, రూపము ఉంటూ సుగంధము లేకపోతే కూడా ఆకర్షించలేరు. ఇది నకిలీది. ఇది అసలైనది అని అంటూ ఉంటారు కదా! కేవలం రంగు మరియు రూపము గల పుష్పాలు అలంకరణ కొరకు ఎక్కువగా ఉపయోగపడతాయి. కానీ సుగంధమయమైన పుష్పాలను మనుష్యులు తమ సమీపముగా ఉంచుకుంటారు.
సుగంధమయమైన పుష్పాలు సదా మరియు స్వతహాగానే సేవ యొక్క స్వరూపముగా ఉంటాయి. కావున నేను ఎటువంటి పుష్పమును అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎక్కడ ఉన్నా కానీ సేవ స్వతహాగా జరుగుతూ ఉంటుంది అనగా ఆత్మిక వాయుమండలమును తయారుచేసేందుకు నిమిత్తముగా అయి ఉంటారు. సమీపముగా రావడంతోనే అనగా సంపర్కములోకి రావడంతోనే సుగంధము చేరుతుంది లేక దూరం నుండే సుగంధము వ్యాపిస్తుంది. కేవలం జ్ఞానమును విని యోగమును జోడించే అభ్యాసులుగా మాత్రమే అయి, జ్ఞానస్వరూపులుగా లేక యోగీ జీవితము కలవారిగా లేక ప్రాక్టికల్ దివ్యగుణమూర్తులుగా అవ్వకపోతే కేవలం అలంకరణ మాత్రముగా అనగా ప్రజలుగా అయిపోతారు. రాజుకు ప్రజలు అలంకరణయే కదా! కావున అల్లా యొక్క పూలతోటలోని పుష్పాలుగా అయ్యారు కానీ ఎటువంటి పుష్పాలుగా అయ్యారు? ఇదే మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. తోట ఒక్కటే, తోటమాలి కూడా ఒక్కరే, కానీ పుష్పాలలో వెరైటీ ఉంది. డబుల్ విదేశీయులు తమను ఏమని భావించుకుంటున్నారు? మీరు రాజ్య అధికారులా లేక రాజ్యము చేసేవారిని చూసేవారా? ఈరోజు బాప్ దాదా తోటలో కలుసుకునేందుకు వచ్చారు. అందరి మనసులో కలిసి మాట్లాడాలి అనే సంకల్పము ఉంటుంది. కావున ఈరోజు ఆత్మిక సంభాషణ చేసేందుకు వచ్చారు. విశేషముగా రెండు గ్రూపులు ఉన్నాయి కదా!
బాప్ దాదాకు కూడా దేశవిదేశాల యొక్క ఇరువురు పిల్లలు ఎంతో ప్రియమైనవారు. కర్నాటక వారు మరియు డబుల్ విదేశీయులు కూడా సదా సంతోషములో ఊగుతూ ఉంటారు. మధువనములోకి వస్తూ అందరూ మాయాజీతులుగా అయ్యే అనుభవజ్ఞులుగా అయిపోయారా లేక మధువనములోకి కూడా మాయ వస్తుందా? మాయాజీత స్థితి యొక్క అనుభూతిని పొందేందుకే మీరు మధువనములోకి వస్తారు, కావున ఇక్కడ మాయ యొక్క యుద్ధం జరుగదు. మాయ ఓడిపోయి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మధువనములో విశేషముగా మీ సంపాదనను జమా చేసుకునేందుకు వస్తారు. డబుల్ విదేశీయులు డబుల్ లాక్ ను వేయాలి. మధువనములోకి వచ్చి స్వయములో విశేషముగా ఏ విశేషతలను ధారణ చేసారు? (బాప్ దాదా విదేశీయులను మరియు కర్నాటక వారిని అడుగుతున్నారు). ఏ విధముగా సహయోగులుగా అయ్యే విశేషతను చూసారో అలా ఇంకే విశేషతను చూసారు? ప్రేమా లభించింది, శాంతి లభించింది, ప్రకాశము కూడా లభించింది. అన్నీ లభించాయి కదా! ఎంతగా స్వయమునకు ప్రాప్తి జరుగుతుందో అంతగా ప్రాప్తి పొందినవారు సేవ చేయకుండా ఉండలేరు. కావున ప్రాప్తి స్వరూపులుగా అయిన కారణముగా సేవాస్వరూపులుగా స్వతహాగానే ఉన్నారు.
కర్నాటక వారు కూడా బాగా వృద్ధినొందారు. విదేశాలలో కూడా మంచి వృద్ధి జరిగింది. విదేశాలవారు సేవాకేంద్రాలను మరియు సేవాధారులను కూడా బాగా తయారుచేసారు. బాప్ దాదా కూడా పిల్లల యొక్క ధైర్యమును, ఉల్లాస, ఉత్సాహములను చూసి ఎంతో హర్షిస్తారు. దేశంలో కానీ, విదేశములో కానీ సేవ యొక్క ఉల్లాస, ఉత్సాహాలను పిల్లలలో చూసి బాబా ఎంతో సంతోషిస్తారు. అచ్చా!
సేవాకేంద్రములో ఎవరైతే ఉంటారో దేశములో కానీ, విదేశములో కానీ సేవలో ఎవరైతే ఉపస్థితులై ఉన్నారో వారు అమృతవేళను శక్తిశాలిగా ఉంచుకుంటున్నారా? ఈ గ్రూప్ చాలా బాగుంది కానీ మంచి, మంచి పిల్లలను మాయ కూడా బాగా చూస్తుంది. మాయకు కూడా వారు ఎంతో నచ్చుతారు, కావున మాయాజీతులుగా అవ్వాలి. ఎందుకంటే మీరు నిమిత్త ఆత్మలు కదా! కావున విశేషమైన అటెన్షన్ ను ఉంచండి. నిమిత్తులై ఉన్న ఆత్మలు ఎంతగా శక్తిశాలులుగా ఉంటారో అంతగా వాయుమండలమును శక్తిశాలిగా తయారుచేయగలుగుతారు. లేకపోతే వాయుమండలము బలహీనమైపోతుంది. ఎన్నో సమస్యలు వస్తాయి. శక్తిశాలీ వాయుమండలము ఉన్న కారణముగా స్వయమూ విఘ్న వినాశకులుగా ఉంటారు మరియు ఇతరులకు కూడా విఘ్న వినాశకులుగా అవుతారు అనగా నిమిత్తముగా అవుతారు. ఏ విధముగా సూర్యుడు స్వయం ప్రకాశమయంగా ఉన్న కారణముగా అంధకారమును అంతం చేసి ఇతరులకు ప్రకాశమునిస్తాడో మరియు చెత్తను భస్మం చేస్తాడో అలాగే నిమిత్తముగా అయిఉన్న ఆత్మలు ఎవరైతే ఉంటారో వారు శక్తిస్వరూపమైన విఘ్నవినాశక స్థితిలో స్థితులై ఉండే ధ్యానమును ఉంచాలి. కేవలం స్వయం ప్రతి కాదు. ఇతరులను కూడా విఘ్నవినాశకులుగా తయారుచేయగలిగేందుకు స్టాక్ కూడా జమా అయి ఉండాలి. కావున ఈ గ్రూప్లో మెజార్టీ మాస్టర్ జ్ఞానసూర్యులు. ఇప్పుడు సదా నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను అన్న స్మృతి స్వరూపముగా అయి ఉండాలి. స్వయమూ ప్రకాశ స్వరూపులుగా ఉండాలి మరియు ఇతరుల యొక్క అంధకారమును కూడా అంతం చేయాలి, అచ్చా!
మధువనము వారు కూడా బాప్ దాదాకు గుర్తున్నారు. మధువన నివాసులు కూడా బ్రాహ్మణ పరివారము యొక్క దృష్టిలో ఉంటారు. మధువనం యొక్క మహిమను గానం చేసినప్పుడు వారి ముందుకు మధువన నివాసులే వస్తారు. మధువనం వారి మహిమ యొక్క పూర్తి భాషణ తయారై ఉంది. మధువనం యొక్క మహిమ ఏదైతే ఉందో దానిని మధువన నివాసులు ప్రతి ఒక్కరూ తమ మహిమగా అనుభవం చేసుకుంటారు కదా, అచ్ఛా!
సదా సర్వ విశేషతా సంపన్నమైన విశేష ఆత్మలకు, సదా స్వయం యొక్క స్వరూపము ద్వారా సేవలో నిమిత్తముగా అయి ఉన్న సేవాధారీ ఆత్మలకు, సదా రంగు, రూపము మరియు సుగంధము గల పుష్పాలకు తోటమాలి అయిన బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
డబుల్ విదేశీ పిల్లల యొక్క ప్రశ్న ఒకటి ఉంది. మాకు డబుల్ సర్వీస్ (ఈశ్వరీయ సేవతో పాటు ఉద్యోగం) చేయవలసిందిగా ఎందుకు చెప్పబడుతుంది అని అడుగుతారు. ఈ ప్రశ్నకు బాప్ దాదా జవాబు చెబుతూ ఇలా అన్నారు:- సమయం తక్కువగా ఉంది మరియు అందరి కన్నా ఎక్కువగా ప్రాప్తిని పొందాలి అని భావిస్తున్నారు. కావున అందుకొరకు తనువూ వినియోగపడాలి, మనస్సు వినియోగపడాలి మరియు ధనమూ వినియోగపడాలి. కావుననే మూడు రకాల సేవ చేయవలసి ఉంటుంది. కొద్ది సమయంలో మీ యొక్క మూడు రకాల లాభము జమా అవుతుంది. ఎందుకంటే ధనము యొక్క సేవ కూడా ఉంది. ఆ మార్కులు జమా అయిన కారణముగా ముందు నెంబర్లు తీసుకుంటారు. కావున మీ లాభం కొరకే మీ ధనమును కూడా వినియోగించడం ద్వారా ధనము యొక్క సబ్జెక్టులో కూడా ఒకటికి కోటానురెట్లుగా లభిస్తుంది. అన్నివైపుల నుండి ఒకే సమయంలో లాభం లభించగలుగుతున్నప్పుడు మరి దానిని ఎందుకు చేయకూడదు? నిమిత్త ఆత్మలకు సమయమే లేదు, ఖాళీయే లేదు. తాము తినడానికి కూడా సమయం దొరకడం లేదు. అంతగా బిజీ అయిపోయారు అని నిమిత్త ఆత్మలు గమనించినప్పుడు ఆటోమాటిక్ గా దాని నుండి ఫ్రీ చేసేస్తారు, కానీ ఎప్పటివరకైతే ఇంతగా బిజీ అయిపోరో అప్పటివరకూ అది అవసరం. ఇది వ్యర్ధమవ్వడం లేదు. దీని యొక్క మార్కులు కూడా జమా అవుతున్నాయి. మీరు ఈజీగా అయిపోయినట్లయితే డ్రామాయే మిమ్మల్ని ఆ పనిని చేయనివ్వదు. ఏదో ఒక కారణం మీరు చేయాలనుకున్నా కూడా చేయలేని విధంగా చేసేస్తుంది. కావున ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే నడుస్తున్నారో అందులోనే కళ్యాణము ఉంది. మేము సరెండర్ కాదేమో అని భావించకండి. మీరు సరెండరే, డైరెక్షన్ అనుసారముగా అది చేస్తున్నారు. మీ ఇష్టానుసారముగా చేసినట్లయితే మీరు సరెండర్ కాదు. ఇందులో మీ మతమును నడుపుతూ మేము చేయము అని అన్నట్లయితే అది ఇంకా మన్మతమే అవుతుంది. కావున స్వయమును సదా తేలికగా ఉంచుకోండి. నిమిత్తమైయున్న ఆత్మలు చెప్పినట్లయితే అందులోనే కళ్యాణము ఉంది అని భావించండి. ఇందులో మీరు నిశ్చింతులుగా ఉండండి. ఈ విషయంలో నాకు పాత్ర లేదేమో, నాకు ఎందుకు చెప్పడం లేదు అని ఎక్కువగా ఆలోచించినట్లయితే అది వ్యర్ధమే అవుతుంది, అర్ధమయ్యిందా?
టీచర్లతో - టీచర్ల కొరకు ఏది సేవాస్థానము? టీచర్లు సదా విశ్వం యొక్క స్టేజిపై ఉన్నారు. విశ్వము యొక్క స్టేజియే మీ యొక్క సేవాస్థానము, కావున స్టేజిపై ఉన్నాము అని భావించడం ద్వారా ప్రతి కర్మనూ అటెన్షన్ గా చేస్తారు. ఏదైనా ప్రోగ్రాం చేసేటప్పుడు స్టేజిపై కూర్చునే సమయంలో ఎంత అటెన్షన్ ఉంటుంది! నిర్లక్ష్యులుగా అవ్వరు. కావున టీచర్లుగా అవ్వడం అనగా విశ్వం యొక్క స్టేజిపై ఉండడం. సెంటర్లో ఇద్దరు అక్కయ్యలు ఉంటారు కానీ మీరు ఇద్దరు కాదు. విశ్వం ముందు ఉన్నారు, అచ్చా ఓం శాంతి.
విదేశీ సోదరీ, సోదరులు అడిగిన ప్రశ్నలకు బాప్ దాదా యొక్కజవాబులు:-
ప్రశ్న: కొన్నిసార్లు యోగములో చాలా మంచి మంచి టచింగ్లు కలుగుతాయి కానీ అవి బాబా యొక్క టచింగ్లే అని ఎలా గుర్తించడం?
జవాబు: 1. బాబాయొక్క టచింగ్ ఎల్లప్పుడూ శక్తిశాలిగా ఉంటుంది మరియు ఇది నా శక్తి కన్నా విశేష శక్తి అని అనుభవమవుతుంది. 2. బాబాయొక్క టచింగ్ ఏదైతే ఉంటుందో అందులో సహజముగా సఫలత యొక్క అనుభూతి కలుగుతుంది. 3. బాబాయొక్క టచింగ్ లో ఎప్పుడూ, ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు. చాలా స్పష్టముగా ఉంటుంది. కావున వీటి ద్వారా ఇది బాబా యొక్క టచింగ్ అని అర్ధం చేసుకోండి.
ప్రశ్న: మేము బుద్ధి ద్వారా సరెండర్ అయ్యామా? లేదా? అన్నది గుర్తించడం ఎలా?
జవాబు: బుద్ధి ద్వారా సరెండర్ అవ్వడం అంటే - బుద్ధి ఏ నిర్ణయం తీసుకున్నా అది శ్రీమతానికి అనుకూలంగా ఉండాలి. ఎందుకంటే, నిర్ణయం తీసుకోవడం బుద్ధి యొక్క పని, కావున బుద్ధిలో శ్రీమతం తప్ప ఇంకే విషయమూ రాకూడదు. బుద్ధిలో సదా బాబా యొక్క స్మృతి ఉన్న కారణముగా ఆటోమాటిక్ గా నిర్ణయశక్తి అదేవిధంగా ఉంటుంది మరియు దానికి ప్రత్యక్షమైన గుర్తు జడ్జిమెంట్ సత్యముగా ఉంటుంది మరియు సఫలతతో కూడుకున్నదిగా ఉంటుంది. వారి విషయం స్వయమునకూ రుచిస్తుంది మరియు ఇతరులకు కూడా, ఈ విషయాన్ని చాలా బాగా చెప్పారు అని ఎంతో నచ్చుతుంది. వీరి బుద్ధి చాలా క్లియర్ గా మరియు సరెండర్ అయినదిగా ఉంది అని అనుభవం చేసుకుంటారు. తమ బుద్ధిపై వారికి సంతుష్టత ఉంటుంది. ఇది రైట్, రాంగ్ అన్న ప్రశ్న కలుగదు.
ప్రశ్న: చాలా మంది నిశ్చయబుద్ధి గల పిల్లలు 4- -5 సంవత్సరాలు నడిచిన తర్వాత కూడా వెళ్ళిపోయారు, ఈ అలలు ఎందుకు? ఈ అలలను ఎలా సమాప్తం చేయాలి?
జవాబు: వారు అలా వెళ్ళడానికి విశేష కారణం - సేవలో చాలా బిజీగా ఉంటారు కానీ సేవ మరియు స్వయం యొక్క బ్యాలెన్స్ ను పోగొట్టుకుంటారు కావున ఏ మంచి మంచి పిల్లలైతే ఆగిపోతారో వారి విషయంలో ఒకటేమో ఈ కారణం మరియు ఇంకొకటి వారు ఏదో ఒక విశేష సంస్కారములో ప్రారంభం నుండి బలహీనులుగా ఉంటారు కానీ దానిని దాచి ఉంచుతారు. తమలో తాము యుద్ధం చేస్తూ ఉంటారు. బాప్ దాదాకు లేక నిమిత్తమైయున్న ఆత్మలకు తమ బలహీనతను స్పష్టముగా వినిపించి దానిని సమాప్తం చేయరు. దాచి ఉంచిన కారణముగా ఆరోగము లోలోపలే వికరాళ రూపాన్ని ధరిస్తుంది మరియు ముందుకు వెళుతున్న అనుభవం కలుగదు దానితో నిరుత్సాహులుగా అయి వదిలివేస్తారు. మూడవ కారణం - పరస్పరం సంస్కారాలు కలవక వెళ్ళిపోతారు. సంస్కారాల యొక్క ఘర్షణ జరుగుతుంది. ఈ అలను సమాప్తం చేసేందుకు ఒకటేమో - సేవతో పాటు స్వయంపై కూడా పూర్తి అటెన్షన్ ను ఉంచాలి. ఇంకొకటి - ఎవరెవరైతే వస్తారో వారందరూ బాప్ దాదా ముందు లేక నిమిత్తమైయున్న ఆత్మల ముందు పూర్తిగా స్పష్టముగా ఉండాలి. సేవలో ఇది టూమచ్ గా ఉంది అని కొద్దిగా అనుభవం చేసుకున్నా మీ ఉన్నతి యొక్క సాధనమును గూర్చి ముందు ఆలోచించాలి మరియు నిమిత్తమైయున్న ఆత్మలు కూడా తమ సలహాను తెలియజేయాలి. కొత్తవారు ఎవరైతే వస్తారో వారికి మొదట ఈ విషయంపై ధ్యానమును ఇప్పించాలి. తమ సంస్కారాలను మొదటినుండే పరిశీలించుకోవాలి. ఎవరితోనైనా మీ సంస్కారాలు ఘర్షణ పడుతున్నాయంటే వారి నుండి పక్కకు తప్పుకోవడం మంచిది. ఏ పరిస్థితులలోనైతే సంస్కారాల యొక్క ఘర్షణ జరుగుతుందో ఆ పరిస్థితుల నుండి పక్కకు తప్పుకోవడమే మంచిది.
ప్రశ్న: ఏదైనా స్థానములో సేవ యొక్క రిజల్టు వెలువడడం లేదంటే అది మన యొక్క లోపమా? ధరణి యొక్క లోపమా?
జవాబు: మొదట సేవ యొక్క అన్ని సాధనాలను అన్ని రకాలుగా ఉపయోగించి చూడండి. అన్నిరకాలుగా సేవ చేసిన తర్వాత కూడా రిజల్టు వెలువడడం లేదంటే అందులో ధరణి యొక్క తేడా ఉండి ఉండవచ్చు. మీ వ్యక్తిగత బలహీనత ఏదైనా ఉండి, ఆ కారణముగా సేవ వృద్ధినొందడం లేదంటే తప్పకుండా లోలోపల నా కారణముగానే సేన జరుగడం లేదు అని మనస్సు తింటూ ఉంటుంది. అటువంటి సమయంలో పరస్పరం ఒకరి సహయోగమును ఒకరు తీసుకొని ఫోర్స్ నింపుకోవాలి. మన వ్యక్తిగత కారణము ఉన్నట్లయితే ఆ ధరణి నుండి వెలువడే ఆత్మలు కూడా అలాగే ఉంటారు. తీవ్ర పురుషార్థులుగా అవ్వరు, అచ్చా!
Comments
Post a Comment