12-01-1979 అవ్యక్త మురళి

12-01-1979         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

వరదాత బాబా ద్వారా లభించిన సంతోషం యొక్క ఖజానాల బండారీ.

                         విశ్వ రచయిత, సర్వ ఖజానాల దాత, సర్వ వరదానాల దాత అయిన బాప్ దాదా మాట్లాడుతున్నారు -
                        బాప్ దాదా పిల్లల యొక్క రాజ్య భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. మొత్తం సృష్టిలోని సర్వాత్మల కంటే ఎంత శ్రేష్టాత్మలు, ఎంత సర్వ ఖజానాలతో సంపన్న ఆత్మలు. ఈ సమయంలోని సంపన్నత యొక్క మహిమ మీ శ్రేష్టాత్మలైన కారణంగా ఆ స్థానం యొక్క మహిమ సదా నడుస్తూ వస్తుంది. ఇప్పుడు అంతిమం వరకు కూడా భారతదేశం యొక్క మహిమ విదేశాలలో కూడా మహాన్ గా ఉంది. చైతన్య మహాన్ ఆత్మలైన మీ కారణంగానే ఈ స్థానానికి ఇంత మహత్యం ఉంది. ఇప్పటి వరకు కూడా ఆధ్యాత్మిక ఖజానా కోసం అందరి దృష్టి భారతదేశం వైపే వెళ్తుంది. స్థూల ధనంలో బీద దేశం కానీ ఆధ్యాత్మిక ఖజానాతో, అవినాశి సుఖం, శాంతి, శక్తి ఈ అన్ని ఖజానాలతో భారత దేశమే అన్నింటికంటే ధనవంతమైన దేశం అని మహిమ ఉంది. మీ యొక్క ఈ సంగమయుగం యొక్క సంపన్నస్థితి కారణంగానే స్థానానికి కూడా మహిమ ఉంది. ఎన్ని ఖజానాలతో సంపన్నం అవుతూ ఉంటారో అర్దకల్పం అవే ఖజానాలు ప్రాప్తిగా నడుస్తూ ఉంటాయి. ఎన్ని ఖజానాలు జమ చేసుకుంటారో అంత అనేక జన్మలు తింటూ ఉంటారు. ఇలా మొత్తం కల్పంలో ఎవరు అవ్వలేరు. సంగమయుగం అన్ని యుగాల కంటే చిన్నది. అందువలన దీనికి చాలా తక్కువ ఆయుష్షు ఉంటుంది. ఎంత చిన్న జీవితమో మరియు యుగమో అంత సంపాదనలో అన్ని యుగాల కంటే శ్రేష్టమైనది. సదా మీ ఖజానాలను స్మృతిలో ఉంచుకుంటున్నారా? ఏమేమి ఖజానాలు, ఎవరి ద్వారా, ఎంత సమయం వరకు లభించాయి? బాబా అయితే ఖజానాలను అందరికీ ఒకే విధంగా ఇచ్చారు. కొంతమందికి లక్ష, కొంతమందికి వెయ్యి ఇలా ఇవ్వలేదు. పిల్లలందరికి బాబా ద్వారా అనంతమైన మరియు తరగని ఖజానా లభించింది. ఇలా ఈ తరగని ఖజానాతో స్వయం సదా నిండుగా, తృప్త ఆత్మగా భావిస్తున్నారా? తృప్త ఆత్మకి సదా బాబా మరియు ఖజానాలే ఎదురుగా ఉంటాయి. సదా ఈ నషాలోనే నాట్యం చేస్తూ ఉంటారు. అన్నింటికంటే గొప్ప ఖజానా దీనికోసమే అనేకాత్మలు, అనేక రకాలైన సాధనాలను సొంతం చేసుకుంటున్నారు, అయినా కానీ వంచితులుగా ఉన్నారు. మీకు లభించిన ఆ ఖజానా ఏమిటి? ఈరోజు ప్రపంచలోని వారికి ఏ ఖజానా గురించి కోరిక ఉంది? ఆ కోరికతో చాలా చాలా స్థానాలకు భ్రమిస్తున్నారు. మీ అందరి దగ్గర అయితే అది ఈ జన్మ కోసమే కాదు అనేక జన్మల కొరకు జమ అయ్యి ఉంది. ఏ ఖజానా లభించింది? అన్నింటికంటే గొప్ప ఖజానా - సంతోషం యొక్క ఖజానా. ఈ సంతోషం కోసమే ప్రపంచంవారు తపిస్తున్నారు. కానీ మీరందరు సదా సంతోషంతో నాట్యం చేసేవారు. మీ అందరి స్మృతిచిహ్న చిత్రాలలో కూడా సంతోషవంతమైన భంగిమను చూపించారు. మీ చిత్రం జ్ఞాపకం ఉంది కదా? అమృతవేళ నుండి ఈ సంతోషం యొక్క ఖజానాను ఉపయోగించండి, ఆలోచించండి లేదా మీలో మీరు మాట్లాడుకోండి. కళ్ళు తెరుస్తూనే ఎవరు ఎదురుగా వస్తున్నారు? మొట్ట మొదటి సంకల్పంలో ఎవరితో కలయిక జరుగుతుంది? విశ్వ రచయిత, సర్వఖజానాల దాత, సర్వ వరదానాల దాత అయిన బీజంతో కలయిక జరుగుతుంది. దీనిలోనే మొతం వృక్షం అంతా ఇమిడి ఉంది. సర్వాత్మలు బికారీగా అయ్యి బాబా యొక్క ఒక్క సెకను మెరుపు చూడటం కోసం కోరికతో ఎన్నో కఠిన మార్గాలు సొంతం చేసుకుంటున్నారు. శ్రేష్టాత్మలైన మీరు సర్వ సంబంధాలతో బాబాని కలుసుకునే అనుభవం యొక్క శ్రేష్ట ఖజానాకు అధికారులు. అన్నింటికంటే మొదటి సంతోషకరమైన విషయం అమృతవేళ సర్వ సంబంధాలతో బాబాని కలుసుకోవటం. ప్రపంచం వారు బికారీలు కానీ మీరు పిల్లలు. దీనికంటే గొప్ప సంతోషం ఇంకేమైనా ఉంటుందా? కనుక అమృతవేళ నుండి ఈ సంతోషం యొక్క ఖజానాను ఉపయోగించుకోండి. ఉపయోగించటమే ఖజానాలకు తాళంచెవి.
                        రెండవ సంతోషం యొక్క ఖజానా - మీరు ఎంత ప్రియమైన, శ్రేష్టాత్మలు అంటే స్వయం భగవంతుడు మిమ్మల్ని చదివించటానికి పరంధామం నుండి వస్తున్నారు. లండన్ లేదా అమెరికా నుండి రావటం లేదు. ఈ లోకానికి అతీతమైన అక్కడికి వైజ్ఞానికులు కలలో కూడా చేరుకోలేరు, అటువంటి పరంధామం నుండి విశేషంగా (స్పెషల్ గా) మిమ్మల్ని చదివించటానికి వస్తున్నారు మరియు చదివించటానికి రుసుము (ఫేజ్) తీసుకోవటం లేదు. మరియు ఈ చదువుకి పాలబ్దంగా స్వర్గం యొక్క స్వరాజ్యం స్వయం తీసుకోవటం లేదు, మీకే ఇస్తున్నారు. మరి దీనికంటే గొప్ప సంతోషం ఇంకేమైనా ఉంటుందా? ఈ స్మృతిలో ఖజానాను ఉపయోగించండి మరియు కొంచెం ముందుకు వెళ్ళండి.
                       కార్యం చేస్తూ కూడా కర్మయోగి పాత్రను అభినయిస్తూ కర్మయోగిగా అంటే సదా బాబాతో పాటూ ఉంటూ ప్రతి కర్మ చేసే కర్మయోగి సమయంలో కూడా ఏ కార్యం చేస్తున్నా లౌకికం అయినా లేదా అలౌకికం అయినా కానీ సర్వశక్తివంతుడు మీకు తోడుగా ఉన్నారు అంటే స్నేహితుడుగా అయ్యి ప్రతి సమయం తోడుని నిలుపుకుంటారు. ఈ విధమైన స్నేహితుడు ఎప్పుడు లభించరు. ఒక్కొక్కసారి స్నేహితుడుగా ఉంటారు. ఒక్కొక్కసారి కంబైండ్ దంపతుల (యుగల్) రూపంలో ఉంటారు. ఈ విధమైన కంబైండ్ స్వరూపం లేదా విచిత్ర దంపతుల రూపంలో సదా బాబా మీకు చెప్తున్నారు. మీ భారాలన్నీ నాకు ఇచ్చేయండి మరియు మీరు సదా తేలికగా ఉండండి అని. ఎక్కడైనా, ఏదైనా కష్టమైనపని వస్తే అది నాకు అర్పణ చేసేస్తే కష్టం సహజం అయిపోతుంది అని. ఈ విధంగా కర్మయోగం యొక్క పాత్రలో కూడా సదా బాబా తోడు యొక్క ఖజానాలను, సదా తోడు యొక్క సంతోషం యొక్క ఖజానాను ఉపయోగించుకోండి మరియు ఇంకా ముందుకు వెళ్ళండి.
                    కార్యం నుండి ఖాళీ అయిపోగానే అన్నింటికంటే గొప్ప మనోరంజనం యొక్క ధనం లభిస్తుంది. ఒకవేళ మీకు షైర్ (విహారం) చేయాలి, చూడాలి, చదవాలి, అలంకరించుకోవాలి నాట్యం చేయాలి, ఆత్మికసంభాషణ చేయాలి అనే కోరిక ఉంటే అన్ని మనోరంజన సాధనాలు మీతో ఉన్నాయి. చూడాలనుకుంటే స్వర్గాన్ని చూడండి, సంగమయుగీ శ్రేష్టతను చూడండి. మీ కర్తవ్యం మరియు బాబా యొక్క కర్తవ్యం యొక్క అలౌకిక కథ యొక్క డ్రామా చూడండి. విహరించాలి అనుకుంటే మూడులోకాలు విహరించండి. అలంకరించుకోవాలి అనుకుంటే ప్రతి గుణం యొక్క విస్తారంతో స్వయాన్ని అలంకరించుకోండి. డ్రామాను చూడాలనుకుంటే 5000 సంవత్సరాల డ్రామాను చూడండి. చరిత్రను చదవాలనుకుంటే మీ 84 జన్మల చరిత్రని చదవండి. ఆత్మిక సంభాషణ చేయాలనుకుంటే ఆత్మగా అయ్యి ఆత్మిక రచయిత బాబాతో ఆత్మిక సంభాషణ చేయండి. ఇంకేం కావాలి? ఈ అన్ని సాధనాలతో సదా స్వయాన్ని సంతోషంగా ఉంచుకోండి, అంటే ఖజానాలను ఉపయోగించుకోండి. భోజనం తయారుచేసే సమయంలో మొదట బాబాకి నైవేద్యం (భోగ్) పెట్టాలి అంటే ప్రియాతి ప్రియమైన బాబా స్వీకరింపచేయాలి అనే స్పృతితో భోజనం తయారుచేయండి. ఎవరికి తినిపించాలి? అనే స్మృతితో భోజనం తయారుచేయాలి. ఈరోజుల్లోని ప్రపంచంలో ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి మీ దగ్గరకి భోజనం చేయటానికి వస్తుంటే ఎంత సంతోషం ఉంటుంది! కానీ బాబా ముందు వీరందరు ఎవరు? సదా బాబా మీతో పాటూ భోజనం చేస్తారు. భక్తులు చాలా సేపు గంటలు కొట్టి కొట్టి అలసిపోయారు, పిలుస్తూ పిలుస్తూ మర్చిపోతున్నారు కూడా. కానీ పిల్లలతో బాబా యొక్క ప్రతిజ్ఞ ఏమిటంటే, సదా మీతోనే ఉంటాను, మీతోనే తింటాను, మీతోనే కూర్చుంటాను అని. మరి దీని కంటే గొప్ప సంతోషం ఇంకేమి కావాలి? అందువలన భోజనం చేసే సమయంలో కూడా నీతోనే తింటాను అనే సూక్తి సదా జ్ఞాపకం ఉంచుకోండి. ఈ విధంగా సంతోషం యొక్క ఖజానాను ఉపయోగించుకోండి మరియు ఇంకా ముందుకు వెళ్ళండి.
                        ఇప్పుడు పగలు సమాప్తి అయిపోయింది అంటే రాత్రి సమయం వచ్చేసింది. రాత్రి ఏం చేస్తారు? నిద్రపోయే ముందు మొత్తం రోజంతటి సమాచారం తండ్రి రూపంలో లేదా కంబైండ్ రూపంలో బాబాకి చెప్పండి, ఆ రోజు యొక్క సమాచారం చెప్పండి మరియు మరుసటి రోజు యొక్క శ్రేష్ట సంకల్పం మరియు కర్మకి ప్రేరణ తీసుకోండి. ఇలా అన్ని సమాచారాలు ఇచ్చి, పుచ్చుకోవటం అంటే తేలికగా అయిపోవటం. ఎలా అయితే రాత్రి తేలికైన బట్టలు వేసుకుని నిద్రపోతారు కదా! అలాగే బుద్ధిని తేలికగా చేసుకోండి అంటే తేలికైన బట్టలు ధరించటం. ఇలా తయారయ్యి బాబాతో పాటూ పడుకోండి. ఒంటరిగా నిద్రపోవద్దు. ఒంటరిగా ఉంటే మాయ అవకాశం తీసుకుంటుంది, అందువలన సదా బాబాని తోడుగా ఉంచుకోండి. ఒంటరిగా ఉంటే భయం కూడా వేస్తుంది. తోడు ఉంచుకుంటే నిర్భయులుగా ఉంటారు. మీరు నిర్భయంగా ఉంటే మాయ భయపడుతుంది. ఇలా బాబాని తోడుగా ఉంచుకోవటం వలన వచ్చే సంతోషం యొక్క ఖజానాను రాత్రంతా ఉపయోగించుకోండి. ఇప్పుడు చెప్పండి మొత్తం రోజంతటిలో ఇంత శ్రేష్ట సంతోష ఖజానా లభిస్తున్నా కానీ శ్రేష్ట ఆత్మలు ఎప్పుడైనా ఉదాసీనం అవుతారా? లేక ఇతర ఏ ఇతర మనోరంజనాల వైపు, అల్పకాలిక ఖజానాలవైపు ఆకర్షితం అవుతారా? మీరు ఇటువంటి శ్రేష్ట ఆత్మలు అంటే సంపన్న ఆత్మలు. మీ పేరుతో ఇప్పుడు అనేకమంది భక్తులు అల్పకాలిక సంతోషాలలోకి వస్తున్నారు. మీ జడ చిత్రాలను చూసి సంతోషంతో నాట్యం చేస్తున్నారు. ఇటువంటి అదృష్టవంతులైన మీకు ఎంతో ఖజానా లభించింది, కేవలం దానిని ఉపయోగించుకోండి అంటే తాళం చెవిని ఉపయోగించండి. తాళం చెవి ఉన్నా కానీ సమయానికి దొరకటం లేదు. సమయానికి కన్పించటం లేదు. అందువలన సదా ఎదురుగా ఉంచుకోండి. అంటే సదా స్మృతిలో ఉంచుకోండి. మాటి మాటికి స్మృతి స్వరూపాన్ని తాజా చేసుకోండి. ఖజానా ఏమిటి మరియు తాళం చెవి ఏమిటి! ప్రతీ కర్మలో ఎలా చెప్పారో అలా ప్రత్యక్షంగా ధారణలోకి తీసుకురండి అంటే స్మృతి స్వరూపంలోకి తీసుకురండి. అర్థమైందా ఏమి చేయాలో? మంచిది.
                    ఈవిధంగా సదా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే ఆత్మలకు, ప్రతీ కర్మలో బాబా తోడుని సర్వ సంబంధాలతో నిలుపుకునే వారికి, సదా బాబాని తమ తోడుగా అనుభవం చేసుకునేవారికి, సదా మాయా భయం నుండి నిర్భయంగా ఉండే వారికి ఈవిధమైన తృప్తి ఆత్మలకి, ఖజానాలకు యజమాని ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో కలయిక (కర్ణాటక జోన్)

1. సదా మీ కల్పపూర్వపు సంపన్న ఫరిస్తా స్వరూపం స్మృతిలోకి వస్తుందా? కల్పపూర్వము ఫరిస్తాగా ఉండేవారము మరియు ఇప్పుడు కూడా పరిస్థాలమే. ఈ విధముగా అనుభవం అవుతుందా? ఫరిస్తా అనగా సర్వసంబంధములను ఒక్క తండ్రితో జోడించడం అనగా సర్వసంబంధములను కలిగి ఉండడం. ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అనే స్థితి అనుభవం అవుతుంది. ఏ ఇతర సంబంధములు స్మృతిలోకి రావు. ఎవరికైతే ఒక్క తండ్రితో సర్వసంబంధములు జోడించబడి ఉంటాయో వారికి సర్వ సంబంధములు నిమిత్తమాత్రముగా అనుభవం అవుతాయి. వారు సదా సంతోషములో నాట్యం చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా విఘ్నం యొక్క అనుభవం వారికి కలుగదు. బాబా సమాన స్థితిలో సదా అలసట లేనివారిగా ఉంటారు, ఎదురుదెబ్బలు తినరు. సదా తండ్రి మరియు సేవ అనే లగ్నంలో మగ్నమై ఉంటారు. కనుక ప్రతి ఒక్కరు విఘ్న వినాశకులుగా నడుస్తున్నారా లేక లగ్నము మరియు విఘ్నము ఈ రెండింటితో నడుస్తున్నారా? విఘ్నాలు రాకపోవడం అనేది జరగదు. ప్రతికల్పము విఘ్నములు వచ్చాయి మరియు మీరు ప్రతి కల్పము విఘ్నవినాశకులుగా అయ్యారు. ఎవరైతే ప్రతీ కల్పపు అనుభవీలో వారికి రిపీట్ చేయడంలో కష్టం ఉండదు. సదా ఇదే స్మృతిలో ఉంచుకోండి - మేము కల్పకల్పపు విజయులము. అనేకసార్లు చేశారు, ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. కనుక సహజయోగి అవ్వాలి కదా. ఏమి చేయను, ఎలా చేయను- అనే ఈ ఫిర్యాదులన్నింటినీ సమాప్తం చేయాలి. కంప్లీట్ ఆత్మలకు అన్ని కంప్లైంట్స్ సమాప్తం అయిపోతాయి. సంపన్నం అవ్వడం అనగా సంతుష్టత. అసంతుష్టం అగుటకు కారణం - అప్రాప్తి. అప్రాప్తియే అసంతుష్టతకు జన్మనిస్తుంది. అప్రాప్తి వస్తువు అంటూ ఏదీ లేదు..... అనే గాయనము దేవతలది కాదు, బ్రాహ్మణులది. మాస్టర్ సర్వశక్తిమంతుల అర్థమే సంపన్న స్వరూపం. ఎటువంటి లక్ష్యమో అటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. లక్ష్యం ఒకటి, లక్షణాలు మరొకటి ఉంటున్నాయి. లక్ష్యం సంపూర్ణంగా అవ్వడం. కానీ ధారణ అనగా ప్రాక్టికల్ స్వరూపం తక్కువగా ఉంది, తేడా కనిపిస్తుంది. మంచిది. అందరూ కూడా సదా నవ్వుతూ ఉండండి, దుఃఖించకండి. దుఃఖిస్తున్నారు అంటే బాబాను యుగళ్ గా చేసుకోలేదు. నేనేమి చెయ్యాలి, ఇలా జరగడం నాకు ఇష్టం లేదు, సహాయం చెయ్యండి, కృప చూపించండి - ఈ విధంగా అనడం కూడా దుఃఖించడమే. ఈ విధంగా దుఃఖించేవారిని బాబా తనతో పాటు ఎలా తీసుకువెళ్తారు? వారితోపాటు వెళ్లాలంటే తండ్రి ఎలా ఉన్నారో పిల్లలు కూడా ఆవిధముగానే ఉండాలి. బాబా సమానంగా ఉండాలి. ఏదైనా కర్మ చేసేటప్పుడు ఈ కర్మ బాబా సమానంగా ఉందా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ బాబా సమానంగా లేకపోతే దానిని వదిలేయాలి, అంతేకానీ ముందుకు నడిపించకూడదు. ఏ కర్మ అయినా శ్రేష్టంగా కాకుండా సాధారణంగా ఉంటే దానిని పరివర్తన చేసి శ్రేష్టముగా తయారుచేయండి. దీని ద్వారా సదా సంపన్నముగా అనగా బాబా సమానంగా అయిపోతారు.

2. అనేకాత్మల ఆశీర్వాదాలను ప్రాప్తింపచేసుకునేందుకు సాధనం - సేవ. ప్రతీ ఒక్కరూ తండ్రికి సహయోగి విశ్వకళ్యాణకారి ఆత్మలుగా భావించి కర్మ చేస్తున్నారా? మేము విశ్వ కళ్యాణకారులము అనే లక్ష్యం ఉన్నట్లయితే అకళ్యాణ కర్తవ్యం ఎప్పటికీ జరగదు. కార్యం ఎటువంటిదో ధారణ కూడా ఆ విధముగా ఉండాలి. సదా కార్యం స్మృతిలో ఉంటే సదా దయా హృదయులుగా, సదా మహాదానిగా ఉండగలరు. విశ్వకళ్యాణకారి  స్మృతితో స్వయం కూడా ప్రతి అడుగులో కళ్యాణకారి స్మృతితో, ప్రతి అడుగులో కళ్యాణకారి వృత్తితో నడుస్తాము మరియు నడుస్తూ ఉంటాము. ప్రతి అడుగులో స్వకళ్యాణకారిగా ఉన్నట్లయితే విశ్వ కళ్యాణం జరుగుతుంది. సదా ఇది స్మృతి ఉంచుకోండి - నిమిత్తమాత్రముగా ఈ కార్యం చేయాలి. నిమిత్తమాత్రము అనేది స్మృతిలో ఉన్నట్లయితే నాది అనేది సమాప్తి అవుతుంది. అలాగే సేవ చేసేటప్పుడు తండ్రి స్మృతి స్వతహాగానే ఉంటుంది. ఎంతగా సేవ చేస్తారో అంతగా విశ్వాత్మల నుండి ఆశీర్వాదములు లభిస్తాయి. ఆశీర్వాదములను పొందుతూ ఉండండి. మంచిది

3. ఈశ్వరీయనషా యొక్క మజా ద్వారా కర్మాతీత అవస్థ యొక్క లక్ష్యమునకు సమీపము అగుట - శ్రేష్టాత్మలైన మీరందరూ జ్ఞాన సాగరుడైన తండ్రి ద్వారా డైరెక్ట్ గా సర్వప్రాప్తులను తయారు చేసుకునేవారు కానీ ఆ మిగిలిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు శ్రేష్టాత్మల ద్వారా ఎంతోకొంత ప్రాప్తిని చేసుకునేవారు. కానీ మీరు డైరెక్టుగా తండ్రి నుండి ప్రాప్తులను తయారు చేసుకునేవారు. మరి ఈ విధమైన నషా ఉంటుందా? ఎంతగా నషా ఉంటుందో అంతగా కర్మాతీత అవస్థ యొక్క లక్ష్యము సమీపంగా కనిపిస్తూ ఉంటుంది. నషా తక్కువ అయినట్లయితే  లక్ష్యము కూడా దూరంగా కనిపిస్తుంది. ఈశ్వరీయ నషాలో ఉన్నట్లయితే ఈ దుఃఖపు ప్రపంచమును సహజంగానే మర్చిపోగలుగుతారు. ఈ నషాలో మొత్తం అంతా మర్చిపోతారు. ఈ ఈశ్వరీయ నషాలో ఉండడం వలన సదాకాలం కొరకు పాత ప్రపంచమును మర్చిపోతారు. ఈ నషాలో ఎటువంటి నష్టము ఉండదు, ఎంత నషా ఎక్కుతుందో అంత మంచిది. ఆ నషా ఎంత ఎక్కితే అంత సమాప్తం అయిపోతారు. కానీ ఈ నషాతో అవినాశి అయిపోతారు. ఈ నషాలో ఉన్నవారిని చూసినవారు, ఏమని అనుభవం చేస్తారంటే, వీరు నషాలో ఉన్నారు. ఇలా మిమ్మల్ని చూసినవారు వీరు నషాలో ఉన్నారు అని అనుభవం చేస్తారు. అప్పుడప్పుడు నషా పైకి ఎక్కడం, అప్పుడప్పుడు క్రిందకి దిగడం అలా ఉంటే మజా రాదు. కనుక నషాలో మజాగా ఉండాలి. ఈ నషాలో సర్వప్రాప్తులు ఉన్నాయి. ఒక బాబా తప్ప ఇంకెవరూ లేరు - అనే ఈ స్మృతితో నషా పైకి ఎక్కుతుంది. ఈ నషాతో సమర్థత వచ్చేస్తుంది.

వినడమైతే చాలా విన్నారు కానీ ఇప్పుడు స్వరూపముగా సాక్షాత్కరించండి. బాప్ దాదా పిల్లలందరినీ చైతన్య  సాక్షాత్కారం చేయించే సాక్షాత్కారమూర్తులుగా చూడాలని కోరుకుంటున్నారు. ఎప్పుడైతే చైతన్యమూర్తులు తయారైపోతారో అప్పుడు జడమూర్తులు సమాప్తం అయిపోతాయి మరియు ఈ భారత్ అనంతమైన మందిరముగా అయిపోతుంది. అనేక మందిరమును సమాప్తం అయిపోయి ఒకే మందిరముగా అయిపోతుంది.

4. సంగమయుగీ సమయమునకు ప్రతి అడుగులో పదమాల సంపాదన యొక్క వరదానం - సదా స్వయమును ప్రతి అడుగులో పదమాల సంపాదన చేసుకునే పదమ పదమ భాగ్యశాలి ఆత్మలుగా భావిస్తున్నారా? ప్రతి అడుగులో పదమాలు జమ అవుతున్నాయా అని చెక్ చేసుకుంటున్నారా? సంగమయుగమునకు ఈ వరదానం ఉంది - ప్రతి అడుగులో పదమాలు జమ అగుట. కనుక ఒక్క సెకండ్, లేదా ఒక్క అడుగు జమ చేసుకోకపోతే ఎంత నష్టం జరుగుతుంది. లౌకికములో కూడా ఏదైనా ఒక రోజు సంపాదన చెయ్యకపోతే ఎంత చింత కలుగుతుంది. అది హద్దు యొక్క సంపాదన కానీ ఇది అనంతమైన సంపాదన. ఇప్పుడు ప్రతి అడుగులో పదమాలు జమ చేసుకునేవారు ఎంతగానో అటెన్షన్ పెట్టాలి. సాధారణమైన అడుగులు వేయకూడదు - ఈ విధమైన అటెన్షన్ ఉండాలి. మీ జన్మ అలౌకిక జన్మ అయినప్పుడు ప్రతి అడుగు అలౌకికముగా ఉండాలి. సాధారణంగా ఉండకూడదు. ప్రతి అడుగులో పదమాలు జమ చేసుకునే వారికి గుర్తులు ఏమి చూపిస్తారు ? మెరిసే స్థూలమైన వస్తువు ఎలా అయితే ప్రకాశమును కలిగి ఉంటుందో, అలా వారి ముఖముపై సదా ప్రాప్తి యొక్క ప్రకాశము కనిపిస్తూ ఉంటుంది. వారి సంపర్కంలోకి వచ్చినవారు వీరికి ఏదో లభించింది అని అనుభవం చేస్తారు. వారు స్వయం ఆకర్షితమయ్యి మీ ఎదురుగా వస్తారు. అప్పుడు మీ సంపన్న ముఖము సేవకు నిమిత్తమైపోతుంది. సదా సంతోషంలో ఉండండి, అప్పుడప్పుడు సంతోషపు ఖజానాను మాయ దొంగలించేస్తోంది. మాయ వచ్చే గేటు తెరిచి ఉన్నా, మూసి ఉన్నా ఆ గేటుకు డబుల్ లాక్ వేయండి. సింగిల్ లాక్ ఉంటే మాయ ఆ గేటును తెరుచుకుని లోపలికి వచ్చేస్తుంది. డబుల్ లాక్ అనగా స్మృతి మరియు సేవలో బిజీగా ఉండడం. కేవలం స్మృతిలో ఉండి సేవ లేకపోయినా మాయ వచ్చేస్తుంది. డబుల్ లాక్ ఉంటే మాయ లోపలికి రాలేదు అలాగా యుద్ధం చేయలేదు. మనసా సేవ చాలా ఉంది, తమ వృత్తి ద్వారా వాతావరణమును శక్తి శాలిగా తయారు చేయండి. మొత్తం విశ్వం పరివర్తన అవ్వాలి, కనుక వృత్తితో వాతావరణం పరివర్తన చేయాలి. మంచిది

5. మొదటి జన్మ యొక్క సంపన్నస్థితి వరకు చేరుకునేందుకు సాధనము - హైజంప్. ఇప్పుడు పురుషార్ధం సమయము. ఎందుకంటే సమయము యొక్క వేగం చాలా తీవ్రంగా ఉంది. చివర్లో వచ్చేవారు మొత్తం చదువునంతా పూర్తి చేయాలి. కనుక తీవ్ర పురుషార్థం చేసి హైజంప్ చేయాలి. కనుక తీవ్ర పురుషార్థం కొరకు ఒక విషయంపై అటెన్షన్ పెట్టాలి - మీ సంపూర్ణ స్థితి ఎదురుగా పెట్టుకుని వర్తమాన సమయం యొక్క లెక్కలఖాతాను చెక్ చూసుకోవాలి. సంపూర్ణ స్థితి 16 కళలతో ఉంటుంది. కనుక 16 కళలలో నేను ఎన్ని కళలను ధారణ చేశాను, ఈ విధముగా చెక్ చేసుకుంటూ వెళ్ళండి, ఏది తక్కువగా ఉంటే దానిని నింపుకుంటూ వెళ్ళండి. దీనినే పురుషార్దము అని అంటారు. మంచిది

వీడ్కోలు సమయములో - ఎలా అయితే తండ్రి పిల్లలను చూసి సంతోషిస్తారో, అలాగే పిల్లలు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండాలి. సంతోషంతో నిండిన ముఖము కలిగిన వారి వాణి ఎంతో సేవ చేస్తుంది. ముఖము నడుస్తూ, తిరుగుతూ ఉన్న ఒక చైతన్య మ్యూజియం వలే అయిపోతుంది. ఎలా అయితే మ్యూజియంలో రకరకాల చిత్రములను పెడతారో, అలాగే ముఖము తండ్రి యొక్క సర్వ గుణములను చూపిస్తుంది. మీరు సేవ కొరకు వెళ్ళినప్పుడు మీరు పిలవకుండానే వారంతట వారే వస్తారు. కనుక మీరందరూ చైతన్య మ్యూజియం వలె తయారవ్వండి. ఈ మ్యూజియం ఎంతగా తయారైతే, అంత త్వరగా స్వర్గం యొక్క ఉద్ఘాటన  జరుగుతుంది. బ్రహ్మాబాబా ఈ ఉద్ఘాటన కొరకు వేచి ఉన్నారు. కనుక త్వరగా ఉద్ఘాటన చేసేందుకు త్వరగా ఏర్పాటు చేసుకోండి. ఎప్పుడు ఉద్ఘాటన (ప్రారంభోత్సవం)చేస్తారు? డేట్ ఫిక్స్ అయ్యిందా? అకస్మాత్తుగా జరుగుతుంది.ఏమి జరుగుతుంది?

సంగమయుగం అయితే మంచిది. కానీ అందరికీ శాంతి మరియు సుఖం ఇచ్చే  సంకల్పం అయితే కావాలి. ఇతరుల దుఃఖము మరియు బాధను  చూసినప్పుడు దయ చూపించాలి. మంచిది.

Comments