10-06-1977 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
మంత్రం మరియు యంత్రాన్ని నిరంతరం ప్రయోగం చేయటం ద్వారా తేడా సమాప్తి అవుతుంది.
బాబా ద్వారా లభించిన సర్వవిధులు మరియు సర్వ శక్తులను విశ్వకళ్యాణం యొక్క సేవలో సమర్పితం చేసే పిల్లలతో బాబా మాట్లాడుతున్నారు -
బాప్ దాదా పిల్లలందరి యొక్క వర్తమాన స్థితి మరియు అంతిమ స్థితి రెండింటిని చూస్తూ ఎక్కడెక్కడ వర్తమాన మరియు అంతిమ స్థితిలో తేడా కనిపిస్తుంది అనేది చూస్తున్నారు. అక్కడక్కడ మహాన్ తేడా కనిపిస్తుంది. మహాన్ తేడా ఎందుకు ఉంటుంది? అందరికీ లక్ష్యం అయితే సర్వశ్రేష్ఠంగా అవ్వాలి అని, మరియు పదవి పొందేవారు కూడా ఒక్కరే, సమయం యొక్క వరదానం మరియు వరదాత యొక్క వరదానం కూడా అందరికీ లభించింది. పురుషార్థం యొక్క మార్గం కూడా ఒకటే, తీసుకువెళ్ళేవారు కూడా ఒక్కరే, అయినప్పటికీ ఇంత తేడా ఎందుకు వస్తుంది? కారణం ఏమిటి? ఆ కారణాన్ని చూస్తున్నారు.
వర్తమాన సమయం ప్రమాణంగా ముఖ్య కారణం ఏమి చూసారు? ఒకటి - మొట్టమొదటి మహామంత్రం మన్మనాభవ మరియు మనమే దేవతలం అనే మంత్రం బాప్ దాదా ద్వారా లభించింది, ఆ మంత్రాన్ని సదా స్మృతిలో ఉంచుకోవటం లేదు. భక్తిమార్గంలో కూడా మంత్రాన్ని ఎప్పుడు మర్చిపోరు. మంత్రం మర్చిపోవటం అంటే గురువు నుండి వేరు అయిపోవటం అనే భయం ఉంటుంది. కానీ పిల్లలుగా అయిన తర్వాత ఏమి చేసారు? భక్తుల వలె భయం పోయింది, ఇంకా పురుషార్థంలో అధికారిగా భావించి అవకాశం తీసుకుని బాబా ఇచ్చిన మంత్రాన్ని లేదా శ్రీమతాన్ని పూర్తిగా ప్రత్యక్షంలోకి తీసుకురావటం లేదు. ఒకటి మంత్రాన్ని మర్చిపోతున్నారు, రెండవది మాయాజీత్ గా అయ్యేటందుకు ఏవైతే అనేక రకాలు మంత్రాలు ఇస్తున్నారో ఆ మంత్రాలను సమయానుసారం కార్యంలోకి తీసుకురావటం లేదు. ఒకవేళ ఈ రెండు విషయాలు అంటే మంత్రం మరియు యంత్రం ప్రత్యక్ష జీవితం జీవితం కొరకు యంత్రం మరియు బుద్దియోగం జోడించేటందుకు మంత్రం లేదా బుద్ధిని ఏకాగ్రం చేసేటందుకు మంత్రాన్ని స్మృతిలో ఉంచుకోండి. అప్పుడు తేడా సమాప్తి అయిపోతుంది. రోజు వింటున్నారు మరియు వినిపిస్తున్నారు - మన్మనాభవ అని. కానీ స్మృతి స్వరూపంగా ఎంత వరకు అయ్యారు? మొదటి పాఠం - మహామంత్రం. ఈ మంత్రం యొక్క ప్రత్యక్ష ధారణ ద్వారా మొదటి నెంబర్ వస్తుంది. ఈ మొదటి పాఠం యొక్క స్మృతి స్వరూపం యొక్క లోపం ఉన్న కారణంగా విజయీగా అవ్వటంలో కూడా నెంబర్ తక్కువ అయిపోతుంది. మంత్రాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకంటే బాప్ దాదా ప్రతి సమయం స్మృతి కొరకు సలహా ఇచ్చారు. దానిని మర్చిపోతున్నారు.
అమృతవేళ యొక్క స్మృతి స్వరూపం, స్వర్ణిమ చదువు (ఈశ్వరీయ చదువు) చదువుకునే స్మృతి యొక్క స్మృతి స్వరూపం, కర్మ చేస్తూ కర్మయోగిగా ఉండే స్మృతి స్వరూపం, నిమిత్తంగా అయ్యి మీ శరీర నిర్వహణ యొక్క వ్యవహార సమయం యొక్క స్మృతి స్వరూపం, అనేక వికారి ఆత్మల యొక్క సంపర్కంలోకి వచ్చే సమయం యొక్క స్మృతి స్వరూపం, అనేక తరంగాలలో ఉండేవారి యొక్క తరంగాలు పరివర్తన చేసే కార్యం చేసే సమయం యొక్క స్మృతి స్వరూపం ఇలా అన్నింటికి సలహాలు లభించాయి, ఇవి జ్ఞాపకం ఉన్నాయా? ఎలా అయితే భవిష్యత్తులో ఎటువంటి సమయమో ఆవిధమైన డ్రెస్ మార్చుకుంటారు. ప్రతి సమయం యొక్క కార్యం యొక్క డ్రెస్ మరియు శృంగారం వేర్వేరుగా ఉంటుంది. కనుక ఈ అభ్యాసం ఇక్కడ ధారణ చేయటం ద్వారా భవిష్యత్తులో ప్రాలబ్ద రూపంలో ప్రాప్తిస్తుంది. అక్కడ స్థూల డ్రెస్ మార్చుకుంటారు మరియు ఇక్కడ ఎలాంటి సమయామో, ఎటువంటి కార్యమో అటువంటి స్మృతి స్వరూపంగా ఉండే అభ్యాసిగా ఉంటున్నారా లేక మర్చిపోతున్నారా? ఈ సమయం యొక్క మీ అభ్యాసం యొక్క స్మృతిచిహ్నం భక్తిమార్గంలో కూడా విశేషమైన పేరున్న మందిరాలలో సమయానుసారం డ్రెస్ మారుస్తూ ఉంటారు. ప్రతి దర్శనానికి వేర్వేరుగా తయారై ఉంటుంది. ఈ స్మృతిచిహ్నం కూడా ఏ ఆత్మలది? ఏ ఆత్మలైతే ఈ సంగమయుగంలో ఎటువంటి సమయమో అటువంటి స్వరూపంగా అయ్యేటువంటి అభ్యాసిగా ఉంటారో వారిది.
బాప్ దాదా పిల్లలందరి రోజంతటి యొక్క దినచర్యను పరిశీలిస్తున్నారు. ఫలితంలో సమయానుసారం స్మృతి స్వరూపం యొక్క అభ్యాసం తక్కువగా కనిపిస్తుంది, స్మృతిలో అయితే ఉన్నారు కానీ స్వరూపంలోకి రావటం రావటం లేదు. అమృతవేళ సమయం విశేషంగా పిల్లలకు సర్వశక్తుల యొక్క వరదానాన్ని, సర్వ అనుభవాల యొక్క వరదానాన్ని, బాబా సమానంగా శక్తిశాలి లైట్ హౌస్, మైట్ హౌస్ యొక్క స్వరూపంలో స్థితులయ్యే, శ్రమ తక్కువ మరియు ప్రాప్తి ఎక్కువగా పొందే స్వర్ణిమ సమయం. ఆ సమయంలో మాస్టర్ బీజరూప, వరదాని స్వరూపం యొక్క స్మృతి ఉండాలి. కానీ దానికి బదులు, సమర్థీ స్వరూపానికి బదులు, బాబా సమాన స్థితిని అనుభవం చేసుకునేటందుకు బదులు ఏ స్వరూపాన్ని ధారణ చేస్తున్నారు? చాలా మంది నిందలు వేస్తున్నారు లేదా ఫిర్యాదులు చేస్తున్నారు లేదా బలహీనంగా అయ్యి కూర్చుంటున్నారు. వరదాని రూపానికి బదులు స్వయం పట్ల వరదానం అడిగేవారిగా అయిపోతున్నారు. లేదా ఫిర్యాదులు లేదా ఇతరులు యొక్క ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. ఎటువంటి సమయమో అటువంటి స్మృతి స్వరూపంగా లేని కారణంగా సమర్థీ స్వరూపంగా కూడా కాలేకపోతున్నారు. ఈ విధంగా రోజంతటి దినచర్యలో, ఎలాంటి సమయంలో ఎటువంటి స్వరూపం ధారణ చేయాలో అది ధారణ చేయని కారణంగా సఫలత పొందలేకపోతున్నారు. ప్రాప్తిని పొందలేకపోతున్నారు మరలా సంతోషం ఎందుకు ఉండటం లేదు? దీనికి కారణం ఏమిటి? అంటున్నారు. మంత్రం మరియు యంత్రాన్ని మర్చిపోతున్నారు.
ఈ రోజుల్లో ఉన్నతమైన పేరు ఉన్నవారు వారిని పెద్ద వ్యక్తులు అని అంటారు. వారికి కూడా ఎటువంటి వేదిక పైకి వెళ్తారో అటువంటి డ్రెస్, అటువంటి రూపం అంటే వారి స్వభావం కూడా ఆవిధంగా తయారుచేసుకునే అభ్యాసం ఉంటుంది. ఒకవేళ సంతోషం యొక్క ఉత్సవం యొక్క వేదిక పైకి వెళ్ళినప్పుడు తమ స్వరూపాన్ని కూడా దాని ప్రమాణంగా చూపిస్తారు, ఏవిధమైన డ్రెస్ ఆవిధమైన స్వరూపం యొక్క అభ్యాసిగా ఉంటారు. అల్పకాలికంగా అయినా కానీ,కృత్రిమంగా అయినా కాని ఇటువంటి అభ్యాసం ఉన్న వ్యక్తులు వారు అందరి ద్వారా మహిమకు పాత్రులుగా అవుతారు. వారిది కృత్రిమమైనది, మీది సత్యమైనది. సత్యత మరియు వ్యక్తిత్వం యొక్క అభ్యాసిగా అవ్వండి. ఎవరు,ఎవరివారు, ఎలాంటివారు ఆ స్మృతిలో ఉండండి. మొదట మననం చేసే ప్రతి సమయం ఆవిధమైన స్వరూపం ఉందా? అని పరిశీలించుకోండి, ఒకవేళ లేకపోతే వెంటనే స్వయాన్ని పరిశీలించుకున్న తర్వాత పరివర్తన చేసుకోండి. కర్మ చేసేముందు స్మృతి స్వరూపాన్ని పరిశీలించుకోండి. కర్మ చేసేసిన తర్వాత కాదు. ఎక్కడైనా, ఏదైనా కార్యార్థం వెళ్తున్నా వెళ్ళే ముందు తయారవ్వవలసి ఉంటుంది, తర్వాత కాదు. అలాగే ప్రతి పని చేసేముందే ఆ స్థితిలో స్థితులయ్యే తయారీ చేసుకోండి, చేసేసిన తర్వాత ఆలోచించటం ద్వారా కర్మ యొక్క ప్రాప్తికి బదులు పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ద్వాపరయుగం నుండి ప్రాప్తికి బదులు ప్రార్థన మరియు పశ్చాత్తాప పడ్డారు. కానీ ఇప్పుడు ప్రాప్తి యొక్క సమయం. కనుక ప్రాప్తికి ఆధారం - ఎటువంటి సమయమో అటువంటి స్మృతి స్వరూపం. ఇప్పుడు లోపం ఏమి చేస్తున్నారో అర్థమైందా! అన్ని తెలుసు, తెలుసుకోవటంలో అయితే తెలివైనవారు అయిపోయారు కాని తెలుసుకున్న తర్వాత నడవటం మరియు తయారవ్వటం. ఒకవేళ ఏదైనా విస్మృతి తర్వాత ఎవరికైనా ఇలా చేయకండి ఇలా చేయకూడదు అని జ్ఞానం చెప్తే ఏమి జవాబు చెప్తారు? మాకు అన్ని తెలుసు, మీకు తెలియదు అంటారు. కనుక ప్రతి పాయింట్ యొక్క తెలివైనవారు అయిపోయారు కదా! కానీ తెలివైనవారు బలహీనం ఎలా అవుతారు? ఎంత బలహీనులు అంటే చేయకూడదు అని అర్థం చేసుకుంటున్నారు, అయినా చేసేస్తున్నారు. కనుక తెలుసుకోవడంలో నెంబర్ వన్ ఇప్పుడు నడవటంలో నెంబర్ వన్ అవ్వండి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అయ్యిందా! వినటం మరియు స్వరూపంగా అవ్వటం. ప్రతి ఒక్కరు 7 రోజుల సమయ ప్రమాణంగా స్మృతి స్వరూపంగా అయ్యే అభ్యాసం చేయాలి. ప్రత్యక్ష అనుభూతి చేసుకోవాలి. సదా బాబా స్మృతిలో ఉంటూ ప్రతి కార్యం చేస్తున్నారా? బాబా స్మృతి సహజమా లేక కష్టమా? ఒకవేళ సహజ విషయం అయితే నిరంతరం స్మృతి ఉండాలి. సహజమైన పని నిరంతరం మరియు స్వతహాగా జరుగుతూ ఉంటుంది. మరి నిరంతరం బాబా స్మృతి ఉంటుందా? స్మృతి నిరంతరం ఉండేటందుకు సాధనం చాలా సహజమైనది. ఎందుకు? లౌకికంలో కూడా చూస్తే స్మృతి సహజంగా, స్వతహాగా ఎవరికి ఉంటుంది? ఎవరితో ప్రేమ ఉంటుందో, ఏ వ్యక్తి, వైభవంతో ప్రేమ ఉంటుందో వారు అనుకోన్నప్పటికి జ్ఞాపకం వస్తారు. దేహంతో ప్రేమ ఉంది కనుక దేహాభిమానం మర్చిపోతున్నారా? అనుకున్నప్పటికి మర్చిపోలేకపోతున్నారు. ఎందుకు? ఎందుకంటే అర్ధకల్పం దేహంతో చాలా ప్రేమ ఉంది. ఎలా అయితే లౌకికంలో కూడా ప్రియమైన వస్తువు, వ్యక్తి స్వతహాగా స్మృతి ఉంటారో అలాగే ఇక్కడ కూడా అందరికంటే ప్రియాతి ప్రియమైనవారు ఎవరు? బాబా కదా! బాబా కంటే ప్రియమైనవారు ఎవరు ఉండరు కదా! ప్రియాతిప్రియమైన వారు కనుక సహజంగా మరియు నిరంతరం ఉండాలి కదా! అయినప్పటికీ ఎందుకు ఉండటం లేదు? దానికి కారణం ఏమిటి? దీని ద్వారా ఏమి ఋజువు అవుతుందంటే. ఇప్పటి వరకు ఎక్కడో కొంచెం ప్రేమ తగుల్కుని ఉంది అని. పూర్తి ప్రేమ ఉండటం లేదు. అందువలనే నిరంతరం ఉండడానికి బదులు, ఒక బాబాతో ఉండడానికి బదులు, ఇతరుల వైపు కూడా బుద్ది వెళ్ళిపోతుంది. ప్రియాతిప్రియమైన బాబా యొక్క ప్రేమని మొదట అనుభవం చేసుకున్నారా లేదా ఆత్మిక ప్రేమను అనుభవం చేసుకున్నారా? ఆత్మ కనుక ప్రేమ కూడా ఆత్మీయంగా ఉంటుంది కదా! మరి ఆత్మిక ప్రేమ యొక్క అనుభవం ఉందా? అనుభవం అయిన విషయం ఎప్పుడు మర్చిపోరు. ఆత్మిక ప్రేమ యొక్క అనుభవం ఒక సెకను యొక్క అనుభవం కూడా ఎంత శ్రేష్ఠమైనది! ఒకవేళ ఒక సెకను అయినా ఆ ప్రేమ యొక్క అనుభవంలోకి వెళ్ళిపోతే రోజంతా ఏమౌతుంది? ఎలా అయితే ఏదైనా శక్తిశాలి వస్తువు ఉంటే దాని యొక్క ఒక బిందువు కూడా చాలా చేస్తుంది. శక్తి తక్కువగా ఉన్న వస్తువు యొక్క బిందువులు ఎన్ని వేసినా అంతగా ఏమీ చేయలేరు. కనుక ఆత్మిక ప్రేమ యొక్క ఒక ఘడియ కూడా చాలా శక్తినిస్తుంది, అప్పుడు మర్చిపోయే అభ్యాసంలో సహాయం చేస్తుంది. కనుక అనుభవీగా ఉన్నారా లేక కేవలం వినేవారిగా అంగీకరించేవారిగా ఉన్నారా? బాబా యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వ గుణాల యొక్క అనుభవీగా ఉన్నానా అని పరిశీలన చేసుకోండి. ఎంతగా అనుభవీ ఆత్మగా ఉంటారో అంతగా మాస్టర్ సర్వశక్తివాన్‌గా ఉంటారు. పురుషార్థం యొక్క వేగం బలహీనం అవ్వడానికి కారణం అనుభవీగా ఉండడానికి బదులు వినేవారిగా, వినిపించేవారిగా ఉన్నారు. అనుభవంలోకి వెళ్ళటం ద్వారా వేగం స్వతహాగా తీవ్రం అవుతుంది.
ఎలా అయితే బాబా సదా సమర్థుడో అలాగే స్వయాన్ని కూడా సదా సమర్థంగా భావిస్తున్నారా? బాబా అప్పుడప్పుడు సమర్థంగా, అప్పుడప్పుడు బలహీనంగా ఉంటారా? లేక సదా సమర్థంగా ఉంటారా? సదా సమర్థుడు కదా! సమర్థుడు కనుక అందరు సమర్థత యొక్క దానాన్ని బాబా నుండి తీసుకుంటారు. బాబా సమర్థ స్వరూపుడు అంటే సమర్థత యొక్క దాత కనుక పిల్లలు ఎలా అవ్వాలి? సమర్థతను తీసుకునేవారా లేక ఇచ్చేవారా? బాబా వస్తూనే సర్వులను అధికారిగా చేస్తున్నారు. రావటంతోనే అన్నీ ఇస్తున్నారు, ఇక అడిగే అవసరం ఏముంది? అడగకుండానే అన్ని లభిస్తుంటే అడిగే అవసరం ఏముంది? అడగటం ద్వారా సంతోషం ఉండదు, ఎవరిలో జ్ఞానం ఉండదో వారు శక్తి ఇవ్వండి, సహాయం చేయండి అని అడుగుతూ ఉంటారు. సహాయం లభించే మార్గం - ధైర్యం. ధైర్యం ఉన్న పిల్లలకే బాబా సహాయం చేస్తారు. అడిగితే ఇచ్చే తండ్రి కాదు. ధైర్యం పెట్టుకుంటే సహాయం లక్షల రెట్లు లభిస్తుంది, ఒకటి చేయటం మరియు లక్ష పొందటం ఈ లెక్క అయితే తెలుసు కదా! కనుక ఎప్పుడు ధైర్యం వదలకూడదు. ధైర్యాన్ని వదిలేసారు. అంటే ఆస్తిని వదిలేసినట్లే. ఆస్తిని వదిలేసారు అంటే బాబాని వదిలేసినట్లే. ఏది ఏమైనా, ఏ పరిస్థితి వచ్చినా ధైర్యం వదలకూడదు. ధైర్యం వదిలేస్తే శ్వాసను వదిలేసినట్లే. ధైర్యమే ఈ మరజీవ జీవితం యొక్క శ్వాస. శ్వాసయే పోతే ఇక ఏమి ఉంటుంది? ధైర్యం ఉంటే మూర్చితుల నుండి తెలివైనవారిగా అయిపోతారు. విజ్ఞానం యొక్క వృద్ధికి కూడా కారణం - ధైర్యం. ధైర్యం ఆధారంగానే చంద్రుని వరకు చేరుకున్నారు, రాత్రిని పగలుగా, పగలుని రాత్రిగా చేస్తున్నారు. ధైర్యం పెట్టుకుని నడిచేవారికి సహజ వరదానం ప్రాప్తిస్తుంది, కష్టం కూడా సహజం అయిపోతుంది, అసంభవ విషయం కూడా సంభవం అయిపోతుంది.
అందరు బ్రహ్మాకుమారీలు ఏమి చెప్తున్నారు మరియు ఏమి చేస్తున్నారు అనేది చూస్తున్నారు. కనుక ఏది చెప్తున్నారో అది చేసేవారిగా అవ్వండి, భగవంతుడు లభించారు, భగవంతుడు లభించారు అనే ధ్వని అయితే వ్యాపింపచేసారు. కానీ భగవంతుడు లభించారు అంటే ఇక బుద్ధి వెళ్ళేటందుకు ఏదైనా మిగిలి ఉందా? సర్వప్రాప్తుల అనుభవం అందరి ముందు చూపించండి. మీ యొక్క శక్తిస్వరూపం ఇప్పుడు అందరు చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు మహారథీలు ఏదోక ప్లాన్ తయారుచేయాలి. విఘ్నవినాశకులుగా అయ్యేటందుకు సాధనం ఏమిటి? డ్రామానుసారం ఏదైతే జరుగుతుందో దానిని నిర్ణయమైనదిగా భావించి ముందుకి వెళ్ళండి, ఆత్మలకు ఏదైనా అకళ్యాణం జరిగినా దయాహృదయంతో ఏ భావం ఉండాలి? దాని ద్వారా ఆ ఆత్మలకు అకళ్యాణం జరుగకూడదు. దీని కొరకు ఏదోక యుక్తి రచించాలి. వాతావరణాన్ని కూడా శక్తిశాలిగా చేసేటందుకు ఇప్పుడు ఏదోక ప్లాన్ తయారుచేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక అల నడుస్తుంది. ఒకటి - సాధారణ విఘ్నాలు, రెండు - దీనిలో అనేకాత్మలకు అకళ్యాణం జరుగుతుంది. ఈ రోజుల్లో కొంతమంది ఆత్మలు స్వయానికి స్వయమే అకళ్యాణానికి నిమిత్త అవుతున్నారు. వారి కోసం ప్లాన్ తయారుచేసుకోండి, మహారథీలకు సంకల్పం చేయటం లేదా ప్లాన్ తయారుచేయటం ఇది కూడా వాతావరణంలో వ్యాపించి ఉంటుంది. వాతావరణాన్ని పరివర్తన చేయాలి, ఈరోజుల్లో విఘ్నవినాశక పేరు ఏదైతే ఉందో అది మీ సంకల్పం, మాట, కర్మలో కనిపించాలి. ఎలా అయితే అగ్నిని ఆర్పేవారు అగ్ని అంటుకుంటే దానిని ఆర్పకుండా ఉండలేరు. ఎటువంటి కష్టమైన పని అయినా ప్లాన్ తయారుచేసి అగ్నిని ఆర్పేస్తారు. మీరు కూడా విఘ్నవినాశకులు, వాతావరణాన్ని ఎలా సమాప్తి చేస్తారు? సంకల్పం చేస్తే వాతావరణం మారిపోతుంది. ఇదైతే ఆది నుండి నడుస్తూ వస్తుంది, ఈ విఘ్నాలు అయితే రావల్సిందే అని తేలికగా వదిలేయకండి.
విఘ్నాలను సమాప్తి చేసుకోండి. ఎలా అయితే ఏదైనా స్థూలంగా వినాశనం జరుగుతూ ఉంటే చూస్తూ వదిలేయరు, దూరం నుండే నష్టాన్ని రక్షించడానికి పరుగుపెడతారు, స్వతహాగానే రక్షించుకునే సంకల్పం వస్తుంది. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఇది డ్రామా, ప్రతి ఆత్మకు ఎవరి పాత్ర వారికి ఉంది, అలజడిలోకి రాకండి. కానీ మీరు రక్షణ మరియు దయ చూపించే వారు. కనుక ఈ భావనతో ఆలోచించాలి. విఘ్నవినాశకులు కనుక ఈ లక్ష్యం పెట్టుకోవాలి. ఏ విషయం యొక్క లక్ష్యం పెట్టుకుంటారో అది నెమ్మది, నెమ్మదిగా అయిపోతుంది. కేవలం లక్ష్యం మరియు ధ్యాస ఉండాలి. మహారథీలు స్వయం పట్ల సర్వ విధులు మరియు సర్వ శక్తులు ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు ఈ ఆలోచన నడుస్తుందా లేక లేదా? నడవాలి. దీనిని వేరు చేయకూడదు. వేరు చేసేస్తే వ్యక్తిగత రాజుగా అవుతారు, విశ్వమహారాజుగా కాదు. విశ్వకళ్యాణం యొక్క భావన పెట్టుకోవటం ద్వారా విశ్వమహారాజుగా అవుతారు.
Comments
Post a Comment