12-01-1982 అవ్యక్త మురళి

* 12-01-1982         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

విశ్వము యొక్క ఉద్ధారణ ఆధారమూర్త ఆత్మలపై ఆధారము.

ఈ రోజు బాప్ దాదా విశ్వము యొక్క ఆధారమూర్తులైన ఆత్మలను చూస్తున్నారు. మీరు సర్వశ్రేష్ఠ ఆత్మలు, విశ్వము యొక్క ఆధారమూర్తులు, శ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క పైకి ఎక్కే కళ లేక ఎగిరే కళ ఉన్నప్పుడు మొత్తం విశ్వం యొక్క ఉద్దారమును చేసేందుకు మీరు నిమిత్తులైపోతారు. జన్మజన్మాంతరాల ముక్తి లేక జీవన్ముక్తులను ప్రాప్తించుకునే సర్వాత్మల యొక్క ఆశ స్వతహాగానే ప్రాప్తమవుతుంది. శ్రేష్ఠ ఆత్మలైన మీరు ముక్తి అనగా మీ ఇంటి యొక్క ద్వారాలను తెరిచేందుకు నిమిత్తులుగా అవుతారు, కావున సర్వాత్మలకూ మధురమైన ఇంటి యొక్క ఆధారము లభిస్తుంది, ఎంతో కాలం యొక్క దు:ఖం మరియు అశాంతి సమాప్తమైపోతుంది, ఎందుకంటే శాంతిధామనివాసులుగా అయిపోతారు. జీవన్ముక్తి యొక్క వారసత్వము నుండి వంచితులైన ఆత్మలకు వారసత్వము ప్రాప్తమవుతుంది. అందుకు నిమిత్తులుగా అనగా ఆధారమూర్తులైన శ్రేష్ఠ ఆత్మలుగా బాబా పిల్లలైన మిమ్మల్నే తయారుచేస్తారు. మొదట పిల్లలు, ఆ తర్వాతే మేము అని బాప్ దాదా సదా అంటారు. ముందు పిల్లలు తర్వాత తండ్రి. ఇలాగే సదా నడిపిస్తూ వచ్చారు. ఇలా
విశ్వము యొక్క ఆధారమూర్తులుగా స్వయమును భావిస్తూ నడుచుకుంటున్నారా? బీజముతో పాటు వృక్షము యొక్క వేర్లలో ఆధారమూర్తులైన శ్రేష్ఠ ఆత్మలగు మీరు ఉన్నారు. కావున బాప్ దాదా ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలతో కలుసుకునేందుకు వస్తారు. నిరాకారుడు మరియు సాకారున్నికూడా తమ సమానముగా సాకారములోకి తీసుకువచ్చే శ్రేష్ఠ ఆత్మలు మీరు. మరి మీరు ఎంత శ్రేష్ఠమైనవారు! కావున స్వయమును ఇలా భావిస్తూ ప్రతి కర్మనూ చేస్తున్నారా? ఈ సమయంలో స్మృతి స్వరూపము ద్వారా సదా సమర్ధ స్వరూపులుగా అయిపోతారు. ఈ ఒక్క అటెన్షన్ స్వతహాగానే హద్దులోని అటెన్షన్లను సమాప్తం చేసేస్తుంది. ఈ అటెన్షన్ ముందు ఎటువంటి టెన్షన్ అయినా అటెన్షన్లోకి పరివర్తితమైపోతుంది మరియు ఇదే స్వపరివర్తన ద్వారా విశ్వపరివర్తన సహజమైపోతుంది. ఈ అటెన్షన్ ఎటువంటి ఇంద్రజాలములా పనిచేస్తుందంటే, అనేక ఆత్మల యొక్క అనేకరకాలైన టెన్షన్లను సమాప్తం చేసి తండ్రి వైపుకు అటెన్షన్‌ను కలిగిస్తుంది. ఏ విధంగా ఈ రోజుల్లో సైన్స్ యొక్క అనేక సాధనాలు స్విచ్ ఆన్ చేయడంతోనే నలువైపులా ఉన్న చెత్తను, అశుద్ధతను తమ వైపుకు లాక్కుంటాయో, నలువైపులకూ వెళ్ళవలసిన అవసరం లేకుండానే పవర్ ద్వారా స్వతహాగానే అందులోకి చెత్త అంతా ఏ విధంగా వచ్చేస్తుందో అలాగే సైలెన్స్ యొక్క శక్తి ద్వారా, ఈ అటెన్షన్ యొక్క సమర్ధ స్వరూపం ద్వారా అనేక ఆత్మల యొక్క టెన్షన్ ను సమాప్తం చేసేస్తారు. అనగా ఆ ఆత్మలు మా టెన్షన్ ఏదైతే అనేక ప్రయత్నాలతో కూడా ఎంతో సమయంగా అలజడిపరుస్తోందో అది ఎలా సమాప్తమైపోయింది, దానిని ఎవరు సమాప్తం చేసారు? అని ఆశ్చర్యపోతారు. ఈ అనుభూతి ద్వారా శివశక్తి కంబైన్డ్ స్వరూపం వైపుకు అటెన్షన్ వెళుతుంది. మరి టెన్షన్ అటెన్షన్ లోకి మారిపోతుంది కదా! ఇప్పుడైతే పదే పదే 'స్మృతి చేయండి, స్మృతి చేయండి' అని అటెన్షన్ ను కలిగిస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే ఆధారమూర్తులుగా, శక్తిశాలీ స్వరూపములో స్థితులైపోతారో అప్పుడు దూరంగా ఉంటూ కూడా అనేకుల యొక్క టెన్షన్ ను సమాప్తం చేసి సహజముగా అటెన్షన్‌ను కలిగించే సత్యతీర్థులుగా అయిపోతారు. ఇప్పుడైతే మీరు వెతికేందుకు వెళుతున్నారు. వెతికేందుకు ఎన్ని సాధనాలను తయారుచేస్తూ ఉంటారు! ఆ తర్వాత ఇక వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు లేక సదా మీరే వెతుక్కుంటూ ఉంటారా?

సైన్స్ కూడా శ్రేష్ఠ ఆత్మల యొక్క శ్రేష్ఠ కార్యములో సహయోగిగా ఉంటుంది, కాస్త అలజడిని జరగనివ్వండి మరియు మీరు స్వయమును అచలముగా చేసుకోండి. ఆ తర్వాత ఇక మీరు ఆత్మిక అయస్కాంతాలుగా అయి అనేక ఆత్మలను ఎంత సహజముగా ఆకర్షిస్తారో చూడండి! ఎందుకంటే దిన ప్రతిదినము ఆత్మలు ఎంత నిర్బలులుగా అవుతూ ఉంటారంటే వారు తమ పురుషార్ధము యొక్క పాదాలతో నడిచేందుకు యోగ్యులుగా కూడా ఉండరు. అటువంటి నిర్బలులైన ఆత్మలకు శక్తిస్వరూప ఆత్మలైన మీ యొక్క శక్తి వారికి శక్తిరూపీ పాదాలను ఇచ్చి నడిపిస్తుంది, అనగా తండ్రి వైపుకు ఆకర్షిస్తుంది.

ఇలా సదా ఎగిరే కళను అనుభవం చేసుకునేవారిగా అయినట్లయితే అనేక ఆత్మలను దు:ఖం, అశాంతి యొక్క స్మృతి నుండి పైకి ఎగిరిస్తూ తమ లక్ష్యానికి చేర్చేయగలుగుతారు. మీ రెక్కలతో వారిని ఎగిరించవలసి ఉంటుంది. మొదట స్వయం ఇలా సమర్ధస్వరూపులుగా అయినప్పుడే సత్యతీర్ధులుగా అయి అనేకులను పావనముగా తయారుచేసి ముక్తి అనగా మధురమైన ఇంటి యొక్క ప్రాప్తిని కలిగించగలుగుతారు. మీరు ఇటువంటి ఆధారమూర్తులు, కావున ఈ రోజు బాప్ దాదా ఇటువంటి ఆధారమూర్తులైన పిల్లలను చూస్తున్నారు. ఆధారమే కదులుతూ ఉన్నట్లయితే ఇతరుల ఆధారముగా ఎలా అవ్వగలుగుతారు? కావున మీరు అచలముగా అయినట్లయితే ప్రపంచంలో అలజడి ప్రారంభమవుతుంది మరియు ఆ చిన్న అలజడి అనేకులను బాబా వైపుకు సహజముగా ఆకర్షింపజేస్తుంది. ఒకవైపు కుంభకర్ణులు మేల్కొంటారు. ఇంకొకవైపు సంబంధ, సంపర్కాలలోకి వచ్చి కూడా ఇంకా నిర్లక్ష్యము యొక్క నిదురలో ఎవరైతే పడుకుంటారో అటువంటి నిర్లక్ష్యపు నిద్రలో పడుకొని ఉన్న ఆత్మలు కూడా మేల్కొంటారు. కానీ మేల్కొలిపేది ఎవరు? అచలమూర్త ఆత్మలగు మీరు. అర్ధమయ్యిందా? సేవ యొక్క రూపము ఇలా మారనున్నది. ఇందుకొరకు సదా శివశక్తి స్వరూపులుగా అవ్వండి, అచ్చా!

ఈ విధంగా సదా శాంతి మరియు శక్తిస్వరూపులకు, తమ సమర్ధ స్థితి ద్వారా అనేకులకు స్మృతిని కలిగించేవారికి, టెన్షన్‌ను సమాప్తం చేసి అటెన్షన్‌ను కలిగించేవారికి, ఇటువంటి ఆధారమూర్తులైన, విశ్వపరివర్తకులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఆబూ కాన్ఫరెన్స్ కొరకు విషేషమైన ప్లాన్: - ఆబూ కాన్ఫరెన్సు స్నేహులుగా తయారుచేసి తీసుకురండి, కేవలం వి.ఐ.పి.లను కాదు. మీరు స్నేహులుగా తయారుచేసి తీసుకురండి మరియ ఇక్కడ సంబంధం ఏర్పడుతుంది (స్నేహులుగా తయారుచేసేందుకు సాధనమేమిటి?) ఎంతెంతగా హృదయపూర్వకముగా బాబాను మహిమ చేస్తారో అంతగా మీరు మహిమ చేస్తూ ఉంటే వారు అంతంతగా మోహితులవుతూ ఉంటారు. మీరు బాబా, బాబా అంటూ ఉంటారు, మహానతను వినిపిస్తూ ఉంటారు మరియు వారు స్నేహీయులుగా అవుతూ ఉంటారు. ఎక్కడైతే మహానత అనుభవమవుతుందో అక్కడ స్వయమే శిరస్సు వంచుతారు. భక్తులు జడవిగ్రహములు కూడా మహానత యొక్క భావనను ఉంచినప్పుడు దానంతట అదే శిరస్సు వంగిపోతుంది. ఆ జడము ఎక్కడ, ఈ చైతన్యము ఎక్కడ! అయినా శిరస్సు వంగిపోతుంది. ఇక్కడ కూడా ఎవరైనా ప్రైమ్ మినిస్టర్‌గా కానీ, ప్రెసిడెంట్‌గా కానీ ఉంటే వారి మహానత ముందు ఆటోమేటిక్ గా శిరస్సు వంగిపోతుంది కదా! అలాగే మీరు కూడా బాబా యొక్క మహానతను వినిపిస్తూ ఉంటే వారి శిరస్సు వంగిపోతుంది. మీరు చురుకుగా అయిపోయారు కదా! సైన్స్ యొక్క జ్ఞానము కూడా ఉంది. సైలెన్స్ యొక్క జ్ఞానము కూడా ఉంది. దేశం యొక్క జ్ఞానమూ ఉంది. విదేశము యొక్క జ్ఞానమూ ఉంది. కావున అనుభవం కూడా ఒక శక్తియే, అన్నింటికన్నా పెద్ద శక్తి అనుభవం. అనుభవం వినిపిస్తే అందరూ సంతోషపడతారు కదా! అనుభవం చేసుకునేవారు స్వయమూ శక్తిశాలిగా అయిపోతారు. ఇది కూడా ఒక పెద్ద శస్త్రము. చెప్పేవారు అనేకమంది ఉన్నారు కానీ అనుభవం యొక్క శక్తి ఎవరివద్దా లేదు. ఇక్కడి విశేషతయే అనుభవం యొక్క విశేషత. మాట్లాడేవారి కన్నా అనుభవం ఉన్నవారికే ఎక్కువ మహత్వము ఉంటుంది. మెల్లమెల్లగా సైన్స్ వారు లేక శాస్త్రాల వారూ ఇరువురూ తాము కేవలం పైపైన మాత్రమే ఉన్నామని, తమది పునాదిగా లేదని అర్ధం చేసుకుంటారు మరియు వీరి అనుభవం పునాది వంటిది అని భావిస్తారు. చంద్రుని వద్దకు కూడా వెళ్ళిపోయారు కానీ స్వయం యొక్క అనుభూతే లేదు. మరప్పుడు చంద్రుని వద్దకు వెళ్ళినా లాభమేముంది? ఇది అర్ధం చేసుకుంటారు కానీ అంతిమంలో చేసుకుంటారు. ఎందుకంటే, వారసులుగా అయ్యేది అయితే లేదు కదా! అంతిమంలో సైన్స్ అనగా శస్త్రధారులు మరియు శాస్త్రధారులు, ఇరువురూ తాము ఎవరో మరియు మీరు ఎవరో అర్ధం చేసుకుంటారు, అచ్ఛా!

అందరూ సంతోషంగా ఉన్నారు కదా! ఎటువంటి కష్టమూ లేదు కదా! సహజయోగులుగా ఉన్నారా? సహజసేవాధారులుగా ఉన్నారా? (విదేశీ అక్కయ్యలు దీదీ, దాదీలను విదేశసేవ కొరకు విదేశానికి వచ్చేందుకు ఆహ్వానమును ఇస్తున్నారు) వర్తమాన సమయంలో 83 ఆదిలోనే ఇక్కడకు అందరినీ తీసుకురావలసి ఉంది, మరియు అందరూ ఇక్కడకు రావలసిందే కావున ఇక్కడి సేవపై విశేషమైన ధ్యానమును ఇవ్వడం అవసరం, కానీ అక్కడి నుండి యు.ఎన్. ఓ. మొదలగు స్థానాల నుండి ఏదైనా ఆహ్వానము లభిస్తే మరి వెళ్ళడం అవసరమే. అంతేకానీ మన కాన్ఫరెన్స్ లు మొదలైనవేవైతే జరుపుతారో వాటి కొరకు అంత అవసరం లేదు. ఎందుకంటే, వారినే ఇక్కడకు తీసుకురావలసి ఉంది, కావున అన్ని విషయాలను గమనించాక ఇప్పుడే అంతటి అవసరం ఉన్నట్లుగా కనిపించడం లేదు. విదేశాలు కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ అన్నట్లుగా ఉన్నాయి, అక్కడ ఏదైనా విశేష కార్యము ఉన్నట్లయితే అలాగే వచ్చి చేరుకుంటారు. యు.ఎన్. ఓ. లో ఏ సంపర్కమునైతే పెంచుతున్నారో ఆ సంపర్కం పెరగడమే సేవ. ఇంకా ఎంత వీలైతే అంత వారిని పరివారిక సంపర్కములోకి తీసుకురండి. ఏ విధంగా ఈ షైలి(యు.యన్. ఓ. నుండి వచ్చిన అక్కయ్య) వచ్చిందో తాను కూడా సంపర్కం ద్వారానే ఆకర్షితమయ్యింది కదా! ప్రేమపూర్వకమైన పాలన లభించింది. పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎక్కడికైతే వెళతారో అక్కడ ఆ పోస్టులో ఉన్న కారణంగా అఫీషియల్ గా ఉంటారు. ప్రేమపూరితమైన పాలన వారికి లభించదు. ఇక్కడైతే సంబంధం యొక్క అనుభూతి లభిస్తుంది. ఇదే ఇక్కడి విశేషత, ఎవరెవరైతే సంబంధ సంపర్కాలలోకి వస్తారో వారికి పరివారిక అనుభూతి కలగాలి. సమీపమైన, ఎంతోకాలంగా విడిపోయిన ఆత్మలను కలుసుకున్నాము అని అనుభవం చేసుకోవాలి. సంపర్కమును పెంచే సేవయే బాగుంది. ఎంతెంతగా సమీపముగా వస్తూ ఉంటారో వీరి వద్ద ఏది కావాలో అదే ఉంది అని అనుభవం చేసుకుంటారు.

స్వీట్ నారాయణ్ గయానా ఉప రాష్ట్రపతి వారి పరివారానికి ప్రియ స్మృతులు చెబుతూ: - వారికి చాలా చాలా ప్రియస్మృతులు చెప్పండి, చాలా బాగా, తనువు, మనస్సు, ధనము మూడింటితోనూ పూర్తి సహయోగిగా నిశ్చయబుద్ధిగా నెంబర్ వన్ సంతానముగా ఉన్నాడు. ఆ బడ్జెట్ యొక్క కారణముగా రాలేకపోయాడు కానీ పాండవ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ లో బుద్ధి ద్వారా ఇక్కడకు చేరుకున్నాడు. చాలా నమ్రచిత్తుడైన పిల్లవాడు. మొత్తం పరివారమే డ్రామా అనుసారముగా సర్వీసబుల్ గా ఉంది. ధైర్యము కూడా బాగుంది. మొత్తం పరివారమంతా స్నేహీగా ఉంది. అంధశ్రద్ధ లేదు, జ్ఞానం యొక్క ఆధారముపై స్నేహిగా ఉన్నారు. తన సంపర్కము ద్వారానే అమెరికాకు చేరుకున్నారు. తాను అనంతమైన సేవకు నిమిత్తముగా విశేష ఆత్మల యొక్క సేవకు నిమిత్తముగా అయ్యాడు. దీనినే ఒక్కరి యొక్క జ్ఞానముతో అనేకులపై ప్రభావము అని అంటారు. తాను ఒక పెద్ద మైక్. తనను చూసి అక్కడి ప్రభుత్వం వారిపై కూడా చాలా మంచి ప్రభావం ఉంది. జ్ఞానము యొక్క, యోగము యొక్క మంచి ప్రభావము ఉంది. మంచి సేవా ధారిగా ఉన్నాడు. 

18 జనవరి స్మృతి దివసము యొక్క ప్రియస్మృతులను పిల్లలందరికీ ఇస్తూ బాప్ దాదా ఇలా అన్నారు - 18 జనవరి యొక్క ప్రియస్మృతులు. 18 అధ్యాయాల యొక్క సమర్ధ స్వరూపము. 1 8 జనవరి ఏమి గుర్తుకు తెస్తుంది? సంపన్నమైన ఫరిస్తా స్వరూపాన్ని ఫాలో ఫాదర్ యొక్క పాఠమును ప్రతి క్షణమూ, ప్రతి సంకల్పములో స్మృతి కలిగిస్తుంది. అటువంటి అనుభవజ్ఞులేనా? 18 జనవరి నాడున అందరూ ఎక్కడ ఉంటారు? సాకారవతనములోనా లేక ఆకారీ ఫరిస్తాల యొక్క వతనములోనా? కావున 18 జనవరి సదా ఫరిస్తా స్వరూపము, సదా ఫరిస్తాల ప్రపంచం యొక్క స్మృతిని కలిగిస్తుంది, అనగా సమర్ధ స్వరూపముగా తయారుచేస్తుంది. ఇది స్మృతి దివసము, కావున ఇది స్మృతి స్వరూపులుగా అయ్యే దినము, మరి 18 జనవరి అంటే ఏమిటో అర్ధం చేసుకున్నారా? స్మృతిస్వరూపులుగా సదా అవ్వండి. ఇదే పదే పదే స్మృతిని కలిగిస్తుంది కావున 'బాబా సమానముగా అవ్వడమే 18 జనవరి యొక్క ప్రియస్మృతులు', సంపన్న స్వరూపముగా అవ్వాలి. అచ్ఛా - అందరికీ ముందే స్మృతి యొక్క ప్రియస్మృతులు చేరుకుంటాయి. అచ్చా!

Comments