11-03-1981 అవ్యక్త మురళి

11-03-1981         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సఫలతకు రెండు ముఖ్య ఆధారాలు.

    ఈ రోజు ఖుదాదోస్త్ తన పిల్లలను స్నేహితుని రూపములో కలుస్తున్నారు. ఒక ఖుదాదోస్త్ కు ఎంతమంది స్నేహితులుంటారు? వాస్తవానికి విదేశీయులు స్నేహితుడినే ఎక్కువగా ఇష్టపడతారు. కనుక బాప్ దాదా తండ్రి, శిక్షకుడు, సద్గురువే కాక సర్వ సంబంధాలను నిభాయిస్తారు. మీ అందరికీ అన్నిటికంటే ఎక్కువ ప్రియమైన సంబంధమేది? కొంతమందికి టీచర్, కొంతమందికి ప్రియుడు, కొంతమందికి స్నేహితుని సంబంధము ప్రియంగా అనిపిస్తుంది. కాని ఉన్నదేమో ఒక్కరే కదా. అందువలన ఆ ఒక్కరితో ఏ సంబంధము నిభాయించినా సర్వ ప్రాప్తులు లభిస్తూ పోతాయి. ఇది ఒక గారడీ. ఈ గారడీతో ఒక్కరితోనే ఏ సంబంధము కావాలంటే అది నిభాయించగలరు. ఇంకెక్కడికీ వెళ్లే అవసరమే ఉండదు. అందువలన మరొకరు లభించాలనే కోరికే సమాప్తమైపోతుంది. సర్వ సంబంధాలతో ప్రీతిని నిభాయించుటలో అనుభవీలుగా అయ్యారా? అయినారా? లేక ఇప్పుడు అవ్వాలా? ఏమనుకుంటున్నారు? పూర్తిగా అనుభవీలుగా అయిపోయారా? ఈ రోజు అఫీషియల్ గా మురళి నడిపించడానికి రాలేదు. బాప్ దాదా కూడా తమ సర్వ సంబంధాలతో దూర దూరాల నుండి వచ్చిన ఆత్మలను చూచి హర్షితమౌతున్నారు. అందరికంటే దూర దేశం నుండి వచ్చిన వారెవరు? మీరైతే సాకార లోకం నుండే వచ్చారు. కాని బాప్ దాదా ఆకారి లోకం కంటే దూరంగా ఉన్న నిరాకార వతనం నుండి ఆకారి లోకంలోకి వచ్చి తర్వాత సాకార లోకంలోకి వచ్చారు. కనుక అందరికంటే దూరదేశి తండ్రినా లేక మీరా? ఈ లోకం లెక్కతో ఎవరైతే అందరికంటే ఎక్కువ దూరదేశం నుండి వచ్చారో వారికి కూడా బాప్ దాదా స్నేహంతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరికంటే దూరం నుండి వచ్చినవారు చేతులెత్తండి. ఎంత దూరం నుండి వచ్చారో, ఎన్ని మైళ్లు ప్రయాణము చేసి వచ్చారో అంతకు పదమారెట్ల శుభాకాంక్షలు స్వీకరించండి.

విదేశీయులనగా(ఫారినర్స్ అనగా) ఫర్ - ఎవర్(ఎప్పటికీ) ఇటువంటి వరదానీలు కదా. ఫారినర్స్ కాదు, ఫార్ - ఎవర్. సదా సేవ కొరకు ఎవర్ రెడీ. డైరెక్షన్ లభిస్తూనే వచ్చేశారు. ఇది ఫార్-ఎవర్ గ్రూపు వారి విశేషత. ఇప్పుడిప్పుడే అనుభవం చేశారు, ఇప్పుడిప్పుడే అనుభవం చేయించుటకు ధైర్యము చేసి ఉపస్థితులైపోతారు. ఇది చూచి బాప్ దాదా కూడా చాలా సంతోషిస్తున్నారు. ఒకరి ద్వారా అనేకమంది సేవాధారులు నిమిత్తమైపోయారు. సేవలో సఫలతకు విశేషంగా రెండు ఆధారాలున్నాయి. అవి ఏమిటో తెలుసా ?(చాలా సమాధానాలు వచ్చాయి). మీ మీ అనుభవాల లెక్కతో అందరి సమాధానాలు సరియైనవే. సేవలో లేక స్వయం ఉన్నతి చెందే కళలో సఫలతకు ముఖ్యమైన ఆధారం - 1) ఒక్క తండ్రితో తెగిపోని ప్రేమ. తండ్రి తప్ప ఇంకేమీ కనిపించరాదు. సంకల్పంలో కూడా బాబా, మాటలో కూడా బాబా, కర్మలో కూడా బాబా తోడు. ఇటువంటి లవలీన ఆత్మ ఒక్క మాట మాట్లాడినా వారి స్నేహపూరిత మాట ఇతర ఆత్మలను కూడా స్నేహములో బంధిస్తుంది. ఈ విధమైన లవలీన ఆత్మల ఒక్క 'బాబా' అను శబ్ధమే గారడీ వస్తువులా(మంత్రదండం వలె) పని చేస్తుంది. లవలీన ఆత్మ ఆత్మిక ఇంద్రజాలకునిగా అయిపోతాడు. ఒక్క తండ్రి పైనే ప్రేమ ఉంటే వారిని లవలీన ఆత్మ అని అంటారు. సఫలతకు రెండవ ఆధారం - 2) ప్రతి జ్ఞాన పాయింటును అనుభవం చేయు అనుభవీ మూర్తిగా అగుట. ఉదాహరణానికి డ్రామా పాయింట్ తీసుకోండి. ఒకటేమో జ్ఞానము ఆధారముపై పాయింట్ ఇవ్వడం, రెండవది అనుభవీ మూర్తులై పాయింట్ ఇవ్వడం. డ్రామా పాయింటును ఎవరైతే అనుభవం చేసి ఉంటారో వారు సదా సాక్షి స్థితి సీటుపై స్థితమై ఉంటారు. ఏకరసంగా, అచంచలంగా, స్థిరంగా ఉంటారు. ఇటువంటి స్థితిలో స్థితమై ఉండువారిని అనుభవీ మూర్తులని అంటారు. రిజల్టులో బాహ్యరూపం భలే మంచిగా ఉన్నా, చెడుగా ఉన్నా డ్రామా పాయింటును అనుభవం చేసిన ఆత్మలు ఎప్పుడూ చెడులో కూడా చెడును చూడకుండా మంచినే చూస్తారు. అనగా స్వంత కళ్యాణానికి మార్గం కనిపిస్తుంది. అకళ్యాణ ఖాతా సమాప్తమైపోతుంది. కళ్యాణకారి తండ్రి పిల్లలుగా అయినందున, కళ్యాణకారీ యుగమైనందున ఇప్పుడు కళ్యాణకారీ ఖాతా ప్రారంభమయ్యింది. ఈ జ్ఞానము మరియు అనుభవము అథారిటీతో సదా అచలంగా ఉంటారు. ఒకవేళ లెక్కిస్తే మీలో ఒక్కొక్కరి వద్ద ఎన్ని ప్రకారాల అథారిటీలున్నాయి. ఇతర ఆత్మల వద్ద అయితే ఒకటో, రెండో అథారిటీలుంటాయి. కొందరికి సైన్సు, కొందరికి శాస్త్రాలు, కొందరికి డాక్టరీ జ్ఞానము, కొందరికి ఇంజనీరింగ్ జ్ఞానముల అథారిటీ ఉంటుంది. కాని మీ వద్ద ఎన్ని అథారిటీలున్నాయి? లిస్టు తయారు చేస్తే చాలా పెద్ద లిస్టు తయారవుతుంది. అన్నిటికంటే మొదటి అథారిటీ అయిన సర్వశక్తివంతుడు మీవారిగా అయిపోయాడు. ఈ విధంగా లిస్టు తయారు చేయండి. ప్రపంచము ఆది-మధ్య-అంత్యముల జ్ఞాన అథారిటీ. ఈ జ్ఞానానికి స్మృతిచిహ్నంగా శాస్త్రాలు, బైబుల్, ఖురాన్ మొదలైనవన్నీ వచ్చాయి. అందుకే గీతా జ్ఞానాన్ని సర్వ శాస్త్రాలకు, అన్ని గ్రంథాలకు తల్లి - తండ్రి అని అంటారు. శిరోమణి అని కూడా అంటారు. గీతను డైరక్టుగా ఎవరు వినిపిస్తున్నారు? బ్రాహ్మణులు. కనుక మీరు అథారిటీగా అయ్యారు కదా. అదే విధంగా అన్ని ధర్మాలలో నెంబరువన్ ధర్మము ఎవరిది? మీ బ్రాహ్మణ ధర్మము నుండే అన్ని ధర్మాలు మొదలవుతాయి. బ్రాహ్మణ ధర్మం “వేరు" వంటిది. అంతేకాక ఈ ధర్మం విశేషత ఏమంటే బ్రాహ్మణ ధర్మం డైరక్టు పరమపిత పరమాత్మయే స్థాపించాడు. ఇతర ధర్మాలు ధర్మపితలు స్థాపించినవి. ఈ ధర్మము పరమపిత పరమాత్మది. ఆ ధర్మాలు పిల్లలు స్థాపించినవి. వారిని “సన్ ఆఫ్ గాడ్” అని అంటారు. కాని వారు గాడ్ కాదు. కనుక డైరక్టు పరమపిత ద్వారా శ్రేష్ఠ ధర్మము స్థాపనయ్యింది. మీరు ఆ ధర్మానికి అథారిటీలు. ఆదిపిత డైరక్టు బ్రహ్మముఖ వంశావళివారు, అథారిటీ కలిగినవారు. సర్వ శ్రేష్ఠ కర్మలు చేసే ప్రాక్టికల్ జీవితం గడిపే అథారిటీ గలవారు. శ్రేష్ఠ కర్మకు ప్రాలబ్దంగా అఖండ విశ్వ రాజ్యానికి అధికారులయ్యే అథారిటీ కలిగినవారు. భక్తుల భక్తికి అథారిటీ మీరే. ఇలా ఇంకా లిస్టు తీస్తే చాలా వస్తుంది. మీరు ఎంత గొప్ప అథారిటీ కలిగినవారో అర్థమయ్యిందా? ఇటువంటి అథారిటీ కలిగిన వారికి తండ్రి కూడా నమస్కరిస్తారు. ఇది చాలా పెద్ద అథారిటీ. ఇంత అథారిటీ కలిగిన వారిని చూచి బాప్ దాదా కూడా హర్షితమౌతారు. 

అందరూ చాలా బాగా శ్రమ చేసి సేవా కార్యాన్ని బాగా విస్తరింపజేశారు. దారి తప్పి వెతుకుచున్న మీ సోదరీ - సోదరులకు దారి చూపించారు. దాహంతో ఉన్న ఆత్మలకు శాంతి, సుఖాల దోసిలినిచ్చి తృప్త ఆత్మలుగా చేయుటకు మంచి పురుషార్ధం చేస్తున్నారు. తండ్రితో చేసిన ప్రతిజ్ఞను ప్రాక్టికల్ గా నిభాయించి తండ్రి ముందుకు చిన్నదో, పెద్దదో ఒక పుష్పగుచ్ఛాన్ని తీసుకొచ్చారు. అయితే తండ్రికి చిన్నది కూడా ఇష్టమే. ఇప్పుడీ ప్రతిజ్ఞనైతే నిలుపుకున్నారు. ఇంకా విస్తరిస్తూ పోతారు. కొంతమంది నెక్లెసు తయారుచేసి తీసుకొచ్చారు, కొంతమంది మాలను తయారుచేసి తీసుకొచ్చారు, కొంతమంది కంకణాన్ని, కొంతమంది ఉంగరాన్ని తయారుచేసి తీసుకొచ్చారు. కనుక ఇదంతా బాప్ దాదా జ్యూవెలరీ(నగలు) ఒక్కొక్కటి చాలా విలువైన రత్నము. బాబా ఎదుటికి చాలా పెద్ద జ్యూవెలరీని తీసుకొచ్చారు. ఇకముందు ఏం చేయ్యాలి? నగలను ఇప్పుడేం చేస్తారు?(పాలిష్) మధువనానికి వస్తే పాలిష్ అవ్వనే అయిపోతుంది. ఇప్పుడు షో కేసులో పెట్టండి. వరల్డ్ షో కేసులో ఈ జ్యూవెలరీ మెరుస్తూ అందరికీ కనిపించాలి. అయితే షోకేసులోకి ఎలా వస్తారు? తండ్రి ఎదుటికి వచ్చారు, బ్రాహ్మణుల ఎదుటికి వచ్చారు, ఇది చాలా బాగా జరిగింది. ఇప్పుడు ప్రపంచము ముందుకు రావాలి. ఇప్పుడు ఎటువంటి ప్లాను తయారు చేస్తారంటే ప్రపంచము మూల మూలల నుండి - భగవంతుని పిల్లలు మూలమూలలా ప్రత్యక్షమైపోయారనే శబ్దము వేలువడాలి. నలువైపులా ఒకే అల వ్యాపించాలి. భారతదేశంలో కావచ్చు, విదేశాలలో కావచ్చు మూల మూలలా ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు వేరు వేరు సమయాలలో కనిపించినా ఒక్కరే వెలుగునిస్తారు కదా. అలా ఈ జ్ఞాన సూర్యుని పిల్లలు మూలమూలలా కనిపించాలి. జ్ఞాన నక్షత్రాల వైభవం నలువైపులా కనిపించాలి. అందరి సంకల్పాలలో, నోట్లో జ్ఞాన నక్షత్రాలు జ్ఞాన సూర్యునితో పాటు ప్రత్యక్షమైనారనే మాట వెలువడాలి. ఎప్పుడైతే అన్ని వైపుల నుండి వచ్చిన శబ్దము నలువైపులా మ్రోగుతుందో అప్పుడు ప్రత్యక్షతా సమయం వస్తుంది. ఇప్పుడైతే పాత్ర గుప్తంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ప్రత్యక్షతలోకి తీసుకురండి. ఇందుకు ప్లాను తయారు చేయండి. తర్వాత బాప్ దాదా కూడా చెప్తారు.

ఒక్కొక్క రత్నము యొక్క విశేషత వర్ణిస్తే అనేక రాత్రులు గడిచిపోతాయి. ప్రతీ పుత్రుని విశేషత - ప్రతీ ఒక్కరి మస్తకంలో మణి సమానంగా మెరుస్తూ ఉంది.

ఇటువంటి సర్వ విశేష ఆత్మలకు, సర్వ సుపుత్రులు అనగా సేవకు ఋజువునిచ్చేవారు, సదాసేవ మరియు స్మృతిలో ఉండేవారు, సేవాధారులు, మాస్టర్ ఆల్‌ మైటీ అథారిటీవారు, సర్వుల మనోకామనలు పూర్తి చేసే అతి ప్రియమైన, లవ్ లీన్ పిల్లలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరియు నమస్తే. 

పార్టీలతో బాప్ దాదా వారి వ్యక్తిగత మిలనము న్యూజిల్యాండ్ పార్టీతో - న్యూజిల్యాండ్ వారికి సదా ఏం గుర్తుంటుంది? న్యూజిల్యాండ్ అయితే సదా గుర్తుంటుంది. విశ్వానికి కొత్త(న్యూ) వార్తలివ్వాలి. న్యూజిల్యాండ్ విశ్వములో ప్రతిరోజు న్యూస్ ఇవ్వాలి. అప్పుడు న్యూజిల్యాండ్ ఎలా తయారవుతుంది? మొత్తం విశ్వానికంతా లైట్ హౌస్ గా తయారైపోతుంది. ఈ వార్తలు ఎక్కడ నుండి వచ్చాయని అందరి దృష్టి న్యూజిల్యాండ్ వైపుకు వెళ్తుంది. ఇప్పుడు కూడా వార్తాపత్రికలలో ఏవైనా వార్తలు వచ్చాయంటే అందరి అటెన్షన్ ఎక్కడకెళ్తుంది? ఈ వార్తలు ఎక్కడ నుండి వచ్చాయి? కనుక న్యూజిల్యాండ్ వారు ఈ అద్భుతాన్ని చేయాలి. ఇప్పుడేదైనా కొత్తగా చేయండి. ఏదైనా కొత్త ప్లాను తయారుచేయండి. అక్కడ నుండి చాలామంది టీచర్లు తయారై అన్ని వైపులకూ వ్యాపించే అద్భుతాన్ని చెయ్యండి. అప్పుడు పేరుకు తగినట్లు పని చేశారని అంటారు. అందరూ చాలా చాలా అపురూపమైన పిల్లలు. మిమ్ములను దూర దూరము నుండి తండ్రి ఎన్నుకున్నారు. భారతదేశాన్ని వదిలి వెళ్లిపోయినా, భారతదేశములో వచ్చిన తండ్రి మిమ్ములను వదలలేదు. న్యూజిల్యాండ్ పుష్పాల తోట కూడా చాలా వికసించింది. 

ట్రినిడాడ్ పార్టీ - బాప్ దాదా పిల్లలలో సదా ఏ విశేషతను చూస్తారు? బాప్ దాదా ప్రతీ పుత్రుని చూచి, పిల్లలలో వారి 21 జన్మల ప్రాలబ్ధాన్ని చూస్తారు. ఎలా ఉండేవారు ఎలా తయారయ్యారు? ఇక మీదట ఎలా తయారవుతారు? మూడు కాలాలను చూస్తూ భవిష్యత్తు ఎంత శ్రేష్ఠంగా ఉందో చూచి సంతోషిస్తున్నారు. మీలో ప్రతి ఒక్కరు తమ ప్రాలబ్ధాన్ని అర్థము చేసుకొని అనుభవం చేసి హర్షితమౌతున్నారా? మీ ప్రాలబ్దము ఎంత స్పష్టంగా ఉందంటే “ఈరోజు ఇలా ఉన్నాము, రేపు ఇలా అవుతాము” అని మీకు తెలిసిపోయింది. తండ్రి వారిగా అయినారంటే తప్పక జరుగుతుంది. తండ్రి వారిగా అవ్వడమంటే బ్రాహ్మణులుగా అవ్వడం. బ్రాహ్మణుల నుండి దేవతలుగా కూడా తప్పకుండా అవుతారు. దేవతలలో కూడా ఏ పదవి లభిస్తుంది? అది ప్రతి ఒక్కరి పురుషార్థముపై ఆధారపడి ఉంటుంది.

ఇప్పుడైతే సేవకు అనేక సాధనాలున్నాయి. వాచాతో పాటు ఒకే స్థానములో ఉంటూ విశ్వ సేవ చేయగలరు. మనసా సేవకు కూడా చాలా మంచి అవకాశముంది. రోజంతా ఏదో ఒక విధమైన సేవలో బిజీగా ఉండండి. మధువనంలో రిఫ్రెష్ అగుట అనగా సేవకు నిమిత్తమై, సేవాధారులుగా అయ్యి సేవ చేసే ఛాన్స్ తీసుకొనుట. సేవ చేయుటకు ముందు ఎవరైతే నిమిత్తమైన సేవాధారులుగా ఉన్నారో వారితో సంపర్కముంచుకొని ముందుకు వెళ్తూ ఉంటే సఫలత లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని సెంటర్లు ఓపన్ చేసి వస్తారో చూస్తాము. ఎన్ని సేవా కేంద్రాలు తెరిచారో అది బులెటిన్లో వస్తుంది.

సదా మేమందరమూ ఆత్మిక సేవాధారులమని, అందరినీ వెతుకుట నుండి విడిపించేవారమని స్మృతిలో ఉండాలి. అనేకాత్మలు దారి తెలియక భ్రమిస్తూ ఉన్నారు. కనుక భ్రమిస్తూ ఉన్న ఆత్మలను చూచి జాలి కలుగుతుంది కదా? మీ గత జీవితాన్ని చూసుకొని ఎంతగా భ్రమించారో, ఎన్ని జన్మల నుండి భ్రమించారో అర్థమవుతుంది కదా. మీ అనుభవం ఆధారముతో ఇంకా ఎక్కువగా జాలిపడాలి. కనుక భ్రమించే ఆత్మలను వెతుకుట నుండి ఎలా విడిపించాలో సదా ప్లాన్లు తయారుచేస్తూ ఉండండి. ప్రతిరోజు కొత్త కొత్త పాయింట్లు ఆలోచించండి. ఏ పాయింటునిస్తే త్వరగా పరివర్తనైపోతారో ఆలోచించండి. ఇప్పుడు భక్తులకు వారి భక్తికి ఫలమునిప్పించండి. సదా తండ్రితో కలుసుకొనుటకు సులభమైన మార్గాన్ని ఆలోచిస్తూ ఉండండి. ఇదే ఆలోచనలు నడుస్తూ ఉండాలి. 

అమెరికా పార్టీ - సదా అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతూ ఉంటారా? తల్లిదండ్రులు తమ అపురూపమైన పిల్లలను ఎటువంటి స్థానములో కూర్చోబెడ్తారంటే అక్కడ వారికెలాంటి కష్టమూ కలగరాదు. బాప్ దాదా తమ అపురూపమైన పిల్లలు కూర్చునేందుకు ఏ స్థానమిచ్చారు? హృదయ సింహాసనము. ఈ హృదయ సింహాసనమెంత పెద్దది! ఈ సింహాసనంపై కూర్చొని ఏ పనినైనా చేయవచ్చు. కనుక సదా సింహాసనాధికారులుగా ఉండండి, క్రిందికి దిగకండి. ఉదాహరణానికి మట్టి తగలకుండా విదేశాలలో అక్కడక్కడ రత్నకంబళ్లు పరుస్తారు కదా. బాప్ దాదా కూడా దేహ భావమనే మట్టిలో మైల కాకుండా ఉండేందుకు సదా హృదయ సింహాసనముపై ఉండమంటారు. ఎవరైతే ఇప్పుడు హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారే భవిష్యత్తులో కూడా సింహాసనాధికారులుగా అవుతారు. కనుక సదా హృదయ సింహాసనాధికారులుగా ఉంటున్నామా? లేక దిగుతూ, ఎక్కుతూ ఉన్నామా? అని చెక్ చేసుకోండి. సింహాసనంపై కూర్చునే అధికారులుగా కూడా ఎవరవుతారు? ఎవరైతే సదా డబల్ లైట్ రూపంలో ఉంటారో వారు కొద్దిగానైనా భారీతనము వచ్చిందంటే సింహాసనము నుండి క్రిందికి వచ్చేస్తారు. సింహాసనం నుండి క్రిందికి వచ్చారంటే మాయను ఎదుర్కోవలసి వస్తుంది. సింహాసనాధికారులుగా ఉంటే మాయ నమస్కరిస్తుంది. బాప్ దాదా ద్వారా బుద్ధికి ప్రతిరోజు ఏదైతే శక్తిశాలి భోజనం లభిస్తూ ఉందో దానిని తిని జీర్ణము చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ బలహీనత రాదు. మాయ దాడి చెయ్యదు. అచ్ఛా!

Comments